కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా ఇసుక ఇక భద్రమే. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని విడుదల చేసింది. ఇసుక రీచ్‌ల కేటాయింపు, ర్యాంపుల నిర్వహణ, తనిఖీలు, రవాణా, తవ్వకాలు వంటి వాటిని సక్రమంగా అమలు చేసేందుకు కొత్త విధానం తీసుకువచ్చేందుకుమార్గదర్శకాలు రూపొందించింది.
జరిమానా.. స్వాధీనం
ఈ క్రమంలోనే జిల్లాలో ఐటీడీఏ పరిధిలోని 32 మండలాల్లో, డ్వామా పరిధిలో 20 మండలాల్లో రీచ్‌ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 24 రీచ్‌లు ఉన్నాయి. నదీ తీరాలు, వాగులు, వంటి వాటిని ఇందులో గుర్తించే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఇసుక ఆక్రమాలకు అడ్డుకట్ట వేయలేకపోయారు. అనుమతులకు మించి తవ్వకాలు, అక్రమంగా నిల్వలు, ఇష్టారాజ్యంగా రవాణా వంటి వాటితో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వీటిని అదుపు చేసేందుకు జిల్లాస్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇసుక రీచ్‌ల గుర్తింపు, కేటాయింపు, పరిశీలన వంటి వాటిని రూపొందిస్తోంది.
జిల్లాస్థాయి కమిటీతో పాటు ఆర్డీవో స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. వీ టిలో ఇసుకకు సంబందించిన అధికారులను సభ్యులుగా చేర్చారు. డ్వామా ఆధ్వర్యంలో రీచ్‌ల కేటాయింపులు జరిగినా, తనిఖీలు చేయాల్సింది, అక్రమాలను అడ్డుకోవాల్సిం ది రెవె న్యూ శాఖ అధికారులే. జిల్లాలోని రీచ్‌ల గుర్తింపు ప్రక్రి య అనంతరం పర్యావరణ పరిరక్షణ సంస్థ పర్మిషన్ కోసం గుర్తించిన రీచ్‌ల నివేదికను పంపుతారు. తద్వారా ఇసుక రీచ్‌లను కేటాయింపులు చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తారు. ఇసుకను అక్రమంగా తరలించినట్లరుుతే తనిఖీలు చేసిన అధికారులు జరిమానా విధించడంతో పాటు స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఆదాయం పక్కదారి
గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ ఆక్రమంగా ఇసుకను రవాణా చేస్తుండడంతో సంబంధిత గ్రామ పంచాయతీకి రావాల్సిన ఆధాయం రాకుండా పోతోంది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇసుకపై పంచాయతీ కార్యదర్శులు సైతం పట్టించుకోకుండా పోయారు. మండలాధికారు లు మాత్రం ఈ విషయంలో తనిఖీ చేయాల్సిం ది పోయి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నా రు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఫలితంగా గ్రామీ ణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు, పట్టణాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ భవన నిర్మాణాలకు సైతం ఇసుక అవసరాలకు అందకుండా పోతోంది. ఇసుక అమ్మకందారులు తక్కువ ధరకు ఇవ్వకపోవడం, ఇందిరమ్మ ఇళ్లకు సైతం ఇసుక అమ్మకంలో ధర నియంత్రణ లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని ఇళ్లు, భవన నిర్మాణాలు సైతం మధ్యలోనే నిలిచిపోయాయి.
రీచ్‌ల గుర్తింపు జరుగుతోంది
ఇసుకకు సంబంధించి ప్రస్తుతం రీచ్‌ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఐటీడీఏ ఆధ్వర్యంలో 32, డ్వామా ఆధ్వర్యంలో 20 మండలాల్లో రీచ్‌లను గుర్తించనున్నాం. రీచ్‌లను గుర్తించిన అనంతరం పర్యావరణ పరిరక్షణ సంస్థ పర్మిషన్ కోసం అధికారులకు పంపుతాం. తద్వారా టెండర్లు పిలిచే అవకాశం ఉంది. అప్పటి నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
- వినయ్‌కృష్ణారెడ్డి, డ్వామా పథక సంచాలకులు
కొత్త మార్గదర్శకాలు ఇవీ..
కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్నింటినీ పర్యవేక్షిస్తుంది. జిల్లా స్థాయి కమిటీలో సంయుక్త కలెక్టర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. డ్వామా పథక సంచాలకులు కన్వీనర్‌గా, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలశాఖ ఉప సం చాలకులు, నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహ క ఇంజినీర్లు, గనులు, భూగర్భజల శాఖ సంచాలకులు సభ్యులుగా ఉంటారు.
జిల్లా కమిటీ సంయుక్త పరిశీలన ద్వారా ఇసుక రీచ్‌ల గుర్తింపు, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ పరిరక్షణ సంస్థ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్‌ల తుది జాబితాను గుర్తిసారు. దీని ప్రకారం ఇసుక రీచ్‌లకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం టెండర్లు ఆహ్వానిస్తారు.
సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలిస్తారు. నిర్దేశించిన తేదీల్లో నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తులు చేసుకున్న వారిని ఎంపిక చేస్తారు.
నదీ ప్రభావం కింద ఇసుక తీయడానికి రీచ్‌ల కేటాయింపులను బోట్స్‌మెన్ సోసైటీలకు కేటాయిస్తారు. స్థానికులు టెండర్లకు దరఖాస్తులు చేసుకోకపోతే ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తారు.
ట్రాక్టర్ల ద్వారానే ఇసుకను రీచ్‌ల నుంచి టెండర్లుదారులకు అనుమతించిన స్టాక్ యార్డుకు మాత్రమే తరలిం చడానికి అనుమతి ఇవ్వనున్నారు. ట్రాక్టర్లో మూడు క్యూబిక్ మీటర్లకు మించి ఇసుకను తరలించకూడదు.
అనుమతించిన ఏరియా మందం కంటే మించి ఇసుక తవ్వకాలు జరిపితే రూ. లక్ష, లేదా క్యూబిక్ మీటర్‌కు రూ.500 చొప్పున జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.
ఇసుకను రవాణా చేసే ట్రాక్టర్ డ్రైవర్‌కు సంబంధించిన వివరాలు తన వద్ద ఉండాల్సి ఉంటుంది. డ్రైవర్ పేరు, చిరునామా, సెల్ నంబర్, ట్రాక్టర్ ఫిట్‌నెస్ పేపర్లు, తదితర వివరాలు తప్పక ఉండాలి.