liquor shop
-
దందాకు పచ్చజెండా .. మద్యం ప్రియులకు బాదుడు
-
ఈ దొంగకు న్యూ ఇయర్ ఒకరోజు ముందే వచ్చింది.. ఏం చేశాడో తెలుసా?
సాక్షి,మెదక్ : అతడో దొంగ. అసలే కొత్త సంవత్సరం (new year). సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు. డబ్బులు కావాలి కదా. వైన్ షాపులో డబ్బులు బాగా ఉంటాయ్. దోచేద్దామని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా రెండ్రోజుల పాటు రెక్కీ కాచాడు. మూడో రోజు ప్లాన్ ప్రకారం.. తాను ముందుగా రెక్కి నిర్వహించిన వైన్ షాప్‌లో దొంగతనం చేశాడు. దొంగతనానికి ముందే తాను ఎవరికి దొరక్కూడదనే ఉద్దేశ్యంతో సీసీ టీవీ కెమెరాల్ని ధ్వంసం చేశాడు. గల్లా పెట్టెలో ఉన్న డబ్బుంతా ఊడ్చేశాడు. అనంతరం బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అప్పటి వరకు అనుకున్నది అనుకున్నట్లుగా చేశాడు. కానీ చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టడంతో పోలీసులకు అడ్డంగా దొరికి పోయాడు.మెదక్ జిల్లా నార్సింగ్ ప్రాంతంలో నిర్వాహకులు కనకదుర్గా వైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి 10 వైన్ షాపును క్లోజ్ చేసి ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆ వైన్ షాప్‌లో దొంగతనం ప్లాన్ చేసిన దొంగ రూఫ్‌ను తొలగించి షాప్‌లో చొరబడ్డాడు. డబ్బుల్ని కాజేశాడు. అనంతరం, దొంగతనానికి వచ్చిన ఆ దొంగకి మందు మీద కుతిపుట్టింది. వెంటనే వైన్ షాపులో ఏ బ్రాండ్ దొరికితే.. ఆ బ్రాండ్‌ని ఫుల్లుగా సేవించాడు. మత్తులో తాను దొంగతనానికి వచ్చానన్న విషయాన్ని మర్చిపోయి ఎంచక్కా పడుకున్నాడు. ఆ మరుసుటి రోజు అంటే నిన్న ఉదయం నిర్వహాకులు వైన్ షాప్‌ను ఓపెన్ చేశారు. దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ పక్కనే మత్తులో ఉన్న దొంగను గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగను పరిశీలించి అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి మద్యం సేవించడం వల్ల స్పృహ కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్పృహలోకి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభిస్తామని వెల్లడించారు. -
మద్యం షాపులపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
-
రెడ్డమ్మ vs పుత్తా
సాక్షి ప్రతినిధి, కడప: అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. తాజాగా మద్యం షాపుల ఏర్పాటు విషయంలో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కడప నగరంలోని బిల్టప్ సమీపంలో మద్యంషాపు ఏర్పాటుపై కడప, కమలాపురం ఎమ్మెల్యేల వర్గీయులు పరస్పర ఫిర్యాదులు హాట్ టాఫిక్‌గా మారాయి.కడపలో టీడీపీ కార్యకర్తలు మినహా మరెవ్వరూ మద్యం టెండర్లు వేయరాదంటూ ముందస్తు బెదిరింపులు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో చూద్దామని కొంతమంది సాహసం చేసి దరఖాస్తులు వేశారు. మరికొంతమంది పొరుగున ఉన్న అధికారపార్టీ నేతల మద్దతుతో పాల్గొన్నారు. టెండర్లు ప్రక్రియ ముగియగానే మద్యం షాపులు లభించిన వారందరూ వచ్చి మాట్లాడాలని కడప ముఖ్యనేత కబురు పెట్టారు. మెజార్టీ లాటరీ విజేతలు సంప్రదింపులు చేపట్టారు. తమ వర్గీయుల భాగస్వామ్యం తప్పనిసరి అంటూ కలిసినవారికి సదరు నేత హుకుం జారీ చేశారు. దీనికి కొందరు అంగీకరించారు, మరికొందరు తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితుల్లో బిల్టప్ సమీపంలో లాటరీ విజేతలు రెండు షాపులు ఏర్పాటు చేశారు. రెడ్డి, మౌర్య వైన్స్ పేరుతో వెలిశాయి. ఈ రెండింటిలో ఒకటి కడప, మరొకటి కమలాపురం ఎమ్మెల్యేల మద్దతుదారులవి. అప్పటికే అక్కడ గోసుల బార్అండ్రెస్టారెంట్ ఒకటి ఉండిపోయింది.ఒకటి ఎత్తివేయాలని..ఒకటే చోట మూడు మద్యం దుకాణాలు ఉండడంతో అక్కడి నుంచి ఒకటి ఎత్తేయిస్తే వ్యాపారం సవ్యంగా ఉంటుందనే ఆలోచన ఓ వర్గం వారిలో మెదిలింది. అంతే వెంటనే బడి, గుడి నిబంధనలను తెరపైకి తెచ్చి ఫిర్యాదు చేశారు. ఆమేరకు ముందుగా ఏర్పాటు చేసుకున్న స్థలం నుంచి మౌర్య వైన్స్ తరలించాల్సి వచ్చింది. గోసుల బార్ స్కూల్ ఏర్పాటు కంటే ముందుగా అక్కడ నిర్వహిస్తుండడంతో దానికి ఆ నిబంధన వర్తించలేదు. ఇక మౌర్య వైన్స్ కాస్త దూరంలో ఉన్న ఓ భవనంలో ఏర్పాటు చేసుకునేందుకు శ్రీకారం చట్టారు. ఈ వైన్‌షాపును అక్కడి నుంచి కూడా లేకుండా చేయాలని కడప ఎమ్మెల్యే వర్గీయులు వ్యూహం పన్నారు.భవనానికి అనుమతులు లేవంటూ..అధికార పార్టీ ఎమ్మెల్యే చిటికేస్తే కార్పొరేషన్ అధికారులు పరుగులు పెడుతున్నారు. గత కొన్ని ఘటనలు అందుకు దర్పంగా నిలుస్తున్నాయి. తాజాగా మౌర్య వైన్స్ ఏర్పాటు చేస్తున్న భవనానికి నిర్మాణ అనుమతులు లేవంటూ కార్పొరేషన్ యంత్రాంగం అడ్డు తగిలింది. భవన యజమానికి నోటిసులు పంపి, ఎందుకు కూల్చకూడదో తెల్పాలంటూ అక్కడికి వెళ్లారు.అధికారులను నిర్భందించిన ‘పుత్తా’విషయం తెలుసుకున్న టీడీపీ నేత.. కమలాపు రం ఎమ్మెల్యే పుత్తా చైతన్య తండ్రి పుత్తా నరసింహారెడ్డి వెంటనే సదరు అధికారులకు ఫోన్ చేసి పక్కనే ఉన్న ఎమ్మెల్యే ఆఫీసుకు రావాల్సిందిగా పిలిచారు. అక్కడికి వెళ్లిన అధికారులకు పట్టపగలు చుక్కలు చూపించారు. ‘ఆ భవనానికి నిర్మాణ అనుమతులున్నాయి. ఒకవేళ లేకపోయినా 40ఏళ్లు క్రితం నిర్మించారు, ఇంతకాలం ఏమి చేస్తున్నారు? ఇప్పుడెందుకు వచ్చారు? మిమ్మల్ని పంపించిన వారి ని ఇక్కడికి పిలచండి? అప్పటి వరకూ మీరు ఇక్కడే ఉండండం’టూ నిర్భంధించారు. ఏమి చేయాలో పాలుపోక ఆ వచ్చిన అధికారులు అక్కడే ఉండిపోయారు. ఉన్నతాధికారులు అటువైపు కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దాదాపు 2గంటలు పాటు కార్పొరేషన్ యంత్రాంగం స్థానికంగా ఉన్న పుత్తా కార్యాలయంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈలోపు భవన యజమాని నిర్మాణ అనుమతులు తీసుకురావడంతో మరింత స్థాయిలో బూతులు తినాల్సివచ్చింది.వ్యవహారం బెడిసికొట్టడడంతో....కార్పొరేషన్ అధికారుల వ్యవహారం బెడిసి కొట్టడంతో కడప ఎమ్మెల్యే వర్గీయులు మరో వ్యూహం పన్నారు. ఈమారు ఆభవనంలో అద్దెకు నివాసం ఉన్నవారితో ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేయవద్దంటూ ఫిర్యాదు చేయించారు. దీంతో కోపోద్రిక్తులైన కమలాపురం ఎమ్మెల్యే వర్గీయులు ఫిర్యాదుదారుడికి తగిన రీతిలో బుద్ధి చెప్పినట్లు సమాచారం. వెంటనే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఈ ముసుగులో వ్యవహారం ఎందుకు ప్రత్యక్షంగా తెరపైకి రండి.. తేల్చుకుందా’మంటూ కమలాపురం ఎమ్మెల్యే వర్గీయులు సవాల్ విసరడం కొసమెరుపు.బాబోయ్.. మందుబాబులు మందుబాబులు చెలరేగుతున్నారు. పట్టపగలు నడిరోడ్లపైనే విచ్చలవిడిగా మద్యం తాగుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ .. డివైడర్ల పక్కన, కూల్‌డ్రింక్ షాపుల్లో బహిరంగంగా తాగుతున్నారు. వెరసి రహదారుల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడపలో ముందే పది బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఆపై 23 మద్యంషాలు కొత్తగా వచ్చాయి. వ్యాపారం అనువుగా ఉన్న ప్రాంతాలల్లో యజమానులు మద్యంషాపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో అక్కడడక్కడ బార్లు ఉండడంతో మందుబాబుల వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఆటంకాలు లేవు. ప్రస్తుతం కడపలో డివైడర్లు చెంతన, రోడ్డు పక్కలో, కూల్‌డ్రింక్ షాపులల్లో తిష్టవేసి మందు తాగుతుండడంతో ప్రజానీకం ఇబ్బందిపడుతోంది.పరస్పర ఒప్పందం కుదిరితేనే...మద్యం షాపుల చెంతలో తాగేందుకు అనుమతులుంటే మందుబాబులు అక్కడే తాగేసి వెళ్తుండేవారు. ఎటూ విచ్చలవిడిగా మద్యం విక్రయాలకు ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పర్మిట్ రూమ్‌కు అనుమతి ఇవ్వడం శ్రేయస్కరమని పలువురు వివరిస్తున్నారు. అప్పటివరకూ బహిరంగ మద్యం తాగుడును కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రధానంగా జిల్లా కేంద్రమైన కడప, ప్రొద్దుటూరు లాంటి పట్టణాలల్లో ఈబెడద ఎక్కువగా ఉండడం గమనార్హం. -
ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి
సాక్షి, అమరావతి: మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మద్యం ధరలు, ఇసుక లభ్యత–సరఫరాపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణం యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే ఊపేక్షించేందిలేదన్నారు.ఎమ్మార్పీకి కంటే ఎక్కువ రేటుకు మద్యం విక్రయిస్తూ, బెల్డ్ షాపులను ప్రోత్సహిస్తూ పట్టుబడితే తొలిసారిగా రూ.5 లక్షలు జరిమానా విధించాలన్నారు. అదే తప్పును పునరావృతం చేస్తే దుకాణం లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆదేశించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలు, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇసుక లభ్యతను పెంచాలని సీఎం సూచించారు. ఇసుకలో అక్రమాలు జరిగితే దానికి అధికారుల పైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
మద్యంపై పోరులో మహిళల విజయం..!
ముంబై ప్రాంతంలోని హెచ్‌ఎస్‌జి కాంప్లెక్స్‌లోని బూజ్ షాప్ తెరవద్దంటూ మహిళలు అడ్డుపడి, విజయం సాధించారు. కొందరు మద్యం ప్రియులు షాపింగ్ కాంప్లెక్స్ పరిసరాలలో తాగి, చుట్టుపక్కల అమ్మాయిలు, మహిళల పట్ల చులకన వ్యాఖ్యల చేయడం వల్ల తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసేయాలని స్థానిక మహిళలు పట్టుబట్టారు. ఎంకే హెరిటేజ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పురుషులు, పిల్లలు కూడా ఆ మహిళలతో జత కలవడంతో అందరూ కలసి మానవ హారంగా ఏర్పడి మౌన నిరసనను తెలియజేశారు.ఈ నిరసన ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన వీరు కలెక్టర్ కార్యాలయానికి, ముఖ్యమంత్రికి ఇ–మెయిల్ ద్వారా తమ సందేశాన్ని పంపారు. ముఖ్యంగా మహిళల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడి మద్యం దుకాణాన్ని మూసివేయకపోతే స్థానిక ప్రజలు శాంతిభద్రతల సమస్యలను ఎంతగా ఎదుర్కొంటున్నారో తెలియజేస్తూ 50 మందికి పైగా మహిళలు ఒక మెమోరాండంపై సంతకం చేసి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పంపారు. ఫలితంగా సీఎం నుంచి కలెక్టర్, ఎక్సైజ్ శాఖ, సంబంధిత అన్ని శాఖలకు ఈ సమస్యపై దర్యాప్తు చేయమని రాయగడ్ డివిజన్‌కు ఆదేశాలు అందాయి. ప్రతిపాదిత దుకాణం ప్రసిద్ధ సాయిబాబా ఆలయ ప్రవేశ ద్వారం నుంచి 144 మీటర్ల దూరంలో ఉందని, ప్రముఖుల విగ్రహాలు, విద్యాసంస్థలు, సమీపంలోని రాష్ట్ర రహదారి వంటి ఇతర అడ్డంకులు లేవని ఎక్సైజ్ శాఖ బృందాలు నివేదించాయి. అయినప్పటికీ స్థానికంగా ఉన్న సమస్యను పరిగణనలోకి తీసుకొని, ఇక్కడ ఉన్న మద్యం షాప్‌ను మరో భవనంలోకి మార్చాలని నిర్ణయించారు. దీంతో మద్యంపై పోరులో మహిళల సాధించిన విజయంగా అందరిని దృష్టిని ఆకర్షించడమే కాదు, ఎంతో మందికి స్ఫూర్తిని కలిగించింది. (చదవండి: -
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం
-
అధికారంలోకి వచ్చాక బాబు మార్క్ అరాచకం
-
ఈడీ అరెస్ట్ నుండి బాబు పీఏ శ్రీనివాస్ తప్పించుకోలేరు..
-
ప్రతిపక్షంగానే కాదు.. ప్రజాపక్షంగా పోరుకు సిద్ధం బలంగా ఎదుగుదాం..
-
సొంత ఆదాయం పెంచుకుని.. ప్రభుత్వం ఆదాయం తగ్గిస్తున్నాడు
-
99 రూపాయలకే క్వార్టర్ పై వైఎస్ జగన్ సెటైర్లు
-
బాబుకు వణుకు పుట్టింది.
-
బాబు మాఫియా బండారం బయటపెట్టిన జగన్
-
జగన్ నోటా చంద్రబాబు మాటలు ఇది మాములు ర్యాగింగ్ కాదు
-
ఇసుక TO "మద్యం దోచుకో.. పంచుకో.. తినుకో.. వైఎస్ జగన్ సెటైర్లు
-
మద్యంపై కూటమి సర్కారు పన్నుల మోత
-
ధర్మవరంలో రెచ్చిపోయిన కూటమి మద్యం మాఫియా
-
మద్యం మాఫియా అరాచకం.. కూటమి నేతల బరితెగింపు!
సాక్షి, సత్యసాయి జిల్లా: ఏపీలో టీడీపీ కూటమి మద్యం మాఫీయా రెచ్చిపోతోంది. లాటరీలో మద్యం షాపు దక్కించుకున్న వారిని పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమకే షాపులు ఇవ్వాలని ధర్మవరం, చిత్తూరులో కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు.తాజాగా ధర్మవరంలో టీడీపీ కూటమి మద్యం మాఫియా రెచ్చిపోయింది. లాటరీ ద్వారా ఎర్రగుంట మద్యం షాపును బాలిరెడ్డి దక్కించుకున్నాడు. దీంతో, మద్యం షాపు తమకు రాసివ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు బాలిరెడ్డిని బెదిరింపులకు గురిచేశారు. అయినప్పటికీ కూటమి నేతల బెదిరింపులకు బాలిరెడ్డి తలొగ్గలేదు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. బాలిరెడ్డి తెచ్చిన రూ.10లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అలాగే, ఎర్రగుంట మద్యం షాపులో లిక్కర్ బాటిల్స్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.ఇక, మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాస్ లాటరీలో ఐదు మద్యం షాపులు దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతల కనుసన్నల్లోనే మద్యం మాఫియా చెలరేగిపోతోంది.మరోవైపు.. చిత్తూరు జిల్లాలోనూ మద్యం సిండికేట్ ముఠా బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిని పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తాజాగా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అరాచకం సృష్టించాడు. బాలకృష్ణ అనే వ్యక్తిని బెదిరింపులకు గురిచేసి అతడి వద్ద నుంచి బలవంతంగా షాప్ లాక్కొన్నాడు.ఈ సందర్భంగా బాధితుడు బాలకృష్ణ మాట్లాడుతూ..‘బైరెడ్డి పల్లి మండలంలో షాప్ నెంబర్ 87 లాటరీ ద్వారా నాకు వచ్చింది. నేను షాప్ పెట్టకుండా విష్ణువర్ధన్ రెడ్డి బెదిరించాడు. అంతేకాకుండా తన అనుచరులతో భౌతికంగా దాడి చేయించారు. నా చేత బలవంతంగా షాప్ వెనక్కి తీసుకుని, ఆర్-2గా వచ్చిన వారికి షాప్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.పలమనేరు నియోజకవర్గం టీడీపీ మద్యం సిండికేట్ బెదిరింపులు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. కర్ణాటకకు చెందిన వ్యక్తికి షాప్ దక్కడంతో పలమనేరు నేతలు బెదిరింపులకు దిగారు. లక్కీ డిప్ ద్వారా దుకాణాలు దక్కిన వాళ్ళు మద్యం సిండికేట్ మాట వినకుంటే బలవంతంగా ఆర్-1, ఆర్-2గా ఉన్న వాళ్లు దక్కించుకునేలా ఎక్సైజ్ అధికారులతో, పోలీసులతో రాయబారం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మాట వినని వారిపై దాడులు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆమ్రపాలి.. ఆంధ్రాకే! -
అధికారులు జాగ్రత్త .. జమిలి ఎన్నికలు వస్తాయ్ ..
-
లిక్కర్ పాలసీ గొప్పదే అయితే.. బెదిరింపులు ఎందుకు ?
-
లిక్కర్ మాఫియాకు సూత్రధారి.. పాత్రధారి నువ్వు కాదా ?
-
బాలకృష్ణ ఇలాకాలో మద్యం షాపు దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
-
కూటమి నేతల బెదిరింపులు
-
టెండర్ గెలిస్తే.. కమీషన్ లేదా కరెన్సీ టీడీపీ బెదిరింపులు
-
కూటమి నేతల బెదిరింపులు
-
మద్యం షాపుల లాటరీ.. చింతమనేని అనుచరుల ఓవరాక్షన్
ఏలూరు జిల్లా: ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. చింతమనేని అనుచరులు.. పోలీసులను దాటుకుని లోపలికి దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు.పోలీసులు చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను పోలీసులు నిలువరించడంతో.. చలసాని గార్డెన్లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. నంద్యాల: మద్యం షాపుల కేటాయింపులో టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఆత్మకూరు పరిధిలో మెజార్టీలు షాపులు కూటమి నేతలకు వచ్చేలా చేసుకున్నారు. 13 మద్యం షాపులకు 11 దుకాణాలను స్కెచ్ వేసి.. కూటమి నేతలు రాబట్టుకున్నారు.నంద్యాల: వ్యాపారి ముత్తుకు టీడీపీ నేతలు బెదిరించారు. లాటరీలో ముత్తుకు జూపాడుబంగ్లా మద్యం షాపు దిక్కింది. దీంతో ఆ మద్యం షాపును తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు ముత్తుపై బెదిరింపులకు పాల్పడ్డారు.ప్రకాశం: ఒంగోలులో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మద్యం టెండర్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు. పూర్తి మద్యనిషేధం విధించాలాని నినాదాలు చేశారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యం షాపు నిర్వాహకులు తనకు 35 శాతం కమిషన్ ఇవ్వాలని హుకూం జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే పేకాట, జూద కేంద్రాల నుంచి 15 శాతం, మరో 20 శాతం పెట్టుబడి వాటాగా ఇవ్వాలని హెచ్చరించారు.కమిషన్ల రూపంలో వచ్చే డబ్బును తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న జేసీ.. తాడిపత్రి నియోజకవర్గంలో తన ప్రత్యర్థులు ఊరు విడిచి పోవాల్సిందేనని బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. జేసీ లిక్కర్ షాపు నిర్వహాకులకు, ప్రత్యర్థులకు బహిరంగంగా హెచ్చరికల జారీ చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ఇలా తండ్రే కాదు ఆయన కుమారుడు సైతం అస్మిత్‌రెడ్డి సైతం వ్యహరిస్తున్నారనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. మా రూటే సపరేటుఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం.. అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి. పోలీసుల్లో అసంతృప్తి.. తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయడానికి అధికారులే రావడం లేదు.. జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్ఐ ఉన్నా అటాచ్డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. -
కిడ్నపులు, బెదిరింపులతో టీడీపీ నేతలు మద్యం షాపుల దందా
-
టీడీపీ లిక్కర్ మాఫియా దెబ్బకు ప్రభుత్వానికి 2000 కోట్లు నష్టం
-
జేసీ వర్గీయుల దాష్టీకం..లిక్కర్ షాపు కోసం కిడ్నాపులు
సాక్షి,అనంతపురం: ఏపీలో లిక్కర్ షాపుల కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. సిండికేట్లుగా ఏర్పడి మద్యం షాపులను చేజిక్కించుకునేందుకు పచ్చనేతలు అక్రమాలకు తెర తీశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు ఏకంగా కిడ్నాప్‌లు చేసేందుకు తెగబడ్డారు. మద్యం దుకాణానికి దరఖాస్తు చేశాడన్న కోపంతో యాడికిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ రామ్మోహన్‌ను జేసీ వర్గీయులు కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీ వర్గీయుల చెర నుంచి ఎంపీటీసీ రామ్మోహన్‌ను విడిపించారు. టీడీపీ నేతల దాష్టీకంపై యాడికి వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా, ఏపీలో వైఎస్సార్సీపీ హయాంలో ఉన్న పాత మద్యం పాలసీని రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఏపీలో కొత మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా మద్యంషాపులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ షాపులన్నీ ఎలాగోలా సిండికేట్లుగా మారి దక్కించుకోవాలని టీడీపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తుండడం గమనార్హం.ఇదీ చదవండి: కమీషన్లు..ముడుపులు.. దారి తప్పిన టీడీపీ -
హైదరాబాద్: వైన్ షాపులు ‘బంద్’.. బారులు తీరిన మద్యం ప్రియులు (ఫొటోలు)
-
FACT CHECK: కల్లు తాగిన కోతి..రామోజీ
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతిలా చిందులు వేయడం అంటే ఏమిటో ఈనాడు రామోజీరావును చూస్తుంటే తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో టీడీపీకి మరోసారి ఘోర పరాజయం తప్పదన్న బాధతో ఆయనలో పచ్చ పైత్యం ప్రకోపిస్తోంది. ఆ ఆక్రోశంతో నిద్రపట్టని రాత్రులు గడుపుతున్న రామోజీ చిత్త చాపల్యంతో మతి స్థితమితం కోల్పోతూ మత్తు రాతలు రాస్తున్నారు. ఈనాడు పత్రిక నిండా అసత్యాలతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయంటూ తాజాగా ‘తాగించారు.. తూగించారు’ శీర్షికతో కట్టుకథను అల్లారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నా కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కారు. మద్యం విక్రయాలు తగ్గించేందుకే షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. దాచేస్తే దాగని సత్యాలు చంద్రబాబు హయాంలో ► రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ యథేచ్ఛగా చెలరేగిపోయింది. మూడు పరి్మట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలు అన్నట్టుగా మద్యం ఏరులై పారింది. ► ఉ. 10 నుంచి రాత్రి 11 వరకు విక్రయాలు. అనధికారికంగా 24 గంటలూ షాపులు. ► 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా అంతే సంఖ్యలో పరి్మట్ రూమ్‌లకు అనుమతి. వీటికి తోడు 43 వేలకుపైగా బెల్డ్ దుకాణాలు. ► ఎమ్మార్పీ ధరల కంటే 25 శాతం వరకు అధిక ధరలకు అమ్మకాలు. ► ఏటా బార్ల సంఖ్య పెంపు. ► మొక్కుబడిగా మద్యం నాణ్యత పరీక్షలు. ఐదేళ్లలో 96,614 శాంపిల్స్ మాత్రమే సేకరణ. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) నివేదిక ప్రకారం 2015–16లో 34.9 శాతం పురుషులు, 0.4 శాతం మహిళలకు మద్యం అలవాటు ఉంది. జగన్ హయాంలో ► మద్యం మాఫియా అరాచకాలను ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. ► ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు. ► 2019, అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం. ► మద్యం దుకాణాల వేళలు కుదింపు. ఉ.10 నుంచి రాత్రి వరకే విక్రయాలు. ► 4,380 పరి్మట్ రూమ్‌లు రద్దు. 43వేల బెల్ట్ దుకాణాలు పూర్తిగా తొలగింపు. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు. ప్రస్తుతం ఉన్నవి 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే. ► కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. నోటిఫికేషన్ జారీ చేసి ఈ–వేలం ప్రక్రియ ద్వారా బార్ల కేటాయింపు. ► నగదు చెల్లింపులతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానం. ► మద్యం నాణ్యత పరీక్షల కోసం బెవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.12.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక లేబరేటరీల ఏర్పాటు. సగటున ఏడాదికి 1,26,083 శాంపిల్స్ పరీక్ష. ► అక్రమ మద్యం అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ఏర్పాటు. ► 2019–21 నాటికి ఇది పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గింది. -
టానిక్ వైన్ షాప్స్ సోదాల్లో సంచలన విషయాలు
-
టానిక్ లిక్కర్ మార్ట్ వ్యవహారాలపై ఎక్సైజ్ అధికారుల విచారణ
-
తెలంగాణలో మొదలైన మద్యం దుకాణాల లక్కీ డ్రా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ అంబర్పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ లక్కీ డ్రా కార్యక్రమం కొనసాగుతోంది. లక్కీ డ్రా జరుగుతున్న సెంటర్లో మద్యం వ్యాపారులు భారీ సంఖ్యలో పోటెత్తారు. పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి అనుమతించనున్నారు అధికారులు. గత కొన్ని రోజులుగా జరిగిన మద్యం షాపు దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో లక్కీ డ్రా ఆధారంగా వారికీ షాపులు కేటాయించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 2620 మద్యం దుకాణాలకు కొనసాగుతున్న లక్కీ డ్రా అంబర్పేట్ రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో జరుగుతోంది. ఇక ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్న ప్రాంతాల్లో భారీగా వాహనాల ప్రవాహం ఉంటుందని ముందే అనుమానించిన ట్రాఫిక్ శాఖ ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లక్కీ డ్రా సమయంలో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోకుండా భారీగా అభండారట ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోకి దరఖాస్తుదారుని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఇతర ఆసరా పింఛన్లూ పెంపు? -
గేమ్‌లో ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. మితిమీరి తాగడంతో..
సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకోవడానికి యువత పోటీపడుతుంటారు. రకరకాల వీడియోలతో ఫాలోవర్స్‌ను ఆకర్షిస్తుంటారు. వివిధ స్టంట్స్ చేస్తూ కొన్నిసార్లు ప్రాణాలమీదికి తెచ్చుకుంటారు. అలాంటి ఘటనే చైనాలో జరిగింది. లైవ్ స్ట్రీమింగ్‌లో పోటీపడి పరిమితికి మించి మద్యంతాగి ప్రాణాలను కోల్పోయాడో వ్యక్తి. ఇంతకూ ఎంత తాగాడో తెలిస్తే షాకవుతారు! చైనా షార్టు వీడియో ప్లాట్‌ఫామ్ 'డౌయిన్'(చైనా టిక్‌టాక్)లో ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమ్స్ నడుస్తుంటాయి. మధ్యరాత్రి ఒంటిగంటకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగుస్తాయి. ఇందులో లైవ్‌లో రకరకాల స్టంట్స్ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తారు. ఈ క్రమంలో ఇద్దరు కంటెండర్లు 'పీకే'అనే పేరుతో ఓ క్రేజీ గేమ్ ఆడారు. ఆడియన్స్ నుంచి ఎక్కువ గిఫ్ట్స్ సంపాదించాలని గేమ్‌లో పోటీపడ్డారు. ఓడిన వ్యక్తి క్రేజీ శిక్షను అనుభవించాలని నిబంధన విధించుకున్నారు. వీడియోలో పేర్కొన్న ప్రకారం.. ఈ గేమ్‌లో ఓడిన వ్యక్తే జియాంగ్సు ప్రావిన్స్‌కు చెందిన జూవా. గెలిచిన వ్యక్తి సాంక్యూజ్. గేమ్‌లో భాగంగా లైవ్‌లో జువా ముందు ఏడుబాటిళ్ల'బైజు'(చైనా ఓడ్కా)ను పెట్టాడు సాంక్యూజ్. గేమ్‌లో ఓడినందుకు ఆ రోజురాత్రి లైవ్‌లోనే ఏడుబాటిళ్ల 'బైజు'ను తాగాడు జువా. మద్యం మత్తులోనే అస్వస్థతకు గురైన జువా.. నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు చూస్తే అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జువా ఎంత వైన్ తాగాడో సరిగ్గా తెలియదు.. కానీ రాత్రి లైవ్‌లో నాలుగో బాటిల్ తాగడం వరకు తనకు జ్ఞాపకం ఉందని తన స్నేహితుడు వెల్లడించాడు. జువా ఈ మధ్యే లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చేరాడని తెలిపాడు. 'బైజు' మద్యంలో సాధారణంగా 30 నుంచి 60 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఒకబాటిల్ పూర్తిగా తాగితేనే ప్రాణాలకు ప్రమాదం అని వైద్యులు తెలిపారు. డౌయిన్ ప్లాట్ఫామ్లో 10లక్షల వ్యూయర్స్ ఉన్నారు. దాదాపు రూ.28బిలియన్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇదీ చదవండి:మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్లో పుడ్ ఫ్రీ, ఫ్రీ! -
Telangana: న్యూ ఇయర్ వేడుకలు.. మందుబాబులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత కొత్త సంవత్సరం వేడుకలు ఈసారి పూర్తిస్థాయిలో జరగనున్నాయి. న్యూ ఇయర్‌ను వెల్కం చెప్పేందుకు యువత జోరుగా హుషారుగా రెడీ అవుతోంది. వీరి ఆసక్తిని రెట్టింపు చేసేందుకు నగరం నలు చెరగులా వేదికలు, వేడుకలు స్వాగతం పలుకుతున్నాయి. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. తాజాగా న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్‌శాఖ అనుమతినిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు రాత్రి ఒంటిగంట వరకు.. రిటైల్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండనున్నాయి. మరోవైపు న్యూయిర్ వేడుకల సందర్భంగా పోలీసులు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని షరతు విధించారు. పరిమితికి మించి పాస్‌లు, టికెట్లు జారీ చేయొద్దని పేర్కొన్నారు.. పబ్బులు, బార్లలో మైనర్లను అనుమతించకూడదని తెలిపారు. చదవండి: తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. గతేడాదితో పోలిస్తే.. -
మద్యం దుకాణంపై పేడ విసిరిన మాజీ సీఎం..
భోపాల్/నివారీ: మద్యపానాన్ని నిషేధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి గత కొంత కాలంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. అది కూడా ఆమె తన సొంత ప్రభుత్వంపైనే ఇదంతా చేస్తోంది. ఈ సారి భిన్నంగా తన పోరాటాన్ని చూపించి మరోసారి వార్తల్లో నిలిచారు ఉమా భారతి. తాజాగా మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని ఆమె చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని నివారీ జిల్లా ఓర్చా పట్టణంలో ఓ మద్యం దుకాణంపై ఆవు పేడ విసిరారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలైంది. ‘పేడ విసరడమే కాదు, దుకాణంపైకి రాళ్లు కూడా రువ్వుతున్నా’నని వీడియో తీస్తున్న వ్యక్తితో ఉమాభారతి అంటూ కన్పించారు. దాంతో దుకాణాన్ని యజమాని తాత్కాలికంగా మూసేశాడు. గతంలోనూ ఉమాభారతి భోపాల్‌లోని ఓ మద్యం దుకాణంలోకి వెళ్లి బాటిళ్లపై రాళ్లు విసిరి పగలగొట్టడం తెలిసిందే. -
మందుబాబులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: మందుబాబులకు హర్యానా ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 24 గంటలపాటు బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో మద్యాన్ని విక్రయించేందుకు అనుమతినిస్తూ హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ పాలసీని తొలిదఫాలో జూన్ 12 నుంచి గురుగ్రామ్‌లో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఏడాది కాలానికి గాను రిటైల్ లిక్కర్ లైసెన్స్ ఫీజుకు మరో రూ. 18 లక్షలు అదనంగా చెల్లించిన బార్లు, రెస్టారెంట్లు 24 గంటలపాటూ మద్యాన్ని విక్రయించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మద్యంపై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు, రెస్టారెంట్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యాన్ని అమ్మడానికి అనుమతినిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఎక్సైజ్ పాలసీ 2021-22 ప్రకారం త్వరలోనే ఉత్తర్వులు జారీచేసే అవకాశమున్నదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాలతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయాన్ని బార్లు, రెస్టారెంట్ల యజమానులు స్వాగతించడం గమనార్హం. ఇది కూడా చదవండి: సిటీ బస్సులో సీఎం.. ఆశ్చర్యపోయిన ప్రయాణికులు -
ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: మద్యం షాపుల కేటాయింపుల్లో ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మద్యం షాపుల కేటాయింపులో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులాలకు రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వాసిరెడ్డి రవికాంత్పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారించారు. కులం ఆధారంగా రిజర్వేషను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని, బీసీల్లో 132 కులాలు ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. ఎక్సైజ్ చట్టం ప్రకారం మద్యం దుకాణాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒక కులానికి రిజర్వేషన్లు కల్పిస్తే మిగిలిన కులాలపట్ల వివక్షత చూపించినట్లేనని తెలిపారు. వెనుకబడిన కులాల ఆర్థిక పురోభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ.. మరోవైపు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలు, లైసెన్స్ ఫీజును రూ.కోటి పది లక్షలు పెట్టిందని, ఆయా వర్గాలు ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. సవరణ జీవో 100 జారీ చేశాం... కాగా, వెనకబడిన వర్గాలు ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించామని, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని విజ్ఞప్తి చేశారు. గౌడ కులస్తులు కల్లుగీతపై ఆధారపడి కల్లు దురాణాలను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని.. తాటి, ఈత చెట్లు తగ్గిపోవడంతో వారికి జీవనోపాధి లేకుండా పోయిందన్నారు. పిటిషనర్లు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేయలేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం వారికి లేదని తెలిపారు. ఓపెన్ కేటగిరీలో మూడు మద్యం దుకాణాలను వేలం వేయకుండా ఉంచుతామని, పిటిషనర్లు దరఖాస్తు చేసి వారి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. -
Telangana : మద్యం దుకాణాలకు ‘రోస్టర్ పాయింట్లు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లను రోస్టర్ పాయింట్ల పద్ధతిలో అమలు జరపాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలను రూపొందించింది. ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం 2021–23 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని వైన్ (ఏ4) షాపుల్లో 30 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఇందులో గౌడ్లకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్లను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు ముందుగా డ్రాలు తీయాల్సి ఉంటుంది. జిల్లా ఎక్సైజ్ అధికారి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో కూడిన కమిటీ ముందు వీడియో చిత్రీకరణ చేస్తూ ఈ డ్రాలు తీయాలని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆ డ్రాలలో వచ్చిన షాపులను ఈ మూడు వర్గాలకు కోటా మేరకు కేటాయిస్తారు. కోటా పూర్తయిన తర్వాత మిగిలిన షాపులను ఓపెన్ కేటగిరిలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచుతారు. ఎక్సైజ్ శాఖ రూపొందించిన నిబంధనల ప్రకారం.. ముందుగా జిల్లాలో ఉన్న షాపులన్నింటికీ నంబర్లు కేటాయించి టోకెన్ల రూపంలో ఒక ఖాళీ డబ్బాలో పోయాలి. ఆ డబ్బా నుంచి ఒక్కో టోకెన్ బయటకు తీయాలి. మొదటి టోకెన్ షాపును ఎస్టీలకు, ఆ తర్వాత వచ్చే టోకెన్‌ను ఎస్సీలకు, ఆ తర్వాతి దాన్ని గౌడ సామాజిక వర్గాలకు కేటాయించాలి. ఈ కోటా పూర్తయిన తర్వాత డబ్బాలో మిగిలిన టోకెన్ నంబర్లున్న షాపులను ఓపెన్ కేటగిరీ డ్రాల కోసం నోటిఫై చేస్తారు. షెడ్యూల్డ్ ఏరియాలో అన్నీ ఎస్టీలకే.. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిధిలోనికి వచ్చే షాపులన్నింటినీ గిరిజనులకే కేటాయించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ షాపులన్నీ ఎస్టీలకు రిజర్వ్ చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని షాపులను సాధారణ డ్రా నుంచి మినహాయించనున్నారు. ఈ షాపులకు ఎస్టీలకు ఇస్తున్నందున మైదాన ప్రాంతాల్లోని షాపుల్లో ఎస్టీలకు పరిమిత సంఖ్యలో మాత్రమే కేటాయించనున్నారు. -
మా స్కూల్ సమీపంలో మద్యం షాపును తీసేయండి!
చెన్నై: తమిళనాడులోని అరియలూరు జిల్లాలో తమ పాఠశాలకు సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేసేయండి అంటూ ఇద్దరూ పాఠశాల విద్యార్థులైన అక్కాతమ్ముడు జిల్లా కలెక్టరుకు లేఖ పంపారు. పైగా ఈ విద్యార్థులిద్దరూ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు విజ్ఞప్తి కూడా చేశారు. అయితే తొబుట్టువులైన ఈ విద్యార్థులు ఇరువురు ఇలంతేంద్రల్ ఆరవ తరగతి, అరివరసన్ నాల్గవ తరగతి చదువుతున్నారు. (చదవండి:అమేజింగ్ ఆర్ట్ .....ఒక చిత్రం ఎన్ని చిత్రాలుగా మారుతుందో!) ఈ క్రమంలో ఈ విద్యార్థులిద్దరూ నవంబర్‌లో స్కూళ్లు తెరవక మునుపే మా స్కూల సమీపంలోని మద్యం దుకాణాన్ని తీసువేయండి అంటూ లేఖలో అభ్యర్థించారు. ఈ మేరకు ఆ విద్యార్థులిద్దరూ మాట్లాడుతూ.....మద్యం సేవించే వాళ్లు ఆ షాపు దగ్గర కూర్చొని అసభ్య పదజాలంతో మాట్లాడుతుంటూరు. అంతేకాదు చాలామంది తల్లిదండ్రులు ఈ మద్యానికి బానిసై పిల్లలను పనికి పంపి వారిని అడుక్కునేలా చేస్తారు. అన్ని మద్యం షాపులు మూసివేస్తేనే ఈ సమస్య ఉండదు" అని అన్నారు. ఈ క్రమంలో ఆ మద్యం షాపు నిబంధనలకు అనుగుణంగా 100 కి.మీ దూరంలో ఉన్నప్పటికీ పిల్లల విజ్ఞప్తి మేరకు ఆ షాపుని తరలించాలని నిర్ణయించామని అరియలూర్ కలెక్టర్ పి రమణ సరస్వతి తెలిపారు. (చదవండి: మేమే నీతో పాటే అంటూ ....చనిపోయిన భర్త, పిల్లలు) -
విదేశీ మద్యం అమ్మకంపై వివాదం.. రివాల్వర్‌తో యువకుడి హల్చల్!
జయపురం: విదేశీ మద్యాన్ని అధికధరకు అమ్మడంపై తలెత్తిన వివాదంలో ఒక యువకుడి నుంచి పిస్టల్‌ను స్వాధీనపరచుకున్నట్లు జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బొయిపరిగుడ వాసి ఉమాశంకర గౌడను అరెస్టు చేసినట్లు బెహర వెల్లడించారు. బొయిపరిగుడలో ప్రభుత్వ లైసెన్స్‌తో విదేశీ మద్యం దుకాణం ఉందని, 12వ తేదీన నిందితుడు ఉమాశంకర గౌఢతో పాటు అతని సహచరుడు అసమత్ఖాన్ ఉరఫ్ పప్పు విదేశీ మద్యం దుకాణానికి వెళ్లి ఒక మద్యం బాటిల్ అడిగినట్లు తెలిపారు. బాటిల్ ధర రూ.200 కాగా, సేల్స్‌మాన్ రూ.220 చెప్పాడని వాగ్వాదానికి దిగారు. దీంతో ఉమాశంకర్ రివాల్వర్ తీసుకొని సేల్స్‌మాన్ రామప్రసాద్ సాహు గురిపెట్టి చంపుతామని బెదిరించాడని వెల్లడించారు. రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బెహర వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు. -
Vaccination:మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించింది. అయినా మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా చేరే లిక్కర్ షాప్ నిర్వాహకులను సూపర్ స్ప్రెడర్స్‌గా గుర్తించింది ప్రభుత్వం. ఈ క్రమంలో వ్యాక్సిన్ డ్రైవ్‌లో మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలానే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ బాయ్స్, ఆటో-క్యాబ్ డ్రైవర్లకు,రైతుబజార్లు, కూరగాయలు, నాన్‌వెజ్ మార్కెట్ నిర్వాహకులకు, పాలు, దుకాణదారులకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. చదవండి: వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్ -
శని, ఆదివారాలు చెక్కులిచ్చినా.. లిక్కర్ ఇస్తాం
సాక్షి, హైదరాబాద్: ఆదాయార్జనలో అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఎక్సైజ్ శాఖ వదిలిపెట్టడంలేదు. కొత్త మున్సిపాలిటీల్లో బార్ల ఏర్పాటు పేరుతో ఔత్సాహికుల నుంచి నెల రోజుల్లోనే రూ. 75 కోట్లకుపైగా సంపాదించిన ఆబ్కారీ శాఖ ఇప్పుడు మద్యం వ్యాపారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. శని, ఆదివారాలు సెలవులు ఉన్న నేపథ్యంలో చెక్కు ఇచ్చినా సరే డిపోల నుంచి రిటైలర్లకు మందు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీన్ని బట్టి ఖజానాను నింపుకొనే క్రమంలో రెండు రోజుల సమయాన్ని కూడా ఆ శాఖ వదులుకోవడంలేదని అర్ధమవుతోంది. గతంలో డీడీలు ఇప్పుడు చెక్‌లు రాష్ట్రంలోని రిటైల్ మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో మాత్రమే మందు అమ్ముతోంది. అంటే ఏదైనా వైన్ లేదా బార్ షాపునకు మద్యం కావాలంటే కొనుగోలు విలువకు సరిపడా నగదును బ్యాంకులో చెల్లించి డీడీ రూపంలో సమర్పిస్తేనే డిపో నుంచి షాపునకు మద్యం పంపేది. కానీ, ఇప్పుడు చెక్కు ఇచ్చినా మద్యం సరఫరా చేయాలని శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రెండు రోజులను కూడా వృధా చేసుకోకుండా కాసులు రాబట్టుకునేందుకే చెక్కుల నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, చెక్కు బౌన్స్ అయితే మాత్రం 20 శాతం పెనాల్టీ చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. -
మద్యంపై యుద్ధం
-
మందుబాబులకు గుడ్‌న్యూస్: ఇకపై హోం డెలివరీ!
ముంబై: మద్యం ప్రియులకు మహారాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి అనుమతినిచ్చింది. లిక్కర్ షాపులు తిరిగి ప్రారంభించిన (మే 5 నుంచి)నేపథ్యంలో సామాజిక ఎడబాటు నిబంధనలకు విఘాతం కలుగుతున్న వేళ.. బీర్, వైన్ సహా అన్ని రకాల స్వదేశీ, విదేశీ బ్రాండ్లు ఇంటి వద్దకే సరఫరా చేసే వెసలుబాటు కల్పించింది. అయితే లాక్డౌన్ నిబంధనలను అనుసరించి.. లైసెన్సు ఉన్న లిక్కర్ షాపులకు మాత్రమే మద్యం డోర్ డెలివరీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 23.401 పాజిటివ్ కేసులు నమోదు కాగా... దాదాపు 868 మంది మృత్యువాత పడ్డారు. 4786 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.(లిక్కర్‌పై సుప్రీంకోర్టుకెక్కిన తమిళనాడు) మద్యం హోం డెలివరీ- నిబంధనలు షాపు విస్తరించి ఉన్న నిర్ణీత ప్రాంతం వరకే హోం డెలివరీకి అనుమతి(లైసెన్స్ అనుమతి ఉన్న ప్రాంతం) మద్యం సరఫరా చేసే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. తరచుగా హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించాలి నిర్ణీత గంటలు, రోజుల్లో మాత్రమే మద్యం డెలివరీకి అనుమతి ఉంటుంది ఈ వెసలుబాటు లాక్డౌన్ ముగిసేవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది(ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి) -
మందు కొంటే ‘మార్క్’ పడాల్సిందే!
హోషంగాబాద్: మందుబాబులను గుర్తించేందుకు మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా అధికార యంత్రాంగం వినూత్న విధానాన్ని అవలంభిస్తోంది. మద్యం కొనేవారి చేతి వేలిపై ఇంకు చుక్క పెడుతున్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి అభిషేక్ తివారి ఆదేశాల మేరకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ‘మద్యం కొనుగోలు చేయడానికి వచ్చేవారి చూపుడు వేలిపై ఇంకు చుక్క పెడుతున్నాం. సమీప భవిష్యత్తులో వారి వివరాలు కావాలంటే వెంటనే వారిని గుర్తించేందుకు ఇది దోహదపడుతుంది. దీంతో పాటుగా మందుబాబుల పేర్లు, చిరునామా, మొబైల్ ఫోన్ నంబర్లు మద్యం కాణంలోని రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించామ’ని తివారి తెలిపారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో 50 మద్యం దుకాణాలు తెరిచారని, షాపుల వద్ద పెద్దగా రద్దీ లేదని చెప్పారు. కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ మే 17 వరకు పొడిగించడంతో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించిన సంగతి తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 3,138 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 185 మంది చనిపోయారు. 1,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. (31 మంది పోలీసులకు కరోనా పాజిటివ్) -
పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు.. షాప్ ఓనర్‌పై కేసు
బెంగళూరు : దాదాపు 40 రోజుల తర్వాత మద్యం విక్రయాలకు అనుమతివ్వడంతో.. మందుబాబుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. చాలా రోజులుగా మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులు.. రెట్టించిన ఉత్సాహంతో అర్ధరాత్రి నుంచే వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా.. షాపులు తెరిచే వరకు వేచి చూశారు. కొందరైతే షాపులు తెరవగానే.. భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేశారు. బెంగళూరులో ఓ వ్యక్తి ఏకంగా రూ. 52,841 విలువ చేసే మద్యం కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన బిల్లును ఫొటో తీసి వాట్సాప్‌లో ఉంచడంతో.. అది కాస్త వైరల్ మారింది.(చదవండి : మందుబాబులు ఎగబడ్డారు!) దీంతో స్పందించిన కర్ణాటక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు మద్యం విక్రయించిన షాప్ ఓనర్‌పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. అనుమతించిన దానికంటే ఎక్కువ మొత్తంలో ఓ వ్యక్తికి మద్యం అమ్మడంతో ఈ నిర్ణయం తీసకున్నట్టు తెలిపారు. నిబంధనల ప్రకారం ఒక్క రోజులో 2.6 లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లేదా 18 లీటర్ల బీర్ మాత్రమే ఒక వినియోగదారుడికి విక్రయించాలి. కానీ వాట్సాప్‌లో వైరల్ అయిన బిల్లు ప్రకారం.. దక్షిణ బెంగళూరులోని వనిల్లా స్పిరిట్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఓ వినియోగదారుడికి 13.5 లీటర్ల లిక్కర్, 35 లీటర్ల బీర్ విక్రయించింది. మరోవైపు ఆ బిల్లు పోస్ట్ చేసిన వ్యక్తిపై కూడా అధికారులు కేసు నమోదు చేయనున్నారు. అయితే అతడి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.(చదవండి : ఢిల్లీలో లిక్కర్‌పై 70% స్పెషల్ కరోనా ఫీజు) ఇదే విషయంపై ఎక్సైజ్ అధికారులు సదరు మద్యం షాపు ఓనర్‌ను ప్రశ్నించగా.. వారు 8 మంది వినియోగదారులని, కానీ ఒక కార్డు ద్వారా బిల్లు మొత్తం చెల్లించినట్టు తెలిపాడు. అయితే ఓనర్ స్టేట్మెంట్ ఆధారంగా విచారణ సాగిస్తామని.. ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఇలా భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసిన కొందరు తమ బిల్లులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అధికారులు వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు మంగళవారం నుంచి కర్ణాటకలో మద్యం రేట్లు 6 శాతం పెంచనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి నాగేశ్ తెలిపారు. కాగా, మే 17 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం.. పలు సడలింపులు ప్రకటించింది. అందులో భాగంగా కరోనా ప్రభావం అధికంగా లేని చోట్ల విక్రయాలకు అనుమతించింది. -
తెలంగాణలో మద్యానికి ఓకే!
సాక్షి, హైదరాబాద్ : మద్యం ప్రియులకు శుభవార్త. రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా మూతబడిన మద్యం దుకాణాలు లాక్డౌన్ కారణంగా ఇప్పటివరకు తెరుచుకోలేదు. అయితే, కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలను తాజాగా పునఃప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోనూ మద్యం విక్రయాలు చేపట్టాలని సర్కారు నిర్ణయానికి వచ్చింది. లేకుంటే పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా మద్యం స్మగ్లింగ్ చేసే అవకాశం ఉండటంతోపాటు మద్యం తాగేందుకు ఇక్కడి ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, దీని ద్వారా అక్కడ నుంచి రాష్ట్రంలోకి కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు వచ్చాయి. ఈ కారణాలరీత్యా రాష్ట్రంలో కూడా మద్యం విక్రయాలు పునరుద్ధరించడం అనివార్యంగా మారిందని ప్రభుత్వవర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా వైరస్ నియంత్రణ కోసం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్డౌన్ మే 7తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిని మరికొన్ని రోజులు పొడిగించే అంశంతో పాటు మద్యం విక్రయాలు, ఇతర సడలింపులపై మంగళవారం రాష్ట్రమంత్రివర్గం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల పరిధిలోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలను తెరిచేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతిచ్చింది. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఉండడంతో అక్కడ ఎలాంటి సడలింపులు వద్దని రాష్ట్ర వైద్యశాఖ సిఫార్సు చేసిన నేపథ్యంలో ఈ జిల్లాల్లో మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకుంటాయా? లేదా అన్న విషయంపై కొంత సందిగ్దత నెలకొని ఉంది. ఒకవేళ మంత్రివర్గం సానుకూలత వ్యక్తం చేస్తే.. కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం దుకాణాలు తిరిగి తెరుచుకునే అవకాశం ఉంది. లేకుంటే, ఈ నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన 29 జిల్లాల్లో మద్యం విక్రయాలు మే 6 లేదా 7 లేదా 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన స్టాకు తరలింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభించే అవకాశం ఉంది. చదవండి: లాక్డౌన్ ఎత్తేస్తే? కేబినెట్ ఎజెండా ఖరారు... రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో లాక్డౌన్ పొడిగింపు అనివార్యంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించడంతో పాటు పలు కీలక విషయాల్లో సడలింపులను ప్రకటించింది. తెలంగాణలో సైతం లాక్డౌన్ పొడిగించడంతో పాటు కేంద్రం ప్రకటించిన కొత్త సడలింపుల అమలకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానుంది. మంత్రివర్గ సమావేశానికి సన్నాహకంగా సీఎం కేసీఆర్ సోమవారం వరుసగా రెండోరోజు ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. కేబినెట్ ఎజెండాను ఈ సందర్భంగా ఖరారు చేశారు. కరోనా నియంత్రణకు రాష్ట్రంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఏ మేరకు ఫలితాలిచ్చాయి? ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? ఇకపై తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని లాక్డౌన్ పొడిగింపుపై మంగళవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మే 21 వరకు మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో లాక్డౌన్ పొడిగింపునకే అధిక శాతం ప్రజలు మొగ్గుచూపుతున్నారని వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది. చదవండి: విమానాల్లో ఇక దూరం దూరం సడలింపులే కీలకం.. రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు లాంఛనమే కాగా, కొత్తగా ప్రకటించనున్న సడలింపుల విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మార్చి 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండడంతో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతబడి రాష్ట్రం ఆర్థికపరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. మరోవైపు కరోనా వైరస్ ప్రభావం లేని గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలోని జిల్లాల్లో పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్వహించుకోవడానికి అనుమతించాలని పారిశ్రామికవర్గాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. భవన నిర్మాణ రంగ పనులకు ఇప్పటికే రాష్ట్రంలో సడలింపులు ఇవ్వగా.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉత్పత్తిని పునరుద్ధరించడం పట్ల సైతం ప్రభుత్వం సానుకూల వైఖరితో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రకటించిన సడలింపుల మేరకు ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో పరిశ్రమల్లో ఉత్పత్తిని పునరుద్ధరించారు. ఈ సమయంలో మన రాష్ట్రంలోని పరిశ్రమలు పడకేసి ఉంటే భవిష్యత్తులో పోటీ నుంచి కనుమరుగయ్యే ప్రమాదముంది. ఈ క్రమంలో పరిశ్రమల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. అలాగే పొరుగు రాష్ట్రాల్లో పగటిపూట ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్దేశించిన సీటింగ్ సామర్థ్యంతో ప్రైవేటు వాహనాలు అనుమతిస్తున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనుంది. చదవండి: రేషన్ తీసుకోని వారికి సాయం ఎలా? రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు కీలకమైన ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగ పరిశ్రమల నిర్వహణకు అనుమతించడంతో పాటు మద్యం దుకాణాల పునరుద్ధరణపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సేవలను పునరుద్ధరించేందుకు మరికొన్ని రోజులు వేచి చూస్తారని తెలుస్తోంది. ఆటోలు, ఆర్టీసీ బస్సులు వంటి ప్రజారవాణా సదుపాయాలను పునరుద్ధరిస్తే లాక్‌డౌన్‌ను అమలు చేయడం సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘మద్యం షాపులపై పునరాలోచన’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మద్యం దుకాణాలు తెరవడంపై పునరాలోచించాలని ఢిల్లీ బీజేపీ నేతలు ఆప్ ప్రభుత్వాన్ని కోరారు. మద్యం షాపులతో కోవిడ్-19 కేసులు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వం అనుమతించడాన్ని అసెంబ్లీలో విపక్ష నేత రాంవీర్ సింగ్ బిధూరీ విమర్శించారు. ఈ నిర్ణయంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 10 శాతం వరకూ పెరుగుతాయని అన్నారు. మార్చి 23న ఢిల్లీలో లాక్డౌన్ అమలైన తర్వాత తొలిసారిగా ఢిల్లీలో 150 ప్రభుత్వ మద్యం దుకాణాలు సోమవారం తెరుచుకున్నాయి. లిక్కర్ షాపుల ఎదుట 1 కిలోమీటర్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకూ మద్యం ప్రియులు క్యూ కట్టారు. పలుచోట్ల ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో ఆయా మద్యం షాపులను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ షాపులను తెరవడంపై పునరాలోచించాలని ఢిల్లీ బీజేపీ ప్రతినిధి ప్రవీణ్ శంకర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పోలీస్ కమిషనర్ ఏకే శ్రీవాస్తవలకు విజ్ఞప్తి చేశారు. చదవండి : ఒక్కొక్కరికి రెండు ‘మందు’ బాటిళ్లు -
మద్యం షాపులు ఇలా తెరిచారు.. అలా మూశారు!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సోమవారం మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం కోసం 40 రోజులుగా వేచిచూస్తున్న మందు బాబులు ఒక్కసారిగా లిక్కర్ షాపుల ముందు బారులుతీరారు. అన్ని మద్యం షాపుల ముందు పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి. మూడో దశ లాక్డౌన్ ప్రారంభమైనా ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, హర్యానా, ఏపీ, గోవా సహా పలు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలకు అనుమతించారు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మద్యం దుకాణాలకు నిర్ధేశిత సమయంలోనే అధికారులు అనుమతించారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనను మద్యం ప్రియులు పలు చోట్ల ఖాతరు చేయకపోవడంతో ఆయా షాపులను అధికారులు మూసివేయిన్నారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాప్ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో లిక్కర్ స్టోర్‌ను మూసివేశామని కరోల్‌బాగ్ ఎస్హెచ్ఓ మణీందర్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లు మినహా వైన్ షాపులను, కాలనీల్లోని వైన్ షాపులకు అనుమతించింది. పలు మద్యం దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు మధ్యాహ్నానికే ఆయా షాపులను మూసివేయించారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేసేవరకూ లిక్కర్ షాపులను తెరిచేందుకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. మద్యం, గుట్కా, పాన్ షాపుల వద్ద ఒకే సమయంలో ఐదుగురు మించి ఉండరాదని, వారి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఇక కర్ణాటకలోనూ మద్యం షాపులు తెరుచకున్నాయి. 40 రోజుల లాక్డౌన్లో మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో రోజుకు రూ 60 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి హెచ్ నగేష్ వెల్లడించారు. చదవండి : అందుకే మద్యం ధరలు పెంచారు : రోజా లిక్కర్‌పై కోవిడ్-19 సెస్ మద్యంపై కోవిడ్-19 సెస్‌ను విధించాలని హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం నాణ్యత, పరిమాణం ఆధారంగా రూ 2 నుంచి రూ 20 వరకూ సెస్ విధించాలని భావిస్తున్నామని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. ఇక ఏపీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలను అనుమతించాయి. -
ఏపీ- తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీలో నేటి నుంచి మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో.. నెల్లూరు జిల్లాలోని తడ మండలం బీవీ పాలెం, రామాపురం ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్దకు తమిళులు భారీగా చేరకుంటున్నారు. ఒక్కసారిగా తమిళులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైన్ షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం షాపులను మూయించి పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చారు. మరోవైపు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏపీలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. చదవండి : ఏపీలో కొత్తగా 67 కరోనా కేసులు.. సడలింపు కొంతే.. ఆదేశాలు పక్కగా అమలు! మందు బాబుల బారులు.. 30 శాతం ధరల పెంపు -
మద్యం షేర్లకు మినహాయింపు కిక్కు
సాక్షి, ముంబై : మద్యం దుకాణాలకు షరతులతో కూడిన అనుమతి లభించడంతో నష్టాల మార్కెట్లో కూడా పలు లిక్కర్ షేర్లు దూసుకుపోతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అన్ని జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం లిక్కర్ స్టాక్స్ ఫుల్ జోష్‌లో ట్రేడవుతున్నాయి. దాదాపు 11శాతం వరకు ఎగిసాయి. జీఎం బ్రూవరీస్, అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్, రాడికో ఖైతాన్, గ్లోబస్ స్పిరిట్స్, యునైటెడ్ బ్రూవరీస్, యునైటెడ్ స్పిరిట్స్ ఈ రోజు ఇంట్రా-డే లో 4 నుండి 11 శాతం వరకు లాభపడుతున్నాయి. కరోనా వైరస్ ఉధృతికి అడ్డు కట్టపడకపోవడంతో మే 17 తేదీ వరకు లాక్డౌన్ పొడగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెన్సెక్స్ 1712 పాయింట్లకుపైగా కుప్ప కూలి 32వేల స్థాయి దిగువకు చేరింది. నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పతనమైంది. (లాక్డౌన్ 3.0 : సెన్సెక్స్ ఢమాల్) లాక్‌డౌన్‌తో గత త్రైమాసికంలో మద్యం అమ్మకాల వాల్యూమ్స్ గణనీయంగా పడిపోనున్నాయని విశ్లేషకులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌తో యునైటెడ్ బ్రేవరీస్ తమ వాల్యూమ్స్‌లో 15శాతం క్షీణతను అంచనావేసింది. అయితే అధిక ధరల కారణంగా కంపెనీలకు మార్జిన్స్ మరింత పెరగనున్నాయనీ, అమ్మకాలు తగ్గడంతో ఆపరేటింగ్ మార్జింగ్ క్షీణతను నమోదు చేసే అవకాశముందని ఎంకే గ్లోబల్ సర్వీసెస్ అంచనా వేసింది. (జియో మరో భారీ డీల్ ) మరోవైపు దేశవ్యాప్తంగా షరతులతో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు ఆయా దుకాణాల వద్ద బారులు తీరడం గమనార్హం. కాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం, రెడ్ ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలను ( స్టాండ్ ఎలోన్) తెరవడానికి అనుమతిస్తారు. అయితే దేశవ్యాప్తంగా కంటైన్ మెంట్ జోన్లలో మద్యం విక్రయాలకు అనుమతి లేదు. (మద్యం దుకాణాలు మినహాయింపులు : క్లారిటీ) -
వైన్ షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర
న్యూఢిల్లీ : లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.(మద్యం ధరలు 30 శాతం పెంపు) చత్తీస్‌ఘడ్‌లోని రాజ్‌నంద్‌గాన్‌లోని సోమవారం ఉదయం మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. కేంద్రం ఇచ్చిన లాక్డౌన్ 3.0 నిబంధనలకు అనుగుణంగా కంటైన్ మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. మరోవైపు ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్ షాప్ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు.(‘బారు’లు తీరిన మందుబాబులు) కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. -
మద్యం విక్రయాలకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి మే 17 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో భారీ సడలింపులు ప్రకటించింది. కంటెయిన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది. మద్యం షాపుల వద్ద అయిదుగురు మించి గుమికూడరాదని స్పష్టం చేసింది. మద్యం, పాన్, గుట్కా, పొగాకు విక్రయించే షాపుల వద్ద ప్రజలు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని పేర్కొంది. ఇక మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం మద్యం విక్రయాలకు అనుమతించలేదని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ నేపథ్యంలో మద్యం అందుబాటులో లేక ఇబ్బందులు పడిన మందు ప్రియులకు ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగిస్తోంది. చదవండి : మే 17 వరకు లాక్డౌన్ పొడగింపు -
తెరుచుకోనున్న మద్యం దుకాణాలు..
ముంబై : లాక్డౌన్ కారణంగా మద్యం దొర్కక మందుబాబులు అల్లాడుతున్న వేళ మహారాష్ర్ట ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అక్కడ మద్యంషాపులు తెరచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రెడ్జోన్లు లేని ప్రాంతాల్లో దశలవారీగా మద్యం అమ్మకాలకు అనుమతినిస్తూ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది ప్రభుత్వం. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన గైడ్ లైన్స్ ఆధారంగా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వనుంది. ఇందులో సోషల్ డిస్టెన్సింగ్ కశ్చితంగా పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ఈ రూల్స్ అన్ని పాటిస్తేనే పర్మిషన్ ఇస్తామని అన్నారు. దీనికి సంబంధించి ప్రకటన ఒకట్రొండు రోజుల్లో వెలువడనుంది. మేఘాలయ, అసోం , పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే మద్యం అమ్మకాలకు అనుమతించాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగానే ఉంది. మహారాష్ర్ట ప్రభుత్వ తాజా ప్రకటనతో అక్కడ మందుబాబులు తెగ సంతోషపడుతున్నారట. -
పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..
ముంబై : కరోనావైరస్ ప్రపంచమంతా పంజా విసురుతోంది. ఈ మహమ్మారి వల్ల దేశదేశాలే స్తంభించిపోయాయి. భారత్‌లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో భారత్ లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా మొత్తం బంద్ అయింది. నిత్యావసర వస్తువులు తప్ప ఏవి ప్రజలకు అందుబాటులో లేకుండాపోయాయి. ఈ కరోనా ఎఫెక్ట్ మందుబాబులపై కూడా పడింది. లాక్డౌన్ వల్ల మద్యం షాపులన్నీ బంద్ చేశారు. దీంతో తాగడానికి మందులేక లిక్కర్ బాబులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఇక లిక్కర్ షాపులన్నీ బంద్ కావడంతో మద్యం ప్రియులు ఆన్ లైన్ అమ్మకాలపై దృష్టి పెట్టారు. ఇదే అదునుగా భావించి.. సైబర్ క్రైమ్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మద్యం సరఫరా చేస్తామని చెబుతూ రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. ఇలా ఆన్లైన్లో మద్యం ఆర్డర్ చేసి లక్ష రూపాయలు పొగొట్టుకుంది ఓ జంట. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ముంబైలోని చెంబూర్‌కు చెందిన ఓ దంపతులు మార్చి 24వ తేదీన ఆన్లైన్లో మద్యం కోనుగోలు చేయాలనుకున్నారు. దాని కోసం ఆన్లైన్లో సెర్చ్ చేసి ఓ ఫోన్ నెంబర్‌ను తెలుసుకున్నారు. వెంటనే కాల్ చేయగా.. ఆన్లైన్ కొనుగోలు కోసం రూ.3,000 చెల్లించాలని ఓ వ్యక్తి వారిని కోరాడు. దీని కోసం ఓ ఓటీపీ వస్తోందని, అది చెప్పమని అడిగాడు. ఆ వ్యక్తి మాటలను నమ్మిన దంపతులు.. ఓటీపీని వారికి చెప్పారు. దీంతో వెంటనే బాధితుడి ఖాతా నుండి రూ.30,000 కట్ చేసుకున్నాడు. బాధితుడు వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ మొత్తం పొరపాటున కట్ అయ్యాయని.. వెంటనే వాపసు చేస్తామని చెప్పాడు. అలా.. సుమారు ఆరుసార్లు ఓటీపీ కోరుతూ రూ. 1.03 లక్షలు దోపిడి చేశారు. ఆ తర్వాత బాధితుడు కాల్ చేయగా తమకు డబ్బు జమ కాలేదని సరుకుని డెలివరీ చేయలేమని.. మరొక కార్డు ఉపయోగించి చెల్లింపులు జరపాలని తెలిపాడు. దీంతో కంగుతిన్న ఆ దంపతులు మోసం చేశారని భావించి తిలక్ నగర్ పోలీసులకు మార్చి 27వ తేదీన ఫిర్యాదు చేశారు. -
మద్యం దొరక్క ఆరుగురి ఆత్మహత్య
సాక్షి, బెంగళూరు : లాక్డౌన్ వల్ల మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. మద్యం లభించకపోవడంతో తట్టుకోలేక ఆరుగురు ప్రాణాలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో శని, ఆదివారాల్లో నలుగురు మందుబాబులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా, కేరళలో ఇద్దరు వ్యక్తులు మద్యం దొరక్క ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని వైన్స్, బార్ షాపులను మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో మద్యం ప్రియులు తట్టుకోలేకపోతున్నారు. నిత్యం తాగుడుకు అలవాటుపడిన వారు అకస్మాత్తుగా దూరం అయ్యేలోపు మానసిక వేదనకు గురిఅవుతున్నారు. మరికొందరు మాత్రం బార్ షాపులపై దాడులకు పాల్పడుతున్నారు. ఇక తెలంగాణలోనూ ఆదివారం నుంచి వైన్ షాపులను తెరుస్తారంటూ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కాగా మద్యం అందుబాటులో లేకపోవడంతో అందరూ కల్లును ఆశ్రయిస్తున్నారు. ప్రజలెవ్వరూ బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నా.. ఇట్లో ఖాళీగా ఉండలేక కల్లుబాట పడుతున్నారు. పలుప్రాంతాల్లో సామాజిక దూరం పాటిస్తూ.. కల్లు సేవించడం గమనార్హం. -
మద్యం ‘డ్రా’ ముగిసెన్..
సాక్షి, ఖమ్మం: మద్యం షాపుల డ్రా ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. దరఖాస్తుదారుల్లో కొందరికి అదృష్టం తలుపు తట్టగా.. మరికొందరిని దురదృష్టం వెక్కిరించింది. నగరంలోని సీక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లాలోని 89 మద్యం దుకాణాలకు డ్రా ప్రక్రియను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ప్రారంభించారు. ఈసారి డ్రా ప్రక్రియ సాయంత్రం 3.30 గంటలకే ముగిసే విధంగా ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేయడంతో సజావుగా ముగిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 89 మద్యం దుకాణాలకు 4,303 దరఖాస్తులు రాగా.. వాటిలో సుమారు వెయ్యి మంది వరకు మహిళలు దరఖాస్తు చేయడం విశేషం. పాత సిండికేట్లకు భంగపాటు.. కొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో దాదాపు 10 నుంచి 12 షాపులు దక్కించుకోవడంతో ఈసారి కూడా వారు తమకు అదృష్టం తలుపు తడుతుందనే ఆశతో ఎదురుచేశారు. అయితే సిండికేట్‌లో 70 దరఖాస్తులు వేయగా.. ఒక్క షాపు కూడా దక్కలేదు. మరికొందరు సిండికేట్ వ్యాపారులు గత ఎక్సైజ్ పాలసీలో జిల్లావ్యాప్తంగా చక్రం తిప్పారు. ఈసారి కూడా అలాగే భావించి 104 దరఖాస్తులు వేయగా.. వారికి కేవలం 3 షాపులు మాత్రమే దక్కాయి. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొత్తోళ్లకు కలిసొచ్చిన అదృష్టం.. గత ఏడాది మద్యం షాపులలో ఒక్క షాపు కూడా దక్కని సిండికేట్లు ఈసారి మద్యం షాపుల డ్రాలో మంచి షాపులను దక్కించుకున్నారు. దీనికితోడు కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు సిండికేట్లు గా ఏర్పడి వచ్చిన వారికి సైతం ఆశ్చర్యకరంగా వైన్ షాపులు దక్కడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాగే మరికొందరు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తే వైన్ షాపు దక్కుతుంది.. లేదంటే రూ.2లక్షలు పోతాయని రంగంలోకి దిగిన సుమారు 20 మందిలో ఐదుగురికి వ్యాపారం బాగా నడిచే ఎ–1 దుకాణాలు దక్కడం విశేషం. డ్రాలో మహిళలు ఎన్నడూ లేని విధంగా ఈసారి మహిళలు డ్రా కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనికితోడు చాలా మంది మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి డ్రా జరిగే సీక్వెల్ ప్రాంతానికి జిల్లావ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచే చేరుకున్నారు. వీరిలో చంటిపిల్లలతో సైతం డ్రాలో పాల్గొనేందుకు వచ్చారు. ఇతర ప్రాంత వ్యాపారుల హవా.. జిల్లాలో మధిర, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న 27 మద్యం దుకాణాల్లో 20కిపైగా ఇతర ప్రాంతాల వారే దక్కించుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది చెబుతున్నారు. ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–2 ప్రాంతాల్లో సైతం ఇక్కడి వారితో సిండికేట్ అయి మొత్తం 30కిపైగా మద్యం షాపులను దక్కించుకున్నట్లు తెలిసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా ప్రాంతాలకు చెందిన వారికి షాపులు అధికంగా దక్కాయి. ఎక్సైజ్ శాఖకు రూ.6,43,75,000 ఆదాయం జిల్లాలో 89 షాపుల డ్రా ప్రక్రియ ద్వారా ఎక్సైజ్ శాఖకు లైసెన్స్ ఫీజు కింద రూ.6,43,75,000 ఆదాయం లభించింది. 41 షాపులకు రూ.55లక్షలు సంవత్సరానికి ఫీజు ఉండగా.. ఇందులో మొదటి విడతగా 8వ వంతు లైసెన్స్ ఫీజు కింద రూ.2,81,87,500 ఆదాయం రాగా.. 33 షాపుల కు రూ.65లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.2,68,12,500 వచ్చాయి. మరో 15 షాపులకు రూ.50లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఉండగా.. 8వ వంతుగా రూ.93,75,000 వచ్చాయి. ఈసారి ఈఎండీని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చిన మధిర ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఎర్రుపాలెం షాపును కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన శ్రీరాములు దక్కించుకున్నాడు. దీనికి 132 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ మొదట ఎక్సైజ్ స్టేషన్–1కు డ్రా తీయగా.. పాశంగులపాటి కృష్ణారావు అనే వ్యక్తి ఈ షాపును దక్కించుకున్నాడు. మహిళల్లో మొదటి షాపుగా షాపు నం–4ను మౌనిక దక్కించుకుంది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మద్యం షాపుల టెండర్లలో పాల్గొనడం గమనార్హం. అయితే ఆయనకు షాపు దక్కలేదు. అలాగే ఒకటి, రెండు దరఖాస్తులు వేసి.. ఎటువంటి అనుభవం లేకుండా మొదటిసారిగా షాపులు దక్కించుకున్న వారికి గుడ్‌విల్ కింద రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ఇస్తామని.. తమకు ఆ షాపులు ఇవ్వాలని కొందరు తలపండిన మద్యం వ్యాపారులు బేరసారాలు కొనసాగించినట్లు తెలిసింది. డ్రా జరిగే హాలుతోపాటు బయట కూడా ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేసి డ్రా ప్రక్రియను అందరూ చూసేలా ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. హాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. డ్రా ప్రక్రియలో కలెక్టర్ కర్ణన్‌తోపాటు సబ్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, ఏసీపీ వెంకట్రావు, ఎక్సైజ్ ఏఈఎస్ సైదులు, ఖమ్మం ఎక్సైజ్ స్టేషన్–1 సీఐ రాజు, ఎౖMð్సజ్ సీఐలు సర్వేశ్వరరావు, రమ్య, జుల్ఫీకర్, పోశెట్టి తదితర సిబ్బంది పాల్గొనగా.. ఖమ్మం వన్‌టౌన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. -
‘మందు’కు మందు
సాక్షి, అమరావతి : దశలవారీగా మద్య నిషేధం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిబంధనలు రూపొందించింది. తొలి ఏడాదిలోనే 800కుపెగా షాపుల్ని తగ్గిస్తూ మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. తాగుడు వ్యసనాన్ని దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో జిల్లాకు ఒకటి చొప్పున డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏజెన్సీల్లో గ్రామసభ అనుమతిస్తేనే... రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి 2019–20 నూతన పాలసీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మద్యం షాపులను ఎక్కడ ఏర్పాటు చేయాలి? మద్యం ఎవరికి అమ్మకూడదు? ఎక్సైజ్ అధికారుల అధికారాలు, లైసెన్సు ఫీజు తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ వెలువడింది. గిరిజన ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలంటే సంబంధిత ఊరిలో గ్రామసభ నిర్వహించి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొందాలని స్పష్టం చేశారు. మద్యం నూతన విధానంపై మద్యపాన నియంత్రణ కమిటీలు, ప్రజా, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లైసెన్సు కాలపరిమితి ఏడాదే ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. ఏపీఎస్‌బీసీఎల్‌కు ఎక్సైజ్ కమిషనర్ లైసెన్సు మంజూరు చేస్తారు. ఏడాదికి రూ.వెయ్యి లైసెన్సు ఫీజు చెల్లించాలి. లైసెన్సు కాలపరిమితి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఆదాయం కోసం రహదారులను డీ నోటిఫై చేసిన గత సర్కారు గత ప్రభుత్వ హయాంలో మద్యం ఆదాయం కోసం ఏకంగా హైవేలను డీ నోటిఫై చేసింది. జాతీయ/రాష్ట్ర రహదారుల వెంట మద్యం దుకాణాలు ఉండరాదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో టీడీపీ సర్కారు మద్యం ఆదాయం కోసం అప్పటికప్పుడు రాష్ట్ర రహదారుల్ని ఏకంగా జిల్లా రహదారులుగా డీ నోటిఫై చేసింది. సుప్రీం తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు. 20 వేలు లేదా అంతకన్నా తక్కువ జనాభా కలిగిన గ్రామం/మండల కేంద్రం మీదుగా హైవే వెళుతుంటే 220 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తించదు. విధివిధానాల్లో ముఖ్యాంశాలు.. మద్యంపై నూతన విధానం ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాల ఏర్పాటును అనుమతించరు. పాఠశాలలు, విద్యాసంస్ధలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా గ్రామసభ అనుమతి ఉండాల్సిందే. ఏజెన్సీల్లో మద్యం షాపుల ఏర్పాటుకు గ్రామసభ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం పొందాలి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ రోడ్డులో మద్యం షాపుల ఏర్పాటుకు వీలు లేదు. 21 ఏళ్ల లోపు వారికి, మద్యం మత్తులో ఉన్నవారికి, యూనిఫాంలో ఉన్న సైనికులకు, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అనుమానితులకు మద్యం అమ్మకూడదు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం వ్యాపారానికి అనుమతి. మద్యం దుకాణాల ఎదుట గరిష్ట విక్రయ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రజారోగ్యాన్ని కాపాడటం, తాగుడు మానిపించడం, వ్యసనపరులకు కౌన్సెలింగ్ కోసం వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో ప్రతి జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు. -
టార్గెట్ 150 కో ట్లు
సాక్షి, అమరావతి: 2018 సంవత్సరం ముగిసిపోయి 2019 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేవేళ పగలూ, రాత్రీ తేడా లేకుండా జనాన్ని మత్తులో ముంచేందుకు రాష్ట్ర సర్కారు సన్నద్ధమైంది. ఆ మేరకు డిసెంబర్ 31న జనాన్ని కిక్కెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా ఆ రోజున మద్యం అమ్మకాలను రూ.150 కోట్లు దాటించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఒకవైపు మద్యం ఆదాయం తమకు ముఖ్యం కాదని చెబుతూనే.. మరోవైపు మద్యం అమ్మకాలను భారీ ఎత్తున పెంచేందుకు చర్యలు చేపట్టడం గమనార్హం. ఇందులో భాగంగా బార్లు, వైన్ షాపులు, లైసెన్సులిచ్చే ఈవెంట్ పర్మిట్లు, అంతర్గతంగా జరుపుకునే పార్టీల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. దీంతో ఇందుకనుగుణంగా అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది. ఇందులో భాగంగా వెలగపూడిలోని సచివాలయంలో కొత్త ఏడాది మద్యం అమ్మకాలు.. అనుమతులపై ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నరసింహం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావులు చర్చించారు. గతేడాది తెల్లవారుజాము 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతించారు. మద్యం అమ్మకాలు మరింత పెంచేందుకుగాను ఈ ఏడాది మరో గంట అదనంగా సమయమివ్వడంపై చర్చించినట్టు సమాచారం. ఆ మేరకు డిసెంబర్ 31, జనవరి 1న రెండురోజులపాటు తెల్లవారు జాము వరకు అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. గతేడాది రూ.101 కోట్లు దాటిన అమ్మకాలు సాధారణంగా రాష్ట్రంలో ఒక్కరోజులో సగటున రూ.40 కోట్లపైన మద్యం అమ్మకాలు జరుగుతాయి. గతేడాది డిసెంబర్ 31న ఒక్కరోజులోనే మద్యం అమ్మకాలు రూ.101 కోట్లు దాటాయి. దీంతో ఈ దఫా రూ.150 కోట్లను దాటాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలపై ఇప్పట్నుంచే ప్రత్యేకంగా దృష్టి సారించింది. మద్యం, బీర్ల కొరత లేకుండా డిపోల్లో భారీగా సరుకును అందుబాటులో ఉంచాలని ఏపీబీసీఎల్ అధికారులకు సూచనలందాయి. ప్రతిసారీ బీర్ల కొరత ఏర్పడుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అదనంగా 90 వేల కేసుల్ని డిపోల్లో ఉంచి మద్యం షాపులు, బార్లకు చేరవేశారు. ఈవెంట్లు, పార్టీలకు అడిగినంత మద్యాన్ని సరఫరా చేసేందుకు బార్లు, వైన్‌షాపులకు అనుమతులిచ్చారు. సాధారణంగా బార్లు, మద్యం షాపులకు సరుకు సరఫరా చేసే మద్యం డిపోల్ని ఆదివారం మూసివేస్తారు. కానీ కొత్త ఏడాది ప్రారంభమవుతున్న సందర్భంగా అన్ని మద్యం డిపోలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచాలని ఆదేశాలు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. కాగా, క్రిస్మస్ పండుగ రోజున కూడా అమ్మకాలు జరపాలని అంతర్గతంగా ఆదేశాలు జారీ అవడం గమనార్హం. -
మంత్రి ఇలాకా.. మద్యం కేక !
కొవ్వూరు: ‘ఇసుక, మద్యం విషయంలో ఎక్కడా అవినీతి జరగడానికి వీల్లేదు. బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం’ ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది జూలై 26న కొవ్వూరులో జరిగిన నగర దర్శిని సభలో చెప్పిన మాటలు. ఆ సమయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సై జ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ కూడా అదే వేదికపై ఉన్నారు. సీఎం ప్రకటన చూసి జనం పులకించారు. మద్యం మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆనందించారు. అయితే సీఎం కల్లబొల్లి మాటలతో తమను బురిడీ కొట్టించారని వారికి తెలియలేదు. ఇది జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా ఎక్కడా మద్యం మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కనీసం బెల్టుషాపులు కూడా మూయించలేదు. రాష్ట్రంలో బెల్టుషాపుల నిర్మూలనకు అధికారంలోకి రాగానే సంతకం చేస్తానన్న సీఎం చంద్రబాబు ఎట్టకేలకు గతేడాది జూలై 19న జీఓ జారీ చేశారు. రా ష్ట్రం సంగతి అటుంచితే కనీసం ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రా తినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడా మద్యం అక్రమ అమ్మకాలపై చర్యలు లేవు. కొవ్వూరు.. మద్యం ఏరులై పారు కొవ్వూరు నియోజకవర్గంలో మద్యం మాఫియా ఆగడాలకు పగ్గాల్లేకుండా పోయాయి. పల్లెపల్లెనా బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎమ్మార్పీకి రూ. 15 నుంచి రూ.20 వరకు అదనంగా గుంజుతున్నారు. రాత్రింబవళ్లు వ్యత్యాసం లేకుండా విక్రయాలు సాగిస్తున్నాయి. లూజు అమ్మకాలు యథేచ్ఛగా జరుగుతున్నా యి. దాబాలు బార్లను తలపిస్తున్నాయి. చీకటి పడితే కిళ్లీ కొట్లు మద్యం దుకాణాలుగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ఇలా కాలో తీరిది. రాష్ట్రంలో ఓ రకమైన మద్యం పాలసీ అమలులో ఉంటే ఇక్కడ మాత్రం మరో పాలసీ అమలవుతోంది. ఈ నియోజకవర్గం ప్రత్యేక సామ్రాజ్యంలా మారింది. దీ నిపై ప్రజలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. కొవ్వూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్లో 41 దుకాణాలు, నాలుగు బార్లు ఉన్నా యి. వీటిలో నియోజకవర్గంలో పరిధిలో 26 మద్యం దుకాణాలు, ఒక బెల్టుషాపు నడుస్తున్నాయి. మద్యానికి బానిసలైన వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన డీ ఎడిక్షన్ సెంటర్లు పనిచేయడం లేదు. కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో మంత్రి ఆర్భాటంగా ప్రారంభించిన డి.అడిక్షన్ సెంటర్ పత్తాలేకుండా పోయింది. బెల్టుషాపులు.. యథేచ్ఛగా విక్రయాలు ► నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. ► తాళ్లపూడి మండలంలో తిరుగుడుమెట్ట గ్రామంలోని మెయిన్‌రోడ్డులో రెండు, వేగేశ్వరపురం ఎస్సీ ఏరియాలో రోడ్డుకు సమీపంలో రెండు బెల్టుషాపులు ఉన్నాయి. ► గజ్జరం, తాళ్లపూడి ఎస్సీ ఏరియాలో బెల్టు దుకాణా లు నిర్వహిస్తున్నారు. ► చాగల్లులో చిక్కాల రోడ్డు శివారున, కోమటి చెరువు సమీపంలో, ఎస్సీ కాలనీలో, మీనానగరంలో మెయి న్రోడ్డుపైన, ఇందిరానగర్ కాలనీ శివారున బెల్టుషాపులు జోరుగా నడుస్తున్నాయి. ► ఎస్.ముప్పవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో, బీసీ కాలనీలోను బెల్టుషాపులు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ► దారవరం ఎస్సీ కాలనీలో, కలవలపల్లి మంచినీటి చెరువు వెనుక శ్మశానం దగ్గరలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బెల్టుషాపులు ఏర్పాటు చేశారు. ► మార్కొండపాడు ఎస్సీ ఏరియాలో ఒకటి, ఇందిరానగర్ కాలనీ మెయిన్‌రోడ్డులో బెల్టుషాపులు ఉన్నాయి. ► మల్లవరం ఎస్సీ ఏరియాలో మెయిన్‌రోడ్డులో రెండు దుకాణాలు ఉన్నాయి. చంద్రవరంలో ఎస్సీ ఏరియాలో ఒక షాపు, మద్దూ రు వెళ్లే రోడ్డులో వంతెన సమీపంలో ఒక షాపు నడుస్తున్నాయి. ► బ్రాహ్మణగూడెం ఎస్సీ ఏరియాలోని మెయిన్‌రోడ్డులో, చిక్కాల హైస్కూల్ సమీపంలోని మెయిన్‌రోడ్డులో, గౌడ వీధిలో, ఎస్సీ ఏరియాలో బెల్టుషాపులు నడుస్తున్నాయి. ► చిడిపిలోని బీసీ ఏరియాలో ఒకటి, కుమారదేవం గౌ డవీధిలో రెండు షాపులు, ఆరికిరేవుల బోడి చపటా సమీపంలో రెండు, కొత్తకాలనీ సాయిబాబా గుడి సెంటర్లో ఒకటి, ఏటిగట్టుపైన ఒకటి బెల్ట్ షాపులు నిర్వస్తున్నారు. ► పెనకనమెట్ట గ్రామ ప్రధాన సెంటర్లో, ధర్మవరం ఇందిరమ్మ కాలనీ కొత్తపేటలో మూడు, ఆర్సీఎం చర్చి వద్ద ఒకటి, జెడ్పీ హైస్కూల్ వద్ద ఒక షాపు నడుస్తోంది. ► దొమ్మేరులో తురాయి చెట్టుసెంటర్, పంచాయతీ కా ర్యాలయం, ప్రధాన సెంటర్లోని కిళ్లీ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ► తోగుమ్మి అంబేడ్కర్ విగ్రహం సమీపంలో, వాడపల్లిలో ప్రధాన రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా, గ్రామంలో కృష్ణుడి గుడి సమీపంలో, 12వ వార్డు ప్రధాన రోడ్డుతో పాటు పలుచోట్ల మద్యం బెల్ట్ షాపులు నడుపుతున్నారు. ► వాడపల్లి శివారు బంగారమ్మపేటలో బెల్ట్ షాపు ఉంది. బార్లను తలపిస్తున్న దాబాలు పట్టణ శివారున జాతీయ రహదారి పక్కన ఉన్న దాబాలు బార్లుగా మారాయి. రాత్రిళ్లు ఇక్కడ మందుబాబులు అర్ధరాత్రి వరకు తాగి ఘర్షణలకు దిగుతున్నారు. గతంలో కొవ్వూరుకి చెందిన ఇరువర్గాల యువకులు మద్యం సేవిస్తూ గొడవపడగా ఓ వర్గం మరో వర్గంపై పలుమార్లు దాడికి తెగబడింది. ఈ వివాదంలో ఓ వ్యక్తిని బస్టాండ్ సెంటర్లో పాశవికంగా హత్యచేసిన సంఘటన జరి గింది. రెండు రోజుల కిత్రం ఐ.పంగిడిలోని మద్యం దుకాణం సమీపంలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దొమ్మేరు, ఐ.పంగిడి, వేములూరు గ్రామాల్లోని దాబాల్లో ఇదే పరిస్థితి. సీతంపేట జంక్షన్ వద్ద కిళ్లీ షాపుల్లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం మద్యం ఎమ్మార్పీకు విక్రయించాలని, బెల్టుషాపులు తొ లగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు మార్లు ఉద్యమాలు, ఆందోళనలు చేసింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత సారథ్యంలో కొవ్వూరులో భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రొహిబి షన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు సైతం చేశారు. రెండు నెలలు కిత్రం తాళ్లపూడిలో అధిక ధరలకు విక్రయాలపై వైఎస్సార్ సీపీ నా యకులు ఆందోళన చేశారు. అధికారులు కేసులు నమో దు చేసి చేతులు దులుపుకున్నారు. గజ్జరం హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో మద్యం దుకాణాన్ని వేరే చోటుకు మా ర్చాలని ఈ ఏడాదిలో జూన్‌లో మహిళలు, గ్రామస్తులు పది రోజులకు పైగా ఆందోళన చేశారు. బంగారమ్మపేటలో మహిళలు బెల్ట్ షాపు తొలగించాలని పోరాటం చే స్తున్నా అ«ధికారుల నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. ఇటీవల మద్దూరులో ఏర్పాటు చేసిన మద్యం దు కాణాన్ని తొలగించాలని మహిళలు పెద్దెత్తున పోరాటం చేశారు. గతంలో ధర్మవరంలో సైతం మద్యం బెల్టుషాపులు తొలగించాలని కోరుతూ పెద్ద ఎత్తున మహిళలు ధర్నా చేసి ఆర్డీఓ, ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మద్దూరులంక, మద్దూరు గ్రామాల్లోను అనుమతి లే కుండా మద్యం అమ్మకాలు సాగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ముడుపులపై ఆశతోనే.. ముఖ్యమంత్రి స్థాయి నుంచి మంత్రి వరకు ముడుపులు అందడంతోనే బెల్టుషాపులను నియంత్రించడం లేదు. మంత్రి నియోజకవర్గంలో వీధివీధినా బెల్టుషాపులు నడుస్తున్నా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు సాగిస్తుంటే కొవ్వూరు నియోజకవర్గంలో మాత్రం ఈ నిబంధన అమలుకావడం లేదు. అధికారులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. మద్యం ఎమ్మార్పీకి విక్రయించాలని, బెల్టుషాపులు తొలగించాలని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు. – తానేటి వనిత, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, కొవ్వూరు రూ.20లు అదనంగా బాదుడు నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో క్వార్టర్ బాటిల్‌కు రూ.15 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బీరుపై రూ.20 నుంచి రూ.30 చొప్పున గుంజుతున్నారు. అధిక ధరలకు విక్రయాలపై గతేడాది జూలై నుంచి ఇప్పటివరకూ పరిశీలిస్తే కొవ్వూరు సర్కిల్ పరిధి లో కేవలం 10 కేసులు మాత్రమే నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదులు చేస్తున్నా ఎక్సైజ్ పోలీసులు స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. లూజు విక్రయాలు, నిబంధనలు అతిక్రమించడం వంటి వాటిపై 15 నెలల కాలంలో కేవలం 22 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఎనీ టైం మందు కొవ్వూరు బస్టాండ్ సెంటర్, మెరకవీధి బ్రాందీ షాపుల వద్ద 24 గంటలు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. రాత్రిళ్లు షా పు మూసిన తర్వాత బస్టాండ్ సెంటర్ వద్ద దుకాణం వెనుక వైపు నుంచి విక్రయాలు సాగిస్తున్నారు. ఆ సమయంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మెరకవీధి సెంటర్లో అయితే షాపు షెట్టర్‌కు రంధ్రం పెట్టి మరీ అమ్మకాలు చేస్తున్నారు. -
మద్యం దుకాణం వద్దన్నా..
సాక్షి, చెన్నై: ప్రజల అభ్యంతరాలను పక్కనపెట్టి సెలయూర్ సమీప నివాస ప్రాంతంలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో ఆగ్రహించిన స్ధానికులు దుకాణాన్ని దగ్ధం చేశారు. మహిళలు, పిల్లలకు అసౌకర్యంగా ఉంటుందని తమ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని తాము అధికారులను కోరామని స్ధానికులు తెలిపారు. ఇక్కడ మద్యం దుకాణం ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినా మే 11న అత్యంత ఆర్భాటంగా మద్యం దుకాణం ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీవ్రంగా ప్రతిఘటించినా ప్రభుత్వం మద్యం దుకాణం ప్రారంభించడంతో సహనం కోల్పోయిన స్ధానికులు దుకాణంలోకి చొరబడి షాపును ధ్వంసం చేశారు. బాక్సుల్లో ఉంచిన మద్యం నిల్వలను పగులగొట్టారు. బార్ కోసం అమర్చిన కుర్చీలను విరగ్గొట్టారు. మరోవైపు మద్యం దుకాణాలపై తమిళనాడు ప్రభుత్వం న్యాయస్ధానాల నుంచి సైతం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత నెలలో మద్రాస్ హైకోర్టు 1700 మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మందుపై ముందుచూపు!
సాక్షి, అమరావతి: అధికార పార్టీ నేతల కనుసన్నల్లోని లిక్కర్ లాబీకి దాసోహమైన రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బార్లకు ఐదేళ్ల పాటు (2022 వరకు) వ్యాపారం చేసుకునేందుకు లైసెన్సులు ఇచ్చిన సర్కారు సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మద్యం షాపులకు కూడా ఐదేళ్ల పాటు లైసెన్సులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రెన్యువల్ స్థానంలో ఐదేళ్ల పాటు పొడిగింపు గతేడాది ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు రెండేళ్లకు లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ నెలాఖరున రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు లైసెన్సులు ఏడాది పాటు రెన్యువల్ చేయాల్సి ఉంది. అయితే రెన్యువల్ స్ధానంలో ఐదేళ్ల పాటు మద్యం లైసెన్సులు పొడిగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. లైసెన్సు పొడిగింపు రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్నట్లు అధికార వర్గాలే వెల్లడించడం గమనార్హం. మద్యం వ్యాపారులతో ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని వారి వ్యాపారానికి ఆటంకాలు లేకుండా లైసెన్సు కాలపరిమితి పొడిగించనుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను మద్యం వ్యాపారుల నుంచి ఐదేళ్ల లైసెన్సు ఫీజు ఒకేసారి వసూలు చేయనున్నారు. ఒకేసారి రూ.2,500 కోట్లు గతేడాది రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి లైసెన్సు ఫీజుల రూపంలో రూ.500 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పుడు ఐదేళ్లకు ఒకేసారి వసూలు చేస్తే సుమారుగా రూ.2,500 కోట్లకు పైగా ఆదాయం సర్కారుకు సమకూరుతుంది. అధికార పార్టీకి చెందిన వారే అధిక శాతం మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి గుడ్‌విల్ చెల్లించి అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ముఖ్యులే తెర వెనుక ఉండి సిండికేట్లుగా జత కట్టారు. 2019 జూన్‌తో మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి ముగుస్తుంది. అయితే వీరి వ్యాపారానికి ఆటంకాల్లేకుండా 2023 వరకు మద్యం వ్యాపారం చేసుకునేలా లైసెన్సు ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. మరో ఐదేళ్లు... రాబోయే ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారం ఆటంకాల్లేకుండా కొనసాగించేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం లైసెన్సీలకు సమాచారం అందించింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాలపై కమీషన్ 18 శాతం పెంచాలని సిండికేట్లు సర్కారు పెద్దల్ని కలిశారు. మార్జిన్ పెంచాల్సిందేనని చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో మద్యం షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించి లైసెన్సులు ఐదేళ్ల పాటు పొడిగిస్తామని సర్కారు పెద్దలు హామీనిచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారులకు ప్రోత్సాహం గతేడాది బార్లకు లైసెన్సులు 2022 వరకు ఇచ్చి లైసెన్సు ఫీజుల్ని గణనీయంగా తగ్గించారు. గతంలో 50 వేల జనాభా వరకు బార్ల లైసెన్సు ఫీజు రూ.25 లక్షలు ఉండేది. దీన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో లైసెన్సు ఫీజు రూ.40 లక్షలు ఉండేది. ఈ ఫీజును రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజు కలిపి రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలుగా ఉన్న లైసెన్సు ఫీజును తగ్గించి కేవలం రూ.30 లక్షలే వసూలు చేశారు. మద్యం షాపులకు కూడా లైసెన్సు ఫీజులు తగ్గించి వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. -
సర్దుకుపోదాం...!
బెల్టు షాపులపై దాడులు జరుగుతాయి... కానీ కేసు నమోదు కాదు. లూజు విక్రయాలు... ఎమ్మార్పీకంటే అధిక మొత్తాలకు విక్రయాలు చేసినట్టు ఫిర్యాదు చేస్తే.. వెంటనే వచ్చివాలుతారు... కానీ చర్యలుండవు. పర్మిట్‌రూమ్‌లను బార్లుగా మార్చేస్తే... వార్నింగ్‌లిస్తారు... కానీ మూయించరు. అయితే గియితే... నెలకో... రెండు నెలలకో ఓ కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటారు. ఇదంతా ఎక్సయిజ్ అధికారులు మద్యం వ్యాపారులతో చేసుకున్న లోపాయికారి ఒప్పందమట! వీరఘట్టం/పాలకొండ: జిల్లాలో కొత్త మద్యం పాలసీ ప్రకారం దుకాణాలకు లెసైన్సు పొందిన వ్యాపారులు హుషారుగా ఉన్నారు. అవసరమైనచోట్ల బెల్టుషాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎమ్మార్పీకంటే అధికంగా విక్రయాలు చేస్తున్నారు. అయినా ఎక్సయిజ్ అధికారులు కిమ్మనడంలేదు. ఎందుకంటే లక్ష్యాలు పూర్తవ్వడమే లక్ష్యం. ఒకవేళ చర్యలు తీసుకున్నా తూతూ మంత్రంగా నెలకో కేసు నమోదు చేస్తారంట. జిల్లాలో 202 మద్యం షాపులకు ఇటీవల లెసైన్సులు మంజూరు చేశారు. 23 మండలాల్లో సర్కారు మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదే అదనుగా విస్తృతంగా బెల్టుషాపులు ఏర్పాటైపోయాయి. ప్రభుత్వం మారిన తర్వాత బెల్టుషాపులపై నిషేధం విధించింది. దీనివల్ల కొంతమేరకు మద్యం అమ్మకాలకు తెర పడుతుందనుకున్నారు. కాని లక్ష్యాల పేరుతో అధికారులే బెల్టు షాపులను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తున్న వ్యాపారులపై దాడులు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా... కేసులు మాత్రం నమోదు చేయడం లేదు. నిత్యం నిఘా ఉంచాల్సిన ఎక్సైజ్ శాఖ మాత్రం లక్ష్యాల మాటున ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఎమ్మార్పీ ఉల్లంఘనలపైనా, పర్మిట్రూమ్ల్ని బార్లుగా మార్చేయడంపైనా... వీరు పట్టించుకోవడం లేదు. బడ్డీకొట్లు.... టీస్టాళ్లు... కిరాణా అంగళ్లు మద్యం కేంద్రాలుగా మారినా దాడులు కరువయ్యాయి. ఎందుకిలా...? ఈ ఏడాది కొత్తగా సర్కారు దుకాణాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రభావం ప్రైవేటు వ్యాపారులపై పడింది. దీంతో అమ్మకాలు కూడా గతేడాది కంటే తక్కువగానే ఉన్నాయి. దీంతో బెల్టుషాపుల ఏర్పాటుకు ప్రైవేటు వ్యాపారులు తెర తీశారు. బెల్టుషాపు కావల్సిన వారికి ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. పాలకొండ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల్లో సుమారు 250 గ్రామాలు ఉన్నాయి. ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ బెల్టుషాపులు కొన్ని బహిరంగంగా... మరికొన్ని గుట్టుగా కొనసాగుతున్నాయి. గతేడాది నెలకు ఒక్కో మండలం నుంచి ఒకటి, రెండు కేసుల చొప్పున ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసి, 2,128 క్వార్టరు బాటిళ్లను స్వాధీనం చేసుకొని 70 మందిని అరెస్టు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ కేసులు కూడా ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల నమోదు చేసినవేనని తెలుస్తోంది. ఈ సారి బెల్టుషాపులు పెరుగుతున్నా కేసులు నమోదు మాత్రం జరగడంలేదు. అధికారులు వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాడులు చేస్తున్నాం ఈ విషయంపై పాలకొండ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారావు వద్ద ప్రస్తావించగా బెల్టుషాపులపై దాడులు నిర్విహ స్తున్నామని, బెల్టుషాపుల వివరాలను తెలియజేస్తే అటువంటి వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.