సాక్షి, హైదరాబాద్: రూ.కోటి పన్నెండు లక్షల లంచం వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నర్సాపూర్ భూ వ్యవహారంలో అరెస్టయిన ఆర్డీవో, తహసీల్దార్ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. స్వయంగా అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తమకు ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తేనే తాము పనులు చేశామని ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసుకు సం బంధించి మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తో సహా నిందితులు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూని యర్ అసిస్టెంట్ మహ్మద్ వాసీం, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌లను ఏసీబీ రెండోరోజు మంగళవారం ప్రధాన కార్యాలయంలో విచారించింది. ఈ సందర్భంగా తామంతా అడిషనల్ కలెక్టర్ ఆదేశాలిస్తేనే పని చేశామంటూ... ఆర్డీవో, తహసీల్దార్‌లు ఏసీబీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అదే సమయంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాత్రం ఏసీబీ అధికారులు అడిగిన అధిక ప్రశ్నలకు.. ‘నాకు తెలియదు’అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.
రింగ్‌రోడ్డు వద్ద కలవండి..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చిన పలు వివాదాస్పద భూ వ్యవహారాలను అడిషనల్ కలెక్టర్ నగేశ్ చాలా జాగ్రత్తగా డీల్ చేసేవారు. ఎక్కడా తనపేరు బయటికి రాకుండా జీవన్‌గౌడ్ నంబరు ఇచ్చేవారు. ఆ తరువాత మొత్తం సెటిల్మెంట్లన్నీ జీవన్‌గౌడ్ చక్కదిద్దేవాడు. పనుల నిమిత్తం జీవన్‌గౌడ్‌కు ఎవరు ఫోన్ చేసినా.. వారితో నగదు గురించి మాట్లాడి, మేడ్చల్ వైపు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కలుసుకునేవాడని, అక్కడే లంచం కింద తీసుకునే నగదు చేతులు మారేదని సమాచారం. ఏ రోజు, ఏటైములో కలవాలో ఫోన్ లో ముందుగానే సూచనలు చే సేవాడు. రింగ్‌రోడ్డు ప్రాంతంలో జనసంచారం తక్కువగా ఉండటం, తాను సికింద్రాబాద్‌లో ఉండటం వల్ల రింగురోడ్డును వసూలు కేంద్రంగా వాడుకునేవాడని తెలిసింది.
బినామీల విచారణ..
రెండో రోజు విచారణలో అడిషనల్ కలెక్టర్ నగేశ్ బినామీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. మొత్తం ముగ్గురు బినామీలను అధికారులు ప్రశ్నించారు. బినామీల్లో ఓ మహిళ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. మెదక్, మ నోహరాబాద్, మేడ్చల్, కామారెడ్డిలో నగేశ్‌కు చెందిన పలు అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కిందిస్థాయి ఉద్యోగులను సైతం అధికారులు విచారించారు. నగేశ్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాకర్ కీ లభ్యం కాకపోవడం తో, బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. ఈ లా కర్ తెరిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వ స్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
సారు చెబితేనే చేశాం..
Published Wed, Sep 23 2020 5:13 AM | Last Updated on Wed, Sep 23 2020 10:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment