సాక్షి,న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ట్యాక్స్ పేయర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు ఆదాయ పన్ను శాఖ ఆన్‌లైన్ చాట్ సర్వీసును ప్రారంభించింది. ఐటీ వెబ్‌సైట్ మెయిన్ పేజ్‌లో లైవ్ చాట్ ఆన్‌లైన్ పేరుతో విండోను ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో ఆదాయ పన్ను చెల్లింపుదారుల ప్రశ్నలు, సందేహాలకు ఐటీ శాఖ నుంచి నిపుణుల బృందంతో పాటు పన్ను ప్రాక్టీషనర్లు సమాధానాలిస్తారు. దేశంలో పన్నుచెల్లింపుదారుల సేవలను మెరుగుపరిచేందుకు ఐటీ శాఖ తొలిసారిగా ఇలాంటి సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చిందని సీనియర్ అధికారి పేర్కొన్నారు.
ఆన్‌లైన్ చాట్ సిస్టమ్‌కు లభించే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని ఫీచర్లు జోడిస్తామని చెప్పారు. ఈమెయిల్ ఐడీ ద్వారా యూజర్ చాట్‌రూమ్‌లోకి వచ్చి ప్రశ్నలు, సందేహాలను అధికారుల ముందుంచవచ్చని తెలిపారు. భవిష్యత్ రిఫరెన్స్ కోసం మొత్తం సంభాషణను ఈమెయిల్ ద్వారా ట్యాక్స్‌పేయర్ పొందే వెసులుబాటు కూడా కల్పించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment