rto
-
నెల పాటు ర్యాపిడో సేవలు బంద్
అహ్మదాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) ర్యాపిడో (Rapido) సేవలను 30 రోజుల పాటు నిలిపివేసింది. రిక్షా అసోసియేషన్ల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ర్యాపిడో కంపెనీకి RTO పలుసార్లు నోటీసులు జారీ చేస్తూ.. వస్తున్న ఫిర్యాదులకు వివరణ ఇవ్వాలని కోరింది. కానీ సంస్థ దీనికి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. అగ్రిగేటర్ రూల్స్ 2020 ప్రకారం.. వాణిజ్య అవసరాల కోసం ప్రయాణీకులను తీసుకెళ్లే ద్విచక్ర వాహనాలు పసుపు రంగు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలి. దాని కార్యకలాపాలలో ఉపయోగించే వాహనాలకు తప్పనిసరి బీమా కూడా అవసరం. ఈ రెండు నియమాలను ర్యాపిడో ఉల్లంఘించినట్లు కనుగొనబడింది.ర్యాపిడో బైక్ సర్వీస్‌కు ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడంతో నిబంధనల ఉల్లంఘించినట్లు ఆటో యూనియన్లు ఆర్టీఓకు ఫిర్యాదు చేశాయి. దీంతో సంస్థ సేవలను 30 రోజుల పాటు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.అహ్మదాబాద్ ఆర్టీవో అధికారి 'జేజే పటేల్' (JJ Patel) మాట్లాడుతూ.. ఆర్టీవో కేవలం ర్యాపిడో త్రీ-వీలర్ ఆటో రిక్షాలకు మాత్రమే అగ్రిగేటర్ లైసెన్స్‌ను జారీ చేసింది. కానీ వారు తమ ఆన్లైన్ యాప్ ద్వారా నాన్-ట్రాన్స్పోర్ట్ టూ-వీలర్ వాహనాలను ఉపయోగించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించారు. అంతే కాకుండా డాక్యుమెంట్స్ గడువు ముగిసిన తర్వాత కూడా వారు వాహనాలను నడపడం కొనసాగించారు. దీంతో ప్రయాణీకుల భద్రత ప్రమాదంలో పడింది. కాబట్టి, మేము 30 రోజుల పాటు రాపిడో సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నిబంధలనలు ఉల్లంగిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.ర్యాపిడో సేవలను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. 2023లో కూడా కొన్ని నియమాలను సంస్థ ఉల్లంఘించిందనే కారణంగా ఢిల్లీ హైకోర్టు ర్యాపిడో సేవలను కొన్ని రోజులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇప్పుడు తాజాగా అహ్మదాబాద్ ఆర్టీవో ర్యాపిడో సేవలను 30 రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.చాలామంది ర్యాపిడో సేవలను ఉపయోగించుకుంటున్నప్పుడు తప్పకుండా, నియమాలను పాటించాలి. అప్పుడే ప్రజలకు సురక్షితమైన సేవలను అందించగలుగుతారు. నియమాలను ఉల్లంగిస్తే.. ఆ ప్రభావం ప్రజల మీద పడుతుంది. కాబట్టి ర్యాపిడో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.ర్యాపిడో సర్వీస్ ఉపయోగాలుదేశంలోని ప్రధాన నగరాల్లో ర్యాపిడో సేవలను మంచి ప్రజాదరణ పొందాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఎక్కడికి వెళ్లాలన్నా.. చాలా మంది ర్యాపిడో బుక్ చేసుకుని గమ్యాన్ని చేరుకుంటున్నారు. రోజువారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ వంటి వాటి కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క రీఛార్జ్.. 425 రోజులు వ్యాలిడీటీ: ఈ నెల 16 వరకే ఛాన్స్చాలామందికి ఉపాధిర్యాపిడో సర్వీస్ కారణంగా దేశంలో చాలామందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కొక్కరు నెలకు వేలల్లో సంపాదించుకుంటున్నారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి ఈ బైక్ సర్వీస్ ద్వారానే నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు ఈ మధ్యకాలంలోనే వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే బైక్ నడుపుకుంటూనే చాలామంది మంచి ఆదాయం సంపాదిస్తున్నారని స్పష్టమవుతోంది. -
విశాఖ ఆర్టీవో ఆఫీస్ లో దసరా, దీపావళి దందా
-
ఇలా వచ్చి.. అలా వెళ్తారు..!
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నాలుగు రోజులకు రూటర్ సమస్య పరిష్కారమై వాహనదారులకు సేవలు అందుబాటులోకి వచ్చాయి. కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో పనులు పెండింగ్ పడుతున్నాయి. వరంగల్‌కు చెందిన ఏఓ స్వర్ణలత 2022 జనవరి 19న హన్మకొండ ఆర్టీఏ కార్యాలయం నుంచి బదిలీపై మంచిర్యాలకు వచ్చారు. అప్పటి నుంచి ఆమె వరంగల్ నుంచి మంచిర్యాలకు రైల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రోజువారీగా రైలు ప్రయాణం సాగిస్తుండగా భోజన విరామ సమయానికి వచ్చి విధుల్లో చేరకుండా కాలక్షేపం చేస్తూ బాధ్యతలు చేపడుతారు. మధ్యాహ్నం 3.30గంటలకు వరంగల్‌కు ఉండే రైల్లో వెళ్తున్నారు. దీంతో ఆ సమయం వరకు మాత్రమే పనులు చేసి మిగతా పనులు వాయిదా వేస్తున్నారు.విధుల్లో నిర్లక్ష్యం..జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏఓ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. సెక్యూరిటీ గార్డు నుంచి మొదలు హోంగార్డు, పోలీసు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుల్ విధులతోపాటు కార్యాలయ సిబ్బంది విధులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. నాన్ ట్రాన్స్‌పోర్టు వ్యవహారాలపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత ఏఓపై ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ అప్రూవ్, పర్మిట్ అప్రూవ్, సీసీ వ్యవహారాలు ఇలా ప్రధాన సేవలన్నీ ఏఓ లేనిదే ముందుకు సాగవు. కార్యాలయం హెల్ప్‌డెస్క్, ఆర్టీఐ అప్పిలేట్ అధికారి బాధ్యతలూ ఉంటాయి. మొత్తంగా జిల్లా రవాణా శాఖ అధికారి తర్వాత పూర్తి బాధ్యత ఏఓదే ఉంటుంది. ఇలాంటి కీలక పాత్ర పోషించాల్సిన ఏఓ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సిబ్బందితోపాటు వివిధ సేవల కోసం వచ్చే వాహనదారులతో మొండిగా వ్యవహరిస్తూ పలు కొర్రీలతో పనులు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.అయినా తీరు మారలేదు..నాలుగు రోజులుగా కార్యాలయంలో ఇంటర్నెట్ రూటర్ సమస్యతో వాహనదారుల సేవలు నిలిచిపోయాయి. గురువారం సేవలు పునరుద్ధరణతో వాహనదారులు వెల్లువెత్తుతున్నారు. ఏఓ ఉదయం 10:30 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారం మధ్యాహ్నం 1:30 గంటల వరకు కూడా రాకపోవడంతో పలువురు తమ పనుల కోసం నిరీక్షించారు. గురువారం కొన్ని పనులు పూర్తి చేయకుండానే రైలు సమయం కావడంతో వెళ్లిపోగా.. శుక్రవారం ఆలస్యంగా వచ్చారు. అప్పటికే స్లాట్ల సమయం ముగిసిపోవడంతో గురు, శుక్రవారాల్లో ఏఓ పనులు మళ్లీ పెండింగ్ అయ్యాయి. శుక్రవారం ఓ సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ సెలవులో ఉండగా వాహనదారులకు సత్వర సేవలు అందించాల్సిన ఏఓ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఏఓ విధులపై మంచిర్యాల ఇంచార్జి డీటీఓ సంతోష్‌ను సంప్రదించగా.. ఏఓ విధుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, సమయానికి కార్యాలయంలో ఉండాలని సూచించామని తెలిపారు. -
టీజీ 09 9999 రూ.25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబరుకు రూ. 25 లక్షల ధర పలికింది. ఖైరతా బాద్ ఆర్టీఏలో సోమవారం నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూ షన్స్ ‘టయోటా లాండ్ క్రూజర్ ఎల్ఎక్స్’ వాహనం కోసం ఈ నంబరును దక్కించుకుంది. దీనిపై ఆర్టీఏ విధించిన రూ.50 వేల ఫీజు తో పాటు, బిడ్డింగ్ మొత్తం రూ.25,50,000 చెల్లించి సొంతం చేసుకుంది. ఆల్‌నైన్స్ కోసం ఈ స్థాయిలో పోటీ రావడం తెలంగాణలోనే ఇది మొదటిసారి అని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి.రమేష్ తెలిపారు. ప్రత్యేక నంబర్లకు ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఒక్క రోజే రూ.43,70,284 లభించినట్టు ఆయన చెప్పారు. ఆల్‌నైన్స్ ఆన్లైన్ అత్యధిక బిడ్డింగ్ ఇలా..👉 టీఎస్ 09 జీడీ 9999’ నంబరుకు ముప్పా హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన మొత్తం రూ.15,53,000👉 టీఎస్ 09 జీఈ 9999 నంబరుకు కీస్టోన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ చెల్లించిన మొత్తం రూ.17,35,000👉 టీఎస్09 జీసీ 9999 నంబరుకు ప్రైమ్ సోర్స్ గ్లోబల్ సర్వీస్ చెల్లించిన బిడ్డింగ్ మొత్తం రూ.21,60,000 👉 తాజాగా ‘టీజీ 09 9999’ నంబర్‌కు సోని ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ చెల్లించిన మొత్తం రూ.25,50,000 -
గుడ్ న్యూస్: ఆర్టీవో టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్!
డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని (RTO) వెళ్లి ఆర్టీఓ వద్ద డ్రైవింగ్ టెస్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. మరి ఇవేమి చేయకుండా లైసెన్స్ ఎలా వస్తుందని అనుకుంటున్నారా. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల నుండి పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ ‘డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు–2022’ నోటిఫికేషన్‌ను ఇటీవల జారీ చేసింది. కొత్త మార్గదర్శకాలు అమలులోకి రాగా, ప్రస్తుత విధానంతో పాటు ఇది కూడా కొనసాగనుంది. కొత్త విధానాన్ని కొన్ని నెలల పాటు ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. పరీక్ష లేకుండా లైసెన్స్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు నుంచి శిక్షణను పూర్తి చేయాలి. ఆపై డ్రైవింగ్‌లో అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌లను సదరు శిక్షణా సంస్థ జారీ చేయనుంది. ఆపై వారు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, శిక్షణా కేంద్రం సర్టిఫికేట్ జారీ చేస్తుంది. సర్టిఫికేట్ పొందిన తర్వాత, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆపై ఆర్టీఓ వద్ద ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా ఈ శిక్షణ సర్టిఫికేట్ ఆధారంగా లైసెన్స్ పొందవచ్చు. వీటిని కేంద్ర లేదా రాష్ట్ర రవాణా శాఖలు ఈ శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తాయి. అయితే, డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్‌ను ప్రైవేటీకరించే అవకాశం ఉన్నందున డ్రైవర్ శిక్షణా కేంద్రాలను తెరవడంపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సరైన వెరిఫికేషన్లు, తనిఖీలు లేకుండానే ఇలాంటి కేంద్రాలు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తారనే భయం కూడా నెలకొంది. అయితే కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనలు ఎంత వరకు సత్పలితాలను ఇస్తాయని తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. చదవండి: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! -
RTO Bandlaguda: ఆన్లైన్ బిడ్డింగ్‌లో క్రేజీ నంబర్స్ అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీఏ ప్రత్యేక నెంబర్లపైన వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. శుక్రవారం బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలో నిర్వహించిన ఆన్లైన్ బిడ్డింగ్‌లో 29 ప్రత్యేక నెంబర్లపైన రూ.8,40,167 ఆదాయం లభించినట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ తెలిపారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0001’ నెంబర్ కోసం ఒక వాహనదారుడు రూ.2,82,786 చెల్లించి సొంతం చేసుకున్నారు. ‘టీఎస్12ఈడబ్ల్యూ 0009’ నెంబర్ కోసం మరో వాహనదారుడు రూ.1,69,999 చెల్లించినట్లు జేటీసీ పేర్కొన్నారు. రవాణాశాఖ దక్షిణమండలం జోన్ అయిన బండ్లగూడ ప్రాంతీయ రవాణా కార్యాలయంలోనూ ప్రత్యేక నెంబర్లపైన పోటీ కనిపించడం విశేషం. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో టీఎస్09 ఎఫ్యూ 9999 నంబరును రూ.10,49,999కు కోట్ చేసి గిరిధారి కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. టీఎస్ 09 ఎఫ్‌వీ 0001 నంబరుకు రేజర్ గేమింగ్ సంస్థ రూ.3,50,000 చెల్లించింది. (క్లిక్ చేయండి: ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్) -
ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!
నిర్మల్ చైన్‌గేట్: ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చిస్తుంటారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎన్ని డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకుంటారు. నిర్మల్ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు. టీఎస్18–జీ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్మల్ ఆర్టీవో అజయ్‌రెడ్డి సమక్షంలో ఆన్లైన్లో వేలం నిర్వహించారు. శ్రీపతి సంతోష్‌కుమార్ రూ.4,80,000కు దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అలాగే టీఎస్18–హెచ్ 0009 నంబర్‌ను వెంకట సత్యశ్రీధర్ వర్మ రూ.3,15,999కి దక్కించుకున్నాడు. టీఎస్18–హెచ్ 0001 నంబర్‌ను తడ్క నాగజ్యోతి రూ.2,02,000కు, 0002 నంబర్‌ను విజయ్ భాస్కర్‌రెడ్డి రూ.1,05,000కు, 0008ను కొంతం ప్రణయ్‌రెడ్డి రూ.12,124కు, 0007ను పూర్ణమ్మ రూ.55,678కు, 0004 ను తుంగెన ధర్మారావు రూ.16,434కు పొందారు. (క్లిక్: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ) -
నంబర్ ప్లేట్‌తో తంటా
న్యూఢిల్లీ: ఆమె ఫ్యాషన్ డిజైన్ చదువుతున్న విద్యార్థిని. ఢిల్లీలోని జనక్‌పురి నుంచి నోయిడాకు రోజూ వెళ్లి రావడం కష్టమవుతోందని... ‘నాన్నా నాకో స్కూటీ కొనిపెట్టవు’ అని తండ్రిని కోరింది. ముద్దుల కూతురి కోరిక తీరుస్తూ ‘దీపావళి’ కానుకగా స్కూటర్ కొనిపెట్టారాయన. ఆ అమ్మాయి ఎంతో సంతోషించింది. తర్వాత బండి రిజిస్ట్రేషన్ పూర్తయి ‘నెంబరు రావడం’తో ఆమె బిక్కచచ్చిపోయింది. స్కూటీని బయటకు తీయాలంటేనే సిగ్గుతో చితికిపోతున్నానని, ఇరుగుపొరుగుతో, వీధుల్లో ఎగతాళికి గురవుతున్నానని, అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వాపోతోంది. ఎందుకంటారా? నెంబరులో ఉన్న సిరీస్ తెచ్చిన తంటా ఇది. ఢిల్లీలోని వాహనాలకు నెంబరు కేటాయించేటపుడు మొదటి రెండు అక్షరాలు DL అని వస్తాయి. తర్వాత ఒక అంకె సంబంధిత జిల్లాను సూచిస్తుంది. ఆపై ఫోర్ వీలర్ అయితే ‘సి’ అక్షరం, టూ వీలర్ అయితే ‘ఎస్’ అక్షరం వస్తుంది. ఆపై వచ్చే రెండు ఆంగ్ల అక్షరాలు సిరీస్‌ను సూచిస్తాయి. ఈ అమ్మాయిది టూ వీలర్ కాబట్టి DL3 SEX (నాలుగు అంకెల నెంబర్) వచ్చింది. దాంతో బండిని బయటికి తీయాలంటేనే భయపడిపోతోంది. చివరకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ)ను ఆశ్రయించింది. దీంతో ఆమెకు కేటాయించిన సిరీస్‌ను మార్చి కొత్త నెంబరును ఇవ్వాలని మహిళా కమిషన్ సంబంధిత ఆర్టీవోకు నోటీసు జారీచేసింది. -
సీటింగ్ 30.. ట్రావెలింగ్ 134
సాక్షి, జైనథ్(ఆదిలాబాద్): జైనథ్ మండలం భోరజ్ బస్‌స్టాండ్ సమీపంలో ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రావెల్ బస్సును ఏఎంవీఐ స్రవంతి సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారులతో కలిసి 44వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీలతో హెదరాబాద్కు వెళ్తున్న బస్సు (పీవై05ఈ1433)ను తనిఖీ చేయగా అందులో 134 ప్రయాణికులు ఉన్నారు. 30 మంది ప్రయాణించే బస్సులో 134 మందిని తరలిస్తుండటంతో ఓవర్‌లోడ్ కారణంగా బస్సును సీజ్‌చేసి ప్రయాణికులతోసహా ఆదిలాబాద్ బస్‌స్టాండ్‌కు తరలించారు. దీంతో కూలీలు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు. రాత్రి ఆదిలాబాద్ బస్టాండ్‌లోనే సేదతీరారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ బస్‌స్టాండ్‌కు చేరుకుని కూలీలతో మాట్లాడా రు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. బస్సు ఓనర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. -
తెలంగాణ రవాణాశాఖ దొంగదెబ్బ!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ వెసులుబాటు వాహనదారుల నడ్డి విరిచింది. వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, పన్ను చెల్లింపులు వంటి వాటి కోసం రవాణా శాఖ మొదట గత ఏడాది డిసెంబర్ వరకు వెసులుబాటునిచ్చింది. అనంతరం ఈ గడువును వచ్చే మార్చి వరకు పొడిగించింది. ఈ అవకాశం ఇవ్వడంతో వాహనదారులు తమ కార్యకలాపాలను వాయిదా వేసుకున్నారు. మార్చి తర్వాత పునరుద్ధరించుకోవచ్చని భావించారు. కానీ ఈ సడలింపే ఇప్పుడు వాహనదారుల కొంప ముంచింది. సకాలంలో వాహనాల రిజిస్ట్రేషన్లను రెన్యువల్ చేసుకోలేని వారికి భారీగా పెనాల్టీలు విధిస్తోంది. దీంతో సుమారు ఏడాది పాటు తమకు వెసులుబాటు లభించిందనుకున్న వాహనదారులు ఇప్పుడు ఏడాది పెనాల్టీలను చెల్లించాల్సిరావడంతో లబోదిబోమంటున్నారు. రవాణాశాఖ దొంగదెబ్బ తీస్తోందంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలల్లో వడ్డింపులు.. బంజారాహిల్స్‌కు చెందిన సామ శ్రీకాంత్‌రెడ్డి తన మారుతీ 800 కారు (ఏపీ 28ఏఎల్3736) రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకున్నారు. సాధారణంగా అయితే అప్లికేషన్ ఫీజు రూ.900, స్మార్ట్‌కార్డు కోసం రూ.200, సర్వీస్ చార్జీ రూ.400, పోస్టల్ చార్జీ రూ.35 చొప్పున మొత్తం రూ.1,535 చెల్లించాలి. 15 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ రూపంలో మరో రూ.500 అదనపు భారం పడుతుంది. కానీ లేట్ ఫీజు రూపంలో రూ.10 వేల జరిమానా విధించడంతో ఆయన ఒక్కసారిగా షాక్ తిన్నారు. మోహన్‌రెడ్డి అనే మరో వాహనదారు రూ.7000కుపైగా పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చింది. గడువు ముగిసిన బండ్లు లక్షల్లో.. ► మోటారు వాహన నిబంధనల ప్రకారం 15 ఏళ్ల గడువు ముగిసిన వాహనాల సామర్థాన్ని రవాణా అధికారులు మరోసారి అంచనా వేసి వాటిని వినియోగించేందుకు అనుమతినివ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనం పాత ఆర్సీ, ఇన్సూరెన్స్, అడ్రస్ తదితర డాక్యుమెంట్లతో పాటు గ్రీన్‌ట్యాక్స్ చెల్లించాలి. ► నమోదు చేసుకున్న స్లాట్ ప్రకారం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు వాహనం సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అనంతరం మరో అయిదేళ్ల పాటు ఆ బండిని వినియోగించుకొనేందుకు అనుమతినిస్తారు. ఇలా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది. గ్రేటర్ పరిధిలో గడువు ముగిసిన వాహనాలు సుమారు 13 లక్షల వరకు ఉంటాయి. ► వీటిలో 5 లక్షల వరకు కార్లు ఉండగా, మిగతావి బైక్‌లు, క్యాబ్‌లు, రవాణా వాహనాలు ఉన్నాయి. కోవిడ్ వెసులు బాటు కారణంగా ఈ వాహనాల్లో 70 శాతం వరకు రెన్యువల్స్ లేకుండానే తిరుగుతున్నాయి. రవాణా శాఖ లెక్కల ప్రకారం ఈ వాహనదారులు భారీ ఎత్తున జరిమానా చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇది చాలా దారుణం కోవిడ్ సమయంలో వెసులుబాటు ఇచ్చినట్లే ఇచ్చి ఇప్పుడు పెనాల్టీ వసూలు చేయడం దారుణం. వెసులుబాటు సమయంలోనే ఆ విషయం స్పష్టంగా చెప్పాల్సింది. అయినా కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఎలా వెళ్తాం. అప్పుడు ఆర్టీఏ కూడా పని చేయలేదు కదా. – సామ శ్రీకాంత్‌రెడ్డి పెనాల్టీ చెల్లించాల్సిందే.. గడువు ముగిసిన వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులకు గడువు మాత్రమే పొడిగించాం. పెనాల్టీల నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పలేదు. నిబంధనల ప్రకారం ఫీజులు, పెనాల్టీలు చెల్లించాల్సిందే. – పాండురంగ్ నాయక్, జేటీసీ, హైదరాబాద్ -
సారు చెబితేనే చేశాం..
సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. రింగ్‌రోడ్డు వద్ద కలవండి.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్‌గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్‌గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్‌గౌడ్‌కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్‌రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్‌లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది. బినామీల విచారణ.. రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్‌కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. -
ఆన్లైన్లోనే ఆర్టీఓ సేవలు
సాక్షి, నిజామాబాద్: డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయించుకోవాలన్నా.. లెర్నింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే కొత్తది తీసుకోవాలన్నా.. డ్రైవింగ్ లైసెన్స్ అడ్రస్‌లో మార్పులు, చేర్పులు చేయాలన్నా.. ఇప్పటి వరకు తప్పనిసరిగా ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి కొన్ని రకాల సేవలన్నీ ఇకపై ఆన్లైన్లోనే అందించాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ సేవల కోసం కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే రవాణాశాఖ వెబ్సైట్ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేసింది. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా జారీ చేసే అన్ని సేవలను ఆన్లైన్లో అందించాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ ఆన్లైన్ సేవలు వెంటనే ప్రారంభించాలని ఆ శాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఆర్టీఓ సేవలను మరింత సరళతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ సేవలు పొందేవారికి ఊరట లభించింది. రోజుకు సుమారు 500 మందికి.. జిల్లాలో నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో ఆర్టీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఇలాంటి సేవల కోసం ఆయా కార్యాలయాలకు రోజుకు సుమారు 400 నుంచి 500 మంది వస్తుంటారు. దీంతో ఆర్టీఓ కార్యాలయాలు కిక్కిరిపోతుంటాయి. కొందరు నేరుగా కాకుండా, ఏజెంట్ల ద్వారా పనులు చేయించుకుంటారు. ఇకపై వీరంతా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ఏజెంట్లను ఆశ్రయించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆన్లైన్లోనే దరఖాస్తులు.. పౌరులు ఆయా సేవల కోసం ఇంటి వద్ద నుంచే పనులు చక్కబెట్టుకోవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు నిర్ణీత స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. సంబంధిత డాక్యుమెంట్లను రవాణాశాఖ వెబ్సైట్లో (www.transport.telangana.gov.in) అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లతో కూడిన దరఖాస్తులు నేరుగా ఆశాఖ రాష్ట్ర కార్యాలయంలోని సర్వర్‌కు అనుసంధానం అవుతుంది. ఆయా సేవల కోసం ఆన్లైన్లోనే ఫీజు మొత్తాన్ని చెల్లిస్తే నిర్ణీత రోజుల్లో ఈ సేవలు అందుతాయి. ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోండి రవాణాశాఖకు సంబంధించి కొన్ని రకాల సేవలను ఆన్లైన్లోనే అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సేవలను వినియోగించుకోవాలి. అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం లేకుండా పొందే సేవలను పౌరులు ఇంటి నుంచే పొందవచ్చు. కార్యాలయాలనికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో పొందవచ్చు. – డా.కె.వెంకటరమణ, ట్రాన్స్పొర్టు డిప్యుటీ కమిషనర్. -
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు: కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఆర్టీవో బ్రోకర్ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జేసీ బ్రదర్స్ అక్రమాల్లో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిషేధిత వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించి, ఆ వాహనాలను బ్రోకర్ రవికుమార్ ద్వారా జేసీ ట్రావెల్స్ విక్రయించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లపై రెండు కేసుల్లో పీటీ వారెంట్లు జారీ కాగా, తండ్రీ కొడుకులు కడప సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. (జేసీ ట్రావెల్స్ కేసు.. కీలక విషయాలు) నిషేధిత వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత విక్రయాలపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. నకిలీ ఇన్ వాయిస్, ఫేస్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ల తయారీపై ఆరా తీస్తున్నారు. నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ల చెలామణి పై పోలీసులు విచారణ చేపట్టారు. స్క్రాప్ కింద కొనుగోలు చేసిన జేసీ ట్రావెల్స్ .. 154 వాహనాలను ఫోర్జరీ డాక్యుమెంట్లు సమర్పించి బీఎస్-4 గా మార్చింది. వాహనాలన్నీ జేసీ ఉమారెడ్డి, చవ్వాగోపాల్ రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. కాగా, జేసీ ట్రావెల్స్ ఫొర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డికి జూలై 1 దాకా రిమాండ్ పొడిగిస్తూ అనంతపురం కోర్టు ఆదేశించించిన సంగతి తెలిసిందే. -
ఆర్టీఓ తనిఖోల్లో 8 బస్సులు సీజ్
-
అవినీతిపై కొరడా
ఓ ఆటో డ్రైవర్...రవాణా శాఖ మంత్రికి ఫోన్ చేయవచ్చా.. చేసినా ఆ బడుగుజీవుల ఆక్రందన అమాత్యులు వింటారా...? ఇన్నాళ్లూ అందరికీ ఇదే సందేహముండేది. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్లోని మంత్రులంతా సామాన్యుల సమస్యల పరిష్కారానికే పెద్దపీట వేస్తున్నారు. అందులో భాగంగానే అనంతపురంలోని కొందరు ఆటో డ్రైవర్లు బుధవారం రవాణాశాఖ మంత్రికి ఫోన్ చేసి ఆర్టీఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదు చేయడం...వెంటనే స్పందించిన మంత్రి ఆరా తీయడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుండగా...ఇది జనసామాన్యుల ప్రభుత్వమని జనం ఆనందపడుతున్నారు. – అనంతపురం టవర్‌క్లాక్ సాక్షి, అనంతపురం: అవినీతి రహిత పాలనే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని శాఖల్లో ప్రక్షాళనకు మంత్రులు సిద్ధమయ్యారు. అంతేకాకుండా సామాన్యులు ఫోన్ చేసినా అందుబాటులోకి వస్తూ అవినీతిపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలోనే అనంతపురం ఆర్టీఏ కార్యాలయంలో అవినీతికి అంతే లేకుండా పోతోందని రవాణాశాఖలో అవినీతి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని బుధవారం జిల్లాకు చెందిన కొంతమంది ఆటో డ్రైవర్లు రవాణాశాఖ మంత్రి పేర్ని నానికి ఫోన్‌చేసి ఫిర్యాదు చేశారు. వారి సమస్యలన్నీ ఓపికగా విన్న మంత్రి పేర్నినాని...అవినీతికి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన అనంతపురం ఆర్టీఏ అధికారులకు ఫోన్‌చేసి ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో పాలన అదుపుతప్పినట్లు తెలిసి ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి...అవినీతికి పాల్పడుతున్న అధికారులపై సమగ్రంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి రవాణాశాఖపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకూడదని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఇంకోసారి ఎవరైనా అవినీతి జరుగుతున్నట్లు ఫిర్యాదు చేస్తే...విచారించి అధికారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్లు లైసెన్సుల కోసం కార్యాలయానికి వస్తే... అధికారులు ఎవరూ స్పందించడం లేదని, బ్రోకర్లను కలిసి లైసెన్సులు పొందేలా సూచనలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి విధానం మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. సేవలన్నీ పారదర్శకంగా ఉండాలని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ ఉన్నతాధికారికి ఫోన్లో ఆదేశించిట్లు తెలుస్తోంది. -
నన్ను చంపేస్తారేమో!
కర్నూలు సీక్యాంప్ : ‘‘సార్.. నా విధులు నన్ను నిర్వర్తించుకోనీయడం లేదు. అధికార పార్టీ నేతల అనుచరులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి నన్ను చంపేస్తారేమో!’’ అని కర్నూలు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాను కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు తాలుకా పోలీసులకు ఆమె గురువారం ఫిర్యాదు చేశారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు అప్రూవల్ కోసం కర్నూలు ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్లోని ఈసెక్షన్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి అవి తిరిగి ఆర్డీవో కార్యాలయానికి వస్తాయి. తప్పులు ఉండడం, సరైన ఆధారాలు లేని కారణంగా దరఖాస్తులను ఈ సెక్షన్ ఆఫీసర్ తిరిగి వెనక్కి పంపుతున్నారు. అయితే ఇవి ఆర్డీఓ కార్యాలయంలోనే ఆగిపోతున్నాయని..కొందరు టీడీపీ కార్యకర్తలు గురువారం సీనియర్ అసిస్టెంట్ భానుపై చిందులేశారు. ‘‘చాలా రోజులుగా మమ్మల్ని తిప్పుకుంటున్నావ్.. ఏంటి నీ బాధ’’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమవుతూ తాలూకా పోలీసులను ఆశ్రయించారు. దాదాపు గంట సేపు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని తన సమస్య అంతా పోలీసులకు వివరించారు. అయితే ఆర్డీఓ కార్యాలయం తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తప్పుకున్నారు. డిప్యూటీ సీఎం అనుచరుల హల్చల్.. సీనియర్ అసిస్టెంట్ భాను.. తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారన్న విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరులు హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ తహసీల్దార్ నిత్యానందరాజుపై మండిపడ్డారు. ‘డిప్యూటీ సీఎం చెప్పినా, మంత్రి లోకేష్ ఫైల్ అని చెప్పినా.. మా పనులు కావడంలేదు’ అని ఆగ్రహించారు. అనంతరం బాధితురాలి వద్దకు వచ్చి.. ‘ మీరేమీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.. బేతంచెర్లలోని మా పొలం పని అయిపోతే.. మీ నుంచి మాకు సమస్య ఉండబోదు’ అని దరఖాస్తులు తీసుకెళ్లారు. -
ఇక టూవీలర్స్‌కి జీపీఎస్
తిరుపతి మంగళం: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు టూవీలర్స్‌కి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చకోవాలని తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు జీపీఎస్ ఎంతో దోహదపడుతుందన్నారు. దానికి తోడు వారి వారి పిల్లలు బైక్‌లపై ఎక్కడికి వెళుతున్నారో, ఎంత స్పీడు వెళుతున్నారన్న విషయాలను సెల్‌ఫోన్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత, భవిష్యత్ కోసం వారి బైక్‌లకు జీపీఎస్‌ను అమర్చాలని సూచించారు. మొట్ట మొదటిసారిగా జీపీఎస్ అమర్చిన టూవీలర్‌ను మంగళవారం తిరుపతిలోని టీవీఎస్ బైక్ షోరూంలో జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న, తిరుపతి సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, తిరుపతి ఎస్పీ అభిషేక్ మొహంతి ప్రారంభిస్తారని తెలిపారు. -
రేసింగ్‌కు కళ్లెం
♦ ఈసీఆర్‌లో మాటు ♦ లగ్జరీ కార్ల భరతం ♦ వంద మందికి జరిమానా ♦ ఐదు కార్లు సీజ్ ఈసీఆర్ రోడ్డులో అతివేగంగా దూసుకెళ్లే కార్ల భరతం పట్టే రీతిలో ఆర్టీవో వర్గాలురంగంలోకి దిగారు. సంపన్నుల పిల్లలతో పాటు అతివేగంగా దూసుకొచ్చిన కార్లను టార్గెట్ చేసి నిఘా వేశారు. వందకార్లను పట్టుకున్నారు. యాభై కార్లకు సుమారు లక్షన్నర రూపాయల మేరకు జరిమానాలు విధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై: చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు ఈసీఆర్ రోడ్డులో పయనం ఆహ్లాదకరమే. సముద్ర తీరం వెంబడి సాగే ఈ పయనంలో తళ తళమని రోడ్లు మెరుస్తుంటాయి. ఈ రోడ్డులో నిత్యం వాహనాలు అతివేగంగా దూసుకెళుతుంటాయి. రాత్రుల్లో అయితే, మోటార్‌సైకిల్, కార్ల రేసింగ్ జోరుగానే సాగుతుంటాయి. ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు మాత్రం స్పందించే పోలీసులు, తదుపరి యథారాజా తథా ప్రజా అని వ్యవహరించడం జరుగుతోంది. ఈ మార్గంలో నిత్యం సాగే ప్రమాదాల్లో విగత జీవులయ్యే వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం అయితే, ఏకంగా అత్యంత ఖరీదైన పదిహేను కార్లు చెన్నై నుంచి ఈసీఆర్ రోడ్డులో పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతివేగంగా దూసుకెళ్తున్న ఈ కార్లతో ఇతర వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే ప్రజలకు ఏదేని ప్రమాదాలు తప్పదేమో అన్న ఆందోళన బయలు దేరింది. ఈ కార్లను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులకు ముచ్చెమటలు తప్పలేదు. ఒక్కో కారు లక్షలు విలువ చే యడంతో పాటు అందులో ఉన్న వాళ్లు సంపన్నుల పిల్లలు కావడమే. ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్‌గా తొలుత తీసుకున్నా, తదుపరి చడీచప్పుడు కాకుండా వదలిపెట్టారు. అయినా, రేషింగ్ జోరుగానే సాగుతుండడంతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. దీంతో అధికారులు ముందస్తుగా మేల్కొన్నట్టున్నారు. ఈసీఆర్‌లో మాటు: ఆర్టీఏ అధికారులు యువరాజ్, విజయకుమార్, నెల్లయ్యన్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది ఈసీఆర్ రోడ్డులో అక్కడక్కడ మాటు వేశారు. ముందుస్తుగా సిద్ధం చేసుకున్న పరికరాల మేరకు అతివేగంగా దూసుకొచ్చే వాహనాలను పసిగట్టారు. ఓ చోట తప్పించుకున్నా, మరోచోట ఆ కార్లు తమ వాళ్లకు చిక్కే రీతిలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయాన్నే అతి వేగంగా కార్లు దూసుకు రావడంతో వాటి వేగానికి కళ్లెం వేస్తూ ముందుకు సాగారు. అతి వేగంగా వచ్చిన కార్లను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సంపన్నులు, అధికారుల పిల్లలు అన్న తేడా లేకుండా జరిమానా మోత మోగించారు. 50 లగ్జరీ కార్లకు అయితే, ఏకంగా లక్షన్నర జరిమానా విధించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, మరో వంద వాహనాలకు లక్ష వరకు జరిమానా విధించారు. ఐదు కార్లను సీజ్ చేసినట్టు తెలిసింది. పూర్తి వివరాలను గురువారం ఆర్టీఏ అ«ధికారులు ప్రకటించనున్నారు. ఇక, ఏదో మొక్కుబడిగా... మమా అనిపించడం కన్నా, ఈ ప్రక్రియ నిరంతర కొనసాగాలని, అప్పుడే నిర్భయంగా రోడ్డు మీదకు రాగలమని ఆ పరిసర వాసులు పేర్కొంటున్నారు. ఈ తనిఖీలు ఓ వైపు సాగితే, మరో వైపు నగరంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉందో, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఎక్కడ జోరుగా సాగుతోందో పసిగట్టి, అందుకు తగ్గ చర్యలు తీసుకునే విధంగా నగర పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ నేతృత్వంలో ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులు పరుగులు తీశారు. ఆదివారం ప్రమాదరహిత చెన్నై నినాదంతో ముందుకు సాగిన పోలీసులు, ఇక, నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా ముందుకు సాగతుండడం గమనార్హం. -
వెలుగు చూసిన అవినీతి బాగోతం
ఏసీబీకి చిక్కిన రవాణా శాఖ అధికారి రూ. 6 కోట్లకు పైగా ఆస్తులు తల్లి, భార్య, కుమార్తెల పేరున ఆస్తులు గుర్తించిన ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం క్రైం : రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న చిట్టిబొమ్మల నాగ వెంకట హైమారావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర నగర్ లో ఉన్న ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. గురువారం ఉదయం శ్రీకాకుళం నుంచి వచ్చిన ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. అధికారులు హైమారావు అపార్ట్మెంట్లో పూర్తిస్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ దాడులలో హైమారావు అవినీతి చిట్టా బయటపడింది. రవాణా శాఖలో అనేక ప్రాంతాలలో పని చేసిన హైమారావు అనేక ప్రాంతాలలో ఆస్తులు కూడగట్టారు. హైమారావు కూడగట్టిన ఆస్తుల వివరాలు 10 ఫ్లాట్స్, 12 ఎకరాల భూములు, వైజాగ్, విజయవాడ, రాజమహేంద్రవరంలలోను, ఏలూరు, కడప, తదితర ప్రాంతాలలో ఇళ్లు భూములు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరంలో రూ 5.53 లక్షల విలువైన ఒక ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పాకలో 2.5 ఎకరాల భూమి, పశ్చిమ గోదావరి జిల్లా తంగెళ్లమూడిలో రూ.15 లక్షల విలువైన ఇంటి స్థం, అదే గ్రామంలో 5.82 ఎకరాల భూమి, ఉన్నట్టు గుర్తించారు. భార్య రజనీకుమారి పేరిట ఉన్న ఆస్తులు రాజమహేంద్రవరంలోని గాంధీ నగర్లో రూ .10 లక్షల విలువైన ఇల్లు, పిడింగొయ్యి గ్రామంలో 1002.36 ఎకరాల భూమి, (రూ.29,18,000 లక్షల విలువైన భూమి), తూర్పు గోదావరి జిల్లా కోలమూరు గ్రామంలో రూ.3,93 లక్షల విలువ గల ఇంటి స్థలం, తంగెళ్లమూడి గ్రామంలో 495 స్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం (రూ.14,85 లక్షల విలువైన స్థలం), తూర్పుగోదావరి జిల్లా రాజానగరం గ్రామంలో రూ 4.27 లక్షల విలువైన ఇంటి స్థలం, పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, కొప్పాక గ్రామంలో 2.02 సెంట్ల భూమి ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కుమార్తె పేరున ఉన్న ఆస్తులు విజయవాడలో హౌస్ ప్లాట్, పిడింగొయ్యిలో 450 స్కేర్ యార్డ్స్ స్థలం, తంగెళ్లమూడి గ్రామంలో రూ 12,90 లక్షల విలువైన 430 స్కేర్ యార్డ్స్ స్థలం, అలాగే రూ.4.42 లక్షల విలువైన 491 స్క్వేర్ యార్డ్స్ ఇంటి స్థలం ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. మరో కుమార్తె పేరిట.. మరోకుమార్తె ఆలైఖ్య పేరున విశాఖపట్నం లో రూ 2.55 లక్షలు విలువైన ఒక ఇంటి స్థలం, పిడింగోయ్యి గ్రామంలో 811.15 స్వెర్యార్డ్స్ ఇంటి స్థలం, రూ 23. 63లక్షలు విలువైన ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. అలాగే నల్గొండ జిల్లా బీబీ నగర్ లో రూ 3.20 లక్షలు విలువైన, 267 స్వెర్ యార్డ్స్ ఇంటి స్థలం, తంగెళ్ళమూడి గ్రామంలో 430 స్వేర్యార్డ్స్ ఇంటి స్థలం ఉన్నట్లు గుర్తించారు. తల్లి లక్ష్మి రాజేశ్వరి పేరున ఉన్న ఆస్తులు హైమరావు తల్లి లక్ష్మి రాజేశ్వరి పేరున రూ 13.లక్షల విలువైన కారు ఉన్నట్టు ఎసీబీ అధికారులు గుర్తించారు. ఈ సోదాలలో హైమారావు ఇంట్లో రూ 2.80 లక్షల నగదు, అరకేజీ బంగారు వస్తువులు, ఐదు కేజీల వెండి వస్తువులు, ఒక లాకర్లో రూ 20లక్షల విలువైన బంగారు నగలు, మరో లాకర్లో బ్యాంక్ బ్యాలన్స్ ఉన్నట్టు గుర్తించారు. జానీవాకర్ రెడ్ వైన్ 12 బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. హైమారావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లోని తంగెళ్లమూడి అద్దెవారి పేట. 1984లో అసిస్టెంట్ మోటార్ వెహిల్ ఆఫీసర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 1997 మోటారు వెహికిల్ ఇనస్పెక్టర్‌గా పదోన్నతి పై రాజోలులో బాధ్యతలు స్వీకరించారు. 2010లో రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆర్టీఓగా కృష్ణ జిల్లా నందిగామాలో పదోన్నతి పొందారు. రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లాలోను విధులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ఆర్టీఓ కార్యాలయంలో పని చేసి ప్రస్తుతం శ్రీకాకుళం ఆర్టీఓగా పనిచేసి సిక్లీవ్పై ఉన్న చిట్టిబొమ్మల నాగవెంకట హైమారావు అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2003లో విజయవాడలో పని చేస్తున్న సమయంలో ఓసారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఆయన తన విధానం మార్చుకోలేదు. -
ఆర్టీవో కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు
నగరంపాలెం: జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో మంగళవారం నుంచి నగదు రహిత లావాదేవీల కోసం స్వైపింగ్(పోస్) మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ జీసీ రాజరత్నం తెలిపారు. చిలకలూరిపేట, తెనాలి, బాపట్ల, మంగళగిరి, పిడుగురాళ్ల, మాచర్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు సోమవారం పోస్ యంత్రాలు అందించినట్లు తెలిపారు. నవంబరు 23 నుంచి గుంటూరు ఉప రవాణ కమిషనర్ కార్యాలయం, నరసరావుపేట ఆర్టీవో కార్యాలయం, దాచేపల్లి, మాచర్ల చెక్‌పోస్టుల్లో పోస్ యంత్రాల ద్వారా నగదు రహిత సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వివిధ పనులకుగాను, పోస్ యంత్రాల ద్వారా రూ.3,04,540 వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే వాహనదారులు క్రెడిట్, డెబిట్ కార్డులను తెచ్చుకుని పోస్ యంత్రాలను ఉపయోగించుకుని నగదు రహిత సేవలు పొందాలని డీటీసీ రాజరత్నం కోరారు. -
ఆన్లైన్ విధానంలో వాహన నంబర్ల కేటాయింపు
రాజానగరం : ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్ విధానంలో వాహనాలకు రిజిస్ట్రేషన్ నంబరును కంప్యూటర్లే కేటాయిస్తాయని రాష్ట్ర రవాణా అథారిటీ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) రమాశ్రీ అన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై జిల్లా ఆటోమోబైల్ డీలర్లకు గైట్ కళాశాలలో గురువారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా రమాశ్రీ మాట్లాడుతూ, వాహనాలకు కేటాయించే రిజిస్ట్రేషన్ నంబర్ తొలుత వాహన యజమానులకు తెలుస్తుందన్నారు. వాహనం సహా యజమానుల ఫొటోను డీలర్ల వద్దే తీయించాలని, జీపీఎస్ విధానంతో ఇది ముడిపడి ఉంటుందని చెప్పారు. ఆధార్ కార్డు వివరాలతోపాటు ప్రస్తుత చిరునామా, బీమా వివరాలు, ఇన్వాయిస్ కాపీ జత చేయాల్సి ఉంటుందన్నారు. ప్రతి ద్విచక్ర వాహనంతో ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ కచ్చితంగా విక్రయించాలని, ఫారం–22 వివరాలను కూడా కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. డీలర్ల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో డీటీసీ ఆనంద్, ఎంవీఐలు టీకే పరంధామరెడ్డి, సాయినాథ్, పద్మాకర్, రాజేంద్ర ప్రసాద్, ఎం.హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశ నిర్వహణకు సహకరించిన చైతన్య విద్యాసంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్య రాజు)కు నిర్వాహకులు కృతజ్ఙతలు తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన ఆర్టీఓ
అనంతపురం సెంట్రల్ : జిల్లా రోడ్డు ర వాణా శాఖ అధికారి (ఆర్టీఓ)గా కె. శ్రీధర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆర్టీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఈయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు ఉత్తమ సేవలందించడమే తన ప్రథమ లక్ష్యమన్నారు. -
ఆర్టీఓ ఆఫీస్‌లో దళారుల హవా
వారి గుప్పిట్లో కార్యాలయ సిబ్బంది నిబంధనల పేరుతో ఇబ్బందులు దళారుల చెంతకు వాహనదారులు రవాణా సేవల కోసం వస్తే జేబుకు చిల్లులే.. సాక్షి, హన్మకొండ : జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జోడు గుర్రాల సవారీ నడుస్తోంది. కార్యాలయ సిబ్బంది, దళారులు ‘కలిసి మెలిసి’ పని చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని పైకి చెబుతూనే లోపాయికారిగా దళారులకు సహకరిస్తున్నారు. వీరి మధ్య నెలకొన్న అన్యోన్యత కారణంగా డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల రిజిస్ట్రేషన్, పర్మిట్ తదితర పనుల కోసం వెళ్తున్న సామాన్యులు, వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. తారుమారు ‘జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో దళారులకు ప్రవేశం లేదు. ఎవరైనా కనిపిస్తే నేరుగా పోలీస్‌స్టేçÙన్కు పంపిస్తాం. రవాణాశాఖ కార్యాలయానికి కనీసం కిలోమీటరు దూరంలో ఆర్టీఏ ఏజెంట్ల కార్యాలయాలు ఉండాలి’.. ఇది ఏడాది క్రితం రవాణాశాఖ కార్యాలయంలో విధించిన నిబంధన. దీంతో ఇక దళారుల బెడద తప్పినట్టేనని సామాన్యులు, వాహనదారులు ఊపరి పీల్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయించుకున్నారు. అయితే గడిచిన ఆర్నెళ్లలో పరిస్థితి తారుమారైంది. దళారులు మళ్లీ రంగప్రవేశం చేశారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులతో కలిసిమెలిసి తిరుగుతున్నారు. వివిధ పనులపై కార్యాలయానికి వచ్చిన వారికి నిబంధనల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. ఆ ధాటికి తట్టుకోలేక వాహనదారులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారుల దగ్గరికి వెళ్లిన వాహనదారులు నిరే్ధశించిన ఫీజు కంటే రెండు..మూడు రెట్లు.. అవసరాన్ని బట్టి పది రెట్లు చెల్లించాల్సి వస్తోంది. జీరో నుంచి మొదలు.. లైసెన్స్, రిజిసే్ట్రషన్ తదితర సేవలు పొందాలంటే తొలుత ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. నిరే్ధశించిన రోజు సంబంధిత ధ్రువపత్రాలతో ఆర్టీఏ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. ఈ దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మొత్తం ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి. వీటిని జీరో కౌంటర్లు అంటారు. అయితే దళారులను సంప్రదించకుండా ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ నేరుగా ఇక్కడికి వచ్చేవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. జీరో కౌంటర్లలో పని చేస్తున్న సిబ్బంది ‘ఆధార్‌కార్డు జిరాక్సులో ఫొటో సరిగా కనిపించడం లేదు, చేతిరాత బాగాలేదు, ఇంటి నంబరు కరెక్టుగా లేద’ంటూ వివిధ కారణాలతో దరఖాస్తులను తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దళారుల ద్వారా వచ్చే దరఖాస్తులు చిటికెలో ఆమోదం పొందుతున్నాయి. దీంతో సిబ్బంది తీరుతో వేగలేక దళారులను ఆశ్రయిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. మొత్తం ఎనిమిది జీరో కౌంటర్లు ఉండగా ప్రస్తుతం ఆరు కౌంటర్ల వద్దకు దళారులు నేరుగా వచ్చి దరఖాస్తులు కుప్పలుగా ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. కాలక్రమేణా ఒక్కో కౌంటర్‌కు ఒక్కో దళారీగా పర్మినెంట్ అయిపోవడం ఇక్కడి నెలకొన్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆఖరిలో చెల్లింపులు.. జీరో కౌంటర్ గండం తప్పించుకున్న తర్వాత డ్రైవింగ్ టెస్టు, కంప్యూటర్ టెస్టు, వాహనం ఫిట్నెస్ తదితర పరీక్షలకు దరఖాస్తుదారులు హాజరు కావాలి. ఇక్కడ ఉత్తీర్ణులైన తర్వాత తిరిగి అడ్మినిస్ట్రేషన్ వింగ్‌కు దరఖాస్తులు చేరుకుంటాయి. అయితే ఇక్కడున్న సిబ్బందిని సైతం దళారులు తమ అజమాయిషీలో పెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల ద్వారా వెళ్లిన దరఖాస్తులు ఇక్కడ వెనువెంటనే చివరి దశకు చేరుకుంటాయి. లేని పక్షంలో ఏ కారణం లేకుండానే రోజుల తరబడి పెండింగ్‌లో ఉండిపోతాయనే విమర్శ పరిపానల విభాగంపై ఉంది. దళారులను ఆశ్రయించకుంటే 90 శాతం దరఖాస్తులకు పెండింగ్ గతి పడుతుందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిమోపెడు.. తమకు సహకరించిన రవాణాశాఖ సిబ్బందికి దళారులు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్సుకు ఆమోదముద్ర వేసినందుకు ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరు సిబ్బందికి రూ.100, పరిపాలన విభాగం సిబ్బందికి రూ. 200 ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాహనాల రిజిసే్ట్రషన్‌కైతే ఒక్కో దరఖాస్తుకు జీరో కౌంటరులో రూ. 700, పరిపాలన విభాగంలో రూ. 1500 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చెల్లింపులకు తమ కమీషన్లు కలుపుకుని దళారులు వాహనదారుల వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టూ వీలర్ లెర్నింగ్ లైసెన్సు (సింగిల్ కేటగిరి)కు రూ. 60 చెల్లిస్తే సరిపోతుంది. కానీ దళారులు రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి సగటున ప్రతిరోజు 600 దరఖాస్తులు వస్తున్నాయి. అంటే ఇక్కడ నిత్యం లక్షలాది రూపాయల ప్రజల సొమ్ము లంచాల రూపంలోకి మారుతోంది. రోజు వందల మంది నష్టపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. -
ఆ ఫ్యాన్సీ నంబర్ ధర రూ.2,51,000
వాహనాల నెంబర్లు తమ హుందాతనాన్ని ప్రస్ఫుటిస్తాయని నమ్ముతారు కొందరు. తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడానికి ఎంత ఖర్చైన వెనకాడరు. తాజాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్టీవో పరిధిలో టీఎస్ 07 ఎఫ్ సీ 7777 నెంబర్‌ను వేలంపాట నిర్వహించగా.. అందరి కంటే ఎక్కువగా రూ. 2,51,000లు పెట్టి సెవన్ హిల్స్ గ్లోబల్ వారు నెంబర్‌ను తమ సొంతం చేసుకున్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో రవాణా సేవలు
తిమ్మాపూర్: రవాణాశాఖ సేవలన్నీ మంగళవారం నుంచి ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ తెలిపారు. రవాణాశాఖలోని 57 సేవలకు సంబంధించి దరఖాస్తుదారులు మొదట ఆన్లైన్లో, మీ సేవా, ఈ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకుని అక్కడే ఫీజులు చెల్లించాలని చెప్పారు. ఆ తరువాత పత్రాలను ఆర్టీఏ ఆఫీసుల్లో సమర్పించాలని సూచించారు. మంగళవారం నుంచి ఆర్టీఏ ఆఫీసులో సేవలకు సంబంధించి నేరుగా డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదని, అంతా ఆన్లైన్లోనే చెల్లించాలని పేర్కొన్నారు. దీనిని దరఖాస్తుదారులు గమనించి సహకరించాలని కోరారు. సేవలు అందించినందుకు మీ సేవా, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులకు రూ.35 ఫీజు చెల్లించాలని చెప్పారు. -
నిలిచిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు
పాత శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఉప రవాణాశాఖ కార్యాలయంలో రెండు రోజులుగా ఆన్లైన్ సేవలు మొరాయిస్తున్నాయి. మంగళవారం కుడా సేవలు స్తంభించిపోయాయి. దీంతో వివిధ రకాల పనులపై ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్, లీజర్లైన్ సేవలన్నీ ఒకేసారి మొరాయించడంతో ఆన్లైన్ నెట్వర్కులు ఏ ఒక్కటీ పనిచేయలేదు. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల ప్రక్రియ నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారంతా గంటల కొద్దీ నిరీక్షిస్తూ నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై రవాణాశా«ఖాధికారులు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కేబుల్ వైర్లు పాడయ్యాయని, వీటికి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. -
రవాణాశాఖ ఆన్లైన్ సేవలపై శిక్షణ
తిమ్మాపూర్ : రవాణాశాఖకు సంబంధించిన ఆన్లైన్ సేవలపై మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాల నిర్వాహకులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్ డీటీసీ వినోద్‌కుమార్ తెలిపారు. రోజుకు మూడు బ్యాచ్‌ల చొప్పున జిల్లాలోని నిర్వాహకులకు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఆన్లైన్ సేవలకు దరఖాస్తు చేసుకునే వి«ధానం నేర్చుకునేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. -
నేడు ఆర్టీఏ కార్యాలయానికి రవాణాశాఖ మంత్రి
తిమ్మాపూర్ : హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తిమ్మాపూర్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం రానున్నట్లు డీటీసీ వినోద్‌కుమార్ తెలిపారు. కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్పర్సన్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నగర మేయర్ హాజరవుతారని పేర్కొన్నారు. మండలంలోని జెడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకావాలని కోరారు. ఏర్పాట్లలో అధికారులు.. ఆర్టీఏ ఆఫీస్‌లో మొక్కలు నాటే కార్యక్రమానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా వస్తున్న సందర్భంగా డీటీసీ, ఎంవీఐలు, ఏఎంవీఐలు, కార్యాలయ ఉద్యోగులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యాలయ ఆవరణలో భూమి చదునుతోపాటు 500 మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వకాన్ని పూర్తిచేశారు. మొక్కలు నాటిన అనంతరం నూతనంగా వేసిన బోరు మోటార్‌ను వారు ప్రారంభిస్తారని డీటీసీ వినోద్ పేర్కొన్నారు. కార్యాలయాన్ని చెట్లతో పచ్చగా ఉండేలా తయారుచేస్తామని తెలిపారు. ఎంవీఐలు కొండాల్‌రావు, శ్రీనివాస్, రవీందర్, కిషన్‌రావు, ఏఎంవీఐ రజనీబాయి తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాన్సీ నంబర్ రూ. 4.8 లక్షలు
హైదరాబాద్: వాహనాల ఫ్యాన్సీ నంబర్ల కోసం వినియోగదారులు పోటీపడి మరి భారీ మొత్తం చెల్లించి దక్కించుకుంటున్నారు. తమకు నచ్చిన నంబరు కావాలనుకున్న వారు.. ఎంత రేటు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా గురువారం టీఎస్ 11 ఈఎఫ్ 9999 నంబర్ రూ. 4.8 లక్షల ధర పలికింది. మలక్‌పేట్ ఆర్టీవో పరిధిలో వెంకట్‌రెడ్డి అనే వ్యాపారి ఈ నంబర్‌ను దక్కించుకున్నాడు. మలక్‌పేట్ పరిధిలో ఇంత మొత్తానికి నంబర్ అమ్ముడు పోవడం ఇదే మొదటి సారి అని ఆర్టీవో అధికారులు తెలిపారు. గత వారంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో టీఎస్ 09 ఈఎల్ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.10 లక్షలు వెచ్చించిన విషయం తెలిసిందే. -
వాహన రిజిస్ట్రేషన్ చేయించుకోండిలా
పాలకోడేరు రూరల్ :వాహనాలను కొనుగోలు చేసిన వారు విధిగా రిజస్ట్రేషన్ చేయించుకోవాలి. వాహన కంపెనీ డీలర్ నుంచి టీఆర్ తీసుకున్న 30 రోజుల్లో పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు భీమవరం ప్రాంతీయ రవాణా అధికారి (ఆర్డీవో) జె.రమేష్‌కువూర్. రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం, తదితర వివరాలు ఆయన మాటల్లోనే.. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) వాహనం కొనుగోలు చేసినప్పుడు సదరు వాహన కంపెనీ డీలర్ తాత్కాలిక రిజస్ట్రేషన్ (టీఆర్) నంబర్ ఇస్తారు. ఆ నంబర్‌తో ఉండే రిజస్ట్రేషన్ కేవలం 30 రోజులు మాత్రమే పనిచేస్తుంది. 30 రోజుల్లోపు వాహనానికి పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోవాలి. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ పొందండిలా పర్మినెంట్ రిజస్ట్రేషన్ కోసం సమీపంలోని ప్రాంతీయు రవాణా అధికారి (ఆర్టీవో) కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. వాహనానికి సంబంధించి డీలర్ ఇచ్చిన పత్రాల కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనం అయితే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, హెల్మెట్ బిల్లు జత చేయాలి. కారు యజమాని అయితే ఆధార్, పాన్ కార్డు కాపీలను జత చేయాలి. ద్విచక్ర వాహనానికి అయితే రూ.445, ఆటోకు రూ.350, కారుకు రూ.635, ట్రాక్టర్‌కు రూ.700, లారీకి రూ.900, ఇతర మినీ లారీలకు రూ.625 చొప్పున చలానా రూపంలో చెల్లించాలి. అనంతరం దరఖాస్తును ఆర్టీవో సిబ్బంది హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) విభాగానికి పంపిస్తారు. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ కోసం.. హెచ్ఎస్ఆర్పీ విభాగం దరఖాస్తును పరిశీలించి అదే రోజున పర్మినెంట్ నంబర్ కేటాయించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) ఇస్తుంది. ఈ నంబర్ ప్లేట్ కోసం ద్విచక్ర వాహనానికైతే రూ.245, నాలుగు చక్రాల వాహనాలకైతే రూ.630 రుసుము వసూలు చేస్తారు. అనంతరం వాహనాన్ని పరిశీలన కోసం రిజస్ట్రేషన్ దరఖాస్తును అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)కి పంపిస్తారు. ఏఎంవీఐ ఆ వాహనాన్ని పరిశీలిస్తారు. డీలర్ ఇచ్చిన పత్రాల్లోని వివరాల ఆధారంగా వాహనం మోడల్, ఛాసిస్ నంబర్, ఇంజిన్, వాడే ఇంధనం తదితర అన్ని వివరాలను పరిశీలిస్తారు. ఫారం-21 ప్రకారం అన్నీ పరిశీలించి.. వివరాలన్నీ సక్రమంగా ఉంటే ఆమోదం తెలియజేస్తారు. అనంతరం దరఖాస్తును ఏపీ ట్రాన్స్పోర్ట్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయినట్టే. అనంతరం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (ఆర్సీ) వివరాలు పొందుపర్చిన కార్డును దరఖాస్తు చేసిన నాలుగు రోజుల్లో పోస్టు ద్వారా వాహన యజమాని ఇంటికి పంపిస్తారు. ఆర్సీ కార్డులో వాహనం రకం, మోడల్, వాడే ఇంధనం, రంగు, యూజవూని పేరు, చిరునామా తదితర వివరాలు ఉంటాయి. రిజస్ట్రేషన్ చేయించకపోతే.. వాహనం కొనుగోలు సవుయుంలో ఇచ్చే తాత్కాలిక రిజస్ట్రేషన్ గడువు 30 రోజుల్లోపు పర్మినెంట్ రిజస్ట్రేషన్ చేయించుకోకపోతే తనిఖీల సమయంలో వాహనాన్ని సీజ్ చేస్తారు. వాహన యజమానికి జరిమానా కూడా విధిస్తారు. ద్విచక్ర వాహనమైతే రూ.2 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. -
22,581 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
రామభద్రపురం(తెర్లాం రూరల్) : పార్వతీపురం డివిజన్లో ఏర్పాటుచేసిన 86 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 22,581 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీవో) రోణంకి గోవిందరావు చెప్పారు. ఆయన బుధవారం రామభద్రపురం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పార్వతీపురం డివిజన్లోని 2,957 మంది రైతుల నుంచి రూ.31.86 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. రైతులకు డబ్బు త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులకు కొత్తగా రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. పార్వతీపురం డివిజన్లో 12 రేషన్ డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని త్వరలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలోని పీఆర్ డిపోల్లో 41 డీలర్ పోస్టులు భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పుడు కులధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు : ఆర్డీవో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తిపై దర్యాప్తు చేస్తున్నామని ఆర్డీవో గోవిందరావు తెలిపారు. రామభద్రపురం మండలం రొంపిల్లికి చెందిన పీవీ మల్లికార్జునరాజు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో పాడేరు ఆర్టీసీ డిపో మేనేజరుగా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇటీవల ఆయనపై విజిలెన్స్ అధికారులు దాడి చేశారని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగంలో చేరాడని గుర్తించారన్నారు. దీనిపై తనను దర్యాప్తు అధికారిగా కలెక్టర్ నియమించారని తెలిపారు. ఆయన ఎస్టీ కాదని తమ దర్యాప్తులో తేలిందని, నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని చెప్పారు. లోకాయుక్త ఫిర్యాదుపై దర్యాప్తు తనకు రామభద్రపురం తహశీల్దార్, వీఆర్వోలు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని రొంపిల్లి గ్రామానికి చెందిన బి.నీలకంఠరాజు లోకాయుక్తలో చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు. తహశీల్దార్ ఎం.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీవోపై ఎమ్మెల్యే అసహనం
మునిసిపల్ చైర్‌పర్సన్‌ను నిలదీసిన తమ్ముళ్లు మంత్రి సుజాత ముందు పంచాయితీ గంటపాటు ఆసక్తిగా తిలకించిన స్థానికులు నరసాపురం అర్బన్ :అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యేగా తనను అటు అధికారులు, ఇటు సొంత పార్టీ ప్రజా ప్రతినిధి పట్టించుకొనకపోవడంపై ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం వలందర రేవు సాక్షిగా మంత్రి పీతల సుజాత ఎదుట ఎమ్మెల్యే అధికారులపై తనకున్న అసహనాన్ని వ్యక్తం చేశారు. సుమారు గంట పాటు జరిగిన ఈ వ్యవహారాన్ని స్థానికులు ఆసక్తిగా గమనించారు. వివరాల్లోకి వెళితే మంత్రి పీతల సుజాత పుష్కర అభివృద్ధి పనులు పరిశీలించేందుకు వలందర రేవుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కూడా అక్కడకు వచ్చారు. ఒక్కసారిగా ఎమ్మెల్యే ఏర్పాట్లపై అధికారులను నిలదీశారు. అంతా మీ ఇష్ట ప్రకారం చేసుకుపోతే నేనెందుకు అంటూ నరసాపురం ఆర్డీవో డి.పుష్పమణిపై అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో పుష్కరాల సమయంలో ట్రాఫిక్ నిబంధనలు దారుణంగా విధిస్తున్నారని ఎమ్మెల్యే మంత్రికి వివరించారు. ఎక్కడో చిట్టవరం వద్ద వాహనాలు నిలిపివేసే విధంగానూ, ఘాట్ల వద్ద ఒక రేవు నుంచి మరో రేవుకు వెళ్లకుండా బారికేడ్లు కట్టడం ఏమిటని ఆర్డీవోను ప్రశ్నించారు. ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నారని నిలదీశారు. నన్ను గేట్ దగ్గర నిలబడమంటారా ! మీరు చేస్తున్న పనుల వల్ల జనం తిట్టుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపి వేసి జనాలను రాకుండా చేస్తామంటున్నారు.. మరి నన్ను అక్కడ గేటు వద్ద నిలబడి జనాన్ని వెనక్కి పంపమంటారా అంటూ ఎమ్మెల్యే ఆర్డీవోను ప్రశ్నించడంతో అంతా నిర్ఘాంతపోయారు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే ఎలాగని ప్రశ్నించారు. దీనిపై మంత్రి సుజాత కలుగజేసుకుని సమన్వయంతో పనిచేయకపోతే ఎలా అని, ఎమ్మెల్యేని సంప్రదించకుండా వ్యవహరించడం ఎందుకని ఆర్డీవోనూ అడిగారు. వెంటనే ట్రాఫిక్ నిబంధనలపై పునరాలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ముందు చైర్‌పర్సన్‌ను నిలదీసిన తమ్ముళ్లు ఎమ్మెల్మే, ఆర్డీవోల మధ్య వివాదం అనంతరం కూడా వలందర రేవు వద్ద పంచాయితీ నడిచింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొప్పాడ రవీంద్ర మరికొందరు మంత్రి సమక్షంలో మునిసిపల్ అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యే పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మునిసిపల్ చైర్పర్సన్ రత్నమాలను నిలదీశారు. గోదావరి పొడవునా జరిగిన గ్రానైట్ రెయిలింగ్ వద్ద మీ పేరు మాత్రమే ఎందుకు వేసుకున్నారని, ఎమ్మెల్మే పేరు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దీనికి చైర్పర్సన్ కూడా దీటుగా సమాధానం ఇవ్వడంతో మంత్రి ముందే వాగ్వివాదం జరిగింది. అవసరమైన చోటల్లా ఎమ్మెల్యే పేరు వేస్తున్నామని, దీన్ని గమనించాలని చైర్పర్సన్ అన్నారు. అయితే వలందర రేవుకు ఎన్టీఆర్ పేరు పెట్టమని పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా లేఖ రాస్తే ఎందుకు చర్య తీసుకోలేదని, మునిసిపల్ పనులు మీ డబ్బుతో జరగడం లేదని గుర్తు పెట్టుకోవాలని రవీంద్ర అన్నారు. దీనికి చైర్పర్సన్.. అభివృద్ధి పనులు పార్టీ కార్యక్రమాలు కాదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని అన్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. మంత్రి సుజాత జోక్యం చేసుకుని ముందు పుష్కరాల పనిని విజయవంతంగా ముగిద్దాం, తరువాత రాజకీయాలు చూసుకుందాం అంటూ సర్ది చెప్పారు. ఇంత జరుగుతున్నా పక్కనే ఉన్న ఎమ్మెల్యే మౌనంగా ఉండడం చర్చనీయాంశమయింది. ఈ ఘటనతో ఎమ్మెల్యే, చైర్పర్సన్ మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమైనట్టయింది. -
వేటు పడింది
విశాఖపట్నం: అనకాపల్లి రవాణాశాఖ కార్యలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నఅధికారులపై వేటు పడింది. విద్యార్హతలను పరిశీలించకుండా డైవింగ్ లైసెన్స్, బ్యాడ్జీలు అందించారని ఉద్యోగులపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై పైఅధికారులకు రికార్డులు దొరకకుండా కింది స్థాయి ఉద్యోగులు మాయం చేసినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆర్డీవో మహ్మద్ సలీం,ఏఓ నర్సింహులు, సీనియర్ అసిస్టెంట్ నాగమణి లపై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం అర్ధరాత్రి ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ రవాణాశాఖ కమిషననర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆర్డీవోనా.. ఐతేఏంటి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు :అక్రమాలను, అవకతవకలను అడ్డుకోవాలంటూ స్వయంగా ఉన్నతాధికారులు ఆదేశించినా కొంతమంది ఉద్యోగులు ఖాతరు చేయని పరిస్థితులు జిల్లాలో ఎక్కువవుతున్నాయి. ఎక్కడికక్కడ మామూళ్ల మత్తులో జోగుతున్న అక్రమార్కులు ఉన్నధికారులను సైతం లెక్కచేయకుండా వారి కళ్లకు గంతలు కట్టేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. పోలవరం సమీపంలోని ఇసుక ర్యాంపుల నుంచి బిల్లులు లేకుండా భారీ వాహనాల్లో ఇసుకను తరలించడం పరిపాటిగా మారింది. ఆ వాహనాలు దేవరపల్లి-తల్లాడ స్టేట్ హైవేపై వెళ్లాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మీదుగా వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న వాహనాలు ఎటువంటి బిల్లులు లేకుండానే పక్కదారుల మీదుగా రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి. లక్షలాది రూపాయల విలువైన ఇసుక లోడుతో ఆయా వాహనాలు ఎటువంటి బిల్లులు లేకుండా వెళ్తున్నా సంబంధిత శాఖల అధికారులు, ఉద్యోగులు మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదలేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించి ఆదేశాలు జారీ చేసినా ఉద్యోగులు, కిందిస్థాయి అధికారులు లెక్కచేయడం లేదు. గత నెల 29వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గోపాలపురం రోడ్డుపై 12 టైర్ లారీ (టీఎస్-08 యూబీ 2287) ఇసుక లోడుతో వెళ్తుండటాన్ని స్వయంగా చూసిన జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎస్.లవన్న వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేశారు. నిబంధనలను అతిక్రమించి వెళ్తున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సూచించారు. అయితే సదరు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు మాత్రం కనీస మాత్రంగా కూడా ఆర్డీవో ఆదేశాలను ఖాతరు చేయలేదు. పట్టుకున్న లారీని వదిలివేశారు. ఎటువంటి బిల్లులు లేకుండా తరలివెళ్లిన ఆ లారీపై కేసు పెట్టేందుకు పోలీసులు కూడా సుముఖత చూపలేదు. ఇదేమిటని అడిగితే.. లారీ ఉంటే స్వాధీనం చేసుకుని కేసు పెడతాం గానీ లేకుండా కేసేంటని ఎదురు ప్రశ్నలు వేశారు. స్వయంగా ఆర్డీవో ఆదేశించినా పట్టుకున్న లారీని వదిలేసిన వ్యవహారంపై ఇప్పుడు పోలీస్, రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. లారీ వదిలేశారా.. నాకు తెలియదే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లోడుతో వెళ్తున్న 12 టైర్ లారీని సీజ్ చేయాల్సిందిగా నేను ఆదేశించాను. ఆ వాహనాన్ని వదిలేసిన విషయం నాకు తెలియదు. ఎందుకు వదిలేశారో కనుక్కుంటా.. లారీ నెంబర్ ఉంది కాబట్టి ఈసారి వచ్చినప్పుడు పట్టుకుని డబుల్ ఫైన్ కట్టిస్తా. - ఎస్.లవన్న, ఆర్డీవో -
కోర్టు ధిక్కారం కేసులో ఆర్డీవోకు జైలు, జరిమానా
నరసరావుపేట ఆర్డీవో అరుణ్‌బాబుపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమే కాకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినందుకు గుంటూరు జిల్లా, నరసరావుపేట రెవిన్యూ డివిజినల్ అధికారి(ఆర్డీవో) పి.అరుణ్‌బాబుకు ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కారం కింద వారం రోజుల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. ఈ మేరకు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి తీర్పు వెలువరిం చారు. దీనిపై అప్పీల్‌కు వీలుగా ఆర్డీవో తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును నెల రోజుల పాటు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో ఎస్.నరసింహారావు అనే వ్యక్తి రెండెకరాల డీకేటీ పట్టా భూమిని సాగు చేసుకుంటున్నారు. దీనిపై నడిచిన వ్యవహారంలో న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. -
మాసూళ్లయినా..మోపెడు కష్టాలే
పంటను అమ్ముదామంటే.. మద్దతు, గిట్టుబాటు ధరల మాటటుంచి కొనే దిక్కే లేదు. సర్కారీ కొనుగోలు కేంద్రాలున్నా ఉపయోగం శూన్యం. ఖరీఫ్ మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న వేళ అన్నదాతల అవస్థలను ‘వీఐపీ రిపోర్టర్’ ద్వారా వెలుగులోకి తేవాలన్న ‘సాక్షి’ ఆలోచనను రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు ఆమోదించారు. శనివారం కె.గంగవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన చేసిన ‘వీఐపీ రిపోర్టింగ్’ విశేషాలివి.. రైతుల మేలు, మేలుకొలుపులకు కృషి చేస్తా...రైతులతో ముఖాముఖి మాట్లాడటం వల్ల క్షేత్రస్థాయిలో మద్దతు ధర, ధాన్యం కొనుగోలు కేంద్రాలతో సాధకబాధకాల వంటి సమస్యలు తెలుసుకున్నాను. వారికి వ్యవసాయశాఖాధికారులు సరైన అవగాహన కల్పించడం లేదని తెలిసింది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, చేస్తున్న సూచనలు ైరె తుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. పొలంబడిలో రైతులను చైతన్యం చేయాల్సి ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను, ప్రతి పథకాన్నీ రైతులుసద్వినియోగం చేసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తాం. ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులువినియోగించుకుని మంచి ధర పొందేలా అన్ని స్థాయిల్లో అధికారులకు స్వయంగా తెలియచేస్తాను రిపోర్టర్ కె. సుబ్బారావు,ఆర్టీఓ,రామచంద్రపురం ఆర్డీఓ కె.సుబ్బారావు : బాబూ నీ పేరేంటయ్యా...? రైతు : పర్వతిని సత్యన్నారాయణండీ.... ఆర్డీఓ : ఏంటీ వ్యవసాయం ఎలా ఉంది? ఎన్ని ఎకరాలు చేస్తున్నావు? తొలకరికి ఎంత పండించావు? రైతు : ఏటా బాడి పిసుక్కుని పంట పండిస్తున్నా తగిన డబ్బులు రావటంలేదు. ఈసారి 11 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఆర్డీఓ : 75 కేజీల బస్తా రేటు ఎంత ఉంది? రైతు : నెమ్ము 18 శాతం దాకా వస్తంటే మిల్లోళ్లు 15 శాతం ఉంటే గానీ కొనమంటున్నారు. ఇప్పటి దాకా ఊళ్లో గింజ కూడా కొనలేదండీ. ఆర్డీఓ : కూలీ డబ్బులు ఎలా ఇస్తున్నారు? రైతు: కుప్ప నూరుత్తున్నానాండీ.. సందేలకి కూలీలకి రూ.15 వేలు దాకా ఇయ్యాల. అక్కడో పదేలు, ఇక్కడో పదేలు తెత్తాను. ఆనక దాన్యం అమ్మాక సావుకారికి తీర్చాలంతే... ఆర్డీఓ : నీపేరేంటయ్యా? రైతు : తాడాల ఏడుకొండలండి. మూడెకరాలు ఏసి, పుత్తు పూస తాకట్టెట్టి పెట్టుబడి ఎట్టానండి. ఆ డబ్బులొత్తాయో లేదో తెలత్తాలేదండీ...? ఆర్డీఓ : తాతా నీ పేరేంటి? కూలి రేట్లు ఎలా ఉన్నాయి? రైతు : కొరమాటి సుబ్బారావండీ. వుప్పుడు సీజన్ కదాండీ మగాళ్లకు రూ.600 నుంచి రూ.700వరకు ఉంది బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటి బాబూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల గురించి తెలుసా? రైతు : దంగేటి సుర్యనారాయణండీ. మాకు పెబుత్వం పెట్టిన వాటి కాడికి దాన్యాన్ని పట్టికెళ్లటం చేనా కట్టం బాబూ. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? ప్రభుత్వ సహకారం అందుతోందా? రైతు : అల్లూరి వీరవెంకట సత్యన్నారాయణండీ. ఏం పెబుత్వమండీ బాబూ.. సీజన్ అయిపోయినాక అప్పులు ఇత్తే ఏటి లాభం? ఆర్డీఓ : నీ పేరేంటి పెద్దయ్యా? నీవెంత చేను పండిస్తున్నావు? కీ ఇబ్బందులేంటి? రైతు : బోడపాటి అర్జునరావయ్యా. గింజలకు సరైన ధర అందటంలేదు. ఆర్డీఓ : కొనుగోలు కేంద్రాలున్నాయిగా? రైతు : ఆళ్లేమో 15 నెమ్ముండాలంటారు బాబూ. ఇయ్యేమో 18 నెమ్ముంటున్నాయి. ఆర్డీఓ : నీ పేరేంటయ్యా? వెదజల్లే విధానం పాటిస్తున్నారా? రైతు : పర్వతిని సత్యన్నారాయణ సార్! 20 ఏళ్ల క్రితమే ఎదజల్లేనండీ. ఎద సాగు బానే ఉంటంది. ఈ ప్రాంతంలో రైతులు ఈ పద్దతే ఎక్కువగా రెండో పంటలో వేత్తున్నారు. ఆర్డీఓ : శ్రీవరి సాగు మీకు తెలుసా? వ్యవసాయాధికారులు ఏమైనా సూచనలిస్తున్నారా? రైతు : శ్రీవరి సాగు బానే ఉంటుంది గాని సారూ.. పెట్టుబడి ఎక్కువ. వ్యవసాయాధికారులు మా దగ్గరకు రారు సారూ! ఆర్డీఓ : నీ పేరేంటి? మీకు రుణాలు ఏమైనా ఇస్తున్నారా? పెట్టుబడులు ఎలా పెడుతున్నారు? రైతు : సత్యసాయి వెంకటరమణండీ. డిగ్రీ చదివి వ్యవసాయం చేస్తున్నా..అంత లాభసాటిగా లేదండి. ఆర్డీఓ : చదువుకున్నావు కదా.. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తున్నావా? రైతు : వ్యవసాయాధికారులు ఎప్పుడు మీటింగులు పెడుతున్నారో తెలియటం లేదు. ఆర్డీఓ : సేంద్రియ పద్ధతుల్ని ఎందుకు ఎంచుకోవటంలేదు? పొలంబడికి వెళుతున్నారా? రైతు: ఈ ప్రాంత రైతులకు దీనిపై ఇంకా అవగాహన లేదు. పొలంబడి ఎక్కడో ఒక చోట పెట్టి, అధికారులు వచ్చి వెళుతున్నారు తప్ప ఉపయోగంలేదు. ఆర్డీఓ : మీపేరేంటండీ? మీరెంత వ్యవసాయం చేస్తున్నారు? మీ ఇబ్బందులేంటి? రైతు : జానకిరామయ్యండీ. మూడెకరాలు చేస్తున్నాను. 80 బస్తాల వరకు పండినా కూలీలకే రూ.54 వేలు ఖర్చయ్యింది. ఆర్డీఓ : ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను ఎందుకు వినియోగించుకోవటం లేదు? రైతు : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు మాకు ఖర్చవుతుంది. అదే మిల్లర్లయితే ఆ ఖర్చు వారే భరించి తీసుకెళతారండీ. ఆర్డీఓ : నీ పేరేమిటయ్యా? మద్దతు ధర లభిస్తోందా? రూ.1020, రూ.1060 వస్తున్నాయా? రైతు : నరసింహ మూర్తి అండీ. పెట్టుబడులు వస్తే చాలు.. గిట్టుబాటు ఎక్కడ వస్తుంది సారూ. అమ్ముదామంటే కొనేవాడే కనిపించడం లేదండీ. రూ.980, రూ.990 అంటున్నారు. అదీ 17 శాతం నెమ్ములున్నాయంటే ప్రతి ఒక్కశాతానికి కేజీ కటింగ్ పెడుతున్నారండీ. ఆర్డీఓ : నేనూ రైతు బిడ్డనే. మీ ఇబ్బందులన్నీ అర్థమయ్యాయి. అధికారులకు చెప్పి కొనుగోలు కేంద్రాలపై మీకు తెలియచేసే ఏర్పాటుచేస్తా. వ్యవసాయాధికారులు మీ దగ్గరకు వచ్చేలా ఆదేశాలు జారీచేస్తాను. సరే వెళ్లి రమ్మంటారా. రైతులు : మంచిది సారూ.. ప్రజెంటర్స్: - లక్కింశెట్టి శ్రీనివాసరావు, చెల్లుబోయిన శ్రీనివాస్ ఫోటోలు : గరగ ప్రసాద్ -
ఆపద్‌బంద్
తిప్పర్తి మండలం వెంకట్రాదిపాలానికి చెందిన పులిచింతల సంతోష్ రెడ్డి గతేడాది మార్చి 29న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఇతనికి సంబంధించిన ఫైల్ ఆర్డీఓ నుంచి కలెక్టరేట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 29న వచ్చింది. అంటే వ్యక్తి మృతిచెందిన ఏడాది తర్వాత ఫైల్ పంపడం వల్ల ఆపద్బంధు కింద పొందాల్సిన సాయం కోల్పోవాల్సి వచ్చింది. నీలగిరి : వివిధ కారణాలతో చనిపోయిన వారి కుటుంబాలను ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆపద్బంధు పథకం ఆగిపోయింది. ఇంటి పెద్దనో.. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన వారు ప్రభుత్వం అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకుంటుందని ఆశగా దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. ఇంటి వ్యక్తి చనిపోయిన బాధ ఒకవైపు ఉంటే..అటు అధికారుల తీరుతో బాధిత కుటుంబాలు మరింత కుంగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుదాఘాతం, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ మృతులు, ఇతర ప్రమాదాలబారిన పడి చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆపద్బంధు పథకం కింద రూ.50 వేల వరకు ఆర్థికసాయం అందుతుంది. నిబంధనల ప్రకారం అయితే మరణించిన వ్యక్తి కుటుంబాలకు తక్షణమే ఈ పథకం కింద ఆర్థికసాయం అందించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం వల్ల నెలల తరబడి వే చి చూడాల్సి వస్తోంది. పలు సందర్భాల్లో ఈ దరఖాస్తులను ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాల్సి వస్తోంది. తద్వార బాధిత కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది. ఈ దరఖాస్తులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించడం ద్వారా కేవలం రూ.20 వేలు మాత్రమే వారికి అందుతుంది. ప్రతి ఏడాది నవంబర్ 1 తేదీ నుంచి తర్వాతి ఏడాది నవంబర్ 2 వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆపద్బంధు పథకం కింద వర్తింపజేస్తారు. ఈ గడువు దాటిని తర్వాత ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను సీఎం సహాయ నిధికి పంపిస్తున్నారు. అధికారుల అలసత్వం... 2013-14 సంవత్సరానికిగాను జిల్లావ్యాప్తంగా ఆపద్బంధు పథకం కింద 224 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పంపడంలో తహసీల్దార్లు, ఆర్డీఓలు తీవ్ర జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్డీఓల నుంచి వచ్చిన ఫైళ్లపై కలెక్టరేట్ అధికారులు లేనిపోని కొర్రీలు పెట్టి మరింత జాప్యం చేస్తున్నారు. అధికారులు చేస్తున్న ఇలాంటి తప్పిదాల వల్ల జిల్లాలో 25 దరఖాస్తులు సీఎం రిలీఫ్ ఫండ్ కు మళ్లించాల్సి వచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రద్దు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.16 లక్షల చెక్కులు ర ద్దయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం 56 కుటుంబాలకు చెందిన చెక్కులు రద్దు అయినట్లు తెలుస్తున్నప్పటికీ అనధికారికంగా ఈ మొత్తం ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ముందు సీఎం సహాయం నిధి కింద జిల్లాకు రూ.16 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఈ చెక్కుల కాలపరిమితి నెలరోజుల మాత్రమే ఉంటుంది. ఎన్నికల హడావిడి కారణంగా బాధిత కుటుంబాలకు చెక్కులు జారీ కావడంలో జాప్యం జరిగింది. దీంతో ఈ నిధికి మంజూరైన సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి తిప్పి పంపారు. చె క్కుల కాలపరిమితి ముగియడంతో బ్యాంకర్లు కూడా ఆ చెక్కులు చెల్లవని చెప్పారు. దీంతో సీఎం సహాయ నిధి కోసం బాధిత కుటుంబాలు కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నా అధికారుల్లో ఏమాత్రమూ చలనం లేకుండా పోయింది. కుటుంబ పోషణ భారంగా మారింది నా కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుటుంబాన్ని పోషించే కుమారుడు మరణించడం వల్ల పోషణ భారంగా మారింది. నా పెద్ద కొడుకు ఓ షాపులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వాహనాల టైర్లకు పంక్చర్లు అతికిస్తూ జీవనం సాగిస్తున్నాం. ఆపద్బంధు పథకానికి దరఖాస్తు చేసి నాలుగు మాసాలు కావస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. - శివలింగాచారి, మర్రిగూడ, నల్లగొండ అప్పుల బాధ వెంటాడుతోంది నా భర్త యాదయ్య రోడ్డు ప్రమాదంలో మరణించి పది మాసాలైంది. నాటినుంచి మా కుటుంబం అప్పులబాధతో ఆర్థిక స మస్యలు ఎదుర్కొంటున్నాను. మా అమ్మాయి పెళ్లి చేయాల్సి ఉంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఆపద్బంధు పథకం ద్వారా వెంటనే డబ్బులు వస్తాయని అధికారులు చెప్పారు. రెండుసార్లు ఇంటికి వచ్చి వివరాలు తీసుకున్నారు. కలెక్టర్ కార్యాల యానికి రావాలని చెప్పి వెళ్లారు. ఇప్పటివరకు ప్ర భుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. - వై.యశోద, నెమ్మాని, నార్కట్‌పల్లి మండలం -
ఆర్డీఓ, ఇద్దరు తహసీల్దార్లపై కేసు
ఆత్మకూరు : నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఓఆర్ పాస్‌పుస్తకం జారీ చేసిన ఆర్డీఓతో సహా ఇద్దరు తహసీల్దార్లు, ఎంఆర్ఐ, వీఆర్ఓపై ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణలో కొంతజాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు ఆత్మకూరు ఎస్సై వి.క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదుదారుడు గురిజాల శ్రీరామ్‌రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని దామెరకు చెందిన గురిజాల దామోదర్‌రెడ్డికి కుమారులు శ్రీరామ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఉన్నారు. దామోదర్‌రెడ్డికి 389-ఏ, 389-బి, 390-డి సర్వేనబర్లలో 4 ఎకరాల 21 గుంటల భూమి ఉంది. అరుు తే ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా మహేందర్‌రెడ్డి ఒక్కరి పేరిట ఆర్ఓఆర్ పాస్‌పుస్తకం జారీచేశారు. అయితే ఈ భూమికి సంబంధించి అంతకుముందే ఆర్ఓఆర్ పాసుపుస్తకం తన తండ్రి పేరుమీద ఉందని.. దానిని ఏపీజీవీబీలో పెట్టి రుణం తీసుకున్నట్లు శ్రీరామ్‌రెడ్డి తెలిపారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో భాగస్వామ్యదావా పెండింగ్‌లో ఉందని అభ్యంతర లేఖ ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అధికారులు అక్రమ పాస్‌పుస్తకాలు ఇచ్చి రికార్డులు మాయంచేశారని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు ఇంతకుముందు వరంగల్ ఆర్డీఓగా పనిచేసిన ఓజే మధు, ఏసీబీకి చిక్కిన అప్పటి ఆత్మకూరు తహసీల్దార్ కారం యాదగిరి, ఇక్కడే గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన దస్తగిరి, ప్రస్తుత ఆత్మకూరు ఎంఆర్ఐ రవీందర్రావు, ఇంతకుముందు దామెరలో వీఆర్ఓగా పనిచేసిన రాజయ్యపై ఆగస్టు 9న కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు మాయం.. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన ఫైళ్లు మాయమైనట్లు సమాచారహక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఈ తతంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఆర్టీవో రూ.12 వేల జరిమానా..
ఆగిన ఆటోడ్రైవర్ తండ్రి గుండె లక్ష్మణచాంద: ఆర్టీవో విధించిన జరిమానా ఓ ఆటోడ్రైవర్ తండ్రిని బలిగొన్నది. వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండలం మునిపల్లికి చెందిన హైమద్ ఈ నెల 11న నిర్మల్ నుంచి మునిపల్లికి ఆటోలో ప్రయాణికులను తరలి స్తుండగా నిర్మల్‌లో ఆర్టీవో తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించావంటూ రూ.12 వేల జరిమానా విధించారు. ఆటోను సీజ్ చేశారు. తాను అంత జరిమానా కట్టలేనని ఆర్టీవోను వేడు కున్నాడు. అయినా కనికరించకపోవడంతో విషయాన్ని హైమద్ ఫోన్లో తండ్రి హైదర్‌కు చెప్పాడు. ఈ మాట విన్న వెంటనే హైదర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని నిర్మల్ ఆస్ప్రతికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు -
ఈ-రిక్షాలను రక్షిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రిక్షాలపై (ఈ-రిక్షా) నిషేధం విధించబోమని, మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. రామ్‌లీలా మైదాన్‌లో ఈ-రిక్షా డ్రైవర్లు, యజమానులు మంగళవారం నిర్వహించిన మహార్యాలీలో ఆయన పాల్గొన్నారు. 650 వాట్ల బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలకు లెసైన్సులు అవసరం లేదని, వాటిలో నలుగురు ప్రయాణికులను, 50 కిలోల సామాన్లను తీసుకువెళ్లవచ్చని గడ్కరీ చెప్పారు. ఈ-రిక్షాల రిజిస్ట్రేషన్ల కోసం డ్రైవర్లు, యజమానులు ఇక ప్రాంతీయ రవాణాశాఖ అధికారి(ఆర్టీఓ) కార్యాలయానికి వెళ్లనవసరం లేదని నితిన్ గడ్కరీ చెప్పారు. వంద రూపాయల ఖర్చుతో ఎమ్సీడీలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వివరించారు. రిజిస్ట్రేషన్‌తోపాటు ఈ-రిక్షా డ్రైవర్లకు గుర్తింపుకార్డు లభిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ వాహనాల పేరును ఇక మీదట దీన్ దయాళ్ ఈ-రిక్షాగా మార్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీన్‌దయాళ్ ఈ-రిక్షా పథకం కింద రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ-రిక్షావాలాల సమస్యల గురించి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడానని గడ్కరీ తెలిపారు. ఈ వాహనాల యజమానులకు మూడు శాతం వడ్డీరేటుతో బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆర్థిక మంత్రికి కూడా లేఖరాసినట్లు ఆయన చెప్పారు. ఈ-రిక్షాల్లో నలుగురిని మాత్రమే కూర్చోబెట్టుకోవాలని ఆయన సూచించారు. డ్రైవర్లు ఎనిమిది మందిని కూర్చోబెట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన చెప్పారు. నలుగురు ప్రయాణీకులతోపాటు 25 -50 కిలోల బరువున్న సామాన్లను తీసుకెళ్లవచ్చని గడ్కరీ వివరించారు. మంత్రి ప్రకటనను వ్యతిరేకిస్తున్న నిపుణులు ఈ-రిక్షాల సమస్యను రాజకీయం చేయవద్దంటూనే వాటికి వరాలు కురిపిస్తూ గడ్కరీ చేసిన ప్రకటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ-రిక్షాలపై నిసేధం విధించబోమని హామీ ఇవ్వడంపై రోడ్డు రవాణా నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై నియంత్రణ లేకపోవడం ఢిల్లీరోడ్లపై అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆక్షేపిస్తున్నారు. నగరంలో 25 వేల ఈ-రిక్షాలున్నాయని అంచనా. లెసైన్సులు, రిజిస్ట్రేషన్లు, నంబరు ప్లేట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్ల వంటివి లేకుండా రోడ్లపై తిరుగుతోన్న ఈ-రిక్షాలపై నిషేధం విధించాలని గత సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. కోర్టు జోక్యంతో ఢిల్లీ సర్కారు ఈ-రిక్షాల వ్యవహారాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంతిత్వశాఖకు పంపింది. దీంతో కేంద్రం మోటారు వాహనాల చ ట్టాన్ని సవరించింది. అనుమతిలేకుండా ఈ-రిక్షాలు నడపడం చట్టవిరుధ్ధమని పేర్కొంటూ ఏప్రిల్ 24 నోటిఫికేషన్ జారీ చేశారు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మూడు నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు ముగియడంతో గత వారం రోజులుగా రవాణా విభాగం, ట్రాఫిక్ పోలీసులు ఈ-రిక్షాలపై కొరడా ఝుళిపించడం ప్రారంభించారు. దీంతో ఈ-రిక్షావాలాలు నిరసనకు దిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ ఈ రిక్షావాలాలకు మద్దతుగా నిలిచి వారిపై చర్యలు తీసుకోవద్దని ఎల్జీని సోమవారం కోరారు. ఢిల్లీవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది ఈ-రిక్షాలను నడుపుతున్నారు. వీటిని నిషేధిస్తే లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతారని కే జ్రీవాల్ విలేకరులతో అన్నారు. ఈ-రిక్షాల నోటి ఫికేషన్ల వ్యవహారం కోర్టు పరిశీలనలో ఉన్నందున తీర్పు వెలువడేంత వరకు ఈ-రిక్షాలపై చలాన్లు విధించ కూడదని, జప్తు చేయకూడదని తాము ఎల్జీని కోరామని ఆయన చెప్పారు. -
నచ్చని అధికారులపై బదిలీ వేటు!
ఎస్పీ, ఆర్డీవోలను సాగనంపేందుకు యత్నాలు ఒక కేసులో ఎస్పీపై మాజీ ప్రతినిధి గుర్రు ఆర్డీవో తమను పట్టించుకోవడంలేదని పలువురి కినుక అధికారం చేపట్టకముందే ప్రయత్నాల్లో నేతలు జిల్లాలోని ఇద్దరు కీలక అధికారులను బదిలీ చేసేందుకు పలువురు నేతలు పంతాలకు పోతున్నారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే అక్కసుతో.. తమ పార్టీ ఇంకా అధికారం చేపట్టకముందే వారిని సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగిన కారణాలు వెదికే పనిలో పడ్డారు. నేతల ప్రయత్నాలు గుప్పుమనడంతో జిల్లాలో సర్వత్రా చర్చ సాగుతోంది. సాక్షి, మచిలీపట్నం : జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు, బందరు ఆర్డీవో పి.సాయిబాబాలను బదిలీ చేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని వ్యవహారాల్లో తమకు అనుకూలంగా లేరన్న అక్కసుతో వారి బదిలీకి కొందరు పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2012 డిసెంబర్ ఒకటిన జిల్లాకు ఎస్పీగా వచ్చిన ప్రభాకరరావు సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగానే విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన జిల్లాకు వచ్చిన తరువాత సమైక్యాంధ్ర ఉద్యమం పెద్ద ఎత్తున సాగినా ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాకుండా సమర్థవంతంగా పనిచేశారు. దీనికితోడు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక, పంచాయతీ, సహకార సంఘాలు, మున్సిపల్, స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చినా ఏ మాత్రం సమస్యలు తలెత్తకుండా జిల్లా పోలీస్ బాస్ కృషి చేశారు. దిగువ స్థాయి సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూనే వారితో సమర్థవంతంగా విధులు నిర్వర్తింపజేయడంలో తనదైన పాత్ర పోషించారు. తమకు అనుకూలంగా వ్యవహరించలేదని.. అటువంటి ఎస్పీ ఒక కేసులో తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న కారణంతో ఒక మాజీ ప్రజాప్రతినిధి ఆయనపై ఉక్రోషంతో ఉన్నట్టు సమాచారం. ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ నేత కుమారుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వెనుక ఎస్పీ ఒత్తిడే కారణమని ఆ పార్టీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ అధికారంలోకి వస్తున్నందున జిల్లా ఎస్పీ ప్రభాకరరావును బదిలీ చేయించి తమ అడుగులకు మడుగులొత్తే పోలీస్ అధికారిని ఇక్కడకు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి ఒకరు హైదరాబాద్‌కు వెళ్లి ఎస్పీకి వ్యతిరేకంగా అక్కడ పావులు కదిపినట్టు సమాచారం. దీంతో ఎస్పీ బదిలీ తప్పదంటూ రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారంలో పెట్టారు. వివాదాల సుడిలో ఆర్డీవో... బందరు ఆర్డీవో పి.సాయిబాబును వివాదాలు చుట్టముడుతున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో తహశీల్దార్‌గా పనిచేసిన సమయంలో ఆయనకు మంచి పేరుంది. అటు తరువాత పదోన్నతిపై మచిలీపట్నం వచ్చిన ఆయనపై సహోద్యోగులే కారాలు మిరియాలు నూరే పరిస్థితి వచ్చింది. తన పరిధిలోని ప్రతి మండల రెవెన్యూ కార్యాలయంలో ఒక్కో ఉద్యోగిని సొంత మనిషిగా పెట్టుకుని ఆయన తహశీల్దార్లకు సమాంతరంగా మండలాల్లో వ్యవహారాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఆఫీసు వేళల్లోను ఎవరైనా ఏదైనా చెప్పుకొందామని వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, బాధితులు తమ గోడు చెప్పుకొందామన్నా అందుబాటులో లేకపోవడం ఆర్డీవోపై ప్రజల్లో వ్యతిరేక భావనకు కారణమైంది. ఆయన వ్యవహారాలు ఎలా ఉన్నా ప్రజాప్రతినిధులను పట్టించుకోకపోవడం, వారికి నచ్చినట్టు వ్యవహరించకపోవడంతో పలువురు నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఆయన్ను కూడా సాగనంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. -
ఆస్తి ఉన్నా భిక్షాటన.. కొడుకులున్నా అనాథ
‘‘నాయనా.. నా మొగుడు చనిపోయాడు. మాకు కోటి రూపాయల ఆస్తి ఉంది. ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లు నన్ను ఇంటి నుంచి గెంటేశారు.. ఆ ఇంటికాడ ఈ ఇంటికాడ అడుక్కు తిని బతకతాండా.. న్యాయం చే యండి స్వామీ అని మూడేళ్లుగా తిరగతాండా.. ఎవ్వరూ పట్టిచుకోవడం లేదు’’ అంటూ ఓ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలంటూ తిరుపతి ఆర్డీవోను వేడుకుంది. తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: రేణిగుంట మండలం వెదుళ్ల చెరువుకు చెందిన మంగమ్మ సోమవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయానికి వచ్చింది. ఆర్డీవోకు తన మొర వినిపించింది. బాధితురాలి కథనం మేరకు.. రేణిగుంట మండలం వెదుళ్లచెరువుకు చెందిన మంగమ్మ(65), అయ్యప్పరెడ్డిది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కొడుకులు. కోటి రూపాయల విలువ చేసే మూడెకరాల వ్యవసాయ పొలం, 200 గొర్రెలు, మంగమ్మకు 7సవర్ల బంగారు నగలు ఉన్నాయి. పెద్దకుమారుడు గురవయ్య, చిన్న కుమారుడు వెంకటమునికి పెళ్లిళ్లు చేశారు. వీరిది ఏ చీకూ చింతాలే ని కుటుంబం. పదేళ్ల క్రితం అయ్యప్పరెడ్డి చనిపోయాడు. దీంతో మంగమ్మ జీవితం తల్లకిందులై పోయింది. తండ్రి చనిపోయాక కొడుకులకు తల్లి భారంగా మారింది. ఆమెను ఇంటినుంచి వెళ్లగొట్టారు. ఉన్న నగలన్నీ లాక్కున్నారు. ఆమె మూడేళ్లగా గ్రామంలో అడుక్కుని తింటూ పొట్టపోసుకుంటోంది. పల్లెలోనే వేరే వారి గుడిసెలో తలదాచుకుంటోంది. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. తనకు న్యాయం చేయాలంటూ మంగమ్మ మూడేళ్లుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రేణిగుంట పోలీసుల వద్దకూ పోయింది. ఎవ్వరూ పట్టించుకోలేదు. అమె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం కనిపిం చడంతో అక్కడున్న ఉద్యోగులందరూ ‘ఏమ్మా.... నీ సమస్య పరిష్కారం కాలేదా’ అంటూ నవ్వుతూ పోయారు. కొడుకులతో పాటు, తనను ఉద్యోగులూ చిన్నచూపు చూస్తున్నారని మంగమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన సొత్తు తనకు వచ్చేలా చేస్తే ఆ దేవుడికి దానం చేస్తానంది. ఈ సందర్భంగా ఆర్డీవో రంగయ్య కాళ్ల మీద పడి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. కుమారులిద్దరికీ నోటిసులివ్వండి సొంత ఆస్తి, ఇల్లు ఉన్నా మంగమ్మను నానా ఇబ్బందులు పెడుతున్న కుమారులిద్దరికీ నోటీసులు ఇవ్వాలని అర్డీవో చెరుకూరి రంగయ్య ఆర్డీవో కార్యాలయ ఏవో సురేష్‌ను ఆదేశించారు. రెండురోజుల్లోగా వారిద్దరూ తన కార్యాలయానికి వచ్చేలా చూడాలని చెప్పారు. -
పాతపట్నంలో ప్రైవేటు ఆస్పత్రి సీజ్
పాతపట్నం, న్యూస్‌లైన్: అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కనకమహాలక్ష్మి మెడికేర్‌పై అధికారులు కొరడా ఝులి పించారు. పాలకొండ ఆర్డీవో ఎస్.తేజ్‌భరత్, ఇతర అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు జరిపారు. అనుమతి ప త్రాలు లేకుండా మెడికల్ స్టోర్, ల్యాబ్, ఆస్పత్రి రెండేళ్ల నుం చి నిర్వహిస్తుండడాన్ని గుర్తించి..విస్తుపోయారు. కనీసం వైద్యుడు కూడా లే కుండా ఎలా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంబంధిత యాజమాన్యం పత్రాలు చూపించకపోవడంతో..వెంటనే ఆస్పత్రిని సీజ్ చేయాలని రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించా రు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే..ఆస్పత్రులు, ల్యా బ్‌లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ బి.ఎస్.ప్రకాష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జి.లక్ష్మీనారాయ ణ, వీఆర్వో మురళీ, పాతపట్నం ఎస్పీహెచ్వో డాక్టర్ వేణుగోపాల్, సీహెచ్‌వో ఐ.నారాయణరావు, సీనియర్ సహాయకుడు శేఖర్ పట్నాయక్, పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ పైల ప్రియాంక సమక్షంలో మెడికేర్‌ను సీజ్ చేశారు. -
ఇసుక ఇక భద్రం..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా ఇసుక ఇక భద్రమే. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని విడుదల చేసింది. ఇసుక రీచ్‌ల కేటాయింపు, ర్యాంపుల నిర్వహణ, తనిఖీలు, రవాణా, తవ్వకాలు వంటి వాటిని సక్రమంగా అమలు చేసేందుకు కొత్త విధానం తీసుకువచ్చేందుకుమార్గదర్శకాలు రూపొందించింది. జరిమానా.. స్వాధీనం ఈ క్రమంలోనే జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని 32 మండలాల్లో, డ్వామా పరిధిలో 20 మండలాల్లో రీచ్‌ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 24 రీచ్‌లు ఉన్నాయి. నదీ తీరాలు, వాగులు, వంటి వాటిని ఇందులో గుర్తించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఇసుక ఆక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. అనుమతులకు మించి తవ్వకాలు, అక్రమంగా నిల్వలు, ఇష్టారాజ్యంగా రవాణా వంటి వాటితో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటిని అదుపు చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇసుక రీచ్‌ల గుర్తింపు, కేటాయింపు, పరిశీలన వంటి వాటిని రూపొందిస్తోంది. జిల్లాస్థాయి కమిటీతో పాటు ఆర్డీవో స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. వీ టిలో ఇసుకకు సంబందించిన అధికారులను సభ్యులుగా చేర్చారు. డ్వామా ఆధ్వర్యంలో రీచ్‌ల కేటాయింపులు జరిగినా, తనిఖీలు చేయాల్సింది, అక్రమాలను అడ్డుకోవాల్సిం ది రెవె న్యూ శాఖ అధికారులే. జిల్లాలోని రీచ్‌ల గుర్తింపు ప్రక్రి య అనంతరం పర్యావరణ పరిరక్షణ సంస్థ పర్మిషన్ కోసం గుర్తించిన రీచ్‌ల నివేదికను పంపుతారు. తద్వారా ఇసుక రీచ్‌లను కేటాయింపులు చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తారు. ఇసుకను అక్రమంగా తరలించినట్లరుుతే తనిఖీలు చేసిన అధికారులు జరిమానా విధించడంతో పాటు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పక్కదారి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ ఆక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండడంతో సంబంధిత గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆధాయం రాకుండా పోతోంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుకపై పంచాయతీ కార్యదర్శులు సైతం పట్టించుకోకుండా పోయారు. మండలాధికారు లు మాత్రం ఈ విషయంలో తనిఖీ చేయాల్సిం ది పోయి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా రు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఫలితంగా గ్రామీ ణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు, పట్టణాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలకు సైతం ఇసుక అవసరాలకు అందకుండా పోతోంది. ఇసుక అమ్మకందారులు తక్కువ ధరకు ఇవ్వకపోవడం, ఇందిరమ్మ ఇళ్లకు సైతం ఇసుక అమ్మకంలో ధర నియంత్రణ లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని ఇళ్లు, భవన నిర్మాణాలు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి. రీచ్‌ల గుర్తింపు జరుగుతోంది ఇసుకకు సంబంధించి ప్రస్తుతం రీచ్‌ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 32, డ్వామా ఆధ్వర్యంలో 20 మండలాల్లో రీచ్‌లను గుర్తించనున్నాం. రీచ్‌లను గుర్తించిన అనంతరం పర్యావరణ పరిరక్షణ సంస్థ పర్మిషన్ కోసం అధికారులకు పంపుతాం. తద్వారా టెండర్లు పిలిచే అవకాశం ఉంది. అప్పటి నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. - వినయ్‌కృష్ణారెడ్డి, డ్వామా పథక సంచాలకులు కొత్త మార్గదర్శకాలు ఇవీ.. కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్నింటినీ పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయి కమిటీలో సంయుక్త కలెక్టర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. డ్వామా పథక సంచాలకులు కన్వీనర్‌గా, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలశాఖ ఉప సం చాలకులు, నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహ క ఇంజినీర్లు, గనులు, భూగర్భజల శాఖ సంచాలకులు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీ సంయుక్త పరిశీలన ద్వారా ఇసుక రీచ్‌ల గుర్తింపు, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ సంస్థ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్‌ల తుది జాబితాను గుర్తిసారు. దీని ప్రకారం ఇసుక రీచ్‌లకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం టెండర్లు ఆహ్వానిస్తారు. సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలిస్తారు. నిర్దేశించిన తేదీల్లో నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తులు చేసుకున్న వారిని ఎంపిక చేస్తారు. నదీ ప్రభావం కింద ఇసుక తీయడానికి రీచ్‌ల కేటాయింపులను బోట్స్‌మెన్ సోసైటీలకు కేటాయిస్తారు. స్థానికులు టెండర్లకు దరఖాస్తులు చేసుకోకపోతే ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తారు. ట్రాక్టర్ల ద్వారానే ఇసుకను రీచ్‌ల నుంచి టెండర్లుదారులకు అనుమతించిన స్టాక్ యార్డుకు మాత్రమే తరలిం చడానికి అనుమతి ఇవ్వనున్నారు. ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్లకు మించి ఇసుకను తరలించకూడదు. అనుమతించిన ఏరియా మందం కంటే మించి ఇసుక తవ్వకాలు జరిపితే రూ. లక్ష, లేదా క్యూబిక్ మీటర్‌కు రూ.500 చొప్పున జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి. ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్ డ్రైవర్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉండాల్సి ఉంటుంది. డ్రైవర్ పేరు, చిరునామా, సెల్ నంబర్, ట్రాక్టర్ ఫిట్నెస్ పేపర్లు, తదితర వివరాలు తప్పక ఉండాలి. -
వ్యక్తిగత వాహనాలపై పోలీస్ స్టిక్కర్ వద్దు
సాక్షి, ముంబై: పోలీసు సిబ్బంది తమ వ్యక్తిగత వాహనాల మీద ‘పోలీస్’ స్టిక్కర్లు అంటించవద్దని పోలీస్ కమీషనరు సత్యపాల్ సింగ్ ఇటీవల సర్క్యులర్‌ను జారీ చేశారు. నియమాన్ని ఉల్లంఘించిన పోలీసు సిబ్బందికి రూ. 100 జరిమానా విధించడమే కాకుండా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమిషనర్ అక్టోబర్‌లో జారీ చేసిన సర్క్యులర్ అమలవుతున్న జాడమాత్రం కనిపించడం లేదు. చాలా ద్విచక్రవాహనాలపై ఇప్పటికీ ఈ స్టిక్కర్లు దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ప్రతాప్ దిగావార్కర్ను ప్రశ్నించగా ఆదేశాలు జారీ అయిన వెంటనే చాలా మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు స్టిక్కర్లను తొలగించారు. సిబ్బంది స్పందన సానుకూలంగానే ఉందని తెలిపారు. ఎవరైనా నియమాలను ఉల్లంఘించి స్టిక్కర్లను ఉపయోగిస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు అతిక్రమించిన వారికి రూ.100 జరిమానా కూడా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదులు పోలీస్ స్టిక్కర్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ స్టిక్కర్లను అంటించుకొని రక్షిత ప్రదేశాలలోకి చొరబడే అవకాశం ఉంది. పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాలను కాపలా విధులను నిర్వహించే వారు అరుదుగా తనిఖీ చేస్తుంటారు. దీన్ని అవకాశంగా ఉగ్రవాదులు ఈ స్టిక్కర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. చట్ట ప్రకారం స్థానిక ఆర్టీవోలో వాహనాన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాత మార్పులు చేయకూడదు. వాహనంలో ఎలాంటి మార్పులు చేయదల్చుకున్నా ఆర్టీవో అధికారులు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని వివరించారు. -
సినిమా థియేటర్లలో తనిఖీలు
తిరువళ్లూరు, న్యూస్‌లై న్: జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు సినిమా టికెట్లను విక్రయిస్తున్న థియేటర్లపై తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి మెరుపుదాడి చేశారు. దాడుల్లో అధిక ధరలకు టికెట్ల విక్రయం నిర్దారణ కావడంతో మెమో జారీ చేశారు. తిరువళ్లూరులో ఆరు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లలో దీపావళికి ప్రముఖ హీరోల చిత్రాలు విడుదలయ్యూయి. ఈ క్రమంలో ఇష్టం వచ్చిన రేట్లతో టికెట్లను విక్రయించారు. దీనిపై తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి ఫిర్యాదు అందింది. దీంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తిరువళ్లూరు ప్రత్యేక స్క్వాడ్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ప్రేక్షకుల వద్ద విచారణ జరిపారు. విచారణలో అధిక ధరలకు టికెట్లు అమ్మినట్లు నిర్దారణ కావడంతో సంబంధిత అధికారి థియేటర్ యూజమాన్యానిక మెమో దాఖలు చేశారు. -
రెవెన్యూ శాఖలో పైరవీల జాతర
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లా రెవెన్యూ శాఖలో పైరవీల జాతర జోరుగా సాగుతోంది. ఇటీవల కొత్త రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆశావహులంతా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఆర్డీఓ పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసింది. మిగిలిన కింది స్థాయి పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో కొత్త కార్యాలయాల్లో కుర్చీ దక్కించుకునేందుకు కొందరు ఉద్యోగులు పావులు కదుపుతున్నారు. ఉన్నతస్థాయిలో మంత్రాంగం నెరిపి సీటు దక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. తమ వాస్తవ పోస్టింగ్‌లను సైతం మార్పు చేసుకుని అనుకున్న స్థానంలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో పాలనాధికారి(ఏఓ)గా ఓ ఉద్యోగిని నియమించారు. అయితే వారం గడవక ముందే ఈ పోస్టులో మరో వ్యక్తిని నియమిస్తూ ఉత్తర్వులు తెచ్చుకోవడం తాజా పైరవీల పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కొత్తవారికి కొలువులు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రాజేంద్రనగర్, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో పాలనా సౌలభ్యం నిమిత్తం జిల్లా యంత్రాంగం కొందరు ఉద్యోగులను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ బి.శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్కో కార్యాలయానికి ఇద్దరేసి ఉప తహసీల్దార్లు బదిలీ అయ్యారు. అదేవిధంగా మరో ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఆయా కార్యాలయాల్లో కొత్తగా పోస్టింగ్ ఇచ్చారు. వీరితోపాటు మరో నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ బదిలీ అయ్యారు. కొత్తగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో వారంతా విధుల్లో చేరాల్సి ఉంది. మేం వెళ్లం..! కొత్త కార్యాలయాల్లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ పలువురు ఉద్యోగులు గురువారం విధుల్లో చేరలేదు. ప్రస్తుతం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలోని సిబ్బంది రాజేంద్రనగర్ డివిజన్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే ఉద్యోగులను చేవెళ్ల కార్యాలయానికి బదిలీ చేయాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇందులో భాగంగా తమను రాజేంద్రనగర్ కార్యాలయానికి పరిమితం చేయాలంటూ ఉన్నతాధికారుల వద్ద పైరవీలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జిల్లా కలెక్టరేట్‌తోపాటు సీసీఎల్ఏ కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులను కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్తగా పోస్టింగులు తీసుకున్న ఉద్యోగులు కొంత గందరగోళంలో పడ్డారు. మరోవైపు తమకిచ్చిన ఉత్తర్వుల ప్రకారం విధుల్లో చేరుతామని పేర్కొంటున్నారు. -
ఆర్టీఓల పనితీరుపై హైకోర్టు అసంతృప్తి
ముంబై: ర వాణా శాఖ కార్యాలయాల (ఆర్టీఓ) పనితీరుపై హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిట్నెస్ పత్రాల జారీ సమయంలో అవి నిబంధనలను పాటించడం లేదని జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ రేవతి మొహితేల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా ఆర్టీఓలు నిబంధనల ప్రకారం పనిచేసేవిధంగా ఆదేశించాలంటూ శ్రీకాంత్ కార్వే దాఖలుచేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఆర్టీఓ కార్యాలయాలు ప్రతిరోజూ సగటున 70 వాహనాలకు ఫిట్నెస్ పత్రాలు జారీచేస్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. నిబంధనల్ని పాటిస్తే ఇన్ని పత్రాలు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ ఈ ఆరోపణలు నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది బీఎంసీ నిర్ణయం సరైందే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోరివలిలోగల మున్సిపల్ స్థలంలో గర్భా నృత్యంతోపాటు అమ్మవారికి పూజలు చే సుకునేందుకు బీఎంసీ అనుమతించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా నవరాత్రి ఉత్సవాలను మున్సిపల్ స్థలాల్లో నిర్వహించుకోవడానికి బీఎంసీ అనుమతించడాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ శివశెట్టి ఇటీవల పిటిషన్ దాఖలుచేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఎస్.సి.ధర్మాధికారి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కాగా నిబంధనల ప్రకారమే అనుమతించామంటూ బీఎంసీ ఇచ్చిన వివరణతో ఏకీభవించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. అయితే నిర్దేశిత సమయంలోగానే కార్పొరేషన్‌కు సదరు స్థలాన్ని అప్పగించాలంటూ ఆదే శించింది. -
45 నిమిషాల్లో డ్రైవింగ్ లెసైన్స్
సాక్షి, ముంబై: కేవలం 45 నిమిషాల్లోనే డ్రైవింగ్ లెసైన్సుల జారీ ! ఇదేదో విదేశాల్లో ఉన్న సదుపాయం కాదు. వడాలా ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) ఇక నుంచి 45 నిమిషాల్లోనే లెసైన్సులు ఇవ్వనుంది. అయితే అంధేరీ ఆర్టీఓ గత రెండు నెలల్లోనే డ్రైవింగ్ నేర్చుకున్న 12 వేల మందికి లెసైన్సులను జారీ చేసింది రికార్డు సృష్టించింది. కేవలం 15 నిమిషాల వ్యధిలోనూ లెసైన్సులను జారీ చేసిన ఘనత దక్కించుకుంది. దీనిబాటలోనే వడాలా ఆర్టీఓలోనూ మరికొన్ని రోజుల్లో ఇదే విధానాన్ని అనుసరించనుంది. ఇక నుంచి డ్రైవింగ్ లెసైన్స్ పొందాలనుకునేవారు తమ వివరాలను తనిఖీ చేయించుకునేందుకు ఒక శాఖ నుంచి మరో శాఖకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఫారాలు నింపడం, ఇతర రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అమల్లో ఉన్న ఈ సుదీర్ఘ ప్రక్రియల కారణంగా డ్రైవింగ్ లెసైన్సులను జారీకి అధికం సమయం పడుతోంది. కొత్త ప్రక్రియను ప్రారంభించిన తర్వాత డ్రైవింగ్ లెసైన్సును అదేరోజు కేవలం 45 నిమిషాల్లోనే పొందవచ్చని ఆర్టీఓ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీఓ అధికారులు గత నాలుగు నెలలుగా కృషి చేస్తున్నారని అధికారి తెలిపారు. ఈ కొత్త విధానంలో లెసైన్సులు పొందడం చాలా సులువుగా ఉంటుందన్నారు. లెసైన్స్ పొందదలచిన వ్యక్తి దరఖాస్తు కోసం రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత అతని పేరు, చిరునామా తదితర వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని, ఒరిజినల్ పత్రాలను మరో అధికారి తనిఖీ చేస్తారు. తదనంతరం దరఖాస్తుదారుడి నుంచి బయోమెట్రిక్ వేలిముద్రలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థి ఫోటోను కూడా తీస్తారు. అంతేగాకుండా రహదారిని గుర్తించే చిహ్నాలు, సిగ్నల్స్‌కు సంబంధించిన పరీక్షలను కార్యాలయంలోనే నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు కేవలం 45 నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుందని అధికారి తెలిపారు. లెసైన్సులను త్వరగా జారీ చేయడానికి కార్యాలయంలోని ఓ హాలును అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. వడాలా ఆర్టీఓలో మున్ముందు అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించే సదుపాయం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ వి.ఎన్.మోరే తెలిపారు. ఈ పరీక్ష ఫలితాలను ప్రింటర్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో లెసైన్సులను జారీ చేసే సమయం మరింత తగ్గనుంది. రాష్ట్రంలోని మిగతా ఆర్టీఓలో కార్యాలయాల్లోనూ డ్రైవింగ్ లెసైన్సుల జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.