2014-15లో పెట్రోల్, డీజిల్‌పై పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై రెవెన్యూ, కస్టమ్స్ తదితర పన్నుల ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రూ. 75,441 కోట్ల భారీ ఆదాయం వచ్చింది. ఇది 2012-13లో వచ్చిన ఆదాయం(రూ.46,926 కోట్లు) కంటే 60 శాతం ఎక్కువ. ఈ మొత్తం రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్నుకు అదనం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం లోక్‌సభకు ఈ వివరాలు తెలిపారు.
గత ఏడాది 2 కోట్ల కేసుల పరిష్కారం: సుప్రీం కోర్టుతోపాటు దేశంలోని వివిధ కోర్టులు గత ఏడాది 2 కోట్ల కేసులను పరిష్కరించాయని, ఇంకా 3 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని న్యాయ మంత్రి సదానంద గౌడ రాజ్యసభకు వెల్లడించారు.
ఆ నర్సులు అనుమతి తీసుకోవాలి: ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్(ఈసీఆర్) అవసరమున్న ఖతర్, కువైట్ వంటి 18 దేశాల్లో ఉద్యోగాలు చేయడానికి వెళ్లే నర్సులు ఇమిగ్రేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
గత మూడేళ్లలో 24 వేల వరకట్న మరణాలు: గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 24,771 వరకట్న మరణాలు నమోదయ్యాయని మంత్రి మేనకా గాంధీ తెలిపారు.
రైళ్లలో అత్యవసర వైద్యానికి 138: రైలు ప్రయాణికులు అత్యవసర వైద్యానికి సెల్‌ఫోన్ల నుంచి 138 నంబర్‌కు చేయొచ్చని, లేకపోతే టికెట్ కలెక్టర్‌కు చెప్పొచ్చని రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాజ్యసభకు తెలిపారు.
నిర్వాసితుల్లో మహారాష్ట్ర టాప్ : డ్యామ్ నిర్మాణాల వల్ల నిర్వాసితులయ్యే వారి సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. అక్కడ 7.13 లక్షల మంది నిర్వాసితులయ్యారని మంత్రి సన్వర్‌లాల్ జాట్ వెల్లడించారు. తర్వాతి స్థానాల్లో అవిభక్త ఆంధప్రదేశ్ (4,64,675 మంది), కర్ణాటక(4,10,104 మంది) ఉన్నట్లు వెల్లడించారు.
ఏడాదికి రూ. 75 వేల కోట్లు
Published Sat, Aug 1 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM
Advertisement