సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల హామీల్లో ఇచ్చిన మేరకు మద్య నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్ననే నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారు. తాజాగా అక్టోబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామని తెలిపారు. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘బెల్టుషాపులపై ఉక్కుపాదం. ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోంది. అక్టోబర్ నుంచి 20శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని, నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
(చదవండి: ఉద్వేగానికి లోనవుతున్నా)
Comments
Please login to add a commentAdd a comment