ఈ-కామర్స్‌పైనా పన్నుల మోత!
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లను మరింతగా పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్న ఆదాయపన్ను విభాగం ప్రస్తుతం ఆన్‌లైన్ సర్వీసులపైన దృష్టి సారిస్తోంది. ఈ-కామర్స్ సర్వీసుల విషయంలో ప్రత్యేక ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కింద పన్ను వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వివిధ సర్వీసులు పొందినందుకు గాను కంపెనీలు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ విధించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వెబ్‌సైట్ల రూపకల్పన సర్వీసులు, అనువాదాలు, డేటా ఎంట్రీ, రీసెర్చ్ మొదలైన వాటికి సంబంధించి వివిధ వెబ్‌సైట్లలో వచ్చే ప్రకటనలపై ఐటీ విభాగం దృష్టి పెడుతోంది. 2012లో 6 బిలియన్ డాలర్లుగా దేశీ ఈ-కామర్స్ బిజినెస్ 2021 నాటికి 76 బిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని అంచనా.