ఈ ఏడాదిలో విడుదలై తొలి విజయాన్ని అందుకున్న మలయాళ సినిమా 'రేఖా చిత్రం' ఓటీటీలోకి రానుంది. మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్‌తో ప్రతి సీన్ ఆసక్తిగా ఈ మూవీని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చే చిత్రాలు మీకు ఇష్టం అయితే.. 'రేఖా చిత్రం'ను చూసేయండి. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి క్యామియో రోల్‌లో కనిపించడం విశేషం. ఈ మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.
జనవరి 9న మలయాళంలో మాత్రమే విడుదలైన రేఖాచిత్రం.. ఫిబ్రవరి 5న ఓటీటీలోకి వచ్చేస్తుంది. సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్ వంటి వారు నటించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 25 రోజ్లులోనే రూ. 75 కోట్ల మేరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
బాక్సాఫీస్ వద్ద ఇంకా థియేటరికల్ రన్ మంచిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానున్నడం విశేషం. ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కథలో భాగంగా ఒక ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) విచారణ చేపడుతాడు. గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన ఈ కేసు కోసం మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్ ఉందని ఆయన గుర్తిస్తాడు. 1985 సమయంలో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి మిస్ అయిన బాలిక కేసును కూడా వివేక్ దర్యాప్తు చేస్తాడు. ఇలా ఒక సంఘటనతో ఎన్నో ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఫైనల్‌గా చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా ఛేదిస్తాడనేది కీలకంగా ఉంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా వివేక్ దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియాలంటే రేఖాచిత్రం చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment