అమీర్‌పేట (హైదరాబాద్) : ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడ్డ యువకుడిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. పంజగుట్ట ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి ప్రశాంత్ నగర్‌కు చెందిన ఎం.కిరణ్‌కుమార్,లైఫ్‌లైన్ ఫార్మాలో పనిచేసే శేఖర్‌రెడ్డిలు వొడాఫోన్ సంస్థలో పనిచేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే సెల్‌ఫోన్ ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని చెప్పడంతో ఎల్లారెడ్డిగూడకు చెందిన పి.వి.రామకృష్ణ వారి వలకు చిక్కాడు. అతడి నుంచి వారు రూ.3,500 వసూలు చేశారు. అయితే రామకృష్ణకు నిందితుల తీరుపై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.
ఆ మేరకు నిందితుడు కిరణ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం ఒక సిమ్ తీసుకుని అమీర్‌పేటకు రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నగదుతోపాటు సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాన్సీ నంబర్లు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని వేరే సిమ్ కార్డులు అంటగడుతున్నారని ఏసీపీ తెలిపారు. కాగా ఫ్యాన్సీ నంబర్లు కావాలంటే బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పరారీలో ఉన్న శేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
ఫ్యాన్సీ సెల్ నంబర్ల పేరుతో మోసం
Published Fri, Jan 8 2016 7:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
Advertisement