allocations
-
చదువుకు పెరిగిన పద్దు
సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి 2024–25 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 21,292 కోట్లు కేటాయించింది. 2023–24లో కేటాయించిన రూ. 19,093 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 2,199 కోట్లు ఎక్కువ కేటాయింపులు చేయడం విశేషం. మొత్తం బడ్జెట్లో గతేడాది విద్యారంగం కేటాయింపులు 6.57 శాతం మేర ఉండగా తాజాగా అవి 7.31 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారు. విశ్వవిద్యాలయాలకు గతంలో మాదిరిగానే రూ. 500 కోట్లు కేటాయించారు. విద్య పరిశోధన, శిక్షణ వ్యవహారాల రాష్ట్ర మండలి (ఎస్సీఈఆర్టీ) నిధులు రూ. 425.54 కోట్ల నుంచి రూ. 705 కోట్లకు పెంచారు. సెకండరీ పాఠశాలలకు కేటాయింపులు రూ. 390 కోట్ల నుంచి రూ. 925 కోట్లకు పెంచారు. గురుకుల విద్యకు 2023లో రూ. 662 కోట్లు కేటాయించగా ఈసారి రూ. 694 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజనం వంటి కేంద్ర పథకాలకు కేటాయింపులు దాదాపు రూ. 300 కోట్ల వరకూ పెరిగాయి. కళాశాల విద్యకు స్వల్పంగా రూ. 60 కోట్లు పెంచారు. అయితే పెరిగిన బడ్జెట్లో 90 శాతం వేతనాలకే సరిపోతుందని విద్యావేత్తలు అంటున్నారు. ఈ నిధులు ఏ మూలకు? విద్యకు 15 శాతం నిధులిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో సగం కూడా కేటాయించలేదు. పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నా నిర్మాణాలకు నిధులు ఇవ్వలేదు. 3వ తరగతి వరకు అంగన్వాడీల్లో కలపాలన్న ప్రతిపాదన సమర్థనీయం కాదు. – చావా రవి (యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
బడ్జెట్ కేటాయింపులపై జడ శ్రవణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
హైదరాబాద్‌లో ‘రక్షణ’కు ఊతం
సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగం, ఏరోస్పేస్‌కు హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్‌కు మరింత ఊతం లభించనుంది. కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ రంగానికి సంబంధించి పరిశోధనలు నగరంలో మరింత ఊపందుకోనున్నాయి. ఇప్పటికే డిఫెన్స్, ఏరోస్పేస్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొచ్చాయి. డీఆర్డీవో, డీఆర్డీఎల్, ఆర్సీఐ, బీడీఎల్, ఎండీఎన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, డీఎంఆర్ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్‌లో రక్షణ రంగానికి వన్నె తెస్తున్నాయి. కేంద్రం బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.6,21,940 కోట్లను కేటాయించిన విషయం విదితమే. కాగా ఈ కేటాయింపుల్లో రూ.1.05 లక్షల కోట్లను దేశీయ ఆయుధ వ్యవస్థల కొనుగోళ్లకే వాడతామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పడంతో హైదరాబాద్ నుంచి దేశీయ ఉత్పత్తుల తయారీ ఊపందుకునే అవకాశం ఏర్పడింది. ఆయుధాల తయారీ హబ్‌గా.. ఆయుధాల తయారీలో హైదరాబాద్ ఇప్పటికే అగ్రగామిగా నిలుస్తోంది. అల్రా్టలైట్ రిమోట్ కంట్రోల్ వెపన్ సిస్టమ్‌ను జెన్ టెక్నాలజీస్ అనే సంస్థ ఇప్పటికే అభివృద్ధి పరిచింది. ఇక,హాక్ ఐ, ఎస్టీహెచ్ఐఆర్ స్టాబ్ 640తో పాటు మిషన్ ప్లానింగ్, నావిగేషన్, ప్రమాదాలను గుర్తించడం, ఉగ్రవాదుల జాడ కనిపెట్టేందుకు ప్రహస్త అనే రోబోటిక్ డాగ్‌ను అభివృద్ధి పరిచారు. ఆయుధ కొనుగోళ్లు, సంబంధిత ఇతర వ్యవస్థల కొనుగోలుకు కేంద్రం రూ.1.72 లక్షల కోట్లను కేటాయించింది. దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకే అత్యధిక మొత్తం ఖర్చుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది హైదరాబాద్‌లోని ఆయుధాల తయారీ సంస్థలకు ఊతమిస్తుందని ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో అగ్రగామిగా.. ఎస్ఈసీ ఇండస్ట్రీస్ రక్షణ రంగంతో పాటు అంతరిక్ష పరిశోధన రంగంలో దేశానికి ఎన్నో సేవలు అందిస్తోంది. గగన్‌యాన్, చంద్రయాన్‌కు కావాల్సిన ప్రధానమైన విడిభాగాలను తయారు చేస్తోంది. క్రూ మాడ్యుల్‌ను ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇక స్కార్పీన్ సబ్‌మెరైన్ ప్రాజెక్టులో కీలక విడిభాగాలైన వెపన్ హ్యాండ్లింగ్, స్టోరేజీ సిస్టమ్, వెపన్ లోడింగ్ సిస్టమ్, థ్రస్ట్ బ్లాక్, బల్లాస్ట్ వెంట్ వాల్‌్వలు, హల్ హాచెస్, కాఫర్ డ్యామ్ డోర్స్, హెచ్‌పీ ఎయిర్ సిలిండర్స్ వంటివి ఇక్కడే తయారయ్యాయి. -
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్ అయ్యారు. మరోవైపు.. జగన్ చొరవతోనే.. కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి నోడ్.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కర్నూల్ జిల్లా ఓర్వకల్లు నోడ్ హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఈ కారిడార్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జగన్ పాలనలో పారిశ్రామిక దూకుడు! -
2024లో పెట్టుబడులకు దారేది..?
ఇన్వెస్టర్లు ఏడాదికోసారి తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను తప్పకుండా సమీక్షించు కోవాలి. అప్పుడే ఏ విభాగానికి ఏ మేరకు కేటాయింపులు చేయాలన్న స్పష్టత వస్తుంది. ఈక్విటీలు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వడ్డీ రేట్లు సైతం గరిష్టాలకు చేరాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. క్యాపిటల్ మార్కెట్లపై ఈ ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఈక్విటీ, డెట్, బంగారం, రియల్ ఎస్టేట్.. వీటిల్లో ఏ విభాగం పనితీరు ఎలా ఉంటుంది..? ఇది తెలిస్తే.. తమ పెట్టుబడుల్లో వేటికి ఎంత మేర ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిర్ణయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులను ఒడిసి పట్టుకోవచ్చు. అంతేకాదు, మార్కెట్ అస్థిరతలను తట్టుకునే విధంగా తమ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు. దీనిపై మార్కెట్ నిపుణుల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీ అవకాశాలు దీర్ఘకాలంలో ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలు అధిక రాబడులు ఇస్తాయని తెలిసిందే. 2024 సైతం ఇందుకు భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. ‘‘2024 పట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నాం. అంతర్జాతీయ, దేశీయ ముఖచిత్రం మెరుగ్గా కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధిలో ఉండడం, మానిటరీ పాలసీ రేట్ల విషయంలో సర్దుబాట్లు, ముడి చమురు ధరలు తగ్గడం ఇందుకు మద్దతునిస్తున్నాయి’’అని ఫండ్స్ ఇండియా సీఈవో గిరిరాజన్ మురుగన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి, ఆ తర్వాత పలు దేశాల మధ్య యుద్ధాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అవరోధాల నడుమ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు ప్రదర్శించడాన్ని గమనించొచ్చు. ‘‘అంతర్జాతీయంగా వాణిజ్యం విషయంలో మారిన ప్రాధాన్యతలు భారత్‌కు అనుకూలించనున్నాయి. పలు రంగాల్లో భారత్ అంతర్జాతీయంగా మార్కెట్ వాటాను పెంచుకోనుంది. ఒకవైపు సేవల ఎగుమతుల్లో బలంగా ఉన్నాం. మరోవైపు తయారీలోనూ బలమైన స్థానం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’’అని ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు కెన్నెత్ ఆండ్రడే పేర్కొన్నారు. ఈక్విటీ ఇన్వెస్టర్లకు భారత్ ప్రాధాన్య ఎంపికగా ఉంటుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘భారత్ ఆర్థిక అంచనాలు బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ వృద్ధి అంచనా 2.7 శాతాన్ని భారత్ వృద్ధి అంచనాలు 6.5–7 అధిగమిస్తున్నాయి. భారత ప్రభుత్వం వైపు నుంచి పారదర్శక, స్థిరమైన, స్నేహపూర్వక పెట్టుబడుల విధానాలు ఈ వృద్ధికి బలాన్నిస్తున్నాయి. ఇవన్నీ ప్రపంచవేదికపై భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్వర్గధామంగా మారుస్తున్నాయి’’అని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమన్ వీర్ తెలిపారు. ఈక్విటీల్లోనూ మెరుగైన రాబడుల అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? అన్న సందేహం వస్తుంది. కేంద్ర సర్కారు దేశీ తయారీ బలోపేతంపై విరామం లేకుండా కృషి చేస్తోంది. కనుక తయారీ రంగం 2024లోనూ బలమైన పనితీరు చూపించనుంది. 2024 సంవత్సరం మధ్య నుంచి వడ్డీ రేట్ల కోత మొదలవుతుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత భారత మార్కెట్లకు మరింత బూస్ట్నిస్తుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ‘‘వడ్డీ రేట్ల కోతతో విదేశీ ఇనిస్టిట్యూషన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా భారత్‌కు తరలివస్తాయి. దీంతో తయారీ, ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, డిఫెన్స్, రైల్వే ఇన్ఫ్రా, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కంపెనీలు లాభపడనున్నాయి’’అని మురుగన్ వివరించారు. దేశీయ ఇన్వెస్టర్లు చిన్న కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తుంటే.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెద్ద కంపెనీలు, సూచీల్లో ఎక్కువ వెయిటేజీ ఉన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆండ్రడే తెలిపారు. ‘‘ఈ ఏడాది డిఫెన్స్, రియాలిటీ, ఆటో, ప్రభుత్వరంగ, ఫార్మా కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. నూతనతరం (న్యూఏజ్) వ్యాపార కంపెనీలు అయితే డార్క్‌హార్స్‌గా నిలుస్తాయి. ఫైనాన్షియల్స్, ఐటీ, తయారీ, ప్రభుత్వరంగ సంస్థలు, హెల్త్‌కేర్ థీమ్‌లు సైతం ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతాయి’’ అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా అభిప్రాయపడ్డారు. 2022 ఈక్విటీలకు అనుకూలంగా లేని విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. 2022, 2023 రెండు సంవత్సరాలకు కలిపి చూస్తే సెన్సెక్స్ ఇచి్చన నికర వార్షిక రాబడి 11.5 శాతమే. మార్కెట్ల వ్యాల్యూషన్లు కొంచెం గరిష్ట స్థాయికి చేరినందున ఇన్వెస్టర్లు వైవిధ్యంతో అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడ్, లార్జ్‌క్యాప్ కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వొచ్చని, అధిక రుణభారంతో నడిచే కంపెనీలకు దూరంగా ఉండాలని మురుగన్ సూచించారు. రియల్ ఎస్టేట్ దశాబ్ద కాలం పాటు రియల్ ఎస్టేట్‌లో డిమాండ్ పెద్దగా పెరగలేదు. కరోనా మహమ్మారి తర్వాత నుంచి డిమాండ్ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. వచ్చే ఐదు, పదేళ్ల పాటు రియల్ ఎస్టేట్ మెరుగైన పనితీరు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నిపుణులు, విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుకు అనుగుణంగా ఈ రంగంలోకి పెట్టుబడులు వస్తాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ, భౌతిక రియల్ ఎస్టేట్ అన్నది భారీ పెట్టుబడికి సంబంధించిన అంశం. అధిక ఆర్జన కలిగిన వర్గానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ‘‘పెట్టుబడి పరంగా రియల్ ఎస్టేట్ అన్నది క్లిష్టమైన, లిక్విడిటీ పెద్దగా లేని సాధనం. వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలని అనుకున్నా, రిస్‌్కలు కూడా లేకపోలేదు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి’’అని హర్ష గెహ్లాట్ సూచించారు. వాణిజ్య రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అందుకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ అయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లను పరిశీలించొచ్చు. బంగారం దీర్ఘకాలంలో (10–15 ఏళ్లు అంతకంటే ఎక్కువ) బంగారం ద్రవ్యోల్బణానికి మించి రాబడులను ఇస్తున్నట్టు ఫండ్స్ ఇండియా రిపోర్ట్ చెబుతోంది. చారిత్రక గణాంకాలను పరిశీలించినా ఇదే విషయం తెలుస్తుంది. దీర్ఘకాలంలో బంగారంపై రాబడి ద్రవ్యోల్బణం కంటే 2–4 శాతం అధికంగా ఉంటోంది. స్వల్పకాలానికి ఇది అనుకూలమైన సాధనం కాదు. అదే పనిగా స్థిరమైన రాబడులను అన్ని కాలాల్లోనూ బంగారం నుంచి ఆశించరాదు. మధ్య మధ్యలో బంగారం కొన్నేళ్లపాటు ఎలాంటి రాబడులు లేకుండా కొనసాగుతందని చెప్పడానికి గత ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దీర్ఘకాలం కోసం ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల పెట్టుబడుల్లో వైవిధ్యానికి తోడు, అనిశి్చత సమయాల్లో, ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్ సాధనంగా ఉపకరిస్తుంది. ‘‘భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ యుద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం ఇవన్నీ బంగారంలో పెట్టుబడికి బలమైన నేపథ్యాలుగా చూడొచ్చు. రాబడులు అధిక స్థాయిలో లేకపోయినా, మరే ఇతర సాధనంలో లేనంతగా పెట్టుబడుల భద్రతకు బంగారం భరోసానిస్తుంది. రిస్‌్కలను ఎదుర్కొనేందుకు వీలుగా పోర్ట్‌ఫోలియోలో కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది’’అని ఫిన్‌ఎడ్జ్ సీఈవో హర్ష గెహ్లాట్ సూచించారు. బంగారానికి అనుకూలించే ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్‌లు సైతం బంగారాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నాయి. డాలర్ నుంచి వైవిధ్యం కోరుకోవడం కూడా బంగారానికి మద్దతునిచ్చే అంశం. సెంట్రల్ బ్యాంక్‌ల నుంచి బంగారానికి డిమాండ్ ఉండడం 2023లో ధరలకు మద్దతునిచి్చందని, 2024లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందని అంచనా. భారత్, చైనా బంగారం కొనుగోళ్లలో రెండు అతిపెద్ద దేశాలు కాగా, వీటి నుంచి ఈ ఏడాదీ కొనుగోళ్లకు డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా మన దేశం బలమైన ఆర్థిక వృద్ధి నమోదు చేస్తున్న క్రమంలో బంగారానికి డిమాండ్ పెరుగుతుందన్న అంచనా కూడా ఉంది. అయితే బంగారానికి ఎంత శాతం పెట్టుబడి కేటాయించుకోవాలన్న సందేహం ఏర్పడొచ్చు. ‘‘పెట్టుబడులకు బంగారాన్ని వైవిధ్య సాధనంగా చూడొచ్చు. అదే సమయంలో బంగారంపై పరిమితికి మించి చేసే పెట్టుబడులతో ప్రతికూల ఉత్పాదకత కూడా ఎదురుకావచ్చు. కనుక ఇన్వెస్టర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతానికి మించకుండా బంగారానికి కేటాయించుకోవచ్చు’’అని నిపుణుల సూచన. వేటికి ఏ మేరకు.. వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే విధంగా ఒక్కో సాధనానికి ఎంత మేరకు కేటాయింపులు చేయాలన్నదీ కీలకమే. ఇన్వెస్టర్ వయసు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, పెట్టుబడుల కాల వ్యవధి, పెట్టుబడుల వెనుక ఉన్న లక్ష్యం ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణ నియమం ప్రకారం.. ఐదేళ్లు అంతకుమించి ఎక్కువ కాలం పాటు తన పెట్టుబడులు కొనసాగించే వెసులుబాటు ఉండి, అధికంగా వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈక్విటీ ఫండ్స్ మొదటి ఆప్షన్ అవుతుంది. ఫండ్స్ బలమైన నియంత్రణల మధ్య, తక్కువ వ్యయాలు, చక్కని వైవిధ్యంతో, తగినంత లిక్విడిటీతో, నిపుణుల ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయని, ఇన్వెస్టర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చని గెహ్లాట్ సూచించారు. రిస్క్ నివారణకు ఈక్విటీల్లో దీర్ఘకాలానికి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఐదేళ్లకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేసే వారు ఈక్విటీలకు మొత్తం పెట్టుబడుల్లో 70–80% వరకు, డెట్‌కు 15–20% వరకు, బంగారానికి 5–10% మధ్య కేటాయింపులు చేసుకోవచ్చు. ఒకవేళ పదేళ్లు అంతకుమించి అయితే ఈక్విటీలకు 80–90%, డెట్‌కు 5–10%, బంగారానికి 5–10% వరకు కేటాయించుకోవచ్చు. పదేళ్లకు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే 20% వరకు కేటాయింపులు చేసుకోవచ్చన్నది సూచన. అప్పుడు డెట్ కేటాయింపులను రియల్ ఎస్టేట్‌కు మళ్లించుకోవచ్చు. డెట్ సాధనాలు.. డెట్ (స్థిరాదాయ) విభాగంలో పెట్టుబడులకు ఈ ఏడాది అనుకూలమేనని విశ్లేషకుల అభిప్రాయం. ‘‘2023–24 వృద్ధి అంచనాలను ఆర్బీఐ అర శాతం పెంచి 7 శాతం చేసింది. 2024లో కనీసం మూడు పర్యాయాలు రేట్ల కోత ఉంటుందని యూఎస్ ఫెడ్ సంకేతాలు ఇచి్చంది. వడ్డీ రేట్ల కోతతో బాండ్ ధరలు పెరుగుతాయి. ఇది బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి అనుకూలం’’అని రీసెర్చ్ అండ్ ర్యాంకింగ్ సీఐవో జ్రస్పీత్ సింగ్ అరోరా పేర్కొన్నారు. ‘‘2024–25లో జీడీపీ 6 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి నమోదు చేస్తుంది. అదే కాలంలో సగటు ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉండొచ్చు. గడిచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం 6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కనుక 2024–25 ద్వితీయ ఆరు నెలల్లో ఆర్బీఐ రేట్ల కోత చేపట్టొచ్చు. ఆ నిర్ణయం పదేళ్ల భారత ప్రభుత్వ బాండ్ల (ఐజీబీ)కు అనుకూలిస్తుంది. భారత ప్రభుత్వ దీర్ఘకాలిక బాండ్లలో ఉన్న వారు రేట్ల కోత ప్రయోజనాలు పొందుతారు’’అని ఎడెల్వీజ్ అస్సెట్ మేనేజ్మెంట్ ఫిక్స్డ్ ఇన్కమ్ సీఐవో దావల్ దలాల్ తెలిపారు. 10 ఏళ్ల ఐజీబీ ప్రస్తుతమున్న 7.17 స్థాయి నుంచి 2025 మార్చి నాటికి 6.75 శాతానికి దిగొస్తుందని దలాల్ అంచనా వేస్తున్నారు. ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్టర్లు క్రమంగా వ్యవధి పెంచుకోవాలని, ఐజీబీలను జోడించుకోవాలని సూచించారు. స్వల్ప కాలానికి కార్పొరేట్ సంస్థలు షార్ట్‌డ్యురేషన్ బాండ్ల జారీకి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిపై ఈల్డ్స్ పెరగొచ్చని.. ఇన్వెస్టర్లు దీర్ఘకాల బాండ్లలో ప్రస్తుతమున్న అధిక రేట్లపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తారని దలాల్ అంచనా వేశారు. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం అన్ని రకాల డెట్ సాధనాలపై ఇప్పుడు కాల వ్యవధితో సంబంధం లేకుండా ఒకటే పన్ను విధానం ఉండడాన్ని మర్చిపోకూడదు. డెట్ సాధనాలపై వచ్చే ఆదాయం వ్యక్తుల వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారి ఆదాయ శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మెరుగైన రాబడులు ఇచ్చే డెట్ సాధనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది నిపుణుల సూచన. మీడియం డ్యురేషన్‌తో కూడిన డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో ఒకటి. వడ్డీ రేట్లు గరిష్టాల్లో ఉన్నందున ఈ సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా పరిశీలించొచ్చు. ఎఫ్డీలు, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ సహజంగా తక్కువ. -
కేడర్ వివాదం కేసు.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేత
హైదరాబాద్, సాక్షి: ఏడేళ్లుగా సాగుతున్న.. ఏపీ-తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ వివాదం కేసును ముగించింది ఎట్టకేలకు ముగించింది తెలంగాణ హైకోర్టు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్- క్యాట్(Central Administrative Tribunal) తీర్పును ఉన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. ప్రత్యూష సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకే కేడర్ కేటాయింపు ఉండాలన్న కేంద్రం వాదనతో ఏకీభవించిన కోర్టు.. మరోవైపు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని తన తీర్పులో స్పష్టం చేసింది. తాజా తీర్పులో.. ఏడేళ్ల కిందటి నాటి క్యాట్ తీర్పును కొట్టేయడంతో పాటుగా డీవోపీటీకి ఐఏఎస్, ఐపీఎస్‌లు తమ అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కల్పించింది తెలంగాణ హైకోర్టు. అలాగే.. అధికారుల సీనియారిటీ, స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. అప్పటివరకు ఇప్పుడున్న రాష్ట్రాల్లోనే విధులు కొనసాగించాలని ఆదేశించింది. ‘‘ఈ 13 మంది బ్యూరో క్రాట్ లు క్యాడర్ కేటాయింపు అంశంపై కేంద్రాన్ని అభ్యర్థించాలి. అధికారులు 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకోవాలి. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను కేంద్రం విడివిడిగా వినాలి. అధికారులు అవసరమైతే లీగల్‌గా ముందుకు వెళ్లొచ్చు. అధికారుల కేటాయింపుకు క్యాట్ లు ఎలాంటి హక్కు లేదు. బ్యూరో క్రాట్ ల కేటాయింపు కేవలం డీవోపీటీ పరిధిలో అంశమే’’ అని తీర్పు సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. వివాదం ఏంటంటే.. రాష్ట్ర విభజన సమయంలో 14 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది కేంద్రం పరిధిలోని డీవోపీటీ( Department of Personnel and Training). అయితే.. ఆ ఉత్తర్వుల్ని క్యాట్ కొట్టేసింది. తన కేటాయింపులు పక్కనపెట్టి మరీ క్యాట్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ 2016లో డీవోపీటీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన పరిధి దాటి బ్యూరోక్రాట్ లపై క్యాట్ ఉత్తర్వులు జారీ చేసిందని వాదిస్తూ వచ్చింది. 2016 నుండి హైకోర్టు లో ఈ వివాదంపై విచారణ కొనసాగుతుండగా.. ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కేటాయింపుల పై తుది వాదనలు ముగిశాయి. ఈ మధ్యలో కేడర్ కేటాయింపు అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కు పంపుతామని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే.. సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ గత ఏడాది హైకోర్ట్ ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో.. మిగిలిన 13 మంది అధికారుల క్యాడేర్ కేటాయింపు పై తుది వాదనలు ఇవాళ జరిగాయి. -
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్‌తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్‌లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్‌కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్‌ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్‌కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్‌ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్‌కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్‌కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్‌లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
Union Budget: తెలుగు రాష్ట్రాల్లోని సంస్థలకు కేటాయింపులు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్-2023ను పార్లమెంట్లో బుధవారం ప్రవేశపెట్టారు. అయితే, విభజన చట్టం హామీల విషయంలో కేంద్రం నిరాశ కలిగించింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కాగా, బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. ►తెలుగురాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు ►ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు ►ఏపీ పెట్రోలియం వర్శిటీకి రూ.168 కోట్లు ►విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.683 కోట్లు ►సింగరేణికి రూ.1650 కోట్లు ►ఐఐటీ హైదరాబాద్‌కు ఈఏపీ కింద రూ.300 కోట్లు కేటాయింపు ►మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు ►సాలర్ జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ.357 కోట్లు ►మణుగూరు, కోట భారజల కర్మాగాలకు రూ.1,473 కోట్లు ►కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లు ►కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ.21,470 కోట్లు చదవండి: వేతన జీవులకు ఊరట, శ్లాబుల్లో మార్పులు ఆదాయ పన్ను విషయానికొస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వేతన జీవులకు ఊరట కల్పించారు. పన్ను పరిమితిని రూ.5 లక్షలనుంచి 7 లక్షలకు పెంచారు. అలాగే ఉద్యోగుల పన్ను శ్లాబులను ప్రస్తుతం 6 నుంచి 5 కు తగ్గించారు. అయితే ఆదాయం రూ.7 లక్షలు దాటితే మాత్రం పన్ను రూ.3 లక్షల నుంచే మొదలవుతుంది. -
యూనియన్‌బడ్జెట్23: రైల్వేలకు భారీ కేటాయింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023-24లో రైల్వేలకు భారీ కేటాయింపులను చేస్తున్నట్టు ప్రకటించారు. రైల్వేల కోసం రూ. 2.4 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు. ఇది దాదాపు పదేళ్లలో అత్యధికం, గత సంవత్సరం బడ్జెట్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని ఆమె ఈ సందర్భంగా చెప్పనారు. అంతేకాదు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దేశాన్ని పరిపాలించిన సంవత్సరంతో పోల్చుతే ఇది 2013-14లో చేసిన వ్యయం కంటే దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ అంటూ ఆర్థికమంత్రి నొక్కిచెప్పారు. క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల కోసం ఆమె రూ. 75,000 కోట్లను కూడా ప్రకటించింది, ఇది రైల్వేలకు కూడా ప్రత్యేకంగా దాని సరుకు రవాణా వ్యాపారంలో సహాయపడే అవకాశం ఉందన్నారు. -
చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్‌కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా. 10-15 శాతం పెరగనున్న కేటాయింపులు ఈ బడ్జెట్లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలపై దృష్టి దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్‌ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది. -
రైల్వే బడ్జెట్ 2023: వందే భారత్ రైళ్లు, కేటాయింపులు, సామాన్యుడికి ఊరట!?
న్యూఢిల్లీ: 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కీలకమైన హల్వా వేడుక ముగిసింది. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు, వేతన జీవులతో పాటు ఆర్థిక నిపుణులు,పెట్టుబడిదారులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రైల్వేకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఇదే బడ్జెట్లో చేయనున్నారు. ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ , మిజోరం మినహా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈశాన్య రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోడీ సర్కార్ రైల్వే కేటాయింపులపై మరింత ఉత్కంఠ నెలకొంది. రైల్వే బడ్జెట్ ఒకపుడు విడిగా 2017 వరకు కూడా రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో కాకుండా విడిగా ప్రవేశపెట్టేవారు. 1924లో తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.దేశంలో రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం నాటి బ్రిటిష్ పాలకులు రైల్వేకు ఎక్కువ నిధులు కేటాయించేది అప్పటి ప్రభుత్వం. ఇది సరకు రవాణాకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆ తరువాతి కాలంలో ఏర్పాటైన రైల్వే వ్యవస్థ జాతీయంపై 1920లో 10 మంది సభ్యుల సర్ విలియం అక్వర్త్ కమిటీ రైల్వే వ్యవస్థను సంఘటితం చేయాలని సూచించింది. అందుకోసం ప్రత్యేకంగా రైల్వేకు నిధులు కేటాయించాలని బ్రిటిష్ పాలకులకు సిఫార్సు చేసింది, దీనికి ఆమోదం లభించడంతో 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ని ప్రభుత్వం విడిగా ప్రవేశపెడుతోంది. దాదాపు 93 ఏళ్ల పాటు రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టే సాంప్రదాయం కొనసాగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి టర్మ్‌లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపింది 2017లో తొలిసారిగా వార్షిక బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్‌ను ప్రకటించారు. అయితే తాజా బడ్జెట్లో కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు,కేటాయింపులపై తదితర విషయాలపై భారీ ఆసక్తి నింపుతోంది. ఈ ఏడాది బడ్జెట్లో వందే భారత్ రైళ్లు, బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడేళ్లలో 400 సెమీ హైస్పీడ్, నెక్స్ట్ జనరేషన్ వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించినట్లు గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజా సమాచారం మేరకు కేంద్రం ఈసారి రైల్వే బడ్జెట్ ను పెంచబోతోంది. అలాగేప్రీ బడ్జెట్ మీటింగ్ రైల్వే బోర్డు తమకు 25 నుంచి 30 శాతం వరకూ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేసింది. ఈక్రమంలో రైల్వేలకు కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో రూ. 1.4 లక్షల కోట్లుగా ఉండగా అది 2023-2024 ఆర్థిక సంవత్సరానికి 30 శాతం పెంచి రూ. 1.9 లక్షల కోట్లు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.45 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండీచర్‌తో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం మూలధన వ్యయం రూ. 3 ట్రిలియన్లకు అంటే 20 శాతానికి పైగా పెరుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ బడ్జెట్లో నూతన రైల్వే లైన్లను ప్రతిపాదనతోపాటు, ఆయా రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థలను మెరుగు పరిచేందుకుప్రాధాన్యత ఇవ్వనుంది. అంచనాలు 2023 బడ్జెట్ కేటాయింపుల్లో వేగవంతమైన రైళ్లకు అనుగుణంగా ట్రాక్స్ అప్‌గగ్రేడేషన్‌పై దృష్టి సారించాలని రైల్వే నిపుణులు చెబుతున్నారు. అధికంగా నిధులు, ముఖ్యంగా కొత్త లైన్ల నిర్మాణం, లైన్ల గేజ్‌లు మార్పు, ఎలక్ట్రిఫికేషన్ చేయడం, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం లాంటివాటిపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ►డిసెంబర్ 2023 నాటికి బ్రాడ్ గేజ్ రైల్వేల 100 శాతం విద్యుదీకరణ పూర్తి. ►మెట్రో రైల్వే వ్యవస్థను టైర్-2 నగరాలు , టైర్-1 నగరాల వెలుపలి ప్రాంతాలలో అభివృద్ధి ►తద్వారా భారతీయ రైల్వేలు 2030 నాటికి ప్రపంచంలోనే తొలి100 శాతం గ్రీన్ రైల్వే సర్వీస్‌గా అవిష్కారం ► హైపర్‌లూప్ టెక్నాలజీని అవలంబిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. ► దీనితో పాటు సామాన్యులకు ఊరటనిచ్చేలా ప్రాథమిక సౌకర్యాలపై భారీ ప్రకటన రానుందని అంచనా. ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4000 కి.మీ పొడవు లైన్ వేయడం ఉద్దేశ్యం ►రాబోయే రైల్వే బడ్జెట్లో 7,000 కి.మీ బ్రాడ్ గేజ్ లైన్ విద్యుదీకరణప్రకటన ► రైల్వే విజన్ 2024 ప్రాజెక్ట్ కింద, కొత్త ప్రత్యేక ఫ్రైట్ కారిడార్లు హై-స్పీడ్ ప్యాసింజర్ కారిడార్లను పరిచయం చేయడంతో పాటు, రద్దీ మార్గాల్లో మల్టీట్రాకింగ్ , సిగ్నలింగ్ అప్‌గ్రేడ్స్ లక్క్ష్యం. ► కోవిడ్ సమయంలో తొలగించిన రైల్వేలో సీనియర్ సిటిజన్ల కుల్పిస్తున్న 50 శాతం రాయితీని పునరుద్ధించాలని కూడా పలువురు కోరుతున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్పెక్ట్రం కేటాయింపు ప్రక్రియ వేగవంతం
న్యూఢిల్లీ: 5జీ వేలంలో పాల్గొన్న కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు 12 కల్లా కేటాయించే దిశగా ప్రభుత్వం వేగంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కార్యదర్శుల కమిటీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. (Zomato: జొమాటోకు మరో ఎదురు దెబ్బ) అలాగే, స్పెక్ట్రం సమన్వయ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వివరించారు. దీని కింద ఒక్కో సంస్థకు ఒక్కో బ్యాండ్‌లో విడివిడిగా ఉన్న స్పెక్ట్రంను ఒక్క చోటికి చేరుస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పట్టేస్తుంది. కానీ దీన్ని ఈసారి ఒక్క రోజులోనే పూర్తి చేయగలిగినట్లు వైష్ణవ్ చెప్పారు. టెల్కోలు మరింత సమర్థమంతంగా సేవలు అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడగలదని ఆయన తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 1 వరకూ కొనసాగిన 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైన సంగతి తెలిసిందే. 10 బ్యాండ్స్‌లో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా 51,236 మెగాహెట్జ్ స్పెక్ట్రం (సుమారు 71 శాతం) అమ్ముడైంది. విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో దాదాపు సగభాగాన్ని రిలయన్స్ జియో రూ. 88,078 కోట్ల బిడ్లతో దక్కించుకుంది. (చదవండి: అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త) -
‘ఉపాధి హామీ’ని మెరుగుపరచాలి!
‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు 100 రోజుల పని దినాలను కల్పించే లక్ష్యంతో అమల్లోకి వచ్చింది. యంత్రాలు వినియోగించ కుండా, కాంట్రాక్టర్లతో పనులు చేయించకుండా పూర్తిగా ప్రజల తోనే పనులు చేయించేందుకు ఈ పథకాన్ని నిర్దేశించారు. 2005లో పదవ పంచవర్ష ప్రణాళిక అమలు సందర్భంగా పీవీ నరసింహారావు ప్రభుత్వం చట్టపరంగా ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లా బండ్లపల్లిలో 2006 ఫిబ్రవరి 2న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభమయింది. ఉపాధిహామీ చట్టం 2005 ప్రకారం...18 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఒక క్యాలెండర్ సంవత్సరంలో వంద రోజుల పాటు ప్రభుత్వం పని కల్పించాలి. పనిచేస్తామని దరఖాస్తు చేసుకున్న వారం దరికీ జాబ్ కార్డులు ఇవ్వాలి. వికలాంగులు, అంతరించిపోతున్న ఆదివాసి జాతులకు ప్రత్యేకంగా జాబ్ కార్డు ఇచ్చి, రెండు వారాలలోపు కచ్చితంగా పని కల్పించాలి. పని కోరినవారందరికీ పనులు చూపించాలి. పనిస్థలాలలో నీడ ఏర్పాటు చేయాలి. కార్మికులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలి. కార్మికులకు పనికి అవ సరమైన సామగ్రిని ప్రభుత్వమే కార్మికులకు ఇవ్వాలి. ఉపాధి హామీ కార్మికులు చేసిన పనికి ఏ రోజుకారోజు కొలతలు తీసుకోవాలి. పదిహేను రోజులకు ఒకసారి వేతనాలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి. ఆ 15 రోజులు చేసిన పనికి రోజువారీ వేతనం ఎంత పడిందో వేతన రశీదు(పే స్లిప్)ను ముందే కార్మికులకు ఇవ్వాలి. చట్టప్రకారం ఉపాధి హామీ కార్మికుడు మరణిస్తే లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియా, అంగ వైకల్యం పొందితే 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. అయితే ఈ చట్టాన్ని అమలు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. అర్హత గలవారు పనికావాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి జాబ్‌కార్డ్ ఇవ్వడంలేదు. దేశవ్యాప్తంగా 50 కోట్ల మంది జాబ్ కార్డుకు అర్హత కలిగి ఉన్నప్పటికీ 13 కోట్ల మందికి మాత్రమే జాబ్ కార్డులు ఇచ్చారు. వందరోజుల పని కల్పిం చకుండా 50 నుండి 75 రోజుల పాటే పనులు కల్పిస్తున్నారు. ఈ పథకం అమలుకు ప్రత్యేక యంత్రాంగం లేదు. చాలా చోట్ల కూలీలకు నీడ కల్పించడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో వేతనాలు, సౌకర్యాల కోసం ఆందోళన చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కేసీఆర్ ప్రభుత్వం తొలగించడంతో జరిగిన పనిని రోజూ కొలతలు, లెక్కలు వేయడంలేదు. పదిహేను రోజులకు ఇవ్వ వలసిన వేతనాలు 12 వారాలు దాటినా ఇవ్వడంలేదు. ఉపాధిహామీ పనులకు కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్రం కేటాయింపులు బడ్జెట్లో 4 శాతం నుండి 1.5 శాతానికి క్రమంగా తగ్గించారు. 2021లో మోదీ ప్రభుత్వం ఉపాధి హామీపనులకు బడ్జెట్ కేటాయింపులు పెద్ద మొత్తంలో తగ్గించటమే కాకుండా చట్టంలో సవరణలు చేసింది. పనిచేసిన కార్మికులందరికీ ఒకే దఫా వేతనాలు ఇప్పటి వరకు ఖాతాలలో వేసేవారు. చట్ట సవరణ తర్వాత ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వేరువేరుగా వేతనాలు వేస్తున్నారు. ఇది కలిసిమెలిసి ఉండే కార్మికుల మధ్య కులాల పేర, మతాలపేర చిచ్చుపెట్టి వారి ఐక్యతను దెబ్బతీయాలనే కుట్రలో భాగమే అనుకోవాలి! (క్లిక్: అభివృద్ధి పేరుతో భూ వ్యాపారమా?) దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకం వల్ల ఎంతో కొంత ప్రయోజనం కలుగుతోంది. ఈ పథకం కింద పనిచేస్తున్నవారిని కూలీలుగా చూడకుండా కార్మికులుగా గుర్తించాలి. నైపుణ్యతలేని (అన్ స్కిల్డ్) కార్మికులకు కేంద్ర ప్రభుత్వ వేతనాల జీఓ ప్రకారం వేతనాలు చెల్లించాలి. సమస్యల పరిష్కారానికై కార్మికవర్గం ఐక్యంగా పోరాడాలి. (క్లిక్: నల్ల చట్టానికి అమృతోత్సవాలా?) – జె. సీతారామయ్య ఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు -
తిండి పెట్టిన వాళ్లకే మొండి చెయ్యి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే చర్యలు బొత్తిగా లేకపోవడం దేశ ప్రజల్ని నిశ్చేష్టుల్ని చేసింది. కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకొన్నది వ్యవసాయ రంగమే. ఈ వాస్తవాన్ని కేంద్రం ఎందుకు విస్మరించిందో అర్థం కాదు. కరోనా దెబ్బకు మిగతా రంగాలు చతికిల పడ్డాయి. రెండేళ్లు దాటినా నేటికీ పలు రంగాలు కోలుకోలేదు. కానీ, వ్యవసాయరంగం మాత్రం యావత్ దేశాన్ని ఆదుకొంది. ప్రజలకు కష్టకాలంలో పట్టెడన్నం పెట్టింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది. తల్లిలా అందర్నీ ఆదుకొన్న వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో మరింత ఊతం ఇచ్చే చర్యలు ఉంటాయని వేసుకున్న అంచనాలు పూర్తిగా తారు మారయ్యాయి. బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 2021–22లో కేటాయించిన 3.92% నిధులను ఈసారి (2022–23) 3.84%కు కుదించడం శోచనీయం. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చడం, స్టార్టప్‌లపై దృష్టి పెంచడం ఆహ్వానించదగిన చర్యలే. కానీ, కీలకమైన మార్పులు చేయకుండా అరకొర చర్యలతో సరిపెడితే ఉపయోగం ఏముంటుంది? ఆశించిన ఫలితాలెలా వస్తాయి? వరి, గోధుమల సేకరణకు కనీస మద్దతు ధరలు అందించ డంతో పాటు అన్ని పంటలకు కూడా రైతు సంఘాలు కోరినట్లుగా చట్టబద్దమైన మద్దతు ధరలు అందించడానికి బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచి ఉండాల్సింది. ఇప్పటివరకు మొత్తం ఆహార ధాన్యాలలో కేంద్రం సేక రించింది 35 శాతమే. ఒక అంచనా ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలోని రైతాంగం వద్ద 65 శాతం ఆహారధాన్యాలను కేంద్రం కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, కేంద్రం వైఖరి చూస్తోంటే... వరి, గోధుమ మినహా మిగతా పంటలను ప్రైవేటు వ్యాపారులకే అప్పజెప్పేటట్లు కనిపిస్తోంది. ఇక, దేశంలో తృణ ధాన్యాల వాడకం పెరిగిన నేపథ్యంలో 2023వ సంవత్సరాన్ని ‘తృణ ధాన్యాల సంవత్సరం’గా ప్రకటించడాన్ని ఆహ్వానించాల్సిందే. రైతాంగానికి లాభసాటి ధరలు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ పంటలపై మరిన్ని పరిశోధనలు చేపట్టడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటా యించాలని ఎప్పటినుంచో డిమాండ్లు ఉన్నప్పటికీ... ఈ బడ్జె ట్లో కూడా వాటికి నిధులు కేటాయించలేదు. 2022–23ను కేవలం తృణధాన్యాల సంవత్సరంగా నామకరణం చేయడం వల్ల రైతులకు ఒరిగే లాభమేమిటి? ఇక, రసాయనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడానికి ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగును ప్రోత్సహిస్తామని బడ్జెట్లో పేర్కొన్నప్పటికీ అందుకు నిర్దిష్టమైన ప్రతిపాదనలు బడ్జెట్లో కనపడటంలేదు. స్వయంగా ప్రధానమంత్రి ప్రతి పాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సాహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో అనాలోచిత చర్య. ఉదాహరణకు ‘పరం పరాగత్ కృషి యోజన’ను ‘రాష్ట్రీయ కృషి యోజన’లో విలీనం చేశారు. మొత్తం 27 పథకాలను 7 పథకాలుగా మార్చారు. సహకార రంగానికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పి... దేశంలో విశిష్ట చరిత్ర, ప్రాముఖ్యం ఉన్న పాల ఉత్పత్తి సహకార సంఘాలకు ఇస్తున్న కొన్ని రాయితీలను ఎత్తేయడానికి ఏకంగా పథకాలనే రద్దు చేయడం శోచనీయం. మూడునాలుగేళ్ల క్రితం ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పథకంగా అభివర్ణించిన ఫసల్ బీమా పథకం అసలు ఉన్నదో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పథకంలో మార్పులు తెచ్చి రైతులకు ప్రయోజనం కలిగేలా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఈ బడ్జెట్లో నిరాశ కలిగించిన మరో ప్రధానమైన అంశం రైతులకు స్వల్పకాలిక రుణాలపై ఇచ్చే రాయితీ గురించిన ప్రస్తావన లేకపోవడం! ‘మార్పు చేసిన వడ్డీ రాయితీ పథకం’ అంటూ ఓ కొత్త పథకం ప్రవేశపెడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఈ పథకం విధివిధానాలేమిటో భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రైతులు, రైతాంగ సంస్థలు జాతీయ స్థాయిలో ఏడాదిపాటు ఉద్యమించి కేంద్రం మెడలు వంచి మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకొనేలా చేసినందుకు గాను వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్య తీసుకొన్నట్లుగా ఉందిగానీ, సానుకూల ప్రోత్సాహకాలు కనిపించటంలేదు. రైతులు ఏం పాపం చేశారు? కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి తిండి గింజలు పండించి దేశ ప్రజల ఆకలి తీర్చడమేనా? వ్యవసాయ సంక్షోభాన్ని నివారించి రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఈ కేంద్ర బడ్జెట్ లేదు. అయితే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి కొన్ని రాష్ట్రాలు రైతులను ఆదుకోవడానికి చేపట్టిన ప్రోత్సాహ కాలే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాయి అనే విషయం కాదన లేని వాస్తవం. కేంద్ర సహకారం తోడై ఉంటే పరిస్థితి మరింత మెరుగై ఉండేది. వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఏపీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి అన్యాయం చేసింది. కరోనాకు ఎదురునిలిచి రైతన్న దేశానికి తిండిపెట్టాడు. అటువంటి మెతుకు దాతకు బడ్జెట్ నిరాశను మిగిల్చింది. వ్యవసాయం, అను బంధ రంగాలకు నిధులను కుదించడం శోచనీయం. స్వయంగా ప్రధాని ప్రతిపాదించిన పథకాలకు బడ్జెట్లో ప్రోత్సహకాలు లేకపోవడం బహుశా ఇదే ప్రథమం కావచ్చు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి వివిధ పథకాలను విలీనం ద్వారా కుదించడం మరో విమర్శనార్హమైన అంశం. డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు -
Union Budget 2022: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు )కు కేంద్రం బడ్జెట్లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.33.18 కోట్లు. చదవండిః చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం -
‘రాడ్‌టెప్’కు మరిన్ని నిధులు కేటాయించాలి
ఎగుమతిరంగం 2022–23 బడ్జెట్లో తమకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతోంది. రీయింబర్స్మెంట్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్పోర్ట్ ప్రొడక్షన్ (రాడ్‌టెప్) పథకానికి కేటాయింపులు పెంచాలని కోరింది. ప్లాస్టిక్ తుది ఉత్పత్తుల దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు సుంకాలు పెంచాలని.. దేశీ తోలు పరిశ్రమకు ప్రోత్సాహకంగా ముడి సరుకుల దిగుమతులకు సుంకాల మినహాయింపు కావాలని డిమాండ్ చేసింది. లాజిస్టిక్స్ సవాళ్లను పరిష్కరించేందుకు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాల అవసరాన్ని తెలియజేసింది. ఎంఎంస్ఎంఈలకు ప్రోత్సాహకంగా పార్ట్నర్షిప్ సంస్థలు, ఎల్ఎల్పీలపై పన్నును తగ్గించాలని బడ్జెట్ ప్రతిపాదనల కింద కేంద్ర ఆర్థిక శాఖకు భారతీయ ఎగుమతి దారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) సూచించింది. భారత్ కోసం ప్రత్యేకంగా షిప్పింగ్ లైన్‌ను ఏర్పాటు చేసేలా పెద్ద సంస్థలను ప్రోత్సహించాలని, అప్పుడు విదేశీ సంస్థలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. రవాణా వ్యయ భారం ‘‘ఎగుమతుల రంగం పెరిగిపోయిన రవాణా వ్యయాల రూపంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. విదేశీ మార్కెటింగ్ అన్నది పెద్ద సవాలుగా మారింది. ఎంఎస్ఎంఈలకు ఈ వ్యయ భారం మరితంగా ఉంటుంది. ఎగుమతిదారుల కోసం ద్వంద్వ పన్ను మినహాయింపు పథకం తీసుకురావాలి. కాకపోతే రూ.5 లక్షల వరకు పరిమితి ఇందులో విధించొచ్చు’’అని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్‌సహాయ్ తెలిపారు. ఎగుమతి మార్కెట్‌కు రాడ్‌టెప్ పథకం కీలకమైనదని, దీనికింద ప్రస్తుతం కేటాయింపులు రూ.40,000 కోట్లుగానే ఉన్నట్టు ముంబైకి చెందిన ఎగుమతిదారు, టెక్నో క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ శారదా కుమార్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి ఈ వాస్తవాన్ని గుర్తించి మరిన్ని కేటాయింపులు చేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. విదేశాల్లో తయారై దిగుమతి అయ్యే ప్లాస్టిక్ ఉత్పత్తులపై (ఫినిష్డ్ గూడ్స్) కనీసం 5 శాతం సుంకాన్ని విధించాలని ప్లాస్టిక్స్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి చైర్మన్ అరవింద్ గోయెంకా అభిప్రాయపడ్డారు. ‘‘ఉదాహరణకు పీవీసీ రెజిన్‌పై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. వ్యాల్యూ యాడెడ్ పీవీసీ ఉత్పత్తులపైనా ఇంతే మేర సుంకం అమల్లో ఉంది’’ అని వివరించారు. తోలు రంగానికి చేయూత.. తోలు వస్త్రాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల దిగుమతులపై పన్ను మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టాలని కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్‌పోర్ట్స్ (సీఎల్ఈ) చైర్మన్ సంజయ్‌లీఖ డిమాండ్ చేశారు. దీంతో ముడిసరుకుల ఆధారితంగా ఉత్పత్తులు దేశీయంగానే తయారయ్యే అవకాశాన్ని ఏర్పాటు కల్పించినట్టు అవుతుందన్నారు. ఫరీదా గ్రూపు చైర్మన్ రఫీఖ్ అహ్మద్ కూడా ఇదే మాదిరి అభిప్రాయాన్ని వ్యక్తం చేవారు. కార్మిక ఆధారిత తోలు రంగానికి ప్రోత్సాహంతో మరింత మందికి ఉపాధి లభిస్తుందన్నారు. -
కేంద్రం దృష్టికి కొత్త ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేలా చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనుంది. కృష్ణా జలాల విషయంలో సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయిన నేపథ్యం లో కొత్త ట్రిబ్యునల్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి, రాష్ట్రానికి న్యాయమైన నీటి హక్కులు దక్కేలా చూడాలని విన్నవించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నీటి వాటాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అందులో మరోమారు ప్రస్తావించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తొలిసారిగా 2014లోనే లేఖ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే 2014 జూలై 14న కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఒక లేఖ రాసింది. కృష్ణా జలాల కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, పంపకాల్లో అసమానతలను వివరిం చింది. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతం మేర మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటా యింపులు ఏమాత్రం సరిపోవు. మరోవైపు ఆంధ్ర ప్రదేశ్‌లో పరివాహకం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం మాత్రమే ఉన్నా మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎం సీలు, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారు. పరివాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలని ఆ లేఖలో పేర్కొంది. స్పందించని కేంద్రం రాష్ట్రం చేసిన అభ్యర్థనపై చట్ట ప్రకారం కేంద్రం ఏడాదిలోగా స్పందించాల్సి ఉన్నా ఉలుకూపలుకూ లేకపోవడంతో 2015లో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదిలావుండగా గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ సందర్భంగా ఈ అంశాన్ని మరోమారు లేవనెత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా జలాల పునఃపంపిణీపై కొత్త ట్రిబ్యునల్‌చే విచారణ చేయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణ డిమాండ్‌ను అంగీకరిస్తామంటూనే... సుప్రీం కోర్టులో తెలంగాణ పిటిషన్ వేసిఉన్న కారణంగా తాము ఎటువంటి చర్య తీసుకోలేక పోతున్నామన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం.. కేంద్రం గనుక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్టే పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామన్నారు. ఆ మేరకు రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు నాలుగు నెలల కిందట ప్రభుత్వం పిటిషన్ పెట్టుకుంది. సుప్రీం ఓకే చెప్పడంతో.. సుప్రీంకోర్టు బుధవారం ఉపసంహరణకు ఓకే చెప్పడంతో ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్రం నిర్ణయించింది. కొత్త ట్రిబ్యునల్‌ను త్వరగా ఏర్పాటు చేయడంతో పాటు నిర్దిష్ట కాలపరిమితితో తుదితీర్పు వెలువడేలా చూడాలని లేఖలో కోరే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి కేటాయింపులు 500 టీఎంసీలకు పెరగాల్సి ఉందన్న విషయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. చదవండి: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై -
ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ కేంద్రం కీలక నిర్ణయం..!
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగానికి ఊతం ఇస్తూ, మంగళవారం కేంద్రం (ఆర్ఓడీటీఈపీ – రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్టెడ్ ప్రొడక్ట్స్) పన్ను, సుంకాల రిఫండ్ పథకానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) రూ.12,454 కోట్లు కేటాయించింది. 8,555 ఉత్పత్తులకు వర్తించే విధంగా ఆర్‌ఓడీటీఈపీకి ఈ నిధులను కేటాయించింది. ఎగుమతి చేసిన ఉత్పత్తులపై విధించిన సుంకాలు, పన్నుల రిఫండ్‌కు ఉద్ధేశించిన ఈ పథకం కింద పన్ను రిఫండ్ రేట్లను కూడా కేంద్రం నోటిఫై చేసింది. వివిధ రంగాలకు సంబంధించి పన్ను రిఫండ్ రేట్లు 0.5 శాతం నుంచి 4.3 శాతం శ్రేణిలో ఉన్నాయి. విద్యుత్ చార్జీలపై సుంకాలు, రవాణా ఇంధనంపై వ్యాట్, వ్యవసాయం, సొంత అవసరాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉత్పత్తి, మండీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్‌పన్ను వంటి విభాగాల్లో రిఫండ్స్ జరుగుతాయి. రిఫండ్ జరిగే 8,555 ఉత్పత్తుల్లో సముద్ర ప్రాంత ఉత్పత్తులు, దారం, డెయిరీ ప్రొడక్టులు, వ్యవసాయం, తోలు, రత్నాలు–ఆభరణాలు, ఆటోమొబైల్, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనరీ ఉన్నాయి. ఈ పథకం కింద వివిధ ప్రొడక్టులపై విధించిన వివిధ కేంద్ర, రాష్ట్ర సుంకాలు, పన్నులు, లెవీలను ఎగుమతిదారులకు రిఫండ్ జరుగుతుంది. (చదవండి: Apple: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!) రెండు కీలక పథకాలకు రూ.19,400 కోట్లు ఆర్ఓడీటీఈపీతోపాటు, ఆర్ఓఎస్సీటీఎల్ (రిబేట్ ఆఫ్ స్టేట్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ లెవీస్) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.19,400 కోట్లు అందుబాటులో ఉంటాయని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. వస్త్రాలు, దుస్తుల ఎగుమతులపై రాయితీలకు సంబంధించిన ఆర్ఓఎస్సీటీఎల్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం కేటాయించిన రూ.19,400 కోట్ల నిధుల్లో రూ.12,454 కోట్లు ఆర్‌ఓడీటీఈపీకి ఉద్దేశించినదికాగా, మిగిలిన రూ. 6,946 కోట్లు ఆర్ఓఎస్సీటీఎల్కు కేటాయించినది. ఆర్ఓడీటీఈపీ స్కీమ్ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు 95 శాతం వస్తువులు, ఎగుమతులకు ఈ రెండు పథకాలు వర్తిస్తాయని సుబ్రమణ్యం తెలిపారు. స్టీల్, రసాయనాలు, ఔషధ రంగాలకు మాత్రం ఆర్ఓడీటీఈపీ పథకం వర్తించదని ఆయన తెలిపారు. ఎటువంటి ప్రోత్సాహకాలూ లేకుండా ఈ రంగాలు కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. భారత్ ఎగుమతులుకు ఈ పథకాలు ప్రతిష్టాత్మకమైనవని, అంతర్జాతీయ పోటీలో భారత్ ఉత్పత్తులు నిలదొక్కుకోడానికి ఈ పథకాలు దోహదపడతాయని వివరించారు. జౌళి ఎగుమతిదారులకు భరోసా కల్పిస్తూ కేంద్రం ఇటీవలే ఆర్ఓఎస్సీటీఎల్ స్కీమ్‌ను పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం, దుస్తుల ఎగుమతిదారులు 2024 మార్చి వరకూ తమ ఎగుమతులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పన్నులపై రాయితీలను పొందగలుగుతారు. ఈ స్కీమ్ కింద వస్త్రాలపై గరిష్టంగా 6.05 శాతం వరకూ రాయితీ అందుతుంది. రెడీమేడ్స్‌పై ఈ రేటు 8.2 శాతం వరకూ ఉంది. సానుకూల చర్య... అంతర్జాతీయంగా ఈ రంగంలో పోటీని ఎదుర్కొనడానికి ఎగుమతిదారులకు తాజా నిర్ణయం దోహదపడుతుందని వస్త్ర ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) చైర్మన్ ఏ శక్తివేల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, మియన్మార్, కాంబోడియా, శ్రీలంక వంటి దేశాల నుంచి పోటీని ఎగుమతిదారులు తట్టుకోగలుగుతారని వివరించారు. స్థిరమైన పన్ను రేట్ల వల్ల ఈ రంగంలోకి భారీ పెట్టుబడులు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరపాలన్న లక్ష్యంలో వేసిన తొలి అడుగుగా దీనిని అభివర్ణించారు. ఎగుమతుల పురోభివృద్ధికే కాకుండా ఈ రంగంలో స్టార్టప్స్ ఏర్పాటుకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు కూడా ఈ చర్య పరోక్షంగా దోహపడుతుందని విశ్లేషించారు. (చదవండి: ఐమాక్స్ వీడియో రికార్డింగ్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం...!) -
బడ్జెట్: శాఖల వారీగా కేటాయింపులు
న్యూఢిల్లీ: కరోనా కాలం తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడంతో దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసింది. బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలకు కేటాయింపులు అత్యధికంగా జరగడం ప్రధాన అంశం. ఇక మొత్తం బడ్జెట్‌ను పరిశీలిస్తే శాఖలవారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. ఈ బడ్జెట్లో యథావిధిగా అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయింపులు దక్కాయి. దాని తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ. (చదవండి: బడ్జెట్ 2021: చైనా దూకుడుకు చెక్) రూ.4.78 లక్షల కోట్లు రక్షణ రంగానికి కేటాయించారు. దీనిలో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19 శాతం పెరగడం గమనార్హం. ఈ విషయమై లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లలో రక్షణ రంగంలో ఈ స్థాయి మూల ధన వ్యయం లేదని తెలిపారు. ఇక అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు రూ. 2,56,948 కోట్లు కేటాయించారు. హోం మంత్రిత్వ శాఖ: రూ.1,66,547 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1,33,690 కోట్లు వ్యవసాయ, రైతుల సంక్షేమం: రూ.1,31,531 కోట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారులు : రూ.1,18,101 కోట్లు రైల్వేలు: రూ.1,10,055 కోట్లు విద్యా శాఖ : రూ.93,224 కోట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ : రూ.73,932 కోట్లు గృహ, పట్టణ వ్యవహారాల శాఖ : రూ.54,581 కోట్లు కొవిడ్ వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు కేటాయించడం విశేషం. స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన అనే కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకానికి తొలి కేటాయింపులు రూ.64,180 కోట్లు -
ఓ.. మై డాగ్!
సాక్షి, అమరావతి: కుక్కల్ని పెంచుకునే అలవాటు పూర్వం నుంచీ ఉన్నా.. గత కొన్నేళ్లుగా మరింత పెరుగుతోంది. ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొందరు శునకాలను పెంచుకుంటుండగా.. మరికొందరు అభిరుచిగా స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఇంటి బడ్జెట్లో కేటాయింపులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రధాన నగరాల్లో పశువుల కంటే పెంపుడు కుక్కల సంఖ్యే అధికంగా ఉండటం విశేషం. వాటికి సీమంతం, బారసాల, పుట్టిన రోజు, వర్ధంతులు, జయంతులు నిర్వహించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరణించిన శునకాలకు సమాధులు, అక్కడక్కడా వాటి విగ్రహాలు ప్రతిష్టించడం కూడా కనిపిస్తోంది. ► శునకాలను పెంచేవారు వారి స్థాయిని.. వాటి రకాన్ని బట్టి బడ్జెట్లో నెలవారీ, వార్షిక కేటాయింపులు చేస్తున్నారు. ► ఒక్కో శునకానికి అవి తినే ఆహారాన్ని బట్టి నెలకు రూ.వెయ్యి నుంచి నుంచి రూ.10 వేల వరకు వెచ్చిస్తున్నారు. ► కుక్క జాతిని బట్టి పోషణకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ► టీకాలు, ఇతర మందులు, వైద్యానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు అవుతుంది. ఏవైనా పెద్ద జబ్బులు చేస్తే ఇంకాస్త ఎక్కువే ఖర్చవుతోంది. ► కాపలాకు, పోలీస్ పనులకు, అంధులకు దారి చూపేందుకు, మత్తు మందుల జాడ తెలుసుకునేందుకు డాబర్మెన్ను ఉపయోగిస్తారు. ► కాపలాకు గ్రెడెన్, అల్సేషన్ వంటి 13 రకాలను వినియోగిస్తారు. యజమానికి తోడు కోసం పమేరియన్, డాషాండ్ వంటి 16 రకాల శునకాలను వినియోగిస్తారు. ► కాపలాకు, పోలీసు పనులకు, తప్పిపోయిన వారి జాడ కనుగొనేందుకు రాట్ వీలర్, బెల్జియన్ టెర్వురెన్ను.. దొంగలు, తప్పిపోయిన వారి జాడ తెలుసుకునేందుకు బ్లడ్ హౌండ్ అనే జాతిని ఉపయోగిస్తారు. ► వేటకు, రక్షణకు ఐరిష్ వాటర్ స్పానియాల్, బోర్డర్ టెరియర్, పాయింటర్, గ్రేహౌండ్, సాలూకి వంటి జాతులను, వాసన పసిగట్టేందుకు ఇంగ్లిష్ సెట్టర్‌ను వినియోగిస్తారు. 350 జాతులు ► ‘టోమార్క్ టాస్’ అనే చిన్నపాటి జంతువులు శునక జాతికి పూర్వీకులని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ► ప్రపంచవ్యాప్తంగా 350 జాతులను అభివృద్ధి చేశారు. వీటిని స్పోర్టింగ్, హౌండ్, వర్కింగ్, ట్రేయర్, టాయ్, నాన్ స్పోర్టింగ్, ఫిష్ హార్డింగ్ అనే 7 గ్రూపులుగా విభజించారు. వీటిలో 38 జాతులు మన దేశంలో ఉన్నాయి. ► పాయింటర్, ఇంగ్లిష్ సెట్టర్, లేబ్రడార్, ఐరిష్ వాటర్ స్పానియాల్, కాకర్ స్పానియాల్, గ్రేహౌండ్, ఆప్ఘన్ హౌండ్, సాలూకి, బ్లడ్ హౌండ్, డాషాండ్, మాస్టిఫ్, గ్రేట్ డెన్, డాబర్‌మెన్, బుల్ మాస్టిఫ్, రాట్ వీలర్, ఎయిర్ డేర్ టెరియర్, బుల్ టెరియర్, స్కాటిష్ టెరియర్, బోర్డర్ టెరియర్, నార్విచ్ టెరియర్, పగ్, పమేరియన్, పెకింగిస్, మాల్టిసి, చిహు అహువా, కిషాండ్, డాల్మేషియన్, బుల్ డాగ్, చౌచౌ, బోస్టన్ టెరియర్, బెల్జియన్ టెర్వురెన్, బోర్డర్ కూలీ, బ్రియార్డ్, రఫ్ కూలీ, అల్సేషియన్, బాక్సర్, గోల్డెన్ రిట్రైవర్, లసోప్సో వంటి విదేశీ కుక్క జాతులు మన దేశంలో ఉన్నాయి. ► రాజుపాళ్యం, చిట్టి తారి అనే స్థానిక జాతులూ ఉన్నాయి. -
వాస్తవిక బడ్జెట్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులకు తగ్గట్లు 2020–21కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సీనియర్ అధికారులతో గురువారం ప్రగతి భవన్లో రాత్రి 11:30 గంటల వరకు సుదీర్ఘ కసరత్తు చేశారు. రాష్ట్ర ఆదాయం, అవసరాలను బేరీజు వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన జరగాలని అధికారులకు సూచించారు. ఎప్పటిలాగే ఈ బడ్జెట్లో సైతం వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు చేయాలని కోరారు. కొత్త హామీల అమలుపై కసరత్తు... గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన వ్యవసాయ రుణాల మాఫీ, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు తదితర కార్యక్రమాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వ్యవసాయ రుణమాఫీకి ఏటా రూ. 6 వేల కోట్లు, వృద్ధాప్య పింఛన్లకు వయో అర్హతలను 57 ఏళ్లకు తగ్గిస్తే కొత్తగా అర్హత సాధించనున్న 8.5 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ఏటా రూ.2,500 కోట్లతో పాటు ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు అవసరమైన కేటాయింపులను సమీక్షించారు. వచ్చే బడ్జెట్లో ఈ మూడు హామీల అమలుకు నిధుల కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 10–12% పెరగనున్న కేటాయింపులు... గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రూ. 1.82 లక్షల కోట్ల అంచనాలతో 2019–20కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను రూ. 1.46 లక్షల కోట్లకు కుదించుకుంది. రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటుపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడటంతో ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను భారీగా కుదించుకోక తప్పలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతోపాటు 2020–21కి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను కేంద్రం రూ. 19,718 కోట్ల నుంచి రూ. 15,987 కోట్లకు తగ్గించింది. వాటి ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో కేవలం 10–12 శాతం వృద్ధితో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రూ. 1.60 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు నిర్వహించినట్లు తెలిసింది. దాదాపు 9.5 శాతానికిపైగా రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు ఉండగా మిగిలిన నిధులను కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా సమీకరించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఈ భూముల విక్రయం ద్వారా రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించనున్నామని ఈ బడ్జెట్లో మరోసారి ప్రతిపాదించబోతున్నారు. మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 6 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్చి 6 నుంచి నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేసే అంశంపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. మరో 2, 3 రోజులపాటు సీఎం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎంతో సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, ఆర్థిక సలహాదారు జీఆర్.రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు
సాక్షి, జిన్నారం(పటాన్చెరు): ఎట్టకేలకు కొన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 192 మంది ఉపాధ్యాయుల నియామకం పూర్తయింది. నియామక పత్రాలను జిల్లా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులకు అందించారు. దీంతో నూతనంగా ఎన్నికైన ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడంతోపాటు వారికి అన్ని రకాల విద్యాబుద్ధులు చెబుతామని నూతన ఉపాధ్యాయులు అంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 1,285 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా వీరిలో 876మంది ఎస్జీటీలు ఉన్నారు. ఎస్టీజీ పోస్టులకు సంబంధించిన ప్రక్రియ కోర్టులో ఉన్నందున వారి నియామకాలను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టడం లేదు. దీంతో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను మాత్రమే భర్తీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్, వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి 263 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 263 పోస్టుల్లో 55 పోస్టులు వివిధ కారణాలతో నిలిపేశారు. ప్రస్తుతం 208 పోస్టులను జిల్లా వ్యాప్తంగా అధికారులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 12న సంగారెడ్డిలోని జెడ్పీ హాలులో డీఈఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల పరిశీలించారు. 192 మంది ఉపాధ్యాయులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 192మంది ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను అందించారు. జేసీ నిఖిల, డీఈఓ విజయలక్ష్మిల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లాలోని జహీరాబాద్, నారాయణఖేడ్, నర్సాపూర్ నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, మనూర్, మునిపల్లి, ఝరాసంఘం, రేగోడ్, టేక్మాల్, కంగ్టి, న్యాల్కల్, హత్నూర, చిలప్‌చెడ్, కోహిర్, రాయికోడ్, సదాశివపేట, కౌడిపల్లి, అల్లాదుర్గం, వెల్దుర్తి, వట్పల్లి తదితర మండలాల్లో ఎక్కువ పోస్టుల ఖాళీలను అధికారులు చూపించారు. ఈ ప్రాంతాల్లో గత పదేళ్ల నుంచి సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో వీటిని భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏదిఏమైనా నూతన ఉపాధ్యాయులు నేటి నుంచి ప్రభుత్వ బడుల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల నుంచి వారు కన్న కలలు సాకారం అవుతుండడంతో నూతన ఉపాధ్యాయుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చాలా సంతోషంగా ఉంది నేను టీఆర్టీలో ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాన్న, మామలు ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడంతో నేను కూడా ఉపాధ్యాయురాలిని కావాలనే లక్ష్యంతో చదివాను. నేటి నుంచి నా కల నెరవేరబోతోంది. ఇది చాలా సంతోషం కలిగిస్తోంది. చదువు విషయంలో నా కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నా వంతు కృషి చేస్తా. – స్వప్న, జిన్నారం, లాంగ్వేజి పండిట్, తెలుగు లక్ష్యం నెరవేరింది ఉపాధ్యాయురాలిని కావాలనే నా లక్ష్యం నెరవేరింది. టీఆర్టీలో సెలక్ట్ కావ డంతో చాలా సంతోషంగా ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ప్రయోజకులుగా చేసేలా ముందుకెళ్తా. కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి సహకారంతోనే నా కల నెరవేరింది. – శశికళ, సంగారెడ్డి -
ఆలయాలకు మంచిరోజులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధూప, దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడూ లేనిరీతిలో మొట్టమొదటిసారిగా బడ్జెట్లో నిధులు కేటాయించింది. వీటి నిర్వహణకు తగినన్ని నిధుల్లేని హిందూ దేవాలయాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో నిత్య పూజలు జరిపించేందుకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రూ.234కోట్లను కేటాయిస్తున్నట్లు తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ప్రకటించారు. ఇన్నాళ్లు దేవదాయ శాఖ అంటే.. రాష్ట్రంలోని ఆదాయం ఉండే ఆలయాల నుంచి ప్రతియేటా 21.5 శాతం మొత్తాన్ని ప్రభుత్వం పన్ను రూపంలో వసూలుచేసి, ఆ డబ్బులతోనే దేవదాయ శాఖ ఖర్చులకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఆ శాఖ అవసరాలకు ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయింపులు అస్సలు జరిగేవి కావు. దీంతో రాష్ట్రంలోని దాదాపు 19వేల ఆలయాలకు ఏడాదికి రూ.50వేలు ఆదాయం కూడా రాని పరిస్థితి. ఫలితంగా వీటిల్లో నిత్యం ధూప, దీప, నైవేద్యాలు జరిగేవి కావు. కానీ, ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2008లో ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్ఎస్) పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని కింద ధూప, దీప, నైవేద్యాలకు రూ.వెయ్యి, పూజారికి గౌరవ వేతనంగా రూ.1,500 చెల్లించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.5వేలకు పెంచారు. అయితే, ఈ మొత్తాన్ని ఆదాయం ఉన్న వివిధ ఆలయాల ద్వారా దేవదాయ శాఖకు పన్నుల రూపంలో వచ్చే మొత్తం నుంచి ఖర్చుపెట్టేవారు. కానీ, ఆ మహానేత హఠాన్మరణంతో ఈ పథకం కొడిగడుతూ వచ్చింది. రాష్ట్ర విభజన సమయానికి రాష్ట్రంలో 1906 ఆలయాలకు డీడీఎన్ఎస్ పథకం అమలవుతుండగా.. ఈ ఏడాది జూన్ నెలకు ఆ సంఖ్య 1,604కు పడిపోయింది. అలాగే, చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది ఆలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) పేరుతో వసూలు చేసిన డబ్బుల నుంచి కేవలం రూ.9.62 కోట్లను మాత్రమే డీడీఎన్ఎస్ పథకానికి ఖర్చు పెట్టింది. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో చిన్నచిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులు డీడీఎన్ఎస్ పథకం కింద అందే ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనాన్ని పెంచాలంటూ పెద్దఎత్తున వినతిపత్రాలు అందజేయడంతో ఆయన అప్పట్లో సానుకూలంగా స్పందించారు. అధికారంలోకి రాగానే తొలి బడ్జెట్లోనే దాని అమలుకు ఏకంగా రూ.234 కోట్లు కేటాయించారు. చరిత్రలో మొదటిసారిగా.. బడ్జెట్లో ఆదాయంలేని ఆలయాల నిర్వహణకు చరిత్రలో మొట్టమొదటిసారిగా రూ.234 కోట్ల మేర కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో ఆలయాలకు మంచి రోజులు వచ్చాయనిపిస్తోంది. – పద్మ, దేవదాయ శాఖ కమిషనర్ బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు సాక్షి, అమరావతి: బ్రాహ్మణుల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అత్యధిక కేటాయింపు ఇదే. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్ల ఏక మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని పట్టించుకోకపోగా.. గడిచిన ఐదేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.282 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సరాసరిన రూ.56 కోట్లు మాత్రమే కేటాయించిందన్నమాట. రాష్ట్రంలో 18 ఏళ్ల వయస్సు నిండిన బ్రాహ్మణుల సంఖ్యే 45 లక్షలదాకా ఉంటుందని అంచనా. అయితే కార్పొరేషన్‌కు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు మాత్రమే విడుదల చేయడంతో కేవలం 80 వేల మందికే సాయం చేయగలిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బ్రాహ్మణ వర్గానికి గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేసింది. -
అందరికీ ఆరోగ్య‘సిరి’
సాక్షి, అమరావతి: పేదవారి ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర సర్కారు బడ్జెట్లో వైద్య రంగానికి పెద్దపీట వేసింది. కనీవినీ ఎరుగని రీతిలో వైద్య ఆరోగ్య శాఖకు తాజా బడ్జెట్లో రూ.11,398.93 కోట్లను కేటాయించింది. 2018–19 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 35 శాతం పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. అంతేగాక ప్రతి పేదవాడికీ ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంతివైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్వైభవం తీసుకొచ్చింది. ఈ పథకానికి ఏకంగా రూ.1,740 కోట్లు కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ స్థాయిలో ఎప్పుడూ కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే చాలు.. దాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి వారికి ఉచితంగా వైద్యం అందించాలన్న బలమైన ఆశయంతో ఈ పథకానికి భారీ కేటాయింపులు చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని గత సర్కారు ఆపేయడం తెలిసిందే. దీనికి ముగింపు పలుకుతూ.. ఇప్పుడు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకూ సేవలను విస్తరించింది. గతంలో ఉద్యోగుల వైద్యపథకంలో మాత్రమే ఉన్న కొన్ని జబ్బులను ఇప్పుడు ఆరోగ్యశ్రీలోనూ చేర్చి దాదాపు రెండువేల జబ్బులకు ఉచితంగా వైద్యమందించేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్నవారికి సైతం ఉచిత వైద్యమందేలా నిర్ణయించింది. తద్వారా మధ్య తరగతి వారికీ సర్కారు ఆరోగ్య భరోసా కల్పించింది. ఈ ఏడాది దేశ బడ్జెట్ రూ.27,86,349 కోట్లు అయితే ఇందులో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ.62,659 కోట్లు. అంటే కేవలం 2.2 శాతం మాత్రమే. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.2,27,974 కోట్లు కాగా, ఇందులో ఆరోగ్యశాఖకు రూ.11,398.93 కోట్లు కేటాయించడమంటే ఆరోగ్య రంగానికి 5 శాతం కేటాయింపులు జరిపినట్టు అవుతుంది. 108, 104 బలోపేతం వైఎస్సార్ హయాంలో అద్భుతంగా నడిచిన 108 అంబులెన్సులు, 104 సంచార వైద్యశాలల సేవలు ఆయన మరణానంతరం నిర్వీర్యం కావడం తెలిసిందే. ఇప్పుడు వీటికి కూడా పునర్వైభవం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. మండలానికొక వాహనాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో ఈ రెండు పథకాలకు 323.14 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 80 శాతం పైనే. ఇందులో 108 వాహనాలకు రూ.143.38 కోట్లు, 104 వాహనాలకు రూ.179.76 కోట్ల నిధులు వెచ్చించనుంది. క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని పెంచిన రాష్ట్ర సర్కారు వారికోసం ఈ బడ్జెట్లో రూ.455 కోట్లను కేటాయించింది. ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.పది వేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచడం తెలిసిందే. గురజాలలో ప్రభుత్వ వైద్యకళాశాల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యకళాశాల నిర్మించేందుకు రూ.66 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటికే పాడేరులో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ప్రస్తుతం గురజాలలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 300 పడకల ఆస్పత్రిగా ఉన్నతీకరించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తారు. మరోవైపు విజయనగరంలో కొత్తగా ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటు చేస్తూ రూ.66 కోట్లు కేటాయించింది. మరోవైపు ఆయుష్ వైద్యకళాశాలల అభివృద్ధికి గతేడాది రూ.30 కోట్లు ఇస్తే ఈ ఏడాది రూ.52 కోట్లు కేటాయించారు. బడ్జెట్లో ప్రధానమైన వాటికి కేటాయింపులు ఇలా.. (రూ.కోట్లల్లో) ఆరోగ్యశ్రీ - 1,740 108 - 123.09 104 - 141.47 ఆశావర్కర్లకు - 455 ఉద్యోగుల వైద్యానికి - 200 రేడియాలజీ సర్వీసులు - 25 మందుల కొనుగోళ్లకు - 126