హైదరాబాద్: కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి పూర్తిస్థాయిలో జరగనున్నాయి. న్యూ ఇయర్‌ను వెల్‌కం చెప్పేందుకు యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది.
తాజాగా న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు రాత్రి ఒంటిగంట వరకు.. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి.
మరోవైపు న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తెలిపారు.
చదవండి: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే..
Comments
Please login to add a commentAdd a comment