ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు.
సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్ అయ్యారు. మరోవైపు..
జగన్ చొరవతోనే..
కేంద్రం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి నోడ్.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కర్నూల్ జిల్లా ఓర్వకల్లు నోడ్ హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఈ కారిడార్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: జగన్ పాలనలో పారిశ్రామిక దూకుడు!
Comments
Please login to add a commentAdd a comment