ఇళ్ల మధ్య మద్యం షాపు పెడితే ఒప్పుకోం
ఇళ్ల మధ్య మద్యం షాపు పెడితే ఒప్పుకోం
Published Sun, Jul 2 2017 11:46 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
మహానంది: తమ కాలనీలో మద్యం షాపు పెడితే ఒప్పుకోమని గాజులపల్లె ఎస్సీ కాలనీవాసులు స్పష్టం చేశారు. ఎస్సీ కాలనీలో పెట్టే వైన్‌షాపును తీసేయాలని కోరుతూ ఆదివారం రాత్రి కాలనీలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు, సిబ్బంది గ్రామంలోని కాలనీకి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు మాట్లాడుతూ ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం పెట్టడం ఏంటని ఎస్‌ఐను ప్రశ్నించారు. పాఠశాల దగ్గర ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళతామని ఎస్‌ఐ తెలిపారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో..
శ్రీశైలం ప్రాజెక్ట్ : భ్రమరాంబా టాకీస్, కాకుల్ సెంటర్ ప్రాంతాలలో లైసెన్స్ దారులు మద్యం దుకాణాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో ఆదివారం ఆయా ప్రాంతాలలోని మహిళలు ఆందోళనకు దిగారు . భ్రమరాంబా టాకీస్ వద్ద లూథరన్ చర్చి పాస్టర్ , క్రైస్తవులు, కాకుల సెంటర్ ప్రాంతంలో అక్కడి మహిళలు మద్యం దుకాణాల ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్, టు టౌన్ ఎస్‌ఐ ఓబులేసుకు కి వినతి పత్రం అందించారు.
క్రైస్తవుల నిరసన
పగిడ్యాల: స్థానిక దేవనగర్ కాలనీలోని బురుజు సమీపంలో ఉండే ప్రార్థన మందిరానికి దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై ఆదివారం క్రైస్తవులు నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొద్దని స్వామిదాసు, తిరుపాలు, నాగేశ్వరరావు, జయరామిరెడ్డి, శ్రీసువాసులు రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శివారెడ్డి, రాము, రమేష్, రూబేను, పౌలయ్య, యేసురాజు పేర్కొన్నారు.
Advertisement