Online service
-
మహంకాళికి ఆన్లైన్లో ‘బోనం’
సాక్షి, హైదరాబాద్: దేశ, విదేశాల్లోని భక్తులు సైతం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్ ద్వారా బోనాలు సమర్పించుకునేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు గురువారం అరణ్య భవన్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం ఆన్లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని, గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం పంపిణీ చేస్తారని, ఆ బియ్యాన్ని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చని వివరించారు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు –కుంకుమ పంపిస్తారని చెప్పారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆన్లైన్లో బోనం సమర్పించాలనుకునే భక్తులకు జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు రూ.300, ఇతర దేశాల భక్తులు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వీటిని పోస్ట్ ఆఫీస్, ఆర్టీసీ కొరియర్ సేవల ద్వారా దేశీయ భక్తుల ఇంటికి చేరవేస్తారని వెల్లడించారు. ఆన్లైన్లో ఎల్లమ్మ కల్యాణ సేవలు హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆన్లైన్ సేవలను కూడా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. జూలై 5న ఎల్లమ్మ కల్యాణం నిర్వహించనున్నారని, జూలై 4 లోగా భక్తులు ఆన్లైన్లో కల్యాణం సేవలను బుక్ చేసుకోవాలని తెలిపారు. అమ్మవారి కల్యాణానికి సంబంధించి ఆన్లైన్ సేవలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, పసుపు కుంకుమ, డ్రై పూట్స్ ఇంటికి పంపిస్తారని చెప్పారు. మీ సేవ, ఆలయ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ కల్యాణ సేవలకు రూ. 500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
క్యాబ్.. ఓన్లీ క్యాష్!
సాక్షి, హైదరాబాద్: క్యాబ్‌లో కాసింత ప్రశాంతంగా ప్రయాణం చేయాలనుకుంటున్నారా? అయితే మీ జేబులో నగదు ఉందో లేదో చూసుకొని మరీ క్యాబ్ బుక్ చేసుకోండి. గూగుల్ పే నుంచి, పేటీఎం వంటి యూపీఐ సేవల నుంచి చార్జీలు చెల్లించవచ్చనుకుంటే క్యాబ్ లభించడం కష్టమే. ఆన్లైన్ పేమెంట్లపై సేవలను అందజేసేందుకు నగరంలో క్యాబ్ డ్రైవర్లు నిరాకరిస్తున్నారు. క్యాబ్ బుక్ చేసుకున్న వెంటనే చార్జీల చెల్లింపులపై ఆరా తీస్తున్నారు. నగదు రూపంలోనే చెల్లించనున్నట్లు ప్రయాణికులు భరోసా ఇస్తేనే క్యాబ్‌లు వస్తున్నాయి. లేదంటే ఉన్నపళంగా రైడ్స్ రద్దవుతున్నాయి. కొంతమంది ఆటోడ్రైవర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉబెర్, ఓలా తదితర సంస్థలకు చెందిన క్యాబ్‌లు, ఆటోలు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు, పోలీసులు క్యాబ్‌ల నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మోటారు వాహన నిబంధనల ప్రకారం ప్రయాణికులు నమోదు చేసుకున్న రైడ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. అలాంటి రైడ్స్ రద్దును పోలీసులు, రవాణా అధికారులు తీవ్రంగా పరిగణించి రూ.500 వరకు జరిమానా విధించవచ్చు, కానీ ఈ నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో వివిధ రకాల కారణాలతో డ్రైవర్లు ప్రతి పది రైడ్లలో 3 నుంచి 4 రైడ్లను రద్దు చేయడం గమనార్హం. డ్రైరన్ల నెపంతో రద్దు.. మరోవైపు డ్రై రన్ సాకుతో కొందరు డ్రైవర్లు రైడ్లను రద్దు చేస్తున్నారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకొన్న సమయానికి కనీసం 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటే క్యాబ్‌లు, ఆటోలు ఠంచన్‌గా బుక్ అవుతున్నాయి. అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే మాత్రం వెంటనే రద్దవుతున్నాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ‘మహిళలు, పిల్లలతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి ఆకస్మిక రద్దులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. క్యాబ్‌లను నమ్ముకొని ప్రయాణం చేయడం కష్టమనిపిస్తుంది.’ అని మారేడుపల్లికి చెందిన సుధీర్ విస్మయం వ్యక్తం చేశారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో రైడ్ల రద్దు ఎక్కువగా ఉంటోంది. ‘పెళ్లిళ్లు, పుట్టిన రోజు వంటి వేడుకల్లో పాల్గొనేందుకు క్యాబ్‌లను నమ్ముకొని నగర శివార్లలోని ఫంక్షన్ హాళ్లకు వెళ్తే తిరిగి ఇల్లు చేరుకోవడం కష్టమే’నని ఎల్బీనగర్కు చెందిన నవీన్ చెప్పారు. ప్రయాణికులు క్యాబ్ బుక్ చేసుకున్న తరువాత 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే డ్రైవర్లు వెంటనే రైడ్ రద్దు చేస్తున్నారు. మరోవైపు దూరాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు ఆకస్మిక రద్దుకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గిట్టుబాటు కావడం లేదు డ్రై రన్లలో డ్రైవర్లు ఎక్కువ దూరం ఖాళీగా వెళ్లాల్సి ఉంటుంది. పెరిగిన డీజిల్ ధరల దృష్ట్యా ఇది ఎంతో భారం. ఓలా, ఉబెర్ సంస్థలు ఇచ్చే కమీషన్లు గిట్టుబాటు కావడం లేదు. ఆన్లైన్ చెల్లింపుల్లో సదరు క్యాబ్ అగ్రిగేటర్ల ఖాతాల్లోంచి డ్రైవర్ ఖాతాలోకి జమ కావడానికి చాలా సమయం పడుతోంది. అందుకే కొంతమంది డ్రైవర్లు తప్పనిసరి పరిస్థితుల్లోనే రైడ్స్ రద్దు చేస్తున్నారు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్స్ జేఏసీ (చదవండి: నిరుద్యోగులకు బస్‌పాస్‌లో 20 శాతం రాయితీ) -
వైద్యసేవల్లో ఐటీ.. మేటి.. దేశంలోనే నాలుగో స్థానంలో ..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో వైద్య రంగంలోనూ ఐటీ సేవలు అగ్రభాగాన నిలుస్తున్నాయి. ఒక్క క్లిక్‌తో కావాల్సిన సరుకులనే కాదు.. అవసరమైన వైద్య సేవలను పొందే విషయంలోనూ మహానగర సిటీజన్లు ముందుండడం విశేషం. స్మార్ట్ సాంకేతికత వినియోగంలో ముందున్న నగరవాసులు.. వైద్యసేవల రంగంలోనూ ఆధునిక సాంకేతికత వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. రోగుల అవసరాలకు తగినట్లుగా మహానగరం పరిధిలోని పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు, వైద్య పరీక్షల నిర్వహణ సంస్థలు ఆయా సేవలను ఆన్లైన్ ఆధారంగా అందజేస్తుండడం విశేషం. చదవండి: కేంద్రం వద్దంటే నువ్వేం చేస్తున్నట్లు..? ఈ విషయంలో గ్రేటర్‌సిటీ దేశంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్) తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో దేశరాజధాని ఢిల్లీ తొలిస్థానంలో రెండోస్థానంలో ముంబై.. మూడో స్థానంలో బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్ నిలిచినట్లు తాజా నివేదికలో పేర్కొనడం విశేషం. ప్రధానంగా వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల నిర్వహణ, టెలీమెడిసిన్ సేవలు, వెబ్ ఆధారిత డయాగ్నొస్టిక్ సేవల్లో సాంకేతికత వినియోగం పెరిగినట్లు ఈ సంస్థ అధ్యయనంలో తెలిపింది. దేశంలో ఇలాంటి సేవలు అందించే 320 సంస్థలుండగా.. గ్రేటర్ పరిధిలో వీటి సంఖ్య 50కిపైమాటేనని నాస్కామ్ అంచనా వేసింది. చదవండి: తెలంగాణలో తృణమూల్ కాంగ్రెస్! ఐటీ.. హై హై.. వైద్యసేవల రంగంలో సేవలందిస్తున్న పలు సంస్థలు కృత్రిమ మేధస్సు (ఏఐ), బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్‌థింగ్స్ (ఐఓటీ) అనువర్తనాలను వినియోగించడం ద్వారా రోగులకు వివిధ రకాల వైద్య, డయాగ్నొస్టిక్, డాక్టర్ కన్సల్టేషన్ సేవలందిస్తున్నట్లు నాస్కామ్ తెలిపింది. ప్రధానంగా వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులను కలిసేందుకు గ్రేటర్ సిటీజన్లు ఒక్క మౌస్‌క్లిక్‌తో వివిధ ఆన్లైన్ పోర్టళ్లను ఆశ్రయించి.. అందులోనూ వైద్యనిపుణులకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించిన తర్వాతే అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాల్హెల్త్ వంటి సంస్థలు రోగుల ఇళ్ల వద్దనే రక్త,మూత్ర,తెమడ నమూనాలను సేకరించి.. ఆన్లైన్లో వైద్యపరీక్షల ఫలితాలను ఇటు వైద్యులకు అటు రోగులకు సకాలంలో చేరవేస్తోందని ఉదాహరించింది. సాంకేతికతపైనే ఆధారం.. పలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొన్నిసార్లు రోగుల నిష్పత్తి ఆధారంగా బెడ్లు సరిపోకపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో టెలీమెడిసిన్ సేవలు అవసరమవుతున్నాయి. నాణ్యమైన వైద్య సేవలు పొందేందుకు రోగులు,సిటీజన్లు హెల్త్‌కేర్ ఐటీ పోర్టళ్లు,సైట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రముఖ, నిపుణులైన వైద్యుల కన్సల్టేషన్‌కు ఈ సాంకేతిక ఉపకరిస్తోంది. రోగులు, వినియోగదారులు తమ బడ్జెట్లోనే వివిధ రకాల శస్త్రచికిత్సలు, వైద్యసేవలు ఎలా పొందాలని క్షణాల్లో తెలుసుకునేందుకు పలు మొబైల్ యాప్‌లు, ఆన్లైన్ పోర్టళ్లు అందుబాటులోకి వచ్చాయి. హెల్త్‌కేర్ రంగంలో ఐటీ,సాంకేతికత వినియోగం ఆధారంగా సేవలందించే సంస్థల వ్యాపారం దేశవ్యాప్తంగా 2016లో 70 మిలియన్ డాలర్లు కాగా.. 2021 చివరి నాటికి 160 మిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుందని నాస్కామ్ అంచనా వేసింది. రోగులకు సంబంధించిన వివరాలను భద్రపరచడం,వారు కోరిన వైద్య సేవలను సకాలంలో అందించేందుకు హెల్త్‌కేర్ ప్రిడిక్టివ్ ఎనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అనే సాంకేతికతను వినియోగిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ సమర్థవంతమైన సమాచార నిర్వహణ, సమాచార వ్యాప్తికి ఐటీ సాంకేతికత దోహదం చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రులతో పాటు, పబ్లిక్ హెల్త్‌కేర్ వ్యవస్థలో రోగుల సంరక్షణకు ఐటీని దత్తత చేసుకోవడం అనివార్యమైందని నాస్కామ్ పేర్కొంది. ఈ ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానా న్ని ఉపయోగించుకునే విషయంలో పలు కార్పొరేట్ ఆస్పత్రులు, సంస్థలు వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను సైతం అందజేస్తున్నాయని నాస్కామ్ వివరించింది. -
ఆన్లైన్ సేల్స్ అదరహో!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాల్లో లాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆన్లైన్ వినియోగం పెరిగింది. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగిందని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారని పేర్కొంది. కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. అలాగే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చంఢీఘడ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపి స్తున్నారు. 41% మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53% మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతు కుతున్నారు. 65% మంది వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుం టే.. 68% మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77% మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాధ మ్యా లుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరో గ్యంపై శ్రద్ద పెరిగింది. దీంతో 72% మంది కస్ట మర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68% మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్వి మ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కన బర్చలేదు. 64% మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. -
వాట్సాప్ ద్వారా ఈపీఎఫ్ఓ సేవలు
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) వాట్సాప్ హెల్ప్ లైన్ సేవను ప్రారంభించింది. చందాదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ సేవను తీసుకొచ్చినట్టు కార్మిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఫిర్యాదుల పరిష్కారానికి ఈపీఎఫ్ ఐజీఎంఎస్ పోర్టల్, సీపీజీఆర్ఏఎంఎస్, సామాజిక మాధ్యమ వేదికలైన ఫేస్ బుక్, ట్విటర్ ద్వారా సేవలు అందిస్తుండడం గమనార్హం. వాట్సాప్ సేవలు వీటికి అదనం. వారంలో అన్నిరోజులు, రోజులో 24 గంటల పాటు సేవలు అందించే కాల్ సెంటర్ కూడా అందుబాటులో ఉంది. ‘‘సభ్యులకు మరింత సౌకర్యార్థం ఈపీఎఫ్ఓ తాజాగా వాట్సాప్ ఆధారిత హెల్ప్ లైన్, ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో సభ్యులకు ఎటువంటి ఆటంకాల్లేని సేవలు అందించడమే దీని లక్ష్యం’’ అని కార్మిక శాఖా తన ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 138 ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాయాల పరిధిలో వాట్సాప్ హెల్ప్ లైన్ పనిచేస్తుంది. సభ్యులు ఈపీఎఫ్ఓ సేవకు సంబంధించి ఏ విచారణ అయినా వాట్సాప్ నంబర్‌కు మెస్సేజ్ పంపించడం ద్వారా వివరాలు, సాయం పొందొచ్చు. ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ పోర్టల్ లో ప్రాంతీయ కార్యాలయాల వారీగా వాట్సాప్ నంబర్ల వివరాలను పేర్కొన్నట్టు ఈపీఎఫ్ఓ తెలిపింది. -
ఆర్టీఏ..ఈజీయే!
సాక్షి, హైదరాబాద్: రవాణా శాఖ అందించే వివిధ రకాల పౌరసేవల్లో పెనుమార్పులు రానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. దాదాపు 37 రకాల సేవలను మనం ఎంచక్కా ఇంట్లో కూర్చుని.. ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దీనికి సంబంధించిన నివేదిక ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉంది. అనుమతి వస్తే.. వెంటనే అమలే.. ఇంతకీ ఏంటా మార్పు.. వివరాలు ఇవిగో.. ఇప్పటివరకు.. అన్ని రకాల పౌర సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ (సమయం, తేదీ) నమోదు చేసుకొని.. ఆన్లైన్లోనే ఫీజులు చెల్లించిన తరువాత నిర్దేశిత సమయం మేరకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వస్తుంది. సంబంధిత పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. పత్రాల కోసం అటూ ఇటూ తిరగడాలు.. మధ్యవర్తులు, దళారుల హడావుడి.. చేతికి చమురు వదలడాలు ఇవన్నీ మామూలే.. ఇకపై.. ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. దళారుల బెడద ఉండదు. పాత డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్, అలాగే అవసరమైన అన్ని రకాల పౌరసేవల్లో.. చిరునామాలో మార్పులు, చేర్పులు.. వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లను ఆన్లైన్లోనే పునరుద్ధరించుకోవచ్చు. ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యే వాహనాలకు నిరభ్యంతర పత్రం(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్), ఒకరి నుంచి మరొకరికి వాహన యాజమాన్యం బదిలీ, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు, లెర్నింగ్ లైసెన్స్ గడువు పొడిగింపు, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డూప్లికేట్ ఆర్సీ, త్రైమాసిక పన్ను, గ్రీన్ ట్యాక్స్ వంటి వివిధ రకాల పన్ను చెల్లింపులు, హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్ వంటి సుమారు 37 రకాల పౌరసేవలను ఆన్లైన్లో పొందవచ్చు. ప్రస్తుతం వీటి కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని ఆర్టీఏ అధికారులను సంప్రదించాల్సి వస్తుంది. ఇక నుంచి ఆ అవసరం ఉండదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం కావలసిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.ఆర్టీఏ అధికారులు తమకు అందిన దరఖాస్తులు, డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం వినియోగదారులు కోరుకున్న సేవలను ఆన్లైన్లోనే అందజేస్తారు. వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా ఈ సదుపాయం లభిస్తుంది.దీంతో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా సత్వరమే సేవలు లభించే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఉద్యోగులపై కూడా పనిభారం తగ్గుతుందని చెబుతున్నారు. ఇవి మాత్రం ఎప్పటిలాగే.. ఆర్టీఏ అధికారులు స్వయంగా పరీక్షించి అందజేసే లెర్నింగ్ లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల ఫిట్నెస్ పరీక్షలు వంటి వాటి కోసం అధికారులను సంప్రదించవలసి ఉంటుంది.లెర్నింగ్ లైసెన్సు కోసం ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకొని ఫీజు చెల్లించి వెళితే పరీక్షలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఇది తీసుకున్న తరువాత నెల నుంచి 6 నెలలోపు మరోసారి డ్రైవింగ్ లైసెన్సు కోసం స్లాట్ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలి. లారీలు, బస్సులు, ఆటోలు తదితర ప్రయాణికుల, సరుకుల రవాణా వాహనాలకు ఏడాదికి ఒకసారి అందజేసే ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. -
అందుబాటులో పౌర సేవలు
సాక్షి, అచ్చంపేట : పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా 34రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఈమెయిల్, నేరుగా సంప్రదించి అధికారులకు తెలిపే వెసులుబాటును కల్పించింది. ఆయా సేవలకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను గోడలపై, బోర్డులపై రాసి ఉంచారు. సిటిజన్ చార్టర్ బోర్డును ఏర్పాటు చేశారు. దరఖాస్తు విధానం ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే పొందే వీలు ఉంటుంది. ఆయా పనుల నిమిత్తం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దరఖాస్తుదారుడికి తన దరఖాస్తుకు సంబంధించి జరుగుతున్న పని ఎప్పటికప్పుడు మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ఏదైనా విభాగంలో దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ– ఆఫీస్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలి. వచ్చిన దరఖాస్తులను కమిషనర్ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. సేవలను వినియోగించుకోవాలి పట్టణ ప్రజలు పౌర సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలి. గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చు. పైరవీలకు తావే లేదు. 30కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకత పెంచేందుకే సేవా కేంద్రం ఏర్పాటు చేశాం. – నాయిని వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
సిటీ పోలీస్.. ఇక పేపర్ లెస్!
సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్న నగర పోలీసు కమిషనరేట్ కాగిత రహితంగా మారుతోంది. అంతర్గత పరిపాలనతో పాటు పిటిషన్ల విచారణ, కేసుల దర్యాప్తుల ఉత్తరప్రత్యుత్తరాలు సైతం ఆన్లైన్లోనే సాగేలా కొత్వాల్ అంజినీకుమార్ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఈ–ఆఫీస్ విధానాన్ని వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తున్నారు. ఈ ఇబ్బందులకు తావు లేకుండా ప్రస్తుతం కమిషనరేట్‌లో అధికారిక వ్యవహారాలన్నీ పేపర్ల మీదే సాగుతున్నాయి. ఓ బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసిన తర్వాత అది కేసుగా మారడానికి, ఆపై దర్యాప్తు జరగడానికి, చార్జ్‌షీట్ దాఖలు కావడానికి ఆ ఫైల్ ఎందరో సిబ్బంది, అధికారుల వద్దకు అనుమతుల కోసం వెళ్తుంటుంది. ప్రస్తుతం ఇది ఫైళ్ల రూపంలోనే జరుగుతుండటంతో ఎవరి వద్ద పెండింగ్‌లో ఉంది? ఎన్ని రోజులు ఆగింది? తదితర అంశాలు గుర్తించడం కష్టం. ఏదిఏమైనా జవాబుదారీతనం కొరవడిన కారణంగా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ రకాలైన అనుమతులు కోరుతూ సమర్పించిన దరఖాస్తులకు సంబంధించిన ఫైళ్ల విషయంలోనే అనేకసార్లు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజినీకుమార్ ఈ–ఆఫీస్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. డ్యాష్‌బోర్డ్ ఏర్పాటుకు నిర్ణయం.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తున్న పేపర్ లెస్ విధానంలో ఫైళ్లన్నీ డిజిటల్ రూపంలోకి మారిపోతాయి. ఓ బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసే సిబ్బంది ఇంట్రానెట్‌లోని ప్రత్యేక లైన్లో పొందుపరుస్తారు. అక్కడ నుంచి ఈ పిటిషన్ ఎవరి వద్దకు వెళ్లింది? వారు తీసుకున్న చర్యలు ఏంటి? ఎన్ని రోజులుగా, ఎక్కడ పెండింగ్‌లో ఉంది? అనే అంశాలు ఆన్లైన్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. అనుమతులకు సంబంధించి ఠాణాలు, డివిజన్లు, జోనల్ అధికారులకు వచ్చిన దరఖాస్తులకూ ఇదే వర్తిస్తుంది. ఈ ఇంట్రానెట్‌కు సంబంధించి ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేస్తున్నారు. దీని కారణంగా ప్రతి ఉన్నతాధికారి ఓ ఫైల్/పిటిషన్ ఎక్కడ ఉంది? దర్యాప్తు ఏ స్థాయికి చేరింది? జాప్యం ఎక్కడ జరుగుతోంది? అనే అంశాలను మానిటర్ చేయవచ్చు. ప్రస్తుతం అంతర్గతంగానే.. ప్రస్తుతం ఈ–ఆఫీస్ విధివిధానాలకు సంబంధించి సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకు గోషామహల్‌లోని ఈ–లెర్నింగ్ సెంటర్లో శిక్షణ ఇచ్చారు. ఏసీపీ ఆపై స్థాయి అధికారులకు గురువారం జరగనుంది. ఆన్లైన్లో ఉండే ఈ–ఆఫీస్ పూర్తి భద్రంగా ఉండేలా, హ్యాకింగ్ బారినపడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ సర్వర్లు కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) సర్వర్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో పాటు డిజిటల్ సిగ్నేచర్ కేటాయిస్తారు. ప్రాథమికంగా సిటీ పోలీసు విభాగంలోనే అమలయ్యే ఈ విధానాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నారు. ఇతర విభాగాలతో సంప్రదింపులకూ ఆన్లైన్ విధానాన్నే అనుసరించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ–కోర్ట్స్తోనూ అనుసంధానం పోలీసుస్టేషన్లో నమోదయ్యే కేసుల దర్యాప్తులో వివిధ దశలు, పూర్తి చేయాల్సిన అంశాలు అనేకం ఉంటాయి. ఇకపై కేసు డైరీ ఫైల్ అప్డేట్తోపాటు ఇవన్నీ ఆన్లైన్లోనే సాగుతాయి. ఫలితంగా కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించే, ఉద్దేశపూర్వకంగా కేసుల్ని నీరుగార్చే అధికారుల్ని గుర్తించడం సాధ్యమవుతుంది. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీటిని మాత్రం ప్రింట్‌ఔట్స్ తీసి పత్రాల రూపంలోనే దాఖలు చేయనున్నారు. భవిష్యత్తులో పోలీసు ఈ–ఆఫీస్‌ను న్యాయ విభాగానికి చెందిన ఈ–కోర్ట్స్‌తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. ఇది జరిగితే అభియోగపత్రాలు సైతం ఆన్లైన్లోనే దాఖలు చేయడానికి ఆస్కారం ఏర్పడనుంది. ఈ దశకు చేరుకోవాలంటే దేశవ్యాప్తంగా అమలవుతున్న సీసీటీఎన్ఎస్ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉంటుందని ఓ అధికారి పేర్కొన్నారు. -
పన్ను సందేహాలకు తెరదించేలా ఆన్లైన్ చాట్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ట్యాక్స్ పేయర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు ఆదాయ పన్ను శాఖ ఆన్లైన్ చాట్ సర్వీసును ప్రారంభించింది. ఐటీ వెబ్సైట్ మెయిన్ పేజ్‌లో లైవ్ చాట్ ఆన్లైన్ పేరుతో విండోను ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలు, సందేహాలకు ఐటీ శాఖ నుంచి నిపుణుల బృందంతో పాటు పన్ను ప్రాక్టీషనర్లు సమాధానాలిస్తారు. దేశంలో పన్నుచెల్లింపుదారుల సేవలను మెరుగుపరిచేందుకు ఐటీ శాఖ తొలిసారిగా ఇలాంటి సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చిందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఆన్లైన్ చాట్ సిస్టమ్‌కు లభించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని ఫీచర్లు జోడిస్తామని చెప్పారు. ఈమెయిల్ ఐడీ ద్వారా యూజర్ చాట్రూమ్లోకి వచ్చి ప్రశ్నలు, సందేహాలను అధికారుల ముందుంచవచ్చని తెలిపారు. భవిష్యత్ రిఫరెన్స్ కోసం మొత్తం సంభాషణను ఈమెయిల్ ద్వారా ట్యాక్స్‌పేయర్ పొందే వెసులుబాటు కూడా కల్పించామని చెప్పారు. -
ఎస్బీఐ ఖాతా బదిలీ ఇక సులభతరం
నిడమర్రు: ప్రైవేట్బ్యాంకులతో పాటు ప్రభుత్వ బ్యాంకులు ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోటీ పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి జీతాల ఖాతాలు ఎస్బీఐ ఖాతాకు మార్చుకునేలా ప్రోత్సహించేందుకు ఇటీవల ఎస్బీఐ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ పేరుతో అనేక రాయితీలు, సౌకర్యాలు ప్రకటించింది. అదే విధంగా ఇటీవల ప్రైవేట్ బ్యాంకులు ఆన్లైన్ సేవలను విస్తృతం చేస్తున్న నేపథ్యంలో పోటీని తట్టుకునేందుకు ఎస్బీఐ అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. తాజాగా ఎస్బీఐ ఆన్లైన్లో ఆ బ్యాంక్ శాఖ మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు కైకరం బ్రాంచి మేనేజర్ వి.చక్రధరరావు తెలిపారు. ఇంటి నుంచే.. సాధారణంగా ఖాతాను ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మార్చుకోవాలంటే మాతృశాఖకు వెళ్లి అర్జీ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆ శాఖకు వెళ్లకుండానే ఇంటి నుంచే ఎస్బీఐ ఖాతా బ్రాంచ్ మార్చుకోవచ్చు. ఎస్బీఐలో ఉన్న ఖాతాలను ఆన్లైన్లో ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతామార్పు ఇలా.. నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్న ఖాతాదారులు www.onlinesbi.com వెబ్సైట్ ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఈ–సర్వీసెస్ ఎంచుకుని ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్స్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఖాతా నంబరు, బ్రాంచి వివరాలు వంటివి ప్రత్యక్షమవుతాయి. ఎక్కువ ఖాతాలుంటే.. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలున్నా ఆ వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఏ అకౌంట్‌ను వేరే బ్రాంచీకి మార్చాలనుకుంటున్నారో అక్కడ కొత్త బ్రాంచ్ కోడ్ ఎంటర్ చేయాలి. కోడ్ ఆధారంగా బ్రాంచ్ పేరు కనిపిస్తుంది. కన్ఫర్మ్ బటన్‌పై నొక్కితే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. తర్వాతి పేజీల్లో ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. అక్కడ తెరపై వచ్చే సందేశంలో మీ బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అభ్యర్థన విజయవంతమైనట్లు చూపిస్తుంది. ఇవీ తప్పనిసరి ఖాతా బదిలీ అవ్వాలంటే దాదాపు వారం రోజులు పడుతుంది. ఒక వేళ మ్యూచువల్ ఫండ్ సంస్థలకు, ఆదాయపు పన్ను శాఖకు బదిలీచేస్తున్న ఖాతా వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇచ్చి ఉంటే అక్కడ కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను అప్డేట్ చేయడం మరవకండి. ముఖ్యంగా ప్రైవేటు/ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాల ఖాతాలు మార్చుకునే విషయంలో కొత్త కోడ్‌ను మార్పుచేసుకోవాలి. ఈసీఎస్, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ విషయంలో సైతం కోడ్ మార్చుకోవాల్సి ఉంటుంది. బ్రాంచ్ కోడ్ సిద్ధం చేసుకోవాలి ముందుగా ఖాతాదారుడు మారే కొత్త బ్రాంచి కోడ్ సిద్ధం చేసుకోవాలి. అలాగే పొదుపు ఖాతాల్లో మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉంటేనే ఖాతా బదిలీ సాధ్యమవుతుంది. ఖాతా బదిలీ ఆన్లైన్లో చేయాలంటే ఖాతాదారునికి కచ్చితంగా నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉండాలి. కేవైసీ వివరాల వెరిఫికేషన్ పూర్తికాని, ఇన్ ఆపరేటివ్ ఖాతాలకు ఈ విధానంలో బ్రాంచి మార్పు సాధ్యం కాదు. – వి.చక్రధర రావు, మేనేజర్, ఎస్బీఐ కైకరం బ్రాంచి -
నిలిచిన రవాణా శాఖ ఆన్లైన్ సేవలు
పాత శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఉప రవాణాశాఖ కార్యాలయంలో రెండు రోజులుగా ఆన్లైన్ సేవలు మొరాయిస్తున్నాయి. మంగళవారం కుడా సేవలు స్తంభించిపోయాయి. దీంతో వివిధ రకాల పనులపై ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన వారంతా నిరాశతో వెనుదిరిగారు. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్, లీజర్లైన్ సేవలన్నీ ఒకేసారి మొరాయించడంతో ఆన్లైన్ నెట్వర్కులు ఏ ఒక్కటీ పనిచేయలేదు. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, పర్మిట్ల ప్రక్రియ నిలిచిపోవడంతో కార్యాలయానికి వచ్చిన వారంతా గంటల కొద్దీ నిరీక్షిస్తూ నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయమై రవాణాశా«ఖాధికారులు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కేబుల్ వైర్లు పాడయ్యాయని, వీటికి మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆన్లైన్లో మెడ్‌ప్లస్ క్లినికల్ ల్యాబ్ సేవలు
మార్కెట్ రేట్ల కంటే 50% తక్కువకే మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మసీ రిటైల్ చైన్ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ తాజాగా క్లినికల్ ల్యాబొరేటరీ సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం మెడ్‌ప్లస్‌ల్యాబ్.కామ్ పోర్టల్‌ను గురువారం ప్రారంభించింది. రోగ నిర్ణయ పరీక్షల కోసం రోగులు ల్యాబ్‌కు వెళ్లే అవసరం లేదు. ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుంటే చాలు. కస్టమర్ కోరిన సమయంలోనే ల్యాబ్ సహాయకులు ఇంటికి వచ్చి శాంపిల్స్‌ను (నమూనా) సేకరిస్తారు. రిపోర్టులను ఇంటికి పంపుతారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో అత్యాధునిక ల్యాబొరేటరీతోపాటు 15 శాంపిల్ సేకరణ కేంద్రాలను కంపెనీ ఏర్పాటు చేసింది. మార్కెట్ రేట్ల కంటే 50 శాతం తక్కువకే సేవలు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. పరీక్షల వివరాలు తెలియనివారు ప్రిస్క్రిప్షన్‌ను అప్లోడ్ చేయవచ్చు. అలాగే రోగులు తమ ఆరోగ్య సంబంధ సమాచారాన్ని (రికార్డులు) వెబ్సైట్లో పొందుపర్చుకోవచ్చు. ఇతర నగరాలకూ.. కొద్ది రోజుల్లో టాప్-10 నగరాల కు మెడ్‌ప్లస్‌ల్యాబ్.కామ్ సేవలను విస్తరిస్తామని మెడ్‌ప్లస్ ఫౌండర్ మధుకర్ గంగాడి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ల్యాబ్‌తోపాటు కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం రూ.10 కోట్లు కేటాయించామని, విస్తరణకు తగ్గట్టుగా ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు. ‘భారత్‌లో రోగ నిర్ణయ పరీక్షల (డయాగ్నోస్టిక్) వ్యాపార పరిమాణం 18 శాతం వార్షిక వృద్ధితో రూ.14,500 కోట్లుంది. ఇందులో పాథాలజీ వాటా 70 శాతం, రేడియాలజీ, ఇమేజింగ్ 30 శాతం కైవసం చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 1 లక్షలకుపైగా ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో 85 శాతం అవ్యవస్థీకృత రంగంలో ఉన్నాయి’ అని వెల్లడించారు. ప్రస్తుతం బ్లడ్, బాడీ ఫ్లూయిడ్ పరీక్షలు మాత్రమే చేస్తారు. రానున్న రోజుల్లో రేడి యాలజీ, స్కానింగ్ సేవలను జోడిస్తామని కంపెనీ సీవోవో సురేంద్ర మంతెన తెలిపారు. పెరగనున్న ఆన్లైన్ వాటా.. మెడ్‌ప్లస్‌కు దేశవ్యాప్తంగా 1,300 ఫార్మసీలు ఉన్నాయి. మార్చికల్లా మరో 60 ఏర్పాటు చేయనున్నారు. టర్నోవర్ 2014-15లో రూ.1,350 కోట్లు నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,800 కోట్లు ఆశిస్తోంది. టర్నోవర్‌లో 10 శాతం ఉన్న ఆన్లైన్ వాటా మార్చి నాటికి 15-20 శాతానికి చేరొచ్చని మధుకర్ తెలిపారు. ప్రతి నెల ఆన్లైన్ అమ్మకాలు 30 శాతం వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. సుమారు రూ.330 కోట్ల నిధుల సమీకరణను కొద్ది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కాగా, మెడ్‌ప్లస్‌లో మధుకర్‌కు 20 శాతం వాటా ఉంది. పీఈ కంపెనీలైన మౌంట్ కెల్లెట్ క్యాపిటల్ మేనేజ్మెంట్, టీవీఎస్ క్యాపిటల్, ఇండియా వెంచర్ అడ్వైజర్స్‌కు 69 శాతం, మిగిలినది ప్రమోటర్ బంధువులు, స్నేహితులు, ఉద్యోగులకు ఉంది. పీఈ కంపెనీల వాటాతోపాటు ఇతర వాటాదారుల నుంచి 6 శాతం వాటాను రెండు పీఈ సంస్థలు ఒకట్రెండు నెలల్లో చేజిక్కించుకోనున్నాయి. -
స్మార్ట్ ఫోన్ల కోసం మొబైల్ యాప్
-
ఈ-కామర్స్‌పైనా పన్నుల మోత!
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లను మరింతగా పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్న ఆదాయపన్ను విభాగం ప్రస్తుతం ఆన్లైన్ సర్వీసులపైన దృష్టి సారిస్తోంది. ఈ-కామర్స్ సర్వీసుల విషయంలో ప్రత్యేక ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కింద పన్ను వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వివిధ సర్వీసులు పొందినందుకు గాను కంపెనీలు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ విధించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వెబ్సైట్ల రూపకల్పన సర్వీసులు, అనువాదాలు, డేటా ఎంట్రీ, రీసెర్చ్ మొదలైన వాటికి సంబంధించి వివిధ వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలపై ఐటీ విభాగం దృష్టి పెడుతోంది. 2012లో 6 బిలియన్ డాలర్లుగా దేశీ ఈ-కామర్స్ బిజినెస్ 2021 నాటికి 76 బిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని అంచనా.