లాటరీ పేరిట ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి నుంచి రూ.12 లక్షల మేర దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
అల్లీపురం (విశాఖపట్నం) : లాటరీ పేరిట ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి నుంచి రూ.12 లక్షల మేర దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోస్ట్‌గార్డ్‌లోని స్లీప్ మెయిల్‌లో పనిచేసే బుద్ధా వెంకట శివ సంతోష్‌కు రూ.40 లక్షల లాటరీ వచ్చిందని కోల్‌కతాకు చెందిన ఉదయ్‌కుమర్ గుప్తా అనే వ్యక్తి నమ్మించాడు.
అయితే ఆ మొత్తం పంపించేందుకు పన్నులు, అదీ, ఇదీ అంటూ రూ.12 లక్షలు రాబట్టడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కోల్‌కతాకు వెళ్లి ఉదయ్‌కుమార్ గుప్తాను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.