RTO Bandlaguda: ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో క్రేజీ నంబర్స్‌ అదుర్స్‌ | Vehicle Registration number 0001 Fetches Morethan Rs 2 Lakh in Hyderabad | Sakshi
Sakshi News home page

RTO Bandlaguda: ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో క్రేజీ నంబర్స్‌ అదుర్స్‌

Published Sat, Nov 12 2022 4:09 PM | Last Updated on Sat, Nov 12 2022 4:09 PM

Vehicle Registration number 0001 Fetches Morethan Rs 2 Lakh in Hyderabad - Sakshi

ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు.

సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో 29 ప్రత్యేక నెంబర్లపైన రూ.8,40,167 ఆదాయం లభించినట్లు హైదరాబాద్‌ సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు. 

‘టీఎస్‌12ఈడబ్ల్యూ 0001’ నెంబర్‌ కోసం ఒక వాహనదారుడు  రూ.2,82,786 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్‌12ఈడబ్ల్యూ 0009’ నెంబర్‌ కోసం మరో వాహనదారుడు రూ.1,69,999 చెల్లించినట్లు  జేటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ దక్షిణమండలం జోన్‌ అయిన బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోనూ ప్రత్యేక నెంబర్లపైన పోటీ కనిపించడం విశేషం. 

ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో టీఎస్‌09 ఎఫ్‌యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్‌ చేసి గిరిధారి కన్‌స్ట్రక్షన్‌ సంస్థ దక్కించుకుంది. టీఎస్‌ 09 ఎఫ్‌వీ 0001 నంబరుకు రేజర్‌ గేమింగ్‌ సంస్థ రూ.3,50,000 చెల్లించింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement