పెదపారుపూడి(కృష్ణా జిల్లా): ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు రన్నింగ్‌లో ఉండగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. మంటలను గ్రహించి బస్సును రోడ్ పక్కకు ఆపేశాడు. దాంతో ప్రయాణికులు పరుగు పరుగున కిందికి దిగిపోయారు. ఈ ఘటన జిల్లాలోని పెదపారుపూడి వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది.
ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 48 ప్రయాణికులు ఉన్నారు. కాగా, డ్రైవర్ మాత్రం బస్సుకు మంటలు వ్యాపించిన విషయాన్ని గ్రహించి రోడ్ పక్కకు ఆపేశాడు. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ నుంచి గుడివాడకు వెళుతుండా ఈ ప్రమాదం సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment