సాక్షి,సిటీబ్యూరో: నగరంలోని మరో 20 వేల మంది వ్యాపారులను ట్రేడ్ లైసెన్స్ పరిధిలో తేవడంలో జీహెచ్‌ఎంసీ సఫలీకృతమైంది. ప్రస్తుతం సుమారు 65వేల మంది ట్రేడ్ లైసెన్స్‌దారులు ఉన్నారు. తాజాగా వాణిజ్య పన్నుల శాఖ ద్వారా 1.10లక్షల మంది ట్రేడ్ లైసెన్స్‌ను తీసుకున్నారు. నగరంలో కమర్షియల్ విద్యుత్ కనెక్షన్ పొందిన జాబితాను కూడా దక్షిణ మండలం విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి జీహెచ్‌ఎంసీ సేకరించింది. కమర్షియల్ ట్యాక్స్, విద్యుత్ శాఖ నుండి పొందిన జాబితాలను ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వద్ద ఉన్న ట్రేడ్ లైసెన్స్‌ల ఆధారంగా జీహెచ్‌ఎంసీకి ట్రేడ్ లైసెన్స్ కట్టనివారి జాబితాను సేకరించింది. ఈ జాబితాలో 27వేల మంది జీహెచ్‌ఎంసీ పరిధి బయట ఉండడం, కొందరు తమ వ్యాపారాలను మానివేసినట్లు గుర్తించారు. మిగిలినవారిలో జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్‌లేని వారికి వెంటనే ట్రేడ్‌లైసెన్స్‌లు పొందాలని ఎస్‌ఎంఎస్‌లు పంపడం, అక్రమ వ్యాపారాలను నిర్వహించే వారికి నోటీసులు పంపడం, అన్ని స్థాయిల అధికారులు నిరంతర తనిఖీలు, పర్యవేక్షణతో ట్రేడ్‌లైసెన్స్‌ల ద్వారా ఇప్పటికే రూ. 37 కోట్లు ఆర్జించారు. మార్చి 31వ తేదీలోగా కనీసం మరో రూ.20 కోట్లను ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా పన్నులు సేకరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి తెలిపారు.
రికార్డు స్థాయిలో ఆదాయం
అంతర్గత లోసుగులను సరిదిద్దుకోవడం, పన్ను ఎగవేత దారులను గుర్తించి వారిని పన్నులు చెల్లించే కేటగిరిలోకి తేవడంతో జీహెచ్‌ఎంసీ పన్నుల వసూళ్లలో ఘణనీయమైన వృద్ది సాధిస్తోంది.గత ఆర్థిక సంవత్సరం ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా బల్దియాకు మొత్తం రూ.27.50 కోట్లు లభించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016–17) జనవరి 17వ తేదీ వరకు రూ. 65,500 ట్రేడ్ లైసెన్స్‌ల నుండి రూ. 37కోట్లు సేకరించడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్స్‌ల ద్వారా రూ. 50కోట్లను సేకరించాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా నిర్ధారించుకుంది.
ఈ ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో రెండు నెలలు ఉండగానే కేవలం ట్రేడ్ లైసెన్స్‌ల సేకరణలోనే గత సంవత్సరం మొత్తాన్ని చూస్తే దాదాపు రూ.10కోట్ల పైగా అదనపు ఆదాయం లభించింది.
పన్ను వసూళ్లలో టాప్
Published Thu, Jan 19 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
Advertisement