రవాణాశాఖ కౌంటర్ల వద్ద జన సమూహం
పాత శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఉప రవాణాశాఖ కార్యాలయంలో రెండు రోజులుగా ఆన్‌లైన్ సేవలు మొరాయిస్తున్నాయి. మంగళవారం కుడా సేవలు స్తంభించిపోయాయి. దీంతో వివిధ రకాల పనులపై ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. బీఎస్‌ఎన్‌ఎల్, రిలయన్స్, లీజర్‌లైన్ సేవలన్నీ ఒకేసారి మొరాయించడంతో ఆన్‌లైన్ నెట్‌వర్కులు ఏ ఒక్కటీ పనిచేయలేదు. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌లు, పర్మిట్ల ప్రక్రియ నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారంతా గంటల కొద్దీ నిరీక్షిస్తూ నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై రవాణాశా«ఖాధికారులు మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ కేబుల్ వైర్లు పాడయ్యాయని, వీటికి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు.