కేంద్రాన్ని కోరనున్న చంద్రబాబు
హైదరాబాద్: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రణాళికేతర పద్దులో ఏర్పడుతున్న రూ.15,691 కోట్ల లోటును భర్తీ చేయడానికి వీలుగా త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేటాయింపులు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు అంశాలపై ప్రధానమంత్రి, పలువురు కేంద్ర మంత్రులతో చర్చిం చేందుకు బాబు గురువారం నుంచి రెండురోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు.
విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడే రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.15,691 కోట్ల లోటు ఏర్పడుతున్నట్టు తేల్చారు. బడ్జెట్ కేటారుుంపులతో ఈ లోటును భర్తీ చేయూలని కోరనున్న సీఎం.. విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్, జలవనరుల మంత్రి ఉమాభారతి, మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ, రైల్వేమంత్రి సదానందగౌడలతో సమావేశం కానున్నారు.
లోటు భర్తీకి కేటాయింపులు చేయండి
Published Thu, Jun 26 2014 1:48 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement