ఆత్మకూరు : నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఓఆర్ పాస్‌పుస్తకం జారీ చేసిన ఆర్డీఓతో సహా ఇద్దరు తహసీల్దార్లు, ఎంఆర్‌ఐ, వీఆర్‌ఓపై ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణలో కొంతజాప్యం జరిగినప్పటికీ ఎట్టకేలకు ఆత్మకూరు ఎస్సై వి.క్రాంతికుమార్ కేసు నమోదు చేశారు.
ఫిర్యాదుదారుడు గురిజాల శ్రీరామ్‌రెడ్డి కథనం ప్రకారం... మండలంలోని దామెరకు చెందిన గురిజాల దామోదర్‌రెడ్డికి కుమారులు శ్రీరామ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఉన్నారు. దామోదర్‌రెడ్డికి 389-ఏ, 389-బి, 390-డి సర్వేనబర్లలో 4 ఎకరాల 21 గుంటల భూమి ఉంది. అరుు తే ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఎలాంటి విచారణ చేయకుండా ఏకపక్షంగా మహేందర్‌రెడ్డి ఒక్కరి పేరిట ఆర్‌ఓఆర్ పాస్‌పుస్తకం జారీచేశారు.
అయితే ఈ భూమికి సంబంధించి అంతకుముందే ఆర్‌ఓఆర్ పాసుపుస్తకం తన తండ్రి పేరుమీద ఉందని.. దానిని ఏపీజీవీబీలో పెట్టి రుణం తీసుకున్నట్లు శ్రీరామ్‌రెడ్డి తెలిపారు. ఈ భూమికి సంబంధించి కోర్టులో భాగస్వామ్యదావా పెండింగ్‌లో ఉందని అభ్యంతర లేఖ ఇచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అధికారులు అక్రమ పాస్‌పుస్తకాలు ఇచ్చి రికార్డులు మాయంచేశారని ఆయన ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసులు ఇంతకుముందు వరంగల్ ఆర్డీఓగా పనిచేసిన ఓజే మధు, ఏసీబీకి చిక్కిన అప్పటి ఆత్మకూరు తహసీల్దార్ కారం యాదగిరి, ఇక్కడే గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన దస్తగిరి, ప్రస్తుత ఆత్మకూరు ఎంఆర్‌ఐ రవీందర్‌రావు, ఇంతకుముందు దామెరలో వీఆర్‌ఓగా పనిచేసిన రాజయ్యపై ఆగస్టు 9న కేసు నమోదు చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు మాయం..
ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాలకు సంబంధించిన ఫైళ్లు మాయమైనట్లు సమాచారహక్కు చట్టం ద్వారా వెల్లడైంది. ఈ తతంగంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఆర్డీఓ, ఇద్దరు తహసీల్దార్లపై కేసు
Published Sat, Sep 6 2014 2:23 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement