Union Budget 2024-25 Highlights
-
నిర్మలమ్మ తక్కువసేపు చదివిన పద్దుల చిట్టా.. (ఫొటోలు)
-
స్టార్టప్స్‌కు జోష్.. ఏంజెల్ ట్యాక్స్ తొలగింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంకుర సంస్థలకు ఊరటనిచ్చే దిశగా అన్ని తరగతుల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు, ఎంట్రప్రెన్యూర్షిప్నకు, నవకల్పనలకు ఊతమివ్వడానికి ఇది తోడ్పడగలదని ఆమె తెలిపారు.సముచిత మార్కెట్ విలువకు మించిన వేల్యుయేషన్లతో అన్‌లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్‌లు సమీకరించే నిధులపై విధించే ఆదాయ పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఇది స్టార్టప్‌లతో పాటు ఇన్వెస్ట్ చేసే మదుపర్లకు సమస్యగా మారింది. గతంలో ఏంజెల్ ట్యాక్స్ స్థానిక ఇన్వెస్టర్లకే పరిమితం కాగా 2023–24లో కేంద్రం దీన్ని విదేశీ పెట్టుబడులకు కూడా వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో దీన్ని తొలగించాలంటూ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) సిఫార్సు చేసింది.నూతన ఆవిష్కరణలకు, భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడానికి మార్గం సుగమం చేసే దిశగా ఇది కీలక అడుగని టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది అంకుర సంస్థలతో పాటు వాటికి మద్దతుగా నిల్చే ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీలు, వెంచర్ ఫండ్స్‌కూ సానుకూలమని న్యాయ సేవల సంస్థ ఇండస్‌లా పార్ట్నర్ లోకేష్ షా చెప్పారు. -
చిన్న సంస్థలకు ఊతం.. రుణ హామీ పథకం
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటు అందించే దిశగా బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చర్యలు ప్రతిపాదించారు. యంత్ర పరికరాల కొనుగోలు కోసం ఎటువంటి కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా టర్మ్ లోన్స్ తీసుకునే వెసులుబాటు లభించేలా రుణ హామీ పథకాన్ని ప్రకటించారు.దీనికోసం విడిగా సెల్ఫ్–ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇది ఒక్కో దరఖాస్తుదారుకు రూ. 100 కోట్ల వరకు రుణాలకు (తీసుకున్న రుణ మొత్తం ఎంతైనా సరే) హామీ ఇస్తుందని పేర్కొన్నారు. దీన్ని పొందేందుకు రుణగ్రహీత ముందస్తుగా నిర్దిష్ట గ్యారంటీ ఫీజును, రుణ బ్యాలెన్స్ తగ్గే కొద్దీ వార్షిక ఫీజును కట్టాల్సి ఉంటుంది.ఎస్ఎంఈలకు గడ్డు కాలంలో కూడా రుణ సదుపాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు కొత్త విధానాన్ని కేంద్రం ప్రతిపాదించింది. తమ పరిధిలో లేని కారణాల వల్ల స్పెషల్ మెన్షన్ అకౌంటు (ఎస్ఎంఏ) దశలోకి చేరిన ఎంఎస్ఎంఈలు ఆ తదుపరి మొండి బాకీల్లోకి జారిపోకుండా సహాయం పొందేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొంది. కొత్త అసెస్మెంట్ విధానం..: ఎంఎస్ఎంఈలకు రుణాల విషయంలో కొత్త మదింపు విధానాన్ని మంత్రి ప్రతిపాదించారు. అసెస్మెంట్ కోసం బైటి సంస్థలపై ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు దానికి సంబంధించి అంతర్గతంగా సొంత విధానాన్ని రూపొందించుకోవాలని పేర్కొన్నారు. సంప్రదాయ అసెస్మెంట్ విధానంతో పోలిస్తే ఈ మోడల్ మెరుగ్గా ఉండగలదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక ఎంఎస్ఎంఈలు, సంప్రదాయ చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించుకునేందుకు తోడ్పాటు అందించేలా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్మెంట్): రూ.2,65,808 కోట్లు.వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.విద్య: రూ.1,25,638 కోట్లు.ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.ఎనర్జీ: రూ.68,769 కోట్లు.సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు -
బడ్జెట్ పై YSRCP MPs కామెంట్స్..
-
కోటి ఇళ్లకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్!
రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టం చేసింది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా, రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా కోటి గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడానికి ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.గ్రీన్ గ్రోత్ , పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలను ప్రకటించిన ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో రూఫ్‌టాప్ సోలార్ స్కీమ్‌కు విశేష స్పందన వచ్చినట్లు చెప్పారు. ఈ పథకానికి ఇప్పటివరకు 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు, 14 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.ఆ ఉచిత సౌర విద్యుత్ పథకం ద్వారా ఆయా కుటుంబాలకు సంవత్సరానికి రూ. 15,000-18,000 కోట్ల వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చు. సప్లయి, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ చేసే క్రమంలో అనేక మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంటోంది. -
వేతనజీవికి ఊరట.. కేంద్ర బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు (ఫొటోలు)
-
ట్యాక్స్‌పేయర్లకు ఊరట కాస్తే..
ఎన్నో ఆశలు, ఆకాంక్షల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2024-25 ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి ఆమె బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ముందుకు తెచ్చారు.ఈ బడ్జెట్లో పన్ను విధానాల్లో మార్పులు చేసి వేతన జీవులకు ఊరట కల్పిస్తారని భావించారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రయోజనాలేమీ మోదీ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కల్పించలేదు. కొత్త పన్ను విధానంలో పన్ను పరిమితిని రూ.4లక్షలకు పెంచుతారని భావించారు. కానీ అందులో ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు. మిగతా శ్లాబుల్లో మాత్రం స్వల్ప మార్పులు చేసింది. ఇక స్టాండర్ట్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచి స్వల్ప ఊరట కల్పించింది.ఆదాయపు పన్ను కొత్త స్లాబులు ఇవేరూ. 3లక్షల వరకు నో ట్యాక్స్‌రూ.3 - 7 లక్షలు 5% పన్నురూ.7-10 లక్షలు 10%రూ.10-12 లక్షలు 15%రూ.12-15 లక్షలు 20%రూ.15 లక్షలు దాటితే 30% పన్ను -
ఇదేం సాయం?.. చంద్రబాబు అట్టర్ ఫ్లాప్
ఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే.. కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు అందించే సాయం మీదా ఆమె స్పష్టత ప్రకటన చేయలేదు. ఇక.. ప్రత్యేక ప్యాకేజీ అంశం తెర మీదకు తెచ్చిన కేంద్రం.. ఈసారి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు అంటూ కొత్త రాగం అందుకుంది. అదే సమయంలో టీడీపీ తర్వాత కూటమిలో ప్రాధాన్యత ఉన్న బీహార్ మాత్రం భారీగా నిధులు సాధించుకుంది. మొత్తంగా కేంద్రంలో చక్రం తిప్పేలా ఏపీ ప్రజలు చంద్రబాబుకి మెజారిటీ ఇచ్చినప్పటికీ.. కేంద్రం కంటి తుడుపు ప్రకటన ద్వారా నిధులు రాబట్టడంలో అట్టర్‌ప్లాఫ్ అయ్యారు. మరోవైపు.. జగన్ చొరవతోనే.. కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాలను ఆదర్శంగా తీసుకుందా? అనే చర్చ మొదలైంది. జగన్ మానసపుత్రికలైన డీబీటీ పథకాల ప్రస్తావనే అందుకు కారణం. ఉన్నత విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు రూ.10 లక్షల విద్యారుణాలు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. దేశీయంగా చదువుకునే లక్ష మందికి ఏటా రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపింది. ఇక.. వైఎస్సార్ జిల్లా కొప్పర్తి నోడ్.. విశాఖపట్నం, చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్, కర్నూల్ జిల్లా ఓర్వకల్లు నోడ్ హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే ఈ కారిడార్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: జగన్ పాలనలో పారిశ్రామిక దూకుడు! -
Budget 2024-25: కొత్త ఉద్యోగులకు రూ.15 వేలు!
