మందు కోసం క్యూ.. మద్యం కేసులు తీసుకెళుతున్న మందుబాబులు
సాక్షి, చెన్నై : లాక్‌డౌన్ కఠినతరం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన వెలువరించిన నేపథ్యంలో మందుబాబులు టాస్మాక్ దుకాణాల ముందు బారులు తీరారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో జూన్ 19 నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 12 రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడే అవకాశం ఉందని గ్రహించిన మందు బాబులు మంగళవారం ఉదయం నుంచే టాస్మాక్ దుకాణాల వద్ద బారులు తీరారు.
దాదాపు కిలోమీటర్ దూరం మేరకు మందుబాబుల హడావిడి కనిపించింది. అయితే దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చిన మందుబాబులు 12 రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేశారు. మద్యం కేసులు కొనుగోలు చేసి తమ వాహనాల్లో తరలించడం స్పష్టంగా కనిపించింది. మద్యం అమ్మకాలు జోరందుకోవడంతో ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు మద్యం ష్టాకును సిద్ధంగా ఉంచింది. కాగా లోడ్ వచ్చిన వెంటనే హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. చదవండి: లడక్ కాల్పుల్లో పళని వీరమరణం
Comments
Please login to add a commentAdd a comment