పోలీస్ కేసు నమోదైందని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
Published Thu, Aug 11 2016 12:11 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
ఖానాపురం : పోలీసులు కేసు పెట్టారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో బుధవారం జరిగింది. మండలంలోని మనుబోతులగడ్డకు చెందిన కుంచం వెంకన్నకు, ఇదే గ్రామానికి చెందిన బొంత సరోజన మధ్య ఈ నెల 8న పొలం వద్ద నీటి విషయంలో గొడవ జరిగింది. దీంతో తనపై వెంకన్న దాడికి పాల్పడ్డాడంటూ సరోజన పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై కేసు నమోదు చేశారు. అనంతరం గ్యాంగ్‌స్టర్ నÄæూం అంత్యక్రియల వద్దకు బందోబస్తుకు వెళ్లారు. ఎస్సై తిరిగి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీస్‌స్టేçÙన్‌కుచేరుకున్నారు. ఈ క్రమంలో తనపై కే సు నమోదైన విషయం తెలుసుకున్న వెంకన్న బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలోకి వచ్చి పురుగుల మందు తాగాడు. దీంతో తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్, ఆర్‌ఐ నవీన్‌కుమార్, ఎంపీటీసీ బోడ పూలునాయక్, దేవి నేని వేణు, ఓర్సు రవితోపాటు పలువురు వ్యక్తులు గమనించి వెంకన్నను వెంటనే నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎస్సై దుడ్డెల గురుస్వామిని వివరణ కోరగా సరోజన అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేర కు వెంకన్నపై దౌర్జన్యం కేసు నమో దు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. వెంకన్నను ఇప్పటి వరకు తాము ఏమీ అనలేదని, కేవలం కేసు మాత్రమే నమోదు చేశామని వివరణ ఇచ్చారు.
వెంకన్నపై కేసు
ఇదిలా ఉండగా తహసీల్దార్ కార్యాల యం నుంచి అందిన ఫిర్యాదు మేరకు వెంకన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుడ్డెల గురుస్వామి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయం సమీపంలో బెదిరింపు, ఆత్మహత్యా ప్రయత్నం చేస్తూ భయాందోళనకు గురిచేసిన వెంకన్నపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి అందిన ఫిర్యాదుతో వెంకన్నపై బెదిరింపు, ఆత్మహత్యాయత్నం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Advertisement