టార్గెట్ వంద శాతం | hundred percent target | Sakshi
Sakshi News home page

టార్గెట్ వంద శాతం

Published Fri, Feb 6 2015 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

టార్గెట్ వంద శాతం

టార్గెట్ వంద శాతం

పంచాయతీ పన్ను వసూళ్ల సవాల్
ఆర్థిక భారం తగ్గించుకునే పనిలో సర్కార్
కార్యదర్శులు.. పంచాయతీ సిబ్బందికి టార్గెట్లు


వసూలు చేయకుంటే వే టు భయం
రూ.17 కోట్లకు వసూలైంది రూ.8 కోట్లే
ముగింపు దశలో ఆర్థిక సంవత్సరం లక్ష్యం చేరాలంటున్న ప్రభుత్వం

 
 
సాక్షి, మంచిర్యాల : గ్రామపంచాయతీల్లో వంద శాతం పన్ను వసూళ్లు చేపట్టాలనేది ప్రభుత్వం లక్ష్యం. కానీ.. ఆ లక్ష్యం చేరుకోవాలంటే జిల్లాలోని పంచాయతీల్లో ఇంకా రూ.9కోట్లు వసూలు కావాల్సి ఉంది. అది కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే ఈ రెండు నెలల్లోనే. గడిచిన పదేళ్లలో కేవలం రూ.8 కోట్లు వసూలు చేసిన జిల్లా సిబ్బంది ఇప్పుడు సవాల్‌గా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు రూ. కోటి కూడా దాటని వసూళ్లు.. ఈ రెండు నెలల్లోనే ఇంత మొత్తంలో ఎలా వసూలు చేసేదని అయోమయంలో పడ్డారు.

కొత్త రాష్ట్రం ఆవిర్భావం కావడం.. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే నిధులు సమకూర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. అందుకే.. గ్రామ పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, నల్లా పన్నులు రాబట్టే విషయంలో సీరియస్‌గా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గ్రామాల్లో ఆస్తి, నీటి, విద్యుత్ బిల్లులు, భూమి క్రయవిక్రయ, దుకాణాల పన్నుల లక్ష్యంలో 75 శాతం వసూలు చేయని పంచాయతీ కార్యదర్శులపై చర్యలూ తీసుకుంటామని హెచ్చరించింది. పన్నుల వసూళ్లపై దృష్టిసారించి.. ప్రభుత్వ ఖాజానాను నింపాలని సంబంధిత పంచాయతీ అధికారులను ఆదేశించింది.

వసూళ్లేలా సాధ్యం..?

రోజుకు కనీసం 2 నుంచి 3 పంచాయతీల్లోనైనా తిరిగి పన్నులు వసూలు చేయాలని ఈవో పీఆర్డీలను జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆదేశించారు. ఇటు మండల పరిషత్ అధికారులు తమ పరిధిలో ఉన్న పంచాయతీల్లో కనీసం పదింటిలోనైనా వంద శాతం, మిగతా పంచాయతీల్లో 75 శాతానికి తగ్గకుండా పన్నులు వసూలు చేయాలని ఆదే శించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జిల్లాలో 27 మేజర్.. 839 మైనర్‌లతో కలుపుకుని మొత్తం 866 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.

వీటిని 580 క్లస్టర్లుగా విభజించారు. 159 క్లస్టర్లకు పంచాయతీ కార్యదర్శులు లేరు. చాలా చోట్ల కార్యదర్శులు మూడుకు మించి పంచాయతీలకు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్నారు. ఇన్‌చార్జి స్థానాల్లో ప్రజలకు కనీస వసతులు లేక పన్నులు చెల్లించేందుకు మొండికేస్తున్నారు. గ్రామా ల్లో ఆస్తి, నీటి, విద్యుత్ బిల్లులు, భూమి క్రయవిక్ర య, దుకాణాల పన్నుల వసూలు చూసుకుంటున్న బిల్ కలెక్టర్లు, కారోబార్లు, ఎన్‌ఎంఆర్ పోస్టులూ రెం డొందలకు పైగా ఖాళీగా ఉన్నాయి.

క్షేత్రస్థాయిలో ఉ న్న ఖాళీల సమస్య గ్రామాల్లో పన్నుల వసూళ్లకు అడ్డంకిగా మారింది. మరోపక్క.. దాదాపు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడంతో పన్నుల వసూళ్లకు అధికారులెవరైనా ఒత్తిడి తెస్తే.. ప్రజలు గ్రామాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆయా ప్రజాప్రతినిధులూ ప్రజలను ఒత్తిడి చేయొద్దని చెబుతుండడంతో ఆ ప్రభావం వసూళ్లపై చూపుతోంది.

పన్నుల వసూలు చేయాల్సిందే..

- పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి

ఈ ఆర్థిక సంవత్సరం ముగించేలోగా.. జిల్లా వ్యాప్తం గా డిమాండ్ మేరకు పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కార్యదర్శు లు పంచాయతీల్లో కనీసం 75 శాతం పన్నులు వసూ లు చేయాలి. వసూలు చేయని వారిపై నిబంధనల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement