టీజీ 09 9999 రూ.25 లక్షలు | Fancy Number TG 09- 9999 Sold For Over Rs 25lakhs, Check All Nines Highest Bidding Details | Sakshi
Sakshi News home page

టీజీ 09 9999 రూ.25 లక్షలు

Published Tue, May 21 2024 8:37 AM | Last Updated on Tue, May 21 2024 5:44 PM

Fancy Number Tg09- 9999 Sold For Over Rs 25lakhs

సాక్షి, హైదరాబాద్‌: టీజీ 09 9999 ఫ్యాన్సీ నంబరుకు రూ. 25 లక్షల ధర పలికింది. ఖైరతా బాద్‌ ఆర్టీఏలో సోమవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో సోనీ ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూ షన్స్‌ ‘టయోటా లాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌’ వాహనం కోసం ఈ నంబరును దక్కించుకుంది. దీనిపై ఆర్టీఏ విధించిన రూ.50 వేల ఫీజు తో పాటు, బిడ్డింగ్‌ మొత్తం రూ.25,50,000 చెల్లించి సొంతం చేసుకుంది. ఆల్‌నైన్స్‌ కోసం ఈ స్థాయిలో పోటీ రావడం తెలంగాణలోనే ఇది మొదటిసారి అని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సి.రమేష్‌ తెలిపారు. ప్రత్యేక నంబర్లకు ఖైరతాబాద్‌లో నిర్వహించిన ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో ఒక్క రోజే రూ.43,70,284 లభించినట్టు ఆయన చెప్పారు.

                      ఆల్‌నైన్స్‌ ఆన్‌లైన్‌ అత్యధిక బిడ్డింగ్‌ ఇలా..
👉   టీఎస్‌ 09 జీడీ 9999’ నంబరుకు  ముప్పా హోమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చెల్లించిన మొత్తం రూ.15,53,000
👉    టీఎస్‌ 09 జీఈ 9999 నంబరుకు కీస్టోన్స్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చెల్లించిన మొత్తం రూ.17,35,000
👉    టీఎస్‌09 జీసీ 9999 నంబరుకు ప్రైమ్‌ సోర్స్‌ గ్లోబల్‌ సర్వీస్‌ చెల్లించిన బిడ్డింగ్‌ మొత్తం  రూ.21,60,000 
👉    తాజాగా ‘టీజీ 09 9999’ నంబర్‌కు సోని ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్‌ చెల్లించిన మొత్తం రూ.25,50,000 

TG క్రేజ్ ..రవాణా శాఖకు ఒకే రోజు 40 లక్షల ఆదాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement