
ఏలూరు జిల్లా: ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. చింతమనేని అనుచరులు.. పోలీసులను దాటుకుని లోపలికి దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు.
పోలీసులు చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను పోలీసులు నిలువరించడంతో.. చలసాని గార్డెన్‌లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది.

నంద్యాల: మద్యం షాపుల కేటాయింపులో టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఆత్మకూరు పరిధిలో మెజార్టీలు షాపులు కూటమి నేతలకు వచ్చేలా చేసుకున్నారు. 13 మద్యం షాపులకు 11 దుకాణాలను స్కెచ్ వేసి.. కూటమి నేతలు రాబట్టుకున్నారు.
నంద్యాల: వ్యాపారి ముత్తుకు టీడీపీ నేతలు బెదిరించారు. లాటరీలో ముత్తుకు జూపాడుబంగ్లా మద్యం షాపు దిక్కింది. దీంతో ఆ మద్యం షాపును తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు ముత్తుపై బెదిరింపులకు పాల్పడ్డారు.
ప్రకాశం: ఒంగోలులో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మద్యం టెండర్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు. పూర్తి మద్యనిషేధం విధించాలాని నినాదాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment