
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో రైతు భీమా, పీఎం ఆవాస్ యోజన వంటి వాటిని గురించి వివరించారు.
కొత్త సంస్కరణలతో పారిశ్రామిక వేత్తలు పెరిగారని, గత పదేళ్లలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందని, దేశంలో అవినీతి కుటుంబ పాలనను అంతమొందించినట్లు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ పాలన పారదర్శకంగా మారిందని.. ఐఐటీ, ఐటీటీల సంఖ్య కూడా భారీగా పెరిగిందని వెల్లడించారు.
పేదల అభివృద్దే.. దేశ అభివృద్ధి అని వెల్లడిస్తూ.. 2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాల వృద్ధిలో కూడా భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని వెల్లడించారు.