కేంద్ర బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు సమర్పించారు.మోదీ మూడో విడత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో యువతను ఆకట్టుకునే దిశగా కొత్త పథకాలను ప్రకటించింది కేంద్రం. ఉపాధిని ప్రోత్సహించేందుకు కొత్త ఉద్యోగులకు, యాజమాన్యాలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తూ మూడు స్కీములను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.మూడు స్కీములు ఇవే..స్కీమ్-ఎ: ఈపీఎఫ్‌వోలో నమోదైన కొత్త ఉద్యోగులకు రూ.15000 వరకు ఒక నెల జీతం. మూడు విడతల్లో చెల్లింపుస్కీమ్-బి: మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఉద్యోగులకు, యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు. మొదటి నాలుగేళ్ల పాటు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్ ఆధారంగా చెల్లింపుస్కీమ్-సి: అధికంగా ఉద్యోగులను చేర్చుకున్న యాజమాన్యాలకు రెండేళ్లపాటు రూ.3000 వరకు ఈపీఎఫ్‌వో కాంట్రిబ్యూషన్ రీయింబర్స్మెంట్Prime Minister’s Package for employment and skilling: 3 schemes announced for ‘Employment Linked Incentive’🔆Scheme A: First Timers🔆Scheme B: Job Creation in manufacturing🔆Scheme C: Support to employers pic.twitter.com/NYDLNjEaea— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024 -
పాత పన్ను బకాయిలు రద్దు.. సీతమ్మ పద్దు...
అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, అభియోగాలు పక్కన పెట్టండి. షేరు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకండి. కేవలం బడ్జెట్‌నే ప్రస్తావిద్దాం. అరుపులు లేవు. మెరుపులు లేవు. ప్రజాకర్షణ పథకాలు లేవు. అందర్నీ అలరించాలనే ప్రయత్నము లేదు. అలా అని అందర్నీ కొనేయలేదు. నాలగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు.. వీరికి ప్రభుత్వ మద్దతు అవసరం.. వీరి వల్లే ‘‘వికసిత భారత్’’ సాధ్యం అని అంటున్నారు. పేదల సాధికారత, మహిళల శక్తి, యువతకు ప్రోత్సాహం, రైతుల శ్రేయస్సు.. ఇలా నడిచింది ప్రసంగం. పదేళ్లలో సాధించిన ప్రగతి మార్గంలో నడిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. స్థలాభావం వల్ల ఈ కాలమ్‌లో కేవలం ఇన్‌కంట్యాక్స్ వరకే పరిమితం చేద్దాం. మినహాయింపులు లేవు తగ్గింపులు లేవు తాయిలాలు లేవు బేసిక్ లిమిట్ పెంచలేదు శ్లాబులు, రేట్లు యధాతథం ఒక పక్కన ట్యాక్స్‌పేయర్ల సంఖ్య పెరిగిందని పొగుడుతూ మరో పక్కన మీకు సదుపాయాలు ఇవ్వాలని కరుణ చూపిస్తూ చేతులు దులుపుకొన్నారు ఆర్థిక మంత్రి. అయితే, ఏకంగా కట్టాల్సిన పన్నులను రద్దు చేస్తూ, కోటి మంది ట్యాక్స్‌పేయర్లకు లబ్ధి చేకూరేలాగా పెద్ద వరం ఇచ్చినందుకు సంబరపడాలి. సంతోషించాలి. వివరాల్లోకి వెళ్తే.. చిన్నవి, వెరిఫై చేయనివి, సమన్వయం కానివి, సందిగ్ధతలో ఉన్నవి, తగువులో ఉన్నవి.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు.. డిపార్టుమెంటు వారి బుక్స్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తే ‘‘మీ రిఫండును పాత బకాయిలకు సర్దుబాటు చేసేశాం’’ అన్న చావు వార్త. వివరాలు కూడా ఇవ్వకుండా సర్దుబాటు చేసేశారు. జవాబుకి జవాబు ఇవ్వకుండా కాలం దాటేశారు. కబురు లేదు. కన్ఫర్మేషన్ లేదు. సమాచారం లేదు. ఇటు ట్యాక్స్‌పేయర్స్‌కి దిక్కుతోచని పరిస్థితి. అనిశ్చితి. ఉత్కంఠ. అయోమయం. అగచాట్లు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త. ➤ 2009–10 సంవత్సరం వరకు రూ. 25,000 లోపు బకాయిలు పూర్తిగా రద్దు.. ➤ 2010–11 నుంచి 2014–15 వరకు రూ. 10,000 వరకు బకాయిలు పూర్తిగా రద్దు. ఈ స్కీము గురించి రెవెన్యూ సెక్రటరీగారు మాట్లాడుతూ 58 లక్షల కేసుల్లో రూ. 25,000 లోపు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రూ. 10,000 లోపు బకాయిల కేసులు 53 లక్షలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తికి ఇది చాలా చిన్న రిలీఫ్లాగా కనబడినా దేశం మొత్తంలో రూ. 3,500 కోట్ల ఉపశమనం దొరుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి లేదా నష్టమనే చెప్పాలి. రేట్లు తగ్గనందుకు, శ్లాబులు మార్చనందుకు, ఎటువంటి రాయితీలు ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా.. బకాయిలను రద్దు చేసినందుకు మెచ్చుకోవాలి. డిపార్టుమెంటు వారికి పని తగ్గుతుంది. మనకు డిమాండ్ల భారమూ తగ్గుతుంది. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
పన్నుస్లాబ్ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోవపోవడంతో సామాన్యులు, ట్యాక్స్ చెల్లింపుదారులు కొంత నిరాశ చెందినట్లు తెలిసింది. అయితే మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలపై ఆధారపడకుండా సాధికారతపై దృష్టి పెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రముఖ మీడయా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆదాయం పన్ను స్లాబ్‌ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. అయినా ఏప్రిల్ / మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటిస్తారని, తమ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం ద్రవ్య క్రమశిక్షణ, సబ్సిడీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ సాంఘిక సంక్షేమానికి పెద్దగా నిధుల కేటాయించక పోవడంపై ఎటువంటి ఆందోళన లేదని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నా పేదలందరికీ ఆహారం, నిత్యావసర వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసిందని ఆమె వివరించారు. -
కేంద్రానికి కోట్లు సంపాదించి పెడుతున్న ఆర్బీఐ..!
కేంద్ర ప్రభుత్వానికి ఏటా భారీ డివిడెండ్ చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొస్తునే ఉంటుంది. తమ వద్ద ఉన్న మిగులు నిధుల నుంచి రూ.87,416 కోట్లు డివిడెండ్‌గా చెల్లించేందుకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బృందం గతేడాది మే నెలలో ఆమోదం తెలిపింది. 2022తో పోలిస్తే ఈ మొత్తం మూడింతలు అధికం కావడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఆర్బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల (బ్యాంకుల) నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్ రానుందని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.04 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉంది. ఇది కిందటేడాది బడ్జెట్లో వేసిన అంచనా రూ.48 వేల కోట్ల కంటే చాలా ఎక్కువ. కేంద్ర సంస్థల నుంచి భారీ డివిడెండ్.. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ)ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల డివిడెండ్ ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల నుంచి రూ.39,961 కోట్ల డివిడెండ్‌ను కేంద్రం అందుకుంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంకులు, ఇతర గవర్నమెంట్ కంపెనీల నుంచి కేంద్రానికి రూ.1,54,407 కోట్ల డివిడెండ్ ఆదాయం రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ మొత్తం డివిడెండ్ రూ.1.50 లక్షల కోట్లు అందుతుందని తెలిసింది. -
Budget 2024-25: సార్వత్రిక ఎన్నికలు.. ఈసీకి కేటాయింపులు ఇలా..
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించారు. ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి 2024-25 బడ్జెట్లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కేంద్రం రూ.385.67 కోట్లు ఇచ్చింది. అయితే ఈసారి బడ్జెట్లో ఈ నిధులు తగ్గించినట్లు తెలుస్తుంది. న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,502.30 కోట్లు ఇవ్వగా.. 2024-25లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు భారత్ సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నం అయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా 96 కోట్ల మందికిపైగా అర్హులు ఉన్నట్లు కొన్ని గణాంకాల ప్రకారం తెలిసింది. వారిలో 47 కోట్ల మంది మహిళలేనని సమాచారం. -
రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - ఎవరికి లాభం, ఎవరికి నష్టం..
మోదీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రైతులు, పేదలు, మహిళలు, యువకులకు అనుకూలంగా.. పర్యాటకం, గృహనిర్మాణం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రకటించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమని అన్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ వల్ల ఎవరికి లాభం, ఎవరి నష్టం అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఎవరికి లాభమంటే.. అగ్రికల్చర్ 2024 మధ్యంతర బడ్జెట్ రైతుల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పాడి రైతుల అభివృద్ధికి కావలసిన సమగ్ర కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. మత్స్య సంపదను పెంపోంచించడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. నూనె గింజలపైన స్వయం సమృద్ధి సాధించడం మాత్రమే కాకుండా.. సరఫరా గొలుసులతో సహా పంటకోత అనంతర కార్యకలాపాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించనుంది. మిడిల్ క్లాస్ అందరికి ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటనలో.. అద్దె ఇళ్లలో నివసించే వారితో పాటు మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే వారి కోసం ప్రభుత్వ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పర్యాటకం దేశంలో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలోని దీవులలో టూరిజం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఉపాధి కల్పనలు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ) 2070 నాటికి భారతదేశంలో కార్బన్ స్థాయిని జీరో చేయాలనే యోచనలో భాగంగానే ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి పరిశ్రమ సబ్సిడీ ప్రోగ్రామ్ కోసం చూస్తోంది. పునరుత్పాదక శక్తి 1 గిగావాట్ల ప్రారంభ సామర్థ్యం కోసం పవన శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను ప్రకటించినప్పటికీ, అది అంచనాల కంటే తక్కువగా ఉంది. అయితే అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే తప్పకుండా జీరో ఎమిషన్ సాధ్యమవుతుంది. ఎవరికి నష్టమంటే.. ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టడానికి ముందు నుంచే నిర్మలమ్మ ఈవీ రంగానికి వరాల జల్లు కురిపిస్తుంది చాలామంది భావించారు. అయితే బడ్జెట్ ప్రకటన ఊహాతీతంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎలక్ట్రిక్ వాహనాలతో మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది, కానీ మార్చిలో ముగియనున్న సబ్సిడీ పొడిగింపుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వెల్లడించలేదు. జ్యువెల్లర్స్ బంగారంపై దిగుమతి పన్నును ప్రభుత్వం 15 శాతం వద్ద యథాతథంగా ఉంచడంతో టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కో, కళ్యాణ్ జువెలర్స్ ఇండియా లిమిటెడ్, సెన్కో గోల్డ్‌తో సహా జ్యువెలరీ షేర్లు పడిపోయాయి. మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రాస్ట్రక్చర్) గడిచిన 4 సంవత్సరాలలో మూలధన వ్యయాన్ని మూడింతలు చేయడంతో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన భారీగా పెరిగింది. అయితే వచ్చే ఏడాదికి మూలధన వ్యయాన్ని 11.1 శాతం పెంచి ప్రభుత్వం రూ. 11,11,111 కోట్లు చేసింది. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు. అయినప్పటికీ ఇది అంచనాలకంటే తక్కువగా ఉంది. ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో.. పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువ గల వాటా విక్రయాలను పూర్తి చేయడంలో విఫలం కావడం వల్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని తగ్గించుకుంది. దీంతో మార్చి 2024 నాటికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 300 బిలియన్లను పొందాలని అంచనా వేస్తోంది. ఇది మునుపటి లక్ష్యం రూ. 510 బిలియన్ల కంటే తగ్గింది. -
Budget 2024-25: విభేదాలున్నా.. 50 శాతం అధికంగా నిధులు
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పర్యాటకానికి పెద్దపీట వేసినట్లు తెలిసింది. దేశంలోని పర్యాటకంతోపాటు సరిహద్దును ఆనుకుని ప్రాంతాలకు సైతం భారీగా నిధులు కేటాయించారు. తాజాగా మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ కేంద్రం ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపినట్లు తెలిసింది. బడ్జెట్లో కేంద్రం మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపు గతేడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువగా ఉంది. గత బడ్జెట్లో ఆ దేశ అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చు చేసిన దాంతో పోలిస్తే మాత్రం ఈసారి కేటాయింపులు 22 శాతం తగ్గాయి. దేశం అవలంబిస్తున్న ‘పొరుగుకే పాధాన్యం’ అనే విధానంలో భాగంగా ఈ బడ్జెట్లో కింది విధంగా నిధులు కేటాయించింది. భూటాన్ అభివృద్ధికి రూ.2,068 కోట్లు మాల్దీవులకు రూ.600 కోట్లు నేపాల్‌కు రూ.700 కోట్లు అఫ్గానిస్థాన్‌కు రూ.200 కోట్లు బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ఇస్తున్నట్లు చెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.22,154 కోట్లు ఇచ్చారు. -
రూ.47.65 లక్షల కోట్లు - ఇలా కేటాయించారు..
బడ్జెట్ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఈ కథనంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు. ఎక్కువ దేనికి, తక్కువ దేనికనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. వివిధ రంగాలకు కేటాయింపులు రక్షణ రంగం - రూ. 621000 కోట్లు పెన్షన్లు - రూ. 239612 కోట్లు ఎరువుల రాయితీ - రూ. 164000 కోట్లు ఆహారం - రూ. 205250 కోట్లు పెట్రోలియం - రూ. 11925 కోట్లు వ్యవసాయం, అనుబంధరంగాలు - రూ. 146819 కోట్లు వాణిజ్యం, పరిశ్రమలు - రూ. 45,958 కోట్లు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి - రూ. 5900 కోట్లు విద్య - రూ. 124638 కోట్లు ఇంధనం - రూ. 76302 కోట్లు విదేశీ వ్యవహారాలు - రూ. 22154 కోట్లు ఆర్థికం - రూ. 87642 కోట్లు ఆరోగ్యం - రూ. 90171 కోట్లు హోం శాఖ - రూ. 202868 కోట్లు వడ్డీ చెల్లింపులు - రూ. 1190440 కోట్లు ఐటీ, టెలికామ్ - రూ. 115752 కోట్లు ప్లానింగ్, స్టాటిస్టిక్స్ - రూ. 6291 కోట్లు గ్రామీణాభివృద్ధి - రూ. 177000 కోట్లు శాస్త్రీయ విభాగాలు - రూ. 32169 కోట్లు సామాజిక సంక్షేమం - రూ. 56501 కోట్లు ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ - రూ. 203297 కోట్లు జీఎస్టీ పరిహార నిధి - రూ. 150000 కోట్లు రాష్ట్రాలకు నగదు బదిలీలు - రూ. 286787 కోట్లు రవాణా - రూ. 5440039 కోట్లు కేంద్రపాలిత ప్రాంతాలు - రూ. 63541 కోట్లు పట్టణాభివృద్ధి - రూ. 77524 కోట్లు ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో.. -
Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. ఎలా ఖర్చు చేస్తారో తెలిపారు. మొత్తం బడ్జెట్ రూ.47,65,768 కోట్లు పన్నుల ఆదాయం: రూ.26,01,574 కోట్లు పన్నేతర ఆదాయం: రూ.3,99,701 కోట్లు ఆదాయ లోటు: రూ.16,85,494 కోట్లు అప్పుల ద్వారా సమీకరణ: రూ.16,81,944 కోట్లు 2024-25లో రూపాయి రాక(శాతాల్లో) కార్పొరేషన్ పన్ను: 17 ఆదాయ పన్ను: 19 కస్టమ్స్ పన్ను: 4 కేంద్ర ఎక్పైజ్ పన్ను: 5 జీఎస్టీ, ఇతర పన్నులు: 19 పన్నేతర ఆదాయం: 7 రుణేతర మూలధన సేకరణ: 1 మార్కెట్ రుణాలు, సెక్యూరిటీలు, ఇతర రుణాలు: 28 రూపాయి పోక(శాతాల్లో) కేంద్ర ప్రభుత్వ పథకాలు/ వ్యయం: 16 రుణాలపై వడ్డీ చెల్లింపులు: 20 రక్షణ రంగ వ్యయం: 8 సబ్సిడీలు: 6 ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయింపులు: 8 పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటా: 20 పెన్షన్ల చెల్లింపులు: 4 ఇతర ఖర్చులు: 10 కేంద్రపాయోజిత పథకాలు: 8 ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి -
సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో..
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' నిన్న (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈమె కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం నాటి బడ్జెట్ సెషన్ ప్రసంగం సీతారామన్ తన కెరీర్లో చేసిన అతి చిన్న ప్రసంగం కావడం గమనార్హం. నిర్మలా సీతారామన్ ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా 2020లో 160 నిముషాలు (2 గంటల 40 నిమిషాలు), అత్యల్పంగా 2024 మధ్యంతర బడ్జెట్ 56 నిముషాలు. 2019లో ఈమె బడ్జెట్ ప్రసంగం 140 నిముషాలు, 2021లో 100 నిముషాలు, 2022లో 91 నిముషాలు, 2023లో 87 నిమిషాల ప్రసంగం చేశారు. బడ్జెట్ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఇదీ చదవండి: అందరికీ ఇళ్ళు - వచ్చే ఐదేళ్లలో 2 కోట్లు.. మధ్య తరగతికి...సొంతింటి వరం! నిర్మలా సీతారామన్ కంటే ముందు 1977లో కేంద్ర బడ్జెట్ సమర్పించిన 'హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్' అతి తక్కువ బడ్జెట్ ప్రసంగంగా రికార్డు క్రియేట్ చేశారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పదాల లెక్కన అత్యంత సుదీర్ఘ బడ్జెట్‌ను రూపొందించిన రికార్డు 'మన్మోహన్ సింగ్' పేరిట ఉంది. 1991లో సమర్పించిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. -
Budget 2024: సబ్సిడీలకు కోతలు.. తగ్గిన కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది. ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది. -
రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రసంగంలోని కీలక అంశాలు
మహిళలు, యువత, పేదలు, రైతులపై ప్రత్యేక దృష్టి సారించి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఈ బడ్జెట్‌ను సమర్పించారు . మధ్యంతర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతానికి పన్ను రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత జులైలో సమర్పించే పూర్తి బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ‘వీక్షిత్ భారత్’ నినాదంతో రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిస్తారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. వేతనజీవులకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి ముఖ్యమైన ప్రకటన చేయలేదు. ఆర్థిక మంత్రి సీతారామన్ గురువారం పన్ను స్లాబ్‌లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. పాత , కొత్త పన్ను స్లాబ్లే ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు. వందే భారత్ తరహా బోగీలు ప్రయాణికుల భద్రత, సౌలభ్యంమేరకు 40,000 సాధారణ రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తామని మంత్రి చెప్పారు. కేంద్రం మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, అధిక ట్రాఫిక్ ఉన్న కారిడార్లుగా విభజించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. మహిళాసాధికారత కోసం.. నిర్మలాసీతారామన్ ఎన్నికల ముందు బడ్జెట్ ప్రసంగంలో మహిళా సాధికారతపై దృష్టి సారించే కొన్ని ప్రతిపాదనలు ప్రకటించారు. కేంద్రం ‘లక్పతి దీదీ’ పథకం మంచి విజయం సాధించిందని చెప్పారు. ఈ పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు శిక్షణనిస్తారు. దాంతో వారు ఏటా కనీసం రూ.1 లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మహిళా హెల్పర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సంరక్షణ అందించాలని పేర్కొన్నారు. ఇన్ఫ్రా రంగానికి బూస్ట్ ఆర్థికమంత్రి మాట్లాడుతూ 2024-25లో చేపట్టనున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.11.1 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగిందని చెప్పారు. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని వివరించారు. గత 4 సంవత్సరాలలో మూలధన వ్యయం మూడింతలు కావడం వల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభావం పడినట్లు తెలిపారు. మధ్యతరగతిని ఆకర్షించేలా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి అద్దె నివాసాలు, మురికివాడల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో గ్రామీణ పేదలకు మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ఆమె ప్రకటించారు. రక్షణ వ్యయం ప్రభుత్వం 2024-25 ఆర్థికసంవత్సరంలో రక్షణ వ్యయాన్ని రూ.6.2 లక్షల కోట్లకు పెంచింది. ఇది మొత్తం వ్యయంలో దాదాపు 8 శాతం ఉంటుంది. రక్షణ రంగానికి ఊతమిచ్చేలా డీప్టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఎఫ్‌డీఐ(ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా) భారతదేశాన్ని అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి మరింత వృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. ఎఫ్‌డీఐ స్ఫూర్తితో విదేశీ భాగస్వాములతో ప్రభుత్వం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని చెప్పారు. 2014-23లో 596 బిలియన్ యూఎస్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్లు తెలిపారు. 2005-14తో పోలిస్తే దాదాపు రెండింతలుగా ఉందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం.. పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేలా 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలతో రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి దేశీయ పర్యాటకానికి ఊతమిచ్చేలా.. బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ వంటి దేశీయ పర్యాటక స్థలాలకు ఆదరణ పెరుగుతోందని మంత్రి చెప్పారు. దేశీయంగా టూరిజం అభివృద్ధిలో భాగంగా లక్షద్వీప్‌తో ఇతర ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆమె వివరించారు. -
Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ముందుగా భావించారు. కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఆశించినమేర కేటాయింపులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో రైల్వేలకు సంబంధించి మంత్రి అశ్వినీవైష్ణవ్ మాట్లాడారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 100శాతం విద్యుదీకరణ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి నిధులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయినట్లు వివరించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా భూమి అప్పగించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్ సైతం సిద్ధమైందన్నారు. -
Budget 2024: ‘లక్షపతి దీదీ’.. ఆర్థికమంత్రి ప్రస్తావించిన ఈ స్కీమ్ గురించి తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్లో ‘లక్షపతి దీదీ’ పథకం గురించి ప్రస్తావించారు. సహాయక గ్రూపు మహిళలకు సంబంధించిన ఈ పథకం లక్ష్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. "తొమ్మిది కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు సాధికారత , స్వావలంబనతో గ్రామీణ సామాజిక-ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయి. వారి విజయం ఇప్పటికే దాదాపు కోటి మంది మహిళలను లక్షపతి దీదీలుగా మార్చడానికి సహాయపడింది. ఈ విజయం ఉత్సాహంతో లక్షపతి దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించాం" అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పార్లమెంటుకు తెలిపారు. అసలేంటి ఈ పథకం? గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు 'లక్షపతి దీదీ' పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడీ బల్బుల తయారీ, డ్రోన్లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపడి వారు ఏటా రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తారు. -
1,361 మార్కెట్ల అనుసంధానం.. వ్యవసాయానికి కేటాయింపులు ఇవే..
మోదీ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా పీఎం ముద్ర యోజన కింద 43 కోట్ల మందికి రూ.22 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. బడ్జెట్ 2024-25 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆమె వ్యవసాయ రంగానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై పార్లమెంట్ లో మాట్లాడిన ఆమె.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవటంలో ప్రభుత్వం ఎంతో ఉదారత చూపిందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో భారీగా కుదేలైన చిన్న పరిశ్రమలను ఆదుకోవటం కోసం లక్ష్యాలను మించి అదనంగా రూ.2 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ప్రధానమంత్రి ఫసల్ బీయా యోజన కింద దేశంలో 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామన్నారు. రైతులు సరుకు అమ్ముకోవడానికి రూ.3 లక్షల కోట్ల రూపాయలతో 1,361 మార్కెట్ యార్డులను అనుసంధానించామన్నారు. దీని వల్ల పంటల అమ్మకం ద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు. -
Budget 2024 Highlights: అందరికీ ఇళ్ళు - వచ్చే ఐదేళ్లలో 2 కోట్లు..
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటనలో.. అద్దె ఇళ్లలో నివసించే వారితో పాటు మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే వారి కోసం ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందరికి హౌసింగ్ (Housing for All) మిషన్ కింద.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-Urban) & ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-రూరల్ (PMAY-Rural) లేదా గ్రామీణ పథకాలు ఉన్నాయి. పీఎంఏవై-రూరల్ కింద 30 మిలియన్ల ఇళ్లను నిర్మించామని, కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల తలెత్తే డిమాండ్‌ను తీర్చాడనికి వచ్చే ఐదేళ్లలో 20 మిలియన్స్ లేదా 2 కోట్ల ఇళ్లను చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మధ్య తరగతి ప్రజల కోసం కొత్త గృహనిర్మాణ పథకంపై, అర్హులైన మధ్యతరగతి ప్రజలు స్వంత గృహాలను కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదీ చదవండి: 2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి కేంద్ర బడ్జెట్ 2023లో ఏకంగా రూ. 79000 కోట్లు కేటాయించింది. ఇది అంతకు ముందు ప్రవేశపెట్టగా బడ్జెట్ కంటే 66 శాతం ఎక్కువ. ఇందులో 'అందరికీ హౌసింగ్' మిషన్‌ను వేగవంతం చేయడానికి పీఎంఏవై-అర్బన్‌కు రూ. 25,103 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తం పీఎంఏవై-రూరల్ పథకానికి కేటయించారు.