దారుణ హత్య | Cut off the robbers who killed former councilors | Sakshi
Sakshi News home page

దారుణ హత్య

Published Mon, Sep 16 2013 1:23 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Cut off the robbers who killed former councilors

గుడివాడ, న్యూస్‌లైన్ : స్థానిక 27వ వార్డు మాజీ కౌన్సిలర్ శొంఠి శ్రీనివాసరావు (45) దారుణహత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గుడివాడ పట్టణంలోని బేతవోలుకు చెందిన మునిసిపల్ మాజీ కౌన్సిలర్ శొంఠి శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో ఉన్న తన చెరువుల వద్దకు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తూ మార్గంలో పెదపారుపూడి వైన్‌షాపు వద్ద మద్యం సేవించినట్లు సమాచారం.

 

ప్రతిరోజూ చెరువు నుంచి వచ్చేటప్పుడు వైన్‌షాపు వద్ద ఆగి మద్యం సేవిస్తాడని అతని బంధువులు చెబుతున్నారు. మద్యం షాపు నుంచి 100 మీటర్ల ముందుకు తన వాహనంపై రాగానే పెదపారుపూడి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు వద్ద దుండగులు కాపు కాసి కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. రక్తపు మడుగులో కిందపడి అక్కడికక్కడే మరణించాడు. ఘటన జరిగిన తీరు పరిశీలిస్తే పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు అర్థమవుతోంది. ముందుగా శొంఠి శ్రీనును పథకం ప్రకారం అక్కడ ఆపి వాహనాన్ని స్టాండ్ వేసి, మాట్లాడి.. నరికినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement