Financial year
-
ఖజానాకు చేరిన గత బడ్జెట్ కేటాయింపులు
భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌ను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కొన్ని శాఖలు పూర్తిస్థాయిలో అప్పటి బడ్జెట్ నిధులను ఉపయోగించలేదు. మూలధన పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్లలో జాప్యం కారణంగా కొంతమేర నిధులు బూ తిరిగి ఖజానాకు చేరాయి. ఏయే విభాగాలు ఎంతమేరకు ఇలా నిధులు తిరిగి పంపాయో.. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.కొన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన బడ్జెట్‌ను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కొనుగోలు ప్రక్రియల్లో జాప్యం, ఇతర బ్యూరోక్రాటిక్ అడ్డంకుల కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ.12,500 కోట్లు తిరిగి కేంద్ర ఖజానాకు జమ చేసింది. ప్రభుత్వం కఠినమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా భారీగా ఖర్చు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖర్చులను ఆదాయ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇది ఆర్థిక జాప్యాన్ని నివారించడానికి, సమతుల్య బడ్జెట్‌ను నిర్వహించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: 100 మంది వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?మెరుగైన పన్ను వసూలు యంత్రాంగాలు, పన్ను ఎగవేతను అరికట్టడంతో సహా సమర్థమైన ఆదాయ సమీకరణ ప్రయత్నాల వల్ల కొంత బడ్జెట్‌ను మిగిల్చింది. కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రభుత్వాల మద్దతు వల్ల ద్రవ్యలోటును నిర్వహించడానికి, బడ్జెట్ అమలు సజావుగా జరిగేలా చూడటానికి సాయపడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. నిధుల రాబడి, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెబుతున్నారు. -
మార్చి తర్వాత వడ్డీరేటు తగ్గింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2025–2026) రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ దిగ్గజం– ఫిచ్ విశ్లేషించింది. స్థిర వృద్ధి, ధరల పెరుగుదల్లో కట్టడి వంటి అంశాలు దీనికి దోహదపడతాయన్నది ఫిచ్ విశ్లేషణ. రెపో రేటు కోత 2025–26లో కార్పొరేట్ల రుణ లభ్యత పెరుగుదలకు దారితీసే అంశంగా పేర్కొంది. అధిక మూలధన వ్యయాలు నమోదయినప్పటికీ, వచే ఆర్థిక సంవత్సరం భారత్ కార్పొరేట్ల మార్జిన్లు మెరుగుపడతాయన్న విశ్వాసాన్ని ఫిచ్ వెలిబుచ్చింది. ‘‘ఇండియా కార్పొరేట్ల క్రెడిట్ ట్రెండ్స్’’ పేరుతో ఫిచ్ రూపొందించిన తాజా నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... వృద్ధి 6.5 శాతం 2025–26లో సిమెంట్, విద్యుత్, పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, ఇంజినీరింగ్, నిర్మాణ (ఈఅండ్‌సీ) కంపెనీల ఉత్పత్తులకు మంచి డిమాండ్ అవకాశాలు ఉన్నాయి. దీనితో ఎకానమీ 6.5 శాతం పురోగమించే వీలుంది. మౌలిక సదుపాయాల వ్యయం పెరగవచ్చు. ఎకానమీ స్థిరవృద్ధికి ఈ అంశం దోహదపడుతుంది. మరికొన్ని అంశాలు... → దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు నెమ్మదించడం వల్ల ఆటో రంగంలో వృద్ధి మధ్యస్థంగా ఉండే వీలుంది. → రవాణా, పర్యాటక పరిశ్రమలో డిమాండ్ రికవరీ ఒక మోస్తరు వేగంతో కొనసాగుతుంది. → అంతర్జాతీయంగా అధిక సరఫరాల ప్రభావం రసాయన కంపెనీల ధరలపై ప్రభావం చూపుతుంది. → టెలికం కంపెనీల ఆదాయ వృద్ధికి టారిఫ్‌ల పెంపు మద్దతు లభిస్తుంది. → ఔషధ రంగంలో మెరుగైన ఫలితాలు నమోదుకావచ్చు.రూపాయిపై ఒత్తిడి కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారత రూపాయి మరింత క్షీణించవచ్చు. అమెరికాసహా కొన్ని దేశాలు తీసుకునే వాణిజ్య రక్షణాత్మక చర్యల వల్ల దిగుమతులు తగ్గి, రూపాయిపై ఆ ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఐటీ మందగమనం.. కీలకమైన విదేశీ మార్కెట్లలోని వినియోగదారులు ఆర్థిక వృద్ధి మందగించే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని వ్యయాల విషయంలో విచక్షణతో వ్యవహరించవచ్చు. దీనితో ఐటీ, సేవా కంపెనీల అమ్మకాల్లో కేవలం ఒక అంకె వృద్ధి మాత్రమే నమోదయ్యే వీలుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఉత్పత్తి విక్రయాల్లో వృద్ధి ఒక అంకెకు పరిమితం కావచ్చు.రేటు తగ్గింపు ప్రక్రియ షురూ! రిటైల్ ద్రవ్యోల్బణం మరింత తగ్గి, 5 శాతం లోపనకు పడిపోయే అవకాశం ఉంది. ఆర్బీవ్యోల్బణం నుండి వృద్ధి వైపు దృష్టి సారిస్తుందని మేము నమ్ముతున్నాము. కరెన్సీ అస్థిరత కొంత అనిశ్చితిని సృష్టిస్తున్నప్పటికీ, ఆర్బీఐ సరళతర ఆర్థిక విధానంవైపు అడుగులు వేయవచ్చని భావిస్తున్నాము. – అఖిల్ మిట్టల్, సీనియర్ ఫండ్ మేనేజర్ (టాటా అసెట్ మేనేజ్మెంట్)ఫిబ్రవరిలో రేటు తగ్గదు నవంబర్ 2024లో 5.5 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.2 శాతానికి దిగివచ్చింది. ఇది మా అంచనాలకన్నా తక్కువ. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి పాలసీ సమీక్షలో రెపో రేటు తగ్గింపు కష్టమే. అయితే కూరగాయల వంటి నిత్యావసర వస్తువుల్లో ధరలలో గణనీయమైన క్షీణత వల్ల వృద్ధే లక్ష్యంగా ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యుల్లో కొందరు కోతకు మొగ్గుచూపే వీలుంది. – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ ఏప్రిల్ పాలసీలో కోత కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఫిబ్రవరి పాలసీ సమీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లోని పలు అంశాలు ప్రస్తుత ఆర్బీఐ పాలసీని ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం డేటా రేటు తగ్గింపునకు కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ) రేటు తగ్గింపునకు మరొక పాలసీ వరకూ ఆర్బీఐ వేచిచూసే వీలుంది. – పరాస్ జస్రాయ్, ఇండ్–రా ఎకనమిస్ట్ -
8 నెలలు..8 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు ముగిసే నాటికి (నవంబర్ 30, 2024 వరకు) అన్ని రకాల రాబడులు కలిపి రూ.1,41,178 కోట్లు వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడుల కింద అంచనా వేసిన రూ.2.74 లక్షల కోట్లలో ఇది 51.51 శాతం కావడం గమనార్హం.కాగా గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో నవంబర్ నెల ముగిసేసరికి రూ.1,49,316.41 కోట్లు రావడం గమనార్హం. గత ఏడాది మొత్తం అంచనాల్లో ఇది 57.46 శాతం కాగా, ప్రస్తుత 8 నెలల కాలంలో రూ.8 వేల కోట్ల మేర రాబడులు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారీగా తగ్గిన పన్నేతర ఆదాయంరాష్ట్ర ప్రభుత్వ ఆదాయ రాబడులకు సంబంధించిన కీలకమైన పద్దుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పన్నేతర ఆదాయంలో భారీగా క్షీణత నమోదైంది. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల మైనింగ్, యూజర్ చార్జీలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సమకూరే ఆదాయాన్ని పన్నేతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఈ పద్దు కింద 2023–24లో నవంబర్ నెల ముగిసే సమయానికి రూ.19,524.69 కోట్లు సమకూరింది. అదే ప్రస్తుత సంవత్సరంలో మాత్రం కేవలం రూ. 5,217.26 కోట్లు మాత్రమే వచ్చింది. వాస్తవానికి 2024–25లో రూ.35,208 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అందులో దాదాపు 15 శాతం మాత్రమే సమకూరడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 8 నెలల్లో రూ.14,607 కోట్లు రాగా, ఈ ఏడాదిలో రూ.2 వేల కోట్లు తక్కువగా రూ.12,364 కోట్లు వచ్చింది. అయితే జీఎస్టీ పద్దు కింద గత ఏడాది కంటే రూ.3 వేల కోట్లు, అమ్మకపు పన్ను కింద రూ.1.500 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.3 వేల కోట్లు అధికంగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.200 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అప్పులు కూడా గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గినా బడ్జెట్ అంచనాల్లో 72 శాతం ఇప్పటికే సమకూరడం గమనార్హం.నాలుగు నెలల్లో రాబడి వస్తుందా?ప్రస్తుత లెక్కల ప్రకారం నవంబర్ తర్వాత మిగిలిన నాలుగు నెలల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.30 లక్షల కోట్లకు పైగా రాబడులు ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సి ఉంది. అయితే గత ఏడాది చివరి నాలుగు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా మాత్రమే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బడ్జెట్ అంచనాలకు, రాబడులకు భారీ లోటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నాలుగు నెలల్లో రూ.80 వేల కోట్ల మేర రాబడులు వస్తాయని ఆశించినా, కనీసం మరో రూ.20–30వేల కోట్లు ఇతర మార్గాల్లో సమకూర్చుకోకపోతే బడ్జెట్ లెక్కలు తప్పుతాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, భూముల అమ్మకాలు, మైనింగ్ ఆదాయం పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని వారు సూచిస్తున్నారు. -
జీడీపీ మందగమనం వ్యవస్థీకృతం కాదు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి తగ్గుముఖం పట్టడం అన్నది.. వ్యవస్థీకృతం కాదని (ఆర్థిక వ్యవస్థ అంతటా) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి మెరుగైన మూలధన వ్యయాల మద్దతుతోతగ్గిన మేర డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) భర్తీ అయ్యి మోస్తరు స్థాయికి వృద్ధి చేరుకుంటున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5.4 శాతానికి పడిపోవడం తెలిసిందే. ఇది ఏడు త్రైమాసికాల కనిష్ట రేటు కావడం గమనార్హం. జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటు 6.7 శాతంగా ఉంది. ‘‘ఇది వ్యవస్థ అంతటా మందగమనం కాదు. ప్రభుత్వం వైపు నుంచి వ్యయాలు, మూలధన వ్యయాలు లోపించడం వల్లే. క్యూ3లో ఇవన్నీ సర్దుకుంటాయి. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా వచ్చే ఏడాది, తర్వాత కూడా కొనసాగుతుంది’’అని ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి చెప్పారు. అంతర్జాతీయ డిమాండ్ స్తబ్దుగా ఉండడం ఎగుమతుల వృద్ధిపై ప్రభావం చూపించినట్టు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున మూలధన వ్యయాలు చేయకపోవడం, కొన్ని రంగాల్లో తగ్గిన కార్యకలాపాలు వృద్ధిపై ప్రభావం చూపించడం తెలిసిందే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.11.11 లక్షల కోట్ల మూలధన వ్యయాలను కేంద్రం లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 37.3 శాతమే ఖర్చు చేసింది. చర్యలు తీసుకుంటున్నాం.. ‘‘దేశ ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపడుతోంది. అదే సమయంలో వేతనాల్లోనూ మందగమనం ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇవి దేశ వినియోగంపై ప్రభావం చూపించగలవు. ప్రతి సవాలు నుంచి అవకాశాలను చూసే ప్రధాన మంత్రి మనకు ఉన్నారు. కరోనా సమయంలో ఎదురైన సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని సంస్కరణలు తీసుకొచ్చాం. ఆ సమయంలో ఐదు మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టాం. విడిగా ప్రతి ఒక్కటీ తనవంతు మద్దతునిచి్చంది’’అని మంత్రి సీతారామన్ వివరించారు. -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
వినియోగదారుల రుణాలు రూ.90 లక్షల కోట్లు
కోల్‌కతా: వినియోగదారుల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15 శాతం వృద్ధి చెంది రూ.90 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే కొంత క్షీణత కనిపించింది. వినియోగదారుల రుణాల్లో 40 శాతం వాటా కలిగిన గృహ రుణ విభాగంలో మందగమనం ఇందుకు కారణమని క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. 2023–24లో గృహ రుణాల విభాగంలో వృద్ధి 7.9 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే విభాగం 23 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. రూ.35 లక్షలకు మించిన గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. సగటు రుణ సైజ్ 2019–20లో ఉన్న రూ.20లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 2023–24లో రూ.26.5 లక్షలకు పెరిగింది. వ్యక్తిగత రుణాలకు డిమాండ్ ఇక వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్)కు డిమాండ్ బలంగా కొనసాగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2023–24లో వ్యక్తిగత రుణాల విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. రూ.10లక్షలకు మించిన వ్యక్తిగత రుణాల వాటా పెరగ్గా.. అదే సమయంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాల విలువ అధికంగా ఉండగా, ఎన్బీఎఫ్సీలు సంఖ్యా పరంగా ఎక్కువ రుణాలు జారీ చేశాయి. టూవీలర్ రుణాల జోరు ద్విచక్ర వాహన రుణ విభాగం సైతం బలమైన పనితీరు చూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2022–23లో 30 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆటోమొబైల్ రుణాల విభాగంలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22 శాతంగా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని చూపించాయి. రుణాల సగటు విలువ కూడా పెరిగింది. ఎంఎస్ఎంఈ విభాగంలో వ్యక్తిగత రుణాల కంటే సంస్థాగత రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఎంఎస్ఎంఈ రుణాలు 29 శాతం, సంస్థలకు సంబంధించి ఎంఎస్ఎంఈ రుణాలు 6.6 శాతం చొప్పున పెరిగాయి. సూక్ష్మ రుణాలు సైతం బలమైన వృద్ధిని చూపించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. -
ఒక్క రూపాయీ గ్రాంట్ రాలే!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ముగిసిపోయింది. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇప్పుడేకాదు చాలా ఏళ్లుగా రాష్ట్రానికి గ్రాంట్లు ఇచ్చే విషయంలో కేంద్రం శీతకన్ను వేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించిన దాంట్లో సగం కూడా నిధులను మంజూరు చేయడం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.2,317 కోట్లు అయినా ఇవ్వగా.. ఈసారి అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21 వేలకోట్లకుపైగా వస్తాయని బడ్జెట్లో అంచనా వేసుకుంది.పన్నుల వసూళ్లతోనే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ 30వ తేదీ వరకు ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్‌కు ఇచ్చిన నివేదికలోని గణాంకాల ప్రకారం పన్ను రాబడులు ఆశించిన మేర వస్తున్నాయి. ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో పన్ను రాబడులు రూ.11,464 కోట్లు వచ్చాయి. మే నెలలో కొంత తగ్గి రూ.10,954 కోట్లు వచ్చినా, జూన్‌లో మళ్లీ పుంజుకుని రూ.12,190 కోట్లు వచ్చాయి. మొత్తంగా మూడు నెలల్లో కలిపి అన్నిరకాల రాబడులు, పన్నుల్లో వాటా, అప్పులు కలిపి రూ.48,790.66 కోట్లు ఖజానాకు సమకూరగా.. అందులో రూ.34,609 కోట్లు పన్ను ఆదాయం కిందే అందాయి. అంటే మొత్తం రాబడిలో 80శాతానికిపైగా పన్నుల రూపంలోనే ఖజానాకు వచ్చినట్టు అర్థమవుతోంది.మూడు నెలల్లో రూ.13,171 కోట్ల అప్పులుఇక ఈ మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.13,171 కోట్లు అప్పుల రూపంలో సమకూర్చుకుంది. ఏప్రిల్‌లో రూ.2,246 కోట్లు, మేలో రూ.5,133 కోట్లు, జూన్‌లో రూ.5,790 కోట్లు రుణాలు తీసుకుంది. ఈ మొత్తంలో సగం వరకు గతంలోని అప్పుల అసలు, వడ్డీలకు చెల్లించినట్టు కాగ్‌కు సమర్పించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏప్రిల్‌లో రూ.1,865 కోట్లు, మేలో రూ.1,864 కోట్లు, జూన్‌లో రూ.2,203 కోట్లు అప్పుల కింద చెల్లించారు. ఇక ఇతర ఖర్చుల విషయానికి వస్తే జీతాలకు రూ.11,026.69 కోట్లు చెల్లించారు. గత ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో చెల్లించిన దానికంటే ఇది రూ.1,300 కోట్లు అధికం. పింఛన్ల కోసం రూ.4,311.62 కోట్లు, సబ్సిడీల కింద రూ.3,354 కోట్లు చెల్లించారు. మొత్తం రాబడిలో రూ.45,320.12 కోట్లు ఖర్చయిందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
సెయిల్ ఈ ఏడాది పెట్టుబడి రూ. 6,500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.6,500 కోట్ల మూలధన వ్యయం చేయనుంది. 2030 నాటికి రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికలో భాగంగా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు సెయిల్ సీఎండీ అమరేందు ప్రశాశ్ శుక్రవారమిక్కడ తెలిపారు. ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ‘తొలి దశలో సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 20 మిలియన్ టన్నుల నుంచి 2031 నాటికి 35 మిలియన్ టన్నులకు చేరుస్తాం. తదుపరి దశలో వార్షిక సామర్థ్యాన్ని 50 మిలియన్ టన్నులకు పెంచుతాం. స్టీల్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా 0.5% వృద్ధి చెందుతోంది. గతేడాది భారత్ ఏకంగా 13 శాతం వృద్ధి నమోదు చేసింది. వచ్చే పదేళ్లు భారత్‌లో స్టీల్ రంగం ఏటా సగటు వృద్ధి 8%గా ఉంటుంది’ అని వివరించారు. -
వృద్ధికి వర్షపాతం, ప్రపంచ సానుకూలతల దన్ను
న్యూఢిల్లీ: సాధారణ రుతుపవనాల అంచనాలు, ఇప్పటివరకు ఎటువంటి ప్రపంచ ప్రతికూలతలు లేకపోవడం వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతం కంటే ఎక్కువగా వృద్ధి చెందడానికి దోహదపడే అవకాశం ఉందని ఎకనామిక్ థింక్ ట్యాంక్– ఎన్సీఏఈఆర్ తన నెలవారీ సమీక్షలో తెలిపింది.దేశీయ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని హై–ఫ్రీక్వెన్సీ సూచికలు వెల్లడిస్తున్నాయని, 2024–25 వృద్ధి అంచనాలను దాదాపు అన్ని ఏజెన్సీలు కూడా ఎగువముఖంగా సవరిస్తున్నాయని పేర్కొంది. భారత్ వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 7.2 శాతం శ్రేణిలో ఉంటుందని పలు సంస్థలు అంచనావేస్తున్న విషయాన్ని ఎన్సీఏఈఆర్ డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా పేర్కొంటూ.. ఎకానమీ వృద్ధి 2024–25లో 7 శాతం ఖాయమని, 7.5 శాతం వరకూ కూడా ఈ రేటు పురోగమించే వీలుందని అన్నారు. పూనమ్ గుప్తా పేర్కొన్న అంశాల్లో ముఖ్యమైనవి...మార్చి త్రైమాసికంలో కనిపించిన ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, వృద్ధి, స్థూల ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలకు తోడు సాధారణ రుతుపవనాల అంచనాలు ఎకానమీకి ఊతం ఇస్తాయి.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిల్లోనే కొనసాగే అవకాశం ఉన్నందున, కీలక రెపో రేటు మరింత కఠినమయ్యే పరిస్థితులు లేవు.అయితే ఆహార ధరలు ఇప్పుడు ప్రధానంగా సవాలు విసురుతున్న సమస్య. దీనిని పరిష్కరించడానికి విస్తృత విధాన ఫ్రేమ్‌వర్క్ అవసరం కావచ్చు. వాతావరణ సవాళ్లను తట్టుకునే ఆహార సరఫరాల చైన్‌ను వ్యవస్థీకరించడంతోపాలు, ప్యాక్ అయిన సురక్షిత ఆహార సరఫరాలవైపు క్రమంగా మారాలి. సరఫరా–డిమాండ్ అంతరాన్ని తగ్గించడానికి తగిన కృషి జరగాలి.ప్రధాన పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపీ)లో వృద్ధి ఏప్రిల్ 2024లో వేగంగా ఉంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏడాది పొడవునా పటిష్టంగా ఉన్నాయి. వ్యక్తిగత రుణ వృద్ధిలో కొంత క్షీణత ఉన్నప్పటికీ, బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 20 శాతం కంటే ఎక్కువగా ఉంది. జూన్‌లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ’సాధారణం కంటే ఎక్కువ’ రుతుపవనాల అంచనాలు వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తున్నాయి. భారత్ ఎకానమీ పురోగతిలో ఇవన్నీ కీలకాంశాలు. -
భారీగా బంగారం వెండి దిగుమతులు
న్యూఢిల్లీ: యూఏఈ నుంచి బంగారం, వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం లో గణనీయంగా పెరిగాయి. 210 శాతం అధికంగా 10.7 బిలియన్ డాలర్లు (88,810 కోట్లు) విలువైన బంగారం, దిగుమతులు నమోదైనట్టు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీ యేటివ్ (జీటీఆర్ఐ) సంస్థ అధ్యయనంలో తెలిసింది. 2022–23లో బంగారం, వెండి దిగుమతుల విలువ 3.5 బిలియన్ డాలర్లుగానే ఉంది. భారత్–యూఏఈ సమగ్ర ఆరి్థక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) కింద యూఏఈకి భారత్ కలి్పంచిన కస్టమ్స్ డ్యూటీ రాయితీలే ఈ పెరుగుదలకు కారణమని జీటీఆర్‌ఈ ఓ నివేదికలో వెల్లడించింది. పెరిగిన దిగుమతులను నియంత్రించేందుకు కస్టమ్స్ డ్యూటీ రాయితీలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. యూఏఈ నుంచి వెండి దిగుమతులపై 7 శాతం టారిఫ్ రాయితీని భారత్ కల్పిస్తోంది. దిగుమతుల పరిమాణంపై ఎలాంటి పరిమితి విధించలేదు. అదే బంగారం అయితే ఒక ఆరి్థక సంవత్సరంలో 160 మెట్రిక్ టన్నుల వరకు ఒక శాతం డ్యూటీ రాయితీ కింద అనుమతించింది. 2022 మే నుంచి రెండు దేశాల మధ్య సీఈపీఏ అమల్లోకి వచ్చింది. దీనికితోడు గిఫ్ట్ సిటీలోని ‘ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్సే్ఛంజ్’(ఐఐబీఎక్స్) ద్వారా యూఏఈ నుంచి ప్రైవేటు సంస్థలు బంగారం, వెండి దిగుమతులకు ప్రభుత్వం అనుమతించింది. బంగారం, వెండి మినహా యూఏఈ నుంచి ఇతర ఉత్పత్తుల దిగుమతులు గత ఆరి్థక సంవత్సరంలో క్షీణించాయి. 2022–23లో 48 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు యూఏఈ నుంచి భారత్‌కు రాగా, 2023–24లో 9.8 శాతం తక్కువగా 48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.ఇదే ధోరణి ఉండకపోవచ్చు.. యూఈఏ నుంచి బంగారం, వెండి దిగుమతులు ఇక ముందూ ఇదే స్థాయిలో కొనసాగకపోవచ్చని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఎందుకంటే యూఏఈలో బంగారం లేదా వెండి తవ్వకాలు (మైనింగ్) లేవని, కనుక ఆ దేశానికి ఈ ఉత్పత్తుల ఎగుమతులతో ఒనగూడే అదనపు విలువ ఏమంత ఉండదన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో బంగారం, వెండి, ఆభరణాల దిగుమతులపై 15 శాతం సుంకం అమలవుతోంది. ఇదే అసలు మూలంలోని సమస్య. టారిఫ్‌లను 5 శాతానికి తగ్గించినట్టయితే అక్రమ రవాణా, దురి్వనియోగానికి అడ్డుకట్ట పడుతుంది’’అని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. యూఏఈ నుంచి దిగుమతులపై తక్కువ టారిఫ్ నేపథ్యంలో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు రాయితీతో కూడి కస్టమ్స్ సుంకాలను సమీక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. బంగారం మాదిరే వెండి దిగుమతులపై వార్షిక పరిమితిని అయినా విధించాలని సూచించారు. దీనివల్ల ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు. గిఫ్ట్ సిటీ ద్వారా బంగారం, వెండి దిగుమతుల విషయంలో నిబంధనలను కఠినతరం చేయాలని సూచించారు. -
జీఎస్టీ రికార్డు వసూళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల్లో 2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు. అంటే సమీక్షా నెల్లో వార్షిక ప్రాతిపదికన 12.4 శాతం పురోగతి నమోదయ్యిందన్నమాట. ఆర్థిక క్రియాశీలత, దిగుమతుల పురోగతి వంటి అంశాలు జీఎస్టీ రికార్డుకు కారణమయ్యింది. విభాగాల వారీగా ఇలా... ⇒ మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2,10,267 కోట్లు. ⇒ సెంట్రల్ జీఎస్టీ రూ.43,846 కోట్లు. ⇒ స్టేట్ జీఎస్టీ రూ.53,538 కోట్లు. ⇒ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,623 కోట్లు ⇒ సెస్ రూ.13,260 కోట్లు (దిగుమతులపై రూ.1,008 కోట్లుసహా) ఏపీలో 12%, తెలంగాణలో 11% వృద్ధి కాగా, జీఎస్టీ ఇంటర్ గవర్నమెంట్ సెటిల్మెంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ నుంచి కేంద్ర జీఎస్టీకి రూ.50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి రూ.41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. దీంతో మొత్తంగా కేంద్ర జీఎస్టీగా రూ.94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా రూ.95,138 కోట్ల ఆదాయం సమీక్షా నెల్లో సమకూరినట్లయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు వృద్ధిని కనబరిచాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 12% వృద్ధితో రూ.4,850 కోట్లు, తెలంగాణలో 11% వృద్ధితో రూ.6,236 కోట్లు నమోదయ్యాయి. అయితే దేశంలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో వసూళ్లు 13 శాతం వృద్ధితో రూ.37,671 కోట్లకు ఎగశాయి. గత ఆర్థిక సంవత్సరంలో నుంచి (అంకెలు రూ. లక్షల కోట్లలో) ఏప్రిల్ 2023 1.87 మే 1.57 జూన్ 1.61 జూలై 1.60 ఆగస్టు 1.59 సెపె్టంబర్ 1.63 అక్టోబర్ 1.72 నవంబర్ 1.67 డిసెంబర్ 1.64 జనవరి 2024 1.74 ఫిబ్రవరి 1.68 మార్చి 1.78 ఏప్రిల్ 2.102017జూలైలో తాజా పరోక్ష పన్ను వ్యవస్థ జీఎస్టీ ప్రారంభమైన తర్వాత 2024 ఏప్రిల్, 2023 ఏప్రిల్, 2024 మార్చి, 2024 జనవరి, 2023 అక్టోబర్ ఇప్పటి వరకూ టాప్–5 జీఎస్టీ నెలవారీ వసూళ్లను నమోదుచేశాయి. -
రూ.1.2 లక్షల కోట్లకు ఆయుర్వేద మార్కెట్
న్యూఢిల్లీ: దేశీయంగా ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ 2028 ఆర్థిక సంవత్సరం నాటికి రెట్టింపు స్థాయికి పైగా వృద్ధి చెందనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 57,450 కోట్లు) ఉన్న ఈ మార్కెట్ 16.27 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) చేరనుంది. స్థానిక, అంతర్జాతీయ మార్కెట్లలో సహజసిద్ధ చికిత్సా విధానాలకు డిమాండ్ నెలకొనడం, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కొత్తగా ఈ విభాగంలోకి ఔత్సాహిక వ్యాపారవేత్తలు కూడా వస్తుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఆయుర్వేద టెక్ స్టార్టప్ సంస్థ నిరోగ్‌స్ట్రీట్ రూపొందించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2023 – 2028 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆయుర్వేద ఉత్పత్తుల మార్కెట్ ఏటా 15 శాతం చొప్పున పెరగవచ్చని అంచనాలు నెలకొన్నాయి. నివేదిక ప్రకారం ప్రోడక్ట్ విభాగం 16 శాతం, సర్వీసుల విభాగం 12.4 శాతం చొప్పున వృద్ధి చెందనున్నాయి. ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో 7,500 పైచిలుకు ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థలు ఉన్నాయి. ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, జమ్మూ–కశీ్మర్, కేరళ ఈ జాబితాలో ఉన్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఆయుష్ (ఆయుర్వేద, యోగ, యునానీ, సిద్ధ, హోమియోపతి) విభాగం 24 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందిందని ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోటేచా ఇటీవల ప్రస్తావించిన నేపథ్యంలో ఆయుర్వేద ఉత్పత్తులకు భారత్ మార్కెట్లో గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని నిరోగ్‌స్ట్రీట్ తెలిపింది. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు.బ్రిటిష్ పాలన నుంచి వారసత్వంబ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది.వ్యవసాయ దేశంభారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.పండుగలుభారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.ప్రాంతీయ నూతన సంవత్సరంభారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు.ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
ఆర్థిక సంవత్సరం.. ఏప్రిల్ 1 నుంచే ఎందుకబ్బా?
ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి వరకు మాత్రమే ఎందుకు పరిగణిస్తారు, అని చాలామందికి అనుమానం రావొచ్చు. దీనికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. ఆర్థిక పరిశోధకులు కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించారు. బ్రిటిష్ పాలన నుంచి వారసత్వం బ్రిటీష్ దేశాల్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు. భారతదేశం సుమారు 150 సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్టిండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఈ పద్దతినే భారత ప్రభుత్వం కొనసాగిస్తూ వస్తోంది. వ్యవసాయ దేశం భారతదేశం వ్యవసాయ దేశం. కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పంటలపై ఆధారపడి ఉంటాయి. ఫిబ్రవరి, మార్చి కాలంలో పండిన దిగుబడుల అంచనాపై ఆదాయం ఆధారపడి ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా/తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు. అందువల్ల ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ నుంచి మార్చి వరకు తీసుకోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. పండుగలు భారతదేశంలో నవరాత్రి, దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్, నవంబర్ నెలల్లో వస్తాయి. ఆ తరువాత డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. ఈ సమయంలో వ్యాపారుల అమ్మకాలు భారీగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్‌ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు. మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ప్రాంతీయ నూతన సంవత్సరం భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది. ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండవచ్చని చెబుతారు. ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్ధిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ''కెనడా, యునైటెడ్ కింగ్డమ్ (UK), న్యూజిలాండ్. హాంగ్ కాంగ్, జపాన్'' దేశాలు కూడా ఉన్నాయి. -
బ్యాంకింగ్ మార్జిన్లకు ఇకపై సవాళ్లు..!
న్యూఢిల్లీ: డిపాజిట్ వృద్ధి స్వల్పంగా ఉంటే ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) భారత్ బ్యాంకుల రుణ వృద్ధి 12–14 శాతం శ్రేణిలో ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘భారత్ బ్యాంకుల్లో కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులు– రుణ వృద్ధి’ అన్న శీర్షికతో ఈ మేరకు ఒక నివేదిక వెలువడింది. ‘‘మేము రేట్ చేసే భారతీయ బ్యాంకుల విషయంలో డిపాజిట్ వృద్ధి రేటు వెనుకబడి ఉంది. ఇది కఠిన లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), రుణ పరిస్థితులకు దారి తీస్తుంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ క్రెడిట్ అనలిస్ట్ నికితా ఆనంద్ నివేదిక విడుదల సందర్భంగా చెప్పారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ నిధుల సమీకరణవైపు దృష్టి సారించవచ్చని ఆయన పేర్కొంటూ.. ఇదే జరిగితే బ్యాంకింగ్ రుణ వ్యయాలు పెరిగి మార్జిన్లు, లాభదాయకత దెబ్బతింటాయని విశ్లేసించారు. నిధుల సమీకరణ వ్యయాల పెరుగుదల, వడ్డీరేట్ల తగ్గుదలకు అవకాశాలు 2025లో బ్యాంకింగ్‌పై ప్రతికూలతలు చూపవచ్చని, నికర వడ్డీ మార్జిన్లు తగ్గడానికి కారణంగా ఉండవచ్చని నికితా ఆనంద్ వివరించారు. వ్యక్తిగత రుణ విభాగం జూమ్.. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ విశ్లేషణ ప్రకారం, బ్యాంకుల మొత్తం లోన్ బుక్‌లో అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్ల వాటా పెరుగుతూనే ఉంటుంది. కఠిన ద్రవ్య పరిస్థితుల్లో మార్జిన్లు భారీగా పడిపోకుండా బ్యాంకింగ్‌కు రక్షించే అంశాల్లో ఇది ఒకటి. క్రెడిట్ కార్డుల వంటి కొన్ని విభాగాలకు సంబంధించి వ్యక్తిగత రుణ మంజూరీలు ఇకపై మరింత కఠినతరం చేస్తూ, బ్యాంకులకు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ విభాగంలో పురోగతి ఆగలేదు. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణ మంజూరీలు పెరుగుతుండడం, ఈ నేపథ్యంలో ఆయా రుణ మంజూరీ పట్ల బ్యాంకింగ్ జాగరూకత పాటించడం ఆర్బీఐ ఇటీవలి ఆదేశాల లక్ష్యం. హై రిస్క్ వెయిటేజ్ అన్సెక్యూర్డ్ వినియోగ రుణాలపై 25 శాతం పెంచాలన్నది ఈ ఆదేశాల ప్రధానాంశం. అంటే కొన్ని వ్యక్తిగత రుణాల విషయంలో బ్యాంకింగ్ కేటాయింపులు మరింత పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ నిర్ణయం వల్ల క్రెడిట్ కార్డ్ రుణాలపై రిస్క్ వెయిటేజ్ బ్యాంకులపై 150 శాతానికి, ఎన్బీఎఫ్సీలపై 125 శాతానికి పెరిగింది. గృహ రుణాలు, విద్యా రుణాలు, వాహన రుణాలు, బంగారం, బంగారు ఆభరణాల ద్వారా పొందే రుణాలపై కొత్త నిబంధనలు వర్తించబోవని ఆర్బీఐ స్పష్టం చేయడం వ్యక్తిగత రుణ విభాగంలో కొనసాగుతున్న పురోగతికి కారణం. 2023 సెపె్టంబర్ చివరి నాటికి పర్సనల్ లోన్ల విభాగంలో బ్యాంక్ క్రెడిట్ బకాయిలు రూ. 48,26,833 కోట్లు. ఇది 2022 అదే నెలతో పోలిస్తే దాదాపు 30 శాతం పెరిగింది. కాగా, స్థిరమైన రుణ నాణ్యత, మూలధనం బ్యాంకుల క్రెడిట్ ప్రొఫైల్‌లకు మద్దతు ఇచ్చే అంశాలుగా ఆనంద్ తెలిపారు. అనుకూలమైన ఈక్విటీ మార్కెట్లు, ఆపరేటింగ్ పరిస్థితులు 2024లో బ్యాంకులకు రుణ సమీకరణ అవకాశాలను పెంచే అంశాలని ఆయన తెలిపారు. -
షిప్పింగ్ కంపెనీల ఆదాయాలు తగ్గొచ్చు
ముంబై: దేశీ షిప్పింగ్ కంపెనీల ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 5–7 శాతం మధ్య క్షీణించొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) షిప్పింగ్ కంపెనీల ఆదాయం 35 శాతం వృద్ధిని చూడగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 23–25 శాతం మధ్య తగ్గుతుందని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చార్టర్ రేట్లు పెరగడం, కరోనా ఆంక్షల అనంతరం చైనా నుంచి పెరిగిన డిమాండ్ గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధికి దారితీసినట్టు క్రిసిల్ తెలిపింది. వివిధ విభాగాల్లో పనిచేసే షిప్పింగ్ కంపెనీల నిర్వహణ మార్జిన్ వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. చార్టర్ రేట్లలో దిద్దుబాటు ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో షిప్పింగ్ కంపెనీల సగటు నిర్వహణ మార్జిన్ 33–35 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా ముందున్న 25–30 శాతానికంటే ఎక్కువేనని గుర్తు చేసింది. మోస్తరు మూలధన వ్యయ ప్రణాళికల నేపథ్యంలో షిప్పింగ్ కంపెనీల రుణ పరపతి ప్రస్తుతం మాదిరే మెరుగ్గా కొనసాగుతుందని అంచనా వేసింది. దేశంలోని మొత్తం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల డెడ్‌వెయిట్ టన్నేజీ సామర్థ్యంలో సగం వాటా కలిగిన ఐదు షిప్పింగ్ కంపెనీలపై అధ్యయనం చేసి క్రిసిల్ ఈ వివరాలు అందించింది. తగ్గిన రేట్లు.. చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు వీలుగా దేశీ షిప్పింగ్ కంపెనీలు ఎక్కువగా ట్యాంకర్లను (70 శాతం) కలిగి ఉన్న విషయాన్ని క్రిసిల్ ప్రస్తావించింది. ఆ తర్వాత బొగ్గు, ముడి ఇనుము, ధాన్యాల రవాణాకు 20 శాతం మేర సామర్థ్యం ఉండగా.. మిగిలిన 10 శాతం కంటెయినర్ షిప్‌లు, గ్యాస్ క్యారీయర్లు ఉన్నట్టు పేర్కొంది. చార్టర్ రేట్లు అంతర్జాతీయ డిమాండ్–సరఫరాకు అనుగుణంగా మారుతూ ఉంటాయని క్రిసిల్ తెలిపింది. ‘‘చమురు ట్యాంకర్ల చార్టర్ రేట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 50వేల డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20–25 శాత మేర తగ్గాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గడమే ఇందుకు కారణం’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. ప్రస్తుత పరిస్థితే అంతర్జాతీయ వాణిజ్యంలో కొనసాగుతుందని, వచ్చే ఏడాది చార్టర్ రేట్లు మరికొంత దిగి వస్తాయని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ కరోనా ముందు నాటి కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. చైనా, భారత్ నుంచి పెరిగే డిమాండ్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల చార్టర్ రేట్లకు మద్దతుగా ఉంటుందని క్రిసిల్ పేర్కొంది. మరోవైపు ట్యాంకర్ల సరఫరా పరిమితంగా ఉంటుందని, ఫలితమే చార్టర్ రేట్లు కరోనా ముందున్న నాటితో పోలిస్తే ఎగువ స్థాయిలోనే ఉండొచ్చని వవరించింది. డ్రై బల్క్ క్యారియర్ల చార్టర్ రేట్లు అదే స్థాయిలో కొనసాగొచ్చని పేర్కొంది. -
ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలు రెండింతలు
ముంబై: చార్జింగ్ స్టేషన్లపరమైన కొరత, ఇతరత్రా రిస్కులు ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ బస్సుల (ఈ–బస్సులు) అమ్మకాలు రెండింతలు పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. పాలసీలు, వ్యయాలపరంగా సానుకూలత దన్నుతో మొత్తం బస్సుల విక్రయాల్లో వాటి వాటా 8 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఇది 4 శాతంగా ఉంది. ప్రజా రవాణా వ్యవస్థలో కర్బన ఉద్గారాలను తగ్గించే లక్ష్యంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతుండటం విద్యుత్ బస్సులకు సానుకూలమని క్రిసిల్ వివరించింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ పథకం కింద టెండర్ల ద్వారా రాష్ట్రాల ప్రజా రవాణా సంస్థలు ఈ–బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు, సాంప్రదాయ ఇంధనాలు, సీఎన్జీతో నడిచే బస్సులతో పోలిస్తే ఈ–బస్సుల కొనుగోలు వ్యయం ప్రాథమికంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ స్థానికంగా తయారీ, బ్యాటరీ ఖరీదు తగ్గుదల, విస్తృతంగా తయారీ తదితర అంశాల కారణంగా వ్యయాలు తగ్గొచ్చని క్రిసిల్ డైరెక్టర్ సుశాంత్ సరోదే తెలిపారు. ఈ–బస్సుల ఓనర్íÙప్ వ్యయాలు పెట్రోల్/డీజిల్ లేదా సీఎన్జీ బస్సులతో పోలిస్తే 15–20 శాతం తక్కువగానే ఉంటాయన్నారు. వాటి జీవితకాలం 15 ఏళ్లు ఉండగా.. ఆరు–ఏడేళ్లలోనే బ్రేక్ఈవెన్ (లాభనష్ట రహిత స్థితి) సాధించవచ్చని (సగటున 330 రోజుల పాటు రోజుకు 250 కి.మీ. రన్ రేట్‌తో) సుశాంత్ వివరించారు. సవాళ్లూ ఉన్నాయి.. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సానుకూలాంశాలు ఉన్నా, దానికి తగ్గట్లే సవాళ్లు కూడా ఉన్నాయని క్రిసిల్ వివరించింది. రాష్ట్రాల రవాణా సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటం వల్ల అంతిమంగా ఈ–బస్ ప్రాజెక్టులకు రుణదాతలు రుణాలివ్వడానికి వెనుకాడేలా చేస్తోందని పేర్కొంది. బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత రెండో సవాలని వివరించింది. నగరాల మధ్య బస్సులు నడిపే ఆపరేటర్లకు చార్జింగ్ సదుపాయాలే కీలకం. ఇటీవల ప్రకటించిన పీఎం–ఈ–బస్5 సేవా స్కీముతో చెల్లింపులపరంగా రుణదాతలకు కాస్త భరోసా లభించగలదని క్రిసిల్ రేటింగ్స్ టీమ్ లీడర్ పల్లవి సింగ్ తెలిపారు. ఈ–బస్ ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు రుణదాతలు సానుకూలంగా ఉండొచ్చని పేర్కొన్నారు. పీఎం–ఈబస్ సేవా స్కీము కింద కేంద్రం 169 నగరాల్లో 10,000 పైచిలుకు ఈ–బస్సులను వినియోగంలోకి తేవడం, 181 నగరాల్లో చార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 22 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా రూ. 10.60 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 22 శాతం పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న టార్గెట్‌లో 58 శాతానికి చేరాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు 12.48 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల వసూళ్లు 31.77 శాతం పెరిగాయని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు రూ. 1.77 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేసినట్లు పేర్కొంది. స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (కార్పొరేట్, వ్యక్తిగత ఆదాయపు పన్నులు కలిపి) సుమారు 18% పెరిగి రూ. 12.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023–24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ. 18.23 లక్షల కోట్లు సాధించాలని నిర్దేశించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 16.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75 శాతం అధికం. -
కార్ల అమ్మకాలు రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ఆటోల విక్రయాల్లోనూ వృద్ధి నెలకొంది. తద్వారా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు పోల్చి చూస్తే.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రవాణా రంగం ద్వారా వచ్చే ఆదాయంలో 8.40 శాతం వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు చూస్తే జాతీయ సగటును మించి రాష్ట్రంలో వృద్ధి చోటు చేసుకుంది. అలాగే ఇదే కాలానికి జాతీయ సగటును మించి రాష్ట్రంలో కార్ల విక్రయాల్లో వృద్ధి నమోదైంది. ఇక ఆటోల అమ్మకాల్లో ఏకంగా 795.28 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు రవాణా ఆదాయం రూ.1,448.35 కోట్లు రాగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1,570.07 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా గూడ్స్ వాహనాల అమ్మకాలు పడిపోగా రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇతర రాష్ట్రాల్లో విధానాలపై అధ్యయనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రవాణా రంగం ద్వారా ఆదాయం పెంచుకోవడానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో బాగుంటే వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. వాహనాల పన్నుల విషయంలో కొత్త విధానాలను అన్వేíÙస్తున్నాం. కొనుగోలుదారులను ప్రోత్సహించేలా సంస్కరణలపై దృష్టి సారించాం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహనాలతో పాటు కార్ల కొనుగోళ్లు పెరిగాయి. రవాణా ఆదాయంలోనూ వృద్ధి నమోదవుతోంది. – ప్రసాదరావు, అదనపు కమిషనర్, రవాణా శాఖ -
భారీ లక్ష్యంతో దిశగా ఐఆర్ఈడీఏ - 2025 నాటికి..
న్యూఢిల్లీ: భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ (ఐఆర్ఈడీఏ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,350 కోట్ల ఆదాయన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అలాగే, 2025 మార్చి నాటికి రూ.5,220 కోట్లకు చేరుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ప్రకటించింది. కేంద్ర నూతన, పునరుత్పాదక శాఖ (ఎంఎన్ఆర్ఈ)తో ఇందుకు సంబంధించి పనితీరు ఆధారిత అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఎంవోయూ ప్రకారం నిర్ధేశించిన మేర ఆదాయ లక్ష్యాలను ఐఆర్ఈడీఏ చేరుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ ఆన్ నెట్‌వర్త్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీడ్, రుణాల్లో ఎన్పీఏ రేషియో, అస్సెట్ టర్నోవర్ రేషియో తదితర పనితీరు ఆధారిత లక్ష్యాలు ఇందులో భాగంగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.3,482 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్టు ఐఆర్ఈడీఏ ప్రకటించింది. ‘‘జూన్ త్రైమాసికంలో రుణాల పంపిణీలో 272 శాతం వృద్ధి నమోదు చేశాం. పన్ను అనంతరం లాభంలో 30 శాతం వృద్ధి నమోదైంది’’అని ఐఆర్ఈడీఏ సీఎండీ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. నికర నిర్ధరక రుణాలు (ఎన్పీఏలు) 2.92 శాతం నుంచి 1.61 శాతానికి తగ్గినట్టు చెప్పారు. -
రూ.8.7 లక్షల కోట్లు.. 2.7 కోట్ల యూనిట్ల వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అన్ని విభాగాల్లో కలిపి తయారయ్యాయి. వీటి విలువ అక్షరాలా రూ.8.7 లక్షల కోట్లు. ఈ విలువలో 57 శాతం వాటా (రూ.5 లక్షల కోట్లు) ప్యాసింజర్ వాహనాలదేనని మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీ ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక వెల్లడించింది. ప్యాసింజర్ కార్ల విభాగంలో మధ్య, పూర్తి స్థాయి ఎస్‌యూవీలు, ఉప విభాగాలు సగ భాగం కంటే అధికంగా కైవసం చేసుకున్నాయి. విలువలో కాంపాక్ట్ ఎస్‌యూవీల వాటా 25 శాతం ఉంది. లగ్జరీ కార్లు 13 శాతం వాటాతో రూ.63,000 కోట్లు నమోదు చేశాయి. వినియోగదార్లు చవక చిన్న కార్లు, సెడాన్లను ఇష్టపడటం లేదు. అందుకే ఇటువంటి కార్ల వాటా మొత్తం విలువలో తక్కువగా ఉంది. తక్కువ ధరలో లభించే వాహనాల నుంచి ఫీచర్ రిచ్ వైపు కస్టమర్లు మళ్లుతున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనం. పరిమాణం కంటే విలువ పెరుగుదల వేగంగా జరుగుతోందని నమ్ముతున్నాము’ అని నివేదిక వివరించింది. టూ–వీలర్లు 2 కోట్లు.. ప్రైమస్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం.. భారత్‌లో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి దాదాపు చైనా స్థాయిలో ఉంది. ఇక్కడి తయారీ ప్లాంట్ల నుంచి ఏటా 2 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలు వెలువడుతున్నాయి. ఉత్పత్తి అయిన మొత్తం వాహనాల్లో పరిమాణం పరంగా 77 శాతం వాటా టూ–వీలర్లదే. మొత్తం వాహనాల్లో కమర్షియల్ వెహికిల్స్ 10 లక్షల యూనిట్లు ఉంటాయి. వీటిలో 2 టన్నుల లోపు సామర్థ్యంగల నాలుగు చక్రాల చిన్న క్యారియర్లు, ట్రాక్టర్ ట్రైలర్స్, టిప్పర్స్ సైతం ఉన్నాయి. వీటి విలువ రూ.1.7 లక్షల కోట్లు. కమర్షియల్ వెహికిల్స్ వాటా మొత్తం పరిమాణంలో 4 శాతం, విలువలో 19 శాతం కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఆటోమొబైల్ రంగం 1.9 కోట్ల మందికి ఉపాధి కల్పించింది’ అని వివరించింది. భారీ పెట్టుబడులు.. భారత్‌లో ద్విచక్ర, త్రిచక్ర వాహన విభాగాల్లో ఈవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ‘భారతీయ ఈవీ పరిశ్రమ చైనా, యూఎస్, ఈయూ వంటి అగ్ర దేశాల కంటే వెనుకబడి ఉంది. దేశంలో భారీ పెట్టుబడులు జరిగాయి. రాబోయే కొద్ది సంవత్సరాలలో దేశం తన ఈవీ విభాగాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉందని ఇది గట్టిగా సూచిస్తుంది. భారత్‌లో ఆటోమొబైల్ పరిశ్రమలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అనేక అంశాలు పరిశ్రమను పునర్నిర్మిస్తున్నాయి. ఈవీలు, ప్రత్యామ్నా య ఇంధనం, ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగంలో పెరుగుదల, షేర్డ్ వెహికల్ రెంటల్స్/క్యాబ్ సర్వీస్‌ల వంటి అంశాలు భారతీయ ఆటోమొబైల్ రంగంలో పరివర్తనకు కారణమవుతున్నాయి’ అని నివేదిక పేర్కొంది. -
రూ.3.51 లక్షల కోట్లకు ఎంఎఫ్ఐ పరిశ్రమ
కోల్‌కతా: సూక్ష్మరుణ సంస్థల పోర్ట్‌ఫోలియో (రుణాల విలువ) గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 21.3 శాతం వృద్ధి చెంది రూ.3.51 లక్షల కోట్లకు చేరుకుంది. 2021–22 చివరికి సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో విలువ రూ.2.89 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం రుణ ఖాతాలు ఈ పరిశ్రమలో 2022 మార్చి నాటికి 1,239 లక్షలుగా ఉంటే, 2023 మార్చి నాటికి 1,363 లక్షలకు చేరినట్టు పరిశ్రమ స్వీయ నియంత్రణ మండలి ‘సాధాన్’ ఈడీ, సీఈవో జిజి మామెన్ తెలిపారు. ఈ గణాంకాలు కరోనా ప్రభావం నుంచి పరిశ్రమ బయటపడినట్టు తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమ ఇప్పుడు వృద్ధి బాటలో నడుస్తున్నట్టు చెప్పారు. నూతన నియంత్రణ నిబంధనలు సూక్ష్మ రుణ సంస్థలు సైతం మార్కెట్లో పోటీ పడే అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. ఇది ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్‌ఐల పోర్ట్‌ఫోలియోలో ప్రతిఫలిస్తోందన్నారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంఎఫ్ఐ రంగం మొత్తం రుణ వితరణలు రూ. 3,19,948 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరంలో ఉన్న రూ.2,53,966 కోట్లతో పోలిస్తే 26 శాతం పెరిగింది. ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు రూ.1,24,063 కోట్లను పంపిణీ చేయగా, బ్యాంకు లు రూ.1,16,402 కోట్లను మంజూరు చేశాయి’’ అని మామెన్ వెల్లడించారు. రుణ ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడినట్టు చెప్పారు. -
16 రోజుల్లో ఐటీ రీఫండ్స్ చెల్లింపులు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లింపులను (రిఫండ్) సగటున 16 రోజుల్లో పూర్తి చేస్తోంది. 2022–23 సంవత్సరాలో సగటు రిఫండ్ సమయం 16 రోజులకు తగ్గినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. 80 శాతం రిఫండ్లను రిటర్నులు దాఖలు చేసిన 30 రోజుల్లోనే విడుదల చేసినట్టు సీబీడీటీ చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. పన్ను చెల్లింపుదారులు సులభంగా, వేగంగా రిటర్నులు దాఖలు చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఐటీఆర్ దాఖలు చేసిన ఒక్కరోజులోనే వాటిని ప్రాసెస్ చేస్తున్నట్టు తెలిపారు. ఇలా ఒక్క రోజులో ప్రాసెస్ చేసినవి 2021–22లో 21 శాతం ఉంటే, 2022–23లో 42 శాతానికి పెరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ సామర్థ్యం గురించి మాట్లాడుతూ.. 2022 జూన్ 28న ఒకే రోజు 22.94 లక్షల రిటర్నుల ప్రాసెసింగ్ నమోదైనట్టు పేర్కొన్నారు. స్వచ్ఛంద నిబంధనల అమలును సులభతరం చేసేందుకు వీలుగా.. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండేళ్ల వరకు ఎప్పుడైనా అప్డేట్ చేసుకునే సదుపాయం కల్పించినట్టు చెప్పారు. 2023 మార్చి 31 నాటికి 24.50 లక్షల అప్డేటెడ్ రిటర్నులు నమోదైనట్టు వెల్లడించారు. -
బజాజ్ అలియెంజ్ నుంచి బోనస్
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ బజాజ్ అలియెంజ్ గత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) గాను పాలసీదారులకు రూ. 1,201 కోట్ల విలువైన బోనస్ ప్రకటించింది. వెరసి అర్హతగల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు వరుసగా 22వ ఏడాదిలోనూ బోనస్ చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా బోనస్‌లో రెగ్యులర్ రివర్షనరీ బోనస్ రూ. 872 కోట్లు, టెర్మినల్, క్యాష్ బోనస్ రూ. 329 కోట్లు కలసి ఉన్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది (2021 - 22) రూ. 11.62 లక్షలకుపైగా పాలసీదారులకు రూ. 1,070 కోట్ల బోనస్ చెల్లించింది. -
ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాల జోరు.. భారత చరిత్రలోనే ఇదే అత్యధికం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా 2022 - 23లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు హోల్‌సేల్‌లో రికార్డు స్థాయిలో 38,90,114 యూనిట్లు అమ్ముడయ్యాయి. భారత చరిత్రలో ఇదే అత్యధికం. యుటిలిటీ వాహనాల జోరు ఇందుకు దోహదం చేసింది. 2018 - 19లో విక్రయం అయిన 33,77,436 యూనిట్లే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 26.73 శాతం వృద్ధి అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ వన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. 2021–22లో తయారీ కంపెనీల నుంచి డీలర్లకు చేరిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 30,69,523 యూనిట్లు. యుటిలిటీ వాహనాలు.. గత ఆర్థిక సంవత్సరంలో 34.55 శాతం వృద్ధితో 20,03,718 యూనిట్ల యుటిలిటీ వాహనాలు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో వీటి సంఖ్య 14,89,219 యూనిట్లు. పీవీ విభాగంలో యుటిలిటీ వెహికిల్స్ వాటా ఏకంగా 51.5 శాతానికి ఎగబాకింది. వాణిజ్య వాహనాలు 7,16,566 నుంచి 9,62,468 యూనిట్లకు చేరాయి. 2018 - 19 తర్వాత ఇదే అధికం. ద్విచక్ర వాహనాలు 17 శాతం అధికమై 1,35,70,008 యూనిట్లు నవెదయ్యాయి. సానుకూలంగా పరిశ్రమ.. అన్ని విభాగాల్లో కలిపి దేశవ్యాప్తంగా విక్రయాలు 20.36 శాతం పెరిగి 2,12,04,162 యూనిట్లకు చేరుకున్నాయి. ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ కార్లు, ద్విచక్ర వాహనాల విభాగంలో సవాళ్లు కొనసాగుతున్నాయని సియామ్ తెలిపింది. ప్రారంభ స్థాయి మినీ కార్ల విక్రయాలు 57 శాతం పడిపోయాయి. 2016 - 17లో ఈ విభాగంలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. 2018 - 19తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎంట్రీ లెవెల్ స్కటర్లు 27 శాతం, మోటార్‌సైకిళ్లు 38 శాతం తగ్గాయి. ‘అన్ని విభాగాల్లో మొత్తం డివండ్ క్రమంగా పెరుగుతోంది. సరైన దిశలోనే పరిశ్రమ కదులుతోంది. 2023–24 సంవత్సరానికి సానుకూలంగా ఉంటుంది’ అని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ తెలిపారు. -
ఆర్బీఐ తొలి ద్వైమాసిక పాలసీ సమీక్ష ప్రారంభం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి ద్వైమాసిక మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ కీలక నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి. 3, 5, 6 తేదీల్లో సమావేశాలు జరుగుతాయి. 4వ తేదీ మçహావీర్ జయంతి సందర్భంగా సెలవు. ఈ సమావేశాల్లో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్ 8, ఆగస్టు 5, సెప్టెంబర్ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. -
లాభాలతో కొత్త ఏడాదిలోకి!
ముంబై: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి ట్రేడింగ్ రోజైన సోమవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఆటో, బ్యాంకింగ్, వినిమయ షేర్లు రాణించడంతో మార్కెట్ మూడోరోజూ ముందడుగేసింది. భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం కలిసొచ్చింది. ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి మళ్లాయి. రోజంతా పరిమిత శ్రేణిలో తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెన్సెక్స్ 139 పాయింట్ల లాభంతో 59,131 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 412 పాయింట్ల పరిధిలో 58,793 వద్ద కనిష్టాన్ని, 59,205 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 115 పాయింట్ల లాభంతో 59,106 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 68 పాయింట్లు బలపడి 17,428 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 17,313–17,428 శ్రేణిలో కదలాడింది. ఆఖరికి 38 పాయింట్లు పెరిగి 17,398 వద్ద ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్‌పీఐలు రూ.322 కోట్ల షేర్లను కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 9 పైసలు క్షీణించి 82.30 స్థాయి వద్ద స్థిరపడింది. మహవీర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి బుధవారం ప్రారంభమవుతాయి. ముడిచమురు ధరలు పెరుగుదలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ‘‘ఈ వారంలో ట్రేడింగ్ మూడురోజులకే పరిమితం కావడంతో పాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో ట్రేడర్లు పొజిషన్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. మార్చిలో ఆటో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో పాటు భారత తయారీ రంగ కార్యకలాపాలు పుంజుకొని మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం మార్కెట్లో ఒత్తిళ్లను తగ్గించాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు... ► హీరో మోటోకార్ప్ షేరు నాలుగుశాతం లాభపడి రూ.2,434 వద్ద ముగిసింది. వార్షిక ప్రాతిపదికన మార్చి విక్రయాలు 15% వృద్ధిని సాధించడంతో ఈ కంపెనీ షేరుకు డిమాండ్ నెలకొంది. ► అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ రేటింగ్ తగ్గించడంతో కేపీఐటీ టెక్నాలజీ షేరు 12 శాతం క్షీణించి రూ.810 వద్ద నిలిచింది. ► పలు ఆర్డర్లను దక్కించుకోవడంతో రైల్ వికాస్ నిగమ్ షేరు 10% ఎగసి రూ.75 వద్ద నిలిచింది. -
ఐటీ ఆదాయాలకు సవాళ్లు..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా స్థూలఆర్థిక పరిస్థితులు, ఫైనాన్షియల్ రంగంలో సవాళ్లు మొదలైనవి దేశీ ఐటీ కంపెనీల ఆదాయాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రతికూలంగా పరిణమించవచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి దాదాపు 20 శాతంగా ఉండనుండగా .. 2024 ఆర్థిక సంవత్సరంలో 10–12 శాతం స్థాయికి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ‘అమెరికా, యూరప్ వంటి కీలక మార్కెట్లలో.. ముఖ్యంగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) విభాగంలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఇవి దేశీ ఐటీ సేవల కంపెనీల ఆదాయాల వృద్ధిపై ప్రభావం చూపనున్నాయి’ అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి తెలిపారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం తర్వాత బీఎఫ్ఎస్ఐ సెగ్మెంట్లో కొంత ఒత్తిడి నెలకొందని పేర్కొన్నారు. ఫలితంగా ఈ విభాగం ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్ మధ్య స్థాయికి పడిపోవచ్చని వివరించారు. అయితే, తయారీ రంగంలో 12–14 శాతం, ఇతర సెగ్మెంట్లలో 9–11 శాతం వృద్ధి నమోదు కావచ్చని.. తత్ఫలితంగా బీఎఫ్ఎస్ఐ విభాగంలో క్షీణత ప్రభావం కొంత తగ్గవచ్చని వివరించారు. దాదాపు రూ. 10.2 లక్షల కోట్ల భారతీయ ఐటీ రంగంలో 71 శాతం వాటా ఉన్న 17 కంపెనీల డేటాను విశ్లేషించి క్రిసిల్ ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► క్లయింట్లు ఐటీపై ఇష్టారీతిగా ఖర్చు చేయకుండా, ప్రతి రూపాయికి గరిష్టమైన ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అటువంటి డీల్స్నే కుదుర్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీనితో పాటు డిజిటల్ సొల్యూషన్స్, క్లౌడ్, ఆటోమేషన్ సామరŠాధ్యలు మొదలైనవి డిమాండ్‌కి దన్నుగా ఉండనున్నాయి. ► ఐటీ రంగం ఆదాయాల్లో బీఎఫ్ఎస్ఐ వాటా 30 శాతం వరకు ఉంటోంది. తలో 15 శాతం వాటాతో రిటైల్, కన్జూమర్ ప్యాకేజ్డ్ గూడ్స్ విభాగాలు ఉంటున్నాయి. మిగతా వాటా లైఫ్ సైన్సెస్ .. హెల్త్‌కేర్, తయారీ, టెక్నాలజీ.. సర్వీసెస్, కమ్యూనికేషన్.. మీడియా మొదలైన వాటిది ఉంటోంది. ► ఐటీ సంస్థలు కొత్తగా నియామకాలు .. ఉద్యోగులపై వ్యయాలను తగ్గించుకోనుండటంతో 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభదాయకత స్వల్పంగా 0.50–0.60 శాతం మెరుగుపడి 23 శాతంగా ఉండొచ్చు. ► ఉద్యోగులపై వ్యయాలు పెరగడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 1.50–1.75 శాతం మందగించి దశాబ్ద కనిష్ట స్థాయి అయిన 22–22.5 శాతానికి తగ్గవచ్చు. ► అట్రిషన్‌లు (ఉద్యోగుల వలసలు) ఇటీవల కొద్ది త్రైమాసికాలుగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇవి మరింత తగ్గవచ్చు. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ ఉద్యోగులను సమర్ధంగా ఉపయోగించుకోవడం, సిబ్బందికి శిక్షణనిస్తుండటం, రూపాయి క్షీణత ప్రయోజనాలు మొదలైన సానుకూల అంశాల కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల మార్జిన్లు 0.50–60 శాతం మెరుగుపడి 23 శాతానికి చేరవచ్చు. అయినప్పటికీ కరోనా పూర్వం 2016–20 ఆర్థిక సంవత్సరాల మధ్య నమోదైన సగటు 24 శాతానికన్నా ఇంకా దిగువనే ఉండొచ్చు. ► దేశీ ఐటీ కంపెనీల రుణ నాణ్యత స్థిరంగానే ఉంది. రూపాయి మారకం విలువ గణనీయంగా పెరగడం, మాంద్యం ధోరణులు ఒక్కసారిగా ముంచుకురావడం వంటి రిస్కులపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. -
టికెట్ల ఆదాయం రూ. 5 వేల కోట్లపైనే
సాక్షి, హైదరాబాద్: సరుకు రవాణా రూపంలో భారీగా ఆదాయాన్ని పొందుతూ దేశంలోని రైల్వే జోన్లలో కీలకంగా అవతరించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్ రైళ్ల ద్వారా కూడా భారీ మొత్తంలో ఆదాయాన్ని నమోదు చేసింది. టికెట్ల అమ్మకం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో వారం రోజులు మిగిలి ఉండగానే రూ.5 వేల కోట్ల మార్కును అందుకుంది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో ఇదే అతి పెద్ద ఆదాయంగా రికార్డుకెక్కింది. గురువారం నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.5,000.81 కోట్లుగా నమోదైంది. ఇప్పటివరకు ఆదాయం గరిష్ట మొత్తంగా రూ.2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.4,119.44 కోట్లు. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేస్తూ తొలిసారి రూ.5 వేల కోట్లను దాటింది. మార్చి చివరి నాటికి ఈ మొత్తం మరింత పెరగనుంది. ఈసారి దేశవ్యాప్తంగా చాలా జోన్లు టికెట్ల రూపంలో మంచి ఆదాయాలను సొంతం చేసుకున్నాయి. 18 జోన్లకు గానూ దక్షిణ మధ్య రైల్వే ఆదాయం విషయంలో ఐదో స్థానంలో నిలిచింది. కోవిడ్ తర్వాత ఇటీవలే పూర్తిస్థాయిలో.. కోవిడ్ లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం వరకు చాలా రైళ్లు పార్కింగ్ యార్డులకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పూర్తిస్థాయి రైళ్లను నడుపుతున్నారు. కోవిడ్ తర్వాత తిరిగి 100 శాతం రైళ్లను నడిపిన తొలి జోన్‌గా దక్షిణ మధ్య రైల్వేనే నిలిచింది. గతంలో ఎన్నడూ లేనట్టుగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో అదనపు రైళ్లు, ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బిజీగా ఉంటోంది. ఇటీవల పలు రైళ్లకు అదనంగా ఏర్పాటు చేసిన వాటిల్లో 200 కోచ్‌లను శాశ్వత ప్రాతిపదికన నడుపుతున్నారు. ఇక రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలకు సంబంధించి రోజువారీ ప్రాతిపదికన 10,539 కోచ్‌లను తాత్కాలికంగా నిర్వహించారు. వీటి రూపంలో 9,83,559 మంది అదనంగా బెర్తులు పొందగలిగినట్టు అ«ధికారులు తెలిపారు. ఈ అదనపు ప్రయాణికుల ద్వారానే రూ. 81 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో 3,543 ప్రత్యేక రైళ్లను నడిపారు. వీటి ద్వారా 30.42 లక్షల మంది అదనంగా ప్రయాణించారు. వీరి ద్వారా రూ.219 కోట్లు అదనంగా సమకూరాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతం ఈ సంవత్సరం సికింద్రాబాద్–విశాఖ మధ్య దేశంలో ఎనిమిదో వందే భారత్ రైలును, కాచిగూడ–మెదక్, అకోలా–అకోట్, బీదర్–కలబురగి మధ్య కొత్త రైళ్లు ప్రారంభమయ్యాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం 8 జతల రైళ్లకు కొత్తగా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రారంభించారు. వీటిల్లో ప్రయాణికుల సామర్థ్యం ఎక్కువ కావటం వల్ల కూడా వారి సంఖ్య పెరిగింది. వెరసి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ రైళ్ల ఆక్యుపెన్సీ రేషియో 123 శాతానికి చేరుకోవటం విశేషం. చమురు ధరలు విపరీతంగా పెరగటంతో సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణాపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. దూరప్రాంతాలకు రైళ్లలో వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ అన్ని కారణాలతో ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆదాయం నమోదైందని తెలుస్తోంది. -
‘మార్చి 31’ గాభరావద్దు? ఈ విషయాలు తెలుసుకుంటే చాలు!
‘మార్చి’.. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. మీ ఆదాయాన్ని లెక్క వేసుకుని.. అవసరం అయితే వీలున్నంత వరకు ప్లానింగ్ చేసుకుని, ఆదాయాన్ని బట్టి పన్ను భారం లెక్కించుకోవాలి. ఆదాయం లెక్కింపునకు (అంచనా), పొదుపు .. పెట్టుబడులకు, చెల్లింపులకు, ఇతరత్రా ప్లానింగ్‌కు ఈ నెల 31 చివరి తేదీ. ఈ నేపథ్యంలో మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు ఏమిటంటే.. ♦ ఉద్యోగస్తులు కేవలం జీతాలు కాకుండా ప్రతి నెలా వచ్చే ఆదాయాలు.. ఉదాహరణకు.. ఇంటద్దె, వడ్డీ, ఇతరాలు ఉంటే లెక్కలు వేసుకోవాలి. ఇటువంటి వారు తమ అవసరాన్ని బట్టి పీఎఫ్, ఎన్ఎస్సీ, బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్, పిల్లల స్కూల్ ఫీజు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లింపు, అసలుకు కట్టాడం లాంటివి ఏమైనా చేసి ఆదాయాన్ని తగ్గించి చూపించుకుని, పన్ను భారం తగ్గించుకోవాలా? లేదా చేతిలో నగదును ’బ్లాక్’ చేసుకోవాలా? బదులుగా కేవలం పన్ను భారం చెల్లించి బైటపడి, ఊపరి పీల్చుకోవాలా? ఇదంతా ఆలోచించుకుని తగు నిర్ణయాలు తీసుకోవాలి. గతంలో మనం ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం. గుర్తుంచుకోండి. అలాగే ఒకరితో ఒకరు పోల్చుకోవద్దండి. ఎవరి వీలు వారిది. ఎవరి వెసులుబాటు వారిదే. ♦ ప్లానింగ్‌లో భాగంగా ఉద్యోగానికి సంబంధించిన జీతభత్యాలు, మిగతా ఆదాయాలను వచ్చే ఆర్థిక సంవత్సరానికి పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉండే ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 7,00,000 వరకు పన్ను భారం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసుకోండి. ప్రైవేట్ సంస్థల్లో యజమానిని, జీతం/బోనస్ ఎక్స్‌గ్రేషియా వచ్చే సంవత్సరం ఇవ్వమనండి. మీకు వచ్చే ఇంటద్దెను వచ్చే సంవత్సరం నుంచి పెంచండి. ♦ అలాగే క్యాపిటల్ గెయిన్స్ విషయానికొస్తే.. మీకు ముందుగానే తెలిసిపోతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు. ఆ అంచనాల మేరకు స్థిరాస్తుల క్రయవిక్రయాలు వాయిదా వేసుకోండి. ఒప్పందాలు అవసరమైతే మార్చుకోండి. అయితే, ఒక జాగ్రత్త తీసుకోండి. కేవలం పన్ను భారం తగ్గించుకోవడం కోసం వాయిదా వేసుకోకండి. మిగతా విషయాలు .. అంటే అగ్రిమెంటును గౌరవించడం, మీరు అనుకున్న ప్రతిఫలం రావడం, మీ కుటుంబ అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోండి. ♦ చివరగా.. ’మార్చి’ వచ్చిందని ’మార్చ్’ చేయనక్కర్లేదు (ముందుకు పరుగెత్తనక్కర్లేదు). గాభరా పడక్కర్లేదు. వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్ చేయనక్కర్లేదు. తలకు మించి భారం పెట్టుకోకండి. అవసరం లేకపోతే పన్ను చెల్లించండి. పన్ను భారం కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటే వీలును బట్టి చెల్లించండి. ప్రభుత్వం ఒక శాతం ఒక నెలకు చొప్పున అదనంగా కట్టవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఆలోచించి, అడుగు వేస్తూ ఆనందంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
13.73 లక్షల కోట్లకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు
దేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతదేశ ప్రత్యక్ష పన్ను వసూళ్లు 17 శాతం వృద్ధి చెంది రూ. 13.73 లక్షల కోట్లకు చేరుకుందని, ఇది పూర్తి సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం ఈ మొత్తం 83 శాతంతో సమానమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (cbdt) తెలిపింది. ఏప్రిల్ 1, 2022 నుంచి మార్చి 10, 2023 వరకు మొత్తం రూ.16.68 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు జరగ్గా... అందులో రూ. 2.95 లక్షల కోట్ల రీఫండ్లు జారీ అయ్యాయి. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్ల కంటే 59.44 శాతం ఎక్కువగా ఉందని ప్రత్యక్ష పన్నుల బోర్డ్ పేర్కొంది. Gross Direct Tax collections for FY 2022-23 upto 10th March, 2023 are at Rs. 16.68 lakh crore, higher by 22.58% over gross collections for corresponding period of preceding yr. Net collections at Rs. 13.73 lakh crore are 16.78% higher than net collections for same period last yr pic.twitter.com/wtxMsqm1LG — Income Tax India (@IncomeTaxIndia) March 11, 2023 స్థూల ప్రాతిపదికన వసూళ్లు 22.58 శాతం పెరిగి రూ.16.68 లక్షల కోట్లకు చేరుకుంది. రీఫండ్ల సర్దుబాటు తర్వాత, సీటీఐ (కార్పొరేట్ ఆదాయపు పన్ను) వసూళ్లలో నికర వృద్ధి 13.62 శాతం, ఎస్టీటీ (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్)తో సహా పీఐటీ (వ్యక్తిగత ఆదాయపు పన్ను) వసూళ్లు 20.06 శాతంగా ఉంది. -
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు
అన్ని పార్టీల కన్నా బీజేపీకి మూడు రెట్లు అధిక విరాళాలు -
టీసీఎస్ సంచలనం, ఇక ‘ఐటీ ఉద్యోగులకు పండగే!’
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు. 150,000 మంది నియామకం టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్ఎస్ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్‌లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఎన్ఎస్ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. ►జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%. ►ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది. ►ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది. ►అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది. ►పబ్లిక్ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది. ►స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది. ఎన్ఎస్ఓ అంచనా విలువల్లో. 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్ఎస్ఓ తాజా అంచనా. అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట. -
11 శాతం పెరిగిన సూక్ష్మ రుణాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ పరిశ్రమ (మైక్రోఫైనాన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 11 శాతం అధికంగా రూ.71,916 కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రుణాల పంపిణీ రూ.64,899 కోట్లుగా ఉంది. మొత్తం రుణాల సంఖ్య 1.81 కోట్లుగా కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో మొత్తం పంపిణీ చేసిన రుణాల సంఖ్య 1.85 కోట్లుగా ఉంది. ద్వితీయ త్రైమాసికానికి సంబంధించి గణంకాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసింది. పరిశ్రమ మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో విలువ రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తం 12 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందిస్తోంది. ‘‘మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్థూల రుణ పోర్ట్‌ఫోలియో (జీఎల్పీ) రూ.3,00,974 కోట్లకు చేరింది. 2021 సెప్టెంబర్ చివరికి ఉన్న రూ.2,43,737 కోట్లతో పోలిస్తే 23.5 శాతం వృద్ధి చెందింది’’ అని ఈ నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో పంపిణీ చేసిన ఒక్కో రుణం సగటున రూ.40,571గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఒక వంతు వాటా పీఎస్‌బీలదే ఈ మొత్తం రుణాల్లో 13 ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) సంయుక్తంగా 37.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఎన్బీఎఫ్సీ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ) 36.7 శాతం వాటా (రూ.1,10,418 కోట్లు) కలిగి ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సూక్ష్మ రుణాల్లో 16.6 శాతం వాటా (రూ.50,029) ఆక్రమించాయి. ఇక ఎన్బీఎఫ్సీలు 7.9 శాతం, ఇతర సూక్ష్మ రుణ సంస్థలు 1.1 శాతం మేర రుణాలను పంపిణీ చేసి ఉన్నాయి. మైక్రోఫైనాన్స్ యాక్టివ్ (సకాలంలో చెల్లింపులు చేసే) రుణ ఖాతాలు గత 12 నెలల్లో (సెప్టెంబర్‌తో అంతమైన చివరి) 14.2 శాతం పెరిగి 12 కోట్లకు చేరాయి. తూర్పు, ఈశాన్యం, దక్షిణాది ప్రాంతాలు మొత్తం సూక్ష్మ రుణాల్లో 63.9 శాతం వాటా కలిగి ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడు ఎక్కువ వాటా ఆక్రమిస్తోంది. -
ఎయిర్‌లైన్స్‌కు రూ. 17 వేల కోట్ల నష్టాలు
ముంబై: అధిక ఇంధన ధరలు, ఆర్థిక పరిస్థితిపై ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీ విమానయాన రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులోనూ వాటి ఆర్థిక పనితీరుపై ఒత్తిడి కొనసాగనుంది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా ప్రయాణికుల ట్రాఫిక్ కోలుకుంటున్న తీరు మెరుగ్గానే ఉన్నప్పటికీ విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు భారీ స్థాయిలో ఉండటమనేది స్వల్పకాలికంగా, మధ్యకాలికంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలకు, లిక్విడిటీకి ప్రధాన ముప్పుగా కొనసాగనుంది. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ అక్టోబర్‌లో దేశీ ప్రయాణికుల సంఖ్య 26 శాతం పెరిగి 90 లక్షల నుంచి 1.14 కోట్లకు చేరింది. అయినప్పటికీ కరోనా పూర్వం అక్టోబర్‌తో పోలిస్తే ఇది 8 శాతం తక్కువే. ఈ నేపథ్యంలో దేశీ ఏవియేషన్ పరిశ్రమకు ఇక్రా నెగటివ్ అవుట్‌లుక్ ఇచ్చింది. నివేదికలోని మరిన్ని ముఖ్య అంశాలు.. ► డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణిస్తుండటమనేది ఎయిర్‌లైన్స్ వ్యయాల స్వరూపంపై గట్టి ప్రభావం చూపనుంది. రుణాల స్థాయిలు, లీజుల వ్యయాలు మొదలైన వాటి భారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1,00,000 కోట్ల మేర ఉండవచ్చని అంచనా. ► మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు/పెంచుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నాలు కొనసాగినా .. విమానయాన సంస్థలకు మార్జిన్లు పెంచుకునే సామర్థ్యాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే ఇందుకు కారణం. పరిశ్రమ ఆదాయాలు మెరుగుపడటానికి ఈ అంశాలు పెను సవాలుగా ఉండనున్నాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం అర్ధవంతమైన స్థాయిలోనే ఉంటుందనే అంచనాలున్నా, పరిశ్రమ ఆదాయాల రికవరీ నెమ్మదించవచ్చు. వ్యయాలు భారీ స్థాయిలో ఉంటున్నందున పరిశ్రమ నికరంగా రూ.15,000–17,000 కోట్ల మేర నష్టాలు నమోదు చేసే అవకాశం ఉంది‘ అని ఇక్రా పేర్కొంది. అయితే, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నికర నష్టాలు తక్కువగానే ఉండవచ్చని తెలిపింది. ప్యాసింజర్ ట్రాఫిక్ మెరుగుపడటం, వడ్డీల భారం తగ్గడం (ఎయిరిండియా విక్రయానికి ముందు దాని రుణభారాన్ని ప్రభుత్వం గణనీయంగా తగ్గించడం) వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. ► విమానాల విడిభాగాలు, ఇంజిన్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనితో కొన్ని దేశీ ఎయిర్‌లైన్స్ పలు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. సరఫరాపరమైన సమస్యల పరిష్కారం కోసం తయారీ కంపెనీలతో ఎయిర్‌లైన్స్ చర్చలు జరుపుతున్నాయి. డిమాండ్‌కి అనుగుణంగా ఫ్లయిట్ సర్వీసులను పెంచుకునేందుకు విమానాలను వెట్ లీజింగ్‌కు (విమానంతో పాటు సిబ్బందిని కూడా లీజుకు తీసుకోవడం) తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. -
క్యాడ్ 3 శాతం లోపే ఉండొచ్చు!
ముంబై: కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) మెజారిటీ అంచనాలకన్నా తక్కువగా 3 శాతమే (స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి) నమోదయ్యే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక ఒకటి పేర్కొంది. 2022–23లో కనీసం 3.5 శాతం క్యాడ్ నమోదవుతుందన్న మెజారిటీ అంచనాలకు భిన్నంగా ఎస్బీఐ నివేదిక ఉండడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఎగుమతులు, రెమిటెన్సులు (ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు దేశానికి పంపే డబ్బు) పెరగడం, స్వాప్ డీల్స్ ద్వారా ఫారెక్స్ నిల్వలలో ఐదు బిలియన్ డాలర్లు పెరిగే అవకాశాలు దీనికి కారణమని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. క్రూడ్ 10 డాలర్ల పెరుగుదలతో క్యాడ్ 0.4 శాతం అప్ క్రూడ్ ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల క్యాడ్‌ను 40 బేసిస్ పాయింట్ల (0.4 శాతం) వరకు ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ప్రతి 10 డాల ర్ల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని 50 బేసిస్ పాయింట్ల పెరుగుదలకు, 23 బేసిస్ పాయింట్ల వృద్ధి కోతకు దారితీస్తుందని నివేదిక విడుదల సందర్భంగా ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఎక్సే్ఛంజ్ రేటు కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్న నివేదిక, రూపా యి ప్రతి 100 పైసలు పతనం వల్ల మన సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 మిలియన్ డాలర్లమేర పెరుగుతాయని విశ్లేషించింది. భారత్ కరెంట్ అకౌంట్‌లోటు ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 2.8 శాతం (జీడీపీ విలువతో పోల్చి) లేదా 23.9 బిలియన్ డాలర్లుగా నమోదయిన విషయాన్ని నివేదిక ప్రస్తావిస్తూ, పటిష్ట రెమిటెన్సులు, సాఫ్ట్వేర్ ఎగుమతు లు క్యాడ్‌ను జూన్ త్రైమాసికంలో 60 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఇదే ధోరణి కొనసాగితే రెండవ త్రైమాసికంలో కూడా క్యాడ్ 3.5% లోపే నమోదుకావచ్చని పేర్కొంది. చమురు ధరలు భారీ గా పెరిగితే మాత్రం 2022–23 క్యాడ్‌పై ప్రతికూలత తప్పదని విశ్లేషించింది. 2022 జనవరి–మార్చి త్రైమాసికంలో క్యాడ్ 13.4 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.5 శాతం). ఎగుమతులకన్నా దిగుమతుల పరిమాణం భారీగా పెరుగుతుండడం తాజా కరెంట్ అకౌంట్ తీవ్రతకు కారణమవుతోంది. క్యాడ్ అంటే... ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
ఎన్టీపీసీ లాభం క్షీణత, క్యూ2లో రూ. 3,418 కోట్లకు పరిమితం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ ప్రభుత్వ దిగ్గజం ఎన్టీపీసీ లిమిటెడ్ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 3,418 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 3,691 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 33,096 కోట్ల నుంచి రూ. 44,681 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 28,950 కోట్ల నుంచి రూ. 40,001 కోట్లకు పెరిగాయి. దిగుమతి చేసుకున్న బొగ్గు సరఫరా 0.42 ఎంఎంటీ నుంచి 5.58 ఎంఎంటీకి జంప్ చేసింది. దేశీయంగా బొగ్గు సరఫరా 44.83 ఎంఎంటీ నుంచి 48.72 ఎంఎంటీకి పుంజుకుంది. సొంత వినియోగ గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి 2.79 ఎంఎంటీ నుంచి 4.32 ఎంఎంటీకి పెరిగింది. సెప్టెంబర్ చివరికల్లా విద్యుదుత్పత్తి సామర్థ్యం భాగస్వామ్యం, అనుబంధ సంస్థలతో కలిపి 70,254 మెగావాట్లకు చేరింది. స్థూల విద్యుదుత్పత్తి 77.42 బిలియన్ యూనిట్ల నుంచి 85.48 బీయూకి మెరుగుపడింది. -
నేటి నుంచి బడ్జెట్ కసరత్తు షురూ..
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సానికి (2023–24) సంబంధించిన బడ్జెట్‌పై నేటి నుంచి (సోమవారం) కేంద్రం కసరత్తు మొదలుపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాలు (ఆర్ఈ), రాబోయే సంవత్సరానికి అవసరమైన కేటాయింపులు తదితర అంశాలపై వివిధ శాఖలు, విభాగాలతో సంప్రదింపులతో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలి రోజైన సోమవారం నాడు అటవీ శాఖ, కార్మిక శాఖ, సమాచార .. ప్రసార శాఖ, గణాంకాల శాఖ, యువజన వ్యవహారాల శాఖ ఆర్ఈ సమావేశాలు ఉంటాయి. వివిధ శాఖలతో నెల రోజుల పాటు సాగే సమావేశాలు నవంబర్ 10న ముగుస్తాయి. సాధారణంగా ఈ సమావేశాలన్నింటికి ఆర్థిక విభాగం, వ్యయాల విభాగం కార్యదర్శులు సారథ్యం వహిస్తారు. ప్రీ–బడ్జెట్ భేటీల తర్వాత 2023–24 బడ్జెట్ అంచనాలను సూచనప్రాయంగా రూపొందిస్తారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో వృద్ధికి ఊతమిచ్చే చర్యలకు ఈ బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనాలు నెలకొన్నాయి. -
ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ జోరు
న్యూఢిల్లీ: స్థూల అడ్వాన్స్‌లు 2022 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 20 శాతం పెరిగి రూ.22,802 కోట్లకు చేరుకున్నాయని ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ శుక్రవారం ప్రకటించింది. గతేడాది ఇదే కాలం నాటికి ఇది రూ.18,978 కోట్లుగా ఉందని వెల్లడించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌లో బ్యాంక్ ఇచ్చిన రుణాలు 22 శాతం ఎగసి రూ.3,845 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 20 శాతం అధికమై రూ.21,726 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ టెర్మ్ డిపాజిట్లు 13 శాతం దూసుకెళ్లి రూ.7,665 కోట్లు నమోదైంది. కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్స్ (కాసా) రూ.8,200 కోట్ల నుంచి రూ.10,456 కోట్లకు ఎగసింది. నిధుల కోసం చెల్లిస్తున్న వడ్డీ (కాస్ట్ ఆఫ్ ఫండ్స్) 6.81 నుంచి 6.25 శాతానికి వచ్చి చేరిందని బ్యాంక్ వివరించింది. -
ప్రభుత్వానికి పీఎస్‌యూల డివిడెండ్..తాజాగా రూ. 1,203 కోట్లు జమ
న్యూఢిల్లీ: పీఎస్‌యూల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 1,203 కోట్లు అందుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్ రూపేణా కేంద్రానికి రూ. 14,778 కోట్లు లభించాయి. ప్రధానంగా సెయిల్ నుంచి రూ. 604 కోట్లు, హడ్కో నుంచి రూ. 450 కోట్లు, ఐఆర్ఈఎల్ రూ. 37 కోట్లు చొప్పున దశలవారీగా దక్కినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఇతర సంస్థలలో ఐఆర్సీటీసీ రూ. 81 కోట్లు, భారతీయ రైల్ బిజిలీ రూ. 31 కోట్లు చొప్పున చెల్లించినట్లు వెల్లడించారు. -
అలెర్ట్: ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) ఖాతాదారులకు అలెర్ట్. మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో వడ్డీ మొత్తం కనిపించడంలేదని కంగారు పడుతున్నారా? సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్మెంట్లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో ఆ వడ్డీని జమ చేస్తుంది. ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లబ్ధి దారుల అకౌంట్లలో డిపాజిట్ అయ్యింది. 2021-22 సంబంధించి ఈపీఎఫ్ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్లో జమ కాలేదు. There is no loss of interest for any subscriber. The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII — Ministry of Finance (@FinMinIndia) October 5, 2022 దీంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్డు సభ్యులు నిర్ణయించిన వడ్డీ మొత్తం ఇప్పటి వరకు తమ అకౌంట్లలో జమ కాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ పీఎఫ్ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్లో స్పష్టం చేసింది. -
ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థిరంగా పన్ను ఆదాయం.. కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే! -
వృద్ధి రేటు 6.9 శాతం
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచనాలను మరో అంతర్జాతీయ సంస్థ ఓఈసీడీ సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 6.9 శాతంగా కొనసాగించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు పట్ల ‘ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య’ (ఓఈసీడీ) సానుకూలంగా స్పందించింది. కాకపోతే ఆర్బీఐ అంచనా అయిన 7.2 శాతానికంటే ఓఈసీడీ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ‘‘వెలుపలి (అంతర్జాతీయ) డిమాండ్ మృదువుగా ఉండడం వల్లే భారత జీడీపీ వృద్ధి 2021–22లో ఉన్న 8.7 శాతం నుంచి, 2022–23లో సుమారు 7 శాతానికి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నాం. ఇది 2023–24కు 5.75 శాతంగా ఉండొచ్చు. అయినా కానీ బలహీన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఈ మాత్రం వృద్ధి అన్నది వేగవంతమైనదే అవుతుంది’’అని ఓఈసీడీ తన తాజా నివేదికలో ప్రస్తావించింది. జూన్ నాటి నివేదికలోనూ ఓఈసీడీ భారత వృద్ధి అంచనాలను 6.9 శాతంగా పెర్కొనడం గమనార్హం. యుద్ధం వల్లే సమస్యలు.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తన వృద్ధి జోరును కోల్పోయినట్టు ఓఈసీడీ పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ వృద్ధి రేటును కిందకు తోసేసిందని, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగేందుకు దారితీసిందని తన తాజా నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఈ ఏడాదికి అంతర్జాతీయ వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని, 2023కు ఇది 2.2 శాతానికి తగ్గిపోతుందని అంచనా వేసింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముందు వేసిన అంచనాలకు ఇది తక్కువ కావడం గమనించాలి. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందన్నది ఓఈసీడీ పూర్వపు అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ సైతం ప్రతికూలతలు చూస్తోందంటూ.. 2022 సంవత్సరానికి 3.2 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. 2020 కరోనా సంక్షోభ సంవత్సరాన్ని మినహాయిస్తే 1970 తర్వాత చైనాకు ఇది అత్యంత తక్కువ రేటు అవుతుందని పేర్కొంది. జీ20 దేశాల్లో ద్రవ్యోల్బణం ఈ ఏడాది 8.2%గాను, 2023లో 6.6 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. భారత్‌కు సంబంధించి ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
వీసాల సంఖ్యను భారీగా పెంచిన ఆస్ట్రేలియా!
కోవిడ్ -19 మహమ్మారిని నుంచి కోలుకునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాశ్వత వలసదారుల వీసాల సంఖ్యను మరింత పెంచింది. గతంలో ఉన్న వీసా నిబంధనల్ని సడలిస్తూ వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏడాదికి 35 వేల వీసాలు మంజూరు చేసే ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఇప్పుడు వాటి సంఖ్యను ఏకంగా 1.95 లక్షలకు పెంచింది. తద్వారా ప్రభుత్వానికి మేలు జరిగే అవకాశం ఉందని భావిస్తోంది. అసలు విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుని 3.4 శాతంగా ఉంది. అయినప్పటికీ ద్రవ్యోల్బణం కారణంగా వేతనాలు తగ్గాయి. దీంతో ప్రస్తుతం ఉన్న వీసాల్ని సవరించాలని అక్కడి వ్యాపార సంస్థలు ప్రభుత్వాన్ని కోరాయి. వ్యాపారస్థుల విజ్ఞప్తితో పాటు ఇతర అంశాల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీసాల పెంపుతో విదేశీయులతో పాటు సంస్థల్ని ఆకర్షించడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చని భావించింది. అందుకే ప్రతిఏడు వేలల్లో వీసాలు జారీ చేసే ప్రభుత్వం ఈ ఏడాది ఆ వీసాల సంఖ్యను లక్షకు పైగా పెంచింది. -
28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి. ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్‌షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్ఇండియా, భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చైన్ సొల్యూషన్స్, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్ క్లినిక్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. సెంటిమెంట్ డౌన్: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్‌ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్ భారీగా కరెక్షన్కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్‌లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ వివరించారు. క్యూలో మరిన్ని కంపెనీలు. పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్‌యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్, ఉత్కర్‡్ష స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎండీ అభిజిత్ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. -
ఈక్విటీ ఫండ్స్‌లో తగ్గిన పెట్టుబడులు,రూ.8,898 కోట్లకే పరిమితం!
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక జూలైలో నిదానించింది. కేవలం రూ.8,898 కోట్ల పెట్టుబడులను ఈక్విటీ పథకాలు ఆకర్షించాయి. అంతకుముందు జూన్ నెలలో వచ్చిన రూ.15,495 పెట్టుబడులతో పోల్చి చూస్తే 43 శాతం తగ్గాయి. మే నెలలో రూ.18,529 కోట్లు, ఏప్రిల్‌లో రూ.15,890 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలైలోనే పెట్టుబడులు తక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతల ప్రభావం పెట్టుబడులపై పడినట్టు తెలుస్తోంది. ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫీ) సోమవారం విడుదల చేసింది. ఇన్వెస్టర్లలో సానుకూల ధోరణికి నిదర్శనంగా 2021 మార్చి నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ ఆగస్ట్‌లోనూ రేట్లను పెంచొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించి ఉంటారని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవితా కృష్ణన్ తెలిపారు. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు ఆదరణ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్ ఫండ్స్ పథకాలు అత్యధికంగా రూ.1,780 కోట్లను జూలైలో ఆకర్షించాయి. ఆ తర్వాత ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.1,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్ విభాగాలు ఒక్కోటీ రూ.1,000 కోట్లకు పైనే నికర పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో రూ.12,140 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.61 కోట్లకు చేరుకుంది. ఇక గత నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి రూ.4,930 కోట్ల పెట్టుబడులు నికరంగా వచ్చాయి. జూన్‌లో రూ.92,247 కోట్లు డెట్ నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించాలి. గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) నుంచి రూ.457 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసేసుకున్నారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ గత నెలలో రూ.23,605 కోట్ల పెట్టుబడులను రాబట్టింది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ జూలై చివరికి రూ.37.75 లక్షల కోట్లకు చేరింది. జూన్ చివరికి ఇది రూ.35.64 లక్షల కోట్లుగా ఉంది. -
భారత్ నుంచి ఎగుమతుల్లో సముచిత వృద్ధి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎగుమతులు ‘సముచిత స్థాయిలో‘ వృద్ధి చెందే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. బడా ఎగుమతిదారులు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లతో సమాలోచనలు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు పరిణామాలను సమీక్షిస్తున్నామని ఆయన వివరించారు. ‘ధర, నాణ్యతపరంగా మన ఎగుమతులకు ప్రత్యేకత ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి ఎగుమతుల అంచనాలు ఉంటాయి‘ అని గోయల్ చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2022–23లో 450–500 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఎగుమతి చేయడం సాధ్యపడేదేనా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యమేదీ విధించుకోలేదని ఆయన పేర్కొన్నారు. నూతన విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్టీపీ)పై స్పందిస్తూ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో ప్రస్తుత పాలసీని ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో ఉత్పత్తుల ఎగుమతులు 17 శాతం పెరిగి 37.94 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి, క్రూడాయిల్ దిగుమతులు భారీగా పెరగడంతో కరెంటు అకౌంటు లోటు 25.63 బిలియన్ డాలర్లకు ఎగిసింది. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 45 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) జూన్ 16వ తేదీ నాటికి 45 శాతం పెరిగాయి. విలువలో రూ.3.39 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022–23 ఇదే కాలంలో ఈ వసూళ్ల పరిమాణం రూ.2,33,651 కోట్లు. భారీగా నమోదయిన ముందస్తు పన్ను వసూళ్లు ఈ స్థాయి పురోగతికి కారణమని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం వసూళ్లలో కార్పొరేట్ పన్ను (సీఐటీ) విభాగానికి సంబంధించి రూ.1.70 లక్షల కోట్లకుపైగా మొత్తం నమోదయ్యింది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)సహా వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) విభాగంలో రూ.1.67 లక్షల కోట్లకుపైగా వసూళ్లు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. వసూళ్లలో ముందస్తు పన్ను వాటా 33 శాతంపైగా పెరిగి రూ.1.01 లక్షల కోట్లకు ఎగసింది. -
రూ.500 దొంగనోట్లు పెరుగుతున్నాయ్: తస్మాత్ జాగ్రత్త!
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థ మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో 79,669 రూ. 500 డినామినేషన్ నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపని ఆర్బీఐ వార్షిక నివేదిక తెలిపింది. ఇక రెండువేల నోట్ల విషయంలో గుర్తించిన నకిలీ సంఖ్య 13,604గా ఉంది. 2020–21తో పోల్చితే ఈ సంఖ్య 54.6 శాతం అధికం. 2016లో అమలులో ఉన్న రూ. 500, రూ. 1,000 నోట్ల రద్దు ప్రధాన లక్ష్యాలలో ఒకటి నకిలీ కరెన్సీ నోట్ల చెలామణిని అరికట్టడం కావడం గమనార్హం. కాగా, ఇందుకు సంబంధించి తాజా పరిస్థితి ఏమిటన్నది గణాంకాల్లో పరిశీలిస్తే... ► 2020–2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,08,625 నకిలీ నోట్లను గుర్తిస్తే, 2021–22లో ఈ సంఖ్య 2,30,971కి చేరింది. ► 2020–21తో పోల్చితే 2021–22లో రూ.10, రూ.20, రూ.200, రూ.500 (కొత్త డిజైన్), రూ. 2,000ల విలువ కలిగిన నకిలీ నోట్లలో వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.9 శాతం, 54.6 శాతం పెరుగుదల నమోదైంది. ► అయితే ఇదే కాలంలో రూ.50, రూ.100 దొంగ నోట్లు వరుసగా 28.7%, 16.7% తగ్గడం గమనార్హం. ► 2021–22లో గుర్తించిన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుర్తించగా, 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు పసిగట్టాయి. ► 2021 ఏప్రిల్ నుండి 2022 మార్చి 31 వరకు కరెన్సీ ప్రింటింగ్‌పై చేసిన మొత్తం వ్యయం రూ. 4,984.8 కోట్లు. అంతకుముందు సంవత్సరం (2020 జూలై 1 నుండి 2021 మార్చి 31 వరకు) ఈ మొత్తం రూ. 4,012.1 కోట్లు. 2021 మార్చికి ముందు ఆర్బీఐ జూలై–జూన్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించేది. అయితే 2021 ఏప్రిల్ నుంచి ‘ఏప్రిల్–మార్చి’ని ఆర్థిక సంవత్సరంగా మార్చారు. ► 2021–22 ఆర్థిక సంవత్సరంలో పాడైపోయిన నోట్లను వెనక్కు తీసుకోడానికి సంబంధించిన సంఖ్య 88.4 శాతం పెరిగి 1,878.01 కోట్లకు చేరింది. 2020–21లో ఈ సంఖ్య 997.02 కోట్లు. -
కంపెనీల సమస్యాత్మక రుణాలు రూ.60 వేల కోట్లు అధికం!
ముంబై: ఉక్రెయిన్–రష్యా యుద్ధ సంక్షోభం కారణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రేట్ల విషయంలో మారనున్న ఆర్బీఐ కఠిన వైఖరి, బలహీన రూపాయి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలో సమస్యాత్మక రుణాలు (రిస్కీ డెట్) రూ.60,000 కోట్ల మేర పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది. కంపెనీల నిర్వహణ లాభంతో పోలిస్తే నికర రుణ భారం 5 రెట్లకు మించిన మొత్తాన్ని రిస్కీ డెట్‌గా పేర్కొంటారు. తాజా సంక్షోభం, అస్థిరతలతో ఈ తరహా రుణాలు 2022–23 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.6.9 లక్షల కోట్లకు పెరుగుతాయని ఇండియా రేటింగ్స్ తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది. వాస్తవానికి ఇవి రూ.6.3 లక్షల కోట్ల స్థాయిలోనే ఉండేవని తెలిపింది. 1,385 కంపెనీలను ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. యుద్ధ సంక్షోభం నేపథ్యంలో కంపెనీల ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గడానికితోడు.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణంతో లాభాల మార్జిన్లు తగ్గిపోతాయని అంచనాకు వచ్చింది. రూపాయి బలహీనత వల్ల రుణాలపై వడ్డీ భారం ఒక శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. కమోడిటీలను మడి సరుకులుగా వినియోగించుకునే కంపెనీల మార్జిన్లు 3 శాతం వరకు క్షీణిస్తాయని అంచనా వేసింది. -
April : అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
ముందుగా మీ అందరికీ శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలు మీ అందరి ఆరోగ్యం బాగుండాలని, మీ ఆర్థిక వ్యవహారాలు ఏ చింతలు లేకుండా జరగాలని కోరుకుంటూ .. కొత్త ఆర్థిక సంవత్సరంలో అమల్లోకి వచ్చే కీలక అంశాలు మీకోసం. ► అనుసంధానించకపోతే ‘పాన్’ పనిచేయదు: అవును. 31–3–2022 తేదీలోపల పాన్‌తో అనుసంధానం చేయని వారి పాన్ పనిచేయదు. దాన్ని స్తంభింపచేస్తారు. వాడుకలో ఉండదు. చెల్లుబడి కాదు. అంటే మీరు ఏ సందర్భంలోను పాన్ని ప్రస్తావించాలో, ఏ సందర్భంలో అయితే నంబర్‌ను పేర్కొనాలో ఆ సమయంలో పాన్ వాడకూడదు. అంటే కొన్ని ఆర్థిక వ్యవహారాలు చేయలేరు. అయితే, డిపార్ట్మెంట్పరమైన కార్యకలాపాల్లో ఇది చలామణీలో ఉంటుంది. అనుసంధానం చేయకపోవడం .. రద్దు వల్ల వాడకూడదు కాబట్టి ఇవ్వలసిన చోట ఇవ్వకపోయినా.. పాన్ తెలియజేసినా .. పాన్ని ప్రస్తావించినా శిక్షార్హులు. కొందరు ఇక్కడ ఉండీ అనుసంధానం చేయలేదు. మరికొందరు విదేశాల్లో ఉండిపోవడం వల్ల చేయలేదు. అటువంటి వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. 1–4–22 నుండి 30–6–2022 వరకూ రూ. 500, అది దాటితే 1–7–2022 నుండి 31–3–2023 వరకూ రూ. 1,000 ఫీజు కింద చెల్లించి అనుసంధానం చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత పాన్‌ను మళ్లీ యధావిధిగా వాడుకోవచ్చు. ► క్రిప్టో ఆస్తుల మీద పన్ను: 2022 ఏప్రిల్ 1 నుండి క్రిప్టో కరెన్సీలపై, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ) మీద 30 శాతం పన్ను విధిస్తారు. 31–03–2023 నాటి విలువ మీద పన్ను చెల్లించాలి. ► ఆదాయపు పన్ను మదింపులో అధికారులు ముసుగు వేసుకున్న వీరుల్లా తయారవుతారు. ఒకరి ముఖం ఒకరికి కనపడదు. అంతా ఫేస్లెస్సే. ► స్థిరాస్తుల వ్యవహారాల్లో (వ్యవసాయ భూములకు వర్తించదు) రూ. 50,00,000 ప్రతిఫలం దాటిన కేసుల్లో స్టాంప్ డ్యూటీ విలువ లేదా ఒప్పందంలో పేర్కొన్న విలువ .. ఏది ఎక్కువ ఉంటే ఆ మొత్తం మీద టీడీఎస్ రికవరీ చేయాలి. 1 శాతం చొప్పున చేయాలి. గతంలో కేవలం ఒప్పంద విలువ మీద చేయాల్సి వచ్చేది. కొత్త రూల్స్ ప్రకారం స్టాంప్ డ్యూటీని తీసుకువచ్చారు. ► మరో అశనిపాతంలాంటిది ఏమిటంటే.. ప్రావిడెంట్ ఫండ్ మీద వడ్డీపరంగా ప్రతికూల పరిణామం. గతంలో మనం తెలుసుకున్నాం ఉఉఉ (పన్నుపరమైన మినహాయింపుల) గురించి. కానీ కొత్త రూల్స్ ప్రకారం పీఎఫ్ జమలు రూ. 2,50,000 దాటితే ఆ ఆదనం మీద వచ్చే దాన్ని ఆదాయంగా పరిగణిస్తారు. అంటే పరోక్షంగా రూ. 2,50,000 దాటి జమ చేసినందుకు ఎటువంటి ప్రోత్సాహం ఉండదు. ఉన్న స్కీముల్లో పీపీఎఫ్ అత్యుత్తమం. హైక్లాస్ ఆదాయం ఉన్న వారికి దెబ్బ. సాధారణ, మధ్యతరగతి వారికి ఎటువంటి నష్టం లేదు. ► కోవిడ్ చికిత్స నిమిత్తం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులకు మినహాయింపు లభిస్తుంది. అయి తే అన్ని కాగితాలు, రుజువులు ఉండాలి. -
ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది, పాన్‌తో ఆధార్ లింక్ చేశారా!..చేయకపోతే..!
అవును..మరో నాలుగు రోజుల్లో 2021–22 ఆర్థిక సంవత్సరం ముగియబోతోంది. ఈ సందర్భంగా నాలుగు ముక్కలు. 2021–22 ఆర్థిక సంవత్సరం 31–03–2022తో ముగియనుండటంతో .. ఏదైనా కారణం వల్ల చేయాల్సిన విధులు చేయకపోతే, ఇంకా టైమ్ ఉంది. త్వరపడండి. ► వాస్తవానికి 31–03–21తో పూర్తయ్యే సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్ను వేయడానికి గడువు తేదీ 31–07–21. తర్వాత రెండు సార్లు పొడిగించారు. 31–12–2021 తర్వాత పెనాల్టీతో వేసుకోవ చ్చు. ఆ గడువు కూడా 31–03–22తో ముగు స్తుంది. ఈ గడువు దాటితే ఇక రిటర్ను వేయలేరు. రిటర్ను వేయకపోతే ఏర్పడే నష్టాలు మీకు తెలుసు. ఇక ఆలస్యం చేయకుండా నడుం కట్టండి. రిటర్నులు దాఖలు చేయండి. ► అడ్వాన్స్ ట్యాక్స్ 15–03–2022 లోపల చెల్లించాలి. నాలుగు విడతల్లో జూన్ నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే వడ్డీ పడుతుంది. అశ్రద్ధ వద్దు. 15–03–22 లోపల చెల్లించకపోయినా కనీసం 31–03–22 లోగా చెల్లించండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వడ్డీ తగ్గుతుంది. రెండోది రిటర్నులు వేసే వరకు ఆగకుండా రుణం కోసమో వీసా కోసమో ఈ చలాన్లను బట్టి మీ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు. ► ఇక ప్లానింగ్‌లో భాగంగా ఇన్వెస్ట్మెంట్లు.. సేవింగ్స్.. చెల్లింపులు మొదలైనవి చేయవచ్చు. 80సి కింద ఏ ప్రయోజనం పొందాలన్నా 31–03–22 లోపల చెయ్యాలి. గత 4 వారాలుగా ప్రస్తుతం అమల్లో ఉన్న .. ఇన్వెస్ట్మెంట్ సాధనాలు ..సేవింగ్స్..వివరాలు మీకు తెలియజేశాము. బ్యాంకులో డిపాజిట్ చేయండి. మదుపు ఖాతా జమలు మీ ఖాతాలో ఖర్చు పడేలా తొందరపడండి. కొన్ని క్లెయిమ్‌లను చెల్లించడం జరిగితేనే మినహాయింపు పొందగలరు .. మరిచిపోతే ప్రయోజనం ఉండదు. మెడిక్లెయిమ్ .. డొనేషన్లు ఇలా ఎన్నో ఉంటాయి. త్వరపడండి. ► ఇక నాలుగోది.. పాన్‌తో ఆధార్ అనుసంధానం. ఎన్నో గడువు తేదీలు..ఎన్నో సార్లు వాయిదాలు ఇచ్చారు. ఇక వెయిట్ చేయవద్దు. అనుసంధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు. పెన్షన్, స్కాలర్షిప్, గ్యాస్ సబ్సిడీ ఈ కోవకి వస్తాయి. దీన్ని పాటించకపోతే సెక్షన్ 272బి ప్రకారం రూ. 10,000 పెనాల్టీ పడుతుంది. అటు రిజర్వ్ బ్యాంక్ కూడా కేవైసీ పథకం కింద గడువు తేదీ 31–3–22 అని స్పష్టం చేసింది. బ్యాంకింగ్, మనీ ల్యాండరింగ్ చట్టం ప్రకారం ఇది తప్పనిసరి. ఈ మధ్య ఎందరో ప్రముఖులు, సినీ హీరోలు .. ఈ చట్టప్రకారం శిక్షార్హులయ్యారు. అశ్రద్ధ వద్దు. కేవైసీ కాగితాలు సమర్పించండి. ఇవన్నీ పూర్తి చేసి.. ప్రశాంతంగా కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడదాం. -
కోలుకుంటున్న ఖజానా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22లో రాష్ట్ర సొంత ఆదాయం పెరగడం దీనిని సూచిస్తోంది. ఆర్థిక మందగమనంతో 2019–20లో రాష్ట్ర ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆ తర్వాత ఏడాది 2020–21లో కోవిడ్ లాక్డౌన్, ఆంక్షలతో రాష్ట్ర సొంత ఆదాయం భారీగా పడిపోయింది. ఈ సమయంలో పేద, మధ్య తరగతి వర్గాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి నేరుగా నగదు బదిలీ చేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. కోవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం.. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఈ ఆర్థిక ఏడాది 2021–22లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర సొంత ఆదాయం రూ.73,690 కోట్లకు చేరుతుందని రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషించింది. అయితే, 2019–20 ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం రూ.57,601 కోట్లు రాగా ఆ మరుసటి సంవత్సరం 2020–21లో రూ.57,427 కోట్లు మాత్రమే వచ్చిందని పేర్కొంది. అంటే.. 2019–20లో వచ్చిన ఆదాయం కూడా 2020–21లో రాలేదు. ప్రధానంగా లాక్డౌన్లో రవాణా ఆంక్షల కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2021–22లో అమ్మకం పన్నుతో పాటు ఎస్జీఎస్టీ, రవాణా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రంగాలన్నింటిలో ఆదాయం పెరుగుదల నమోదైనట్లు సర్వే పేర్కొంది. అలాగే.. పన్నేతర ఆదాయం కూడా పెరుగుతున్నట్లు సర్వే వెల్లడించింది. 2019–20లో పన్నేతర ఆదాయం రూ.3,315 కోట్లు రాగా 2020–21లో రూ.3,395 కోట్లు వచ్చింది. 2021–22లో సవరించిన అంచనాల మేరకు రూ.5,451 కోట్లు వస్తుందని అంచనా వేసింది. -
పన్ను చెల్లింపు దారులకు శుభవార్త!! రూ.లక్షవరకు పన్ను ఆదా చేసుకోండిలా?
మీరు 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ట్యాక్స్ చెల్లిస్తున్నారా? ఈ సందర్భంగా మీరు ట్యాక్స్ సేవ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. సెక్షన్ 80సీ కాకుండా సెక్షన్ 80డీ కింద అదనంగా మరో రూ.1లక్ష వరకు అదా చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించడానికి 2022 మార్చి,31చివరి తేదీ. అయితే ఈ ట్యాక్స్ చెల్లింపు సందర్భంగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి వరకు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు సెక్షన్ 80సీతో పాటు సెక్షన్ 80డీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80డీలో వయస్సు ఆధారంగా నిర్దిష్ట పరిమితి వరకు మీరు తీసుకున్నహెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంపై సెక్షన్ 80సీ పరిమితి కంటే ఎక్కువ మీకు అదనపు పన్ను ప్రయోజనాల్ని పొందవచ్చు. మీరు,మీ తల్లిదండ్రులు 60ఏళ్లు పైబడిన వారు అంటే సీనియర్ సిటిజన్లు అయితే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌ను తీసుకోవడం ద్వారా మీరు రూ.1లక్ష వరకు ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన సీనియర్ సిటిజన్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేకం ఉన్నాయి. మీరు ఎలాంటి ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకున్నా పన్ను ఆదా చేసుకునేందుకు ఆదాయపు పన్ను చట్టం 961లోని సెక్షన్ 80డీ కిందకు వస్తుంది. ఇందులో గరిష్ట పన్ను ప్రయోజనం రూ.25,000 లేదా రూ.50,000 మాత్రమే. అయితే వాస్తవ పన్ను ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇది మీ వయస్సు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు నిర్దిష్ట వయస్సు కంటే ఎక్కువ ఉంటే మీరు పొందే మొత్తం మినహాయింపు సుమారు రూ.లక్షరూపాయలు. ఆరోగ్య బీమా ప్రీమియం 60 ఏళ్లలోపు వ్యక్తులకు రూ. 25,000 వరకు, 60 ఏళ్లు పైబడిన వారికి రూ. 50,000 వరకు పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం (కనీసం 60 సంవత్సరాలు) ఆరోగ్య బీమా ప్లాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మొత్తం పన్ను ప్రయోజనాన్ని రూ.75,000 వరకు పొందవచ్చు. మీరు, మీ తల్లిదండ్రులు ఇద్దరూ 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే, గరిష్టంగా రూ.1,00,000 వరకు మినహాయింపు పొందవచ్చు” అని క్యూబీఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ,సీఈఓ పంకజ్ అరోరా చెప్పారు. చెల్లించిన ప్రీమియం మీ స్థూల మొత్తం ఆదాయాన్ని సమాన మొత్తానికి తీసుకువస్తుంది. తద్వారా మీ పన్ను బాధ్యత తగ్గుతుంది. -
ప్రభావం చూపని ఒమిక్రాన్, వృద్ధి సాధించనున్న హౌసింగ్ ఫైనాన్స్
ముంబై: హౌసింగ్ ఫైనాన్స్ రుణ ఫోర్ట్‌ఫోలియో మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం వృద్ధిని నమోదుచేసుకునే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. రానున్న ఏప్రిల్ నుంచి ప్రారంభం అయ్యే 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 9 నుంచి 11 శాతం ఉంటుందన్నదని ఇక్రా అంచనా. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 మొదటి త్రైమాసికంలో (2020 ఏప్రిల్–జూన్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు–హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ–హెచ్ఎఫ్సీ) రుణ పంపిణీలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం పడింది. అయితే రెండవ త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్) చక్కటి రికవరీ చోటుచేసుకుంది. 2021–22 మొదటి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) కాలాన్ని పరిశీలిస్తే, వాటి ఆన్ బుక్ పోర్ట్‌ఫోలియో 9 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ►ఇదే ధోరణి ఆర్థిక సంవత్సరం మొత్తంలో కనబడుతుందని భావిస్తున్నాం. దేశంలో వ్యాక్సినేషన్ విస్తృతి, ఎకానమీ క్రియాశీలత మెరుగ్గా ఉండడం, పరిశ్రమ డిమాండ్ మెరుగుపడ్డం, కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యవస్థలో అనుకున్నంత ఆందోళనలు సృష్టించకపోవడం వంటి అంశాలు దీనికి కారణం. ►ఈ విభాగంలో మొండిబకాయిలు సైతం మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికం నుంచి గణనీయంగా మెరుగుపడ్డం ప్రారంభమైంది. వసూళ్ల సామర్థ్యం (సీఈ) బలపడింది. మొదటి త్రైమాసికంతో పోల్చితే రెండవ త్రైమాసికంలో స్థూల ఎన్పీఏలు 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) మెరుగుపడ్డాయి. ►హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో రుణ పునర్వ్యవస్థీకరణల డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి పునర్వ్యవస్థీకరణ డిమాండ్ మొత్తం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 1.1 శాతం ఉంటే, 2021 సెప్టెంబర్ 30 నాటికి 2.3 శాతానికి పెరిగింది. అయితే 2022 మార్చి 31వ తేదీ నాటికి ఈ శాతం స్వల్పంగా 2 నుంచి 2.1 శాతం శ్రేణికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. రికవరీలు బాగుండడం, డిఫాల్ట్‌లు తగ్గడం వంటి అంశాలు దీనికి కారణం. ► ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల లాభదాయకత 2020–21 ఆర్థిక సంవత్సరం తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి భారీ పెరుగుదలా లేకుండా మామూలుగా కొనసాగే అవకాశం ఉంది. నిధుల సమీకరణ వ్యయాలు పెరగడం దీనికి కారణం. అయితే 2022–23లో లాభదాయకత కోవిడ్–19 ముందస్తు స్థాయికి వేరే అవకాశం ఉంది. -
జనవరి 18లోగా రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం 2022–23కి బడ్జెట్ ప్రతిపాదనల అంచనాలను ఈ నెల 18లోగా సమర్పించాలని అన్ని ప్రభుత్వ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ విభాగాలు అంచనాలను ఈ నెల 17లోగా సంబంధిత శాఖ కార్యదర్శికి సమర్పించాలని కోరింది. 2021–22కి సవరించిన బడ్జెట్ అంచనాలనూ సమర్పించాలంది. ఈ అంచనాల్లో కేటాయింపుల పెంపును అంగీకరించమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులిచ్చారు. బడ్జెట్ అంచనాల సమర్పణలో జాప్యం ఉండొద్దని, జాప్యమైతే మార్పులకు సమయం లభించడం లేదన్నారు. గడువులోగా ప్రతిపాదనలు సమర్పించకుంటే సంబంధిత శాఖకు పథకాల అమలుకు ఆర్థిక శాఖ నిధులు కేటాయించదన్నారు. తదనంతర పరిణామాలకు సదరు శాఖదే బాధ్యతని చెప్పారు. ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనల స్వీకరణ ప్రారంభమయింది. -
డీఆర్డీఏలకు కేంద్రం మంగళం!
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు ఉద్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డీఆర్‌డీఏల నిర్వహణకు నిధులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో వీటిలో పనిచేస్తున్న సిబ్బంది సంకట స్థితిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, వేర్వేరుగా అమలు చేసే పలు సంక్షేమ పథకాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అవి క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చూడటం వీటి బాధ్యత. 1999లో ఏర్పాటైన డీఆర్డీఏలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. వీటిలో 230 మందికి పైగా సిబ్బంది కాంట్రాక్టు, తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల గ్రామీణ మహిళల పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పింఛన్ల పంపిణీ వంటి పథకాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేసే డీఆర్‌డీఏల నిర్వహణ, సిబ్బంది జీతాల నిధులను కేంద్రమే ఇస్తోంది. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ అన్ని రాష్ట్రాలకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఈ ఉద్యోగులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే వివిధ విభాగాల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
స్టీల్‌ప్లాంట్ టర్నోవర్ రూ. 17,980 కోట్లు
ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్ 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.17,980 కోట్లు టర్నోవర్ సాధించింది. దీంతో గత ఏడాది కంటే 14 శాతం వృద్ధి సాధించినట్టయింది. గురువారం నిర్వహించిన 39వ సాధారణ వార్షిక సమావేశంలో స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వివరాలను ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్ ఏజీఎంలో పాల్గొన్న సీఎండి, డైరెక్టర్లు సంస్థ ఉత్పత్తులు,ఎగుమతులు 0.497 మెట్రిక్ టన్నుల నుంచి 1.308 మెట్రిక్ టన్నులకు పెరిగాయన్నారు. గత ఏడాది కంపెనీ నికర నష్టం రూ.3,910 కోట్లు కాగా ఈ ఏడాది రూ.789 కోట్లకు తగ్గిందన్నారు. దేశీయ అమ్మకాలు గత ఏడాదిలో 20 శాతం కాగా ఈ ఏడాది 24 శాతానికి పెరిగాయన్నారు. సమావేశంలో ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధిగా అండర్ సెక్రటరీ సుభాష్ కుమార్, స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు వి.వి.వేణుగోపాలరావు, డి.కె. మహంతి, కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరెక్టర్ డాక్టర్ సీతా సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం: మంత్రి అవంతి -
జీఈఎం ద్వారా రూ.1,500 కోట్లు: బీహెచ్ఈఎల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ దిగ్గజం బీహెచ్ఈఎల్ గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం) పోర్టల్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ.1,500 కోట్ల విలువైన వస్తు, సేవలను సేకరించినట్టు ఒక ప్రకటనలో ప్రకటించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.389 కోట్లు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. పోర్టల్ ద్వారా స్టీల్, సిమెంట్, కేబుల్స్, పలు విడిభాగాలను సేకరించినట్టు వివరించింది. ప్రభుత్వ ఈ–మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా వస్తు, సేవలను సేకరించిన టాప్–20 ప్రభుత్వ రంగ సంస్థల జాబితాలో తొలి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. ఇదే పోర్టల్‌లో విక్రేతగా సైతం నమోదైనట్టు తెలిపింది. చదవండి: భెల్ రికార్డు.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో.. -
సర్వే: రూ.71.4 లక్షల కోట్లకు రాష్ట్రాల రుణ భారం
ముంబై: రాష్ట్రాల రుణ భారం 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే వాటి రుణ భారం 2021–22లో 33 శాతంగా ఉంటుందని పేర్కొన్న క్రిసిల్, 2020–21 ఆర్థిక సంవత్సరంతో (34 శాతం) పోల్చితే దాదాపు సమానమేనని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు పెరగడం, వ్యయాలు ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చే అంశంగా పేర్కొంది. నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► 2020–21తో పోల్చితే 2021–22లో రాష్ట్రాల మొత్తం రుణం రూ.7.2 లక్షల కోట్లు పెరుగుతుంది. తద్వారా ఈ మొత్తం రూ.71.4 లక్షల కోట్లకు చేరుతుంది. అయితే ఆదాయాలు 15 శాతం పెరిగి, మూడవ వేవ్ రాకుండా ఉంటేనే ఈ లెక్కల అంచనా నిజమవుతుంది. లేదంటే రుణ భారాలు మరింత పెరగక తప్పదు. ► మొత్తం జీఎస్డీపీలో దాదాపు 90 శాతం వాటా కలిగిన 18 రాష్ట్రాలను పరిశీలనలోకి తీసుకుంటే, ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిమాణం 0.9 లక్షల కోట్ల నుంచి (గత ఏడాది) రూ.1.4 లక్షల కోట్లకు పెరగడం ఊరటనిచ్చే అంశం. ► 2019–20లో రాష్ట్రాల ఆదాయ లోటు రూ.1.8 లక్షల కోట్లు. కరోనా కష్ట కాలం 2020–21లో ఇది రూ.3.8 లక్షల కోట్లకు పెరిగింది. 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు తగ్గే అవకాశం ఉంది. ఇదే కాలంలో రాష్ట్రాల మూలధన వ్యయాలు జీఎస్డీపీలో వరుసగా 3.7 శాతం, 3.6 శాతంగా ఉంటే, 2021–22లో 4.4 శాతంగా ఉండే వీలుంది. ► 2019–20లో స్థూల ద్రవ్యలోటు 5.1 శాతం. 2020–21లో ఇది 7.6 శాతానికి చేరింది. 2021–22లో ఇది మరింతగా 8.2 శాతానికి పెరిగే వీలుంది. ► ఒక్క రెవెన్యూ లోటును తీసుకుంటే, 2020– 21లో రూ.3.8 లక్షల కోట్లయితే (జీఎస్డీపీలో 2 శాతం), 2021–22లో రూ.3.4 లక్షల కోట్లకు (జీఎస్డీపీలో 1.6 శాతం) తగ్గే వీలుంది. ► తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో రుణ భారాలు వరుసగా 55.7 లక్షల కోట్లు, రూ.64.2 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.71.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. ► గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల ఆదాయాలు 3 శాతం పతనమైతే, 2021–22లో 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నాం. ► ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో, మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయంలో రెండు ప్రధాన భాగాలు– వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అలాగే పెట్రోలియం ఉత్పత్తులు– మద్యం మీద అమ్మకపు పన్ను వాటా 30 శాతంగా ఉంటుంది. ఈ విభాగాల నుంచి ఆదాయాలు పటిష్టంగా ఉండే వీలుంది. అధిక ద్రవ్యోల్బణం, బేస్ పెంపు ద్వారా జీఎస్టీ 20 శాతం వృద్ధి చెందే వీలుంది. ► అయితే పన్నులు పెరిగినప్పటికీ ఆదాయ వ్యయాలు 10 నుంచి 11 శాతం పెరగవచ్చు. రాష్ట్రాల ఆదాయ వ్యయాల్లో 75 నుంచి 80 శాతం వేతనాలు, పెన్షన్లు, వడ్డీ వ్యయాలు, గ్రాంట్–ఇన్–ఎయిడ్, వైద్యం, కార్మిక సంక్షేమం వంటి కార్యక్రమాలకే కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. ► రోడ్లు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి వంటి మౌలిక రంగాలకు రుణ సమీకరణలు జరపాల్సిన పరిస్థితి ఉంది. ► ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయంలో రాష్ట్రాలు 55 శాతం వృద్ధిని (రూ .5.6 లక్షల కోట్లు) అంచనావేస్తూ బడ్జెట్ ప్రకటించాయి. కానీ వృద్ధి 20 శాతం దాటబోదన్నది అంచనా. ఇప్పటికే 4 శాతంగా ఉన్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య ఉన్న నికర వ్యత్యాసం) దీనికి ప్రధాన కారణం. పెరుగుతున్న రాష్ట్రాల రుణ వ్యయాలు: కేర్ రేటింగ్స్ ఇదిలావుండగా, రాష్ట్రాల రుణ వ్యయాలు పెరుగుతున్నాయని కేర్ రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. గడచిన ఐదు వారాలుగా రాష్ట్రాల మార్కెట్ రుణాలు దీనికి కారణమని వివరించింది. అన్ని మెచ్యూరిటీలపై సగటున వ్యయాలు 5 బేసిస్ పాయింట్లు పెరిగి 6.85 శాతానికి చేరినట్లు కేర్ రేటింగ్స్ పేర్కొంది. చదవండి: షాకింగ్ సర్వే,దక్షిణాది కుటుంబాలలో అప్పులే అధికం -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
వేగవంతమైన వృద్ధిపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరుసగా గత తొమ్మిదేళ్ల నుంచి లాభాల బాటలో ఉన్న ప్రైవేట్ రంగ ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేగవంతమైన వృద్ధి సాధనపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా అత్యంత సంపన్న వ్యక్తులు (హెచ్ఎన్ఐ) సహా వివిధ వర్గాలకు అనువైన పథకాలను రూపొందిస్తోంది. ‘‘2002 నుంచి ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పాలసీదారులకు బోనస్‌లు ఇస్తున్నాం. పాలసీదారులను ఆకర్షించడానికి ఇది ఒక కీలకాంశం కాగలదు. దీంతో పాటు వినూత్న పాలసీలు ప్రవేశపెడుతున్నాం. ఇటీవలే ఎక్సైడ్ లైఫ్ గ్యారంటీడ్ వెల్త్ ప్లస్ పేరిట కొత్తగా గ్యారంటీడ్ సేవింగ్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం. మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా ఉంటూ మెరుగైన రాబడులు కోరుకునే వారికి ఇది అనువైన పథకం. వివిధ కేటగిరీల్లో పథకాల మేళవింపును మెరుగుపర్చుకుంటున్నాం‘ అని కంపెనీ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ (సీడీవో) రాహుల్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకి తెలిపారు. ‘మా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి పరిశ్రమలో మెరుగ్గా 98.54 శాతం స్థాయిలో ఉంటోంది. క్లెయిములను వేగవంతంగా పరిష్కరించేందుకు మేము కట్టుబడి ఉన్నామనడానికి ఇది నిదర్శనం. గడిచిన 3–4 సంవత్సరాల్లో అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం, ఈ–సేల్స్ వంటి సాధనాలపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా మా డిజిటల్ వ్యవస్థను మరింత పటిష్టపర్చుకున్నాం. కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు, పాలసీల విక్రయ ప్రక్రియను సత్వరం పూర్తి చేసేందుకు మా సేల్స్ బృందాలు, భాగస్వాములకు తోడ్పడేలా డేటా, డిజిటైజేషన్ సామర్థ్యాలను పటిష్టం చేసుకున్నాం’’ అని ఆయన తెలిపారు. 800 కోవిడ్ క్లెయిములు .. కరోనా వైరస్ మహమ్మారి మొదలైనప్పట్నుంచి కోవిడ్–19కి సంబంధించి 800 క్లెయిమ్స్ వచ్చాయని, వాటన్నింటిని సాధ్యమైనంత వేగంగా సెటిల్ చేశామని అగర్వాల్ వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 582 వ్యక్తిగత కోవిడ్–19 క్లెయిమ్‌లు, 147 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చాయని, వాటన్నింటిని సెటిల్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మే నెల దాకా 38 వ్యక్తిగత క్లెయిమ్‌లు, 6 గ్రూప్ క్లెయిమ్‌లు వచ్చినట్లు తెలిపారు. మార్చి ఆఖరు నాటి దాకా కోవిడ్–19 క్లెయిమ్‌ల సెటిల్మెంట్ కింద దాదాపు రూ. 40 కోట్లు చెల్లించినట్లు అగర్వాల్ వివరించారు. మారిన పంపిణీ వ్యవస్థ.. కరోనా వైరస్ వ్యాప్తి పరిణామాల నేపథ్యంలో వ్యాపార నిర్వహణ ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయని అగర్వాల్ తెలిపారు. సాంప్రదాయ విధానాల నుంచి డిజిటల్ వ్యవస్థ వైపు బీమా సంస్థలు మారుతున్నాయని ఆయన వివరించారు. ఈ క్రమంలో తమ సంస్థకు సంబంధించి ఈ–సేల్స్ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫాం తయారు చేసుకున్నామని, ప్రస్తుతం కొత్త ప్రపోజల్స్‌లో 95 శాతం భాగం దీని ద్వారానే లాగిన్ అవుతున్నాయని అగర్వాల్ పేర్కొన్నారు. లాగిన్ దగ్గర్నుంచి పాలసీ జారీ అయ్యే దాకా ఈ విధానంతో పారదర్శకత, సమర్థత పెరిగిందని, మధ్య కాలికం నుంచి దీర్ఘకాలికంలో వ్యయాలను నియంత్రించుకోవడానికి కూడా ఇది దోహదపడగలదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్ల ఆదాయాలు, ఆర్థిక లక్ష్యాలు తదితర అంశాల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సేల్స్ బృందాలకు డిజిటల్ సాధనాలు తోడ్పడుతున్నాయని చెప్పారు. సరైన పథకాలను అందించడం ద్వారా జీవిత బీమా రంగంలో కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడంలో ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తుంటారని, ఈ నేపథ్యంలో డిజిటల్ విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్నా సాంప్రదాయ పంపిణీ విధానాలు కూడా కొనసాగుతాయని వివరించారు. -
మొబైల్ ఫోన్ ఎగుమతులు మూడు రెట్లు
న్యూఢిల్లీ: భారత్ మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2021–22, ఏప్రిల్–జూన్)లో మూడు రెట్లు పెరిగింది. రూ.4,300 కోట్లుగా నమోదయ్యింది. 2020 ఇదే కాలంలో ఎగుమతుల విలువ దాదాపు రూ.1,300 కోట్లు. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ఒక నివేదికలో ఈ విషయాలను తెలిపింది. ఈ రంగంలో రికవరీ, వృద్ధి అంశాలను తాజా గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. నివేదికలో ముఖ్యాంశాలు ►మొబైల్ హ్యాండ్సెట్ తయారీ పరిశ్రమ నిరంతరం వృద్ధి పథంలో కొనసాగుతోంది. కోవిడ్–19 సెకండ్‌వేవ్‌లోనూ ఫలితాలను నమోదుచేసుకుంది. ►ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎగుమతులు సైతం మొదటి త్రైమాసికంలో 100 శాతం పెరిగి విలువలో రూ.20,000 కోట్లను అధిగమించింది. ►ఇక ఇదే కాలంలో మొబైల్ ఫోన్ల దిగుమతుల విలువ భారీగా తగ్గి రూ.3,100 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పతనమైంది. 2014–15 అల్‌టైమ్ కనిష్ట స్థాయి ఇది. ►కాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ల దిగుమతుల విలువ మాత్రం మొదటి త్రైమాసికంలో 50 శాతంపైగా పెరిగి రూ.6,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు ఎగసింది. మరింత పురోగతికి చర్యలు... మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగంలో మరింత పురోగతి సాధించడానికి కృషి చేస్తున్నాం. ఇందుకు తగిన విధాన కల్పనకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. భారీగా ఈ విభాగాల్లో ఉత్పత్తులను పెంచాలన్నది ప్రధాన లక్ష్యం. ప్రపంచ దేశాల్లో అవసరాల్లో 25 శాతం భారత్ వాటా కావాలన్నది సంకల్పం. – పంకజ్ మొహింద్రూ, ఐసీఈఏ చైర్మన్ చదవండి : ఏడాదిలో మరింత పెరగనున్న ఇళ్ల ధరలు! -
బీఎస్ఎన్ఎల్: ఆశ్చర్యకరమైన పరిణామాలు!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ఆశ్చర్యకర ఫలితాల్ని చవిచూస్తోంది. 4జీ సర్వీసులు లేకున్నా.. ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. సబ్ స్క్రయిబర్ షేర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం. బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. 2016-2017 మధ్య బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ 8.6 శాతంగా ఉండగా, 2017-18కి 9.4 శాతం, 2018-19కి 9.9 శాతం, 2019-2020 నాటికి 10 శాతానికి చేరింది. ఇక 2020-2021కి(మార్చి 21, 2021) స్వల్పంగా పెరిగి.. 10.3 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. డాటా వినియోగం, టెలికామ్ సెక్టార్లో పోటీ వల్ల టారిఫ్‌లలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. 4జీ సర్వీసులు లేకపోవడం బీఎస్ఎన్ఎల్కు ప్రతికూలంగా మారాయని టెలికాం నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU)పై మాత్రం ప్రభావం పడేలా చేస్తోంది. 4జీ ఎందుకు లేట్ అంటే.. లోకల్ ఎక్విప్మెంట్లు, తగిన సాంకేతికత లేకపోవడం బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతూ వస్తోంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. హాట్ న్యూస్: మీ ఫోన్లో ఈ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి నష్టాల్ని ఇలా తగ్గించుకుంది పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. మరోపక్క ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా-బీఎస్ఎన్ఎల్ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కొందరు తెర మీదకు తెస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరిధిలో మాత్రం అలాంటి ఆలోచనేం కనిపించడం లేదు. -
స్పైస్‌జెట్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్‌చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
నిధుల సమీకరణలో ప్రభుత్వ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీలు) గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో నిధులను సమకూర్చుకోవడంలో దూకుడు ప్రదర్శించాయి. వెరసి రుణాలు, ఈక్విటీ మార్గాలలో దాదాపు రూ. 58,700 కోట్లు సమీకరించాయి. ఒక ఏడాదిలో ఇది సరికొత్త రికార్డు కాగా.. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఆర్థిక సవాళ్లు నెలకొన్నప్పటికీ పెట్టుబడులను పెంపొందించుకోవడంలో బ్యాంకులు జోరు చూపాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 4,500 కోట్లు, కెనరా బ్యాంక్ రూ. 2,000 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (ప్రయివేట్ ప్లేస్మెంట్) రూ. 3788 కోట్లు చొప్పున అందుకున్నాయి. క్విప్‌లు విజయవంతంకావడం పీఎస్‌బీల పట్ల దేశ, విదేశీ ఇన్వెస్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 12 పీఎస్‌బీలు రికార్డుకు తెరతీస్తూ టైర్–1, టైర్–2 బాండ్ల జారీ ద్వారా గతేడాది రూ. 58,697 కోట్లు సమీకరించాయి. సంస్కరణల ఎఫెక్ట్ గుర్తింపు, రుణ పరిష్కారాలు, కొత్తపెట్టుబడులు వంటి పలు ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్పీఏలు) తగ్గడంతోపాటు.. లాభాలు మెరుగుపడ్డాయి. ఫలితంగా పీఎస్‌బీల ఎన్పీఏలు రూ. 6,16,616 కోట్లకు తగ్గాయి. 2020లో ఇవి రూ. 6,78,317 కోట్లుకాగా.. 2019లో రూ. 7,39,541 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే కాలంలో ప్రొవిజన్ల కవరేజీ నిష్పత్తి 84 శాతానికి బలపడింది. గత ఐదేళ్లలోలేని విధంగా ప్రభుత్వ బ్యాంకుల లాభాలు రూ. 31,816 కోట్లకు చేరాయి. కరోనా మహమ్మారి దెబ్బకు గతేడాది ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించినప్పటికీ పటిష్ట పనితీరును కనబరిచాయి. 2020లో నమోదైన రూ. 26,015 కోట్ల నష్టాల నుంచి ఈ స్థాయి టర్న్‌అరౌండ్‌ను సాధించడానికి మొండి రుణ సవాళ్లను అధిగమించడం సహకరించింది. ఎన్పీఏల నియంత్రణ, రికవరీ చర్యలు ఇందుకు తోడ్పాడునిచ్చాయి. గత ఆరేళ్లలో పీఎస్‌బీలు రూ. 5,01,479 కోట్లను రికవరీ చేయడం గమనార్హం. ఇదే సానుకూల ధోరణి కొనసాగుతుందని అంచనా. -
ఐటీసీ ఫలితాలు భేష్
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 30 శాతంపైగా ఎగసి రూ. 3,343 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,567 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 36 శాతం జంప్‌చేసి రూ. 14,241 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు సైతం 28 శాతంపైగా పెరిగి రూ. 10,220 కోట్లను తాకాయి. కోవిడ్–19 సెకండ్ వేవ్‌లోనూ వివిధ విభాగాలు పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ పేర్కొంది. విభాగాల వారీగా ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ 24 శాతం వృద్ధితో రూ. 9,534 కోట్లను అధిగమించింది. సిగరెట్ల విభాగం 34 శాతం పుంజుకుని రూ. 5,803 కోట్లకు చేరింది. కాగా.. ఎఫ్ఎసీజీ ఇతర విభాగంలో బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్నాక్స్, డైరీ, పానీయాలు, స్టేషనరీ తదితరాల టర్నోవర్ 10 శాతంపైగా బలపడి రూ. 3,731 కోట్లను తాకింది. హోటళ్ల ఆదాయం ఐదు రెట్లు ఎగసి రూ. 134 కోట్లకు చేరింది. -
ఐటీ స్టాక్స్ జోరు, లాభాల్లో ఎల్అండ్టీ టెక్నాలజీ షేర్లు
ముంబై: ఎల్అండ్టీ అనుబంధ సంస్థ ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ (ఎల్టీటీఎస్) జూన్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించింది. కంపెనీ లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 84 శాతం పెరిగి రూ.117 కోట్ల నుంచి రూ.216 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 19 శాతం వృద్ధితో రూ.1,562 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 17.3 శాతంగా ఉంది. ఆదాయ వృద్ధి 2021–22లో 15–17 శాతం మధ్య ఉండొచ్చన్న అంచనాలను వ్యక్తం చేసింది. ‘‘యూఎస్, యూరోప్‌లో (ఈ రెండు ప్రాంతాల నుంచి 80 శాతం ఆదాయం) దాదాపు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. జపాన్, భారత్‌లోనూ సాధారణ పరిస్థితులు ఏర్పడనున్నాయి’’ అని కంపెనీ సీఈవో, ఎండీ అమిత్చద్దా తెలిపారు. బీఎస్ఈలో కంపెనీ షేరు 3 శాతం లాభపడి రూ.2,910 వద్ద క్లోజయింది. చదవండి : వాహనాల కొనుగోళ్లు, రెండింతలు పెరిగింది -
నియోజకవర్గ అభివృద్ధి నిధులు 5 కోట్లకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్)ను రూ. 5 కోట్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.3 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో ఎంఎస్ నెం: 13 జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల వారీగా ఈ నిధులను వెచ్చించేందుకు గాను త్వరలోనే మార్గదర్శకత్వాలు విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి, ప్రస్తుత జిల్లాల వారీగా రాష్ట్ర మంత్రి వర్గంలోని 16 మంది పరిధిలోనికి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆయా జిల్లాల పరిధిలోనికి వచ్చే ఎమ్మెల్సీల వివరాలను ప్రత్యేకంగా ఆ జీవోలో పేర్కొన్నారు. చదవండి: షర్మిల పార్టీ వ్యూహకర్తగా ప్రియ -
వేతన జీవులూ.. జర జాగ్రత్త!
► వేతన జీవులకు జీతభత్యాల మీద వారి యజమాని ప్రతి నెలా టీడీఎస్ కొంత చేసి, ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు. అలా జమ చేసిన తర్వాత ఆ సమాచారం అంతా ఫారం 26 ఏఎస్‌లో పొందుపర్చబడుతుంది. ఇందులో ఎప్పటికప్పుడు సమాచారం చేరుస్తుంటారు. ముందుగా ఉద్యోగస్తులు వారి ఆదాయ వివరాలు, సేవింగ్స్ వివరాలు ఇవ్వాలి. యజమాని నికర ఆదాయాన్ని లెక్కించి, పన్ను భారం లెక్కించి పన్నెండు సమాన భాగాలుగా ప్రతి నెలా జమ చేయాలి. కానీ అలా జరగడం లేదు. బదులుగా చివరి 3-4 నెలల్లో చేస్తున్నారు. జీతం, పెన్షన్ మీద టీడీఎస్ వర్తింపచేయడం జరుగుతుంది. జాగ్రత్తగా సమాచారం ఇవ్వండి. ► ఉద్యోగి తనకి వచ్చే ఇతర ఆదాయపు వివరాలు యజమానికి తెలియజేస్తే, వాటిని పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని, పన్ను భారాన్ని లెక్కించి, రికవరీ చేయాలి. ► ఏదైనా కారణం వల్ల వేతన జీవులు ఇతర ఆదాయం గురించి యజమానికి చెప్పలేకపోయిన పక్షంలో వారే స్వయంగా అలాంటి ఆదాయాలన్నింటినీ లెక్కించి, జీతం మీద ఆదాయంతో కలిపి మొత్తం పన్ను భారాన్ని లెక్కించాలి. అందులో నుంచి టీడీఎస్‌ని తగ్గించి, మిగతా భారాన్ని 2022 మార్చిలోగా చెల్లించాలి. ► జీతం కాకుండా వేతన జీవులకి బ్యాంకు వడ్డీ, ఫిక్సిడ్ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రావచ్చు. ఇలాంటి ఆదాయం మీద కేవలం 10 శాతం టీడీఎస్ వర్తింపచేస్తారు. మీరు శ్లాబును బట్టి అదనంగా 10 శాతం నుంచి 20 శాతం దాకా చెల్లించాల్సి రావచ్చు. ► అలాగే ఇంటి అద్దె. దీని మీద టీడీఎస్ జరగవచ్చు లేదా జరగకపోనూ వచ్చు. ఒకవేళ జరిగినా నిర్దేశిత స్థాయి పన్ను భారానికి సరిపోకపోవచ్చు.. తేడా ఉండొచ్చు. అటువంటి తేడాలేమైనా ఉంటే సకాలంలో చూసుకుని పన్నుని చెల్లించాలి. ► క్యాపిటల్ గెయిన్స్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. కొన్ని సందర్భాల్లోనే టీడీఎస్ వర్తిస్తుంది. (అమ్మకపు విలువ రూ. 50,00,000 దాటితేనే టీడీఎస్ చేయాలి) వేతన జీవులు స్వయంగా వాళ్ల క్యాపిటల్ గెయిన్స్ లెక్కించి పన్ను భారం చెల్లించాలి. లావాదేవీ జరిగిన తేదీ తర్వాత వచ్చే త్రైమాసికంలో పన్ను చెల్లించాలి. అలా చేయకపోతే వడ్డీ చెల్లించాలి. ► ఇంకేదైనా ఇతర ఆదాయం కూడా ఉండి ఉండవచ్చు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ► అడ్వాన్స్ ట్యాక్స్ వర్తించే పరిస్థితి వస్తే.. ప్రతి మూడు నెలలకు అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదాల ప్రకారం చెల్లించేయాలి. గడువు తేదీ దాటితే కొన్ని సందర్భాల్లో వడ్డీ పడుతుంది కాబట్టి మీ సంవత్సర ఆదాయాన్ని సేవింగ్స్‌ను ముందుగా లెక్కించండి. నికర ఆదాయం మీద పన్ను భారాన్ని టీడీఎస్ ద్వారా, అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి కె.వి.ఎన్ లావణ్య చదవండి: పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు! -
ముగింపులో అదర గొట్టిన మార్కెట్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లోముగిసాయి. కొత్త ఆర్థిక సంసంవత్సర ఆరంభంలోనే భారీగా ఎగిసిన సూచీలు ముగింపును కూడా అదరగొట్టేశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగినా వారాంతంలో పాజిటివ్‌గా ముగిసాయి. చివరి గంటలో పుంజుకుని కీలక మద్దతు స్థాయిలకుఎగువన ముగియం విశేషం. సెన్సెక్స్ 520 పాయింట్లు ఎగిసి 50029వద్ద,నిప్టీ 177 పాయింట్లలాభంతో 14867 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి. ముఖ్యంగా టాటా స్టీల్ 6 శాతానికిపైగా ఎగిసింది. దీంతో సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ తిరిగి లక్ష కోట్ల రూపాయలకు చేరింది. జూన్,2008 తర్వాత ఆ స్థాయి ధరకి చేరడంతో 12ఏళ్ల నాటి గరిష్టానికి షేరు చేరింది.ఆస్ట్రేలియాలోని సైబర్ సెక్యూరిటీ సంస్థ కొనుగోలుతో విప్రో షేర్లు దాదాపు 5 శాతం ర్యాలీ అయ్యాయి. ఇండస్ఇండ్, కోటక్‌మహీంద్ర, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు, బజాజ్ ఫైనాన్స్,సన్‌ఫార్మ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి., మరోవైపు హెచ్‌యూఎల్, టీసీఎస్ నెస్లే, టైటన్, టెక్ మహీంద్ర స్వల్పంగా నష్టపోయాయి. -
ఆరేళ్లలో ఆరు లక్షల కోట్లు.. కార్పొరేట్లకు మినహాయింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఆరేళ్ళలో దేశంలోని కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపుల రూపంలో రూ.6,07,583.04 కోట్లను మినహాయించినట్లు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. మంగళవారం రాజ్యసభలో సీపీఐ (ఎం) ఎంపీ కెకె రాగేష్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,15,176.50 కోట్లు, 2016–17లో రూ.1,30,184.41 కోట్లు, 2017–18లో రూ.1,20,069.67 కోట్లు, 2018–19లో రూ.1,25,891.78 కోట్లు, 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,16,260.68 కోట్లు దేశంలోని పెట్టుబడిదారులకు పన్ను మినహాయిం పులు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. చట్టం ప్రకారమే.. ఆదాయ పన్ను చట్టం–1961 ప్రకారమే కార్పోరేట్లకు పన్నుల మినహాయింపులు, ప్రోత్సాహకాలు, వివిధ తగ్గింపులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు ఈ చర్యలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ప్రాంతీయ అసమానతలను తొలగించే చర్యల్లో భాగంగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ ట్యాక్స్ మినహాయింపులిచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. ఒక నిర్దిష్ట రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి లేదా ప్రాంతీయ అసమాన పరిస్థితులను తగ్గించడానికి సాధారణంగా పన్ను ప్రోత్సాహకం అందిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రాంతాలలో వివిధ పారిశ్రామిక యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఆయా పెట్టుబడిదారులు ఈ పన్ను మినహాయింపులను వినియోగిస్తారని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వెల్లడించారు. -
నిధులెట్లా.. 2021–22 బడ్జెట్ కూర్పుపై సీఎం కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించేందుకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకునే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా దెబ్బకు కకావికలమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఏడాది అవసరాలకు తగినట్టు నిధుల సమీకరణ ఎలా అన్న దానిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ వర్గాలు, సలహాదారులతో సమావేశమైన ఆయన ఈ వారంలో కీలక భేటీలు జరుపుతారని, వచ్చే నెలలోపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన వార్షిక బడ్జెట్ (2021–22)పై అధికారులకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ భేటీల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు, కష్టకాలంలోనూ కేంద్ర సాయం అరకొరగా ఉన్న నేపథ్యంలో సొంత ఆదాయం పెంచుకునేందుకు గల ప్రత్యామ్నాయ మార్గాలు, వచ్చే ఏడాది కొత్త కార్యక్రమాల అమలుకు అవసరమయ్యే, అనివార్య ఖర్చుల కింద వెచ్చించాల్సిన మేరకు కావాల్సిన నిధులను సమకూర్చుకునే అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. చదవండి: (మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి: సీఎం కేసీఆర్) రూ.95 వేల కోట్లు కావాల్సిందే.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించాల్సి ఉంది. దీంతో పాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు వేతన సవరణ లాంటి కచ్చితంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పింఛన్లు, అప్పుల కింద కట్టాల్సిన మొత్తం, వడ్డీ చెల్లింపుల కింద రూ.45 వేల కోట్ల వరకు అవసరమవుతాయి. రైతు బంధు, ఆసరా పింఛన్లు, వ్యవసాయ రుణాల మాఫీ, గొర్రెల పంపిణీ లాంటి సంక్షేమ కార్యక్రమాలకు రూ.50 వేల కోట్లు తప్పనిసరిగా కావాల్సిందే. వీటికి తోడు నిరుద్యోగ భృతి అమలు చేస్తే రూ.5 వేల కోట్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇస్తారన్న దాన్ని బట్టి కనీసం మరో రూ.5 వేల కోట్లు అవసరముంటాయి. ఇటు ప్రభుత్వ నిర్వహణ, రెవెన్యూ ఖర్చు, అత్యవసర కార్యక్రమాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని నిధులు అవసరం కానున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులు కేటాయించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా కనిపిస్తోంది. వీటన్నింటికీ కలిపి కనీసం రూ.1.50 లక్షల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే మొత్తం ఆదాయం, అప్పుల అంచనాలను బట్టి ఈ మేరకు వచ్చే ఏడాది బడ్జెట్‌ను రూపొందించేందుకు సీఎం దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. విలువల సవరణ.. భూముల అమ్మకాలు ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రత్యామ్నాయ ఆర్థిక మార్గాలు ఏంటన్నవి ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన గత రెండేళ్లుగా అమలు కావడం లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సవరించాల్సిన భూముల రిజిస్ట్రేషన్ల విలువలు ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి సవరించలేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై నిర్ణయాల విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం రూ.80 వేల కోట్ల వరకు వచ్చే అవకాశముండటం, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల కింద మరో రూ.25 వేల కోట్ల వరకు వచ్చినా, మిగిలిన నిధులను సమకూర్చుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తి మీద సాములాగానే మారనుంది. ఇక, అప్పులు చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రాబడులకు తోడు భూముల అమ్మకాలు, రిజిస్ట్రేషన్ విలువల సవరణ ద్వారా మరో రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో జరిగే భేటీల్లో సీఎం సమీక్షలో చర్చకు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకుపోతుందో వేచి చూడాల్సిందే..! -
ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ రూ.3,950 కోట్ల ఆదాయం
భీమవరం (ప్రకాశం చౌక్): ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.3,950 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ శాఖ అడిషనల్ ఐజీ ఎం.ఉదయభాస్కరరావు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం ఆయన రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం తమ శాఖ ఆదాయ లక్ష్యం సుమారు రూ.6,336 కోట్లుగా తెలిపారు. అంతకు ముందు డిసెంబర్ నెలలో సుమారు రూ.421 కోట్ల ఆదాయం వస్తే, గతేడాది డిసెంబర్లో రూ.599 కోట్లు వచ్చిందని ఉదయభాస్కరరావు వెల్లడించారు. -
ఐఆర్సీటీసీకి రూ.25 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ కంపెనీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020–21) జూన్ క్వార్టర్లో రూ.25 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2019–20) ఇదే క్వార్టర్లో రూ.72 కోట్ల నికర లాభం వచ్చిందని ఐఆర్సీటీసీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం, లాక్డౌన్ల కారణంగా ఈ క్యూ1లో నష్టాలు వచ్చాయని వివరించింది. కార్యకలాపాల ఆదాయం రూ.459 కోట్ల నుంచి 71 శాతం పతనమై రూ.131 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. టూరిజం విభాగం ఆదాయం రూ.48 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గిందని తెలిపింది. కేటరింగ్ విభాగం ఆదాయం రూ.272 కోట్ల నుంచి రూ.90 కోట్లకు, రైల్‌నీర్ ఆదాయం రూ.58 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గాయని పేర్కొంది. మర్చంట్ బ్యాంకర్ల డెడ్‌లైన్ 14 వరకూ పొడిగింపు ఐఆర్సీటీసీలో 15–2 శాతం వాటాను కేంద్రం ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్)మార్గంలో విక్రయించనున్న విషయం తెలిసిందే. ఈ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులను సమర్పించడానికి గడువు తేదీని ఈ నెల 10 నుంచి మరో నాలుగు రోజులు... .ఈ నెల 14 వరకూ పొడిగించింది. ఐఆర్సీటీసీలో కేంద్రానికి 87.40 శాతం వాటా ఉంది. సెబీ పబ్లిక్ హోల్డింగ్ నిబంధనల ప్రకారం ఈ వాటాను 75 శాతానికి తగ్గించుకోవలసి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.2.1 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరడానికి ఐఆర్సీటీసీ వాటా విక్రయం ఒకింత తోడ్పడుతుందని అంచనా. కేంద్రం ఇటీవలనే హిందుస్తాన్ ఏరోనాటిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీల్లో వాటా విక్రయం ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించింది. మర్చంట్ బ్యాంకర్ల గడువు పొడిగింపు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో ఐఆర్సీటీసీ షేర్ 0.2% లాభంతో రూ. 1,374 వద్ద ముగిసింది. -
హీరో మోటోకార్ప్ లాభం రూ.621 కోట్లు
న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,885 కోట్ల నుంచి 21 శాతం పతనమై రూ.6,235 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం, ఆదాయాలు తగ్గాయని వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.25 తుది డివిడెండ్‌ను ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. వాహన అమ్మకాలు 25 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17.81 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు గత క్యూ4లో 13.35 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు స్పల్ప లాభంతో రూ.2,386 వద్ద ముగిసింది. -
కొత్త ఏడాది : కీలక సూచీలు ఢమాల్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లాయి. కొత్త ఆర్థిక సంవత్సరాన్ని నష్టాలతో ఆరంభించింది. అనంతరం నష్టాల్లోంచి మరింత బలహీనపడింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 722 పాయింట్ల నష్టంతో 28745 వద్ద, నిప్టీ 209 పాయింట్లు పతనమై 8381 వద్ద కొనసాగుతోంది. తద్వారా సెన్సెక్స్ 29వేల దిగువకు చేరగా, నిఫ్టీ 84 వేల స్థాయిని కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉండగా బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్‌లు లాభపడుతున్నాయి. అలాగే గత 2 రోజులుగా నష్టాల్లో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్‌లో షార్ట్ కవరింగ్ కనిపిస్తోంది. ఎస్ బ్యాంకు పది శాతం ఎగసింది. బ్రిటానియా, సిప్లా, హెచ్‌యూఎల్, నెస్లేలు నిఫ్టీ లాభపడుతుండగా, కోటక్ మహీంద్రా, ఒఎన్జీసీ, అదాని పోర్ట్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్‌లు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. కాగా ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లకు సెలవు. -
ఆర్థిక సంవత్సరం పొడిగింపు... నిజంకాదు!
న్యూఢిల్లీ: ఏప్రిల్ 2019 నుంచీ ప్రారంభమై మార్చి 2020తో ముగిసే 2019–2020 ఆర్థిక సంవత్సరం మరో మూడు నెలలు అంటే జూన్ నెలాంతం వరకూ పొడిగించినట్లు సోమవారం వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ఈ మేరకు ఒక వివరణాత్మక ప్రకటన చేసింది. ఆర్థిక సంవత్సరం పొడిగింపు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆర్థికశాఖ కింద పనిచేస్తున్న రెవెన్యూ శాఖ 30వ తేదీన ఇండియన్ స్టాంప్స్ యాక్ట్‌లో కొన్ని సవరణలకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. ‘‘స్టాక్ ఎక్సే్చంజీలు లేదా క్లీనింగ్ కార్పొరేషన్ల ద్వారా జరిగే సెక్యూరిటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్ల లావాదేవీలపై స్టాంప్ డ్యూటీ వసూళ్లకు 2020 ఏప్రిల్ 1 నుంచీ పటిష్ట యంత్రాంగం అమల్లో ఉంటుందని గత నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యంత్రాగం అమలును 2020 జూలై 1వ తేదీ వరకూ వాయిదా వేయడం జరిగిందని రెవెన్యూ శాఖ మార్చి 30వ తేదీన ఒక ప్రకటన ఇచ్చింది. దీనిని కొన్ని మీడియా వర్గాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి’’ అని ఆర్థికశాఖ ప్రకటన మంగళవారం వివరణ ఇచ్చింది. -
ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదు : కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ వరకూ కొనసాగనుందనే వార్తలకు కేంద్రం చెక్ పెట్టింది. ఇలాంటి వదంతులను నమ్మవద్దంటూ కేంద్రం స్పష్టం చేసింది. యథావిధిగా ఈ ఆర్థిక సంవత్సరం 31.3.2020 తో ముగుస్తుందని తెలిపింది. ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరాన్ని పొడిగించలేదని, మార్చి 31 తో ముగియనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారత స్టాంప్ చట్టంలో చేసిన మరికొన్ని సవరణలకు సంబంధించి 2020 మార్చి 30న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ తప్పుగా పేర్కొనబడిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఆర్థిక సంవత్సరం పొడిగింపు లేదు" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాంప్రదాయకంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై ఆ తదుపరి ఏడాది మార్చి 31తో పూర్తవుతుంది. కరోనా కల్లోలం కారణంగా కేంద్రం భారత్ ఆర్థిక సంవత్సరాన్ని3 నెలలు పొడిగించిందంటూ వార్తలు వెలువడ్డాయి. 2020 ఏప్రిల్ నుంచీ కాకుండా 2020 జూలై 1వ తేదీ నుంచీ ప్రారంభమవుతుందని సూచించాయి. అయితే ఈ అంచనాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 ముగియనున్న నేపథ్యంలోనే వ్యక్తిగత ఆదాయ పన్ను వివరాల ఫైలింగ్ ను, ప్యాన్-ఆధార్ లింకింగ్ గడువున, జీఎస్టీ ఫైలింగ్ లాంటి కొన్ని అంశాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జూన్ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. (చదవండి : తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?)