Tax collection
-
లక్ష్యాన్ని మించేలా పన్ను వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. నిర్దేశిత రూ.22.07 లక్షల కోట్ల లక్ష్యాన్ని దాటేస్తాయని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్ రవి అగర్వాల్ తెలిపారు. కార్పొరేట్, నాన్–కార్పొరేట్ పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో ట్యాక్స్‌పేయర్స్ లాంజ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. సీబీడీటీ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా 15.41 శాతం పెరిగి రూ.12.11 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: గోల్డ్ ఈటీఎఫ్‌లు కళకళమరోవైపు, 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను విదేశీ ఆదాయం, అసెట్స్‌ను తమ ఐటీఆర్‌లలో వెల్లడించని వారు సవరించిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువుందని అగర్వాల్ పేర్కొన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాల ద్వారా విదేశీ అసెట్స్ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందుతాయని, ఐటీఆర్‌లలో పొందుపర్చిన వివరాలతో వాటిని సరిపోల్చి చూస్తుందని తెలిపారు. అధిక విలువ అసెట్స్‌ను వెల్లడించనివారికి ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ పంపే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను చట్టంలో భాషను సరళంగా, అందరికీ అర్థమయ్యే విధంగా మార్చడంపై 6,000 పైచిలుకు సలహాలు తమకు వచ్చినట్లు అగర్వాల్ పేర్కొన్నారు. -
రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..
కేంద్రప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాల వాటాను ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ ఉంటుంది. అయితే రానున్న నూతన సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల అవసరాలు తీర్చేలా రూ.72,961.21 కోట్ల పన్నుల పంపిణీకి కేంద్రం శుక్రవారం ఆమోదం తెలిపింది. వివిధ సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆర్థిక సహాయం చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వాలను బలోపేతం చేయడానికి ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబరు 11, 2023న ఇప్పటికే విడుదలైన నిధులకు తాజాగా విడుదల చేస్తున్న రూ.72,961.21 కోట్లు అదనం అని కేంద్రం ప్రకటనలో చెప్పింది. ఈ నిధుల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు అత్యధికంగా రూ.13,088.51 కోట్లు, బిహార్ రూ.7338.44 కోట్లు, మధ్యప్రదేశ్ రూ.5727.44 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.5488.88 కోట్లు రానున్నాయి. ఇదీ చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం నిధులను 14 విడతలుగా రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు సమాచారం. 2023-24 బడ్జెట్ ప్రకారం ఈ ఏడాది రాష్ట్రాలకు రూ.10.21 లక్షల కోట్లు బదిలీ చేయాలని కేంద్రం భావిస్తోంది. -
పెరిగిన మున్సిపల్ ఆస్తి పన్ను వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆస్తి పన్ను వసూళ్లలో మున్సిపల్ శాఖ 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రగతి సాధించింది. గత ఏడాదికంటే ఈసారి 41.50 శాతం అధికంగా పన్నులు వసూలు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శుక్రవారం సాయంత్రానికి సుమారు రూ.1,998 కోట్లు వసూలు చేసింది. మొత్తం పన్నుల డిమాండ్ రూ.3,763.44 కోట్లు కాగా, అందులో ఇప్పటివరకు 53.10 శాతం వసూలైంది. గత ఆర్థిక సవంత్సరంలో మార్చి 31 నాటికి వసూలైంది రూ.1,414 కోట్లే. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1,651.44 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.49.54 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి 12.73 కోట్లు, కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తుల నుంచి రూ.48.99 కోట్లు, ఖాళీ స్థలాల నుంచి రూ.235.74 కోట్లు వసూలైంది. మార్చి 31 లోగా పన్ను చెల్లించినవారికి బకాయిలపై 5 శాతం రాయితీ కల్పించడంతో రెండు వారాల్లో ఆస్తి పన్ను చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. వడ్డీ మాఫీ కింద పన్ను చెల్లింపుదారులు మొత్తం రూ.178.91 కోట్లు మినహాయింపు పొందినట్టు సీడీఎంఏ అధికారులు తెలిపారు. కాగా, గత ఏడాదితో పోలిస్తే ఈసారి బకాయి చెల్లింపులు కూడా పెరిగాయి. ప్రైవేటు ఆస్తుల యజమానులతోపాటు ప్రభుత్వ సంస్థలు కూడా బకాయిల చెల్లింపునకు ముందుకు రావడం విశేషం. నిర్ణీత పన్ను చెల్లింపు గడువునాటికి మొత్తం వసూళ్లు రూ.2 వేల కోట్లు దాటుతాయని అంచనా వేస్తున్నారు. మున్సిపల్ నీటి పన్ను డిమాండ్ రూ.632.63 కోట్లు ఉండగా, రూ.228.78 కోట్లు వసూలైంది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లింపుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటించిన తగ్గింపును మినహాయించేలా ఈ–మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు. అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు
దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (cbdt) తెలిపింది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరగ్గా... అందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్లు జారీ అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్ల కంటే 59.44 శాతం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష పన్నుల బోర్డ్ పేర్కొంది. Gross Direct Tax collections for FY 2022-23 upto 10th March, 2023 are at Rs. 16.68 lakh crore, higher by 22.58% over gross collections for corresponding period of preceding yr. Net collections at Rs. 13.73 lakh crore are 16.78% higher than net collections for same period last yr pic.twitter.com/wtxMsqm1LG — Income Tax India (@IncomeTaxIndia) March 11, 2023 స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత, సీటీఐ (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్)తో సహా పీఐటీ (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లు 20.06 శాతంగా ఉంది. -
గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరుగా ఆస్తి పన్ను!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు వేర్వేరు ఇంటి పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఎన్నో దశాబ్దాల నుంచి వేర్వేరు పన్ను విధానం అమలులో ఉంది. గ్రామాల్లో ప్రస్తుతం ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు ఒకే రకమైన ఇంటి పన్నును వసూలు చేస్తున్నారు. అయితే, గ్రామ పంచాయతీలు తమ అవసరాలకు సరిపడా ఆదాయాన్ని అవే సమకూర్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ పలుమార్లు రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సామాన్య ప్రజలపై ఏ మాత్రం అదనపు భారం పడకుండా నివాసిత ఇళ్లకు ఇప్పుడు అమలులో ఉన్న ఇంటి పన్ను విధానాన్నే కొనసాగించనున్నారు. వ్యాపార అవసరాలకు ఉపయోగించే ఇళ్లకు, వ్యాపార దుకాణాలకు మాత్రం కొత్త ఇంటి పన్ను విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. అయితే, వ్యాపార దుకాణాలకు ఎంత ఇంటి పన్ను విధించాలన్న దానిపై పంచాయతీరాజ్ శాఖే ఒక ప్రాతిపదికను నిర్ధారించనుంది. దీని ఆధారంగా సంబంధిత గ్రామ పంచాయతీలు వ్యాపార దుకాణాలకు పన్ను నిర్ణయించుకునేలా కార్యాచరణను సిద్ధం చేశారు. ముందుగా సర్వే.. గ్రామాలవారీగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ఏప్రిల్ మొదటి వారంలో అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహించనుంది. పంచాయతీ, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. వ్యాపార అవసరాలకు నిర్మించిన షాపులతోపాటు నివాసిత ఇళ్లకు అనుబంధంగా ఆ ఇంటిలోనే నిర్వహిస్తున్న దుకాణాల వివరాలను వేర్వేరుగా సేకరించనున్నారు. సర్వే అనంతరం తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీరాజ్ శాఖ యోచిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో భారీ వడ్డన నిబంధనల ప్రకారం.. గ్రామాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఇంటి పన్నును సవరించాల్సి ఉంది. అయితే, 1996 తర్వాత ఇప్పటివరకు పన్ను సవరణ జరగలేదు. దీనికి బదులుగా 2001 నుంచి ఏటా పాత పన్నుపై ఐదు శాతం చొప్పున పెంచే విధానం అమలవుతోంది. కాగా, గత ప్రభుత్వ హయాంలో 2017–18 ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామాల్లో అప్పటి ఇళ్ల విలువ ఆధారంగా కొత్త ఇంటి పన్నును నిర్ధారించే ప్రక్రియను చేపట్టారు. దీంతో ఆ జిల్లాలో ఒక్కో యజమాని చెల్లించాల్సిన పన్ను అంతకు ముందున్న ఇంటి పన్నుకు ఐదారు రెట్లు పెరిగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే పశ్చిమ గోదావరి జిల్లాలో మాదిరిగా రాష్ట్రమంతా అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను పెంపునకు కసరత్తు చేపట్టారు. ఇందుకుగాను 2018లో ప్రిస్ సర్వే పేరిట ప్రతి ఇంటి కొలతలు తీసుకున్నారు. వాటికి ఆ గ్రామంలోని మార్కెట్ ధరను కలిపి ఆ వివరాలన్నింటినీ అన్లైన్లో నమోదు చేశారు. అయితే, 2018 ఆగస్టులో సర్పంచుల పదవీ కాలం ముగియడం, సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ఇంటి పన్ను అమలును టీడీపీ ప్రభుత్వం వాయిదా వేసింది. -
టీడీఎస్ రేటు తగ్గింపు అమల్లోకి..
న్యూఢిల్లీ: డివిడెండ్, అద్దె, బీమా చెల్లింపులు తదితర వేతనేతర చెల్లింపులపై మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) రేట్లను తగ్గిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీడీబీటీ) గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన రేట్లు గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. 2021 మార్చి 31 వరకు ఇవే రేట్లు అమల్లో ఉంటాయని తెలిపింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు గాను కంపెనీలు, పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ.. టీడీఎస్, టీసీఎస్ రేటును ప్రస్తుత రేటుపై 25 శాతం తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన మరుసటి రోజే అందుకు సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి. ► 23 ఐటమ్స్‌పై టీడీఎస్ తగ్గింది. రూ.10 లక్షలు మించిన మోటారు వాహనంపై టీడీఎస్ 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింది. ► జీవిత బీమా పాలసీకి సంబంధించి పాలసీదారునికి చేసే చెల్లింపులపై టీడీఎస్ 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గింది. ► డివిడెండ్, వడ్డీ ఆదాయంపై టీడీఎస్ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ► చరాస్తి కొనుగోలుపై 1 శాతం టీడీఎస్ 0.75 శాతానికి తగ్గింది. ► వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు చేసే అద్దె చెల్లింపులపై టీడీఎస్ 5% నుంచి 3.75%కి సవరించారు. ► ఈ కామర్స్ వేదికపై విక్రేతలకు వర్తించే టీడీఎస్ రేటు 1 శాతం నుంచి 0.75 శాతానికి మారింది. ► వృత్తి ఫీజు 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. ► నేషనల్ సేవింగ్స్ స్కీమ్ డిపాజిట్ మొత్తాలను తిరిగి చెల్లించే సందర్భంలో వర్తించే టీడీఎస్ రేటు 10 శాతం నుంచి 7.5 శాతానికి దిగొచ్చింది. ► బీమా కమీషన్, బ్రోకరేజీపై 5 శాతం నుంచి 3.75 శాతానికి టీడీఎస్ సవరించారు. ► మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లకు చేసే డివిడెండ్ చెల్లింపులపై టీడీఎస్ 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. ► టెండ్ లీవ్స్ (బీడీ ఆకులు), తుక్కు, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, లిగ్నైట్, ఐరన్ ఓర్ తదితర మినరల్స్‌పై టీసీఎస్ తగ్గింది. ► పాన్/ఆధార్ సమర్పించని కేసుల్లో అధిక టీడీఎస్/టీసీఎస్ వసూలు చేయాల్సిన చోట ఈ తగ్గింపులు వర్తించవని సీబీడీటీ స్పష్టం చేసింది. -
‘నాలా’ ఫీజులపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్ల నుంచి ఎగ్గొట్టిన నాలా (వ్యవసాయేతర భూ మదింపు చట్టం) ఫీజులను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 నుంచి ఇప్పటివరకు రూ. 815.48 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా యం రావాల్సి వుండగా.. రెవెన్యూ శాఖ పట్టించుకోవట్లేదని ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నిగ్గు తేల్చింది. రాష్ట్రవ్యాప్తంగా 105 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించింది. జిల్లాలవారీగా విజిలెన్స్‌శాఖ ఈ నివేదికను అందజేసింది. వ్యవసాయ భూములు.. ఇతర అవసరాలకు మార్పిడి చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ విలువలో 3 శాతాన్ని చెల్లించాలి. కొందరు రియల్టర్లు, బడా బాబులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యవసాయేతర అవసరాలకు భూములను మళ్లిస్తున్నారు. లేఔట్లను అభివృద్ధి చేసుకోవడమో లేక పరిశ్రమలు, ఇతరత్రా వ్యాపార సంస్థలను నెలకొల్పడమో చేశారు. ఇలా భూ వినియోగ మార్పిడి ఫీజు చెల్లించకుండా.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన కేసులను గుర్తించిన విజిలెన్స్ విభాగం.. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు ఇటీవల ఆదాయ వనరులను సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు.. పెండింగ్‌లో ఉన్న నాలా ఫీజులను వసూలు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీంతో జిల్లాలవారీగా రావాల్సిన నిధులను తక్షణమే వసూలు చేయాలని ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. -
ఆర్థిక వ్యవస్థ మందగమనం..అయినా ఆదాయం
సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇది సానుకూలమని, దేవుడు మనతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆదాయ వనరుల ఆర్జన శాఖలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం వల్ల లైసెన్స్ ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా, మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లను రాబట్టుకోవడానికి ఒక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని, ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయతి్నంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై గనుల శాఖ ప్రయత్నించాలని చెప్పారు. రంగాల వారీగా ఆదాయం గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. -
పన్ను వసూళ్లలో టాప్
సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని మరో 20 వేల మంది వ్యాపారులను ట్రేడ్ లైసెన్స్ పరిధిలో తేవడంలో జీహెచ్ఎంసీ సఫలీకృతమైంది. ప్రస్తుతం సుమారు 65వేల మంది ట్రేడ్ లైసెన్స్‌దారులు ఉన్నారు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 1.10లక్షల మంది ట్రేడ్ లైసెన్స్‌ను తీసుకున్నారు. నగరంలో కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ పొందిన జాబితాను కూడా దక్షిణ మండలం విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి జీహెచ్ఎంసీ సేకరించింది. కమర్షియల్ ట్యాక్స్, విద్యుత్ శాఖ నుండి పొందిన జాబితాలను ప్రస్తుతం జీహెచ్ఎంసీ వద్ద ఉన్న ట్రేడ్ లైసెన్స్‌ల ఆధారంగా జీహెచ్ఎంసీకి ట్రేడ్ లైసెన్స్ కట్టనివారి జాబితాను సేకరించింది. ఈ జాబితాలో 27వేల మంది జీహెచ్ఎంసీ పరిధి బయట ఉండడం, కొందరు తమ వ్యాపారాలను మానివేసినట్లు గుర్తించారు. మిగిలినవారిలో జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్‌లేని వారికి వెంటనే ట్రేడ్‌లైసెన్స్‌లు పొందాలని ఎస్ఎంఎస్లు పంపడం, అక్రమ వ్యాపారాలను నిర్వహించే వారికి నోటీసులు పంపడం, అన్ని స్థాయిల అధికారులు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణతో ట్రేడ్‌లైసెన్స్‌ల ద్వారా ఇప్పటికే రూ. 37 కోట్లు ఆర్జించారు. మార్చి 31వ తేదీలోగా కనీసం మరో రూ.20 కోట్లను ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా పన్నులు సేకరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు. రికార్డు స్థాయిలో ఆదాయం అంతర్గత లోసుగులను సరిదిద్దుకోవడం, పన్ను ఎగవేత దారులను గుర్తించి వారిని పన్నులు చెల్లించే కేటగిరిలోకి తేవడంతో జీహెచ్ఎంసీ పన్నుల వసూళ్లలో ఘణనీయమైన వృద్ది సాధిస్తోంది.గత ఆర్థిక సంవత్సరం ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా బల్దియాకు మొత్తం రూ.27.50 కోట్లు లభించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) జనవరి 17వ తేదీ వరకు రూ. 65,500 ట్రేడ్ లైసెన్స్‌ల నుండి రూ. 37కోట్లు సేకరించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా రూ. 50కోట్లను సేకరించాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో రెండు నెలలు ఉండగానే కేవలం ట్రేడ్ లైసెన్స్‌ల సేకరణలోనే గత సంవత్సరం మొత్తాన్ని చూస్తే దాదాపు రూ.10కోట్ల పైగా అదనపు ఆదాయం లభించింది. -
భారీ పన్ను వసూళ్లు..!
నోట్ల రద్దు ప్రభావం లేదని చెబుతున్నాయ్ • ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ విశ్లేషణ • వృద్ధి వేగం తగ్గుతుందన్నది అపోహేనన్న అభిప్రాయం న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిపై రూ.500, రూ.1,000 నోట రద్దు ప్రభావం ఎంతమాత్రం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం మరోసారి విశ్లేషించారు. డిసెంబర్లో పరోక్ష పన్ను వసూళ్లలో భారీగా 14.2% (రూ.76 వేల కోట్లు) వృద్ధి నమోదయ్యిందని ఆయన పేర్కొంటూ, తయారీ రంగం పురోభివృద్ధి, తద్వారా ఎక్సైజ్ సుంకాల మెరుగుదలను ఈ చక్కటి వసూళ్లు సూచిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికమంత్రి వెల్లడించిన అంశాల్లో ముఖ్యమైనవి... ⇔ డిసెంబర్లో పరోక్ష పన్నుల వసూళ్లను వేర్వేరుగా చూస్తే... ఎక్సైజ్ వసూళ్లు 31.6% (రూ.36,000 కోట్లు) పెరిగాయి. సేవల పన్ను వసూళ్లలో వృద్ధి 12.4%(రూ.23,000 కోట్లు). అయితే కస్టమ్స్‌లో మాత్రం అసలు వృద్ధిలేకపోగా 6.3% క్షీణించింది. పసిడి దిగుమతులు పడిపోవడమే దీనికి కారణం. ⇔ ఏప్రిల్–డిసెంబర్ కాలంలో చూస్తే... పరోక్ష పన్ను వసూళ్లు 25% వృద్ధితో రూ.6.30 లక్షల కోట్లకు చేరాయి. బడ్జెట్ అంచనాల్లో ఇది 81%. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.01 శాతం ఎగసి, రూ.5.53 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలో ఇది 65 శాతం. ⇔ డీమోనిటైజేషన్ అనంతరం ఉపాధి అవకాశాలు తగ్గాయన్న వార్తలు అన్నీ వాస్తవ ప్రాతిపదికతో కూడినవి కావు. వృద్ధి అంకెలు... ఇలాంటి ఊహాజనిత ప్రాతిపదికలను సమర్థించడం లేదు. పన్నులు, ఆయా గణాంకాలే వాస్తవం. ⇔ ఇక చాలా రాష్ట్రాల్లో వ్యాట్ వసూళ్లు నవంబర్‌లో కూడా పెరిగాయి. ⇔ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలు, పన్ను వసూళ్ల అంకెలకు పొంతన కుదరడం లేదనడం సరికాదు. జీడీపీపై ఇప్పుడు వచ్చింది ముందస్తు అంచనాలు మాత్రమే. తుది గణాంకాలపై మాత్రమే మనం స్పందించాల్సి ఉంటుంది. -
నోట్ల రద్దయినా ఆ వసూళ్లు పెరిగాయ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు బాగానే పెరిగాయట. గతేడాది కంటే 2016 ఏప్రిల్-నవంబర్ కాలంలో ప్రత్యక్ష పన్నులు 12.01 శాతం, పరోక్ష పన్ను వసూళ్లు 25 శాతం పెరిగినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పన్ను వసూళ్ల గణాంకాలను వెల్లడించారు. పన్ను వసూళ్లు తగ్గిపోతాయంటూ భయాందోళనలు వ్యక్తంచేస్తూ వచ్చిన రిపోర్టులు, గణాంకాలను ఆయన కొట్టిపారేశారు. తాను వెల్లడించిన గణాంకాలు అసలైనవిగా చెప్పారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సైతం పన్ను వసూలపై ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని తెలిపినట్టు జైట్లీ పేర్కొన్నారు. మొత్తంగా 2016 ఏప్రిల్-నవంబర్ కాలంలో పన్ను వసూళ్లు పెరిగినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్ర ఎక్స్చేంజ్ ట్యాక్స్ వసూళ్లు 43 శాతం, సర్వీసు ట్యాక్స్ 23.9 శాతం, కస్టమ్ డ్యూటీ పన్ను వసూళ్లు 4.1 శాతం ఎగిసినట్టు వెల్లడించారు. ప్రాథమిక రిపోర్టుల ప్రకారం 2016 డిసెంబర్లో పరోక్ష పన్నులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 14.2 శాతం పెరిగాయట. నగదు కొరత, పెద్ద నోట్ల రద్దు ఉన్నప్పటికీ పన్ను వసూళ్లు మంచిగానే నమోదైనట్టు ప్రభుత్వం పేర్కొంది. అయితే డిసెంబర్ నెలలో కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ గతేడాది కంటే 6.3 శాతం పడిపోయింది. బంగారం దిగుమతులు పడిపోవడంతో ఇవి తగ్గాయని జైట్లీ చెప్పారు. -
పన్ను వసూళ్లు పెరిగాయ్..
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దుతో ప్రతికూల ప్రభావం లేదు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు ప్రతికూలత ఆర్థిక వ్యవస్థలో ప్రతిబింబించడం లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. భారీగా పన్ను వసూళ్లే ఈ ఆరోపణలను తోసిపుచ్చేవిగా ఉన్నాయని అన్నారు. ఈ మేరకు ఒక వార్తాసంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వూ్యలో ముఖ్యాంశాలు... ♦ ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 19 మధ్య ప్రత్యక్ష పన్నులతో ప్రభుత్వ ఖజానాకు రూ.5.57 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో ఇది 65%. ♦ ఇక ఏప్రిల్–నవంబర్ మధ్య కస్టమ్స్, ఎక్సైజ్, సేవల పన్నులతో కూడిన పరోక్ష పన్నుల వసూళ్లు 26.2 శాతం వృద్ధితో 7.53 లక్షల కోట్లకు ఎగశాయి. ♦ డీమోనిటైజేషన్ నవంబర్‌లో జరిగింది. పారిశ్రామిక క్రియాశీలత మందగించిందనీ విమర్శలు వచ్చాయి. అయితే ఈ నెలలోనే పరోక్ష పన్ను వసూళ్లు 23.1 శాతం వృద్ధితో రూ.67,358 కోట్లకు చేరాయి. మొత్తం మూడు విభాగాల్లో మంచి పరిమాణంలో వసూళ్లు జరిగాయి. కస్టమ్స్ వసూళ్లు 16.1 శాతం వృద్ధితో రూ.20,510 కోట్లకు ఎగశాయి. ఎక్సైజ్ వసూళ్లు 33.7 శాతం వృద్ధితో రూ.29,664 కోట్లకు చేరాయి. సేవల పన్ను వసూళ్లు 15.5 శాతం వృద్ధితో రూ.17,178 కోట్లకు చేరాయి. ♦ ఈ ఏడాది ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 12.64% వృద్ధితో రూ.8.47 లక్షల కోట్లుగా ఉండాలని, పరోక్ష పన్ను వసూళ్లు 10.8% వృద్ధితో రూ.7.79 లక్షలకు చేరాలని ప్రభుత్వం కోరుకుంటోంది. లక్ష్యాలను సాధిస్తామన్న విశ్వాసముంది. ♦ ఎంతో అసౌకర్యం ఉంటుందని తెలిసినా... కీలక నిర్ణయం తీసుకుంటున్నందున ప్రజలు సహరించాలని డీమోనిటైజేషన్ సందర్భంగా నవంబర్ 8న ప్రధాని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి తగిన మద్దతు లభించినందుకు ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంటుంది. దేశంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనా చోటుచేసుకోలేదు. ♦ డీమోనిటైజేషన్‌తో పెద్దఎత్తున డబ్బు బ్యాంకింగ్‌లోకి వచ్చింది. పన్నులు, రెవెన్యూ వసూళ్ల రూపంలో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. బ్యాంకింగ్ సామర్థ్యం మరింత మెరుగుపడింది. ♦ రబీ సాగు బాగుంది. బీమా వ్యాపారం, అంతర్జాతీయ టూరిజం, పెట్రోలియం వినియోగం, మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధులు... ఇలా పలు అంశాలు సానుకూలంగా ఉన్నాయి. ♦ డీమోనిటైజేషన్ నేపథ్యంలో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని వ్యవస్థలో కరెన్సీ సర్క్యులేషన్‌పై ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థను సాధ్యమైనంత విస్తృత స్థాయిలో ‘క్యాష్‌లెస్’గా మారాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ధరలు, పన్ను రేట్లు పెరగడంవల్లే.. పలు ప్రతికూలతలు ఉన్నా... పన్ను వసూళ్లు పెరుగుదలకు కారణాలేమిటన్న విషయంపై ఆర్థిక విశ్లేషకులు దృష్టి సారిస్తున్నారు.క్రూడ్, పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం వంటి కమోడిటీల ధరలు పెరగడం, 2016–2017 బడ్జెట్లో కొన్ని ఉత్పత్తులు, సర్వీసుల పన్ను రేట్లు పెరగడం పన్ను వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణమని, అంతేగానీ ఆర్థిక వ్యవస్థ పనితీరు బేషుగ్గా వుండటం కాదనేది వారి అభిప్రాయం. ♦ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో. బీడీలు మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం 10% నుంచి 15%కి పెరిగింది. రూ.10 లక్షలపైన కారు కొనుగోలు, రూ. 2 లక్షలకు పైన గూడ్స్ అండ్ సర్వీస్ కొనుగోళ్లపై 1% సర్వీస్ చార్జీ విధించింది. వెండి మినహా ఆభరణాలపై 1% ఎక్సైజ్ సుంకం విధింపు వంటి అంశాలు పన్ను వసూళ్ల వృద్ధికి దోహదపడ్డాయి. ♦ ప్రభుత్వం మొదటి విడతగా ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం కింద ఇటీవలే మొదటి విడత పన్ను చెల్లింపులు ప్రభుత్వ ఖజానాకు అందాయి. దాదాపు రూ. 7వేల కోట్లుగా ఇది అంచనా. మొత్తం 45 శాతం పన్నుతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ మొదటి విడత ఆదాయ వెల్లడి పథకం అమలయ్యింది. ఈ స్కీము ద్వారా వచ్చిన అదనపు వసూళ్లతో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగాయి. ♦ఇక ఎక్సైజ్, కస్టమ్స్ పన్ను వసూళ్లలో క్రూడ్ ధరల పెరుగుదల కీలకమైంది. ఈ ధరల పెరుగుదల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపై వసూలుచేసే కస్టమ్స్ వసూళ్లు, దేశీయంగా ఈ ఉత్పత్తుల విక్రయాల ద్వారా సమకూరే ఎక్సైజ్ వసూళ్లు పెరిగాయి. ♦ పసిడి విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. దిగుమతి సుంకాలు పెరుగుదలకు ఇది దోహదపడింది. ♦ ఇక డీమోనిటైజేషన్ కారణంగా పన్నుల వసూళ్ల రూపంలో సానుకూలతలు నమోదయినట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీనే స్వయంగా పేర్కొంటున్నారు. అంటే రద్దయిన నోట్లతో పాత బకాయిలు చెల్లింపులు పెరిగాయి. -
పన్ను వసూళ్లు రూ.8.62 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) రూ.8.62 లక్షల కోట్లుగా నమోదయ్యారుు. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యం 16.26 లక్షల కోట్లలో ఇది సగానికన్నా అధికం కావడం గమనార్హం. ఈ కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు 26.7 శాతం పెరిగి రూ.4.85 లక్షల కోట్లకు చేరారుు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.6 శాతం ఎగసి రూ.3.77 లక్షల కోట్లకు పెరిగారుు. ప్రత్యక్ష పన్నుల విభాగంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు ఉన్నారుు. ఎకై ్సజ్, సేవలు, కస్టమ్స్ సుంకాలు పరోక్ష పన్నుల్లో ఉంటారుు. -
వాణిజ్య పన్నుల సర్కిళ్ల పునర్విభజన
♦ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ♦ పన్ను వసూళ్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలి ♦ వృద్ధి రేటులో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖకు దేశంలో రెండో స్థానం ♦ మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులకు సన్మానం సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వాణిజ్య పన్నుల శాఖలో ప్రస్తుతం ఉన్న సర్కిళ్లను పునర్విభజించి, కొత్తగా మరికొన్నింటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఆధునికీకరించిన కాన్ఫరెన్స్ హాలును శనివారం ప్రారంభించిన ఆయన 2015-16 సంవత్సరంలో పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన అధికారులను సన్మానించారు. అనంతరం అధికారులతో వార్షిక ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడంలో వాణిజ్యపన్నుల విభాగమే ప్రధాన మైందని అన్నారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో రూ. 32,492 కోట్ల ఆదాయాన్ని సాధించిన రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ వృద్ధి రేటులో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందన్నారు. ఇది ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి విజయమని పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్యపన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ. 43,115 కోట్లుగా నిర్ధేశించామని తెలిపారు, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని క్షేత్రస్థాయిలో ఆడిట్లు నిర్వహించడం, స్ట్రీట్ సర్వేల ద్వారా కొత్త రిజిస్ట్రేషన్లు ఇవ్వడం, ట్రాన్స్‌పోర్టు కార్యాలయాలు, గోడౌన్లను తనిఖీ చేయడం ద్వారా సరుకు రవాణా లీకేజీలను అరికట్టడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. వినోదపు పన్ను, వృత్తిపన్ను, హోటళ్ల నుంచి రావలసిన వ్యాట్, లగ్జరీ పన్నులను సక్రమంగా వసూలు చేయాలని, పన్ను చెల్లింపునకు, జరిగే వ్యాపారానికి సంబంధించి ఇతర శాఖల ద్వారా తె ప్పించిన సమాచారంతో సరిపోల్చుకోవాలని సూచించారు. కోర్టుల్లో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. అన్ని జిల్లాల్లో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేయడంతో పాటు హైదరాబాద్‌లోనూ పెంచే యోచన ఉందని, సర్కిళ్లను కూడా పెంచి, ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. గత ఏడాది పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించిన టి.వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌గౌడ్, పి.లక్ష్మి, కిషోర్ కుమార్, నారాయణరెడ్డి సత్కారం అందుకున్నారు. మొత్తం 68 మందిని సత్కరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, కమిషనర్ వి.అనిల్‌కుమా ర్, అదనపు కమిషనర్ సత్యనారాయణరెడ్డి, సంయుక్త కమిషనర్లు రేవతి రోహణి, చంద్రశేఖర్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నాయకులు వేణుగోపాల్, టి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లు.. రూ. 32,492 కోట్లు
♦ 2015-16 ఆర్థిక సంవత్సరంలో 96 శాతం లక్ష్య సాధన ♦ పన్ను వసూళ్ల వృద్ధిలో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం ♦ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: పన్ను వసూళ్లలో గణనీయవృద్ధి సాధించి తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని వాణిజ్య పన్నుల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.33,965 కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యానికిగానూ రూ.32.492 కోట్లు సమకూరిందని, 96 శాతం లక్ష్యసాధన అధికార యంత్రాంగం కృషి వల్లనే సాధ్యమైందని చెప్పారు. సోమవారం సచివాలయంలో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మెరుగైన పనితీరు కనబరచడంతో 17.85 శాతం వృద్ధి సాధించిందని చెప్పారు. 2015-16 పన్ను వసూళ్లలో 30 శాతం వృద్ధి సాధించి బిహార్ తొలి స్థానంలో నిలవగా, 16 శాతం వృద్ధితో ఏపీ మూడోస్థానంలో ఉందని అన్నారు. తెలంగాణ ఏర్పాటైన సమయంలో రూ. 18 వేల కోట్ల వార్షిక పన్ను ఆదాయం ఉన్న వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లలోపే రూ.32 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూర్చుకోవడం విశేషమన్నారు. ఇదే స్ఫూర్తితో 2016-17 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ల లక్ష్యం రూ.43,115 కోట్లుగా నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. డిఫర్మెంట్ టాక్స్‌ను ముందుగా చెల్లిం చిన వారికి రాయితీలు కల్పించడం, గుర్రపు పం దేలు, బెట్టింగ్ పన్నుల్లో చట్ట సవరణ, కేంద్రీకృత బిల్లింగ్ విధానం అమలు చేయడంతో పాటు శాఖలోని ఖాళీలను భర్తీ చేసి, పన్ను వసూళ్లను కట్టుదిట్టం చేయడం వంటి చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలోని 419 ఉద్యోగ ఖాళీల్లో 110 మంది ఏసీటీవో స్థాయి అధికారులను గ్రూప్-2 ద్వారా నియమించేందుకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. మార్చిలో 74 డీసీటీవో పోస్టులను ఏసీటీవోలకు పదోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. చెక్‌పోస్టుల ఆధునీకరణ.. అధికారుల పెంపు రాష్ట్రంలోని 14 సరిహద్దు చెక్‌పోస్టులను ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు తలసాని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టుల కోసం రూ. 12 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వివిధ వ్యాపారాల ద్వారా రూ.1,657 కోట్ల టర్నోవర్‌కు సంబంధించి పన్ను ఎగవేతను గుర్తించి రూ.115 కోట్ల పన్ను వసూలుకు నోటీసులు జారీ చేసి, రూ.51 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వాహనాలను తనిఖీల ద్వారా రూ.9.70 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రతి జిల్లాకు ఓ డిప్యూటీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డివిజన్లలో అదనంగా డిప్యూటీ కమిషనర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మెరుగైన పనితీరు కనబరిచిన అధికారులకు అవార్డులను అందజేశారు. -
ఒక్కరోజు..రూ.4 కోట్లు
♦ వంద శాతం పన్నుల వసూళ్లు.. ♦ లక్ష్యసాధనకు అధికారుల ఉరుకులు ఉన్న గడువు ఒక్కరోజు.. వసూలు కావాల్సిన పన్ను రూ. 4.23 కోట్లు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పన్నుల వసూళ్లలో గ్రామ పంచాయతీల్లో వంద శాతం లక్ష్యం పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నా.. మిగిలిన ఒక్కరోజులో మిగతా లక్ష్యాన్ని చేరడంపై సందేహాలు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31 వరకు రూ.37.74 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ నెల 30 వరకు రూ.33.51 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలు ఉండగా, 950 పంచాయతీల నుంచి వంద శాతం వసూలయ్యాయి. పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్న మెదక్ జిల్లా.. ఈసారీ ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికారులు చెమటోడుస్తున్నారు. జోగిపేట: పన్నుల వసూళ్లలో జిల్లా గత ఏడాది మాదిరిగానే మొదటి స్థానం నిలబెట్టుకుంటుందో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వసూళ్లకు గడవు ఇక ఒక్క రోజు మాత్రమే ఉండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. 2015-16 సంవత్సరానికిగాను రూ. 37.74 కోట్ల పన్నుల వసూలు లక్ష్యంకాగా ఇప్పటి వరకు రూ.33.51 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలోని 1077 గ్రామ పంచాయతీలకు గాను 950 పంచాయతీల్లో బుధవారం వరకు 100 శాతం పన్నులు వసూలయ్యాయి. ఈనెల 31వరకు వెయ్యి పంచాయతీలు 100 శాతం ఇంటి పన్నులు వసూలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించిన పన్నులే ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమల ద్వారా రూ.19 కోట్ల పన్నులు రావాల్సి ఉంది. జిల్లాలో 4.50 లక్షల ఇళ్లు ఉన్నాయి. కార్యదర్శుల కొరతతో ఇబ్బందులు జిల్లాలో 1077 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం 469 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు పంచాయతీలకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉండటంతో పూర్తి స్థాయిలో పన్నులు వసూలు కావడంలేదని సమాచారం. 2013లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరినప్పటికీ పన్నుల వసూలుపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. ప్రస్తుతం జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు పర్యవేక్షణలో డివిజనల్ పంచాయతీ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పన్నులు వసూళ్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా వంద శాతం లక్ష్యం పెట్టుకున్నా, కార్యదర్శుల కొరతతో అనుకున్న లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు. గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేదు. పంచాయతీల నిర్వహాణ పాలకవర్గానికి కష్టంగా మారుతోంది. మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. వారం రోజుల్లో వంద శాతం పన్నులు వసూలు చేస్తాం ఈనెల 31లోగా జిల్లాలోని అన్ని పం చాయతీల్లో ఇంటి పన్నులను వసూలు చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాం. అనుకున్న సమయంలో కాకున్నా మరో వారం పాటు జిల్లాలో పన్నుల వసూలు చేస్తాం. ఇప్పటికే 950 పంచాయతీల్లో వంద శాతం వసూళ్లు సాధించాం. రేపటి వరకు వెయ్యి పంచాయతీల్లో వంద శాతం పూర్తవుతుంది. మరో వారం పాటు వసూళ్లు కొనసాగించి 1077 పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేస్తాం. ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో మన జిల్లానే పన్నుల వసూళ్లలో అగ్ర స్థానంలోనే నిలవడం ఖాయం. జిల్లాలో ఎక్కువగా పరిశ్రమలున్నాయి. వాటి ద్వారానే రూ.19 కోట్లు వ సూలు కావాల్సి ఉంది. అయితే కొన్ని పంచాయతీల పరిధిలోని ఫ్యాక్టరీలు మూతబడిపోవడం, జప్తు చేద్దామన్న ఎలాంటి ఆస్తులు లేకపోవడం వల్ల కూడా వంద శాతం పూర్తి కాలేకపోతుంది. సదాశివపేట మండలంలో ఇలాంటి పరిస్థితే ఉంది. పన్నుల వసూళ్లలో మంచి పనతీరును గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయనుంది. దీనికింద రాష్ట్రానికి రూ.105 కోట్లు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2771 పంచాయతీలు వంద శాతం పన్నుల వసూళ్లు చేయగా అందులో మెదక్ జిల్లాకు చెందిన పంచాయతీలు వెయ్యి వరకు ఉన్నాయన్నారు. పనితీరు గ్రాంట్ కింద సుమారుగా రూ. 40 కోట్లు జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. 2014-15 సంవత్సరంలో చేపట్టిన పన్నుల వసూళ్లకు సంబంధించి పనితీరు గ్రాంట్లు విడుదల చేయనున్నారు. - సురేష్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి -
లక్ష్యం రూ.78 వసూళ్లు రూ.17 కోట్లు
పంచాయతీ పన్నుల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం జిల్లా యంత్రాంగం తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం ఈనెల 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం హన్మకొండ అర్బన్ : గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లలో జిల్లా పూర్తిగా వెనుకబడిపోరుుంది. ఈనెల 31 వరకు ఆర్థిక సంవత్సరం ముగియనుండగా ఇప్పటివరకు 19.78 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. దీనిపై ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని గణాంకాలు చెబు తున్నాయి. వసూళ్లలో జాప్యానికి పంచాయతీ సిబ్బంది కొరత కొంత కారణమైనప్పటికీ.. ప్రస్తుతం పంచాయతీల పాలనపై పర్యవేక్షణ కొరవడటం మూలంగానే పన్ను వసూళ్లలో వె నుకబడ్డామని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 962 పంచాయతీలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 19.78 శాతం, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయ సేకరణలో 26.06 శాతం మాత్రమే వసూలు చేశారు. పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే జిల్లా చివరి స్థానంలో ఉండడం గమనార్హం. రెండూ అంతే.. పంచాయతీలకు వచ్చే ఆదాయం పన్నులు(టాక్సబుల్), పన్నేతర (నాన్ టాక్సబుల్) అని రెండు రకాలుగా ఉంటాయి. వీటలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో ఇంటిపన్నులు , నీటి పన్నులు, గ్రంథాలయ పన్నులు ఉంటాయి. రెండోరకం ఆదాయంలో పంచాయతీలు లెసైన్స్‌లు జారీ చేయడం, సంతలు, తైబజార్, షాపింగ్ కాంప్లెక్స్‌ల అద్దెలు వంటివి ఉంటాయి. అయితే ఈ రెండింటి విషయంలోనే జిల్లా ప్రగతి అంతంతమాత్రమే. లక్ష్యం రూ.78 కోట్లు.. వసూళ్లు 17 కోట్లు.. జిల్లాలో రెండు రకాల ఆదాయ మార్గాల ద్వారా గ్రామ పంచాయతీలకు రావాల్సిన మొత్తం పన్ను బకాయిలు రూ.78, 02,98,452గా ఉంది. అయితే తాజా లెక్కల ప్రకారం మొత్తం రూ.17,54,77,494 మాత్రమే సేకరించగలిగారు. ఇంకా రూ.60,48,20,958 వసూలు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నాలుగురోజులే గడువు ఉండడం గమనార్హం. పన్నుల ద్వారా రూ.44,40,67,470 ఆదాయం రావల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 8,78,56,929 మాత్రమే సేకరించారు. ఇంకా రూ.35,62,10,541 రావల్సి ఉంది. అంటే సరాసరిన 19.78 శాతం మాత్రమే లక్ష్యం సాధించారు. ఇక పన్నేతర ఆదాయం కింద జిల్లాలో రూ.33,62,30,982 రావల్సిండగా ఇప్పటివరకు 8,76,20,555 మాత్రమే సేకరించగలిగారు. ఇంకా రూ. 24,86,10,427 సేకరించాల్సి ఉంది. ఈ మండలాల్లో 10 శాతంలోపే... పంచాయతీల ఆదాయం 10 శాతంకన్నా తక్కువ సాధించిన మండలాలు పరిశీలిస్తే చేర్యాల -6.21 శాతం,ఖానాపూర్ 7.53 శాతం, పరకాల 7.17 శాతం, రాయపరి ్త 4.59 శాతం, చెన్నారావుపేట 7.53 శాతం సాధించి అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి. 50 శాతం దాటింది 8 మండలాలే... పన్నుల వసూళ్లలో 50 శాతం లక్ష్యం దాటింది కేవలం ఎనిమిది మండలాలే. వీటిలో నర్సింహులపేట 50.08 శాతం, తాడ్వాయి 56.41 శాతం, ఏటూరునాగారం 66.36 శాతం, గీసుకొండ 53.82 శాతం, గోవిందరావుపేట 63.12 శాతం, గూడూరు 63.46 శాతం,నెక్కొండ 54.58 శాతం, తొర్రూరు 58.56 శాతం వసూళ్లు సాధించారుు. -
డిసెంబర్ నాటికి రూ.9.5 లక్షల కోట్ల పన్ను వసూళ్లు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015 -16) ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో రూ.9.5 లక్షల కోట్ల పన్నులను వసూలు చేసింది. ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్న మొత్తంలో ఇది 66 శాతం. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు మొత్తం కలిసి రూ.14.45 లక్షల కోట్లు వసూళ్లు కావాలన్నది 2015-16 బడ్జెట్ లక్ష్యం. ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూళ్ల లక్ష్యం రూ.7.97 లక్షల కోట్లు కాగా... పరోక్ష పన్నుల ద్వారా వసూళ్ల లక్ష్యం రూ.6.47 లక్షల కోట్లు. నల్లధనం వెల్లడి స్కీమ్ ద్వారా రూ.2,428 కోట్లు నల్లధనం వెల్లడి పథకం కింద చెల్లింపుల చివరితేదీ అయిన డిసెంబర్ 31 వరకూ రూ.2,428 కోట్లు వసూళ్లు చేసినట్లు రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా ట్వీట్ చేశారు. ఈ ఆఫర్ కింద దాదాపు రూ.4,164 కోట్ల నల్లధనం మొత్తాల వివరాలను ఆయా వ్యక్తులు వెల్లడించారు. -
జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు
అగ్రస్థానంలో ప్రైవేట్ బ్యాంక్‌లు ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు డిసెంబర్ క్వార్టర్లో జోరుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 45 కంపెనీల నుంచి అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.24,279 కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు రూ.21,681 కోట్లుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరతామని ప్రధాన ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ డి. ఎస్. సక్సేనా చెప్పారు. ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు జోరుగా ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు అగ్రస్థానంలో ఉన్నాయని, మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు ప్రోత్సాహ కరంగా లేవని పేర్కొన్నారు. -
ఏడాదికి రూ. 75 వేల కోట్లు
2014-15లో పెట్రోల్, డీజిల్‌పై పన్ను వసూళ్లు న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై రెవెన్యూ, కస్టమ్స్ తదితర పన్నుల ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 75,441 కోట్ల భారీ ఆదాయం వచ్చింది. ఇది 2012-13లో వచ్చిన ఆదాయం(రూ.46,926 కోట్లు) కంటే 60 శాతం ఎక్కువ. ఈ మొత్తం రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్నుకు అదనం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్‌సభకు ఈ వివరాలు తెలిపారు. గత ఏడాది 2 కోట్ల కేసుల పరిష్కారం: సుప్రీం కోర్టుతోపాటు దేశంలోని వివిధ కోర్టులు గత ఏడాది 2 కోట్ల కేసులను పరిష్కరించాయని, ఇంకా 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయ మంత్రి సదానంద గౌడ రాజ్యసభకు వెల్లడించారు. ఆ నర్సులు అనుమతి తీసుకోవాలి: ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్(ఈసీఆర్) అవసరమున్న ఖతర్, కువైట్ వంటి 18 దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్లే నర్సులు ఇమిగ్రేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గత మూడేళ్లలో 24 వేల వరకట్న మరణాలు: గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 24,771 వరకట్న మరణాలు నమోదయ్యాయని మంత్రి మేనకా గాంధీ తెలిపారు. రైళ్లలో అత్యవసర వైద్యానికి 138: రైలు ప్రయాణికులు అత్యవసర వైద్యానికి సెల్ఫోన్ల నుంచి 138 నంబర్‌కు చేయొచ్చని, లేకపోతే టికెట్ కలెక్టర్‌కు చెప్పొచ్చని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. నిర్వాసితుల్లో మహారాష్ట్ర టాప్ : డ్యామ్ నిర్మాణాల వల్ల నిర్వాసితులయ్యే వారి సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. అక్కడ 7.13 లక్షల మంది నిర్వాసితులయ్యారని మంత్రి సన్వర్‌లాల్ జాట్ వెల్లడించారు. తర్వాతి స్థానాల్లో అవిభక్త ఆంధప్రదేశ్ (4,64,675 మంది), కర్ణాటక(4,10,104 మంది) ఉన్నట్లు వెల్లడించారు. -
వాణిజ్య రాబడి భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పథకాలకు నిధులు సమకూర్చేందుకు వాణిజ్యపన్నుల శాఖ కొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఈ శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి 3 నెలల్లో లక్ష్యానికి అనుగుణంగానే రాబడి సాధించింది. ఈ కాలంలో రూ.7,406 కోట్ల ఆదాయం సాధించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏ నెలలోనూ రూ. 2,400 కోట్లకు తగ్గకుండా ఆదాయం సమకూరింది. జూన్‌లో రూ. 2,577 కోట్లు సాధించి, కొత్త రికార్డు సాధించింది. ఈ నెలలో అంచనా మొత్తానికన్నా రూ. 177 కోట్లు అధికంగా వచ్చిందని అధికారవర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.36 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, దీన్ని సాధించేందుకు ఆ శాఖ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. రూ.కోటికి పైగా బకాయిపడి కోర్టుల్లో ఉన్న వందలాది కేసులను పరిష్కరించేందుకు పేరున్న అడ్వొకేట్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే పన్ను చెల్లించకుండా జీరో దందాలు సాగించే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే వారి ఆస్తుల అటాచ్మెంట్కూ వెనకాడవద్దని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ పొందిన కమిషనర్ వి.అనిల్‌కుమార్ కిందిస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. కాగా, ఈ శాఖ 2014-15లో రూ. 27,777 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.23,727.15 కోట్లు సాధించింది. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి వ్యాట్ ద్వారా మద్యం, పెట్రోల్, డీజిల్, సిగరెట్ల మీద వచ్చే పన్నుపైనే ప్రధానంగా ఆధారపడుతున్న వాణిజ్యపన్నుల శాఖ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఉద్యోగ విభజన పూర్తయితే సిబ్బంది కొరతను పూడ్చుకొని కొత్త నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ఈలోపు క్లరికల్ పోస్టుల కోసం కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించుకునే ప్రయత్నాల్లో ఉంది. సీటీవో, డీసీటీవో స్థాయిలో యంత్రాంగాన్ని పరిపుష్టం చేయడం ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను రాబట్టాలని చూస్తోంది. సీఎస్టీ, వినోద పన్ను, విలాసపన్ను, గుర్రపు పందాల బెట్టింగ్ పన్నులను క్రమబద్ధీకరించి, పూర్తిస్థాయిలో పన్ను వసూలయ్యేలా కృషి చేయాలని భావిస్తున్నారు. -
ఈ-కామర్స్‌పైనా పన్నుల మోత!
న్యూఢిల్లీ: పన్ను వసూళ్లను మరింతగా పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు కసరత్తు చేస్తున్న ఆదాయపన్ను విభాగం ప్రస్తుతం ఆన్లైన్ సర్వీసులపైన దృష్టి సారిస్తోంది. ఈ-కామర్స్ సర్వీసుల విషయంలో ప్రత్యేక ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (టీడీఎస్) కింద పన్ను వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా వివిధ సర్వీసులు పొందినందుకు గాను కంపెనీలు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ విధించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. వెబ్సైట్ల రూపకల్పన సర్వీసులు, అనువాదాలు, డేటా ఎంట్రీ, రీసెర్చ్ మొదలైన వాటికి సంబంధించి వివిధ వెబ్సైట్లలో వచ్చే ప్రకటనలపై ఐటీ విభాగం దృష్టి పెడుతోంది. 2012లో 6 బిలియన్ డాలర్లుగా దేశీ ఈ-కామర్స్ బిజినెస్ 2021 నాటికి 76 బిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని అంచనా. -
పన్ను కడతారా.. జప్తు చేయాలా?
సీఎం సొంత జిల్లాలో అరాచకం పన్ను వసూళ్ల పేరిట దౌర్జన్యం అప్పటికప్పుడు కట్టాలంటూ హుకుం ఇళ్ల తలుపులు ఊడబెరికిన వైనం నగలు తాకట్టు పెట్టి చెల్లింపు పంచాయతీ అధికారుల వీరంగంపై జనం మండిపాటు సంగారెడ్డి: సీఎం సొంత జిల్లాలో పంచాయతీ అధికారులు రౌడీల్లా ప్రవర్తించి, దౌర్జన్యానికి దిగారు. స్పెషల్‌డ్రైవ్ పేరిట గ్రామాలపై మూకుమ్మడి దాడులకు పూనుకున్నారు. అప్పటికప్పుడు పన్ను చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఇళ్ల తలుపులు పెకిలించారు. ఇళ్లల్లోకి చొరబడి మంచాలు, సిలిండర్లు, టీవీలు, చెంబులు, బిందెలు జప్తు చేశారు. మంచం మీద పసిబిడ్డకు పాలిస్తున్న తల్లీబిడ్డను లాగేసి మంచం ఎత్తుకెళ్లారు. తాళం వేసి పొలానికి వెళ్లి వచ్చేలోగా ఓ రైతు ఇంటి తలుపులు ఊడదీసుకు పోయారు. దొరికిన వస్తువును దొరికినట్టు తీసుకెళ్లి గ్రామ పంచాయతీలో వేలానికి పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో గురువారం ఈ అరాచకం జరిగింది. ఆస్తి పన్నును వంద శాతం వసూలు చేయాలనే లక్ష్యంతో పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ పేరిట అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామాలను చుట్టుముడుతున్నారు. గురువారం చిన్నశంకరంపేట, రామాయంపేట మేజర్ గ్రామ పంచాయితీలపై విరుచుకుపడ్డారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ‘బకాయిలు కడ్తారా..? లేక ఆస్తులు జప్తు చేయమంటారా?’ అని బెదిరించారు. బకాయి కట్టిన వారికి రశీదులిచ్చారు. కట్టలేని వారి ఇంట్లోకి చొరబడి టీవీలు, మంచాలు, తలుపులు ఎత్తుకుపోయారు. నల్లా కనెక్షన్లు తొలగించారు. ► తాను స్నానం చేస్తుండగానే బాత్రూం తలుపులు ఊడదీశారు. ఇంట్లో ఉన్న టీవీ పట్టుకొని పోయారని రామాయంపేటకు చెందిన ఓ మహిళ కన్నీరు కార్చింది. ► చంటి బిడ్డకు పాలిస్తుంటే నెట్టేసి మంచం ఎత్తుకుపోయారని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ► చిన్నశంకరంపేటలో మేడి ప్రసాద్ అనే వ్యక్తి రూ.1,593 బకాయి పడ్డాడు. అధికారులు వచ్చిన సమయంలో ఆయన పొలం వద్ద ఉన్నారు. అదేం పట్టించుకోని అధికారులు అతని ఇంటి తలుపులు ఊడదీసి పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ► అదే గ్రామంలో పలువురి గ్రామస్తులది ఇదే పరిస్థితి. తలుపులతో సహా ఇంట్లోని వస్తువులు ఎత్తుకొని పోయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. పరువు పోతుందని భావించిన కొందరు మహిళలు ఒంటి మీద నగలు కుదవబెట్టి పన్నులు కట్టారు. మరికొంత మంది రైతులు అప్పటికప్పుడు దూడలు, పశువులను విక్రయించి పన్ను చెల్లించారు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు రూ. 2 వేలు బాకీ ఉన్నామట. మాకు సెప్పనే సెప్పలేదు. ఇంటికొచ్చిండ్రు దర్వాజలు పీక్కుపోయిండ్రు. వద్దు బిడ్డా అని గదువ పట్టుకొని బతిమిలాడినా... కాళ్లు పట్టుకున్న వినలే.. అనరాని మాటలు తిట్టుకుంట దర్వాజలు గడ్డపారతో పెకిలించిండ్రు. అపుడు మాపెద్ద మనిషి తానంజేత్తుండు. తానం సేసినంక పైసలు ఇస్తమన్నా ఆగలేదు. నేను ఇన్నేండ్లలో ఇసుంటి దౌర్జన్యం ఎప్పుడు సూడలే. నల్లాపైపులు విరగ్గొట్టిండ్రు. నాకు భయంతో బీపీ ఎక్కువయింది. - దేవుని నర్సవ్వ, దుర్గమ్మ బస్తీ, రామాయంపేట కమ్మలు కుదవబెట్టి కట్టిన.. ఎకాఎకిన ఇంటి మీద సక్తుజేస్తే ఎట్లా... నేనేమో పొలం మీదకు పోయిన.. ఆళ్లు ఇంటిమీదకచ్చిళ్లు. తలుపులు పీక్కపోయిండ్రు. నల్లా కనెక్షన్ పీకేసిళ్లు. నా భార్య ఒంటిమీది కమ్మలు మార్వాడీకి కుదవబెట్టి రూ.5 మిత్తికి రూ.3 వేలు తీసుకొచ్చి కట్టిన. - అంజయ్య, చిన్నశంకరంపేట ‘జప్తు’ చట్టంలోనే ఉంది నోటీసులిచ్చిన 12 రోజుల్లో పన్ను బకాయిలు కట్టాలి. అలా కాని పక్షంలో చరాస్తులను జప్తు చేయవచ్చ ని పంచాయతీ చట్టంలోనే ఉంది. జప్తు చేసిన ఆస్తులను వేలం వేయొచ్చు. రామాయంపేట, చిన్నశంకరంపేట పంచాయతీల్లో ఏం జరి గిందో నాకు తెలియదు. - సురేశ్‌బాబు, డీపీవో టీవీ ఎత్తుకపోయిండ్రు ట్యాక్స్ కోసం వచ్చిన పంచాయితోళ్లు మా ఇంటికి వచ్చి నల్లా పైపులు విరగ్గొట్టిండ్రు. మమ్ములను నెట్టేసి టీవీ ఎత్తుకపోయిండ్రు. మేము రూ.4 వేలు బాకీ ఉండగా, రూ.2 వేలు కడ్తమన్నా దౌర్జన్యం జేసిండ్రు. వారిపై చర్యలు తీసుకోవాలి. - జమాల్‌పూరి గణేశ్, రామాయంపేట -
పన్నుల వసూళ్లలో కేటుగాళ్లు!
గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చే ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ దారితప్పింది. పన్ను రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ప్రైవేటు ఖాతాకు మళ్లినట్లు వెలుగుచూసింది. తీగలాగితే డొంక కదులుతుందని భావించిన జిల్లా పంచాయతీ శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత వచ్చిన నివేదికల్లో అక్రమాల తంతు బయటపడనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు గ్రామ పంచాయతీని బలోపేతం చేసుకునేందుకు కీలక వనరు ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ. ఇంతటి ముఖ్యమైన పన్ను వసూళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పన్ను పైసలు సేకరించే బిల్ కలెక్టర్లే ఈ అక్రమాలకు కేంద్ర బిందువులుగా మారారు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలోని పంచాయతీల్లో ఇలాంటి బాగోతమే జరుగుతోంది. ఈ అంశంపై జిల్లా పంచాయతీ శాఖకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు.. అక్రమాల గుట్టును రట్టు చేసేందుకు ఉపక్రమించారు. 2013- 14, 2014 -15 ఆర్థిక సంవత్సరాల్లో పంచాయతీల వారీగా పన్ను వసూలు ప్రక్రియ, నిధులు జమచేసిన విధానంపై ఆరా తీసేందుకు పంచాయతీ శాఖ ప్రత్యేకంగా విచారణాధికారులను నియమించింది. శివారు పంచాయతీల్లో.. రాజధానికి ఆనుకుని ఉన్న పంచాయతీల్లో ఆస్తి పన్ను లక్ష్యం అధికంగా ఉంది. ఈ పంచాయతీల పరిధిలో ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉండడంతో వసూళ్ల ప్రక్రియ కూడా ఆశాజనకంగా ఉంది. ఈ క్రమంలో సర్కారుకు భారీగా ఆదాయం వస్తున్న ఈ పంచాయతీల్లో అక్రమాలు సైతం అదేస్థాయిలో ఉన్నాయి. పన్ను రాబడి అధికంగా ఉన్నప్పటికీ ఖజానాకు మాత్రం తక్కువ మొత్తంలో జమ అవుతోంది. జిల్లా పంచాయతీ శాఖ అధికారి పద్మజారాణి ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించి ఈ అక్రమాల్ని గుర్తించారు. దీంతో వాస్తవంగా వసూలైన పన్ను ఎంత.. ఖాతాలో జమైన నిధులెన్ని అనే అంశంపై స్పష్టత కోసం విచారణకు ఆదేశించారు. వివిధ మండల పరిషత్‌లలో పనిచేస్తున్న విస్తరణాధికారులకు ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈనెల 25లోపు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. విచారణ ఇలా.. గ్రామ పంచాయతీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియలో నిర్వహించే తీరు ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. వాస్తవానికి పన్ను వసూలు చేసిన రోజేఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమచేయాలి. రసీదుల్లో పేర్కొన్న మొత్తం.. బ్యాంకులో జమచేసిన మొత్తానికి సరిపోలాలి. ఈ క్రమంలో తేడాలొస్తే అక్రమాలకు ఆస్కారం ఉన్నట్లే. ఈ అంశాల ఆధారంగా విచారణాధికారులు పరిశీలనకు ఉపక్రమించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించి అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. ఈనెల 25లోగా కొందరు, వచ్చేనెల ఏడో తేదీలోగా మరికొందరు ఈ విచారణ నివేదికలు జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించనున్నారు. విచారణ చేపట్టే పంచాయతీలివే.. నగరానికి చుట్టూ విస్తరించి ఆదాయం సమృద్ధిగా వచ్చే మండలాలపై పంచాయతీ శాఖ దృష్టి సారించింది. ఈక్రమంలో ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 22 గ్రామ పంచాయతీలను గుర్తించి విచారణకు ఆదేశించింది. వీటిలో మణికొండ, బండ్లగూడ, నిజాంపేట, దమ్మాయిగూడ, బాచుపల్లి, కొంపల్లి, దూలపల్లి, బోడుప్పల్, ఫిర్జాదీగూడ, చెంగిచర్ల, మీర్పెట్, మేడిపల్లి, జిల ్లలగూడ, చౌదరిగూడ, బాలాపూర్, జల్పల్లి, రాగన్నగూడ, నాగారం, రాంపల్లి, కీసర, పుప్పాల్‌గూడ, పరిగి గ్రామ పంచాయతీలున్నాయి. వీటి విచారణకు వివిధ మండలాల విస్తరణ అధికారులను నియమించి వారికి డీపీఓ ఆదేశాలు జారీ చేశారు. -
టార్గెట్ వంద శాతం
►పంచాయతీ పన్ను వసూళ్ల సవాల్ ►ఆర్థిక భారం తగ్గించుకునే పనిలో సర్కార్ ►కార్యదర్శులు.. పంచాయతీ సిబ్బందికి టార్గెట్లు వసూలు చేయకుంటే వే టు భయం రూ.17 కోట్లకు వసూలైంది రూ.8 కోట్లే ముగింపు దశలో ఆర్థిక సంవత్సరం లక్ష్యం చేరాలంటున్న ప్రభుత్వం సాక్షి, మంచిర్యాల : గ్రామపంచాయతీల్లో వంద శాతం పన్ను వసూళ్లు చేపట్టాలనేది ప్రభుత్వం లక్ష్యం. కానీ.. ఆ లక్ష్యం చేరుకోవాలంటే జిల్లాలోని పంచాయతీల్లో ఇంకా రూ.9కోట్లు వసూలు కావాల్సి ఉంది. అది కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే ఈ రెండు నెలల్లోనే. గడిచిన పదేళ్లలో కేవలం రూ.8 కోట్లు వసూలు చేసిన జిల్లా సిబ్బంది ఇప్పుడు సవాల్‌గా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు రూ. కోటి కూడా దాటని వసూళ్లు.. ఈ రెండు నెలల్లోనే ఇంత మొత్తంలో ఎలా వసూలు చేసేదని అయోమయంలో పడ్డారు. కొత్త రాష్ట్రం ఆవిర్భావం కావడం.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నిధులు సమకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. అందుకే.. గ్రామ పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, నల్లా పన్నులు రాబట్టే విషయంలో సీరియస్‌గా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రామాల్లో ఆస్తి, నీటి, విద్యుత్ బిల్లులు, భూమి క్రయవిక్రయ, దుకాణాల పన్నుల లక్ష్యంలో 75 శాతం వసూలు చేయని పంచాయతీ కార్యదర్శులపై చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. పన్నుల వసూళ్లపై దృష్టిసారించి.. ప్రభుత్వ ఖాజానాను నింపాలని సంబంధిత పంచాయతీ అధికారులను ఆదేశించింది. వసూళ్లేలా సాధ్యం..? రోజుకు కనీసం 2 నుంచి 3 పంచాయతీల్లోనైనా తిరిగి పన్నులు వసూలు చేయాలని ఈవో పీఆర్డీలను జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆదేశించారు. ఇటు మండల పరిషత్ అధికారులు తమ పరిధిలో ఉన్న పంచాయతీల్లో కనీసం పదింటిలోనైనా వంద శాతం, మిగతా పంచాయతీల్లో 75 శాతానికి తగ్గకుండా పన్నులు వసూలు చేయాలని ఆదే శించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లాలో 27 మేజర్.. 839 మైనర్లతో కలుపుకుని మొత్తం 866 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటిని 580 క్లస్టర్లుగా విభజించారు. 159 క్లస్టర్లకు పంచాయతీ కార్యదర్శులు లేరు. చాలా చోట్ల కార్యదర్శులు మూడుకు మించి పంచాయతీలకు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. ఇన్చార్జి స్థానాల్లో ప్రజలకు కనీస వసతులు లేక పన్నులు చెల్లించేందుకు మొండికేస్తున్నారు. గ్రామా ల్లో ఆస్తి, నీటి, విద్యుత్ బిల్లులు, భూమి క్రయవిక్ర య, దుకాణాల పన్నుల వసూలు చూసుకుంటున్న బిల్ కలెక్టర్లు, కారోబార్లు, ఎన్ఎంఆర్ పోస్టులూ రెం డొందలకు పైగా ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఉ న్న ఖాళీల సమస్య గ్రామాల్లో పన్నుల వసూళ్లకు అడ్డంకిగా మారింది. మరోపక్క.. దాదాపు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడంతో పన్నుల వసూళ్లకు అధికారులెవరైనా ఒత్తిడి తెస్తే.. ప్రజలు గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయా ప్రజాప్రతినిధులూ ప్రజలను ఒత్తిడి చేయొద్దని చెబుతుండడంతో ఆ ప్రభావం వసూళ్లపై చూపుతోంది. పన్నుల వసూలు చేయాల్సిందే.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఈ ఆర్థిక సంవత్సరం ముగించేలోగా.. జిల్లా వ్యాప్తం గా డిమాండ్ మేరకు పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కార్యదర్శు లు పంచాయతీల్లో కనీసం 75 శాతం పన్నులు వసూ లు చేయాలి. వసూలు చేయని వారిపై నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.