సాక్షి, అమరావతి: ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ ఆదాయాల పరంగా నిలదొక్కుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇది సానుకూలమని, దేవుడు మనతో ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆదాయ వనరుల ఆర్జన శాఖలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహిస్తుండడం వల్ల లైసెన్స్ ఫీజు కోల్పోయామని అధికారులు ప్రస్తావించగా, మద్యాన్ని నియంత్రించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లను రాబట్టుకోవడానికి ఒక విధానాన్ని తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీలో మంచి బస్సులను ప్రవేశపెట్టాలని, ఏసీ బస్సుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎర్రచందనానికి అదనపు విలువ జోడించడానికి ప్రయతి్నంచాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. ఆదాయాన్ని పెంచుకోవడంపై గనుల శాఖ ప్రయత్నించాలని చెప్పారు. రంగాల వారీగా ఆదాయం గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment