మద్యం దుకాణాలు వద్దంటూ ర్యాలీ
మద్యం దుకాణాలు వద్దంటూ ర్యాలీ
Published Mon, Mar 27 2017 11:10 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
నంద్యాల: తమ ప్రాంతంలో మద్యం దుకాణాలు వద్దంటూ నంద్యాల పట్టణంఓని పద్మావతి నగర్ మహిళలు సోమవారం ర్యాలీ నిర్వహించారు. కాలనీలో సగం భాగం పైగా నివాస గృహాలు, కాలేజీలు, ఆసుపత్రులు, స్టేడియం ఉన్నాయి. కాలనీలో అక్కడక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో మద్యం షాపులను పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టీడీపికి చెందిన మాజీ మంత్రి అనుచరులకు కూడా మద్యం షాపు ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికులు గెలివి రామకృష్ణ, బాచంనాగేశ్వరరెడ్డి, నెరవాటి నందబాబు ఆధ్వర్యంలో పద్మావతినగర్ పార్కులో సమావేశమయ్యారు.
అనంతరం పద్మావతినగర్ సెంటర్ వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తారోకో చేసి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. నివాస గృహాల మధ్య మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనలో శేషిరెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ తారకేష్, డాక్టర్ జఫరుల్లా, న్యాయవాదులు సత్యం, గోళ్ల జయకృష్ణ, బీజేపీ నేతలు పెసల శ్రీకాంత్, నిమ్మకాయల సుధాకర్, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు కశెట్టి చంద్రశేఖర్, కశెట్టి వేణుగోపాల్, గెలివి చక్రవర్తి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్‌లాల్ పాల్గొన్నారు.
Advertisement