fancy numbers
-
రవాణాశాఖలో ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో కొందరు అధికారులు, ఓ ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలిసి ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు వాహన దారులు కోట్ చేసిన ధరను రహస్యంగా ఉంచాల్సింది పోయి, ఆ మొత్తాన్ని అనుకూల వాహనదారుల చెవిన పడేసి ఆ నంబర్ వారికే దక్కేలా పావులు కదిపారు. ఇలా ఒక్కో నంబర్ కేటాయింపు ద్వారా భారీగా కమీషన్లు దండుకున్నారు. ఇదంతా ఓ అధికారి కనుసన్నల్లో జరిగిందని తేల్చుకున్న ప్రభుత్వం ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం గుట్టు విప్పే పని ఇప్పుడు వేగంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు భారీగా అక్రమాలను సాగించారని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. గతంలో రవాణాశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన ఓ అధికారిపై భారీగా ఫిర్యాదులున్నాయి.కమిషనర్‌ను కూడా లెక్క చేయకుండా ఆ అధికారే అన్ని చక్కబెట్టేవారన్న ఆరో పణలున్నాయి. సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇదే తరహాలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు వ్యవహారం కూడా చోటుచేసుకుంది. ఆ అధికారికి చెందిన ఓ బినామీ సంస్థ కూడా ఈ శాఖలో కీలకంగా వ్యవహరించిందని సమాచారం. రూ.కోట్లలో కమీషన్లురవాణా శాఖ కార్యాలయాలకు సాంకేతిక సహకారాన్ని అందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బందిని ఓ అధికారి తన అక్రమాలకు వినియోగించుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. సెంటిమెంటు ఆధారంగా వాహనదారులు తమకు ఇష్టమైన నంబరును పొందేందుకు ఆసక్తి చూపుతారు. 0001, 9999, 0099, 5555... ఇలాంటి నెంబర్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఏటా దాదాపు లక్ష వరకు నంబర్లను వేలంలో ఉంచటం ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది.ఈ నంబర్ల కేటాయింపు బిడ్డింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి నంబరు దక్కుతుంది. రవాణాశాఖ ప్రధాన సర్వర్ వద్ద విధుల్లో ఉండే ప్రైవేటు సంస్థ సిబ్బంది బిడ్డింగ్‌లో కోట్ చేసిన మొత్తాన్ని ఆ అధికారికి చేరవేసేవారు. అప్పటికి బిడ్‌లో నమోదైన గరిష్ట మొత్తాన్ని తెలుసుకుని అనుకూల వాహనదారులకు చేరవేయటం ద్వారా నంబర్ అలాట్ అయ్యే మొత్తం కోట్ చేసేలా చక్రం తిప్పేవారు. ఇలా కోరిన వారికి నంబర్ ఇప్పించి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేసే వారు. అలా ఏటా రూ.కోట్లలో జేబుల్లో వేసుకునేవారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా కొందరిని గుర్తించింది. ప్రస్తుతానికి 56 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల(డీబీఏ)లను విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిసింది. త్వరలో మరికొందరిపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమా చారం. సూత్రధారిగా ఉన్న అధికారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. -
TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం
-
కారు రిజిస్టర్ నెంబర్ ఖరీదు రూ. 6 లక్షలు - ఆ నెంబర్ ఏదంటే?
Mahindra Scorpio N: ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా వాహనాలన్నా, నెంబర్ ప్లేట్స్ అన్నా ఎక్కువ క్రేజుంది. ఇందులో భాగంగానే తక్కువ ధరకు కొనుగోలు చేసే వాహనాలకు కూడా అంతకు మించి డబ్బు వెచ్చించి నెంబర్ ప్లేట్స్ కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. అలాంటి మరో సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 6 లక్షల నెంబర్ ప్లేట్ నివేదికల ప్రకారం ఇటీవల రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన మహీంద్రా స్కార్పియో కారుకి ఏకంగా రూ. 6 లక్షలు వెచ్చించి నెంబర్ ప్లేట్ కొనుగోలు చేశారు. ఇది మాత్రమే కాకుండా తన కారు చూసేవారిని వెంటనే ఆకట్టుకోవాలని ప్రత్యేకంగా కస్టమైజ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో తరుణ్ వ్లాగ్స్3445 అనే తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లయితే మహీంద్రా స్కార్పియో 'RSY 0017' అనే ప్రత్యేకమైన రిజిస్టర్ నెంబర్ చూడవచ్చు. ఇది సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లకు భిన్నంగా ఉంది, ఈ కారణంగానే దీనికి రూ. 6 లక్షలు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఈ SUV దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందింది. ఇక్కడ వీడియోలో కనిపించే కారు స్కార్పియో ఎన్ Z4 ట్రిమ్ పెట్రోల్ మోడల్ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఖరీదైన కారు నెంబర్ ప్లేట్ అక్షరాలా రూ. 122 కోట్లు) మహీంద్రా స్కార్పియో ఎన్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 200 బీహెచ్‌పి పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. స్కార్పియో ఎన్ ప్రారంభ ధర రూ. 13.05 లక్షలు, కాగా Z4 ట్రిమ్ పెట్రోల్ ధర రూ. 14.65 లక్షల నుంచి ప్రారంభమవుతుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). -
ఫ్యాన్సీ నంబర్లకు పెరిగిన క్రేజ్.. ఎన్ని రూ.లక్షలు పెట్టేందుకైనా రెడీ..!
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన కాన్వాయ్‌లోని వాహనాలన్నింటికీ వాడుతున్న ఫ్యాన్సీ నంబర్ 6666.. ఈ సంఖ్యకు ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు పోటీ ఉంది. ఉమ్మడి ఏపీలో రాజకీయరంగ ప్రవేశం అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తన వాహనాలకు వాడిన నంబర్లు 999, 9999... ఇటీవల టీఎస్ 09 ఎఫ్‌జెడ్ 9999 అనే ఫ్యాన్సీ నంబర్ కోసం ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఓ సంస్థ వెచ్చించిన మొత్తం రూ. 9,50,999. గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో టీఎస్ 09 ఎఫ్ఎక్స్ 9999 అనే నంబర్‌కు పలికిన ధర ఏకంగా రూ.13.50 లక్షలు. టీఎస్ 09 జీఏ 0001 నంబర్ పొందేందుకు ఒక సంస్థ రూ.7.25 లక్షలు చెల్లించగా టీఎస్ 09 జీఏ 0007 అనే నంబర్ కోసం మరో సంస్థ రూ. 1.35 లక్షలు వెచ్చించింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. లగ్జరీ వాహనాలకు నంబర్లు కూడా ప్రత్యేకంగా ఉండాలనే ఆకాంక్ష వాహనదారుల్లో పెరుగుతోంది. సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై విశ్వాసం వల్లనో లేదా అదృష్టం కలసి వస్తుందనే నమ్మకంతోనో, సామాజిక హోదాను చాటేందుకో వాహనదారులు ప్రత్యేక నంబర్లపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీనటులు, రాజకీయ నాయకులు, సాఫ్ట్వేర్ సంస్థలు ఈ తరహా నంబర్లపట్ల ఎక్కువ ఆదరణ చూపుతున్నాయి. ఆర్టీఏకు భారీ ఆదాయం.. రవాణా శాఖ ప్రతి మూడు నెలలకోసారి విడుదల చేసే ప్రత్యేక నంబర్లలో ఆన్లైన్ (9999) నంబర్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తోంది. ఈ నంబర్ ప్రతి సిరీస్‌లోనూ దాదాపు రూ. 10 లక్షలు పలుకుతోంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉన్న 2020–21 ఆర్థిక సంవత్సరం మినహాయించి రవాణాశాఖకు ఏటా ఆదాయం పెరుగుతోంది. నాలుగైదేళ్ల క్రితం వరకు పెద్దగా ఆదరణలేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ లభిస్తోంది. ప్రత్యేక నంబర్ల వేలం నిర్వహించిన ప్రతిసారీ ఖైరతాబాద్ కార్యాలయంలోనే సుమారు రూ. 30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం లభిస్తోంది. ఒక్కో నంబర్‌కు 10 మంది పోటీ.. ఆర్టీఏలో విడుదల చేసే కొత్త సీరిస్ నంబర్లలో 2,500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటున్నాయి. ఒక్కో నంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చిన నంబర్లు లభించని వాహనదారులు తదుపరి వేలం కోసం 3 నెలల నుంచి 6 నెలల వరకు కూడా ఎదురు చూస్తున్నారు. అదృష్టం కోసమే ఎక్కువ మంది.. ► జ్యోతిషాన్ని నమ్మేవారే ఎక్కువగా తమ గ్రహస్థితి ప్రకారం అదృష్ట సంఖ్య పేరిట ఫ్యాన్సీ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ► ఒకటో నంబర్‌ను నాయకత్వానికి, రెండో నంబర్‌ను శాంత స్వభావానికి, 3ను తెలివితేటలకు, ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తున్నారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్న వాళ్లు, పోరాడేతత్వం ఉన్నవాళ్లు ‘9’ని కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తూ ఈ నంబర్‌ను ఇష్టపడుతున్నారు. వాహనాలకు ఆయా నంబర్ల వాడకం వల్ల తాము వృద్ధిలోకి వస్తామని చాలా మంది నమ్ముతున్నారు. నంబర్లే బహుమతులు.. ► ఇటీవల కాలంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందించడంతోపాటు వారి పుట్టినరోజు కలిసొచ్చే విధంగా రిజి్రస్టేషన్ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ► ‘1313’నంబర్ అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీన్ని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ► ‘5121’అనే నంంబర్ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లకు కూడా ఎంతో క్రేజ్ ఉంది. క్రేజ్ పెరిగింది.. గతంకంటే ఇప్పుడు ఫ్యాన్సీ నంబర్లకు అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది.లగ్జరీ వాహనాలు బాగా పెరిగాయి. ఏటా 10 వేలకుపైగా ఖరీదైన కార్లు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. అలాగే రూ. 50 లక్షల విలువైన బైక్‌లు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ వాహనాల స్థాయికి తగినట్లుగానే వాహనదారులు నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. – జె.పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: హైదరాబాద్‌లో ఈస్ట్‌జోన్‌వైపే మధ్యతరగతి ప్రజల ఆసక్తి -
తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజైన శనివారం.. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 9న శాఖల వారీగా ప్రభుత్వ పద్దులపై చర్చ ప్రారంభం కాగా, మొత్తం 37 పద్దులను ఆమోదించారు. అసెంబ్లీలో శనివారం రాత్రి 11.48వరకు వార్షిక బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసనసభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు చర్చకు రానుండటంతో పద్దుల ఆమోదానికి చర్చ కొనసాగింది. ఇక, శనివారం సభలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటే.. వాహనాలు మాత్రం ఒక కోటి 53 లక్షలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఫ్యాన్సీ నెంబర్ల ద్వారా ఈ బిడ్డింగ్ విధానంలో ప్రభుత్వానికి రూ. 231 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఆర్టీసీకి ప్రతి రోజు కోటి 77 లక్షల రూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేశారు. మరోవైపు.. తెలంగాణలో ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు చెప్పుకొచ్చారు. త్వరలో 1,360 ఎలక్ట్రిక్ అద్దె బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తామన్నారు. తెలంగాణవ్యాప్తంగా 26 ఆర్టీసీ డిపోలు లాభల్లోకి వచ్చాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారంలో శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. -
వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే క్రేజ్.. ఒక్కరోజే 31 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్ పెరిగింది. వాహనదారులకు ఇష్టమైన నంబర్‌తో పాటు, లక్కీ నంబర్, పుట్టిన తేదీ, కలిసి వచ్చే నంబర్‌తో గుర్తింపు దక్కాలని చూస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి తమకు కావాల్సిన నంబర్లను వేలం ద్వారా దక్కించుకుంటున్నారు. సాధార ణంగా వాహనాల రిజిస్ట్రేషన్ల ద్వారా రవాణా శాఖకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంటే.. ఫాన్సీ నంబర్ల ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. తాజాగా ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. ప్రతి సిరీస్‌లో ఎంతో డిమాండ్ ఉండే ఆల్‌నైన్ ఈసారి కూడా అ‘ధర’హో అనిపించింది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రత్యేక నెంబర్లకు నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ‘టీఎస్ 09 ఎఫ్‌జడ్ 9999’ నెంబర్‌కు ప్రీమియర్ ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రూ.9,50,999 చెల్లించి సొంతం చేసుకుంది. అలాగే ‘టీఎస్ 09 జీఏ 0001’ నెంబర్ కోసం రాజేశ్వరి స్కిన్ అండ్ ఎయిర్క్యూర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్లైన్ వేలంలో రూ.7,25,199 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్09 జీఏ 0009’ నెంబర్ కోసం ఎం.వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2.20,111 చెలించింది. ‘టీఎస్09 జీఏ 0007’ నెంబర్ కోసం స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,35,007 చెల్లించి నెంబర్‌ను దక్కించుకుంది. ‘టీఎస్ 09 జీఏ 0003’ నెంబర్ కోసం ధని కన్సల్టేషన్స్ ఎల్ఎల్పీ రూ.1,35,000 చెల్లించి సొంతం చేసుకుంది. ప్రత్యేక నెంబర్లపైన శుక్రవారం ఒక్క రోజే రూ.31,66,464 లభించినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగ్‌నాయక్ తెలిపారు. -
RTO Bandlaguda: ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్రేజీ నంబర్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 29 ప్రత్యేక నెంబర్లపైన రూ.8,40,167 ఆదాయం లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0001’ నెంబర్ కోసం ఒక వాహనదారుడు రూ.2,82,786 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0009’ నెంబర్ కోసం మరో వాహనదారుడు రూ.1,69,999 చెల్లించినట్లు జేటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ దక్షిణమండలం జోన్ అయిన బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోనూ ప్రత్యేక నెంబర్లపైన పోటీ కనిపించడం విశేషం. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 నంబరుకు రేజర్ గేమింగ్ సంస్థ రూ.3,50,000 చెల్లించింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్) -
వాహనదారులకు అలర్ట్.. పెరిగిన ఫ్యాన్సీ నంబర్ల రేట్లు!
అనంతపురం సెంట్రల్: వాహనం ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కారు కొన్నాక నచ్చిన నంబర్ ఉండాలన్నది మరో సెంటిమెంట్. లక్కీ నంబర్ కావాలని చాలామంది ఆశ పడుతుంటారు. ఇందు కోసం ఎంత డబ్బు అయినా వెచ్చించడానికి వెనుకాడరు. ఏడాది క్రితం రూ.50 వేలు ప్రారంభ ధర ఉన్న 9999 నంబర్ వేలంలో రూ.7.20 లక్షలు పలికింది. అనంతపురానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఈ నంబర్ కోసం పోటీ పడి మరీ దక్కించుకున్నాడు. ఫ్యాన్సీ నంబర్ రూపంలో రవాణా శాఖకు ఏటా రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ఎక్కువశాతం సంపన్నులు ఈ నంబర్లకు పోటీ పడుతున్నారు. గతంలో ఉన్న రేట్లను సవరిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని అనంతపురం ఆర్టీఓ సురేష్ నాయుడు తెలిపారు. సవరించిన ధరలు ఇలా.. - 9999 నంబరుకు రూ. 2 లక్షలు - 1, 9, 999 నంబర్లకు రూ. 1 లక్ష - 99, 3333, 4444, 5555, 6666, 7777 నంబర్లకు రూ.50వేలు - 5, 6, 7, 333, 369, 555, 666, 777, 1116, 1234, 2277, 2345, 2727, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888 నంబర్లకు రూ.20 వేలు - 3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999,7999, 9009 నంబర్లకు రూ.15వేలు - 2, 4, 8, 18, 27, 36, 45, 77, 143, 222, 444, 786, 789, 909, 1122, 1233, 1269, 1314, 1359, 2223, 2255, 2349, 3344, 3399, 3555, 3789 నంబర్లకు రూ.10 వేలు చొప్పున ప్రారంభ ధరలుగా నిర్ణయించారు. పోటీని బట్టి సదరు నంబర్‌కు ఎంత ధర అయినా పలకవచ్చు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!
నిర్మల్ చైన్‌గేట్: ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చిస్తుంటారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎన్ని డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకుంటారు. నిర్మల్ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు. టీఎస్18–జీ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్మల్ ఆర్టీవో అజయ్‌రెడ్డి సమక్షంలో ఆన్లైన్లో వేలం నిర్వహించారు. శ్రీపతి సంతోష్‌కుమార్ రూ.4,80,000కు దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అలాగే టీఎస్18–హెచ్ 0009 నంబర్‌ను వెంకట సత్యశ్రీధర్ వర్మ రూ.3,15,999కి దక్కించుకున్నాడు. టీఎస్18–హెచ్ 0001 నంబర్‌ను తడ్క నాగజ్యోతి రూ.2,02,000కు, 0002 నంబర్‌ను విజయ్ భాస్కర్‌రెడ్డి రూ.1,05,000కు, 0008ను కొంతం ప్రణయ్‌రెడ్డి రూ.12,124కు, 0007ను పూర్ణమ్మ రూ.55,678కు, 0004 ను తుంగెన ధర్మారావు రూ.16,434కు పొందారు. (క్లిక్: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ) -
ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం.. 9999 @ రూ.10,49,999
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల వేలం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి కాసుల వర్షం కురిపించింది. బుధవారం నిర్వహించిన వేలం పాటలో పలు ఫ్యాన్సీ నంబర్ల విక్రయం ద్వారా మొత్తంగా రూ.30.83 లక్షల ఆదాయం లభించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందని చెప్పారు. టీఎస్ 09 ఎఫ్‌వీ 0009 నంబరును రూ.3,50,0005 చెల్లించి సీహెచ్ అనంతయ్య అనే వినియోగదారుడు దక్కింకుకున్నారని పేర్కొన్నారు. టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 నంబరును రూ,3,50,000కు రేజర్ గేమింగ్ సంస్థ దక్కించుకుందని తెలిపారు. వీటితోపాటు పలు ఇతర నంబర్లను కూడా వేలం వేశామని చెప్పారు. -
వాహనం అమ్మేసినా...నంబర్ ఉంచేసుకోవచ్చు!
అహ్మదాబాద్: ముచ్చటపడి కారు, బండి (ద్విచక్ర వాహనం) కొనుక్కుంటాం. దానికి ఫ్యాన్సీ నంబరు ఉండాలనో, సంఖ్యాశాస్త్రం ప్రకారం తమకు అచ్చివచ్చే నంబరు ఉండాలనో, మతపరమైన విశ్వాసాలతోనో, సెంటిమెంటుతోనో ప్రభుత్వం నిర్ణయించిన ధర కట్టి వాటిని సొంతం చేసుకుంటాం. ఆల్స్ (1111, 2222...)కు అయితే మంచి క్రేజ్. అదే 9, 99, 999... ఆల్ నైన్స్ అయితే వేలంలో ఎంతకు అమ్ముడవుతాయో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు, సెలబ్రిటీలు లక్షలు పోసి నంబరును సొంతం చేసుకుంటారు. సరే.. కొన్నేళ్లు పోయాక వాహనం పాతబడుతుంది. మరోటి కొంటారు. మళ్లీ దానికి అదే నంబరు ఉండాలనుకునే వారు ఎంతోమంది ఉంటారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా వేరే సిరీస్‌లో సేమ్ నంబర్ తీసుకుంటారు. అలాకాకుండా మన పాత నంబర్‌ను మనమే ఉంచుకోగలిగితే! చాలా బాగుంటుంది కదూ! గుజరాత్ ప్రభుత్వం సోమవారం ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పాత వాహనాన్ని అమ్మివేసినా, మూలకుపడ్డాక (జీవితకాలం తీరిపోయాక) తుక్కుకింద తీసివేసినా... దాని తాలూకు నంబర్‌ను సదరు యజమాని కొనుగోలు చేసే కొత్త వాహనానికి బదిలీ చేసుకోవచ్చని గుజరాత్ రవాణా శాఖ మంత్రి పూర్ణేష్ మోదీ వెల్లడించారు. ఈ విధానం ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్లో అమల్లో ఉంది. గరిష్టంగా రూ.40 వేలు కడితే చాలు తమపేరిట కేటాయింపు ఉన్న నంబర్లను కొత్తగా కొన్న వాహనాలకే బదిలీ చేసుకోవచ్చని, సెకండ్ హ్యాండ్ వెహికిల్స్‌కు మళ్లించానికి వీల్లేదని చెప్పారు. పాత నంబరు కారుకు ఉంటే దాన్ని ఇంకో కారుకే బదలాయించాలి తప్పితే ద్విచక్ర వాహనానికి మార్చడానికి వీల్లేదు. కనీసం ఏడాది పాటు తమవద్ద వాహనం ఉంటేనే దాని నంబరును మార్చుకోవడానికి అర్హులవుతారు. గుజరాత్లో ద్విచక్ర వాహనాలకు గోల్డెన్ కేటగిరీ ఫ్యాన్సీ నంబర్లకైతే రూ. 8 వేలు, సిల్వర్ కేటగిరీ నంబర్లకు రూ.3,500, ఇతర నంబర్లకు రూ. 2,000 చెల్లించాలి. అదే కార్లు, ఇతర ఫోర్ వీలర్లకయితే గోల్డెన్ కేటగిరీ నంబర్లకు రూ. 40 వేలు, సిల్వర్‌కు రూ. 15 వేలు, ఇతర నంబర్లకు రూ. 8 వేలు చెల్లిస్తే పాత నంబరును ఉంచేసుకోవచ్చు. -
ఆర్టీఏ ఆన్లైన్ బిడ్డింగ్‌లో గందరగోళం
► ఇటీవల నగరంలోని ఓ ఆర్టీఏ కేంద్రం పరిధిలో కూకట్పల్లి ప్రాంతానికి చెందిన ఓ వాహనదారు తనకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యాహ్నం వేలం నిర్వహించే సమయానికి మొబైల్ ఫోన్‌కు ఎలాంటి సమాచారం అందకపోవడంతో పోటీలో పాల్గొనలేకపోయారు. దీంతో నచ్చిన నంబర్‌ను కోల్పోయారు. ► బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన మరో వాహనదారుకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రధానంగా ‘9999’, ‘9’, ‘1111’, ‘6666’, ‘1234’ వంటి నంబర్లకు ఎంతో డిమాండ్ ఉంటుంది. గతంలో ఆల్‌నైన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో ఏకంగా రూ.10 లక్షల వరకు వేలంలో పోటీపడి సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రియల్ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నచ్చిన నంబర్లను సొంతం చేసుకొనేందుకు పెద్ద మొత్తంలోనే చెల్లించేందుకు సిద్ధపడతారు. కానీ ఆన్లైన్ బిడ్డింగ్‌లో పోటీ తగ్గుముఖం పట్టినట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నంబర్లపై నిర్వహించే ఆన్లైన్ బిడ్డింగ్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బిడ్డింగ్‌లో ప్రదర్శించే నంబర్ల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోటీలో పాల్గొనలేకపోతున్నట్లు వాహనదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నంబర్లపై ఎలాంటి పోటీలు కూడా నిర్వహించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారులు తమకిష్టమైన నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరైన సమాచారం లేకపోవడంతో ఇందులో పాల్గొనలేకపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్) అప్పుడలా.. ► మూడేళ్ల క్రితం అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేక నంబర్లకు ప్రత్యక్షంగా వేలం నిర్వహించేవారు. వాహనదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి మధ్యాహ్నం 3 గంటలకు పోటీ నిర్వహించేవారు. ఈ పోటీలో వాహనదారులంతా స్వయంగా పాల్గొనేందుకు అవకాశం ఉండడంతో ఏ వాహనదారు ఎంత మొత్తానికి బిడ్డింగ్‌లో పాల్గొని నంబర్‌ను సొంతం చేసుకున్నాడనేది స్పష్టంగా తెలిసిపోయేది. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) ► మరోవైపు నంబర్ల బిడ్డింగ్ నిర్వహణలో పారదర్శకత కోసం అధికారులు సైతం ఎలాంటి దాపరికానికి తావు లేకుండా బహిరంగంగా వేలం నిర్వహించేవారు. దీంతో ప్రత్యేక నంబర్లపైనే రవాణా శాఖకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం లభించింది. నంబర్ల సీరిస్‌లో ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రతి ప్రత్యేక నంబర్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. రూ.30 వేల ఫీజు ఉన్న నంబర్లకు పోటీలో రూ.5 లక్షలు డిమాండ్ ఉండేది. సింగిల్ నైన్, ఆల్‌నైన్స్ కోసం ప్రతి సిరీస్‌లో కనీసం 10 మంది వాహనదారులు పోటీపడేవారు. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ఇప్పుడిలా.. ► ప్రత్యేక నంబర్లపై నిర్వహించే బిడ్డింగ్‌ను మూడేళ్ల క్రితం ఆన్‌లైన్‌లోకి మార్చారు. మొదట హైదరాబాద్ ఆర్టీఏలో అమలు చేసి ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు విస్తరించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండాపోయింది. ► సాంకేతిక వైఫల్యాల కారణంగా వాహనదారులకు సకాలంలో సరైన సమాచారం లభించడం లేదు. దీంతో ఎక్కువ మంది పోటీలో పాల్గొనలేకపోతున్నారు. దీనిపై కొంతమంది వాహనదారులు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. -
ఫ్యాన్సీ నెంబర్ డిమాండ్ మాములుగా లేదుగా.. ‘9999’ కోసం ఏకంగా..
1,2,3,4,5,6,7,8,9 వంటి ప్రతి సింగిల్ అంకెకు ఓ లక్షణం ఉంటుందని వాహనదారుల విశ్వాసం. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంత స్వభావానికి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివి తేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ సంఖ్య వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరూ ఇష్టపడే అంకె ‘9’. కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీమనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నంబర్‌ను ఇష్టపడతారు. సాక్షి, హైదరాబాద్: ‘టీఎస్ 09 ఎఫ్ఆర్ 9999’.. కోవిడ్ కాలంలోనూ తాజాగా ఈ సంఖ్య కోసం చాలామంది పోటీపడ్డారు. చివరకు ఓ వాహనదారు రూ.7.6 లక్షలతో సొంతం చేసుకున్నారు. ఆల్‌నైన్ నంబర్ మరోసారి ఆల్టైమ్స్ రికార్డును సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే ఈ సంఖ్య కోసం పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది. గతంలో రూ. 9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు కూడా వేలంలో పోటీపడ్డ సందర్భాలూ ఉన్నాయి. ‘టీఎస్09ఎఫ్ఎస్ 0009’ అనే మరో సంఖ్యకు సైతం లాక్డౌన్ తర్వాత మొదటిసారి అనూహ్యమైన డిమాండ్ లభించింది. మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.6.5 లక్షలకుపైగా వేలంలో పోటీ పడి నంబర్‌ను దక్కించుకోవడం గమనార్హం. తాజాగా నిర్వహించిన వేలంలో రవాణా శాఖకు ప్రత్యేక అంకెలపై ఒక్క రోజే సుమారు రూ.30 లక్షల మేర ఆదాయం లభించింది. కరోనా కారణంగా నగరంలో హై ఎండ్ వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో సహజంగానే ప్రత్యేక సంఖ్యలకు డిమాండ్ కూడా తగ్గింది. చాలా రోజుల తర్వాత ప్రత్యేక అంకెల కోసం పోటీ పెరిగిందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. పోటీ ఆన్లైన్లోనే.. వాహనాల నంబర్ల కోసం రెండేళ్ల క్రితం ఆన్లైన్ పోటీలను ప్రవేశపెట్టారు. వాహనదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే వేలంలో పాల్గొనవచ్చు. నంబర్ దక్కించుకోలేని వాహనదారులు చెల్లించిన డబ్బులు వారం రోజుల్లో తిరిగి వాళ్ల ఖాతాల్లో జమ అవుతాయి. దీంతో ఆన్లైన్ పోటీలకు సైతం క్రమంగా డిమాండ్ పెరిగింది. మొదటి సంవత్సరం గ్రేటర్లో సుమారు రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభించింది. గతేడాది నుంచి కోవిడ్ విజృంభించడంతో ప్రత్యేక నంబర్లకు డిమాండ్ తగ్గింది. ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తిరిగి వాహనాల కొనుగోళ్లు పెరగడంతో నచి్చన నంబర్ల కోసం వాహనదారులు ఆసక్తిగా ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అదే క్రేజ్.. ► ఆల్‌నైన్ నంబర్‌కే కాదు.నాలుగైదేళ్ల క్రితం పెద్దగా ఆదరణ లేని నంబర్లకు సైతం ఇప్పుడు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోంది. ►‘టీఎస్ 09 ఎఫ్‌సీ 0001’ నంబర్ కోసం ఒక సంస్థ గతంలో ఏకంగా రూ.6.66 లక్షలు చెల్లించింది. ‘టీఎస్ 09 ఎఫ్‌సీ 0005’ నంబర్ కోసం మరో సంస్థ రూ.5.06 లక్షలు చెల్లించి గెలుచుకుంది. ► సంఖ్యాశాస్త్రం, జ్యోతిషంపై ఉండే విశ్వాసం, కొన్ని నంబర్ల వల్ల అదృష్టం కలిసి వస్తుందనే నమ్మకం వాహనదారుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ నంబర్లలంటే ఎంతో ఇష్టం.. ► 9, 1, 999, 9999, 786, 6, 666, 1111 వంటి అంకెలకు ఎక్కువ డిమాండ్ ఉంది. బీఎండబ్ల్యూ, ల్యాండ్‌రోవర్, ల్యాండ్ క్రూజర్, ఆడి వంటి ఖరీదైన వాహనాలే కాదు, బైక్‌ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. అదృష్ట జాతకంగా భావించే నంబరల కోసం కొందరు పోటీకి దిగితే సామాజిక హోదా కోసం, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లకు పోటీ పడుతున్నారు. కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని సంఖ్యల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజీకి కారణమే. నంబర్లే బహుమతులు.. ► కొంతమంది తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు. వారి పుట్టిన రోజు కలిసొచ్చేలా రిజిస్ట్రేషన్ నంబర్లను ఎంపిక చేసుకొంటున్నారు. ► ‘1313’ (తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ► ‘5121’ నంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు. ► ‘143’, ‘214’, ‘8045’ వంటి వాటికీ ఎంతో క్రేజీ ఉంది. ప్రత్యేక నంబర్లకు అదే డిమాండ్.. కోవిడ్ కారణంగా కొంత స్తబ్ధత వచ్చినా ప్రత్యేక అంకెలకు డిమాండ్ అలాగే ఉంది. ప్రత్యేకించి ‘9’ తో మొదలయ్యే ఖైరతాబాద్ పరిధిలో చాలామంది వాహనదారులు నచ్చిన నంబర్ల కోసం పోటీ పడతారు. ఇటీవల కాలంలో నగర శివార్లలోనూ డిమాండ్ పెరిగింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఒకే రోజు ప్రత్యేక నంబర్లపై రూ.30 లక్షల వరకు ఆదాయం లభించింది. – పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా... -
అరచేతిలో.. ఫ్యాన్సీ నంబర్!
గద్వాల క్రైం: కారు కొనాలనే ఆశయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆర్థికంగా ఉన్న వారు మాత్రం ఫ్యాన్సీ నంబర్ కోసం రూ.లక్షలు వెచ్చించి దక్కించుకునేందుకు వెనకడుగు వేయరు. అయితే ఇక్కడే పలువురు యజమానులు దళారుల వైపు.. ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయినప్పటికీ దళారులకు తెలిసిన సిబ్బంది ద్వారా ఫ్యాన్సీ నంబర్‌ను పెద్ద మొత్తంలో చెల్లించే యజమానులకు ఎలాగైనా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేయాలనే లక్ష్యంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి తెలంగాణ ట్రాన్స్‌పోర్టు శాఖ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సేవలు ఆన్లైన్ చేసి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టింది. తాజాగా ఫ్యాన్సీ నంబర్ విషయంలోనూ అందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్లోనే వాహనదారులకు ఉపయోగపడేలా కోరుకున్న నంబర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఈ విధానానికి ఈనెల 10న అనుమతులు జారీ చేయడంతో వాహన యజమానులు ఊరట చెందుతున్నారు. సేవలు ప్రారంభం.. ఫ్యాన్సీ నంబర్‌ను పొందేందుకు జిల్లా రవాణా శాఖలో ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ పూర్తయి మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. అనంతరం కోరుకున్న నంబర్‌ను త్వరగా పొందవచ్చు. ఇక ఎక్కడి నుంచైనా ఆన్లైన్ నంబర్‌ను ఎంపిక చేసుకునే ఆవకాశం ఉండటంతో వాహనదారులకు ఎంతో ఉపయోగపడనుంది. సద్వినియోగం చేసుకోవాలి వాహనాల రిజిస్ట్రేషన్‌లో భాగంగా ఫ్యాన్సీ నంబర్లు ఆన్లైన్లో రిజర్వు చేసుకునే అవకాశాన్ని కల్పించాం. ఈ విధానం ద్వారా వాహన యజమానులు కోరుకున్న నంబరును సులువుగా పొందవచ్చు. అలాగే 15 రోజుల్లో వాహనాన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. – పురుషోత్తంరెడ్డి, డీటీఓ -
ఆర్టీఏ ప్రత్యేక నంబర్లకు ఆన్లైన్ బిడ్డింగ్
సాక్షి, సిటీబ్యూరో: రవాణాశాఖ ప్రత్యేక రిజర్వేషన్ నెంబర్లకు ఇక ఆన్లైన్లోనే టెండర్లు నిర్వహించనున్నారు. ఈ నెల 10వ తేదీ సోమవారం నుంచి హైదరాబాద్ పరిధిలోని ఐదు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఒక నెల తరువాత రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏలకు దీనిని విస్తరిస్తారు. రిజర్వేషన్ నెంబర్లపై ప్రస్తుతం నిర్వహిస్తున్న టెండర్ ప్రక్రియ వల్ల అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ బిడ్డింగ్‌కు చర్యలు చేపట్టింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆన్లైన్ బిడ్డింగ్ విధివిధానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రవాణాశాఖ తాజాగా ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. కొత్త విధానం మేరకు వినియోగదారులు తమకు కావలసిన నెంబర్లను ఆర్టీఏ వెబ్సైట్లోనే ఎంపిక చేసుకోవచ్చు. నిబంధనల మేరకు ఫీజు చెల్లించి, వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు తదితర డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఒక నెంబర్‌పైన ఎంత మందైనా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్‌బ్యాంకింగ్ లేదా ఇతర ఆన్లైన్ పద్ధతుల్లోనే ఆర్టీఏ నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ బిడ్డింగ్‌ను ఆహ్వానిస్తారు. డిమాండ్ బాగా ఉన్న నెంబర్‌పైన వినియోగదారులు ఎంత మందైనా పోటీ పడవచ్చు. చివరకు ఎక్కువ మొత్తంలో బిడ్డింగ్ చేసిన వారికి నెంబర్లను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరిగిపోతుంది. బిడ్డింగ్‌లో నంబర్లను దక్కించుకోలేని వారికి వారు చెల్లించిన డబ్బులు ఆ తరువాత 48 గంటల్లో తిరిగి వాళ్ల ఖాతాలో జమ అవుతాయి. పోటీలో పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందచేస్తారు. అనూహ్యమైన డిమాండ్... ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారుల్లో అనూహ్యమైన డిమాండ్ ఉంది. ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో “9999’ నెంబర్‌కు వాహనదారులు రూ.10 లక్షల వరకు కూడా చెల్లించేందుకు పోటీపడుతున్నారు. ఖరీదైన హైఎండ్ కార్లను, బైక్‌లను కొనుగోలు చేస్తున్న వినియోగదారులు నచ్చిన నెంబర్ల కోసం ఎన్ని రు.లక్షలైనా వెచ్చించేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో రవాణాశాఖకు ప్రత్యేక నెంబర్లపైన ఏటా రూ.50 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. ‘0009, 999, 9999, 1234, 6666, 2233, 7777,1111’ వంటి నెంబర్లకు భారీ డిమాండ్ ఉంది. కొన్ని రకాల నెంబర్లను అదృష్ట సంఖ్యలుగా భావిస్తుండగా, మరికొన్ని రైజింగ్ నెంబర్లుగా, ఫ్యాన్సీ నెంబర్లుగా వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రత్యేక నెంబర్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దళారులు రంగంలోకి దిగారు. వాహనదారులకు కావలసిన నెంబర్ల కోసం ఒక బేరం కుదుర్చుకొని ఆ తరువాత ఆర్టీఏ అధికారుల సహకారంతో సదరు నెంబర్లకు పోటీ లేకుండా దక్కించుకోవడం లేదా, ఆ నెంబర్లకు ఆ రోజు యాక్షన్ నుంచి మినహాయింపును ఇచ్చేసి మరుసటి రోజు లెఫ్టో్టవర్ (మిగిలిపోయిన) నెంబర్లుగా ఎలాంటి బిడ్డింగ్ లేకుండా రూ.లక్షల్లో సొమ్ము చేసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆర్టీఏ కేంద్రాల్లో ఏజెంట్లు సిండికేట్‌గా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ బిడ్డింగ్‌కు శ్రీకారం చుట్టారు. 5 కేంద్రాల్లో అమలు ఇలా... నగరంలోని ఖైరతాబాద్, మెహదీపట్నం, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయాల్లో ఆన్లైన్ బిడ్డింగ్ సోమవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ ఐదు ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో వాహనదారులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకొని, ఫీజు చెల్లించి, బిడ్డింగ్‌లో పాల్గొనవలసి ఉంటుంది. ఒక నెంబర్ కోసం ఒక్కరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉండి, ఎక్కువ మొత్తంలో చెల్లించిన వారికి నెంబర్‌ను కేటాయిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఒక్కరే దరఖాస్తు చేసుకొంటే అలాంటి నెంబర్లు పోటీ లేకుండానే లభిస్తాయి. కాగా ఆన్లైన్ బిడ్డర్లు ఎవైనా సందేహాలుంటే నివృత్తి కోసం 040–23370081/83/84 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. -
నోట్ల రారాజు...!
లక్కవరపుకోట: ఆయన ఉద్యోగం బ్యాంకు మేనేజర్. నిత్యం నోట్లకట్టల మధ్యనే విధుల నిర్వహణ. ఆ నోట్లలో ఫ్యాన్సీ నంబర్ల సేకరణపై ఆసక్తి పెంచుకున్నారు. వివిధ రకాల ఫ్యాన్సీ, స్టార్ నోట్లు సేకరించి అందరినీ అబ్బుర పరుస్తున్నారు. గిన్నిస్ బుక్‌లో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయనే.. ఎల్.కోట ఎస్బీఐ పూర్వపు మేనేజర్ ఎస్ఎస్ఎన్ రాజు. ఆయన నోట్ల సేకరణ ఆసక్తిని ఓ సారి పరికిస్తే... చిత్రవిచిత్రమైన నంబర్ నోట్లు... ఒక్క రూపాయి నోటు నుంచి 2 వేల రూపాయల నోటు వరకు స్టార్స్ ఉన్న నోట్లు, ఫ్యాన్సీ నోట్లు ఆయన వద్ద ఉన్నాయి. మనం వినియోగిస్తున్న కరెన్సీ నోట్లు నంబర్ల మధ్యలో స్టార్ గుర్తులు అప్పుడుప్పుడూ కనిపిస్తాయి. స్టార్ గుర్తులు ఉన్న నోట్లు పరిశీలించి కొందరు ఆందోళనకు గురవుతుం టారు. అయితే, స్టార్ గుర్తు ఉన్న నోట్లు అరుదైనవి. లక్షల నోటుల్లో ఒక్కటి మాత్రమే ఇటువంటివి ఉంటాయి. కరెన్సీ నోట్లు ముంద్రించే విషయంలో రిజర్వుబ్యాంకు సిబ్బంది అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుంటారు. కరెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ కేటాయించే ముందు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మూడు నంబర్లు ముద్రిస్తారు. వాటి నుంచి కొంత ఖాళీ ఉంచి తర్వాత ఆరు నంబర్లు ముద్రిస్తారు. సీరియల్ నంబర్ ఆధారంగా వంద నోట్లను ఒక కట్టగా కడతారు. అయితే, ముద్రణా లోపం వల్ల కొన్ని నోట్లు పాడైపోతే అటువంటి నోట్లు స్థానంలో స్టార్ గుర్తుపెట్టి వేరొక సీరియల్ నంబర్‌తో కొత్తనోటు ముద్రించి అటువంటి నోట్లు స్థానంలో పెడతారు. స్టార్ నోటు ఉన్న కట్టపై ప్రత్యేకంగా స్టార్ గుర్తును కూడా ముద్రిస్తారు. దీంతో ఆ కట్టలో స్టార్ గుర్తు ఉన్న నోటు ఉందని తెలుసుకోవచ్చు. ఈ తరహా నోట్లు అరుదుగా లభిస్తాయి. అలాంటి నోట్లు రాజు వద్ద రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50 రూ.100, రూ.200, రూ.500, రూ.2వేల నోట్టు వరకు గల 839 నోట్లను ఆయన సేకరించారు. మరో విచిత్రం ఏమిటంటే స్టార్ గుర్తు ఉన్న ఒకే సీరియల్లో గల ఒక్క రూపాయి కట్టను (వందనోట్లు) సేకరించడం గమనార్హం. ఫ్యాన్సీ నంబర్లు... ఫ్యాన్సీ నంబర్లు ఉన్న నోట్లను సేకరించడం రాజుకు ఇష్టం. రూపాయి నోట్లలో 111111, 222222, 333333 నంబరు కలిగిన నోట్లు ఆయన వద్ద ఉన్నాయి. ఈ తరహా నోట్లు రూ.2వేల నోట్లు వరకు సుమారు 281 నోట్లు ఉన్నాయి. 2006 నుంచి సేకరిస్తున్నా... నేను స్టార్ గుర్తుల గల నోట్లను రిజర్వుబ్యాంకు 2006 నుంచి ముద్రించడం ప్రారంభించింది. అప్పటి నుంచి అరుదైన నోట్లను సేకరించడం ప్రారంభించాను. మనం నిత్యం వాడే కరన్సీ నోట్లలో ఎన్నో చిత్ర విచిత్రాలు ఉంటాయి. వాటిని ఎవరూ పట్టించుకోరు. అలాంటి విషయాలు తెలియపర్చాలనే ఉద్దేశంతోనే నోట్ల సేకరణ ప్రారంభించాను. ఈ తరహా నోట్లను ప్రపంచంలో ఎక్కడా సేకరించే దాఖలాలు లేవు. –ఎస్.ఎస్.ఎన్.రాజు,ఎల్.కోట స్టేట్‌బ్యాంక్ పూర్వపు మేనేజర్ -
9999 @ రూ.10 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలానికి వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘టీఎస్ 09 ఈజడ్ 9999’ నంబర్ కోసం ఓ వ్యక్తి రూ.10.46 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. బాగా డిమాండ్ ఉండే ‘ఆల్ నైన్స్కు’ రూ.10 లక్షలు చెల్లించడం ఇదే మొట్టమొదటిసారి. గతంలో ఈ నంబర్ కోసం రూ.9 లక్షల వరకు చెల్లించి దక్కించుకున్నావారు ఉన్నారు. కానీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తమ రూ.1.04 కోట్ల ఖరీదైన రేంజ్‌రోవర్ కారు కోసం ఆల్ నైన్స్ నంబర్‌ను వేలంలో రూ.10,46,722 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0009’ నంబర్ కోసం గంగవరం పోర్టు సంస్థ రూ.5,01,000కు దక్కించుకుంది. రూ.1.41 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నంబర్ తీసుకున్నారు. అలాగే ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0005’ నెంబర్ కోసం కూనం ఈశ్వరమ్మ రూ.2,51,000 చెల్లించారు. తమ వోల్వో ఎక్స్‌సి కారు కోసం ఈ నెంబర్ తీసుకున్నారు. ప్రత్యేక నెంబర్లకు మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో ఆర్టీఏకు మొత్తం రూ.26,55,243 లభించినట్లు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ తెలిపారు. -
రసవత్తరంగా ఫ్యాన్సీ నంబర్ల వేలం..
సాక్షి, హైదరాబాద్ : కారు ఖరీదు ఎంతన్నదేకాదు.. రిజిస్ట్రేషన్ నంబర్ ఏమిటన్నది కూడా కొందరికి ప్రెస్టేజ్ ఇష్యూనే! అందుకే, లక్షలు పోసిమరీ ఫ్యాన్సీ నంబర్లు సొంతం చేసుకుంటారు!! ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయం సోమవారం నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలం రసవత్తరంగా ముగిసింది. వేలం ద్వారా రవాణా శాఖకు రూ. 24,96,953 ఆదాయం సమకూరింది. కోటి రూపాయల కారుకు 7.5 లక్షల నంబర్ : TS 09 EW 0001 నంబర్‌కు గానూ ప్రముఖ రిటైల్ వ్యాపార సంస్థ మున్నా యునైటెడ్ అక్షరాల రూ. 7,56,695 చెల్లించింది. సంస్థ ఇటీవలే కొనుగోలు చేసిన జాగ్వర్ ఎక్స్‌జే 3.0ఐడీ మోడల్ కారు కోసం వారు ఈ నంబర్‌ను కొనుగోలుచేశారు. కారు ధర రూ.1,00,63,502 అని అధికారులు పేర్కొన్నారు. మెగా మళ్లీ : ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ యజమాని భారీ ధరకు ఫ్యాన్సీ నంబర్ కొనుగోలుచేసి మరోసారి వార్తల్లో నిలిచారు. తాను కొనుగోలుచేసిన బెంజ్ కారు కోసం ఫ్యాన్సీ నంబర్ TS 09 EW 0009ను రూ.4,70,00కు దక్కించుకున్నారు. ఆ కారు ధర రూ.1,63,50,000. గతంలోనూ ఫ్యాన్సీ ధరను కోట్‌చేసి ఫ్యాన్సీ కారు కొన్న మెగా ఓనర్ మరోసారి అదేపని చేశారు. 0006 @1.6 లక్షలు : వై. కామేశ్ అనే వ్యక్తి తన ఫోర్డ్ ఎండీవర్ కారు కోసం TS 09 EW 0006 నంబర్‌ను రూ.1,61,899 చెల్లించి కొన్నారు. -
0001కు రూ.8 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ రవాణా శాఖకు కాసుల పంట పండిస్తోంది. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ప్రారంభమైన నూతన సిరీస్‌లోని టీఎస్ 09 ఈవీ 0001 నంబర్ రికార్డు స్థాయిలో రూ.8.02 లక్షల ధర పలికింది. నగరానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి రూ.62.99 లక్షల విలువ గల తన నూతన బెంజ్ కారుకు ఈ నంబర్‌ను దక్కించుకున్నారు. ఇక ఇదే సిరీస్‌లో 0111 నంబర్‌కు రూ.1.20 లక్షలు లభించా యి. ఇక 09 ఈయూ సిరీస్‌లోని నంబర్ 0007 వేలానికి రూ.1.07 లక్షలు లభించాయి. మొత్తంగా నూతన సిరీస్‌ల ప్రారంభంతో ఫ్యాన్సీ నంబర్ల వేలం ప్రక్రియలో ఆర్టీఏకు ఒకేరోజు రూ.14.65 లక్షల ఆదాయం లభించినట్లు జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. -
ఫ్యాన్సీ నంబర్లకు బ్రేక్!
- కేటాయింపు నిలుపుదలతో వాహనదారుల్లో నిరుత్సాహం - రవాణాశాఖ ఆదాయానికి గండి అనంతపురం సెంట్రల్ : ఆన్లైన్ అవుతోందనే కారణంతో ముందుగానే ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు నిలుపుదల చేశారు. దీంతో వాహనదారులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.రవాణాశాఖ అధికారుల అత్యుత్సాహం వాహనదారుల పాలిట శాపంగా మారుతోంది. మరో వైపు రవాణాశాఖ ఆదాయానికీ గండిపడే అవకాశం ఉంది. ఎంతో ఇష్టంగా వాహనం కొనుగోలు చేసిన వారు అంతే ఇష్టమైన.. నచ్చిన నంబర్ కూడా ఉండాలని ఆశ పడుతుంటారు. ఇందుకోసం అదనంగా డబ్బులు చెల్లించి ఫ్యాన్సీ నంబర్‌ను తన వాహనానికి వేయించుకుంటుంటారు. ఇటీవల 9999 నంబర్‌కు ఇద్దరు పోటీ పడ్డారు. చివరకు రూ.1.80 లక్షకు ఆ నంబర్‌ను ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే వాహన నంబర్‌కు ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో అర్థమవుతుంది. సాధారణ నంబర్లకే ద్విచక్ర వాహనానికి అయితే రూ.2 వేలు, కార్లకు అయితే రూ.5 వేలు చొప్పున చెల్లించాలి. రైజింగ్ నంబర్, టోటల్ 9, 5 వచ్చే నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రూ.లక్షలు వెచ్చించేందుకు కూడా వాహనదారులు వెనుకాడరు. దీంతో పరోక్షంగా రవాణాశాఖకు భారీ ఆదాయం సమకూరుతోంది. అయితే త్వరలో ఆన్లైన్ అవుతోందనే కారణంతో కొద్దిరోజులుగా ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపును తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో ఎంతోమోజు పడి వాహనాలు కొనుగోలు చేసుకున్నవారు నిరుత్సాహానికి గురవుతున్నారు. తొలుత డీలర్ వద్దే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచించారు. ఆన్లైన్లో ఫ్యాన్సీ నంబర్ల కేటాయించకపోవడంతో కొందరు రవాణాశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఉప రవాణా కమిషనర్ సుందర్వద్దీని అడగ్గా ఆన్లైన్ అవుతోందనే కారణంతో ఆర్టీఏ కార్యాలయంలో నిలుపుదల చేశామన్నారు. అయితే తాత్కాలికంగా సడలించినట్లు పేర్కొన్నారు. వచ్చే గురువారం నుంచి మొత్తం ఆన్లైన్ అవుతుందని, ప్రతి ఒక్కరూ డీలర్ వద్ద ఆన్లైన్లోనే ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
రూ. 10 లక్షలు పలికిన ఫ్యాన్సీ నంబర్
తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో కొన్ని నెంబర్లకు మంచి ధర పలికింది. అత్యధికంగా 9999 నెంబరుకు రూ. 10 లక్షలు పలికింది. టీఎస్ 09 ఈఎస్ 9999 నంబరును హెట్రో డ్రగ్స్ ప్రతినిధులు 10 లక్షలకు పాడుకున్నారు. రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారుకు ఈ నెంబరు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత టీఎస్ 09 ఈఎస్ 0099 నెంబరును రూ. 1.93 లక్షలకు సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ వాళ్లు పాడుకున్నారు. రూ. 4.49 కోట్లతో కొన్న ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు ఈ నంబర్ పొందారు. టీఎస్ 09 ఈఎస్ 0009 నంబరుకు రూ. 1.73 లక్షల ధర పలికింది. ఇంటర్ కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ తాము రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు ఈ నంబరు తీసుకుంది. ఇక టీఎస్ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పాడుకుంది. రూ. 1.28 కోట్లతో కొన్న బెంజ్ ఎస్350 సీడీఐ కారుకు ఈ నంబరు పొందారు. -
ఇక ఈజీగా ఫ్యాన్సీ నెంబర్లు..
► రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఫ్యాన్సీ నంబర్లు తీసుకోవచ్చు ► డిమాండ్‌కు తగ్గట్టుగా ఆదాయం రాబట్టే యోచన ► త్వరలో కొత్త విధానం అమలు ► ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న రవాణా శాఖ విశాఖపట్టణం : వాహనాల ఫ్యాన్సీ నంబర్లను రాష్ట్రంలో ఏ జిల్లావైనా.. ఎక్కడి నుంచైనా పొందేందుకు రవాణా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న డిమాండ్ బట్టి ఆదాయం రాబట్టడానికి సిద్ధపడుతోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆయా జిల్లాల రవాణా కార్యాలయం పరిధిలో వచ్చే నంబర్లను ఎక్కడికక్కడ కేటాయిస్తున్నారు. దీంతో మంత్రులు, ఇతరత్రా ప్రజాప్రతినిధుల సిఫారసులు, ఒత్తిళ్లకు తలొగ్గుతున్న రవాణా అధికారులు లక్షలాది రూపాయలు రాబట్టే అవకాశమున్న ఫ్యాన్సీ నంబర్లను కనీస ధరలకు కట్టబెడుతున్నారు. ఇక నుంచి ఎటువంటి సిఫారసులకు తావు లేకుండా వాహనదారుడికి నేరుగా నంబర్ దక్కేలా చేయాలని రవాణా శాఖ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం నిర్ణయించారు. మార్చి ఒకటో తేదీ నుంచి విశాఖ జిల్లాలో కొత్త వాహనాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించడానికి రవాణా యంత్రాంగం సిద్ధపడుతోంది. ఈ వ్యవస్థను రూపొందించే బాధ్యత పమ్సాఫ్ట్ సంస్థకు అప్పగించారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తర్వాత ఆన్లైన్లో ఫ్యాన్సీ నంబర్లు కేటాయింపునకు విధి విధానాలు రూపొందిస్తారు. అంతా ఆన్లైన్లోనే..: ‘ఈ-బై’ విధానంలో ఇక నుంచి రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఆయా జిల్లాల సిరీస్‌లో వచ్చే ఫ్యాన్సీ నంబర్లను అమ్మకానికి పెడతారు. జిల్లా, స్థానికతతో సంబంధం లేకుండా వాహనదారులు వాటిని కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు విశాఖలో ఎపి 31 డిడి 9999 ఫ్యాన్సీ నంబర్‌ను రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల వాహనదారులు కూడా పోటీపడి పొందవచ్చు. అలాగే ఇతర జిల్లాలకు చెందిన నంబర్లు విశాఖలో తీసుకోవచ్చు. ఆయా జిల్లాల రిజిస్ట్రేషన్, చిరునామాతో నిమిత్తం లేకుండా ఫ్యాన్సీ నంబర్ సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో విజయవాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, గుంటూరు నగరాల్లో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ బాగా పెరిగింది. సీల్డ్ టెండర్ విధానంలో లక్షలాది రూపాయలు చెల్లించి ఫ్యాన్సీ నంబర్లు పొందుతున్నారు. వీటిని జిల్లాల వారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పోటీ పడే వీలు కల్పిస్తే మరింత ఆదాయం వస్తుందన్నది రవాణా శాఖ అధికారుల ఆలోచన. కొత్త విధానాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రముఖ ఫ్యాన్సీ నంబర్ల కనీస ధర రూ.50 వేలు ఉండగా ఇక నుంచి లక్ష రూపాయలు చేయాలన్న దానిపై కూడా కమిషనర్ అభిప్రాయ సేకరణ జరిపినట్లు తెలిసింది. -
ఫ్యాన్సీ నంబర్లకు ఈ-టెండర్
డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ కసరత్తు ఫిబ్రవరి నుంచి రవాణా సేవలన్నీ ఆన్లైన్లోనే సాక్షి, హైదరాబాద్: కొత్తగా వాహనాల్ని కొనుక్కుని ఫ్యాన్సీ నంబర్లు పొందాలంటే ఇకపై ఈ-టెండర్లలో పోటీ పడాల్సిందే. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి నుంచి రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఫ్యాన్సీ నంబర్లకున్న గిరాకీ దృష్ట్యా అధిక ఆదాయం ఆర్జించేందుకు కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా బ్రోకర్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఆ మేరకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే వాహన యజమానులు రిజిస్ట్రేషన్‌కు ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. రవాణాశాఖ నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఈ-టెండర్ విధానంలో పాల్గొనాలి. ఇప్పటివరకు ఆయా నంబర్లకున్న డిమాండ్‌ను బట్టి ధరను నిర్ణయించి ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు సీల్డ్ టెండర్లు కోరేవారు. ఉదాహరణకు 9999 ఫ్యాన్సీ నంబరు కనీస ధర రూ.50 వేలుంటే.. ఆ నంబరుకోసం ఒక్కరే దరఖాస్తు చేస్తే అదే ధరకిచ్చేవారు. ఒకరికంటే ఎక్కువమంది పోటీపడినట్లయితే సీల్డ్ టెండర్లు ఆహ్వానించేవారు. పోటీలో ఎక్కువ మొత్తం చెల్లించేవారికి నంబరును కేటాయించేవారు. ఈ విధానంలో పరపతి ఉన్నవారు పోటీదారులతో రింగై తక్కువ మొత్తంలో ఫ్యాన్సీ నంబ రును దక్కించుకునేందుకు వీలుంది. దీంతో రవాణాశాఖ ఆదాయానికి గండి పడుతోంది. ఈ-టెండర్ విధానంలో ఇందుకు ఆస్కారం లేదు. వాహన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఇదిలా ఉండగా వాహనాలు విక్రయించే డీలర్ వద్దే ఇకనుంచీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని రవాణాశాఖ యోచిస్తోంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసిన సమయంలో డీలర్ వద్ద ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. కొనుగోలు సమయంలోనే వాహనదారు వివరాలు, ఇంజన్, ఛాసిస్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. యజమాని సంతకం, కంప్యూటర్ ప్యాడ్‌లో ఫీడ్ చేసి పూర్తి చేసిన వివరాలన్నీ రవాణా అధికారులు సేకరించి నేరుగా రిజిస్ట్రేషన్ కార్డును పోస్టులో పంపుతారు. వాహన ఫిట్నెస్, లెసైన్సు పరీక్షలు తప్ప ప్రభుత్వం నుంచి జరిపే ఏ కార్యకలాపాలకు రవాణాశాఖ కార్యాలయాలతో పనిలేకుండా అన్నీ ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. -
ఇకపై ఈ-టెండర్ విధానంలోనే..
వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు సాక్షి, హైదరాబాద్: కొత్తగా వాహనాల్ని కొనుక్కుని ఫ్యాన్సీ నంబర్లు పొందాలంటే ఇకపై ఈ-టెండర్లలో పోటీ పడాల్సిందే. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి నుంచి రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఫ్యాన్సీ నంబర్లకున్న గిరాకీ దృష్ట్యా అధిక ఆదాయం ఆర్జించేందుకు కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని అమలు చేయనుంది. దీనిద్వారా బ్రోకర్లకు చెక్ పెట్టవచ్చని భావిస్తోంది. ఆ మేరకు ఫ్యాన్సీ నంబరు కావాలంటే వాహన యజమానులు రిజిస్ట్రేషన్‌కు ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. రవాణాశాఖ నిర్దేశించిన ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఈ-టెం డర్ విధానంలో పాల్గొనాలి. ఇప్పటివరకు ఆయా నంబర్లకున్న డిమాండ్‌ను బట్టి ధరను నిర్ణయించి ఆయా జిల్లాల్లో రవాణాశాఖ అధికారులు సీల్డ్ టెండర్లు కోరేవారు. వాహన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ..: ఇదిలా ఉండగా వాహనాలు విక్రయించే డీలర్ వద్దే ఇకనుంచీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిర్వహించాలని రవాణాశాఖ యోచిస్తోంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసిన సమయంలో డీలర్ వద్ద ఇప్పటివరకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్లకు వీలు కల్పిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. -
హైదరాబాద్‌లో నయా మోసం