మలయాళ నటుడు హకీమ్ షాజహాన్ నటించిన 'కడకన్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన రివెంజ్ డ్రామాగా ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. గతేడాది మార్చిలో విడుదలైన ఈ మూవీ సుమారు 10 నెలల తర్వాత ఓటీటీలోకి సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే ఈ చిత్రం మలయాళంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూసే ఛాన్స్ ఉంది.
మలయాళంలో తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన కడకన్ మంచి విజయాన్ని అందుకుంది. అయితే, సడెన్‌గా సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇసుక మాఫియాలో జరిగే సంఘటనలను తెరపై డైరెక్టర్ సాజిల్ మాంపాడ్ అద్భుతంగా తీశాడు. అతనికి మొదటి సినిమా ఇదే అయినప్పటికీ దర్శకుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. మంజుమ్మెల్ బాయ్స్, అన్వేషిప్పిమ్ కండేతుమ్ వంటి భారీ హిట్ సినిమాలను తట్టుకుని కడకన్ మంచి కలెక్షన్స్ రాబట్టింది.
ఇసుక మాఫియా వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ప్రతీకార ఘటనలను తెరపై దర్శకుడు చూపించాడు. ఇండియాలోనే నాణ్యమైన ఇసుక కేరళలోని మల్లపురం ఏరియాలో దొరుకుతుంది. అక్కడ ఇసుక మాఫియా వల్ల జరిగిన కొన్న నేరాల నుంచి స్ఫూర్తి పొందుతూ.. స్నేహం, ప్రేమ, యాక్షన్ అంశాలను వాటికి జోడించి కడకన్ చిత్రాన్ని తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment