భారత ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌ను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కొన్ని శాఖలు పూర్తిస్థాయిలో అప్పటి బడ్జెట్ నిధులను ఉపయోగించలేదు. మూలధన పెట్టుబడులు, వస్తువుల కొనుగోళ్లలో జాప్యం కారణంగా కొంతమేర నిధులు బూ తిరిగి ఖజానాకు చేరాయి. ఏయే విభాగాలు ఎంతమేరకు ఇలా నిధులు తిరిగి పంపాయో.. అందుకుగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కొన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమకు కేటాయించిన బడ్జెట్‌ను 2024-25 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. కొనుగోలు ప్రక్రియల్లో జాప్యం, ఇతర బ్యూరోక్రాటిక్ అడ్డంకుల కారణంగా రక్షణ మంత్రిత్వ శాఖ రూ.12,500 కోట్లు తిరిగి కేంద్ర ఖజానాకు జమ చేసింది. ప్రభుత్వం కఠినమైన ఆర్థిక విధానాలు, మెరుగైన ఆర్థిక నిర్వహణ పద్ధతుల ద్వారా భారీగా ఖర్చు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఖర్చులను ఆదాయ ఉత్పత్తికి అనుగుణంగా ఉండేలా చూసుకుంటున్నాయి. ఇది ఆర్థిక జాప్యాన్ని నివారించడానికి, సమతుల్య బడ్జెట్‌ను నిర్వహించడానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 100 మంది వాట్సప్ యూజర్లపై స్పైవేర్ దాడి..?
మెరుగైన పన్ను వసూలు యంత్రాంగాలు, పన్ను ఎగవేతను అరికట్టడంతో సహా సమర్థమైన ఆదాయ సమీకరణ ప్రయత్నాల వల్ల కొంత బడ్జెట్‌ను మిగిల్చింది. కొన్ని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశీ ప్రభుత్వాల మద్దతు వల్ల ద్రవ్యలోటును నిర్వహించడానికి, బడ్జెట్ అమలు సజావుగా జరిగేలా చూడటానికి సాయపడిందని నిపుణులు తెలియజేస్తున్నారు. నిధుల రాబడి, ఆర్థిక క్రమశిక్షణ, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment