పన్ను వసూళ్లు రూ.8.62 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్-అక్టోబర్) రూ.8.62 లక్షల కోట్లుగా నమోదయ్యారుు. ఆర్థిక సంవత్సరం మొత్తం లక్ష్యం 16.26 లక్షల కోట్లలో ఇది సగానికన్నా అధికం కావడం గమనార్హం. ఈ కాలంలో పరోక్ష పన్ను వసూళ్లు 26.7 శాతం పెరిగి రూ.4.85 లక్షల కోట్లకు చేరారుు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 10.6 శాతం ఎగసి రూ.3.77 లక్షల కోట్లకు పెరిగారుు. ప్రత్యక్ష పన్నుల విభాగంలో కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు ఉన్నారుు. ఎకై ్సజ్, సేవలు, కస్టమ్స్ సుంకాలు పరోక్ష పన్నుల్లో ఉంటారుు.