పెదపారుపూడిని మోడల్‌ గ్రామంగా మారుద్దాం | model village pedaparupudi | Sakshi
Sakshi News home page

పెదపారుపూడిని మోడల్‌ గ్రామంగా మారుద్దాం

Oct 20 2016 11:30 PM | Updated on Sep 4 2017 5:48 PM

పెదపారుపూడిని మోడల్‌ గ్రామంగా మారుద్దాం

పెదపారుపూడిని మోడల్‌ గ్రామంగా మారుద్దాం

పెదపారుపూడి గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తయారు చేసుకుందామని పంచాయతీరాజ్‌ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ అన్నారు. పెదపారుపూడిలో నిర్మించిన ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు.

పెదపారుపూడి : పెదపారుపూడి గ్రామాన్ని మోడల్‌ గ్రామంగా తయారు చేసుకుందామని పంచాయతీరాజ్‌ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ దినేష్‌కుమార్‌ అన్నారు. పెదపారుపూడిలో నిర్మించిన ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఘన వ్యర్థ పదార్థాల తయారీ కేంద్రం నుంచి నెలకు ఎంత వర్మీకంపోస్టు తయారు చేస్తున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతోందని సర్పంచ్‌ గారపాటి శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. తడి, పొడి చెత్తను ఎలా వేరుచేస్తారో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చెత్త నుంచి సంపద కోసం ఘన వ్యర్థపదార్థాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుందామన్నారు. అందరూ బాధ్యతగా భావించి గ్రామాభివృద్ధి చేసుకోవాలని సూచించారు. స్థానికులు కొంద రు గ్రామంలో సీసీ రోడ్లు, మరుగుదొడ్లు ఉన్నా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షకాలం ఇబ్బందిగా ఉందని దీనిష్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన డ్రైనేజీ పనులు నిర్వహించాలని సర్పంచ్‌కు సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామా ంజనేయులు, అడిషనల్‌ కమిషనర్‌ సుధాకర్,  ఉపాధి హామీ జిల్లా అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జ్యోతిబసు, గుడివాడ డీఎల్‌పీవో విక్టర్, ఎంపీడీవో బి.శ్రీనివాసరావు, ఎంపీపీ కాజ విజయలక్ష్మి, కార్యదర్శులు ఎస్‌.రాధిక, నరసింహారా వు, ఎలీషారావు తదితరులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement