జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు సినిమా టికెట్‌లను విక్రయిస్తున్న థియేటర్‌లపై తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి
తిరువళ్లూరు, న్యూస్‌లై న్: జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు సినిమా టికెట్‌లను విక్రయిస్తున్న థియేటర్‌లపై తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి మెరుపుదాడి చేశారు. దాడుల్లో అధిక ధరలకు టికెట్ల విక్రయం నిర్దారణ కావడంతో మెమో జారీ చేశారు. తిరువళ్లూరులో ఆరు సినిమా థియేటర్‌లు ఉన్నాయి. ఈ థియేటర్‌లలో దీపావళికి ప్రముఖ హీరోల చిత్రాలు విడుదలయ్యూయి. ఈ క్రమంలో ఇష్టం వచ్చిన రేట్లతో టికెట్‌లను విక్రయించారు. దీనిపై తిరువళ్లూరు ఆర్‌డీవో అభిరామికి ఫిర్యాదు అందింది. దీంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తిరువళ్లూరు ప్రత్యేక స్క్వాడ్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ప్రేక్షకుల వద్ద విచారణ జరిపారు. విచారణలో అధిక ధరలకు టికెట్లు అమ్మినట్లు నిర్దారణ కావడంతో సంబంధిత అధికారి థియేటర్ యూజమాన్యానిక మెమో దాఖలు చేశారు.