pedaparupudi
-
డ్రైవర్ అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
పెదపారుపూడి(కృష్ణా జిల్లా): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. మంటలను గ్రహించి బస్సును రోడ్ పక్కకు ఆపేశాడు. దాంతో ప్రయాణికులు పరుగు పరుగున కిందికి దిగిపోయారు. ఈ ఘటన జిల్లాలోని పెదపారుపూడి వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నారు. కాగా, డ్రైవర్ మాత్రం బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని గ్రహించి రోడ్ పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ నుంచి గుడివాడకు వెళుతుండా ఈ ప్రమాదం సంభవించింది. -
కృష్ణా జిల్లా: డ్రైవర్ అప్రమత్తం.. తప్పిన పెను ప్రమాదం
-
రోజురోజుకు బరితెగిస్తున్న టీడీపీ నేతలు
-
పెదపారుపూడిలో బరితెగించిన టీడీపీ నేతలు
సాక్షి, కృష్ణా: టీడీపీ నేతలు రోజురోజుకు బరితెగిస్తున్నారు. పోలింగ్ రోజున వైఎస్సార్సీపీ అభ్యర్థులపై ఇష్టారీతిన దాడులకు దిగిన టీడీపీ నేతలు.. ఇంకా అదే పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పెదపారుపూడిలో పామర్రు శాసనసభ వైఎస్సార్సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన అనిల్‌కుమార్‌ను టీడీపీ నాయకుడు చప్పిడి కిషోర్ దూషించారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ సీపీ నాయకులు చిగురుపాటి శ్రీధర్, జాషువాలపై కిషోర్ వర్గీయులు దాడికి దిగారు. అయితే కిషోర్‌కు మద్దతుగా పామర్రు టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అనిల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనిల్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఇరుపక్షాలు కేసులు స్వీకరించారు. -
పెదపారుపూడిని మోడల్ గ్రామంగా మారుద్దాం
పెదపారుపూడి : పెదపారుపూడి గ్రామాన్ని మోడల్ గ్రామంగా తయారు చేసుకుందామని పంచాయతీరాజ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ దినేష్‌కుమార్ అన్నారు. పెదపారుపూడిలో నిర్మించిన ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఘన వ్యర్థ పదార్థాల తయారీ కేంద్రం నుంచి నెలకు ఎంత వర్మీకంపోస్టు తయారు చేస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతోందని సర్పంచ్ గారపాటి శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను ఎలా వేరుచేస్తారో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చెత్త నుంచి సంపద కోసం ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. అందరూ బాధ్యతగా భావించి గ్రామాభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్థానికులు కొంద రు గ్రామంలో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు ఉన్నా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షకాలం ఇబ్బందిగా ఉందని దీనిష్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డ్రైనేజీ పనులు నిర్వహించాలని సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ రామా ంజనేయులు, అడిషనల్ కమిషనర్ సుధాకర్, ఉపాధి హామీ జిల్లా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ జ్యోతిబసు, గుడివాడ డీఎల్పీవో విక్టర్, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీపీ కాజ విజయలక్ష్మి, కార్యదర్శులు ఎస్.రాధిక, నరసింహారా వు, ఎలీషారావు తదితరులు పాల్గొన్నారు. -
దారుణ హత్య
గుడివాడ, న్యూస్‌లైన్ : స్థానిక 27వ వార్డు మాజీ కౌన్సిలర్ శొంఠి శ్రీనివాసరావు (45) దారుణహత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గుడివాడ పట్టణంలోని బేతవోలుకు చెందిన మునిసిపల్ మాజీ కౌన్సిలర్ శొంఠి శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడలో ఉన్న తన చెరువుల వద్దకు వెళ్లారు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తూ మార్గంలో పెదపారుపూడి వైన్‌షాపు వద్ద మద్యం సేవించినట్లు సమాచారం. ప్రతిరోజూ చెరువు నుంచి వచ్చేటప్పుడు వైన్‌షాపు వద్ద ఆగి మద్యం సేవిస్తాడని అతని బంధువులు చెబుతున్నారు. మద్యం షాపు నుంచి 100 మీటర్ల ముందుకు తన వాహనంపై రాగానే పెదపారుపూడి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు వద్ద దుండగులు కాపు కాసి కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. రక్తపు మడుగులో కిందపడి అక్కడికక్కడే మరణించాడు. ఘటన జరిగిన తీరు పరిశీలిస్తే పథకం ప్రకారమే ఈ ఘటన జరిగినట్లు అర్థమవుతోంది. ముందుగా శొంఠి శ్రీనును పథకం ప్రకారం అక్కడ ఆపి వాహనాన్ని స్టాండ్ వేసి, మాట్లాడి.. నరికినట్లు తెలుస్తోంది.