
సాక్షి, కృష్ణా: టీడీపీ నేతలు రోజురోజుకు బరితెగిస్తున్నారు. పోలింగ్ రోజున వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై ఇష్టారీతిన దాడులకు దిగిన టీడీపీ నేతలు.. ఇంకా అదే పంథాను కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పెదపారుపూడిలో పామర్రు శాసనసభ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌పై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్లిన అనిల్‌కుమార్‌ను టీడీపీ నాయకుడు చప్పిడి కిషోర్ దూషించారు. అంతటితో ఆగకుండా వైఎస్సార్ సీపీ నాయకులు చిగురుపాటి శ్రీధర్, జాషువాలపై కిషోర్ వర్గీయులు దాడికి దిగారు. అయితే కిషోర్‌కు మద్దతుగా పామర్రు టీడీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే ఈ ఘటన గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చిన అనిల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అనిల్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో దిగివచ్చిన పోలీసులు ఇరుపక్షాలు కేసులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment