One arrest
-
బుఖారి హత్యకేసులో ఒకరి అరెస్ట్
శ్రీనగర్: రైజింగ్ కశ్మీర్ దినపత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ షుజాత్ బుఖారి(53) హత్యకేసులో ఓ అనుమానితుడ్ని అరెస్ట్ చేసినట్లు కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్వయం ప్రకాశ్ పానీ మీడియాకు తెలిపారు. నిందితుడ్ని జుబైర్ ఖాద్రీగా గుర్తించినట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల అనంతరం కారులో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారి నుంచి జుబైర్ తుపాకీని ఎత్తుకెళ్లాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీల్లో రికార్డయిందన్నారు. జుబైర్ నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును త్వరితగతిన విచారించేందుకు సెంట్రల్ కశ్మీర్ డీఐజీ వీకే విర్దీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పానీ పేర్కొన్నారు. మరోవైపు బారాముల్లా జిల్లాలోని స్వగ్రామంలో బుఖారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన్ను కడసారి చూసేందుకు స్థానికులు, ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. అధికార పీడీపీ, బీజేపీ మంత్రులు, ప్రతిపక్ష నేత ఒమర్ అబ్దుల్లా బుఖారి అంత్యక్రియలకు హాజరయ్యారు. -
ఐసిస్ కలకలం
ఈ రాష్ట్రానికి ఏమైంది...ఒకవైపు మావోలు..మరోవైపు ఐఎస్ తీవ్రవాదులు..విధ్వంసాలకు కుట్ర’. నాలుగు రోజుల్లో పట్టుబడిన నిందితుల నేపథ్యం ప్రభుత్వాన్ని ప్రజలను ఈ రకంగా భయాందోళనకు గురి చేస్తోంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఒకప్పుడు తమిళనాడు దేశంలోనే శాంతి భద్రతల సమస్యలు, తీవ్రవాద కార్యకలాపాలు లేని ప్రాంతంగా పేరుగాంచింది. ఆధ్యాత్మిక చింతన, గుళ్లు గోపురాలతో నిండిన రాష్ట్రంలో కరుడుగట్టిన వ్యక్తులకు తావులేదని భావించేవారు. అయితే కొన్నేళ్లలో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తీవ్రవాద కార్యకలాపాలకు అవసరమైన మనుషులు తమిళనాడులో సులభంగా దొరుకుతారు అనే భావన జాతీయ, అంతర్జాతీయ తీవ్రవాదులు సైతం వేళ్లూనుకుపోయింది. యువతకు బ్రెయిన్ వాష్ చేసి ముఠాలో చేర్చుకోవడంలో కొందరు వ్యక్తులు నిమగ్నమై ఉండడం ఆందోళనకరమైన అంశం. దశరథన్, సెన్బగవళ్లి అనే మావో దంపతులు తమ దళంలోకి యువతను చేర్చుకునే ప్రయత్నంలోనే ఈనెల 10వ తేదీన తిరువళ్లూరులో పట్టుబడడం గమనార్హం. సుమారు 15 ఏళ్ల క్రితం అప్పటి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని హతమార్చేందుకు తిరుమల అలిపిరి మార్గంలో మంతుపాతర పేల్చిన సంఘటనలో ఈ మావో దంపతులు నిందితులని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సదరు మావోలు ఏపీపై గురిపెట్టినట్లు అనుమానిస్తున్నారు. మావో దంపతులతో పాటు రహస్య సమావేశానికి హాజరై పారిపోయిన పదిమంది మావోల కోసం తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో క్యూ బ్రాంచ్ పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. ఐఎస్ కలకలం: మావోల కోసం ఒకవైపు కూంబింగ్ జరగుతుండగా చెన్నైలో సోమవారం రాత్రి ఐఎస్ తీవ్రవాది దొరకడం, మరో ఐదుగురి కోసం గాలించడం గమనార్హం. సిరియా, ఇరాక్‌లోని కొంత ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న ఐఎస్ తీవ్రవాదులు ప్రత్యేక దేశాన్ని ప్రకటించుకోవాలని పోరాడుతున్నారు. ఐఎస్ తీవ్రవాదులకు, ఇతర దేశాల సైనికులకు మధ్య హోరాహోరీగా పోరుసాగుతోంది. ఈ పోరు కోసం మరింత బలగాలను సిద్ధం చేసుకునేందుకు ఐఎస్ తీవ్రవాద సంస్థ ఇతర దేశాలపై కన్నువేసింది. తమ తీవ్రవాద సంస్థకు ప్రపంచ నలుమూలలా సానుభూతిపరులు ఉన్నారని నమ్ముతున్న ఐఎస్ సంస్థ కేరళ నుంచి కొంత మంది యువకులను ఎంపిక చేసి సిరియాకు పంపి తమలో విలీనం చేసుకున్నట్లు కేంద్ర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులు గ్రహించారు. దీనిపై ఎన్ఐఏ తీవ్రస్థాయిలో విచారణ చేపట్టగా తమిళనాడు నుంచి సైతం యువత తరలిపోతున్నట్లు తెలియడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఐఎస్ తీవ్రవాదం వైపు యువతను చేరవేయడంలో కడలూరు జిల్లాకు చెందిన ఖాజా ఫక్రుద్దీన్ ప్రధానపాత్ర పోషించినట్లు కనుగొన్నారు. ఖాజా ఫక్రుద్దీన్ సిరియా దేశానికి వెళ్లి సాయుధ శిక్షణ కూడా తీసుకున్నాడు. సింగపూర్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న ఖాజా ఫక్రుద్దీన్ కదలికలపై అధికారులు నిఘాపెట్టారు. గత ఏడాది జనవరిలో అతని ఢిల్లీకి వచ్చినçప్పుడు ఎన్ఏఐకి పట్టుబడగా, తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేక తీవ్రవాద ముఠాను సిద్ధం చేసినట్లు, ఈ ముఠాలో 9 మంది తమిళులు ఉన్నట్లు అధికారుల వద్ద ఖాజా ఫక్రుద్దీన్ అంగీకరించాడు. ఈ 9 మందిపై 9 సెక్షన్లలో అనేక కేసులు పెట్టి గాలింపు ప్రారంభించారు. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన అబ్దుల్లా ముత్తలీఫ్, 18వ తేదీన సాహుల్ హమీద్ అనే ఐఎస్ సానుభూతిపరులు చెన్నైలో అరెస్టయ్యారు. ఈ ముగ్గురిని ఎన్ఏఐ అధికారులు తీవ్రస్థాయిలో విచారించారు. మిగిలిన ఆరుగురు అజ్ఞాతంలో ఉంటూ ఐఎస్ కోసం నిధుల సమీకరణ చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ఐఎస్ తీవ్రవాద సంస్థకు మానవరవాణా, నిధుల సమీకరణతోపాటూ తమిళనాడులో విధ్వంసాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు కనుగొన్నారు. ఏదో ఉపద్రవం జరిగేలోగా ఆరుగురిని పట్టుకోవాలని ఎన్ఏఐ అధికారులు గాలింపును తీవ్రతరం చేశారు. తమిళనాడులో ఐఎస్ తీవ్రవాదుల సంఖ్యలో కన్యాకుమారీ జిల్లా నాల్గవస్థానంలో ఉన్నట్లు అందిన సమాచారం ఎన్ఏఐ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కన్యాకుమారీ జిల్లా తిరువిదాంగేడు ఉత్తమన్ ప్రాంతానికి చెందిన అన్సార్ మీరన్ చెన్నైలో దాక్కుని ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఏఐ అధికారులు సోమవారం రాత్రి అన్సార్మీరన్ను చెన్నైలో అరెస్ట్ చేశారు. అన్సార్ మీరన్ తనపై ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చెన్నైలో ట్రావెల్స్ ఏజెన్సీ నడుపుతూ ఐఎస్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తేలింది. తన ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారానే భారతదేశానికి చెందిన యువకులకు సిరియాకు విమాన టికెట్లు సమకూర్చాడు. అన్సార్ మీరన్‌ను రహస్య ప్రదేశంలో ఉంచి ఎన్ఏఐ అధికారులు విచారిస్తున్నారు. తమిళనాడు నుంచి సిరియాకు ఎంతమంది యువకులను పంపారనే వివరాలను రాబట్టుతూ గాలింపును తీవ్రతరం చేశారు. అన్సార్ మీరన్‌ను పూందమల్లిలోని ప్రత్యేక కోర్టులో మంగళవారం హాజరుపరిచి పుళల్ సెంట్రల్ జైలుకు పంపారు. అన్సార్ మీరన్‌ను పదిరోజుల పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ ఎన్ఏఐ అధికారులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. -
కాటూరులో వ్యక్తి దారుణ హత్య
కంకిపాడు (కృష్ణా జిల్లా) : ఉయ్యూరు మండలం కాటూరులో జాగర్లమూడి నాని బాబు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో నానిబాబుని కత్తితో పొడిచి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ బంగారం కేసులో వ్యక్తి అరెస్ట్
సంతోష్‌నగర్ (హైదరాబాద్) : ఓ గోల్డ్ షాపు యజమానిని నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి అసలు బంగారం తీసుకెళ్లిన వ్యక్తిని మంగళవారం సంతోష్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూన్ మూడవ తేదీన సంతోష్ నగర్ బంగారు నగల దుకాణంలోకి లక్ష్మణ్ అనే వ్యక్తి వచ్చి నకిలీ బంగారం పెట్టి అసలు బంగారంతో పరారయ్యాడు. మంగళవారం లక్ష్మణ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద నుంచి పదిహేడు తులాల బంగారం, ఒక మారుతీ కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా నిందితుడిపై పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి..
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : మళ్లీ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఓ వివాహితను మోసం చేశాడో ప్రబుద్ధుడు. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువతి(19)కి ఇదివరకే వివాహమైంది. కాగా ఈమెకు గౌతం ప్రదీప్ అనే యువకుడితో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో నమ్మింది. శారీరకంగా లోబరచుకున్నాక అతడు ముఖం చాటేయటంతో మోసపోయినట్లు గ్రహించి పెద్దలకు తెలిపింది. దీంతో బంధువులంతా కలసి శుక్రవారం ప్రదీప్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లక్కీ డ్రా పేరుతో రూ.5 లక్షలకు టోకరా
హైదరాబాద్ : లక్కీ డ్రాలో బహుమతి తగిలిందని ఫోన్లు చేస్తూ అమాయకులకు ఎరవేసి అందినకాడికి దండుకుంటున్న పశ్చిమ బెంగాల్ వాసిని సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం.. నగరంలోని సత్తార్‌బాగ్‌కు చెందిన జమీలా బేగంకు 00923040019476, 00923366994426, 00923066379229 నంబర్ల నుంచి ఇటీవల కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు. తాము రంజేష్, బాలాజీ, ప్రతాప్‌సింగ్, శిరీష్ పాండేలుగా పరిచయం చేసుకున్నారు. ఎయిర్టెల్ లక్కీ డ్రాలో ఆమె ఫోన్ నంబర్ ఎంపికైందని, రూ.25 లక్షలు బహుమతిగా వచ్చాయని చెప్పారు. జమీలా బేగం వారి మాటలను న మ్మింది. వారు చెప్పినట్లుగా ప్రాసెసింగ్ ఫీజులు, పన్నులు, ఇతర చార్జీల పేరుతో రూ.5 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆపై వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ సాంకేతిక ఆధారాలను బట్టి కోల్‌కతాకు చెందిన చరణ్‌జిత్ దాస్ నిందితుడిగా గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం దాస్‌ను అరెస్టు చేసి పీటీ వారెంట్‌పై శుక్రవారం హైదరాబాద్‌కు తీసుకువచ్చింది. -
టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని..
తిరుపతి : టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన బాలకృష్ణ అనే వ్యక్తిని తిరుపతి ఈస్ట్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాలకు చెందిన 80 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ. 5 లక్షలు వసూలు చేసిన బాలకృష్ణ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి తప్పించుకు తిరుగుతుండటంతో.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. -
దృష్టి మరల్చి చోరీలు..
పంజగుట్ట(హైదరాబాద్ సిటీ): ఏటీఎం సెంటర్ వద్ద కాపుకాసి... డబ్బు డ్రా చేసేందుకు వచ్చే వారికి సాయం చేస్తున్నట్టు నటించి.. వారి ఏటీఎం కార్డు మార్చేసి డబ్బు డ్రా చేసుకుపోతున్న ఓ పాతనేరస్తుడిని ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.77 వేల నగదు, 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వెంకటేశ్వర్లుతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కర్నూలు జిల్లా వెల్ధుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన డి.సిద్దేశ్ (25) ఇంటర్ వరకు చదివి వ్యవసాయ పనులు చేసేవాడు. గ్రామంలో ఒకసారి ఏటీఎం సెంటర్‌కు నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏటీఎం మిషీన్ ఆపరేటింగ్ రాక తికమకపడుతుంటే సిద్దేశ్ అతనికి సాయం చేశాడు. ఇద్దరి ఏటీఎం కార్డులు ఒకే బ్యాంక్‌వి కావడంతో డబ్బులు డ్రా చేసే సమయంలో మారిపోయాయి. సిద్దేశ్ అకౌంట్ లో కేవలం రూ. 3 వేలు ఉండగా... గుర్తుతెలియని వ్యక్తి అకౌంట్లో రూ. 40 వేలు ఉన్నాయి. ఆ కార్డు పిన్ నెంబర్ తెలియడంతో సిద్దేశ్ ఆ డబ్బు డ్రా చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇదే తరహా మోసాలు మొదలెట్టాడు. ఇదే కేసులో గతంలో కర్నూలులో అరెస్టై జైలుకెళ్లాడు. నగరానికి మకాం మార్చి... జైలు నుంచి బయటకు వచ్చాక తన మకాం నగరానికి మార్చాడు. ఎర్రగడ్డలో స్నేహితుడు లక్షీ్ష్మకాతం ఇంట్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. కాకినాడకు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వర్రావు తన కొడుకును కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కోసం నిమ్స్‌లో చేర్పించాడు. ఫిబ్రవరి 3న నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్న ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు రెండుసార్లు ప్రయత్నించగా రాలేదు. అప్పటికే అక్కడ కాపుకాసిన సిద్దేశ్ తాను సాయం చేస్తానని కార్డు తీసుకుని, ఏటీఎం పిన్ తెలుసుకున్నాడు. నాగేశ్వర్రావు దృష్టి మరల్చి అతని ఏటీఎం కార్డుకు బదులు అదే బ్యాంక్‌కు చెందిన మరో కార్డు అతడి చేతిలో పెట్టి.. ఈ ఏటీఎంలో నగదు లేదు, వేరే ఏటీఎంకు వెళ్లి డ్రా చేయండి’’ అని చెప్పి వెళ్లిపోయాడు. 15 నిమిషాల తర్వాత నాగేశ్వర్రావు కార్డుతో సోమాజిగూడలోని మరో ఏటీఎం నుంచి రూ.22 వేలు డ్రా చేశాడు. ఆ మరుసటి రోజే సోమాజిగూడలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న నాగలక్ష్మి కార్డును కూడా ఇదే విధంగా మార్చేసి రూ. 30 వేలు డ్రా చేశాడు. ఆన్లైన్లో డిపాజిట్ చేస్తే టాక్స్ పడుతుందని.... ఫిబ్రవరి 17న ఎస్సార్ నగర్ ఎస్బీఐ ఏటీఎం సెంటర్‌కు ప్రేమ్‌నగర్‌కు చెందిన బి.సూర్యనారాయణ అనే కూలీ రూ. 50 వేలు ఆన్లైన్ క్యాష్ డిపాజిట్ మిషన్ ద్వారా తన స్నేహితుడి అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చాడు. అక్కడే ఉన్న సిద్దేశ్ ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేస్తే ట్యాక్స్ పడుతుంది. నీ అకౌంట్లో ఉన్న నగదు పోతుంది. నా అకౌంట్లో నగదు ఉంది. అకౌంట్ టు అకౌంట్ మారిస్తే ట్యాక్స్ పడదు’’ అని నమ్మబలికాడు. దీంతో సూర్యనారాయణ తన వద్ద ఉన్న రూ. 50 వేలు సిద్దేశ్‌కు ఇచ్చాడు. సిద్దేశ్ తన బ్యాంక్ ఏటీఎం కార్డును మిషీన్లో పెట్టి మినీ స్టేట్మెంట్ తీసి దానిని సూర్యనారాయణకు ఇచ్చి నగదు ట్రాన్స్ఫర్ అయిపోయిందని నమ్మబలికాడు. చదువు రాని సూర్యనారాయణ నిజమే అనుకుని వెళ్లిపోయి.. కొద్దిసేపటి తర్వాత స్నేహితుడికి ఫోన్ చేసి వాకబు చేయగా డబ్బు రాలేదని చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన సూర్యనారాయణ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టివేత... దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించారు. బుధవారం రాజీవ్‌నగర్ ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సిద్దేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా... ఏటీఎం సెంటర్ల వద్ద మోసాలకు పాల్పడుతున్నట్టు ఒప్పుకున్నాడు. నిందితుడి వద్ద నుంచి 77 వేల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 11 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిద్దేశ్పై కర్నూలులో 3, గుత్తిలో 2, పంజగుట్టలో 2, ఎస్సార్ నగర్లో 1 మెత్తం 8 కేసులు ఉన్నాయని, ఇతడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఎస్సార్ నగర్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, డీఐ షేక్ జిలానీ, ఎస్సై శ్రీనివాస్ నిందితున్ని గుర్తించిన హోంగార్డు తిమ్మారెడ్డి పాల్గొన్నారు. -
బాలికకు ప్రేమ పేరుతో వేధింపులు
మిర్యాలగూడ రూరల్ (నల్లగొండ) : పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం పరిధిలో జరిగిన ఈ ఘటనలో పోలీసుల కథనం మేరకు... ఊట్లపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన జగడాల హరికుమార్ ప్రేమ పేరుతో నెల రోజులుగా బాలిక వెంటపడి వేధిస్తున్నాడు. దీనిపై బాలిక మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
కృత్రిమ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
నేరేడ్మెట్ (హైదరాబాద్) : కాదేదీ కల్తీకి అనర్హం మాదిరిగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఇంజక్షన్ ద్వారా పాలప్యాకెట్లలోని సగం పాలను తీసేసి.. నీళ్లతో నింపుతున్న ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో గత కొంత కాలంగా కృత్రిమ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. వినియోగదారుల ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు పాల విక్రయ కేంద్రాలపై దృష్టిపెట్టారు. ఆదివారం ఉదయం ఒక పాల విక్రయ కేంద్రంపై దాడి చేసి పాలప్యాకెట్లలో నీళ్లు కలుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లలో ఇంజక్షన్ ద్వారా పాలను తీసివేసి నీళ్లు కలుపుతుండగా అతడిని పట్టుకున్నారు. అలాగే కృత్రిమ పాల తయారీకి ఉపయోగించే మిషన్, కెమికల్స్‌ను, 200 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మహిళపై అత్యాచారం, ఆపై హత్యాయత్నం..
జోగిపేట (మెదక్): మహిళను మద్యం తాగించి అత్యాచారం, ఆపై హత్య చేసేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మెదక్ డీఎస్పీ రాజారత్నం మంగళవారం జోగిపేట పోలీస్‌సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన టేక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు వెళ్లింది. ఈ నెల 5వ తేదీన అక్కడే ఆమెకు బంధువైన ఎడ్ల యాకోబ్ అలియాస్ పెంటయ్య కలిశాడు. ఆమెను నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను తీవ్రంగా హింసించటంతో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాలను తీసుకుని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు తన బంధువు సాయంతో పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ కేసులో పోలీసులు విచారణ జరిపి నిందితుడు యాకోబ్‌ను ఉత్తులూరులో మంగళవారం అదుపులోకి తీసుకొని జోగిపేట మున్సిఫ్ కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితుడిపై రౌడీషీట్‌ను తెరుస్తున్నట్లు డీఎస్పీ రాజారత్నం వివరించారు. -
చిన్నారితో చాకిరీ చేయిస్తున్న వ్యక్తి అరెస్ట్
యాకుత్‌పురా (హైదరాబాద్) : చిన్నారితో చాకిరీ చేయిస్తున్న ఓ యజమానిని రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై వి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా సాదత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ (29) గత కొన్ని రోజులుగా జాఫర్ రోడ్డులో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫరీద్ అన్సారీ (13) అనే బాలుడిని దుకాణంలో చేర్చుకుని పని చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు రెయిన్‌బజార్ పోలీసుల సహకారంతో బాలుడికి విముక్తి కల్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిర్దోస్‌ను అరెస్ట్ చేశారు. -
ఫ్యాన్సీ సెల్ నంబర్ల పేరుతో మోసం
అమీర్‌పేట (హైదరాబాద్) : ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డ యువకుడిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన ఎం.కిరణ్‌కుమార్,లైఫ్‌లైన్ ఫార్మాలో పనిచేసే శేఖర్‌రెడ్డిలు వొడాఫోన్ సంస్థలో పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే సెల్‌ఫోన్ ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఎల్లారెడ్డిగూడకు చెందిన పి.వి.రామకృష్ణ వారి వలకు చిక్కాడు. అతడి నుంచి వారు రూ.3,500 వసూలు చేశారు. అయితే రామకృష్ణకు నిందితుల తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మేరకు నిందితుడు కిరణ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం ఒక సిమ్ తీసుకుని అమీర్‌పేటకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నగదుతోపాటు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని వేరే సిమ్ కార్డులు అంటగడుతున్నారని ఏసీపీ తెలిపారు. కాగా ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరారీలో ఉన్న శేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
మరో 'కాల్ మనీ' వ్యాపారి అరెస్ట్
విజయవాడ : రైల్వే చిరుద్యోగులకు 'కాల్ మనీ' వడ్డీకి అప్పులు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న గుడివాడకు చెందిన కొమ్మిరెడ్డి వెంకట సుబ్బారెడ్డిని విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 1469 ప్రామిసరీ నోట్లు, 911 ఖాళీ చెక్కులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు 59, ఏటీఎం కార్డులు 83, ఆరు నాన్ జ్యుడీషియరీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్టు శనివారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతిభద్రతల విభాగం డీసీపీ ఎల్.కాళిదాస్ చెప్పారు. ఈ నెల 24న కార్పొరేషన్ చిరుద్యోగులను అధిక వడ్డీల పేరిట వేధింపులకు పాల్పడుతున్న రాంపిళ్ల పాపారావును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులను అధిక వడ్డీల పేరిట వేధింపులకు పాల్పడుతున్నవారిని కమిషనరేట్ పోలీసులు అరెస్టులు చేయడం సంచలనం కలిగిస్తోంది. డీసీపీ కాళిదాస్ కథనం ప్రకారం.. సుబ్బారెడ్డి మొబైల్ ఫోన్ల వ్యాపారంతో పాటు విజయవాడ, గుడివాడ పట్టణాల్లో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రైల్వేలో పని చేసే చిరుద్యోగులకు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నాడు. ఇందుకోసం ఖాళీ నోట్లు, చెక్కులు, బ్యాంక్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు తీసుకుంటాడు. ఆయా ఉద్యోగులు ఏళ్ల తరబడి వడ్డీలు చెల్లిస్తున్నారు. కనీసం తమకు జీతం ఎంత వస్తుందనే విషయం కూడా వారికి తెలియదు. ఫైనాన్స్ వ్యాపారి తన వడ్డీ పోను ఇచ్చింది తీసుకొని కుటుంబాన్ని గడుపుకోవడమే. ఒకవేళ పూర్తిగా అప్పులు చెల్లించినా వారికి ఇవ్వాల్సిన పత్రాలు, ఇతర ఆధారాలు ఇవ్వడు. గట్టిగా నిలదీస్తే అనుచరులతో కోర్టు కేసులు వేయించి వేధింపులకు పాల్పడుతుంటాడు. సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన పలువురు చిరుద్యోగులు తాము అప్పు చెల్లించినా వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొంటూ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసు కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ రంగంలోకి దిగి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి నోట్లు, చెక్కులు, పాస్‌పుస్తకాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. కొత్తపేట పోలీసులు కె.ఎల్.రావునగర్ కుండల మార్కెట్ ప్రాంతానికి చెందిన కానుళ్ల కోటేశ్వరరావు మెడికల్ షాపుపై దాడి చేసి పెద్ద మొత్తంలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు, రోజువారీ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. -
బాణాసంచా గోదాము సీజ్: ఒకరి అరెస్ట్
ఎంవీపీ కాలనీ (విశాఖ) : విశాఖ నగరం గాజువాక ప్రాంతం బీసీరోడ్డులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు పట్టుకున్నారు. వై.శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఇంట్లో రూ.1.50 లక్షల విలువైన బాణాసంచాను ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బాణాసంచాను సీజ్ చేసి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును గాజువాక పోలీసులకు బదిలీ చేశారు. -
టిప్పర్‌తో పరారైన వ్యక్తి అరెస్ట్
రాజేంద్రనగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టిప్పర్ మాయం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నార్సింగ్‌లో రెండు నెలల క్రితం టిప్పర్ అదృశ్యం కాగా, ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో నిందితుడు శివాజీని పోలీసులు సోమవారం నార్సింగ్‌లో అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చెప్పిన వివరాల ఆధారంగా టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
'కౌన్ బనేగా..' పేరుతో మోసం
అల్లీపురం: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎమ్మెస్సీ విద్యార్థినిని 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం పేరుతో మోసగించిన నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్ చక్రవర్తి కొన్ని రోజుల క్రితం ఆంధ్రా వర్సిటీ ఎమ్మెస్సీ విద్యార్థిని ఇంద్రజకు ఫోన్ చేసి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నామని.. ప్రైజ్ మనీ వచ్చిందని, దాన్ని పంపేందుకు అవసరమైన డీడీ, రవాణా చార్జీలు చెల్లించాలని కోరాడు. అయితే అది నమ్మి ఇంద్రజ కొంత మొత్తంలో నగదును అతడికి పంపింది. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కోల్‌కతాలో దాగున్న ప్రదీప్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. -
లాటరీ పేరిట రూ.12 లక్షల దోపిడీ
అల్లీపురం (విశాఖపట్నం) : లాటరీ పేరిట ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పనిచేసే ఓ ఉద్యోగి నుంచి రూ.12 లక్షల మేర దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కోస్ట్‌గార్డ్‌లోని స్లీప్ మెయిల్లో పనిచేసే బుద్ధా వెంకట శివ సంతోష్‌కు రూ.40 లక్షల లాటరీ వచ్చిందని కోల్‌కతాకు చెందిన ఉదయ్‌కుమర్ గుప్తా అనే వ్యక్తి నమ్మించాడు. అయితే ఆ మొత్తం పంపించేందుకు పన్నులు, అదీ, ఇదీ అంటూ రూ.12 లక్షలు రాబట్టడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కోల్‌కతాకు వెళ్లి ఉదయ్‌కుమార్ గుప్తాను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. -
యువతిపై అత్యాచారయత్నం
కరీంనగర్ : మానసికస్థితి సరిగా లేని ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి యత్నించారు. యువతి సోదరి చూడడంతో ఆమె వారి చెర నుంచి బయటపడింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాగర్, నరేష్ న్యూమారేడు పాక గ్రామానికి చెందిన మతిస్థిమితంలేని యువతిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళుతుండగా యువతి సోదరి చూసి కేకలు పెట్టింది. స్థానికులు వారిని అడ్డగించగా నరేష్ పరారయ్యాడు. సాగర్ దొరకడంతో అతడ్ని పోలీసులకు అప్పగించారు. -
నాటు తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
అనంతపురం : నాటు తుపాకులు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వడ్డె సుంకన్న(42) అనే వ్యక్తి గతంలో కూడా నాటు తుపాకుల విక్రయానికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉండగా.. తాజాగా మంగళవారం అతని వద్ద తుపాకులు ఉన్నాయనే సమాచారంతో దాడి చేసిన పోలీసులకు రెండు నాటు తుపాకులు లభించాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరుల సమావేశంలో తెలిపారు. -
580 పైరసీ డీవీడీలు స్వాధీనం
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నుంచి 580 పైరసీ డీవీడీలు స్వాధీనం చేసుకున్నారు. బాహుబలి, శ్రీమంతుడు, ధనలక్ష్మి తలుపుతడితే, సినిమా చూపిస్త మావ లాంటి తెలుగు సినిమాలకు సంబంధించిన డీవీడీలు సదరు వ్యక్తి వద్ద ఉన్నాయి. విజయవాడలోని కుమ్మరవీధికి చెందిన సురేష్ బాబు చెన్నై నుంచి పైరసీ డీవీడీలు తీసుకొస్తుండగా కొత్తపేట వద్ద పోలీసులకు పట్టుబడ్డాడు. సురేష్‌పై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. -
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
నాగోలు/ హయత్‌నగర్ : అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి 50 బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఘటన ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... బండ్లగూడలోని తన నివాసంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బంటు సోమయ్య ఇంటిపై దాడి చేసి 50 బాటిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయారు
ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి) : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి నిర్వహించిన రీసెట్- 2015లో ఒక విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటనపై ఎస్వీయూ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు... ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీలో ప్రవేశానికి గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కాగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఫిజిక్స్ పాఠ్యాంశానికి సంబంధించిన ప్రవేశ పరీక్షకు ఆనంద్‌రావు అనే విద్యార్థి హాజరుకావాల్సి ఉంది. అయితే అతని స్థానంలో సిద్ధయ్య అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించారు. ఎస్వీయూ వీసీ రాజేంద్ర, రిజిస్ట్రార్ దేవరాజులు, అడ్మిషన్ డెరైక్టర్ భాస్కర్‌రెడ్డి ఈ సంఘటనపై విచారణ జరిపి, ఇంకో విద్యార్థి పరీక్ష రాస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. సదరు విద్యార్థిని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. -
యువతులను ఫోన్లో వేధిస్తున్న ప్రబుద్ధుడు అరెస్ట్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : ఫోన్లో యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన నందమాల గోపి అలియాస్ వంశీ(25) సూరారం కాలనీలో నివసిస్తూ జగద్గిరిగుట్టలోని వినాయక మెటల్స్‌లో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్‌లో అద్దెకుండేవాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సూరారం ప్రాంతానికి మకాం మార్చాడు. కాగా ఇతనికి ఇటీవల రోడ్డుపై ఒక సిమ్‌కార్డు దొరికింది. అది పని చేస్తుండటంతో రాత్రిపూట తన ఫోన్లో ఆ సిమ్ కార్డు వేసి ఇందిరానగర్‌కు చెందిన ఓ యువతికి అసభ్యకర సందేశాలతో పాటు ఫోన్లు కూడా చేస్తున్నాడు. నెల రోజుల నుంచి ఆ యువతికి ఫోన్ చేసి వేధిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అంతే కాకుండా చాలా మంది యువతుల నంబర్లు సేకరించి వారికి కూడా ఫోన్లు చేస్తున్నాడు. పలువురి కాపురాల్లో చిచ్చు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇందిరానగర్‌కు చెందిన ఇద్దరు యువతులు తమకు వస్తున్న అసభ్యకర ఫోన్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాల్‌డేటా సేకరించిన బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు గోపి అలియాస్ వంశీని నిర్భయచట్టం కింద అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్..
జీడిమెట్ల (హైదరాబాద్) : అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పద్మానగర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉండే సుబ్బారావు(50) అనే వ్యక్తి గత కొంతకాలంగా అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు గురువారం దాడి చేసి అతని వద్ద నుండి మూడు పెద్ద సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సుబ్బారావును పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.