lottery
-
ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగితే.. కోటీశ్వరురాలు అయింది
ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. ఇటీవల ఆరెంజ్ జ్యూస్ కోసం ఆగిన మహిళ, లాటరీ టికెట్ కొని కోటీశ్వరురాలు అయిపోయింది.నార్త్ కరోలినాకు చెందిన ఒక మహిళ ఆరెంజ్ జ్యూస్ కొనుక్కోవడం కోసం ఆగింది. అక్కడే కనిపించిన లాటరీ టిక్కెట్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్న విధంగానే ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.సరిగ్గా ఆమె కొనుగోలు చేసిన లాటరీ టికెట్టుకు లాటరీ తగిలింది. దీంతో 2,50,000 డాలర్ల విజేతగా నిలిచింది. అనుకోకుండా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ వారి జీవితాన్నే మార్చేసిందని ఆ మహిళ చాలా సంతోషపడింది.కొన్ని రోజులకు ముందు అమెరికాకు చెందిన ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు. ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు గెలుచుకున్నాడు. -
లంచ్ బాక్స్ మరిచిపోయి.. కోటీశ్వరుడయ్యాడు
ఒక సాధారణ ఉద్యోగి లంచ్ బాక్స్ మరిచిపోవడమే.. అతన్ని కోటీశ్వరున్ని చేసింది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..అమెరికాకు చెందిన వ్యక్తి ఉద్యోగానికి వెళ్లే హడావిడిలో లంచ్ బాక్స్ తీసుకెళ్లడం మరిచిపోయాడు. ఆ తరువాత అతని భార్య ఫోన్ చేసి లంచ్ బాక్స్ మరిచిపోయావు అన్న విషయం చెప్పింది. మళ్ళీ వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లడం ఇష్టం లేక మధ్యాహ్నం తినడానికి సమీపంలో ఏదైనా దొరుకుతుందేమో చూసాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ కిరాణా షాపులో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేసాడు.ఆ వ్యక్తి కొనుగోలు చేసి టికెట్టుకే లాటరీ తగిలింది. దీంతో అతడు ఏకంగా రూ. 25.24 కోట్లు (3 మిలియన్ డాలర్లు) గెలుచుకున్నట్లు మిస్సౌరీ లాటరీ అధికారులు తెలిపారు. లాటరీ టికెట్ కొన్న వ్యక్తికి.. లాటరీ తగిలిందంటే అస్సలు నమ్మలేదు. ఆ తరువాత టికెట్ నెంబర్ చూసుకుని నిర్దారించుకుని, తెగ సంతోషపడ్డాడు.ఇదీ చదవండి: మారని ధరలు: బంగారం కొనడానికి ఇదో మంచి ఛాన్స్!లాటరీ గెలిచిన తరువాత, ఆ విషయాన్ని తన భార్యకు చెప్పడానికి ఫోన్ చేసాడు. అయితే ఆమె కూడా మొదట్లో నమ్మలేదని.. ఆ వ్యక్తి వెల్లడించాడు. ఈ విషయాన్ని నమ్మడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. మొత్తానికి లంచ్ బాక్స్ మరిచిపోవడంతో అతడు ధనవంతుడయ్యాడు. -
మద్యం షాపుల లాటరీ.. చింతమనేని అనుచరుల ఓవరాక్షన్
ఏలూరు జిల్లా: ఏలూరు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులపైకి చింతమనేని అనుచరులు జులుం ప్రదర్శించారు. దరఖాస్తుదారుల మినహా ఇతర వ్యక్తులకు లోపలికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. చింతమనేని అనుచరులు.. పోలీసులను దాటుకుని లోపలికి దౌర్జన్యంగా వెళ్లేందుకు యత్నించారు.పోలీసులు చింతమనేని అనుచరులకు మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. చింతమనేని అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై దుర్భాషలాడి దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను పోలీసులు నిలువరించడంతో.. చలసాని గార్డెన్లో జిల్లాకు సంబంధించి 144 దుకాణాలకు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. నంద్యాల: మద్యం షాపుల కేటాయింపులో టీడీపీ నేతలు స్కెచ్ వేశారు. ఆత్మకూరు పరిధిలో మెజార్టీలు షాపులు కూటమి నేతలకు వచ్చేలా చేసుకున్నారు. 13 మద్యం షాపులకు 11 దుకాణాలను స్కెచ్ వేసి.. కూటమి నేతలు రాబట్టుకున్నారు.నంద్యాల: వ్యాపారి ముత్తుకు టీడీపీ నేతలు బెదిరించారు. లాటరీలో ముత్తుకు జూపాడుబంగ్లా మద్యం షాపు దిక్కింది. దీంతో ఆ మద్యం షాపును తమకు ఇవ్వాలని టీడీపీ నేతలు ముత్తుపై బెదిరింపులకు పాల్పడ్డారు.ప్రకాశం: ఒంగోలులో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. మద్యం టెండర్లు నిలిపేయాలని డిమాండ్ చేశారు. పూర్తి మద్యనిషేధం విధించాలాని నినాదాలు చేశారు.చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ -
రూ.కోట్లలో లాటరీ గెలుపొందిన భారతీయులు (ఫొటోలు)
-
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్‌లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్‌లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్‌లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్‌ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్‌ఛార్జీ, సెస్‌ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
జాక్‌పాట్ కొట్టిన మెకానిక్.. లాటరీలో రూ.25 కోట్లు
మాండ్య: కర్ణాటకకు చెందిన స్కూటర్ మెకానిక్ ఒకరు జాక్‌పాట్ కొట్టేశారు. మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషాకు కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో ఏకంగా రూ.25 కోట్లు దక్కాయి. కేరళలోని స్నేహితుడికి అప్పుడప్పుడు వెళ్లే అల్తాఫ్ ప్రతిసారీ అక్కడ లాటరీ టిక్కెట్ కొనడం అలవాటు. ఇటీవల అక్కడికి వెళ్లిన అల్తాఫ్ వయనాడ్ జిల్లా సుల్తాన్ బాతెరీలో రూ.500 పెట్టి టిక్కెట్ కొనుగోలు చేశారు. ఈ లాటరీ ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అల్తాఫ్‌ను మొదటి బహుమతి వరించింది. అల్తాఫ్ కొన్న టీజీ 43422 నంబర్ టిక్కెట్ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్న విషయాన్ని వయనాడ్ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పారు. మొదట్లో నమ్మలేదు. కానీ, ఆ తర్వాత నిజమేనని బంధువులు చెప్పడంతో ఎగిరి గంతేశారు. లాటరీ సొమ్ము కోసం కుటుంబంతో కలిసి తిరువనంతపురం వెళ్లారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇటీవలే ఆ టిక్కెట్‌ను తన పక్క దుకాణదారుకు అమ్మజూపగా, కొనేందుకు నిరాకరించాడని అల్తాఫ్ తెలిపారు. గంటలోనే లాటరీ విజేతగా నిలిచినట్లు తనకు సమాచారం అందిందన్నారు.‘బెంగళూరులో సెటిలవుతా.నా కూతురి పెళ్లి ఘనంగా చేద్దామనుకుంటున్నా. అప్పులన్నీ తీర్చేస్తా’అని అల్తాఫ్ ఆనందంతో చెప్పారు. రూ.25 కోట్ల మొత్తంలో అన్ని రకాల పన్నులు పోను అల్తాఫ్ చేతికి రూ.13 కోట్లు వస్తాయని చెబుతున్నారు. -
దుబాయ్: తెలుగు వ్యక్తికి బంపర్ లాటరీ
దుబాయ్ సిటీ: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ తెలుగు వ్యక్తిని లక్ష్మీదేవి కనికరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరుగడ్డ నాగేంద్రమ్ 2017లో దుబాయ్ వెళ్లారు. కష్టపడి సంపాదించిన సొమ్ములో నెల నెలా పొదుపు చేసి లాటరీ టికెట్ కొన్నాడు. ఇంకేముంది జాక్పాట్కొట్టాడు. లాటరీ టికెట్‌పై ఏకంగా రూ.2.25 కోట్లు గెలుచుకున్నారు. పొదుపు పథకం చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా అందులో అతడు విజేతగా నిలిచారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తాను సంపాదించిన సొమ్ములో నుంచి ప్రతి నెలా 100 దిర్హమ్(ఏఈడీ)లను 2019 నుంచి నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేశారు. ఈ సేవింగ్ స్కీమ్ కట్టేవారికి రివార్డు ఇవ్వడానికి లక్కీ డ్రా నిర్వహిస్తారు.గ్రాండ్ ప్రైజ్ కేటగిరీ లాటరీలో నాగేంద్రమ్ విజేతగా నిలిచారు. లాటరీ బహుమతిగా 10 లక్షల యూఏఈ దిర్హమ్స్ అందుకున్నారు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.25కోట్లకు పైమాటే. ఇంత భారీ ప్రైజ్‌మనీ రావడంపై నాగేంద్రమ్ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ డబ్బుతో తన పిల్లలను ఉన్నత చదువు చదవిస్తానని సంతోషపడ్డారు. -
గణిత మేధావి.. తెలివితో 14 సార్లు లాటరీ గెలిచి..
లెక్కలు అనగానే చాలామందికి బాల్యం నుంచే భయం ఏర్పడుతుంది. అంకెలను చూసే సరికి కొంతమందిలో వణుకు పుడుతుంది. అయితే గణితం సాయంతో పలు విషయాల్లో విజయం సాధించవచ్చని తెలిస్తే వారిలోని భయం తొలగిపోతుంది. రొమేనియాకు చెందిన ఒక గణిత మేధావి లెక్కలతో లాటరీలలోని లాజిక్కును పట్టేసి, ఏకంగా 14 సార్లు లాటరీ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు.డైలీ స్టార్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం రొమేనియా నివాసి స్టెఫాన్ మాండెల్ గణిత శాస్త్రజ్ఞుడు. అతని జీతం భారత కరెన్సీతో పోలిస్తే ఏడు వేలు. అది అతని కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. దీంతో స్టెఫాన్ మాండెల్ తన జీవితాన్ని తక్షణం మార్చుకోవాలని, గణితాన్ని తెలివిగా ఉపయోగించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. అంకెలను ఉపయోగించి ఒక సూత్రాన్ని సిద్ధం చేశాడు. దాని సాయంతో లాటరీలను గెలుచుకుంటూ వచ్చాడు.స్టెఫాన్ స్వయంగా ప్రత్యేక అల్గారిథమ్‌ను సృష్టించాడు. పలు పరిశోధనలు సాగించిన అనంతరం ‘సంఖ్యల ఎంపిక’కు అల్గారిథమ్‌ను సిద్ధం చేశాడు. దానికి ‘కాంబినేటోరియల్ కండెన్సేషన్’ అనే పేరు పెట్టాడు. తాను ఎన్ని లాటరీ టిక్కెట్లు కొన్నప్పటికీ, వాటికి అయ్యే ఖర్చు జాక్‌పాట్ కన్నా చాలా తక్కువగా ఉంటుందని స్టెఫాన్ కనుగొన్నాడు. దీంతో లాటరీని దక్కించుకునేందుకు అధికంగా లాటరీ టిక్కెట్లు కొని జాక్‌పాట్ గెలిచేందుకు వివిధ కాంబినేషన్లను సిద్ధం చేసేవారు. ఇది క్లిక్ అవడంతో స్టెఫాన్ లాటరీలను సొంతం చేసుకుంటూ వచ్చాడు.తరువాత స్టెఫాన్ లాటరీ సిండికేట్‌ను ఏర్పాటు చేశాడు. దీనిలో చేరినవారు స్టెఫాన్ సూచనలతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇలా వారు గెలుపు అవకాశాలను పెంచుకుంటారు. ఈ సిండికేట్‌కు లాటరీలో వచ్చే భారీ మొత్తాన్ని సభ్యులంతా పంచుకునేవారు. ఈ విధంగా సంపాదించిన డబ్బుతో స్టెఫాన్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.స్టెఫాన్ మాండెల్ తాను కనుగొన్న లెక్కల సూత్రం ఆధారంగా మొత్తం 14 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. తరువాతి కాలంలో యూకేలోనూ తన లాటరీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే అతని సిండికేట్‌పై దర్యాప్తు సంస్థల కన్నుపడింది. దీంతో పెద్దమొత్తంలో టిక్కెట్లు కొనడంపై నిషేధం విధించారు. దీంతకితోడు స్టెఫాన్‌పై పలు కేసులు నమోదు కావడంతో న్యాయపోరాటం కోసం లెక్కకు మించినంత డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీంతో తాను కూడబెట్టిన సొమ్మునంతా పోగొట్టుకుని 1995లో తాను దివాలా తీసినట్లు స్టెఫాన్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం స్టెఫాన్ తన స్నేహితులతో పాటు వనాటు ద్వీపంలో నివసిస్తున్నాడు. యూనిలాడ్ నివేదిక ప్రకారం స్టెఫాన్ 1960-70ల కాలంలోనే లాటరీలలో రూ. 200 కోట్లకుపైగా మొత్తాన్ని గెలుచుకున్నాడు. -
చోరీ డెబిట్ కార్డుతో లాటరీ.. రూ. 41 కోట్లు గెలిచి..
యూకేలో ఓ వింత ఉదంతం వెలుగు చూసింది. ఈ దేశానికి చెందిన ఇద్దరు దొంగలు లాటరీలో నాలుగు మిలియన్ పౌండ్లు గెలుచుకున్నాడు. భారత కరెన్సీతో పోల్చిచూస్తే ఈ మొత్తం రూ.41 కోట్ల 66 లక్షలు. ఇంత భారీ ప్రైజ్ మనీ గెలుచుకున్నాక కూడా వారు చిక్కుల్లో పడ్డాడు. బోల్టన్‌కు చెందిన జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు తాము చోరీ చేసిన డెబిట్ కార్డుతో లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. ఆ లాటరీ ఫలితాలు రాగానే వారు ఆనందంతో గెంతేశారు. తాము నాలుగు మిలియన్ పౌండ్లు అందుకోబోతున్నామంటూ ఉబ్బితబ్బిబయ్యారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరయ్యింది. లాటరీలో వచ్చిన మొత్తాన్ని అందుకునేందుకు వారు లాటరీ నిర్వాహకులను సంప్రదించారు. వారు బ్యాంకు ఖాతా గురించి అడగగా, గుడ్‌రామ్ తనకు బ్యాంకు ఖాతా లేదని తెలిపాడు. దీంతోవారు అనుమానంతో అతనిని పలు విధాలుగా విచారించారు. ఈ నేపధ్యంలో గుడ్‌రామ్ ఆ కార్డు తన స్నేహితుడు జాన్‌దని తెలిపాడు. దీంతో వారు జాన్‌ను కూడా విచారించారు. అది అతనిది కూడా కాదని తేలింది. లాటరీ నిర్వాహకుల విచారణలో ఆ డెబిట్ కార్డు జోషువా అనే వ్యక్తికి చెందినదని తేలింది. దీంతో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లు ఆ కార్డును దొంగిలించారని వారు గుర్తించారు. విషయం పోలీసుల వరకూ చేరింది. కోర్టు విచారణలో జాన్ రాస్ వాట్సన్, మార్క్ గుడ్‌రామ్‌లకు 18 నెలల చొప్పున జైలు శిక్ష పడింది. డెబిట్ కార్డు యజమాని జోషువా ఆ లాటరీ మొత్తాన్ని అందుకునేందుకు అర్హుడయ్యాడు. ఈ విషయం తెలిసినవారంతా అదృష్టమంటే ఇదేనేమో అని అంటున్నారు. -
USA: చిన్న పొరపాటుతో మహిళకు జాక్‌పాట్!
వాషింగ్టన్: జీవితంలో చిన్న పొరపాట్లు చేసి కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికాలోని వర్జీనియాలో మిరియం లాంగ్ అనే మహిళకు మాత్రం తాను చేసిన చిన్నపొరపాటే భారీగా కలిసి వచ్చింది. ఒకేసారి ఏకంగా 1 మిలియన్ డాలర్(సుమారు 8 కోట్ల రూపాయలు) వర్జీనియా లాటరీ గెలుచుకునేలా చేసింది. మిరియం వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ నగరంలో ఉన్న సౌత్ మెయిన్ స్ట్రీట్‌లోని సీవీఎస్ స్టోర్‌కి వెళ్లింది. పనిలో పనిగా స్టోర్‌లో ఉన్న వర్జీనియా లాటరీ వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లి ఒక బటన్ నొక్కింది. అయితే అది రాంగ్ బటన్. నిజానికి మిరియం మెగా మిలియన్స్ లాటరీ టికెట్ కొనాల్సింది పోయి పొరపాటున వన్ మిలియన్ పవర్ బాల్ ప్రైజ్ టికెట్‌కు సంబంధించిన బటన్ నొక్కింది. దీంతో ఆమె అనుకున్నది కాకుండా వేరే టికెట్ వచ్చింది. లాటరీ డ్రా తీయగా విచిత్రంగా మిరియంకు పొరపాటున వచ్చిన టికెట్‌కే వన్ మిలియన్ డాలర్ ప్రైజ్ తగిలింది. ఊహించని విధంగా జాక్‌పాట్ తగలడంతో మిరియం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లాటరీ గెలుచుకోవడంపై మిరియం స్పందిస్తూ ‘ఇది నా జీవితంలో చేసిన చాలా మంచి పొరపాటు. ఇంత పెద్ద మొత్తం గెలుచుకున్నందుకు షాక్ తిన్నాను. నా గుండె సంతోషంతో వేగంగా కొట్టుకుంది’అని తెలిపింది. ఇదీ చదవండి.. 19 ఏళ్లకే బిలియనీర్ స్టూడెంట్.. ఆమె ఆస్తి అన్ని కోట్లా..? -
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్‌లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
దేశంలోనే అత్యధిక ఎన్నికల బాండ్ల కొనుగోలు.. చుట్టూ వివాదాలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దాంతో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఈ డేటా వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్’ పేరు మారుమోగింది. ఆ సంస్థ 2024 జనవరి వరకు అత్యధికంగా రూ.1,368 కోట్ల విలువ చేసే ఎన్నికలబాండ్లను కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారీగా ఎన్నికలబాండ్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ యజమాని, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మయన్మార్‌లో సాదాసీదా కూలీగా జీవనం సాగించిన మార్టిన్ రూ.కోట్ల విరాళాలు ఇచ్చే స్థాయికి ఎలా ఎదిగాడో ఈ కథనంలో తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే లాటరీ వ్యాపారం భారత్‌లోనే పుట్టిన మార్టిన్ చిన్నతనంలో మయన్మార్‌లో చాలాకాలం పాటు కూలీగా జీవనం సాగించారు. తన 13వ ఏటా తిరిగి భారత్‌కు వచ్చి తమిళనాడులోని కోయంబత్తూరులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు. తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు దేశం అంతటా విస్తరించారు. అనంతరం ఈశాన్య భారత్‌కు మకాం మార్చారు. అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్‌లతో వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్లకు భూటాన్, నేపాల్‌లో కూడా తన బిజినెస్‌ను మొదలుపెట్టారు. తర్వాత స్థిరాస్తి, నిర్మాణ, టెక్స్టైల్, ఆతిథ్య రంగాల్లోకి అడుగుపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో లాటరీలు చట్టబద్ధమని తెలుసుకున్న మార్టిన్ ఆయా రాష్ట్రాల్లో సుమారు 1,000 మందిని నియమించుకుని వ్యాపారం సాగిస్తున్నారు. నాగాలాండ్, సిక్కింలో అయితే తన కంపెనీకి చెందిన 'డియర్ లాటరీ' సంస్థదే ఆధిపత్యం. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు. భారత్‌లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది. ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వరల్డ్ లాటరీ అసోసియేషన్‌లో సభ్యత్వం కూడా ఉంది. వివాదాలతో వెలుగులోకి.. సిక్కిం ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2008లో రూ.4,500 కోట్లకు పైగా మోసానికి పాల్పడడంతో మార్టిన్ పేరు బయటకొచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి రూ.910 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2011లో అక్రమ లాటరీ వ్యాపారాలపై అణిచివేతలో భాగంగా తమిళనాడు, కర్ణాటక పోలీసులు సంయుక్తంగా తన కంపెనీలో సోదాలు నిర్వహించారు. 2013లో, కేరళ పోలీసులు రాష్ట్రంలో అక్రమ లాటరీ కార్యకలాపాలపై దర్యాప్తులో భాగంగా మార్టిన్ సంస్థలో దాడులు చేశారు. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘనల అనుమానాలతో ఈ కంపెనీపై ఈడీ పలు మార్లు దాడులు చేసింది. దాదాపు రూ.603 కోట్ల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది. సిక్కిం ప్రభుత్వ లాటరీలను కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సీబీఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
లాటరీ టిక్కెట్ కొన్నాడు.. లక్షల బహుమతి మరిచాడు!
పంజాబ్‌లోని ఫజిల్కాలో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి లాటరీని గెలుచుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు అతను రాకపోవడం విశేషం. ఈ లాటరీని పంజాబ్ స్టేట్ మంత్లీ లాటరీ డ్రా నిర్వహిస్తుంది. ఈ లాటరీలో బహుమతి మొత్తం రూ.7 లక్షలు. ఈ లాటరీలో ఫాజిల్కాకు చెందిన ఒక వ్యక్తి విజేతగా నిలిచాడు. లాటరీ టిక్కెట్ల విక్రేత బాబీ బవేజా మాట్లాడుతూ తన వద్ద ఫాజిల్కాకు చెందిన వ్యక్తి లాటరీని కొనుగోలు చేశాడని, ఆ టికెట్ నంబర్ 688558 అని, దానికి మొదటి బహుమతిగా రూ.7 లక్షలు వచ్చిందని తెలిపారు. విజేతను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అతని చిరునామా తెలుసుకుని, అందరికీ ఆ విషయాన్ని తెలియజేసి, అతనికి రూ.7 లక్షల రివార్డు ఇస్తామని బాబీ బవేజా తెలిపారు. గతంలో తన దగ్గర లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము గెలుచుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో రూ. 5 కోట్లు, రూ. 2.5 కోట్లు, రూ. ఒక కోటి, రూ. 51 లక్షలు, రూ. 25 లక్షలు ఇలా భారీ మొత్తాలను గెలుచుకున్నవారున్నారని వివరించారు. అయితే లాటరీ విజేత బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు తమ దగ్గరకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాగా దేశంలోని 13 రాష్ట్రాల్లో లాటరీకి అధికారిక గుర్తింపు ఉంది. వాటిలో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో లాటరీ డ్రాను ప్రభుత్వం నిర్వహిస్తుంది. -
లాటరీలో ఏకంగా రూ.795 కోట్లు గెలిచాడు.. సుడి మామూలుగా లేదు!
చైనాలో 28 ఏళ్ల వ్యక్తి 680 మిలియన్ యువాన్స్ (రూ. 795 కోట్ల కంటే ఎక్కువ) లాటరీ గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు చైనా దేశంలో ఇదే అతి పెద్ద లాటరీ కావడం గమనార్హం. నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తికి ఈ అదృష్టం వరించిందని చైనా వెల్ఫేర్ లాటరీ వెబ్సైట్ వెల్లడించింది. చైనాకు చెందిన ఓ చిరు వ్యాపారి ఒకేసారి 133 లాటరీ టికెట్స్ కొనుగోలు చేశారు. ప్రతిసారీ ఏడు నంబర్లతో కూడిన ఒకే గ్రూప్‌పై బెట్టింగ్ చేశాడు, దీంతో అతని ప్రతి టిక్కెట్‌కు 5.16 మిలియన్ యువాన్స్ బహుమతి లభించిందని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే విజేత వివరాలను సంస్థ బయటపెట్టలేదు. లాటరీ గెలుచుకున్న వ్యక్తి ఈ నెల 7న బహుమతి స్వీకరించారని, ప్రావిన్షియల్ వెల్ఫేర్ లాటరీ సెంటర్ అధికారి తెలిపారు. ఇంత డబ్బు లాటరీ గెలిచాననే ఆనందంలో అతనికి నిద్ర పట్టలేదని, ఉద్వేగానికి గురైనట్లు వెల్లడించారు. మొదట్లో తనని తానె నమ్మలేదని, ఇది నిజమా.. కాదా అని నమ్మడానికి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్నట్లు తెలిపారు. చైనా నిబంధనల ప్రకారం గెలుచుకున్న బహుమతిలో ఐదోవంతు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: రెస్టారెంట్‌గా మారిపోయే ట్రక్ - వీడియో వైరల్ చైనాలో ఇప్పటి వరకు గెలుచుకున్న అతిపెద్ద లాటరీ ఇదే అయినప్పటికీ.. భారీ మొత్తంలో లాటరీ గెలుచుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. 2012లో బీజింగ్‌కు చెందిన ఒక వ్యక్తి 570 మిలియన్ యువాన్లు, గత ఏడాది తూర్పు జియాంగ్జి ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి 200 మిలియన్ యువాన్లను లాటరీలో గెలుచుకున్నారు. -
రూ.166 లాటరీ టికెట్.. వచ్చిన బహుమతి.. రూ.13,339 కోట్లు
ఒక్కసారిగా ఏదైనా కలిసి వచ్చిందంటే.. లాటరీ తగిలిందని అంటుంటాం. మరి ఒక లాటరీ తగిలి మొత్తం జీవితం అసలే మాత్రం ఊహించనంతగా మారిపోతే.. ఆ ఊహే ఎంత అందంగా ఉందో అనిపిస్తుంది కదా.. అలాగే అమెరికాలోని ఫ్లారిడాలో ఓ వ్యక్తికి లాటరీ(రూ.166)లో ఏకంగా 13,339 కోట్ల రూపాయల (160 కోట్ల డాలర్ల) ‘మెగా మిలియన్’ లాటరీ తగిలింది. నిజానికి సెప్టెంబర్ 27నే విజేత ఎవరో తేలిపోయినా.. భద్రతా నిబంధనల మేరకు మూడు నెలల తర్వాత తాజాగా పేరును ప్రకటించారు. సాల్టయిన్ హోల్డింగ్స్ పేరిట దాని యజమాని ఈ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ‘మెగా మిలియన్’ లాటరీ చరిత్రలోనే ఇది అత్యధిక బహుమతి మొత్తం కావడం గమనార్హం. ఇక లాటరీ టికెట్‌ను అమ్మిన జాక్సన్విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్‌కు రూ.83 లక్షలు (లక్ష డాలర్లు) అదనపు కమీషన్‌గా లభించాయి. –సాక్షి సెంట్రల్ డెస్క్ -
వెయిటర్‌కి కోట్లలో జాక్‌పాట్ తగిలింది! అదే ఆమె జీవితాన్ని..
కోట్లల్లో లాటరీ తగిలితే వాట్ ఏ జాక్‌పాట్ అని ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఒక్క క్షణంలో జీవితమే మారిపోయింది అని సంబరపడిపోతాం. అది కూడా ఓ సాధారణ వెయిటర్‌లా పనిచేస్తున్న వ్యక్తికి ఇలాంటి అదృష్టం దక్కితే అతడి సంతోషానికి అవధులే ఉండవు. కానీ అతడికి ఆ లాటరీ టికెట్ శాపమైపోయింది. ఎందుకు తగిలిందిరా బాబు అని జుట్టు పీక్కునేలా చుక్కలు చూపించింది. ఇందేంటి అనుకుంటున్నారా..!ఇంకెందుకు ఆలస్యం అలా ఎలా అయ్యిందో త్వరగా చదివేయండి మరీ..! ఫోరిడాలోని అలబామాలోని వాఫిల్ హౌస్ హోటల్‌కి ఎడ్వర్డ్ సెవార్డ్ అనే కస్టమర్ వచ్చాడు. అతడు వెళ్లిపోతూ వెయిటర్ టోండా డికర్సన్ అనే మహిళకి తాను ఫ్లోరిడాలో కొనుగోలు చేసిన లాటరీని టిప్‌గా ఇచ్చాడు. ఈ ఘటన మార్చి 6, 1999లో చోటు చేసుకుంది. అనూహ్యంగా ఆ మరుసటి రోజే ఆ లాటరీ టికెటే విజేతగా ప్రకటించబడింది. దీంతో డికర్సన్‌కి ఆ లాటరీలో ఏకంగా రూ. 73 కోట్లకు పైగా సోమ్ము వచ్చింది. అంతే ఇక తన జీవితం మారబోతుందన్న ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది డికర్సన్. అంతేగాదు ఆ వాఫిల్ హౌస్‌లోని మిగతా ఉద్యోగులు కూడా డికర్సన్‌కి లాటరీ తగలిందని సంతోషంగా ఉన్నారు. అక్కడ ఆ హోటల్లో తమ ఉద్యోగులు ఎవరైనా జాక్‌పాట్ కొట్టినట్లయితే ఆ వచ్చిన మొత్తాన్ని అందరూ షేర్ చేసుకుంటామని ఒప్పదం చేసుకున్నారు. ఇప్పడు డికర్సన్ ఇప్పుడు అందుకు ఇష్టపడటం లేదు. దీంతో సహోద్యోగులు కోపంతో ఆమెపై కేసు పెట్టారు. అయితే కోర్టు ఆ ఒప్పదం నోటిమాటే గానీ అధికారికంగా ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వెల్లడించింది. అలబామా చట్టం ఇలాంటి ఒప్పందాలు చట్టం విరుద్ధం కాదని చెబుతుండటంతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది. అలాగే డికర్సన్ గెలుచుకున్న మొత్తాన్ని తన వద్ద ఉంచుకోవచ్చని తీర్పు ఇచ్చేసింది. ఇలా డికర్సన్ తన సహోద్యోగులతో పంచుకోలేదన్న విషయం లాటరీ టికెట్ ఇచ్చిన ఎడ్వర్ సెవార్డ్కి తెలుస్తుంది. దీంతో అతను కూడా డికర్సన్పై కేసు పెట్టాడు. తన సహోద్యుగులకు డికర్సన్ వాటా ఇవ్వాల్సిందే అని కోర్టుని ఆశ్రయించాడు. ఐతే కోర్టు అతడి కేసుని కూడా కొట్టేసింది. అయితే డికర్సన్‌కి ఆ కోర్టు కష్టాలు అక్కడితో ఆగలేదు. హమ్మయ్యా!.. అని అన్ని అడ్డంకులు దాటుకుని తన స్నేహితుడితో కలిసి ఎస్ కార్పోరేషన్ అనే కంపెనీని పెట్టింది. అయితే ఆ కంపెనీ ట్యాక్స్‌లు పెద్ద మొత్తంలో ఎగ్గొట్టినట్టు ఆరోపణలు వచ్చి.. మళ్లీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్(ఐఆర్స్) ఎదుర్కొంటోంది. డికర్సన్ తన కుటుంబానికి రూ. 20 కోట్లు బహుమతిగా ఇచ్చిందన్న అంశం తెరపైకి వచ్చి రాద్ధాంతంగా మారింది. ఆమె గెలుచుకున్న మొత్తంలో సుమారు 51% గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐఆర్ఎస్ చెబుతోంది. ఐతే డికర్సన్ అది గిఫ్ట్ కాదని తమ కుటుంబంలో ఎవరైన పెద్ద మొత్తంలో గెలుచుకుంటే అది అందరం షేర్ చేసుకోవడం జరుగుతుందని, అదికూడా ఒకరి బాగోగులు చూసుకోవడంలో భాగంగానే అని వివరణ ఇచ్చుకుంది. ఇలా ఆమెను 12 ఏళ్ల పాటు ఇన్కమ్ ట్యాక్స్ కష్టాలు వెంటాడాయి. ఆ విధంగా ఆమె ఉదారంగా గెలుచుకున్న సొమ్ములో దాదాపు రూ. 9 కోట్ల వరకు పన్నుల రూపంలో చెల్లించాలని 2012లో కోర్టు ఆమెను ఆదేశించింది. కోట్లలో డబ్బు గెలుచుకుందన్నమాటే గానీ ట్యాక్స్‌లు సహోద్యోగుల రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కోట్లాధికారిగా మారానన్న సంతోషాన్ని మాత్రం ఇవ్వలేదు సరికదా!. ఆ లాటరీ తగిలాక ప్రతి నిమిషం ఓ టెన్షన్.. టెన్షన్..అన్నట్లుగా మారిపోయింది జీవితం. టైం బ్యాడ్‌గా ఉంటే అదృష్టం కూడా దురదృష్టంలా ఏడిపించేస్తుందేమో. బహుశా ఊరికే వచ్చిన సొమ్ము లేదా నడిమంత్రపు సిరి ఎక్కువ కాలంనిలవదు అంటే ఇదేనేమో కదా..!. In 1999, waitress Tonda Dickerson was tipped a lottery ticket and won $10,000,000. Her colleagues then sued her for their share. Then she was sued by the man who tipped her the ticket. Later, she was kidnapped by her ex-husband and had to shoot him in the chest. Finally, she… pic.twitter.com/KpDR4lhN4I — Fascinating (@fasc1nate) December 11, 2023 (చదవండి: 24 గంటలూ ఓపెన్... సిబ్బంది మాత్రం నిల్!) -
అలా వెళ్లి.. ఇలా రూ. 2.5 కోట్లు గెల్చుకున్నాడు
చండీగఢ్: ఎప్పటికైనా లాటరీ తగలకపోతుందా అనే ఆశతో లాటరీ టికెట్ కొంటూ ఉంటారు చాలామంది. ఆ తరువాత దానిసంగతి మర్చిపోతూ ఉంటారు కూడా. కానీ ఇలా లాటరీ కొన్నాడో లేదో అలా జాక్‌పాట్ వరించింది ఒక పెద్దాయన్ను. పంజాబ్‌లో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లోని మహిల్పూర్ నగరంలో నివసించే శీతల్ సింగ్‌ని ఆ అదృష్టం వరించింది. ఇంట్లోని వారి కోసం మెడిసిన్ కొనడానికి దుకాణానికి వెళ్లాడు. స్తూ వస్తూ ఒక లాటరీ టికెట్ కూడా కొని జేబులో వేసుకున్నాడు. బహుశా అంత తొందరగా లక్ష్మీదేవి తన ఇంటికి నడిచి వస్తుందని అస్సలు ఊహించ ఉండడు. ఇలా ఇంటికి వెళ్లాడో లేదో రూ. 2.5 కోట్ల లాటరీని మొదటి బహుమతిగా గెల్చుకున్నారంటూ సమాచారం అందిందింది. టికెట్ కొన్న దాదాపు నాలుగు గంటల తర్వాత తనకు రూ. 2.5 కోట్లు గెలుచుకున్నట్లు లాటరీ నిర్వాహకుల నుంచి కాల్ వచ్చిందంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలనేది కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పాడు బోసి నవ్వులతో శీతల్ సింగ్. వ్యవసాయ పనులు చేసుకునే సింగ్ ఇద్దరు పిల్లల. వారు పెళ్లిళ్లు అయ్యాయి. కాగా, తాను పదిహేనేళ్ల నుంచి లాటరీ టికెట్లు వ్యాపారంలో ఉన్నానని లాటరీ టికెట్ల దుకాణదారుడు చెప్పాడు. ఇప్పటివరకు తన దగ్గర టికెట్లు కొన్నవారిలో ముగ్గురు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెల్చుకున్నారని తెలిపాడు. -
రూ.76 లక్షల రేంజ్ రోవర్ కేవలం రూ.100కే..! ఎగబడుతున్న జనం..
తక్కువ ధరలో కారు కొనాలన్నా.. కనీసం ఐదు లక్షలైనా ఉండాలి. లగ్జరీ కార్ల విషయానికి వస్తే కోట్లు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం రూ. 100 పెడితే లక్షల ఖరీదైన కారు గెలుచుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అస్సాంలో ప్రతి ఏటా నిర్వహించే హౌలీ రాస్ ఫెస్టివల్ (Howly Raas Festival) ముందు నిర్వాహక కమిటీ గత సంవత్సరం మాదిరిగానే లాటరీని నిర్వహించింది. ఇందులో మొదటి బహుమతి రూ.76 లక్షల విలువైన రేంజ్ రోవర్. రెండవ బహుమతి రూ. 50 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్, స్కార్పియో, మూడవ బహుమతి స్కోడా కుషాక్, నెక్సాన్ ఉన్నాయి. ఈ ఖరీదైన కార్లను సొంతం చేసుకోవాలంటే కేవలం రూ.100 పెట్టి లాటరీ టికెట్ కొంటే సరిపోతుంది. ఈ లాటరీ అనేది గత 95 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు, విజేతలకు కార్లను బహుమతిగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లాటరీ విషయం తెలిసి చాలామంది టికెట్ కొనటానికి బారులు తీరుతున్నారు. ఇదీ చదవండి: వారానికి 60 గంటల కంటే ఎక్కువే.. పని గంటలపై ఇదిగో ప్రూఫ్.. లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత విజేతలను 2023 డిసెంబర్ 10న ప్రకటించనున్నారు. లాటరీ టికెట్స్ అమ్మిన డబ్బును వివిధ కార్యక్రమాలను ఉపయోగిస్తారు. ఈ ఏడాది నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 వరకు రాస్ పండుగను నిర్వహిస్తారు. గతేడాది మొత్తం 3.2 లక్షల లాటరీ టికెట్స్ అమ్ముడయ్యాయి, ఈ సారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. -
లాటరీ ఏజెంట్ జాక్‌పాట్.. అమ్ముడుపోని ఆ టికెట్‌తోనే..
అదృష్టం ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. అదృష్టం కలిసి వస్తే రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతాయి. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్, బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ జీవితాలు అలాగే మారిపోయాయి. కోటీశ్వరులయ్యారు. కేరళలో లాటరీ (Kerala Lottery) ఏజెంట్ అయిన ఎన్‌కె గంగాధరన్, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఫిఫ్టీ ఫిఫ్టీ లాటరీలో అమ్ముడుపోని లాటరీ టికెట్ విజేత నంబర్‌గా మారడంతో అతనికి అదృష్టవశాత్తూ కోటి రూపాయలు వచ్చాయి. ఈ విజయం ఆయన లాటరీ స్టోర్‌కు మొదటిది కావడంతో పాటు మరింత ప్రత్యేకమైనదిగా నిలిచింది. 33 సంవత్సరాలు బస్ కండక్టర్‌గా పని చేసిన గంగాధరన్ ఆ తర్వాత కోజీకోడ్‌లో లాటరీ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తన దుకాణంలో మొదటి విజేత ఆయనే కావడం గమనార్హం. అమ్ముడుపోకుండా తన మిగిపోయిన లాటరీ టికెట్టే ఆయనకు కోటి రూపాయలను తెచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే అదే డ్రాలో గంగాధరన్ స్టోర్ నుంచి టిక్కెట్లు కొనుగోలు చేసిన మరో ఆరుగురు కూడా ఒక్కొక్కరూ రూ.5,000 గెలుచుకున్నారు. దీంతో లాటరీ ఏజెంట్‌కి, ఆయన కస్టమర్లకు ఆనందాశ్చర్యాలను కలిగించింది. ఆఫర్లో వచ్చిన టికెట్‌కి రూ. 44 కోట్లు బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వాటక్కే కోరోత్, అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్‌ల (సుమారు రూ. 44 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. అయితే మొదట్లో ఇది స్కామ్‌గా భావించిన అరుణ్ నంబర్‌ను కూడా బ్లాక్ చేస్తూ కాల్‌ను డిస్కనెక్ట్ చేశాడు. అరుణ్ కుమార్ 'బై టు గెట్ వన్ ఫ్రీ' ఆఫర్లో ఈ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు. ఆఫర్ కింద వచ్చిన ఆ టికెట్‌కే జాక్‌పాక్ తగిలింది. -
Telangana: ఈనెల 4న మద్యం లాటరీలకు నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్ల కాలానికి (2023–25)గాను రాష్ట్రంలోని 2,620 ఏ4 దుకాణాల (వైన్‌షాపులు) ద్వారా మద్యం విక్రయించడం కోసం లైసెన్సులు మంజూరు చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. ఈ మేరకు ఈనెల 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం నిర్వ హించాల్సిన ప్రక్రియపై మంగళవారం అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో రాష్ట్ర ఎక్సైజ్ డైరెక్టర్ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెల 4న నోటిఫికేషన్ రానుండగా, అదేరోజు నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 20 లేదా 21న లాటరీలు నిర్వహించి షాపులు కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, గత రెండేళ్ల పాలసీనే ఈసారి కూడా అమలు చేస్తారని, దరఖాస్తు ఫీజు, దుకాణాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదని, ఎస్సీ, ఎస్టీ, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కూడా యథాతథంగా అమలవుతాయని తెలుస్తోంది. చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! -
దుబాయ్‌లో భారతీయుడి జాక్‌పాట్.. నెలకు రూ.5.59 లక్షలు..
అబుదాబి: యూపీకి చెందిన ఖాన్ దుబాయ్‌లో మెగా ప్రైజ్ గెలుచుకున్నాడు. బహుమతిగా అతను మరో 25 ఏళ్లపాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) సొంతం చేసుకోనున్నాడు. దుబాయ్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్కిటెక్టుగా పనిచేసున్న మహమ్మద్ అడిల్ ఖాన్ టైఖేరోస్ సంస్థ నిర్వహించిన ఫాస్ట్ 5 ఎమిరేట్స్ డ్రాలో మొట్టమొదటి విజేతగా నిలిచాడు. ఈ మేరకు కంపెనీ మార్కెటింగ్ హెడ్ పాల్ చాడర్ మాట్లాడుతూ ఈ డ్రా మొదలుపెట్టిన ఎనిమిది వారాల్లోపే మొట్టమొదటి విజేతను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మెగా ఎమిరేట్స్ డ్రాలో విజేతగా ఖాన్ పేరును ప్రకటిస్తూ బహుమతిగా ఆయనకు 25 సంవత్సరాల పాటు నెలకు 25 వేలు దేనారాలు (రూ.5.59 లక్షలు) చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. యూపీకి చెందిన ఖాన్ మాట్లాడుతూ.. ఈ నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్లకి ఈ విషయాన్ని చెబితే వారు కూడా నమ్మలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమన్నారు. మా కుటుంబంలో నేనొక్కడినే పనిచేస్తుంటాను. మా అన్నయ్య కరోనా సమయంలో చనిపోయారు. అన్నయ్య కుటుంబాన్ని కూడా నేనే చూసుకోవాలి. వయసు మీదపడిన తల్లిదండ్రుల తోపాటు నాకొక ఐదేళ్ల పాప కూడా ఉందని, ఈ బహుమతి నాకు సరైన సమయంలోనే అందిందనుకుంటున్నానని అన్నాడు. ఇది కూడా చదవండి: 11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు.. -
ముందస్తుగా ‘మద్యం లాటరీలు’?
సాక్షి, హైదరాబాద్: ఎప్పుడో నవంబర్‌లో జరగాల్సిన వైన్‌షాపుల లాటరీ ప్రక్రియ వచ్చే నెలలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అక్టోబర్‌లోనే వస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ మేరకు కసరత్తు చేస్తోంది. 2021–23 సంవత్సరాల ఏ4 (వైన్స్) షాపుల లైసెన్సు కాలం ముగియక ముందే 2023–25 సంవత్సరాలకు లైసెన్సులిచ్చే నోటిఫికేషన్ జారీ చేసేందుకు ముమ్మరంగా ముందుకెళ్తోంది. వచ్చే నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ ప్రారంభం కల్లా ప్రక్రియను పూర్తి చేసేలా కొత్త పాలసీ రూపకల్పనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ముందుగానే ఎందుకు?: వాస్తవానికి, 2021–23 (రెండేళ్ల పాలసీ) సంవత్సరాలకుగాను ఏ4 లైసెన్సుల గడువు వచ్చే నవంబర్ 30తో ముగియనుంది. అంటే డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్‌దారులు రాష్ట్రంలో మద్యం విక్రయాలు జరపాల్సి ఉంటుంది. అలా జరగాలంటే అక్టోబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. రానున్న రెండేళ్లకు (2023–25) లైసెన్సులను లాటరీ పద్ధతిలో జారీ చేసేందుకు కొత్త పాలసీ రూపొందించాల్సి ఉంటుంది. అయితే, వచ్చే డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున అక్టోబర్‌లో షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశముంది. దీంతో ఎన్నికల నియమావళి వచ్చేలోపే నోటిఫికేషన్ ఇచ్చి లాటరీలు ముగించి కొత్త లైసెన్స్‌దారులకు షాపులు కేటాయించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి మాత్రమే వారికి షాపులు అప్పగించాలని, ఈలోగా పాత లైసెన్స్‌ల ద్వారా మద్యం విక్రయాలు జరపవచ్చని అంటు న్నారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన మద్యం టెండర్లకు ముహూర్తం ఖరారు చేసే పనిలో పడ్డారు. అడిగితే ఇవ్వరా?: గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ముందస్తు ఎక్సైజ్ టెండర్లకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. గతంలో జూలై 1 నాటికి లైసెన్సులు ముగిసేవి. కానీ, 2014లో మూడుసార్లు గడువు పెంచడంతో ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి కొత్త షాపులు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఈసారి గడువు పెంచకుండా ముందస్తుగా లాటరీల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఎన్నికల కోడ్ అడ్డంకి అయితే, ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని ప్రక్రియ ప్రారంభించి లైసెన్స్‌లను ఖరారు చేసి పెట్టుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోడ్ అయ్యాక కొత్త లైసెన్స్‌దారులకు షాపులు అప్పగించవచ్చనే వాదనా ఉంది. అయితే, అప్పటివరకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం పాటు గడువు పొడిగించి పాత లైసెన్స్‌దారుల దగ్గరే ఫీజు వసూలు చేసి విక్రయాలు జరపవచ్చనే అభిప్రాయమూ ఉంది. మరోవైపు, వైన్‌షాపుల్లో కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మళ్లీ ఇప్పుడు ముందస్తు ప్రక్రియపై ఎవరైనా కోర్టుకు వెళితే అసలుకే ఎసరు వస్తుందనే చర్చ ఎక్సైజ్ వర్గాల్లోనే జరుగుతుండటం గమనార్హం. ఆదాయం కోసమేనా?: మందుషాపులకు ముందస్తు లాటరీలు ఆదాయం కోసమేనా అనే చర్చ జరుగుతోంది. రెండేళ్లకు లైసెన్సు ఫీజు జారీ చేసేందుకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల అమ్మకాల మీదనే ప్రభుత్వానికి రూ. 1,400 కోట్ల ఆదాయం వచ్చింది. ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం లాటరీ ప్రక్రియ పూర్తయి షాపు కేటాయించాలంటే మొదటి విడత లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇలా లైసెన్స్ ఫీజు కింద మరో రూ.500– 600 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎన్నికలకు ముందు ఈ రూ.2 వేల కోట్ల కోసమే ఎక్సైజ్ శాఖ హడావుడి చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. -
11 మంది కలిసి రూ.10 కోట్లు గెలుచుకున్నారు..
కొచ్చిన్: కేరళలోని 11 మంది మహిళా పారిశుద్ధ్య కార్మికులు ఒక్కసారిగా కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి చందాలు వేసి కొనుక్కున్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.10 కోట్ల బంపర్ లాటరీ గెలుచుకుంది. రాత్రికి రాత్రే అంత పెద్ద మొత్తంలో నడమంత్రపుసిరి సొంతం కావడంతో వారంతా ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నారు. కేరళ ప్రభుత్వం 2023 వర్షాకాలం బంపర్ లాటరీ టికెట్ కొనడం కోసం 11 మంది మహిళా పారిశుధ్య కార్మికులు తలా కొంచెం చందాలు వేసుకున్నారు. పరప్పనంగడి మునిసిపాలిటీలోని హరిత కర్మ సేనకు చెందిన వీరందరివి అత్యంత నిరుపేద కుటుంబాలు. చందాలు పోగు చేసే సమయానికి వారిలో కొందరి వద్ద కనీసం రూ. 25 కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో చేతిలో ఎంత ఉంటే అంత పెట్టి ఎలాగోలా రూ. 250 పోగుచేసి బంపర్ లాటరీ టికెట్టు కొన్నారు. వారు కష్టపడి కొన్న అదే టికెట్‌కు రూ.10 కోట్లు బహుమతి లభించిందని తెలియగానే వారంతా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. వారిలో ఒకామె మాట్లాడుతూ.. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. మేము మరికొంతమందిని అడిగి దీన్ని నిర్ధారించుకోవాలి. మేమంతా చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చినవారమే. మాలో చాలామందికి పెద్ద మొత్తంలో అప్పులున్నాయి. నాకే రూ.3 లక్షలు అప్పు ఉంది. ఇందులో నా వాటా డబ్బులతో అప్పులన్నీ తీర్చేస్తాను. డబ్బు సరైన సమయానికి చేతికందిందని అనుకుంటున్నానంది. ఇక హరిత కర్మ సేన కోఆర్డినేటర్ వారి సిబ్బందిలో కొంతమంది లాటరీ గెలవడంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వారంతా తమ జీవనాన్ని సాఫిగా గడపడం కోసం ఏంతో కష్టపడేవారు. వారు సాధారణంగా ప్రతి ఇల్లు తిరిగి చెత్తను సేకరిస్తూ ఉంటారు. వారి నెల జీతం కూడా రూ. 8000 నుండి రూ. 15000 మాత్రమేనని అన్నారు. ఈ లాటరీలో వారి జీవితాలు మారిపోయినట్లేనని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ 11 మంది పారిశుద్ధ్య కార్మికులు గత నాలుగేళ్లుగా ఈ బంపర్ కాటరీ టికెట్ కొంటుండగా గతంలో ఒకసారి వీరికి ఓనమ్ బంపర్ లాటరీలో రూ. 1000 బహుమతి లభించగా ఈ సారి మాత్రం ఏనుగు కుంభస్థలాన్ని కొల్లగొట్టారు. ఇది కూడా చదవండి: వందే భారత్ ఎక్స్ ప్రెస్.. ఆహారంలో స్పెషల్ ఐటెం.. -
28 ఏళ్ల క్రితం రూ. 166 కోట్ల జాక్‌పాట్.. ఇప్పుడు తిరిగి పాత జీవితంలోకి..
అతను నేషనల్ లాటరీలో 11 మిలియన్ యూరోలు(సుమారు రూ.116 కోట్లు) గెలుచుకున్నాడు. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న అతను రెండు దశాబ్ధాల తరువాత తన గత వర్కింగ్ లైఫ్‌లోకి తిరిగి వచ్చేశాడు. 61 ఏళ్ల మార్క్ గార్డ్నర్, అతని బిజినెస్ పార్ట్నర్ పాల్ మెడిసన్ 1995లో 22 మిలియన్ల యూరోలు గెలుచుకున్నారు. దీంతో వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మార్క్ .. బ్రిటన్‌కు చెందినవాడు. అతను కొంత మొత్తాన్ని అస్తవ్యస్త రీతిలో వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. దీంతో కోట్లాది రూపాయలు కోల్పోయాడు. అతని నాల్గవ భార్య కూడా ఇదేవిధంగా వివిధ చోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయింది. ‘ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని’ అయితే మార్క్ కొంత మొత్తాన్ని మాత్రం సరైన చోట్ల పెట్టుబడిగా పెట్టాడు. వాటిలో యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఒకటి. దీనితో పాటు తమ కంపెనీ క్రాఫ్ట్ గ్లాస్లో 2 మిలియన్ యూరోలు పెట్టుబడిగా పెట్టాడు. ఇప్పుడు మార్క్ ఈ కంపెనీని నడుపుతున్నాడు. మార్క్ మీడియాతో మాట్లాడుతూ ‘నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఆరోజు కాకుండా.. ఇప్పుడు ఈ 61 ఏళ్ల వయసులో లాటరీలో గెలిచివుంటే పరిస్థితులు మరో విధంగా ఉండేవి. ఈ పాటికి నేను పనిచేయడం మానేసేవాడిని. ఇప్పుడు నా దగ్గర కావాలసినంత తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఒక్క రోజు సెలవు తీసుకున్నా, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాను’ అని అన్నాడు. ప్రతీవారం లాటరీ టిక్కెట్ల కొనుగోలు మార్క్‌కు ఇప్పటికీ ఫుట్‌బాల్‌తో అనుబంధం ఉంది. అతనికి హాస్టింగ్లో లోకల్ క్లబ్ ఉంది. అలాగే మార్క్ గతంలో బార్బాడోస్‌లో ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడు. లాటరీలో వచ్చిన సొమ్మునంతా అతను దుర్వినియోగం చేయలేదు. కొన్ని పెట్టుబడుల వలన అతనికి లబ్ధి చేకూరింది. ఇప్పుడు కూడా మార్క్ ప్రతీవారం లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. తాను 1995లో ఏ నంబరు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశాడో ఆ నంబరు గల లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటాడు. నాటి తన పార్ట్నర్ పాల్ ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో ఉన్నాడని, అయితే అతను ఆ లాటరీ సొమ్ముతో ఏమి చేశాడో తెలియదని మార్క్ తెలిపాడు. ఇది కూడా చదవండి: కేలండర్లో లేని రోజున పుట్టిన పిల్లాడు.. విద్యాశాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట! -
ఇది కదా లక్ అంటే.. గంటలో కోటి!
Nagaland State Lottery: ఏదో అదృష్టం కలిసి వస్తుందని చాలామంది లాటరీలు కొంటారు. మరికొందరైతే ఏళ్ల తరబడి లాటరీ టికెట్లు కొంటూనే ఉంటారు. ఆ బంపర్ఎ ప్రైజ్ తమకు ఎప్పుడు తగులుతుందా అని ఎదురు చూస్తూనే ఉంటారు. కానీ లాటరీ టిక్కెట్ కొన్న గంటకే కోటి రూపాయలు గెలుచుకోవడం గురించి విన్నారా? పంజాబ్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి జాక్‌పాట్ తగిలింది. ఈ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కావడం అతని వంతైంది. వివరాలను పరిశీలిస్తే.. పంజాబ్, గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్మెంట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. అందరిలాగారే ఈయన కూడా గత ఏడాది కాలంగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు కానీ ఇంత తొందరగా లక్ష్మీ దేవి తన ఇంటికి నడిచి వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. (ఇషా అంబానీ దూకుడు.. అలియా భట్‌తో భారీ డీల్!) ఎప్పటిలాగే రూపీందర్‌జిత్ సింగ్ శనివారం మధ్యాహ్నం నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు రూ.6 పెట్టి 25 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఇంతలో దాదాపు గంట తరువాత లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఏకం రూ. కోటి గెలుచుకున్నట్టు సమాచారం అందించడంతో ఎగిరి గంతేశాడు రూపిందర్. ఇన్నళ్లకి తన కల నెలవేరిందని, ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానన్నారు. అంతేకాదు ఆపదలో ఉన్న పేదలకు కూడా సాయం చేస్తానని చెప్పాడు రూపీందర్ కొండంత సంబరంతో. (ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్: మరింత గడ్డు కాలం?) తన అలవాటే తనను కోటీశ్వరుడిని చేసిందని రూపిందర్జిత్ చెప్పాడు. లాటరీని గెలుచుకున్నందుకు బ్యాంకు సిబ్బంది అభినందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్లు చేశారు. కాగా గతంలో ఇదే ప్రాంతంలో కిరాణా దుకాణం యజమానికి రూ.2.5 కోట్ల లాటరీ బంపర్ ప్రైజ్ వచ్చింది. మరోసారి బంపర్ ప్రైజ్ గెలవడంతో డేరా బాబా నానక్ టౌన్ పేరు మరోసారి మారుమోగింది. (