ఆర్టీఓల పనితీరుపై హైకోర్టు అసంతృప్తి
Published Thu, Oct 3 2013 11:03 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
ముంబై: ర వాణా శాఖ కార్యాలయాల (ఆర్టీఓ) పనితీరుపై హైకోర్టు గురువారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిట్నెస్ పత్రాల జారీ సమయంలో అవి నిబంధనలను పాటించడం లేదని జస్టిస్ అభయ్ ఓక్, జస్టిస్ రేవతి మొహితేల నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. కాగా ఆర్టీఓలు నిబంధనల ప్రకారం పనిచేసేవిధంగా ఆదేశించాలంటూ శ్రీకాంత్ కార్వే దాఖలుచేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. ఆర్టీఓ కార్యాలయాలు ప్రతిరోజూ సగటున 70 వాహనాలకు ఫిట్నెస్ పత్రాలు జారీచేస్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. నిబంధనల్ని పాటిస్తే ఇన్ని పత్రాలు జారీ చేయడం సాధ్యం కాదన్నారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ ఈ ఆరోపణలు నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది
బీఎంసీ నిర్ణయం సరైందే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బోరివలిలోగల మున్సిపల్ స్థలంలో గర్భా నృత్యంతోపాటు అమ్మవారికి పూజలు చే సుకునేందుకు బీఎంసీ అనుమతించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కాగా నవరాత్రి ఉత్సవాలను మున్సిపల్ స్థలాల్లో నిర్వహించుకోవడానికి బీఎంసీ అనుమతించడాన్ని సవాలుచేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ శివశెట్టి ఇటీవల పిటిషన్ దాఖలుచేసిన సంగతి విదితమే. ఈ పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఎస్.సి.ధర్మాధికారి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. కాగా నిబంధనల ప్రకారమే అనుమతించామంటూ బీఎంసీ ఇచ్చిన వివరణతో ఏకీభవించిన న్యాయస్థానం పైవిధంగా స్పందించింది. అయితే నిర్దేశిత సమయంలోగానే కార్పొరేషన్‌కు సదరు స్థలాన్ని అప్పగించాలంటూ ఆదే శించింది.
Advertisement
Advertisement