2024 budget
-
కేంద్ర బడ్జెట్‌కు తేదీ ఖరారు..?
కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు మీడియా సంస్థల్లో వార్తలొస్తున్నాయి. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఎకనామిక్టైమ్స్ నివేదించింది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు.సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి గెలుపొందిన నరేంద్రమోదీ పరివారానికి ఇప్పటికే మంత్రిత్వశాఖలు కేటాయించారు. కేంద్ర ఆర్థికమంత్రిగా తిరిగి నిర్మలాసీతారామన్ ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటికే 6 సార్లు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డులకెక్కారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో 5 పూర్తికాల కేంద్ర పద్దులు చదివినట్లైంది. బడ్జెట్ తేదీపై వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం జులైలో నిర్మలమ్మ కేంద్ర పద్దులు ప్రవేశపెడితే ఏకంగా వరుసగా 7 సార్లు బడ్జెట్ విడుదల చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తారు.ఇదీ చదవండి: మనిషికో రోబో!ఈసారి బడ్జెట్లో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. వ్యవసాయ రంగంలోని సవాళ్లను పరిష్కరించడం, ఉపాధిని సృష్టించడం, రాబడి వృద్ధిని పెంచడం వంటి ప్రాథమిక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రబడ్జెట్‌కు సంబంధించి జూన్ 22న జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారనుంది. ఏయే వస్తువులపై ఏమేరకు ట్యాక్స్‌లో మార్పులుంటాయో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. -
పాత పన్ను బకాయిలు రద్దు.. సీతమ్మ పద్దు...
అనుకున్న ప్రకారం ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాజకీయ నాయకుల అభిప్రాయాలు, అభియోగాలు పక్కన పెట్టండి. షేరు మార్కెట్ ఒడిదుడుకులను పరిగణనలోకి తీసుకోకండి. కేవలం బడ్జెట్‌నే ప్రస్తావిద్దాం. అరుపులు లేవు. మెరుపులు లేవు. ప్రజాకర్షణ పథకాలు లేవు. అందర్నీ అలరించాలనే ప్రయత్నము లేదు. అలా అని అందర్నీ కొనేయలేదు. నాలగు వర్గాల వారిని దృష్టిలో పెట్టుకున్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు.. వీరికి ప్రభుత్వ మద్దతు అవసరం.. వీరి వల్లే ‘‘వికసిత భారత్’’ సాధ్యం అని అంటున్నారు. పేదల సాధికారత, మహిళల శక్తి, యువతకు ప్రోత్సాహం, రైతుల శ్రేయస్సు.. ఇలా నడిచింది ప్రసంగం. పదేళ్లలో సాధించిన ప్రగతి మార్గంలో నడిస్తే రాబోయే ఎన్నికల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. స్థలాభావం వల్ల ఈ కాలమ్‌లో కేవలం ఇన్‌కంట్యాక్స్ వరకే పరిమితం చేద్దాం. మినహాయింపులు లేవు తగ్గింపులు లేవు తాయిలాలు లేవు బేసిక్ లిమిట్ పెంచలేదు శ్లాబులు, రేట్లు యధాతథం ఒక పక్కన ట్యాక్స్‌పేయర్ల సంఖ్య పెరిగిందని పొగుడుతూ మరో పక్కన మీకు సదుపాయాలు ఇవ్వాలని కరుణ చూపిస్తూ చేతులు దులుపుకొన్నారు ఆర్థిక మంత్రి. అయితే, ఏకంగా కట్టాల్సిన పన్నులను రద్దు చేస్తూ, కోటి మంది ట్యాక్స్‌పేయర్లకు లబ్ధి చేకూరేలాగా పెద్ద వరం ఇచ్చినందుకు సంబరపడాలి. సంతోషించాలి. వివరాల్లోకి వెళ్తే.. చిన్నవి, వెరిఫై చేయనివి, సమన్వయం కానివి, సందిగ్ధతలో ఉన్నవి, తగువులో ఉన్నవి.. ఇలా ఎన్నెన్నో డిమాండ్లు.. డిపార్టుమెంటు వారి బుక్స్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. రిఫండ్ కోసం క్లెయిమ్ చేస్తే ‘‘మీ రిఫండును పాత బకాయిలకు సర్దుబాటు చేసేశాం’’ అన్న చావు వార్త. వివరాలు కూడా ఇవ్వకుండా సర్దుబాటు చేసేశారు. జవాబుకి జవాబు ఇవ్వకుండా కాలం దాటేశారు. కబురు లేదు. కన్ఫర్మేషన్ లేదు. సమాచారం లేదు. ఇటు ట్యాక్స్‌పేయర్స్‌కి దిక్కుతోచని పరిస్థితి. అనిశ్చితి. ఉత్కంఠ. అయోమయం. అగచాట్లు. ఇలాంటి నేపథ్యంలో ఓ శుభవార్త. ➤ 2009–10 సంవత్సరం వరకు రూ. 25,000 లోపు బకాయిలు పూర్తిగా రద్దు.. ➤ 2010–11 నుంచి 2014–15 వరకు రూ. 10,000 వరకు బకాయిలు పూర్తిగా రద్దు. ఈ స్కీము గురించి రెవెన్యూ సెక్రటరీగారు మాట్లాడుతూ 58 లక్షల కేసుల్లో రూ. 25,000 లోపు బకాయిలు ఉన్నాయని తెలిపారు. రూ. 10,000 లోపు బకాయిల కేసులు 53 లక్షలు ఉన్నాయన్నారు. ప్రతి వ్యక్తికి ఇది చాలా చిన్న రిలీఫ్లాగా కనబడినా దేశం మొత్తంలో రూ. 3,500 కోట్ల ఉపశమనం దొరుకుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ఖజానాకి గండి లేదా నష్టమనే చెప్పాలి. రేట్లు తగ్గనందుకు, శ్లాబులు మార్చనందుకు, ఎటువంటి రాయితీలు ఇవ్వనందుకు కొంచెం బాధ ఉన్నా.. బకాయిలను రద్దు చేసినందుకు మెచ్చుకోవాలి. డిపార్టుమెంటు వారికి పని తగ్గుతుంది. మనకు డిమాండ్ల భారమూ తగ్గుతుంది. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
పన్నుస్లాబ్ సవరణలపై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు
కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక నిర్ణయాలు ఏవీ తీసుకోవపోవడంతో సామాన్యులు, ట్యాక్స్ చెల్లింపుదారులు కొంత నిరాశ చెందినట్లు తెలిసింది. అయితే మోదీ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలపై ఆధారపడకుండా సాధికారతపై దృష్టి పెట్టిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రముఖ మీడయా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఆదాయం పన్ను స్లాబ్‌ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టలేదన్నారు. అయినా ఏప్రిల్ / మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం ప్రకటిస్తారని, తమ బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారని తేల్చి చెప్పారు. ఇదీ చదవండి: ట్రక్కు డ్రైవర్లకు కొత్త భవనాలు.. ప్రధాని కీలక నిర్ణయం ద్రవ్య క్రమశిక్షణ, సబ్సిడీలను అమలు చేస్తున్నామన్నారు. కానీ సాంఘిక సంక్షేమానికి పెద్దగా నిధుల కేటాయించక పోవడంపై ఎటువంటి ఆందోళన లేదని ఆమె తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకున్నా పేదలందరికీ ఆహారం, నిత్యావసర వస్తువులను ప్రభుత్వం సరఫరా చేసిందని ఆమె వివరించారు. -
నేను చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నా! 2024 బడ్జెట్‌పై ఆనంద్ మహీంద్రా కామెంట్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ 2024పై ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా బడ్జెట్ అనగానే భారీ అంచనాలు పెట్టుకుంటూ.. బడ్జెట్ చుట్టూ ఒక డ్రామా క్రియేట్ చేసుకుంటారు. ప్రతిసారీ బడ్జెట్లో పెద్ద పథకాలు, విధానపరమైన మార్పులు చేయాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబాల బడ్జెట్ మాదిరిగానే కేంద్ర బడ్జెట్ రాబడి, ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రకటించడం జరుగుతుంది. అభివృద్ధి దిశగా చేసే ప్రకటనలకు బడ్జెట్ మాత్రమే సందర్భంగా కాదు. ఎందుకంటే.. సంవత్సరంలో ఎప్పుడైనా సందర్భానుసారంగా అవసరమైన ప్రకటనలు చేసుకోవచ్చు. ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఎలా ప్లాన్ చేసుకోవాలన్నదానికి బడ్జెట్ ఒక అవకాశం కల్పిస్తుంది. నేను ఎప్పటినుంచో ఇదే విషయాన్ని చెబుతున్నానంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 2024 మధ్యంతర బడ్జెట్ తనకు ఎంతగానో నచ్చిందని, తక్కువ సమయంలో ఎక్కువ ప్రకటనలు చేయడాన్ని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఎన్నికల సమయంలో ప్రజలను ఆకర్శించే పథకాలు ఏవీ లేకపోవడం హర్శించదగ్గ విషయమని కొనియాడారు. ఇదీ చదవండి: పరుగులు పెడుతున్న పసిడి, పడిలేస్తున్న వెండి - నేటి ధరలు ఇవే.. ట్యాక్స్, డ్యూటీస్ వంటి వాటిలో మార్పులు కనిపించలేదు. వ్యాపారులు ఇలాంటి స్థిరత్వాన్ని కోరుకుంటారని వెల్లడించారు. ట్యాక్స్-జీడీపీ నిష్ఫత్తి అధికంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది దేశానికి ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుందని, అవసరమైన సందర్భాల్లో నిధుల లభ్యతను కూడా పెంచుతుందని అన్నారు. For many years, I have been saying that we create too much drama around the budget and raise expectations of policy announcements to an unrealistically feverish pitch. The Budget is NOT necessarily the occasion for transformational policy announcements. Those can, and should,… pic.twitter.com/hfqxnw4IUa — anand mahindra (@anandmahindra) February 1, 2024 -
కేంద్రానికి కోట్లు సంపాదించి పెడుతున్న ఆర్బీఐ..!
కేంద్ర ప్రభుత్వానికి ఏటా భారీ డివిడెండ్ చెల్లించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొస్తునే ఉంటుంది. తమ వద్ద ఉన్న మిగులు నిధుల నుంచి రూ.87,416 కోట్లు డివిడెండ్‌గా చెల్లించేందుకు ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బృందం గతేడాది మే నెలలో ఆమోదం తెలిపింది. 2022తో పోలిస్తే ఈ మొత్తం మూడింతలు అధికం కావడం గమనార్హం. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఆర్బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల (బ్యాంకుల) నుంచి రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్ రానుందని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.04 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉంది. ఇది కిందటేడాది బడ్జెట్లో వేసిన అంచనా రూ.48 వేల కోట్ల కంటే చాలా ఎక్కువ. కేంద్ర సంస్థల నుంచి భారీ డివిడెండ్.. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (సీపీఎస్ఈ)ల నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.43 వేల కోట్ల డివిడెండ్ ఆదాయం వస్తుందని బడ్జెట్ అంచనా వేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ, ప్రభుత్వ ఫైనాన్షియల్ సంస్థల నుంచి రూ.39,961 కోట్ల డివిడెండ్‌ను కేంద్రం అందుకుంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ, ప్రభుత్వ బ్యాంకులు, ఇతర గవర్నమెంట్ కంపెనీల నుంచి కేంద్రానికి రూ.1,54,407 కోట్ల డివిడెండ్ ఆదాయం రాబోతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో ఈ మొత్తం డివిడెండ్ రూ.1.50 లక్షల కోట్లు అందుతుందని తెలిసింది. -
తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్..?
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 15న ప్రారంభం కానున్నట్లు తెలిసింది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం తర్వాత నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రం కూడా అటు వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని సమాచారం. ఈ సమావేశాల్లో భాగంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెడతారా? ఓటాన్ అకౌంట్‌కు వెళతారా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వాస్తవానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న అంచనాలతోనే రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్ ఇన్ఎయిడ్తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు (సీఎస్ఎస్) నిధుల కేటాయింపులను అంచనా వేసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాను పేర్కొంటూ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కేంద్రం పెట్టిన ఓటాన్ అకౌంట్లో ప్రజలపై విధించే ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించారు కానీ, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో విధాన నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి దీంతో అసలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయన్న దానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. తెలంగాణలో కూడా ఆరు నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ పెట్టి ఆ తర్వాత సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. -
Budget 2024-25: సార్వత్రిక ఎన్నికలు.. ఈసీకి కేటాయింపులు ఇలా..
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి వివిధ ప్రభుత్వ శాఖలకు నిధులు కేటాయించారు. ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి 2024-25 బడ్జెట్లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కేంద్రం రూ.385.67 కోట్లు ఇచ్చింది. అయితే ఈసారి బడ్జెట్లో ఈ నిధులు తగ్గించినట్లు తెలుస్తుంది. న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,502.30 కోట్లు ఇవ్వగా.. 2024-25లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు భారత్ సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నం అయింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశవ్యాప్తంగా 96 కోట్ల మందికిపైగా అర్హులు ఉన్నట్లు కొన్ని గణాంకాల ప్రకారం తెలిసింది. వారిలో 47 కోట్ల మంది మహిళలేనని సమాచారం. -
రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ - ఎవరికి లాభం, ఎవరికి నష్టం..
మోదీ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రైతులు, పేదలు, మహిళలు, యువకులకు అనుకూలంగా.. పర్యాటకం, గృహనిర్మాణం, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే చర్యలను ప్రకటించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమని అన్నారు. ఈ మధ్యంతర బడ్జెట్ వల్ల ఎవరికి లాభం, ఎవరి నష్టం అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఎవరికి లాభమంటే.. అగ్రికల్చర్ 2024 మధ్యంతర బడ్జెట్ రైతుల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. పాడి రైతుల అభివృద్ధికి కావలసిన సమగ్ర కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తోంది. మత్స్య సంపదను పెంపోంచించడానికి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. నూనె గింజలపైన స్వయం సమృద్ధి సాధించడం మాత్రమే కాకుండా.. సరఫరా గొలుసులతో సహా పంటకోత అనంతర కార్యకలాపాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించనుంది. మిడిల్ క్లాస్ అందరికి ఇళ్లు అనే కార్యక్రమంలో భాగంగా మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటనలో.. అద్దె ఇళ్లలో నివసించే వారితో పాటు మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే వారి కోసం ప్రభుత్వ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పర్యాటకం దేశంలో పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాన్ని కూడా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలోని దీవులలో టూరిజం మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఉపాధి కల్పనలు కూడా పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. పునరుత్పాదక శక్తి (రెన్యువబుల్ ఎనర్జీ) 2070 నాటికి భారతదేశంలో కార్బన్ స్థాయిని జీరో చేయాలనే యోచనలో భాగంగానే ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనాన్ని స్వీకరించడాన్ని ప్రోత్సహించడానికి పరిశ్రమ సబ్సిడీ ప్రోగ్రామ్ కోసం చూస్తోంది. పునరుత్పాదక శక్తి 1 గిగావాట్ల ప్రారంభ సామర్థ్యం కోసం పవన శక్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ను ప్రకటించినప్పటికీ, అది అంచనాల కంటే తక్కువగా ఉంది. అయితే అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే తప్పకుండా జీరో ఎమిషన్ సాధ్యమవుతుంది. ఎవరికి నష్టమంటే.. ఎలక్ట్రిక్ వెహికల్స్ మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టడానికి ముందు నుంచే నిర్మలమ్మ ఈవీ రంగానికి వరాల జల్లు కురిపిస్తుంది చాలామంది భావించారు. అయితే బడ్జెట్ ప్రకటన ఊహాతీతంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల పబ్లిక్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎలక్ట్రిక్ వాహనాలతో మరింత విస్తరించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది, కానీ మార్చిలో ముగియనున్న సబ్సిడీ పొడిగింపుకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు వెల్లడించలేదు. జ్యువెల్లర్స్ బంగారంపై దిగుమతి పన్నును ప్రభుత్వం 15 శాతం వద్ద యథాతథంగా ఉంచడంతో టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్ కో, కళ్యాణ్ జువెలర్స్ ఇండియా లిమిటెడ్, సెన్కో గోల్డ్‌తో సహా జ్యువెలరీ షేర్లు పడిపోయాయి. మౌలిక సదుపాయాలు (ఇన్ ఫ్రాస్ట్రక్చర్) గడిచిన 4 సంవత్సరాలలో మూలధన వ్యయాన్ని మూడింతలు చేయడంతో ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన భారీగా పెరిగింది. అయితే వచ్చే ఏడాదికి మూలధన వ్యయాన్ని 11.1 శాతం పెంచి ప్రభుత్వం రూ. 11,11,111 కోట్లు చేసింది. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు. అయినప్పటికీ ఇది అంచనాలకంటే తక్కువగా ఉంది. ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో.. పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొన్ని అధిక విలువ గల వాటా విక్రయాలను పూర్తి చేయడంలో విఫలం కావడం వల్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని తగ్గించుకుంది. దీంతో మార్చి 2024 నాటికి డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 300 బిలియన్లను పొందాలని అంచనా వేస్తోంది. ఇది మునుపటి లక్ష్యం రూ. 510 బిలియన్ల కంటే తగ్గింది. -
Budget 2024-25: విభేదాలున్నా.. 50 శాతం అధికంగా నిధులు
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పర్యాటకానికి పెద్దపీట వేసినట్లు తెలిసింది. దేశంలోని పర్యాటకంతోపాటు సరిహద్దును ఆనుకుని ప్రాంతాలకు సైతం భారీగా నిధులు కేటాయించారు. తాజాగా మాల్దీవులతో దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న తరుణంలోనూ కేంద్రం ఆ దేశానికి ఆపన్నహస్తం అందించడానికి మొగ్గుచూపినట్లు తెలిసింది. బడ్జెట్లో కేంద్రం మాల్దీవులకు ఆర్థిక సాయం కింద రూ.600 కోట్లు కేటాయించింది. ఈ కేటాయింపు గతేడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువగా ఉంది. గత బడ్జెట్లో ఆ దేశ అభివృద్ధికి కేంద్రం రూ.400 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.770 కోట్లు ఖర్చు చేసింది. ఖర్చు చేసిన దాంతో పోలిస్తే మాత్రం ఈసారి కేటాయింపులు 22 శాతం తగ్గాయి. దేశం అవలంబిస్తున్న ‘పొరుగుకే పాధాన్యం’ అనే విధానంలో భాగంగా ఈ బడ్జెట్లో కింది విధంగా నిధులు కేటాయించింది. భూటాన్ అభివృద్ధికి రూ.2,068 కోట్లు మాల్దీవులకు రూ.600 కోట్లు నేపాల్‌కు రూ.700 కోట్లు అఫ్గానిస్థాన్‌కు రూ.200 కోట్లు బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఇరాన్‌తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం ఆ దేశంలోని చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100 కోట్లను ఇస్తున్నట్లు చెప్పింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మొత్తం రూ.22,154 కోట్లు ఇచ్చారు. -
రూ.47.65 లక్షల కోట్లు - ఇలా కేటాయించారు..
బడ్జెట్ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఈ కథనంలో ఏ శాఖకు ఎంత కేటాయించారు. ఎక్కువ దేనికి, తక్కువ దేనికనే వివరాలు వివరంగా తెలుసుకుందాం. వివిధ రంగాలకు కేటాయింపులు రక్షణ రంగం - రూ. 621000 కోట్లు పెన్షన్లు - రూ. 239612 కోట్లు ఎరువుల రాయితీ - రూ. 164000 కోట్లు ఆహారం - రూ. 205250 కోట్లు పెట్రోలియం - రూ. 11925 కోట్లు వ్యవసాయం, అనుబంధరంగాలు - రూ. 146819 కోట్లు వాణిజ్యం, పరిశ్రమలు - రూ. 45,958 కోట్లు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి - రూ. 5900 కోట్లు విద్య - రూ. 124638 కోట్లు ఇంధనం - రూ. 76302 కోట్లు విదేశీ వ్యవహారాలు - రూ. 22154 కోట్లు ఆర్థికం - రూ. 87642 కోట్లు ఆరోగ్యం - రూ. 90171 కోట్లు హోం శాఖ - రూ. 202868 కోట్లు వడ్డీ చెల్లింపులు - రూ. 1190440 కోట్లు ఐటీ, టెలికామ్ - రూ. 115752 కోట్లు ప్లానింగ్, స్టాటిస్టిక్స్ - రూ. 6291 కోట్లు గ్రామీణాభివృద్ధి - రూ. 177000 కోట్లు శాస్త్రీయ విభాగాలు - రూ. 32169 కోట్లు సామాజిక సంక్షేమం - రూ. 56501 కోట్లు ట్యాక్స్, అడ్మినిస్ట్రేషన్ - రూ. 203297 కోట్లు జీఎస్టీ పరిహార నిధి - రూ. 150000 కోట్లు రాష్ట్రాలకు నగదు బదిలీలు - రూ. 286787 కోట్లు రవాణా - రూ. 5440039 కోట్లు కేంద్రపాలిత ప్రాంతాలు - రూ. 63541 కోట్లు పట్టణాభివృద్ధి - రూ. 77524 కోట్లు ఇదీ చదవండి: సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో.. -
Union Budget 2024-25: రూపాయి రాక..పోకలు ఇలా..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రానికి ఆదాయం ఎలా వస్తుంది.. ఎలా ఖర్చు చేస్తారో తెలిపారు. మొత్తం బడ్జెట్ రూ.47,65,768 కోట్లు పన్నుల ఆదాయం: రూ.26,01,574 కోట్లు పన్నేతర ఆదాయం: రూ.3,99,701 కోట్లు ఆదాయ లోటు: రూ.16,85,494 కోట్లు అప్పుల ద్వారా సమీకరణ: రూ.16,81,944 కోట్లు 2024-25లో రూపాయి రాక(శాతాల్లో) కార్పొరేషన్ పన్ను: 17 ఆదాయ పన్ను: 19 కస్టమ్స్ పన్ను: 4 కేంద్ర ఎక్పైజ్ పన్ను: 5 జీఎస్టీ, ఇతర పన్నులు: 19 పన్నేతర ఆదాయం: 7 రుణేతర మూలధన సేకరణ: 1 మార్కెట్ రుణాలు, సెక్యూరిటీలు, ఇతర రుణాలు: 28 రూపాయి పోక(శాతాల్లో) కేంద్ర ప్రభుత్వ పథకాలు/ వ్యయం: 16 రుణాలపై వడ్డీ చెల్లింపులు: 20 రక్షణ రంగ వ్యయం: 8 సబ్సిడీలు: 6 ఫైనాన్స్ కమిషన్ కింద కేటాయింపులు: 8 పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటా: 20 పెన్షన్ల చెల్లింపులు: 4 ఇతర ఖర్చులు: 10 కేంద్రపాయోజిత పథకాలు: 8 ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి -
సీతారామన్ కెరీర్లో కొత్త రికార్డ్ - కేవలం 56 నిమిషాల్లో..
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' నిన్న (ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టారు. బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన సుదీర్ఘ ప్రసంగాన్ని ఈమె కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసి కొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. గురువారం నాటి బడ్జెట్ సెషన్ ప్రసంగం సీతారామన్ తన కెరీర్లో చేసిన అతి చిన్న ప్రసంగం కావడం గమనార్హం. నిర్మలా సీతారామన్ ఇప్పటికి ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా 2020లో 160 నిముషాలు (2 గంటల 40 నిమిషాలు), అత్యల్పంగా 2024 మధ్యంతర బడ్జెట్ 56 నిముషాలు. 2019లో ఈమె బడ్జెట్ ప్రసంగం 140 నిముషాలు, 2021లో 100 నిముషాలు, 2022లో 91 నిముషాలు, 2023లో 87 నిమిషాల ప్రసంగం చేశారు. బడ్జెట్ 2024-25లో రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు వేలకోట్లు కేటాయించారు. ఇందులో రక్షణ రంగానికి, జాతీయ రహదారులు, రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, హోం శాఖకు పెద్ద పీట వేశారు. ఇదీ చదవండి: అందరికీ ఇళ్ళు - వచ్చే ఐదేళ్లలో 2 కోట్లు.. మధ్య తరగతికి...సొంతింటి వరం! నిర్మలా సీతారామన్ కంటే ముందు 1977లో కేంద్ర బడ్జెట్ సమర్పించిన 'హిరూభాయ్ ముల్జీభాయ్ పటేల్' అతి తక్కువ బడ్జెట్ ప్రసంగంగా రికార్డు క్రియేట్ చేశారు. ఆయన బడ్జెట్ ప్రసంగంలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. పదాల లెక్కన అత్యంత సుదీర్ఘ బడ్జెట్‌ను రూపొందించిన రికార్డు 'మన్మోహన్ సింగ్' పేరిట ఉంది. 1991లో సమర్పించిన ఆయన బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. -
Interim Budget 2024: మధ్య తరగతికి...సొంతింటి వరం!
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగానికి మరింత ఊతమిచ్చే దిశగా ఆర్థిక మంత్రి సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కరోనా అనంతరం సొంతిళ్ల కోసం డిమాండ్ పెరగ్గా.. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా హౌసింగ్ రంగానికి, పేద, మధ్య తరగతి వాసులకు మంత్రి తీపి కబురు చెప్పారు. ముఖ్యంగా కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు అందుబాటు ధరల ఇళ్లకు ప్రోత్సాహంపై దృష్టి సారించారు. ‘‘అద్దె ఇళ్లల్లో లేదా మురికివాడలు, అనధికారిక కాలనీల్లో నివసించే అర్హత కలిగిన మధ్యతరగతి ప్రజలు.. ఇంటి కొనుగోలుకు లేదా ఇంటి నిర్మాణానికి వీలుగా ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రారంభిస్తుంది’’అని మంత్రి సీతారామన్ తెలిపారు. అలాగే, వచ్చే ఐదేళ్ల కాలంలో పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద గ్రామీణ పేదల కోసం మరో రెండు కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉపాధి కల్పనకు దారితీస్తుందని ప్రాపర్టీ డెవలపర్లు, కన్సల్టెంట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి ఇళ్లు ‘‘కరోనా వల్ల అవరోధాలు ఎదురైనప్పటికీ పీఎం ఆవాస్ యోజన పథకం అమలును కొనసాగించాం. మూడు కోట్ల ఇళ్ల లక్ష్యానికి చేరువలో ఉన్నాం. వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించి ఇస్తాం’’అని మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్లు సమకూర్చడమనే లక్ష్యంతో కేంద్ర సర్కారు 2016లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకాన్ని ప్రారంభించింది. 2024 మార్చి నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. పరిశ్రమ డిమాండ్లు.. షాపూర్జీ పల్లోంజీ రియల్ ఎస్టేట్ ఎండీ, సీఈవో వెంకటేష్ గోపాలకృష్ణన్ ప్రభుత్వ చర్యలను గుర్తిస్తూనే.. ఈ రంగం పూర్తి సామర్థ్యాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వచ్చే బడ్జెట్లో లకి‡్ష్యత చర్యలను ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘పట్టణ, సుస్థిరాభివృద్ధికి ప్రకటించిన చర్యలు దేశీయ రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో సానుకూల ప్రభావం చూపిస్తాయి’’ అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈవో గౌరవ్ పాండే పేర్కొన్నారు. మూలధన వ్యయాలను పెంచడం , అందుబాటు ధరల ఇళ్లపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించడాన్ని టాటా రియల్టీ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ప్రస్తావించారు. ‘‘ఊహించినట్టుగానే బడ్జెట్లో భారీ ప్రకటనలు ఏవీ లేవు. కానీ, మౌలిక వసతులను మెరుగు పరచడానికి, దేశవ్యాప్త అనుసంధానతపై దృష్టిని కొనసాగించడం.. రియల్ ఎస్టేట్ వృద్ధికి మేలు చేస్తుంది’’అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు. ప్రోత్సాహకరం.. బడ్జెట్ ప్రతిపాదనలపై క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు బొమాన్ ఇరానీ స్పందించారు. ఈ తరహా చర్యలు ప్రోత్సాహకరమని, హౌసింగ్ మార్కెట్ వృద్ధికి సాయపడతాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధిపై స్థిరమైన దృక్పథం హౌసింగ్ రంగానికి ఊతమిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ పథకం ద్వారా హౌసింగ్ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తన మద్దతు కొనసాగించడం ప్రశంసనీయమని నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు పేర్కొన్నారు. పట్టణ మధ్యతరగతి వాసులకు కొత్త పథకాన్ని ప్రకటించడం సామాన్యుల్లోనూ, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోనూ విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. నూతన పథకానికి సంబంధించి మరింత స్పష్టత కోసం చూస్తున్నట్టు చెప్పారు. ఎన్నో సానుకూలాంశాలు.. ఆర్థిక వ్యవస్థగా, అపార వాగ్దాన వ్యవస్థగా, అభివృద్ధి చెందిన దేశం వైపు భారత్ పయనిస్తున్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తోంది. గ్రామీణ, పర్యాటకం, మహిళా సాధికారత, సాంకేతికతపై దృష్టి సారించి ప్రజా పనుల కోసం మూలధన వ్యయాన్ని నిరంతరం పెంచడం పట్ల సంతోషిస్తున్నాము. రూ.1 లక్ష కోట్ల నిధి వంటి ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. ఇది గొప్ప బడ్జెట్. – సంజీవ్ పురీ, చైర్మన్, ఐటీసీ. ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు.. సీతారామన్ ప్రెజెంటేషన్ అతిచిన్న ప్రసంగాల్లో ఒకటి. తక్కువ మాటల్లో ఎక్కువ విషయాలు ఉన్నాయి. ఇది స్వాగతించదగినది. నిశ్శబ్ద విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎన్నికల ముందు బడ్జెట్లలో సంప్రదాయంగా ఊహించినట్లుగా ఎలాంటి ప్రజాకర్షక చర్యలు ప్రకటించలేదు. ఆర్థిక లోటు లక్ష్యం అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంది. – ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా గ్రూప్ భవిష్యత్తును ప్రతిబింబించేలా.. 60 బిలియన్ డాలర్ల వార్షిక ఎఫ్‌డీఐ స్థాయిని మరింత పెంచడానికి కొన్ని సాహసోపేతమైన చర్యలు అవసరం. డిజిటల్ అవస్థాపనపై మరింత ఊపుతో పాటు బ్యాంకింగ్, విద్యుత్ రంగ సంస్కరణలు మెరుగైన వికసిత్ భారత్‌కు ఆవశ్యకమైనవి. మధ్యంతర బడ్జెట్ ప్రజాకర్షక చర్యలకు దూరంగా ఉన్నందున వర్తమానాన్ని చాకచక్యంగా నిర్వహిస్తూ భవిష్యత్తును ప్రతిబింబించే సమయం, దృక్పథం రెండింటినీ సూచిస్తుంది. – జి.పి.హిందూజా, చైర్మన్, హిందూజా గ్రూప్ ఆవిష్కరణలకు దన్ను.. దేశీ ఫార్మా 2030 నాటికి 120–130 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వర్ధమాన రంగాల్లో పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కేటాయింపనేది ఆవిష్కరణలకు దన్నుగా నిలవగలదు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, స్థానికంగా తయారీని ప్రోత్సహించే చర్యలు స్వాగతించతగ్గవి. – సతీష్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.. వివేకవంతమైన, సమ్మిళిత బడ్జెట్. సబ్కా సాథ్ సబ్కా వికాస్‌కు అనుగుణంగా అవసరాలు, ఆకాంక్షలకు ప్రాధాన్యతనిస్తూ గరీబ్ కళ్యాణ్, నారీ శక్తి, యువ (యువ సాధికారత), అన్నదాత (రైతుల సాధికారత) గురించి ఉద్ఘాటించడం ప్రభుత్వ దార్శనికత, అందరి సమగ్ర అభివృద్ధికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. – çపవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటో -
Budget 2024: సబ్సిడీలకు కోతలు.. తగ్గిన కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పలు సబ్సిడీలకు కేటాయింపుల్లో కోతలు పెట్టింది. రైతులకు అందించే ఎరువులు, ఆహార, పెట్రోలియం ఉత్పత్తులకు సబంధించిన కేటాయింపులను ఈ బడ్జెట్లో గణనీయంగా తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.1.64 లక్షల కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.1.89 లక్షల కోట్లతో పోల్చితే 13.2 శాతం తగ్గించారు. అలాగే 2023-24 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్రం యూరియాపై సబ్సిడీ, ఇతర ఎరువులపై పోషకాల ఆధారిత సబ్సిడీ ఇస్తుంది. అంతర్జాతీయ ధరలు తగ్గుముఖం పట్టడం, బయో, సేంద్రియ ఎరువుల కోసం ఒత్తిడి పెరగడం , నానో-యూరియా వినియోగం పెరిగిన నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎరువు సబ్సిడీకి కేటాయింపు తగ్గుదల కనిపించింది. దేశం మొత్తం ఎరువుల వినియోగంలో యూరియా 55-60 శాతం ఉంటోంది. రైతులకు సబ్సిడీ యూరియా 45 కిలోల బ్యాగ్ రూ.242లకు లభిస్తోంది. దీనికి పన్నులు, వేప పూత ఛార్జీలు అదనం. అయితే ఇదే బ్యాగ్ అసలు ధర సుమారు రూ.2,200 ఉంది. ఇక ఆహార, పెట్రోలియ ఉత్పత్తులపై ఇస్తున్న సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులను 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం తగ్గించింది. ఆహార ఉత్పత్తుల సబ్సిడీ కోసం ఈ బడ్జెట్లో రూ.2,05,250 కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయించిన రూ.2,12,332 కోట్లతో పోల్చితే 3.33 శాతం తక్కువ. అలాగే పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీ కోసం గతేడాది కేటాయించిన రూ. 12,240 కోట్ల కంటే 2.6 శాతం తక్కువగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11,925 కోట్లు కేటాయించింది. -
రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రసంగంలోని కీలక అంశాలు
మహిళలు, యువత, పేదలు, రైతులపై ప్రత్యేక దృష్టి సారించి 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఈ బడ్జెట్‌ను సమర్పించారు . మధ్యంతర బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతానికి పన్ను రేట్లను యథాతథంగా ఉంచింది. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత జులైలో సమర్పించే పూర్తి బడ్జెట్లో మోదీ ప్రభుత్వం ‘వీక్షిత్ భారత్’ నినాదంతో రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరిస్తారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. వేతనజీవులకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి ముఖ్యమైన ప్రకటన చేయలేదు. ఆర్థిక మంత్రి సీతారామన్ గురువారం పన్ను స్లాబ్‌లను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించారు. పాత , కొత్త పన్ను స్లాబ్లే ప్రస్తుతానికి కొనసాగుతాయని చెప్పారు. వందే భారత్ తరహా బోగీలు ప్రయాణికుల భద్రత, సౌలభ్యంమేరకు 40,000 సాధారణ రైల్వే బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా మారుస్తామని మంత్రి చెప్పారు. కేంద్రం మూడు ప్రధాన ఆర్థిక రైల్వే కారిడార్ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, అధిక ట్రాఫిక్ ఉన్న కారిడార్లుగా విభజించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. మహిళాసాధికారత కోసం.. నిర్మలాసీతారామన్ ఎన్నికల ముందు బడ్జెట్ ప్రసంగంలో మహిళా సాధికారతపై దృష్టి సారించే కొన్ని ప్రతిపాదనలు ప్రకటించారు. కేంద్రం ‘లక్పతి దీదీ’ పథకం మంచి విజయం సాధించిందని చెప్పారు. ఈ పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు శిక్షణనిస్తారు. దాంతో వారు ఏటా కనీసం రూ.1 లక్ష రూపాయల స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మహిళా హెల్పర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య సంరక్షణ అందించాలని పేర్కొన్నారు. ఇన్ఫ్రా రంగానికి బూస్ట్ ఆర్థికమంత్రి మాట్లాడుతూ 2024-25లో చేపట్టనున్న భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు రూ.11.1 లక్షల కోట్లకు పెంచామని తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.1 శాతం పెరిగిందని చెప్పారు. ఇది జీడీపీలో 3.4 శాతం ఉంటుందని వివరించారు. గత 4 సంవత్సరాలలో మూలధన వ్యయం మూడింతలు కావడం వల్ల ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనపై ప్రభావం పడినట్లు తెలిపారు. మధ్యతరగతిని ఆకర్షించేలా.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి అద్దె నివాసాలు, మురికివాడల్లో ఉంటున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు మంత్రి చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో గ్రామీణ పేదలకు మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ఆమె ప్రకటించారు. రక్షణ వ్యయం ప్రభుత్వం 2024-25 ఆర్థికసంవత్సరంలో రక్షణ వ్యయాన్ని రూ.6.2 లక్షల కోట్లకు పెంచింది. ఇది మొత్తం వ్యయంలో దాదాపు 8 శాతం ఉంటుంది. రక్షణ రంగానికి ఊతమిచ్చేలా డీప్టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీతారామన్ చెప్పారు. ఎఫ్‌డీఐ(ఫస్ట్ డెవలప్మెంట్ ఇండియా) భారతదేశాన్ని అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి మరింత వృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. ఎఫ్‌డీఐ స్ఫూర్తితో విదేశీ భాగస్వాములతో ప్రభుత్వం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని చెప్పారు. 2014-23లో 596 బిలియన్ యూఎస్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చినట్లు తెలిపారు. 2005-14తో పోలిస్తే దాదాపు రెండింతలుగా ఉందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం.. పరిశోధనలు, ఆవిష్కరణలు పెంచడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేలా 50 సంవత్సరాల వడ్డీ రహిత రుణాలతో రూ.1 లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి దేశీయ పర్యాటకానికి ఊతమిచ్చేలా.. బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీప్ వంటి దేశీయ పర్యాటక స్థలాలకు ఆదరణ పెరుగుతోందని మంత్రి చెప్పారు. దేశీయంగా టూరిజం అభివృద్ధిలో భాగంగా లక్షద్వీప్‌తో ఇతర ప్రాంతాలకు పోర్ట్ కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాజెక్టులు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తున్నట్లు ఆమె వివరించారు. -
Union Budget 2024-25: తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులు ఇవే..
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ముందుగా భావించారు. కానీ ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఆశించినమేర కేటాయింపులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో రైల్వేలకు సంబంధించి మంత్రి అశ్వినీవైష్ణవ్ మాట్లాడారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.5,071 కోట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 100శాతం విద్యుదీకరణ పూర్తయిందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ అన్నారు. రాష్ట్రంలో రైల్వేపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీకి పీఎం శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి నిధులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి 240 కి.మీ ట్రాక్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. ఏపీలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తి అయినట్లు వివరించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి విశాఖ రైల్వే జోన్ కోసం 53 ఎకరాల భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఇంకా భూమి అప్పగించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్ సైతం సిద్ధమైందన్నారు. -
Budget 2024: ‘లక్షపతి దీదీ’.. ఆర్థికమంత్రి ప్రస్తావించిన ఈ స్కీమ్ గురించి తెలుసా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన మధ్యంతర బడ్జెట్లో ‘లక్షపతి దీదీ’ పథకం గురించి ప్రస్తావించారు. సహాయక గ్రూపు మహిళలకు సంబంధించిన ఈ పథకం లక్ష్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. "తొమ్మిది కోట్ల మంది మహిళలతో కూడిన 83 లక్షల స్వయం సహాయక సంఘాలు సాధికారత , స్వావలంబనతో గ్రామీణ సామాజిక-ఆర్థిక దృశ్యాన్ని మారుస్తున్నాయి. వారి విజయం ఇప్పటికే దాదాపు కోటి మంది మహిళలను లక్షపతి దీదీలుగా మార్చడానికి సహాయపడింది. ఈ విజయం ఉత్సాహంతో లక్షపతి దీదీ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచాలని నిర్ణయించాం" అని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పార్లమెంటుకు తెలిపారు. అసలేంటి ఈ పథకం? గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా గ్రామాల్లోని 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించేందుకు 'లక్షపతి దీదీ' పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద మహిళలకు ప్లంబింగ్, ఎల్ఈడీ బల్బుల తయారీ, డ్రోన్లను ఆపరేట్ చేయడం, రిపేర్ చేయడం వంటి నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. తద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపడి వారు ఏటా రూ.లక్షకు పైగా ఆదాయాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తారు. -
1,361 మార్కెట్ల అనుసంధానం.. వ్యవసాయానికి కేటాయింపులు ఇవే..
మోదీ ప్రభుత్వ హయాంలో 2023 సంవత్సరంలోనే దేశ వ్యాప్తంగా పీఎం ముద్ర యోజన కింద 43 కోట్ల మందికి రూ.22 లక్షల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. బడ్జెట్ 2024-25 ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆమె వ్యవసాయ రంగానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై పార్లమెంట్ లో మాట్లాడిన ఆమె.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవటంలో ప్రభుత్వం ఎంతో ఉదారత చూపిందని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో భారీగా కుదేలైన చిన్న పరిశ్రమలను ఆదుకోవటం కోసం లక్ష్యాలను మించి అదనంగా రూ.2 లక్షల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ప్రధానమంత్రి ఫసల్ బీయా యోజన కింద దేశంలో 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా అందించామన్నారు. రైతులు సరుకు అమ్ముకోవడానికి రూ.3 లక్షల కోట్ల రూపాయలతో 1,361 మార్కెట్ యార్డులను అనుసంధానించామన్నారు. దీని వల్ల పంటల అమ్మకం ద్వారా రైతులు అధిక ప్రయోజనం పొందారని మంత్రి చెప్పారు. -
Budget 2024 Highlights: అందరికీ ఇళ్ళు - వచ్చే ఐదేళ్లలో 2 కోట్లు..
లోక్‌సభ ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్ 2024 ప్రకటనలో.. అద్దె ఇళ్లలో నివసించే వారితో పాటు మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే వారి కోసం ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందరికి హౌసింగ్ (Housing for All) మిషన్ కింద.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-Urban) & ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-రూరల్ (PMAY-Rural) లేదా గ్రామీణ పథకాలు ఉన్నాయి. పీఎంఏవై-రూరల్ కింద 30 మిలియన్ల ఇళ్లను నిర్మించామని, కుటుంబాల సంఖ్య పెరగడం వల్ల తలెత్తే డిమాండ్‌ను తీర్చాడనికి వచ్చే ఐదేళ్లలో 20 మిలియన్స్ లేదా 2 కోట్ల ఇళ్లను చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మధ్య తరగతి ప్రజల కోసం కొత్త గృహనిర్మాణ పథకంపై, అర్హులైన మధ్యతరగతి ప్రజలు స్వంత గృహాలను కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇదీ చదవండి: 2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే! ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకానికి కేంద్ర బడ్జెట్ 2023లో ఏకంగా రూ. 79000 కోట్లు కేటాయించింది. ఇది అంతకు ముందు ప్రవేశపెట్టగా బడ్జెట్ కంటే 66 శాతం ఎక్కువ. ఇందులో 'అందరికీ హౌసింగ్' మిషన్‌ను వేగవంతం చేయడానికి పీఎంఏవై-అర్బన్‌కు రూ. 25,103 కోట్లు కేటాయించారు. మిగిలిన మొత్తం పీఎంఏవై-రూరల్ పథకానికి కేటయించారు. -
బడ్జెట్ 2024-25: సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్.. ఫొటోలు వైరల్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయం నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. అసలు ఇది బడ్జెట్టేనా అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు చివరకు తమకు నిరాశే మిగిలినట్లు కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో బడ్జెట్‌పై నెటిజన్స్ మీమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని సినిమాల్లోని చిత్రాలను ఫన్నీగా చిత్రీకరించి వాళ్లకు నచ్చిన కామెంట్లు అందులో రాసి వైరల్ చేస్తున్నారు. 😂#Budget2024 pic.twitter.com/DRgfeliYdP — Finance Memes (@Qid_Memez) January 27, 2024 Salaried class looking at Nirmala Sitharaman for tax relief 😂#Budget2024 pic.twitter.com/pg1fhgJDlt — Finance Memes (@Qid_Memez) February 1, 2024 Salaried Class looking at Nirmala Sitharaman's Budget for tax reliefs #Budget2024 pic.twitter.com/zf85GmwRJR — Nimo Tai (@Cryptic_Miind) February 1, 2024 -
Budget 2024: మహిళలకు కీలక ప్రకటనలు ఇవే..
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మహిళలకు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేశారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంలోని బడ్జెట్ ప్రకటనలలో అంగన్వాడీ, ఆశా వర్కర్లందరికీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా కవరేజీని విస్తరించడం, లక్షపతి దీదీ పథకం లక్ష్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి-జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఫండెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆసుపత్రిలో చేరేందుకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల కవరేజీని అందిస్తుంది. ఇక కేంద్ర ప్రబుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ‘లక్షపతి దీదీ’ పథకం లక్ష్యాన్ని పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందుతుండగా దీన్ని 3 కోట్ల మందికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. మహిళా సాధికారతపై మంత్రి మాట్లాడుతూ, "10 సంవత్సరాలలో ఉన్నత విద్యలో మహిళల నమోదు 28 శాతం పెరిగింది, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ (STEM) కోర్సులలో బాలికలు, మహిళలు 43 శాతం నమోదు చేసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఈ పురోగతులన్నీ శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంలో ప్రతిబింబిస్తాయి. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 1/3 సీట్ల రిజర్వేషన్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 70 శాతం ఇళ్లు మహిళలకు గౌరవాన్ని పెంచాయి." అన్నారు. -
బడ్జెట్లో ప్రభుత్వ పథకాలకు కేటాయింపులు ఇలా..
2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వివిధ ప్రభుత్వ పథకాలకు కొత్త బడ్జెట్లో ప్రతిపాదించిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ.86 వేల కోట్లు ఆయుష్మాన్ భారత్: రూ.7,500 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లు సెమీ కండక్టర్స్, డిస్ప్లే ఎకో వ్యవస్థల తయారీ: రూ.6,903 కోట్లు సోలార్ విద్యుత్ గ్రిడ్: రూ.8,500 కోట్లు గ్రీన్ హైడ్రోజన్ మిషన్: రూ.600 కోట్లు -
Budget 2024 Highlights: ఈవీ రంగం అంచనాలు తారుమారు..
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి పెద్ద పీట వేస్తారని, ఫేమ్ సబ్సిడీ కొనసాగిస్తారని చాలామంది భావించారు. కానీ నిర్మలమ్మ ప్రతిపాదనల్లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన పెద్ద ప్రకటనలు వెలువడలేదు. మా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను విస్తరిస్తుందని, కొత్త ఈవీల తయారీ మాత్రమే కాకుండా ఛార్జింగ్ వంటి వాటికి మద్దతు కల్పిస్తామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి కావలసిన మౌలిక సదుపాయాలను తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్రజా రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: 2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే! ఫేమ్ II సబ్సిడీ పథకం ముగిసిన తరువాత ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించలేదు. కానీ ఎలక్ట్రిక్ వాహనాల మాన్యుఫ్యాక్షరింగ్, ఇన్‌స్టాలింగ్ వంటి వాటిలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని సమాచారం. -
రూ.47.65 లక్షల కోట్లు బడ్జెట్.. కేటాయింపులు ఇలా..
బడ్జెట్ 2024-25లో భాగంగా రూ.47.65 లక్షల కోట్లను ప్రకటించిన ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మౌలికవసతుల కల్పనకు ప్రాముఖ్యం ఇచ్చారు. ప్రధానంగా వివిధ విభాగాలకు కేటాయింపులు ఈ కింది విధంగా ఉన్నాయి. రక్షణ రంగం: రూ 6.2 లక్షల కోట్లు ఉపరితల రవాణా, జాతీయ రహదారులు: రూ. 2.78 లక్షల కోట్లు రైల్వే: రూ.2.55 లక్షల కోట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ: రూ.2.13 లక్షల కోట్లు హోం శాఖకు: రూ.2.03 లక్షల కోట్లు గ్రామీణాభివృద్ది: రూ.1.77లక్షల కోట్లు రసాయనాలు, ఎరువులు: రూ.1.68 లక్షల కోట్లు కమ్యూనికేషన్లు: రూ.1.37 లక్షల కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమం: రూ.1.27 లక్షల కోట్లు -
Union Budget 2024: ట్యాక్స్ పేయర్స్‌కు నిరాశే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024 మధ్యంతర బడ్జెట్ ట్యాక్స్ పేయర్స్‌ను నిరాశపరిచింది. పన్ను రేట్లకు సంబంధించిన ఎలాంటి ప్రకటనలు ఆర్థిక మంత్రి చేయలేదు. దీంతో పన్ను రేట్లు యథాతథంగా ఉంటాయి. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితి రూ. 7 లక్షలు ఉంది. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీన్ని రూ.8 లక్షలకు పెంచుతారని భావించారు. కానీ ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో నిరాశే మిగిల్చింది. ఇక పన్ను శ్లాబులకు విషయానికి వస్తే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో 5 పన్ను శ్లాబులు ఉన్నాయి. ఇవి గతంలో ఆరు శ్లాబులు ఉండగా గతేడాది ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గతేడాది గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. అయితే ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో పన్నుచెల్లింపుదారులకు ఎటువంటి ఊరటలను కేంద్రం ప్రకటించకపోవడంతో నిరాశ తప్పలేదు. కాస్త ఊరట.. పన్ను బకాయిల రద్దు పన్ను రేట్ల విషయంలో నిరాశ పరిచినప్పటికీ పాత పన్ను బకాయిలు రద్దు చేస్తూ ఈ బడ్జెట్ కాస్త ఊరటనిచ్చింది. 2009-10 కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.25,000, అలాగే 2014-15కి ముందున్న పన్ను బకాయిలు గరిష్టంగా రూ.10,000 వరకూ రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. -
2024 బడ్జెట్ - కీలకమైన అంశాలు ఇవే!
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పేదలు, మహిళలు, యువత, రైతుల పరిస్థితులను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024లో కీలకమైన అంశాలు ప్రభుత్వం మరింత సమగ్రమైన GDP (పాలన, అభివృద్ధి, పనితీరు)పై దృష్టి పెట్టింది. ప్రభుత్వం 10 ఏళ్లలో 250 మిలియన్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది. పంటల బీమా పథకం ప్రయోజనాలు 40 మిలియన్ల మంది రైతులకు చేరుతాయి. ద్రవ్యోల్బణం తగ్గింది, ఆర్థిక వృద్ధి పుంజుకుంది. పన్ను సంస్కరణలు పన్ను స్థావరాన్ని విస్తృతం చేశాయని, పన్ను వసూళ్లను పెంచాయని అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో అపూర్వమైన ఆర్థిక వృద్ధి ఉంటుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశాన్ని 'విక్షిత్' (అభివృద్ధి) చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆమె చెప్పారు. రక్షణ ప్రయోజనాల కోసం డీప్ టెక్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. అర్హులైన మధ్యతరగతి వర్గాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుందని వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల విజయం వల్ల 1 కోటి మంది మహిళలు "లక్షపతి దీదీ'లుగా మారేందుకు సాధికారత కల్పించారని పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులలో ఎలాంటి మార్పులు లేవు స్టార్టప్‌లకు పన్ను ప్రయోజనాలు, సార్వభౌమ సంపద ద్వారా చేసే పెట్టుబడులు, పెన్షన్ ఫండ్లు మార్చి 2025 వరకు పొడిగించబడతాయి. దేశంలో పర్యాటక రంగంలో ప్రభుత్వం గణనీయమైన పెట్టుబడులు పెడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్ 2024 ప్రసంగంలో తెలిపారు. -
రానున్న రోజుల్లో పీఎం గతిశక్తిపై మరిన్ని ఆశలు
దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రూ.100లక్షల కోట్ల విలువతో ఈ కార్యక్రమాన్ని గతంలో రూపొందించిన విషయం తెలిసిందే. మల్టీమోడల్ కనెక్టివిటీతో చాలా ప్రయోజనాలు చేకూరుతున్నాయని బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి చెప్పారు. రైల్కారిడార్లో ప్రధానంగా ఎనర్జీ, మినరల్, పోర్ట్కనెక్టవిటీ, హైట్రాఫిక్ ఉన్న ప్రదేశాల్లో సమర్థంగా రైళ్లను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లాజిస్టిక్ ఎఫిషియన్సీ, రెడ్యూసింగ్ కాస్ట్, వేగాన్ని పెంచేలా ఏర్పాటు చేశామన్నారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి పీఎం గతిశక్తి పథకంతో 25ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు గతంలోనే మోదీ చెప్పారు. దాదాపు 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా రానున్న రోజుల్లో దేశ మౌలిక వసతుల ముఖచిత్రమే సమూలంగా మారిపోతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
మహిళలు, యువత, రైతులపై దృష్టి - నిర్మలా సీతారామన్
లోక్‌సభ ఎన్నికలకు ముందు 2024 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్నింటిలోనూ, అందరినీ కలుపుకొని, సర్వవ్యాప్తి చెందే అభివృద్ధికి ఒక విధానంతో పని చేసిందని వెల్లడించారు. మోదీ ప్రభుత్వ అభివృద్ధి దార్శనికత అన్ని కులాలు, అన్ని స్థాయిల ప్రజలను కవర్ చేస్తుందని పేర్కొన్న సీతారామన్ 2047 నాటికి భారతదేశాన్ని 'అభివృద్ధి చెందిన భారత్'గా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఈ విజన్‌కు అనుగుణంగా పేద, మహిళా, యువ (యువకులు), రైతులు అనే నాలుగు ప్రధాన కులాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పేద ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగతి చెందుతుందని.. వారి జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తన మద్దతుని అందిస్తుంది వెల్లడించింది. వారి సాధికారత, శ్రేయస్సే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది కేంద్ర మంత్రి అన్నారు. -
2047 నాటికి వికసిత భారత్ - నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో రైతు భీమా, పీఎం ఆవాస్ యోజన వంటి వాటిని గురించి వివరించారు. కొత్త సంస్కరణలతో పారిశ్రామిక వేత్తలు పెరిగారని, గత పదేళ్లలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందని, దేశంలో అవినీతి కుటుంబ పాలనను అంతమొందించినట్లు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ పాలన పారదర్శకంగా మారిందని.. ఐఐటీ, ఐటీటీల సంఖ్య కూడా భారీగా పెరిగిందని వెల్లడించారు. పేదల అభివృద్దే.. దేశ అభివృద్ధి అని వెల్లడిస్తూ.. 2047 నాటికి వికసిత భారత్ సాధ్యమవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాల వృద్ధిలో కూడా భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని వెల్లడించారు. -
బడ్జెట్ 2024: మంత్రికి పెరుగు తినిపించిన రాష్ట్రపతి
మధ్యంతర బడ్జెట్ 2024-25 సమర్పణకు వెళ్లే ముందు భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పెరుగు తినిపించారు. 2024-25 ముందస్తు ఎన్నికల బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి పార్లమెంటుకు వెళ్లే ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పించేందుకు అనుమతి తీసుకుంటారు. అందులో భాగంగానే మంత్రి రాష్ట్రపతిని కలిశారు. ముర్ము నిర్మలమ్మకు పెరుగు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. -
Budget 2024-25: రాష్ట్రపతిని కలిసిన నిర్మలమ్మ - ఫోటోలు
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024-25 ఆర్థిక సంవత్సరానికి కోసం పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అంతకంటే ముందు రాష్ట్రపతి 'ద్రౌపది ముర్ము'ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మలా సీతారామన్ రాష్ట్రపతిని కలిసిన ఫోటోలను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరద్, శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా ముర్ము కేంద్ర ఆర్థిక మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. మధ్యంతర బడ్జెట్లో రైతులకు, కార్మికులకు, నిరుద్యోగ యువతతో పాటు మహిళా విభాగాలకు సానుకూల ప్రతిపాదనలు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. మధ్యంతర బడ్జెట్ 2024 కేవలం "ఓట్ ఆన్ అకౌంట్" మాత్రమేనని, నిజమైన యూనియన్ బడ్జెట్ 2024ని ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుందని చెబుతున్నారు. మరిన్ని 2024-25 బడ్జెట్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Union Minister of Finance and Corporate Affairs Smt Nirmala Sitharaman along with Ministers of State Dr Bhagwat Kishanrao Karad and Shri Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the… pic.twitter.com/miwSv8r4dE — President of India (@rashtrapatibhvn) February 1, 2024 -
Budget 2024-25: నిర్మలమ్మ చీర ప్రత్యేకత ఇదే..
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్లే కాదు.. ప్రత్యేకరోజున ఆవిడ కడుతున్న చీరలు అందరిలో ఆసక్తి కలిగిస్తున్నాయి. టెంపుల్ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో గతేడాది బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అందరినీ ఆకట్టుకున్న ఎరుపు రంగు చేనేత చీర గుర్తుందా.. ఆ ఇల్కల్ చేనేత చీరను నవల గుంద కసూతితో రూపొందించిన విషయ తెలిసిందే. తాజాగా 2024-25 బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టస్సర్ హ్యాండ్లూమ్ బ్లూ, క్రీమ్ రంగు చీరను ఎంచుకున్నారు. మరికాసేపట్లో పార్లమెంట్లో ప్రభుత్వ ఓట్ ఆన్ అకౌంట్‌ను సమర్పించనున్న నిర్మలమ్మ ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందు సీనియర్ అధికారులతో సంప్రదాయ బహీ ఖాతా ట్యాబ్లెట్‌తో దర్శనమిచ్చారు. గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక సందర్భాలలో ధరించిన చీరలెంటో చూద్దాం.. ►అమరవీరుల దినోత్సవం సందర్భంగా రూ.10 నోటు రంగుతో సరిపోయే మణిపురి చీర ధరించింది. ►పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో 20 రూపాయల నోటు రంగులో పచ్చని మంగళగిరి చీర.. ►సౌత్ సిల్క్ చీరలో రూ. 2000 నోటు రంగు సరిపోతుంది ►రూ.100 నోటు రంగులో లిలక్ సంబల్పురి చీర ► గతంలో మన్మోహన్ సింగ్‌ను కలిసే ముందు రూ.200 నోటు రంగు చీర ►అమెరికాలో జరిగిన ప్రపంచ బ్యాంకు సమావేశంలో 500 నోటు కలర్ చీర ధరించారు. #WATCH | Union Finance Minister Nirmala Sitharaman will present the interim budget today pic.twitter.com/irGtbAcPbP — ANI (@ANI) February 1, 2024 -
Interim Budget 2024: బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Live Updates.. ►లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ రూపొందించాం. యువతీ యువకుల కోసమే ఈ బడ్జెట్. అందరి అవసరాలు తీర్చే బడ్జెట్ ఇది. మౌళిక సదుపాయాల కోసం రూ.11వేల కోట్లు కేటాయించాం. పేదలు, రైతులకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగం. కోటి గృహాలకు ఉచిత సోలార్ విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. ►లోక్‌సభ రేపటికి వాయిదా. ►లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డిజిటల్ రూపంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల. ఇది ప్రజల బడ్జెట్. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధిస్తోంది. ప్రధాని మోదీ సారధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంది. వేతన జీవులకు ఊరట కొత్త పన్ను విధానంతో రూ. 7లక్షల వరకు పన్ను లేదు. ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడెక్షన్ రూ.50వేల నుంచి 75వేలకు పెంపు. ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి. పన్ను చెల్లింపుదారులకు అభినందనలు. ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనా. ఫిజికల్ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గింపు. కార్పొరేట్ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింపు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పులు లేవు. ఆదాయపు పన్నుల శ్లాబులు యథాతథం. 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు. ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం. ఈ ఏడాది అప్పులు రూ.14లక్షల కోట్లు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్.. అదే మా మంత్రం. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు. గత పదేళల్లో అందరికీ ఇళ్లు, గ్యాస్, నీళ్లు ఇచ్చాం. అవినీతిని గణనీయంగా తగ్గించాం. శతాబ్ధంలోని అతిపెద్ద సంక్షోభం కోవిడ్‌ను అధిగమించాం. కోవిడ్‌ను అధిగమించి అభివృద్ధి సాధించాం. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం. #WATCH | Union Finance Minister Nirmala Sitharaman presents the Union Interim Budget 2024-25. "...The Indian economy has witnessed a profound positive transformation in the last 10 years, The people of India are looking ahead to the future with hope and optimism. With the… pic.twitter.com/yJUnh3WLze — ANI (@ANI) February 1, 2024 మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్మెంట్, పర్ఫార్మెన్స్. ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ప్రజల ఆదాయంలో పెరుగుదల ఉంది. పన్ను సంస్కరణలతో గుణాత్మకమైన పురోగతి సాధించాం. ద్రవ్యోల్భణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం. పాలనలో పారదర్శకతను పెంచాం. మూలధన వ్యయం రూ.11.1లక్షల కోట్లకు పెంపు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింపు. రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు. స్టార్ట్‌ప్‌ల కోసం రూ.43వేల కోట్ల రుణాలు. టూరిజాన్ని పొత్రహించేందుకు వడ్డీ లేని రుణాలు. దేశంలో కొత్తగా 5 సమీకృత యాక్టివ్ పార్కులు. 30కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం. 9కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించాం. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చాం. రూప్ టాప్ సోలార్ విధానంలో కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఇచ్చాం. పీఎం విశ్వకర్మ యోజన పథకంతో చేతి వృత్తుల వారిని కాపాడుకుంటున్నాం. ఆశావర్కర్లు అందరికీ ఆయుష్మాన్ భారత్. లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టార్‌కి కార్పస్ ఫండ్. వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. అంగన్వాడీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేశాం. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో విజయం సాధించాం. విషన్ ఫర్ వికసిత్ భారత్... సుసంపన్నమైన భారత్‌ను ఏర్పాటు చేయడం మా లక్ష్యం. ప్రకృతితో మమేకమై, ఆధునిక మౌలిక సదుపాయాలతో అందరికీ వారి సామర్థ్యానికి తగ్గట్టుగా రాణించేందుకు అవకాశం కల్పించడం మా లక్ష్యం. అందరి విశ్వాసం చూరగొనడం ద్వారా రానున్న ఐదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి కనిపించనుంది. ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించేందుకు సువర్ణ సంవత్సరాలుగా మిగలనున్నాయి. పీఎం ఫసల్ కింద నాలుగు కోట్ల మంది రైతులకు బీమా అందించాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్భణం, అధిక వడ్డీ. పీఎం ఆవాస్ యోజక కింద మహిళలకు 70వేల గృహాలు అందించాం. యూరప్ ఎకనామిక్ కారిడార్ దేశానికి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. డెమోగ్రఫీ, డెమొక్రసీ, డైవర్శిటీలకు సబ్ కా ప్రయాస్ అంటే అందరి ప్రయత్నాలను జోడించడం ద్వారా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చగలం. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో అవకాశాలకు కొదవలేదని, ఆకాశమే హద్దని వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మా ప్రభుత్వానికి సకాలంలో తగినంత ఆర్థిక వనరులు, టెక్నాలజీలు, శిక్షణ ఇవ్వడం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందివ్వడం ప్రాధాన్యమైన అంశం. పంచామృత్ లక్ష్యాలకు అనుగుణంగా మరింత సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తాం ఇంధన భద్రత, అందరికీ చౌకగా ఇంధనం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు ఎకనామిక్, లాజిస్టిక్ కారిడార్లను ఏర్పాటు చేస్తున్నాం. మూడు మేజర్ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. కొత్త రోడ్, రైలు కారిడార్లను అందుబాటులోకి తెలుస్తున్నాం. 40వేల నార్మల్ బోగీలను వందే భారత్ మోడల్లోకి మారుస్తున్నాం. పోర్టు కనెక్టివిటీ కారిడార్ అభివృద్ధి జరిగింది. పీఎం గతిశక్తి ద్వారా మల్టీమోడల్ కనెక్టివిటీ అభివృద్ధి. మత్య్స రంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెండింతలు పెరిగాయి. మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లను అందిస్తాం. 517 ప్రాంతాలకు కొత్తగా విమాన సర్వీసులు. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి ప్రోత్సాహం కల్పిస్తాం. పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించడం, గొడౌన్లు, శీతలీకరణ గిడ్డంగుల ఏర్పాటు తదితర రంగాల్లో ఈ భాగస్వామ్యం ఉంటుంది. వేర్వేరు పంటలకు నానో డీఏపీ వాడకాన్ని దేశంలోని అన్ని వ్యవసాయ ప్రాంతాలకు విస్తరిస్తాం. నూనెగింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భరతకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తాం. అధిక దిగుబడులిచ్చే వంగడాల వృద్ధికి పరిశోధనలు చేపడతాం పాడి రైతుల అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం ఒకదాన్ని సిద్ధం చేస్తాం. పాల ఉత్పత్తిలో భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కానీ.. పశువులను వృద్ధి చేయడంలో మాత్రం వెనుకబడి ఉంది. ఈ లోటును అధిగమించే ప్రయత్నం జరుగుతుంది. మత్స్య సంపదను పెంచేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలిగాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 2013 నాటితో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. ఇన్‌ల్యాండ్, అక్వాకల్చర్ ఉత్పత్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను అక్వాకల్చర్ ఉత్పాదకతకు ప్రస్తుతన్న హెక్టారుకు మూడు టన్నుల నుంచి ఐదు టన్నులకు పెంచేందుకు ఉపయోగించుకుంటాం. సమీకృత ఆక్వాపార్క్‌లు దేశవ్యాప్తంగా ఐదింటిని ఏర్పాటు చేస్తాం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెట్టింపు చేయడం 55 లక్షల మందికి ఉద్యోగలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంటున్నాం టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్. పౌరవిమానయాన రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ! 1000 కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. ప్రస్తుతమున్న ఆసుపత్రుల ద్వారానే మరిన్ని కళాశాలల ఏర్పాటుకు ఈ కమిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తుంది. మాతాశిశు సంక్షేమానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు కార్యక్రమాలను ఒక ఛత్రం కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. టీకాకీరణను మరింత మెరుగుపరిచేందుకు కొత్త న్యూ విన్ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తాం. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధిస్తాం. సామాజిక న్యాయం మా పరిపాలనా విధానంలో ఒక భాగం. చాలా మందికి సామాజిక న్యాయం అనేది ఒక రాజకీయ నినాదం మాత్రమే. గత పదేళ్లలో 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేలా చర్యలు తీసుకున్నాం. ప్రధాన్ మంత్రి కిసాన్ సంపద యోజనా 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. 10 లక్షల ఉద్యోగాలు కల్పించింది. రూ.34 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించాం. రైతు బీమా ద్వారా 11.8కోట్ల మందిని ఆదుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.4కోట్ల మంది యువతకు శిక్షణ. దేశంలో అవినీతి, కుటుంబ పాలనను అంతం చేశాం. 3000 కొత్త ఐటీఐలను ఏర్పాటు చేశాం. ప్రారిశ్రామిక విధానాల ద్వారా మహిళలను ప్రోత్సహించాం 30 కోట్ల ముద్రా యోజనా రుణాలు మహిళలకు ఇచ్చాము ఉన్నత విద్యలో మహిళల ముందుకు సాగుతున్నారు. స్టెమ్ కోర్సుల్లో 43 శాతం మహిళా విద్యార్థులే. ఇవన్నీ ఉద్యోగ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగేలా చేసింది ట్రిపుల్ తలాక్ రద్దు, మూడొంతుల సీట్లు లోక్‌సభలో కేటాయింపు గ్రామీణ ప్రాంతాల్లో 70 శాతం ఇళ్లను మహిళలకు ఇవ్వడం (పీఎం ఆవాస్ యోజనా కింద) వంటి కార్యక్రమాలన్నీ వారి గౌరవాన్ని పెంచాయి. అందరికీ అవకాశాలు లభిస్తాయి వ్యవస్థీకృతమైన లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాం. Union Minister Nirmala Sitharaman presents the Union Interim Budget 2024-25 at the Parliament. pic.twitter.com/ooIT0ztsof — ANI (@ANI) February 1, 2024 ►బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ►బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు. #WATCH | Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament. Union Finance Minister Nirmala Sitharaman will present the Budget in the House, shortly. pic.twitter.com/wfhk1MdQp7 — ANI (@ANI) February 1, 2024 ►అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా యువత, మహిళలపై ఫోకస్ పెట్టినట్టు కామెంట్స్ #WATCH | On Budget 2024, Amravati MP Navneet Rana says, "We expect the Budget will focus on youth and women." pic.twitter.com/M0nf1HoMLo — ANI (@ANI) February 1, 2024 ►పార్లమెంట్లో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కాసేపటి క్రితమే ముగిసిన కేబినెట్ సమావేశం. ►2024 మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్ ట్యాక్స్ పేయర్లు కొత పన్ను విధానాన్ని ఎంచుకొనేలా మార్పులు చేసే అవకాశం ఇన్‌కంటాక్స్ మినహాయింపు పరిమితి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచే చాన్స్ పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులకు వీలు ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచే చాన్స్ విదేశీ ఆదాయంపై ట్యాక్స్ రిటర్నుల సవరణలు మరింత సులభతరం చేసే అవకాశం ఈవీ వాహన లోన్స్‌పై వడ్డీలో రాయితీలు పెంచే అవకాశం ►రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారుల బృందం. Union Minister of Finance and Corporate Affairs Nirmala Sitharaman along with Ministers of State Dr Bhagwat Kishanrao Karad and Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union… pic.twitter.com/o2UrUCRuaH — ANI (@ANI) February 1, 2024 ►రాష్ట్రపతిభవన్‌కు బయలుదేరిన కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు. #WATCH | Finance Minister Nirmala Sitharaman along with her team before the presentation of the country's interim Budget pic.twitter.com/hohpB7qtZi — ANI (@ANI) February 1, 2024 ►ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్. బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దన్న నిర్మల. మరోవైపు.. ఈసారీ బడ్జెట్లో ఊరటలు ఉంటాయని నమ్ముతున్న జనం. ►కేంద్ర మధ్యంతర బడ్జెట్ నేడు పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ►కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు. #WATCH | Finance Minister Nirmala Sitharaman arrives at the Ministry of Finance as she is set to present the interim Budget today pic.twitter.com/46Ut7oHdzE — ANI (@ANI) February 1, 2024 ►కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. #WATCH | Delhi | MoS Finance Pankaj Chaudhary arrives at the Ministry of Finance. Finance Minister Nirmala Sitharaman will present the Union Interim Budget today. pic.twitter.com/dW1LEupHKe — ANI (@ANI) February 1, 2024 ►బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. ►లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. -
Budget 2024: రేపే మధ్యంతర బడ్జెట్
దిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్ 2024-25ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటుకు సమర్పించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆమె మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ ఈసారి కూడా డిజిటల్ రూపంలోనే బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది. నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 9 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ సమర్పణకు అనుమతి తీసుకుంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సహాయ మంత్రి, ముఖ్య అధికారులు ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఇక్కడే మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. -
Budget 2024: అప్పట్లో ఇవే హైలెట్స్.. మళ్లీ ఉంటాయా?
బడ్జెట్ ఎప్పుడు వచ్చినా మధ్య తరగతి వర్గాలు కోటి ఆశలు పెట్టుకుంటాయి. ఈ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనా మిడిల్ క్లాస్, అల్పాదాయ వర్గాల్లో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఈ వర్గాల కోసం గతేడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏయే ప్రయోజనాలు కల్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కోసం అనేక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ముఖ్యమైన ప్రకటనలు ఏంటో ఇక్కడ చూడండి.. ➧ పన్ను మార్పులు: కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ➧ పన్ను శ్లాబులు: కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. ➧ స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ప్రొఫెషనల్స్, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 52,500కి పెంచారు. ➧ 80C మినహాయింపు పరిమితి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో పెట్టుబడి పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. ➧ విద్య: విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసంస్థలకు నిధులతో సహా విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ➧ హౌసింగ్: డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మళ్లీ ఉంటాయా? సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నది మధ్యంతర బడ్జెట్. అయినప్పటికీ గత బడ్జెట్లో అందించిన లాంటి ప్రయోజనాలు మళ్లీ ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ మధ్యతరగతి వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
Budget 2024-25: మహిళాసాధికారతకు ప్రధాన డిమాండ్లు
మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. పురుషులతో సమానంగా వారు రాణిస్తున్నారు. కానీ, భాగస్వామ్యం ఆశించినమేరకు లేదనేది వాస్తవం. ఉదాహరణకు కంపెనీల్లో అత్యున్నతస్థానంలో పురుషులతో సమానంగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ సదరు సంస్థల్లో వారి సంఖ్య పెరగడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రైవేటు సంస్థలు, ఇతర రంగాలు మహిళలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. వీటిని మరింత పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు. రానున్న బడ్జెట్లో వారి అభివృద్ధికి సరైన ప్రాతినిధ్యం ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలంటు డిమాండ్ చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్లో భాగంగా పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసే నగదుపై లభించే వడ్డీను పెంచేలా బడ్జెట్లో నిర్ణయాలు ఉండాలని కొందరు కోరుతున్నారు. ప్రసుత్తం 7.5శాతం వడ్డీ అందిస్తున్నారు. దీన్ని మరింత పెంచాలనే డిమాండ్ ఉంది. వర్కింగ్ మహిళలకు పన్ను మినహాయింపు ఇవ్వాలనే కొందరు భావిస్తున్నారు. మహిళల సాధికారత కోసం సంప్రదాయ వ్యవహారాలకు భిన్నంగా వారికి కొత్త నైపుణ్యాలను నేర్పించేలా చర్యలు తీసుకోవాలని కొందరు అంటున్నారు. ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి సంబంధించి జెండర్ గ్యాప్ కనిపిస్తుంది. అది తగ్గించడానికి బడ్జెట్లో నిర్ణయాలు చేపట్టాలని కోరుతున్నారు. 15-50 సంవత్సరాల వయసు ఉన్న మహిళల్లో 57 శాతం మందికి రక్తహీనత ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. దాంతో చాలామంది మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. రానున్న బడ్జెట్లో మహిళల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ఆశిస్తున్నారు. ఒంటరి మహిళల భద్రత, వారికి నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేలా నిర్ణయాలు ఉండాలని కొందరు భావిస్తున్నారు. నిర్భయ ఫండ్ అనేది మహిళల భద్రత కోసం 2013లో స్థాపించిన నాన్ లాప్సబుల్ కార్పస్ ఫండ్. డిసెంబర్ 2023లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం 70 శాతం నిధులు మాత్రమే అంటే రూ.7,212 కోట్లలో రూ.5,119 కోట్లు పథకం ప్రారంభం నుంచి వినియోగించారు. నేరాలు జరుగుతున్నా వాటిని అరికట్టేలా చర్యలు ఉండడం లేదు. ఈసారి బడ్జెట్లో మరింత నిధులు పెంచి వాటిని సమర్థ్యంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఉంది. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య పెరుగుతున్నా వారు తక్కువ జీతం, తక్కువ నాణ్యత కలిగిన ఉద్యోగాలను చేపడుతున్నట్లు చాలా సర్వేలు చెబుతున్నాయి. ఆ పరిస్థితులు రాకుండా కేంద్రం బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Budget: తెలుగు రాష్ట్రాలు ఏం కోరుకుంటున్నాయంటే..
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం కొంత వరాలు కురిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న అవసరాలమేరకు రాష్ట్రాలకు ఎన్ని నిధులు కావాలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తూ నిపుణులు కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కావాల్సినవి.. విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ.683 కోట్లు కేటాయించాలి. ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు. మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి. ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలి. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి. ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీలకు నిధుల కేటాయింపులు జరగాలి. హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలి. తెలంగాణలో.. రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి. తెలంగాణలో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు జరగాలి. ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు.. రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ.6,835 కోట్లు కేటాయించాలి. రెండు రాష్ట్రాల్లో మరిన్ని మ్యూజియంలు ఏర్పాటు చేయాలి. కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెరగాలి. రెండు రాష్ట్రాల్లో 5జీ కనెక్టివిటీ పూర్తిగా ఉండాలి. యూనిఫైడ్ కార్డు జారీ (ఆధార్, పాన్, వోటర్, ఈపీఎఫ్, రేషన్ కార్డులన్నింటికి ప్రత్యామ్నాయంగా ఒకే కార్డు) కావాలి. పెట్రోలు, డీజిల్ ధరలపై సుంకాలు తగ్గాలి. సీనియర్ సిటిజన్ల గరిష్ఠ పొదుపు పరిమితిని రెట్టింపు చేయాలి. ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు పెరగాలి. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధులు పెరగాలి. ఉద్యోగులకు మరిన్ని పన్ను రాయితీలు పెరగాలి. స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లకు కేటాయింపులు పెరగాలి. -
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఎకానమీగా భారత్..?
భారతదేశం వాస్తవ జీడీపీ వృద్ధి 2024-25లో 7 శాతంకు చేరుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. మధ్యంతర కేంద్ర బడ్జెట్‌కు ముందు ప్రకటించిన నివేదికలో ఇందుకు సంబంధించి కీలక అంశాలను పేర్కొంది. 2030 నాటికి ఇండియా 7 శాతం వృద్ధిని అధిగమించగలదని, ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. రానున్న మూడేళ్లలో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నట్లు పేర్కొంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచం కేవలం 2 శాతం వృద్ధి సాధించబోతుందని, కానీ భారత్ రానున్న రోజుల్లో 7 శాతం వృద్ధి సాధించబోతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీన్ని ఎకనామక్సర్వేగా భావించకూడదని నాగేశ్వరన్ స్పష్టం చేశారు. ఆర్థికనివేదిక ప్రకారం భారతదేశ వృద్ధిని రెండు దశలుగా విభజించారు. 1950 నుంచి 2014 వరకు ఒకదశ. 2014-2024 వరకు రెండో దశగా పరిగణించారు. 2012-13, 2013-14 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు నివేదిక చెప్పింది. దాంతో జీడీపీ 5 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేసినట్లు తెలిసింది. ఆహార ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు.. వంటి అంశాలు గతంలో వృద్ధి క్షీణించేందుకు కారణాలుగా మారినట్లు నివేదికలో వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి మినీ ఎకనామిక్ సర్వేగా పరిగణించిన ఈ నివేదిక అన్ని సానుకూల పరిణామాలు, సవాళ్లను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారత్ వచ్చే మూడేళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిసింది. 2030 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: సీతమ్మ సరికొత్త రికార్డులు
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేస్తున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేయనున్నారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ వరుసగా ఆరవ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేయనున్నారు. 2019 జూలై నుంచి వరుసగా ఐదు సంవత్సరాలు దేశానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అందించిన మహిళా ఆర్థికమంత్రి సీతారామన్. ఈ వారంలో ఆరవసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా 1959–1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్. గతంలో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పీ చిదంబరం, యశ్వంత్ సిన్హా ఐదుసార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఆరో బడ్జెట్‌తో కొత్త రికార్డు నెలకొల్పనున్న నిర్మలా సీతారామన్. -
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. రాష్ట్రపతి ఏమన్నారంటే..
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మాట్లాడారు. కొత్త పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చేయడం రాష్ట్రపతికి ఇది తొలిసారి కావడం విశేషం. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. రూ.7 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పన్ను చెల్లింపుదారులు ఇటీవల కాలంలో భారీగా పెరిగారు. దేశంలో 5జీ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తోంది. రీఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్, ఐటీ రిటర్న్‌లు ఫైల్ చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ నినాదంతో అభివృద్ధి సాధించాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం ఇండియా. ప్రభుత్వం దేశ్యవ్యాప్తంగా 1300 రైల్వే స్టేషన్లను ఆదునికీకరించింది. భారీగా జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. -
పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. పన్నుదారులకు ఊరట లభిస్తుందా..?
ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో నెలనెలా వస్తున్న ఆదాయాలు, జీతాలు ఏమాత్రం సరిపోవడంలేదని సామాన్యులు భావిస్తున్నారు. దానికితోడు ప్రభుత్వానికి చెల్లించే పన్నుభారం అధికమవుతుందని అభిప్రాయపడుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పన్నుదారులకు కొంత వెసులుబాటు ఉండాలని కోరుతున్నారు. దేశంలో సీపీఐ ద్రవ్యోల్బణం 4-8 శాతంగా నమోదవుతోంది. దాంతో వస్తున్న సంపాదనలో గరిష్ఠంగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. అదనంగా పన్ను చెల్లింపుదారులకు మరింత నష్టం చేకూరుతుందని భావిస్తున్నారు. అధిక జీతాలున్న వారికి పన్నుస్లాబ్లు పెంచాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల థ్రెషోల్డ్‌ను రూ.20 లక్షలకు పెంచడం వల్ల కొంత ద్రవ్యోల్బణంతో పాటు పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2020 కింద కొత్త పన్ను విధానాన్ని ప్రారంభించింది. ఈ విధానంలో భాగంగా పన్నుస్లాబ్లు 5 శాతం నుంచి ప్రారంభమవుతాయి. వార్షికంగా రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు 30 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రూ.20లక్షల స్లాబ్‌కు మార్చాలని కొందరు కోరుతున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనని వేచిచూస్తున్నారు. ఏటా స్టాండర్డ్ డిడక్షన్‌లో భాగంగా ఉన్న రూ.50,000 స్లాబ్‌ను రూ.1లక్షకు పెంచాలని కొందరు కోరుతున్నారు. -
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: రాష్ట్రపతి ప్రసంగం ఇదే..
Live Updates.. ►రాష్ట్రపతి ప్రసంగం అనంతరం రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన ద్రౌపది ముర్ము.. #WATCH | President Droupadi Murmu departs from the Parliament for Rashtrapati Bhavan after concluding her address to the joint session of both Houses on the first day of Budget Session. pic.twitter.com/VKweTcdlBB — ANI (@ANI) January 31, 2024 ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. ►కొత్త పార్లమెంటులో నా తొలి సంతకం ►భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైంది ►శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది ►భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్ గా జరుపుకుంటున్నాం ►ఆదివాసీ యోధులను సర్మించుకోవడం గర్వకారణం ►చంద్రుడి దక్షిణధ్రువం పై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు ►ఆదిత్య ఎల్-1 మిషన్ ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించింది ►భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించింది. #WATCH | President Murmu speaks on the potential of India's growing tourism sector "Tourism is a sector that provides employment opportunities to the youth. A record number of tourists are reaching the northeast region. There is excitement among people about the Andaman Islands… pic.twitter.com/6ugt4VzHwU — ANI (@ANI) January 31, 2024 ►జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది ►ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా 107 పతకాలు సాధించింది ►ఆసియా పారా క్రీడల్లో భారత్ 111 పతకాలు సాధించింది ►భారత్ లో తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం నారీ శక్తి వందన్ అధినీయం బిల్లును ఆమోదించుకున్నాం. ►నారీశక్తి వందన్ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయింపు ►పేదరికి నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్ ముందుకెళ్తోంది ►తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశాం ►అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించాం ►ఎన్నో ఏళ్ల భారతీయుల కల.. రామమందిర నిర్మాణం సాకారమైంది. #WATCH | Budget session | President Droupadi Murmu says, "My Government is working towards making India, a major space power of the world. This is a mode to make human life better. This is also an effort to increase India's share in the space economy. Important decisions have… pic.twitter.com/ejZ9VHzCgG — ANI (@ANI) January 31, 2024 ►దేశంలో 5జీ నెట్ వర్క్ వేగంగా విస్తరిస్తోంది ►దేశంలో కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చాం ►ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తో ముందుకెళ్తున్నాం ►రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి ►నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా ►ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ►పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ►రెండు లక్షల అమృత్ వాటికలను నిర్మించాం ►లక్ష కోట్లకు డిఫెన్స్ ఉత్పత్తులు చేరాయి ►డిజిటల్ ఇండియా నిర్మాణం గొప్ప విషయం ►డిజిటల్ ఇండియాలో 46 శాతం అభివృద్ధి సాధించాం ►డిజిటల్ ఇండియాతో బ్యాంకింగ్ లావాదేవీలు సులభతరమయ్యాయి ►రక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. ►ఆయుష్మాన్ భారత్ లో 57 కోట్ల మంది భాగస్వామ్యమయ్యారు ►జాతీయ రహదారుల్లో లక్షా 40 వేల కిలో మీటర్లు నిర్మించాం ►39 వందే భారత్ రైళ్లను ఏర్పాటు చేసుకున్నాం ►యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ►10 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం ►తక్కువ ధరకు గ్యాస్ సరఫరా చేస్తున్నాం ►కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాం. ►ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థలున్న దేశం భారత్ ►దేశంలో 10 లక్షల కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించుకుంటున్నాం ►ప్రపంచంలో అత్యంత వేగంగా భారత ఎకానమీ అభివృద్ధి ►రక్షణ, అంతరిక్ష రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరిగాయి ►రైల్వే శాఖలో పలు సంస్కరణలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు ►విద్యుదీకరణ, వందే భారత్ రైళ్లతో వేగంగా ప్రయాణికుల రాకపోకలు ►దేశంలో ప్రస్తుతం పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ►నా చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నా ►దేశంలో 10 లక్షల కి.మీల గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసుకున్నాం ►ముంబైలో అటల్ సేతు నిర్మించుకున్నాం. ►రూ.7 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేశాం ►సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చాం. ►2 కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారు ►4 కోట్ల 10 లక్షల మందికి పక్కా ఇళ్లు నిర్మించాం ►కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయమందిస్తున్నాం ►కరోనా, యుద్దాల ప్రభావం దేశంలో ధరల పెరుగుదలపై పడకుండా జాగ్రత్తపడ్డాం #WATCH | Budget Session | President Droupadi Murmu says, "In the past years, the world witnessed two major wars and faced a pandemic like Corona. Despite such global crises, my government kept inflation under control in the country and did not let the burden on common Indians… pic.twitter.com/N2aL6sRma8 — ANI (@ANI) January 31, 2024 ►యువతకు లక్షల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం ►25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి పైకి తీసుకొచ్చాం ►ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మోదీ సర్కార్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది ►లక్షకు పైగా స్టార్టప్స్ ను ఎంకరేజ్ చేశాం ►డీబీటీ కింద రూ.25 లక్షల కోట్లు ప్రజలకు అందించాం ►గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ తో 46 శాతం మనదే ►రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి #WATCH | President Droupadi Murmu says, "My Government believes that the grand edifice of a developed India will stand on four strong pillars – youth power, women power, farmers and the poor." pic.twitter.com/u8C4opfICx — ANI (@ANI) January 31, 2024 ►ఆవాస్ యోజన పథకం ద్వారా సామాన్యులకు నీడ కల్పిస్తున్నాం ►పదేళ్లలో వేల ఆదివాసీ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాం ►ఆదివాసీ గ్రామాలకు శుద్దజలాలు అందిస్తున్నాం ►ట్రాన్స్ జెండర్లకు సమాజంలో గౌరవస్థానం కల్పించాం ►దేశ అభివృద్ధి నాలుగు స్తంభాల పై ఆధారపడి ఉంది ►యువశక్తి, నారీశక్తి, రైతులు, పేదలు అనే స్తంభాలపై ఆధారపడి ఉంది. #WATCH | Budget Session | President Droupadi Murmu addresses a joint session of both Houses at the new Parliament building. She says, "...In the last 10 years, India saw the completion of several works towards national interest that had been awaited by the people of the country… pic.twitter.com/ERbVcaSI7P — ANI (@ANI) January 31, 2024 ►రష్యా-ఉక్రెయిన్, పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్దాల వేళ ద్రవ్యోల్భణాన్ని అదుపుచేశాం ►ఎన్నో సమస్యలున్నా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతున్నాం ►గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తున్నాం ►సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నాం ►సికిల్ సెల్, ఎనీమియతో బాధపడుతున్న గిరిజనుల కోసం జాతీయ మిషన్ ►జాతీయ మిషన్ కింద ఇప్పటివరకు 1.40 కోట్ల మందికి పరీక్షలు చేయించాం ►ఇంజినీరింగ్, మెడిసన్ కూడా మాతృభాషల్లో చదివే అవకాశం కల్పించాం ►వైద్య కళాశాలల సంఖ్యను గణనీయంగా పెంచాం. #WATCH | 'Make in India' and 'Aatmanirbhar Bharat' have become our strengths, says President Droupadi Murmu. The President also lauds defence production crossing the Rs 1 lakh crore mark. pic.twitter.com/KDkEKZZ3kA — ANI (@ANI) January 31, 2024 ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభయ్యాయి. ►పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. #WATCH | Budget Session | President Droupadi Murmu arrives at the Parliament for her address to the joint session of both Houses. Sengol carried and installed in her presence. pic.twitter.com/vhWm2oHj6J — ANI (@ANI) January 31, 2024 ►కాసేపట్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ►ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ నుంచి పార్లమెంట్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. #WATCH | President Droupadi Murmu departs from Rashtrapati Bhavan for the Parliament building. The Budget Session will begin with her address to the joint sitting of both Houses. This will be her first address in the new Parliament building. pic.twitter.com/I5KmoSRcKV — ANI (@ANI) January 31, 2024 ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. పార్లమెంట్ వద్దకు చేరుకున్న సోనియా. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrives at the Parliament on the first day of the Budget session. pic.twitter.com/pFyrQ11Utp — ANI (@ANI) January 31, 2024 ►నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్లో తొలిసారిగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు. ►పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నారీ శక్తిని కేంద్రం ప్రతిబింబిస్తోంది. బడ్జెన్‌ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతుండటం నారీశక్తికి నిదర్శనం. ప్రతీసారి సభను అడ్డుకుంటున్న సభ్యులు.. ఈసారైనా సహకరించాలి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇవే చివరి సమావేశాలు. గత పదేళ్లలో మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు. #WATCH | Budget Session | PM Narendra Modi says, "...At the end of the first session that was convened in this new Parliament building, the Parliament took a graceful decision - Nari Shakti Vandan Adhiniyam. After that, on 26th Jan we saw how the country experienced the… pic.twitter.com/Oa84GNftCX — ANI (@ANI) January 31, 2024 ►ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ►తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. -
భారత్‌లో పాకిస్థాన్ మాజీ ప్రధాని బడ్జెట్ ప్రవేశపెట్టారా?
రేపు అంటే 2024, ఫిబ్రవరి ఒకటిన దేశ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారతదేశంలో బడ్జెట్ చరిత్ర 180 సంవత్సరాల పురాతనమైనది. బ్రిటీష్ వారి కాలం నుంచి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని ఒకరు భారత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భముంది. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. 1946 ఫిబ్రవరి 2న పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ భారతదేశ బడ్జెట్‌ను సమర్పించారు. నిజానికి ఆ సమయంలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో లియాఖత్ అలీఖాన్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ బడ్జెట్‌ను భారత్, పాకిస్తాన్ విభజనకు ముందు ప్రవేశపెట్టారు. లియాఖత్ అలీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. తదనంతర కాలంలో లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ తొలి ప్రధాని అయ్యారు. మహ్మద్ అలీ జిన్నాకు సన్నిహితుడైన లియాఖత్ అలీఖాన్ ఈ బడ్జెట్‌ను సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (నేటి పార్లమెంట్ హౌస్)లో సమర్పించారు. చరిత్రలో నేటికీ ఈ బడ్జెట్‌ను ‘పేదవారి’ బడ్జెట్‌గా పిలుస్తుంటారు. ఈ బడ్జెట్‌పై దేశంలోని పారిశ్రామికవేత్తలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లియాఖత్ అలీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు చాలా కఠినంగా ఉంచారు. దీని కారణంగా వ్యాపారవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలపై ప్రతి లక్ష రూపాయల లాభంపై 25 శాతం పన్ను విధించాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. అంతేకాదు కార్పొరేట్ ట్యాక్స్‌ని రెట్టింపు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత లియాఖత్ అలీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ బడ్జెట్‌ను ప్రజలు హిందూ వ్యతిరేక బడ్జెట్‌గా అభివర్ణించారు. వ్యాపారవేత్తలు ఉద్దేశపూర్వకంగానే ఇంత పన్ను విధించారని ఆరోపించారు. హిందూ వ్యాపారులంటే లియాఖత్‌కు నచ్చరని, అందుకే వారిని దెబ్బతీసేందుకు ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారనే విమర్శలు వచ్చాయి. భారత్-పాక్ విభజన తరువాత అలీ ఖాన్ పాకిస్తాన్ మొదటి ప్రధాని అయ్యారు. అతను అక్కడ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేదు. 1951లో లియాఖత్ అలీని కాల్చి చంపారు. -
మధ్యంతర బడ్జెట్ ఈ ఐదింటిపై ఆశలొద్దు !
కేంద్ర బడ్జెట్ పేరు వినగానే మధ్య తరగతి ప్రజల్లో ఒకింత ఉత్సుకత మొదలవడం సహజం. పన్ను శ్లాబులు తగ్గిస్తారనో, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే చర్యలేవో తీసుకుంటారనో ఆశ పడుతుంటారు. మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తుందేమోనని ఎదురుచూస్తుంటారు. మధ్యంతర బడ్జెట్ అయినా సామాన్య ప్రజానీకం మొదలు కార్పొరేట్ వర్గాల దాకా అందరి అంచనాలు భారీగానే ఉన్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఎన్నికల తాయిలాలు బడ్జెట్లో కనిపించవచ్చని అందరి అంచనా. అయితే ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఒక ఐదు అంశాలపై ఆశలు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని వారు సెలవిస్తున్నారు. ఆ ఐదేంటో ఓసారి చూసేద్దాం. – సాక్షి, నేషనల్ డెస్క్ 1. ప్రభుత్వ విధానపర నిర్ణయాలు త్వరలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. విపక్షాల ‘ఇండియా’ కూటమి గెలిస్తే ఈ మధ్యంతర బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలను కొత్త ప్రభుత్వం నెలవేరుస్తుందన్న గ్యారెంటీ లేదు. అందుకే దీర్ఘకాలిక ఆర్థిక సంస్కరణల జోలికి వెళ్లకుండా ఇప్పటి పద్దుల సంగతే చూడాలని ప్రభుత్వం భావిస్తోందట. అందుకే ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించదల్చుకోలేదని కొందరు ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. ఈసారి బడ్జెట్లో కొత్త పథకాలు ఏమీ ఉండబోవని ఇప్పటికే విత్త మంత్రి నిర్మల సెలవివ్వడం గమనార్హం. ప్రస్తుత ఖర్చుల మీద మాత్రమే దృష్టిపెడతామని ఆమె ప్రకటించారు. 2. పన్ను మినహాయింపులు పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భాల్లో మాత్రమే పన్ను శ్లాబుల్లో మార్పుల వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వాలు ప్రకటించడం చూశాం. ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి పన్ను శ్రేణుల్లో సవరణలు ఆశించలేమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంటే పన్ను శ్లాబుల్లో మార్పులు రావాలంటే కొత్త ప్రభుత్వం కొలువుతీరాక వచ్చే పూర్తి బడ్జెట్ దాకా వేచి ఉండక తప్పదు. 3. నూతన సంక్షేమ పథకాలు కొత్త సంక్షేమ పథకానికి రూపకల్పన చేయాలంటే చాలా సమయం పడుతుంది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టిన బీజేపీ.. కొత్త పథకాలను పట్టించుకోదనే వాదన ఉంది. నూతన సంక్షేమ పథక రచనకు విస్తృతస్తాయి సంప్రదింపులు జరగాలి. ఎన్డీఏ కూటమికి అంత వ్యవధిలేదని మూడోసారి గెలిచాక వాటి సంగతి చూసుకుందామనే ధోరణి బీజేపీలో కనిపిస్తోందని ఒక రాజకీయ విశ్లేషకుడు అంచనావేశారు. కొత్త సంక్షేమ పథకం ప్రకటించి అమలుచేయాలంటే అందుకు తగ్గ ఆర్థికవనరులనూ సమకూర్చుకోవాల్సిందే. అంటే పూర్తి బడ్జెట్ స్థాయిలో కేటాయింపులు జరగాలి. మధ్యంతర బడ్జెట్లో అది సాధ్యమేనా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. అందుకే కొత్త సంక్షేమ పథకాల పాట బీజేపీ పాడదని మాట వినిపిస్తోంది. 4. ద్రవ్యలోటు కట్టడి చర్యలు ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఖర్చులను తగ్గించుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించాలి. ఆ పని చేయాలంటే సంబంధిత అన్ని శాఖలతో విస్తృతస్థాయి సంప్రతింపులు అవసరం. అత్యంత కఠిన ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ద్రవ్యలోటు కట్టడి చర్యలకు దిగితే దాని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. సార్వత్రిక ఎన్నికలపై పూర్తిగా దృష్టిపెట్టే సర్కార్ మళ్లీ ద్రవ్యలోటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అనేది తెలియాల్సిఉంది. ద్రవ్యలోటు భారాన్ని దింపేందుకు మధ్యంతర బడ్జెట్ సరైన వేదిక కాదనే భావన ఉండొచ్చు. 5. నూతన ఆర్థిక విధానాలు చాలా నెలలుగా అమలవుతోన్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు తెస్తూ ప్రకటించే నూతన ఆర్థిక విధానాలు వ్యవస్థను ఒక్కసారిగా కుదుపునకు గురిచేస్తుంది. ఇలాంటి ప్రయోగాలు సాధారణంగా పూర్తిస్తాయి బడ్జెట్లోనే చేస్తారు. మధ్యంతర బడ్జెట్‌కు ఈ ఫార్ములా నప్పదు అనే అభిప్రాయం ఒకటి ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు, సంబంధిత రంగాల సంస్థలతో చర్చోపచర్చల తర్వాతే మామూలుగా ఇలాంటి నూతన ఆర్థిక విధానాలను ప్రకటిస్తారు. నూతన ఆర్థిక విధానాలు ప్రకటిస్తే స్టాక్ మార్కెట్లు స్పందించడం సర్వసాధారణం. సానుకూలమో, ప్రతికూలమో, లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడమో.. ఇంకేదైనా జరగొచ్చు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాల అమలుకు మధ్యంతర బడ్జెట్‌ను ప్రభుత్వం వాడుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. అయినా కొన్ని అంచనాలు.. 1.పెట్రోల్, డీజిల్ ధరలను కిందకు దించుతారని ఆశలూ ఎక్కువయ్యాయి. అధిక పెట్రో ధరల కారణంగా ప్రభుత్వ చమురు రిటైల్ కంపెనీలు ఇటీవలికాలంలో అధిక లాభాలను కళ్లజూశాయి. ఈ లాభాలను పౌరులకు కాస్తంత మళ్లించే యోచన ఉందట. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 5–10వరకు తగ్గించవచ్చని అనుకుంటున్నారు. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించడం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ప్రకటనలు బడ్జెట్ రోజు వెలువడొచ్చని భావిస్తున్నారు. 2. పట్టణవాసులు భారీ లబ్ది చేకూరేలా నివాస గృహాలపై తక్కువ వడ్డీకే రుణాలు అందించవచ్చని భావిస్తున్నారు. సబ్సిడీతో పీఎం ఆవాస్ యోజన తరహా కొత్త పథకం తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా పథకం అమలుచేస్తే బాగుంటుందని మంత్రి గతంలో వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 3.దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర పథకం పీఎం– కిసాన్ కింద ఇచ్చే నగదు మొత్తాన్ని మరింత పెంచుతారని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇంతకంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నాయి. అందుకే పీఎం–కిసాన్ నగదు సాయాన్ని అధికం చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వార్తలొచ్చాయి. ఈ ఆలోచన బడ్జెట్లో ఆచరణాత్మకం అవుతుందో లేదో చూడాలి. పీఎం కిసాన్ మొత్తాన్ని దాదాపు రూ.9,000కు పెంచే వీలుందని సమాచారం. 4. గత బడ్జెట్లో మధ్యతరగతి కుటుంబాలకు పన్ను రిబేట్‌ను ఏకంగా రూ.7,00,000 పెంచడం వంటి చాలా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి అలాంటి కలలనే మధ్యతరగతి కుటుంబాలు కంటున్నాయి. ఆదాయంపై స్టాండర్డ్ డిడక్షన్ (ప్రామాణిక తగ్గింపు) ప్రస్తుతం రూ. 50 వేలుగా ఉంది. కొత్త, పాత పన్ను విధానాల్లో ఈ డిడక్షన్‌ను రూ.1,00,000కు పెంచాలని మధ్యాదాయ వర్గాలు అభిలషిస్తున్నాయి.. 5. బ్యాంకు ఖాతాదారులకు పన్ను మినహాయింపులు పెరగొచ్చని మరో అంచనా. వీరి సేవింగ్స్ ఖాతా వడ్డీపైనా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50,000కు పెంచుతారని ఆశిస్తున్నారు. 6. ఆదాయపు పన్ను చట్టంలో ముఖ్యమైనదైన సెక్షన్–80సీ కింద ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. పొదుపు పథకాల్లో పెట్టుబడులు, జీవిత బీమా చందా చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, గృహ రుణాల చెల్లింపులు, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నీ దీని కిందికే వస్తాయి. కాబట్టి ఈ మొత్తాన్ని రూ. 3,00,000కు పెంచాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి. -
Budget 2024: పెరుగుతున్న ఈవీ రంగం అంచనాలు - కొత్త స్కీమ్ వస్తుందా..
ఫేమ్ II సబ్సిడీ పథకం ముగియడంతో, ఫేమ్ III సబ్సిడీ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు మార్చి 2024 తర్వాత కూడా కొనసాగుతాయని చెబుతున్నారు. భారత ప్రభుత్వం ఫేమ్ II స్కీమ్ కింద రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో వాహనాలను ఎలక్ట్రిక్ విభాగంలో జోడించడానికి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఫేమ్ II గడువు ముగిసిన తర్వాత అమలు చేయడానికి సిద్దమవుతున్న ఫేమ్ III అంత విస్తృతంగా ఉండకపోవచ్చని, రానున్న బడ్జెట్లో ఈ స్కీమ్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం పరిశ్రమలకు సహాయం చేయాలి. అప్పుడే ఆశించిన రీతిలో ఎలక్ట్రిక్ వాహనాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఫేమ్ III ప్రోత్సాహకాలు ఎలా ఉంటాయనేది త్వరలోనే తెలుస్తుంది. FAME IIIని రాబోయే కేంద్ర బడ్జెట్ 2024లో ఆర్థిక మంత్రి సీతారామన్ నిస్సందేహంగా ప్రవేశపెడతారని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి ఇప్పటికే ధృవీకరించారు. అయితే ఫేమ్ III కూడా ఫేమ్ II మార్గదర్శకాలనే కొనసాగించే అవకాశం ఉంది. 2021 సెప్టెంబర్ 15న PLI-ఆటో స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఐదేళ్లకు రూ. 25,938 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆ తరువాత ఈ పథకం 2027-28 ముగిసే వసరకు పొడిగించారు. అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ (AAT) ఉత్పత్తి తయారీని పెంచడం, దాని కోసం లోతైన స్థానికీకరణను ప్రోత్సహించడం, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-అమర్చిన వాహనాల వంటి జీరో ఎమిషన్ వెహికల్స్ (ZEVలు) కోసం ప్రపంచ సరఫరా గొలుసును ఏర్పాటు చేయడం ఈ పధకం ముఖ్య లక్ష్యం. ఇదీ చదవండి: ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం! త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2024 మీద ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కేంద్రం ఈ ఆశలను నిజం చేస్తుందా? లేక షాకిస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో వేగంగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ప్రోత్సాహాలు అవసరం, కాబట్టి రానున్న బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. 2024-25 బడ్జెట్ కథనాల కోసం క్లిక్ చేయండి. -
ట్యాక్స్స్లాబ్లు సవరిస్తారా..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పెట్టబోయే తాత్కాలిక బడ్జెట్లో ట్యాక్స్ స్లాబ్‌ల్లో భారీ మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణుల అంచనా. అందులో భాగంగా ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వొచ్చని, టీడీఎస్‌ను మరింత సులభతరం చేయొచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను మరింతగా ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం బేసిక్ ట్యాక్స్ మినహాయింపును ప్రస్తుతం ఉన్న రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతుందని అంచనా. అంతేకాకుండా ట్యాక్స్ రేట్లను తగ్గించే యోచనలో ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ట్యాక్స్ డిడక్షన్లు, మినహాయింపులు లేవు కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.50 వేల నుంచి రూ.1లక్షకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. బడ్జెట్ 2024-25 కథనాల కోసం క్లిక్ చేయండి ఇన్ఫ్లేషన్ పెరగడంతో ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పెంచి ఉద్యోగులకు ఉపశమనం ఇవ్వొచ్చు. ఉద్యోగస్థులు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో వీటిని ట్యాక్స్ మినహాయింపుగా వాడుకోవడానికి వీలుంది. కొత్త సిస్టమ్‌లో ఈ సౌకర్యం లేదు. అందువలన హెల్త్ కేర్, రిటైర్మెంట్ కోసం పొదుపు చేసుకోవడానికి కొత్త సిస్టమ్‌లోని ట్యాక్స్ శ్లాబ్‌లను సవరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
పీఎం కిసాన్ సాయం రూ.9 వేలు? రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్
రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్లో 50 శాతం పెరగవచ్చని అంచనా. ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
కేంద్రబడ్జెట్.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
బడ్జెట్ 2024-25ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దేశ చరిత్రలో కీలకమైన కొన్ని బడ్జెట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. స్వాతంత్య్రం రాకముందే బడ్జెట్.. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి పూర్వమే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి 1860, ఏప్రిల్ 7వ తేదీన ప్రవేశపెట్టారు. ఈస్ట్ఇండియా స్కాటిష్ ఆర్థికవేత్త జేమ్స్ విల్సన్ బడ్జెట్‌ను బ్రిటిష్ రాణికి సమర్పించారు. స్వతంత్ర భారత తొలి బడ్జెట్.. స్వతంత్ర భారత మొదటి కేంద్ర బడ్జెట్‌ను 1947, నవంబరు 26వ తేదీన అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రులు.. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉండి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు ప్రవేశపెట్టినవారు.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను అత్యధికంగా 10 సార్లు ప్రవేశపెట్టారు. 1962-69 మధ్య 10 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1964, 1968 లీపు సంవత్సరాలల్లో ఆయన పుట్టిన రోజైన ఫిబ్రవరి 29న బడ్జెట్‌ను సమర్పించడం ప్రత్యేకంగా నిలిచింది. పి.చిదంబరం 9 సార్లు, ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు, యశ్వంత్ సిన్హా 8 సార్లు, మన్మోహన్ సింగ్ 6 సార్లు, తాజాగా నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సమయం మార్పు.. 1999 వరకు బడ్జెట్‌ను ఫిబ్రవరిలో చివరి పనిదినాన, సాయంత్రం 5 గంటలకు ప్రకటించేవారు. అయితే, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్పు చేసి ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. బడ్జెట్ తేదీ మార్పు.. బడ్జెట్‌ను 2016 వరకు ఫిబ్రవరి చివరి పనిదినం రోజున సమర్పించేవారు. అయితే, 2017 నుంచి అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1కి మార్చారు. అత్యధిక, అత్యల్ప పదాలున్న బడ్జెట్లు.. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అత్యధికంగా 18,650 పదాలు ఉన్న బడ్జెట్ డాక్యుమెంట్‌తో దేశ పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్ ముల్జీ భాయ్ పటేల్ సమర్పించిన బడ్జెట్ అతిచిన్నది. ఆ బడ్జెట్లో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. సుదీర్ఘ ప్రసంగం.. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం రెండు గంటల 42 నిమిషాల పాటు సాగింది. బడ్జెట్ లీక్.. 1950 సంవత్సరంలో యూనియన్ బడ్జెట్ లీక్ అయ్యింది. లీక్ కారణంగా అప్పటి వరకు రాష్ట్రపతి భవన్లో ముద్రించే బడ్జెట్‌ను, దిల్లీలోని మింట్‌రోడ్‌కు మార్చారు. 1980లో నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముద్రించడం మొదలు పెట్టారు. 1995 వరకు బడ్జెట్‌ను ఆంగ్ల భాషలో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఆ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతులను హిందీ, ఆంగ్లం రెండు భాషల్లోనూ సిద్ధం చేయించింది. పేపర్‌లెస్ బడ్జెట్.. 2021, ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొదటి సారిగా పేపర్‌లెస్ బడ్జెట్‌ను సమర్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పేపర్‌లెస్ బడ్జెట్‌ను తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్ విలీనం.. 2017కు ముందు వార్షిక బడ్జెట్, రైల్వే బడ్జెట్లను విడివిడిగా ప్రవేశపెట్టేవారు. కానీ, 2017లో ఈ రెండింటిని విలీనం చేశారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..! బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళలు.. ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళ. 1970-71లో ఆమె ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రేవేశపెట్టి.. రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ స్థానంలో సాంప్రదాయ బహీ-ఖాతాలో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంటుంది. -
బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ వెల్లడించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రకటించడానికి ముందే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా.. ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద ద్రుష్టి సారించే అవకాశం ఉందని వెల్లడించారు. 👉2024 బడ్జెట్లో డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌కు ఎక్కువ నిధులు కేటాయించే సూచనలు ఉన్నాయి. 👉ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును GDPలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 👉కాపెక్స్‌పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి & వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు. 👉రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 👉వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువని తెలుస్తోంది. 👉గృహాల కోసం ప్రభుత్వం డబ్బును (నిధులు) 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 ట్రిలియన్ డాలర్లకు (12 బిలియన్ డాలర్లకు సమానం) చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్‌యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఆర్ధిక అంశాలకు సంబంధించిన అనేక మార్పులు ఉండనున్నాయి. బ్యాంకుల వడ్డీ రేట్లు, పథకాలకు సంబంధించిన కొన్ని మార్పులు జరుగుతాయి, ఇవన్నీ వచ్చే నెల ప్రారంభం నుంచే అమలులోకి వస్తాయి. ఈ కథనంలో ఫిబ్రవరి 1నుంచి ఎలాంటి అంశాలలో మార్పులు రానున్నాయో వివరంగా తెలుసుకుందాం. ఫాస్ట్‌ట్యాగ్ ఈ-కేవైసీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రకారం.. ఈ నెల చివరి (2024 జనవరి 31) నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC అసంపూర్తిగా ఉంటే అలాంటి వాటిని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. 'వన్ వెహికిల్ వన్ ఫాస్ట్‌ట్యాగ్' ప్రచారంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి దాదాపు 7 కోట్ల ఫాస్ట్‌ట్యాగ్‌లు జారీ చేసినట్లు, ఇందులో కేవలం 4 కోట్లు మాత్రమే యాక్టివ్‌గా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. అంతే కాకుండా 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్ట్‌ట్యాగ్‌లు వినియోగంలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి ఫాస్ట్‌ట్యాగ్ KYC పూర్తి కాకుంటే అలాంటి ఫాస్ట్‌ట్యాగ్‌లను డీయాక్టివేట్ లేదా బ్లాక్‌లిస్ట్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ (SGB) 2023-24 సిరీస్ 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 2024లో 2023-24 సిరీస్‌లో సావరిన్ గోల్డ్ బాండ్ల(SGB) చివరి విడతను జారీ చేస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్ 4 ఫిబ్రవరి 12న ప్రారంభమై.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. గత సిరీస్ డిసెంబర్ 18న ప్రారంభమై.. డిసెంబర్ 22కు ముగిసింది. నేషనల్ పెన్షన్ సిస్టం నిధుల పాక్షిక ఉపసంహరణ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) జనవరిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పెట్టుబడి పెట్టిన నిధులను పాక్షిక ఉపసంహరణకు సంబంధించిన మార్గదర్శకాలను హైలైట్ చేస్తూ ఒక మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తాయి. మొదటి ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రాయితీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తన కస్టమర్లకు గృహ రుణ రాయితీలను అందిస్తోంది. హోమ్ లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజులు, రాయితీలకు చివరి తేదీ జనవరి 31, 2024. ఫ్లెక్సీపే, ఎన్ఆర్ఐ, నాన్ శాలరీడ్, ప్రివిలేజ్, అపాన్ ఘర్ కస్టమర్లకు రాయితీ అందుబాటులో ఉంది. సిబిల్ స్కోర్‌పై ఆధారపడి గృహ రుణాల వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఇదీ చదవండి: ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు ధన్ లక్ష్మి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB) 'ధన్ లక్ష్మి 444 డేస్' పేరుతో తీసుకు వచ్చిన ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (FD) పథకానికి చివరి తేదీ జనవరి 31, 2024. ఈ స్కీమ్ లాస్ట్ డేట్ 2023 నవంబర్ 30 అయినప్పటికీ.. ఆ సమయంలో గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేవారు సాధారణ పౌరులైతే 7.4 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 7.9%, సూపర్ సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంటుంది. -
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత "సింగిల్ హైబ్రిడ్ స్కీమ్"ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కలకత్తా చాప్టర్) చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు. -
ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల మీద దృష్టి పెట్టనుంది? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందం ఎలాంటి ప్రకటనలు చేయనుందనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల హిందూ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కులం, వర్గం లేదా మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారి అభ్యున్నతిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. యువకులు, మహిళలు, రైతులు, పేదవారిని సంస్కరించడానికి వారి అభ్యున్నతి వైపు దృష్టి కేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ ఉపకరణాలను మెరుగుపరచడానికి, పౌరులకు ఆరోగ్య సంరక్షణ.. ఇతర ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. సీతారామన్ పంట అనంతర పద్ధతులను ఆధునీకరించడం, వివిధ రంగాల్లో తయారీని ప్రోత్సహించడం వంటి ప్రాముఖ్యతలను వివరించారు. బడ్జెట్లో మాత్రమే కాకుండా ఈ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్అండ్డిని మెరుగుపరచడంతోపాటు అగ్రశ్రేణి నిపుణులను సలహాదారులుగా తీసుకురావాలని కూడా చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా? ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చురుకుగా పనిచేస్తున్నాయని ఆమె వెల్లడిస్తూ.. ఈ అభివృద్ధి తక్కువ ఖర్చుతో లావాదేవీలను వేగవంతం చేయడం, అంతర్గత, బాహ్య చెల్లింపులను మరింత సరసమైనదిగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో సానుకూల పనితీరును కనబరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అలంటి వాదనలు చేసేవారు ఆధారాలు చూపాలని సీతారామన్ సవాల్ విసిరారు. -
బడ్జెట్లో రాబోయే కీలక ప్రకటనలు..?
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి దీన్ని పార్లమెంట్లో చదవనున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఇది మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం. అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చులు, గడిచిన ఏడాదిలో ఖజానాకు వచ్చిన రాబడులను వివరిస్తుంది. పేదలు, యువత, రైతులు, మహిళలకు ఈసారి బడ్జెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో ఈ కింది అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళలకు బడ్జెట్ కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో కేటాయింపులు 30 శాతం పెరిగాయని తెలుస్తుంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తీసుకునే డబ్బుపై వడ్డీ రాయితీ పథకం ప్రకటించే వీలుంది. రైతులకు పంటబీమాతో పాటు తమకు తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే అవకాశం ఉంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన ఇంధనంకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. విద్య, ఆరోగ్య సంరక్షణకు మరిన్ని నిధులు కేటాయించే వీలుంది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. కిసాన్ సమ్మాన్ నిధి కింది ఇచ్చే నగదును పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
Budget 2024: ఆమె పద్దు ఆరోసారి..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించబోతున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా ఆరో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐదు వార్షిక బడ్జెట్లు కాగా ఇప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. నిర్మలమ్మ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఐదు బడ్జెట్లను సమర్పించిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి మాజీ ఆర్థిక మంత్రుల రికార్డులను అధిగమించనున్నారు. ఆయన పదిసార్లు అత్యధిక సార్లు బడ్జెట్లను ప్రవేపెట్టిన రికార్డ్ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఉంది. మొత్తంగా ఆయన పది బడ్జెట్లను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఏ ఆర్థిక మంత్రికి అయినా గరిష్టంగా ఒక మధ్యంతర బడ్జెట్ సహా వరుసగా ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలోనూ మరో పర్యాయం ఆర్థిక మంత్రిగా కొనసాగితే మరిన్ని బడ్జెట్లు సమర్పించే వీలుంటుంది. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ సమర్పించనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిర్దిష్ట మొత్తాలను ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఓట్-ఆన్-అకౌంట్‌గా ఉంటుంది. పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నందున ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్లో నిర్మలా సీతారామన్ చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ఎటువంటి "అద్భుతమైన ప్రకటన" ఉండదని, ఇది సాధారణ ఎన్నికలకు ముందు ఓటు-ఆన్-అకౌంట్ మాత్రమే అని అన్నారు. -
ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రోత్సాహకాలుంటాయా..?
దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా, ఎగుమతులను ఉత్సాహపర్చేలా రాబోయే బడ్జెట్లో పరిశోధనలకు పన్ను ప్రోత్సాహకాలివ్వాలని ఎగుమతిదారులతోపాటు భారతీయ పరిశ్రమ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. మార్కెటింగ్ కార్యకలాపాల విస్తృతికి వీలుగా మరిన్ని నిధులను కేటాయించాలని తెలిపాయి. ఎగుమతులకు అనుగుణంగా రవాణా ఖర్చులు పెరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ రంగ భాగస్వామ్యంలో ఓ గ్లోబల్ షిప్పింగ్ లైన్‌నూ అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ వర్గాలు సూచించాయి. దీనివల్ల భారతీయ సంస్థలకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు వ్యయభారం తగ్గనుందని చెప్పాయి. 2021లో ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చార్జీలో భాగంగా 80 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించాల్సి వచ్చేదని, 2030 నాటికి ఇది 200 బిలియన్ డాలర్లను తాకవచ్చని అంచనా వేస్తున్నట్లు భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. చైనా, అమెరికా, కొరియా, ఇజ్రాయెల్ దేశాల కంటే ఆర్అండ్డీపై భారత్ పెడుతున్న ఖర్చు చాలా తక్కువగా ఉందని, ఇది దేశ జీడీపీలో 1 శాతానికిలోపే ఉందని ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు ఇస్రార్ అహ్మద్ అన్నారు. ఇదీ చదవండి: ఇకపై మృదువైన రోబోలు.. అంతర్జాతీయ కస్టమర్లకు భారతీయ ఉత్పత్తులు మరింత చేరువయ్యేలా మార్కెటింగ్ సౌకర్యాలు కావాలని, మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) స్కీం కింద బడ్జెట్లో మరిన్ని నిధులను కేటాయించాలని అహ్మద్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రూ.5,000 కోట్ల కార్పస్‌తో దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో పైలట్ ప్రాతిపదికన ఓ పథకాన్ని ప్రకటించేందుకున్న వీలును పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు. -
సిగరెట్ అక్రమ రవాణా.. చర్యలు తీసుకోవాలన్న ప్రతినిధులు
ప్రభుత్వ ఖజానాకు ఏటా దాదాపు రూ.13,000 కోట్ల ఆదాయం నష్టం వాటిల్లుతున్న సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం ఎఫ్‌ఏఐఎఫ్‌ఏ (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్ అసోసియేషన్) గతంలో ప్రభుత్వాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. అక్రమ రవాణా ప్రక్రియలో భాగంగా నేరాలు కూడా పెరుగుతున్నట్లు మెమోరాండంలో పేర్కొన్నారు. సిగరెట్ స్మగ్లింగ్‌ను అరికట్టడానికి పన్నులను తగ్గించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో వాణిజ్య పంటల సాగులో ఉన్న లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులకు అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. అక్రమ రవాణాను అరికట్టడానికి పసిడిపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నారన్న వార్తలను అసోసియేషన్ ప్రస్తావిస్తూ, ఇదే రకమైన చర్యలు సిగరెట్ పరిశ్రమకు సంబంధించి ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఫోన్ల స్మగ్లింగ్ నిరోధానికీ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఫోన్ అక్రమ రవాణా వల్ల కేంద్ర ఖజానాకు సుమారు 3వేలకోట్ల నష్టం వాటిల్లుతుండగా, సిగరెట్ అక్రమ రవాణా విషయంలో ఈ మొత్తం సుమారు రూ.13వేలకోట్లు ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు సిగరెట్ అక్రమ రవాణాను అరికట్టేలా బడ్జెట్లో చర్యలుంటాయని ఆశిస్తున్నారు. -
Budget 2024: ట్యాక్స్ పేయర్స్కి ఈ గుడ్ న్యూస్ ఉండొచ్చు!
దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టన్నారు. ఈ బడ్జెట్‌పై దేశంలోని అన్ని వర్గాలవారు వివిధ ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఈసారి ఏవైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా అని ఆసక్తిగా ఉన్నారు. ఈసారి ప్రవేశపెట్టేది సమగ్ర బడ్జెట్ కాకపోయినా కొన్ని సానుకూల మార్పులపై పన్ను చెల్లింపుదారులలో ఆశలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రధాన పన్ను ప్రయోజనాలు ఉంటాయని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయినప్పటికీ ఈ మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపు ఊరటనిచ్చే కొన్ని చిన్న సర్దుబాట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అవి ఏవేవీ అన్నది ఇక్కడ చూద్దాం.. బెంగళూరుకు హెచ్ఆర్ఏ మినహాయింపు చట్ట ప్రకారం మెట్రో నగరంగా బెంగళూరును గుర్తించినప్పటికీ, ఆదాయపు పన్ను విషయాల పరంగా బెంగళూరును ఇప్పటికీ నాన్-మెట్రో సిటీగా పరిగణిస్తున్నారు. ఈ బడ్జెట్లో బెంగళూరును మెట్రో నగరంగా వర్గీకరించి హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. సెక్షన్ 80D మినహాయింపు పరిమితి పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం సెక్షన్ 80D కింద మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలకు రూ.25,000 నుంచి రూ.50,000కు, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచవచ్చని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవలకు పన్ను తగ్గింపులను సులభతరం చేయడానికి కొత్త పన్ను విధానంలోకి సెక్షన్ 80D ప్రయోజనాలను తీసుకొస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. గృహ కొనుగోలుదారులకు టీడీఎస్ పరిమితి ప్రస్తుతం ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. 50 లక్షలు ఉంది. ఈ పరిమితిని మించితే 1 శాతం టీడీఎస్ ఉంది. ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపులకు సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్ ఆస్తులు విక్రయించే ఎన్ఆర్ఐలకు మరింత పారదర్శకత, అవగాహన తీసుకొస్తుందని భావిస్తున్నారు. మూలధన లాభాలపై పన్ను సరళీకరణ పెట్టుబడి ఆదాయానికి సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను ఎత్తి చూపుతూ ట్యాక్స్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఇండెక్సేషన్‌కు సంబంధించిన నియమాలను సరళీకృతం చేయడం, లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల పన్నులో సమానత్వాన్ని తీసుకురావడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. -
బడ్జెట్ ప్రవేశపెట్టని ఆర్థికమంత్రులు.. కారణం..
కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరంలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2024-25ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడం విశేషం. అయితే ఇప్పటి వరకు దేశ చరిత్రలో బడ్జెట్లకు సంబంధించిన కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం! ‘బడ్జెట్’ పేరు వినగానే గుర్తుకువచ్చే ఆర్థిక మంత్రుల్లో మొరార్జీ దేశాయ్ పేరు తప్పకుండా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఏకంగా పదిసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రత్యేకత ఆయన సొంతం. కొన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ కొనసాగుతోంది. మరోవైపు ఆర్థిక మంత్రిగా పని చేసి ఒక్కసారి కూడా బడ్జెట్‌ను సమర్పించని సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థికమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టని జాబితాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు హెచ్ఎన్ బహుగుణ కాగా మరొకరు కేసీ నియోగి. వీరిద్దరూ ఆర్థిక మంత్రులుగా పనిచేసినప్పటికీ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించలేదు. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. హెచ్ఎన్ బహుగుణ, కేసీ నియోగి చాలా తక్కువ కాలంపాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. వీరు మంత్రులుగా పని చేసిన సమయంలో వారికి బడ్జెట్ సమర్పించే అవకాశం రాలేదు. నియోగి 1950లో స్వతంత్ర భారతదేశానికి రెండో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కేవలం 35 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఇక బహుగుణ, 1979-80 మధ్య ఐదున్నర నెలల పాటు పదవిలో ఉన్నారు. ఆయనకూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం రాలేదు. దీంతో వీరిద్దరూ ఆర్థిక మంత్రిగా పని చేసి కూడా కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు. -
కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో కొంత ఉపశమనాన్ని ప్రకటించాలని ప్రజలు భావిస్తున్నారు. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తారు అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకు మేలు జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు రెట్టింపు చేయాలని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50.7 బేసిస్ పాయింట్ల మేర అంటే దాదాపు రూ.9.07 లక్షల కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈమేరకు నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని కొందరు చెబుతున్నారు. -
వ్యవ‘సాయం’ అందుతుందా..?
భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయం కీలకపాత్రం పోషిస్తోంది. దేశంలో 42 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ గతంలో కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. దీనికి తోడు వ్యవసాయం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవడం కీలకం. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా అన్నదాత ఆదాయం హెచ్చవుతుందని నిపుణలు చెబుతున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, నాణ్యమైన విత్తనాలు, టెక్నాలజీ వంటివి ఆర్థిక మంత్రికి కీలకంగా మారనున్నాయి. సవాలు విసురుతున్న పరిస్థితులు.. వ్యవసాయ, పశుపోషణ రంగానికి కీలకమైన డీజిల్, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఈ ఏడాది ఆలస్యం కావడంతో పంట దిగుబడుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఆహారకొరత ఏర్పడుతోంది. వ్యవసాయ ఎగమతులు తగ్గుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు గోధుమ పంటను దెబ్బతీశాయి. గోధుమలు, చక్కెర ఉత్పత్తులను కేంద్రం ఇప్పటికే నిలిపేసింది. ఆధునికీకరణకే పెద్దపీట.. భారత్‌లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతోంది. దీనికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. భారత్‌లో రైతుల ఉత్పత్తి.. అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీలను తీసుకురావాల్సి ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రైతులకు సాంకేతికత, దానికి సంబంధించిన పరికరాలు చౌకగా లభించేందుకు ఈ రంగంలోని స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి 2022 బడ్జెట్లోనే పునాదులు వేశారు. కిసాన్ డ్రోన్లను ప్రమోట్ చేసేలా అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కింద ఓ నిధిని ఏర్పాటు చేసింది. బ్లాక్‌చైన్, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను వ్యవసాయ రంగానికి అన్వయించడమే అసలైన సవాలు. 2024-25 బడ్జెట్లో వీటికి ప్రత్యేక కేటాయిపులు చేయడంతో పాటు.. పన్ను రాయితీలు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. వ్యవసాయ రుణాలు రూ.22-25 లక్షల కోట్లు..? 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఇచ్చే స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 2% వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. అందువల్లే రూ.3 లక్షల వరకు రుణాలు 7% వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. గడువులోపు బకాయిలు తీర్చేవారికి అదనంగా మరో 3% వడ్డీ మినహాయింపూ ఉంటుంది. దీర్ఘకాల రుణాలనూ రైతులు తీసుకోవచ్చు కానీ.. మార్కెట్ రేటు ప్రకారమే వడ్డీ రేటు ఉంటుంది. -
ఎంఎస్ఎంఈకి ప్రత్యేక ప్యాకేజ్!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో తనకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందని లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) భావిస్తోంది. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో.. ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా తగిన కనిష్ట స్థాయి రుణ రేట్లు పరిశ్రమలకు లభిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. స్థూల దేశీయోత్పతిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 29.15 శాతం కావడం గమనార్హం. బ్యాంకులు– ఎంఎస్ఎంఈల మధ్య సంబంధం అసమానంగా ఉందని, రుణ దాతల విచక్షణ పరిధిలో అసతౌల్యతకు గురవుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) సెక్రటరీ జనర ల్ అనిల్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బడ్జెట్ ప్రయతి్నస్తుందన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ నిర్దిష్ట ఉత్పత్తుల ఎగుమతి వాటా 2023–24లో (సెపె్టంబర్ 2023 వరకు) 45.56 శాతంగా ఉంది. ఇది 2022–23లో 43.59 శాతం. కన్స ల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఎంఎస్ఎంఈలకు మూలధన ప్రవాహాలలో నష్టాలను తగ్గించడానికి క్రెడిట్ గ్యారెంటీలు, బీమా పథకాల వంటి నష్ట నివారణ సాధనాలను ప్రోత్సహించడం మంచిని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో మోటివ్, ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్, ఎలక్ట్రికల్ మెషినరీ, కెమికల్స్ వంటి పరిశ్రమలకు ఈ తరహా చర్యలు అవసరమని వివరించారు. 6 శాతం మాత్రమే ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ విక్రయాల్లో ఎంఎస్ఎంఈ పాత్ర కేవలం 6 శాతంగా ఉంటోందని పరిశ్రమ పేర్కొంటోంది. -
నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే..
సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ ఇది. 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా మోదీ సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది. సాధారణంగా రెండు పర్యాయాలు అధికారంలో కొనసాగినప్పుడు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత సహజం. దీనికితోడు గత బడ్జెట్లలో మధ్య తరగతిని ఆకట్టుకునే ప్రకటనలేవీ లేవు. ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో కీలక ప్రకటనలు లేకపోయినప్పటికీ ఉన్నంతలో మధ్యతరగతిని ఆకట్టుకుంటూనే ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మధ్యంతర బడ్జెట్‌ను రూపొందించడం ఆమె ముందున్న సవాలు. ఇందుకోసం నిర్మలా సీతారామన్, ఆమె టీమ్ కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఆమె టీమ్‌లో ఎవరు ఉన్నారు? వారి పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.. నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ మంత్రి మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతలను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు. ఇందిరాగాంధీ తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా ఘనత సాధించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన నిర్మల.. కెరీర్ తొలినాళ్లలో లండన్‌లోని ఓ స్టోర్‌లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్‌లో ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా, తర్వాత రక్షణశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. టీవీ సోమనాథన్, ఆర్థిక శాఖ కార్యదర్శి తమిళనాడు కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీవీ సోమనాథన్. గతంలో కార్పొరేట్ వ్యవహారాల జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. 2015-17 మధ్య ప్రధాని కార్యాలయంలోనూ పనిచేశారు. కలకత్తా యూనివర్శిటీ నుంచి అర్థశాస్త్రంలో పీహెచ్డీ పూర్తిచేసిన సోమనాథన్ ప్రపంచ బ్యాంక్‌లోనూ విధులు నిర్వర్తించారు. బడ్జెట్ బృందంలోని కీలక వ్యక్తుల్లో అత్యంత సీనియర్ ఈయనే. ప్రభుత్వం ప్రకటించే పథకాల వ్యయాలను అంచనా వేసేది ఈయనే. మరి ఈసారి బడ్జెట్ ఖర్చులను ఎలా రూపొందిస్తారో చూడాలి. పీకే మిశ్రా ప్రమోద్ కుమార్ మిశ్రా(పీకే మిశ్రా) భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ కేడర్‌కు చెందిన ఆయన 1972 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2001-2004 మధ్యకాలంలో మిశ్రా నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అరవింద్ శ్రీవాస్తవ ప్రధానమంత్రి కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ ఎకానమీ అధికారిగా అరవింద్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. కర్ణాటక కేడర్‌కు చెందిన ఆయన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ అతని పరిధిలోనే ఉన్నాయి. అతను జాయింట్ సెక్రటరీగా పీఎంఓలోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో చేరారు. పుణ్య సలిల శ్రీవాస్తవ పుణ్య సలిల శ్రీవాస్తవ ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం) కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నవంబర్ 2020 నుంచి అక్టోబర్ 2021 వరకు హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత ఆమె పీఎంఓకు మారారు. ఇదీ చదవండి: పన్ను మినహాయింపు పెంచనున్నారా..? హరిరంజన్ రావు హరిరంజన్ రావు మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పీఎంఓలో సాంకేతికత, పాలనపరమైన వ్యవహారాలు చూస్తున్నారు. రావు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. పీఎంఓలో చేరడానికి ముందు ఆయన టెలికమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేశారు. -
పన్ను మినహాయింపు పెంచనున్నారా..?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో పన్ను మినహాయింపులు పెంచుతారని పన్నుదారులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ఎక్కువ మంది ఆయా ప్లాన్‌ల్లో అధికంగా కేటాయింపులు జరిపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయానికి పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో పెడుతున్న పెట్టుబడి చాలా కీలకంగా మారనుంది. ప్రస్తుతం నేషనల్ పెన్షన్ స్కీమ్‌కు సెక్షన్ 80సీ కింద ఇస్తున్న రూ.50,000 పన్ను మినహాయింపును పెంచాలని కోరుతున్నారు. దాంతోపాటు పెన్షన్, యాన్యుటీ ప్లాన్లకు సైతం ఈ మినహాయింపును వర్తింపజేయాలని నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం ఆ ప్లాన్‌ల్లో మరింత పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. పెన్షన్, యాన్యుటీ ప్లాన్‌ల్లో జీరో రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే వస్తున్న రాబడులపై ట్యాక్స్ భారాన్ని తగ్గించడంలో సహాయపడాలని అంటున్నారు. ఫలితంగా మరింత ఆర్థికభద్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఇదీ చదవండి: వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే.. ప్రస్తుతం సెక్షన్ 80సీ పరిధిలోకి పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకం, ఈఎల్ఎస్ఎస్ మొదలైన ఇతర పన్ను ఆదా ఉత్పత్తులు వస్తున్నాయి. సెక్షన్ 80డీ కింద టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే వీటిలో ప్రస్తుతం ఉన్న పరిమితిని పెంచాలని కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. -
Union Budget 2024: కొత్త బడ్జెట్.. ఆసక్తికర మార్పులు
ఏటా కొత్త బడ్జెట్ వస్తున్నప్పుడల్లా దేశమంతా ఆసక్తిగా చూస్తారు. ఏయే మార్పులు ఉండబోతున్నాయి. పన్నులు ఏమైనా తగ్గుతాయా.. ధరలు తగ్గే వస్తువులేంటి.. ఏయే రంగాలకు ఎంత బడ్జెట్ కేటాయించారు.. తదితర విషయాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలోనే మార్పు వచ్చింది. ఏళ్లనాటి సంప్రదాయాలు మారాయి. అవేంటి.. ఎందుకు మారాయన్న విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ సమర్పణకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు. ఇందులో ఎటువంటి ప్రధాన ప్రకటనలు ఉండవు. 2024 లోక్‌సభ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు దీనిని ప్లేస్‌హోల్డర్‌గా పరిగణిస్తారు. బడ్జెట్ సమర్పణ తేదీ కొన్నేళ్ల క్రితం వరకు ఫిబ్రవరి నెలాఖరున బడ్జెట్‌ను సమర్పించేవారు. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 28 నుంచి ఫిబ్రవరి 1కి మార్చారు. 2017లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వలసరాజ్యాల కాలంలో మాదిరిగా ఫిబ్రవరి చివరి రోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించబోమని ప్రకటించారు. బ్రిటిష్ పాలనలో అనుసరించిన 92 ఏళ్ల పద్ధతికి ముగింపు పలికేందుకు నెల చివరి రోజు కాకుండా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించనున్నట్లు అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. దీంతోపాటు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త విధానాలు, మార్పులకు సిద్ధం కావడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ సమయం ఉందని, అందుకే బడ్జెట్ ప్రదర్శన తేదీని ఫిబ్రవరి 1కి మార్చినట్లు ఆయన పేర్కొన్నారు. రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ బ్రిటీష్ హయాంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. తర్వాత చాలా ఏళ్లు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. మోదీ ప్రభుత్వంలో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్‌ను సమర్పించే విధానాన్ని రద్దు చేశారు. రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో అనుసంధానం చేయనున్నట్లు 2016లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. బడ్జెట్ సమర్పణ సమయం 1999 వరకు ఫిబ్రవరి నెల చివరి రోజున సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను సమర్పించేవారు. బ్రిటీష్ ఇండియా నుంచి సంక్రమించిన ఈ సంప్రదాయం స్వాతంత్ర్యం తర్వాత కూడా మారలేదు. వలసరాజ్యాల కాలంలో బడ్జెట్ సమర్పణ సమయాన్ని బ్రిటన్ స్థానిక సమయం ద్వారా నిర్ణయించేవారు. దీని ప్రకారం బడ్జెట్‌ను బ్రిటన్‌లో ఉదయం 11 గంటలకు (స్థానిక కాలమానం) సమర్పించేవారు. ఇది భారతదేశంలో సాయంత్రం 5 గంటలకు సమానంగా ఉంటుంది. తర్వాత 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. బడ్జెట్‌ను మరింత క్షుణ్ణంగా విశ్లేషించడానికి, చర్చించడానికి తగిన సమయం ఉండటమే ఈ మార్పు వెనుక కారణం. -
వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
దేశీయంగా బ్యాంకుల స్థూల పారు బాకీలు(గ్రాస్ ఎన్పీఏలు) గత పదేళ్లలో కనిష్ఠ స్థాయికి చేరినట్లు ఇటీవల భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగ ఆర్థిక స్థితి మెరుగైందన్నది కాదనలేని సత్యం. కానీ అందుకు చాలామార్పులు తీసుకురావాల్సి వచ్చింది. డిపాజిట్‌దారుల నుంచి డబ్బు తీసుకుని, వారికి చెల్లించే వడ్డీకన్నా కాస్త ఎక్కువకు రుణగ్రహీతలకు అప్పులు ఇచ్చి లాభాలు ఆర్జించడమే బ్యాంకుల ప్రధాన వ్యాపారం. అప్పులు తీసుకున్నవారు వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోతే పారు బాకీలు (ఎన్పీఏలు) ఎక్కువై బ్యాంకులు నష్టాలపాలవుతాయి. భారతీయ బ్యాంకులు 2014-15 నుంచి రూ.14.56 లక్షల కోట్ల పారు బాకీలను రద్దు చేశాయని కేంద్రం ఇటీవల పార్లమెంటులో తెలిపింది. అందులో రూ.7.40 లక్షల కోట్లు భారీ పరిశ్రమలకు, బడా సర్వీసు కంపెనీలకు ఇచ్చినవే. గడచిన మూడేళ్లలో బ్యాంకులు పారుబాకీల కింద చూపిన రూ.5.87 లక్షల కోట్లలో 19శాతాన్ని అంటే, 1.09 లక్షల కోట్ల రూపాయలను మాత్రమే తిరిగి వసూలు చేయగలిగాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. గత పదేళ్లలో బ్యాంకుల పారుబాకీలు బాగా తగ్గినట్లు రిజర్వు బ్యాంకు తాజాగా వెల్లడించింది. అయితే, భారీ కంపెనీలకు ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కాక నష్టాలపాలైన బ్యాంకులను మళ్ళీ నిలబెట్టడానికి క్యాపిటల్ మానిటైజేషన్ పేరుతో బడ్జెట్లలో వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కేటాయించడం ఆనవాయితీగా మారింది. ఇదీ చదవండి: ఎక్కువ పన్నులు కట్టాలంటున్న బిల్ గేట్స్! ఎందుకు..? ఇలా 2016-21 మధ్య కేంద్రం దాదాపు రూ.3.10 లక్షల కోట్లు ఇచ్చింది. 2022-23, 2023-24 బడ్జెట్లలో మాత్రమే కేటాయింపులు జరపలేదు. ఈసారి బడ్జెట్లో పరిస్థితి ఎలాఉండబోతుందో చూడాలని నిపుణులు చెబుతున్నారు. -
బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా?
ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' 2024 బడ్జెట్లో ఈవీ రంగానికి సానుకూలమైన మద్దతు ప్రకటిస్తారని వాహన తయారీ సంస్థలు ఆశిస్తున్నాయి. 2023లో భారతీయ ఈవీ రంగం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది కూడా ఉత్తమ ఉత్పత్తులను, విక్రయాలను సాధించనున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. 2024లో చాలా వరకు ఫ్యూయెల్ కార్లఉత్పత్తి తగ్గి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లు రానున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EV) పరిశ్రమ విడిభాగాలపై వస్తువులు, సేవల పన్ను (GST) రేటును తగ్గించాలని.. బడ్జెట్ 2024లో ఫేమ్ సబ్సిడీ పథకాన్ని పొడిగించాలని పలువురు ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి తప్పకుండా ఫేమ్ III స్కీమ్ పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్లో ఈ స్కీమ్ కోసం అదనపు వనరులను కోరే అవకాశం ఉంది. ఫేమ్ అనేది ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ (e-3W), ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (e-4W), ఎలక్ట్రిక్ బస్సుల కోసం అందించే సబ్సిడీ స్కీమ్. ఇదీ చదవండి: చైనా కంపెనీకు చుక్కలు చూపించిన కస్టమర్.. దెబ్బకు రూ.10 లక్షలు ఫైన్! గతంలో 7,000 ఎలక్ట్రిక్ బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు వంటి వాటికి మద్దతు ఇవ్వడానికి ఫేమ్ 2 పథకాన్ని రూ. 10000 కోట్ల బడ్జెట్ వ్యయంతో 2019లో మూడు సంవత్సరాల కాలానికి ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సుమారు 1216380 వాహనాలకు ఇప్పటి వరకు రాయితీలు అందించారు. దీని వ్యయం 2023 డిసెంబర్ 21 నాటికి రూ. 5422 కోట్లు. -
Budget 2024: ద్రవ్యలోటు 5.3 శాతానికి కట్టడి
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.3 శాతానికి కట్టడి చేయడానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రయతి్నస్తుందని భావిస్తున్నట్లు ఫారిన్ బ్రోకరేజ్ సంస్థ– బ్యాంక్ ఆఫ్ అమెరికా (బీఓఎఫ్ఏ) సెక్యూరిటీస్ అంచనా వేసింది. అలాగే 2023–24లో 5.9 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని కూడా అభిప్రాయపడింది. ఎన్నికల పరమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, 2024–25లో 5.3 శాతానికి లోటును కేంద్రం కట్టడి చేయగలుగుతుందని అభిప్రాయపడింది. వ్యయ కుదింపునకు బదులుగా మూలధన వ్యయం ఆధారిత వృద్ధి ద్వారా ద్రవ్య లోటును తగ్గించుకునే వ్యూహాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు పరిస్థితి కనబడుతోందని వివరించింది. సబ్సిడీ లీకేజీలుసహా అనవసర వ్యయాలను తగ్గించుకోవడం, డిజిటలైజేషన్ వినియోగం ద్వారా పన్ను వసూళ్లను భారీగా పెంచుకోవడం లక్ష్యంగా చర్యలు ఉంటున్నాయని వివరించింది. 2023–24లో ద్రవ్యలోటు రూ.17.86 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ అంచనాల్లో పోల్చి చూస్తే ఇది 5.9 శాతం. ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు లక్ష్య సాధన సాధ్యమేనని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ ఇటీవలే స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. నవంబర్ ముగిసే నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.17.40 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 64.3 శాతం). వ్యయాలు రూ.26.46 లక్షల కోట్లు (బడ్జెట్ లక్ష్యంలో 58.9 శాతం). వెరసి ద్రవ్యలోటు రూ.9.06 లక్షల కోట్లకు చేరింది. మొత్తం లక్ష్యంలో (రూ.17.86 లక్షల కోట్లు) ఇది 51 శాతం. -
Budget 2024: ఈసారైనా సెక్షన్ 80సీకు మోక్షం లభిస్తుందా..?
కేంద్ర బడ్జెట్ 2024 పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించేలా చూడాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న యూనియన్ బడ్జెట్లో సెక్షన్ 80C కింద మినహాయింపుల పరిమితిని పెంచాలని అంటున్నారు. ఈ మినహాయింపులను చివరిసారిగా 2014-2015 బడ్జెట్లో రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు సవరించారు. 2015 నుంచి ఇప్పటి వరకు అందులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈసారైనా మినహాయింపు స్లాబ్‌ను పెంచుతారేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సెక్షన్ 80C అనేది ఆదాయపు పన్ను చట్టంలో కీలకమైంది. సాధారణంగా ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వేతనజీవులు స్వల్ప, దీర్ఘకాల పెట్టుబడులు, ఖర్చుల కోసం పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి దీన్ని వినియోగిస్తారు. సెక్షన్ 80C కింద క్లెయిమ్ అవుతున్న కొన్ని పెట్టుబడులు: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్) ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్(యులిప్) ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్) జీవిత బీమా ప్రీమియంలు సుకన్య సమృద్ధి యోజన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. పరిమితిని ఎందుకు పెంచాలంటే.. సెక్షన్ 80C కింద మినహాయింపుల కోసం రూ.1.5లక్షల పరిమితి తొమ్మిదేళ్లుగా అలాగే ఉంది. దీన్ని చివరిగా 2014-15లో సవరించారు. అప్పటినుంచి ఉంటున్న ద్రవ్యోల్బణాన్ని పరిగణించి సవరణలు చేయాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. ఈ పరిమితిలో ఎక్కువ భాగం ప్రావిడెంట్ ఫండ్కే కేటాయించబడుతుందని కొందరు తెలుపుతున్నారు. ఒకవేళ హౌసింగ్ లోన్ ఉంటే అసలు కట్టేందుకే ఈ పరిమితి సరిపోవడంలేదని చెబుతున్నారు. దీన్ని కనీసం రూ.2,50,000కి పెంచాలని అంటున్నారు. -
ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే..
కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు ప్రత్యక్ష, పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.5 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న తరుణంలో భారత్ వంటి పెద్ద దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో పన్నువసూళ్లు ఆసక్తిగా మారాయి. పరోక్ష పన్నులతోపాటు నేరుగా ప్రజల సంపాదనపై వేసే ప్రత్యక్ష పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం వృద్ధి నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.14.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని తెలిపింది. జనవరి 10 నాటికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు స్థిరమైన వృద్ధిరేటు కొనసాగిస్తున్నాయని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2023-24 బడ్జెట్ అంచనాల్లో 80.61 శాతం వృద్ధి చెందినట్లు కేంద్రం పేర్కొంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లు (వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్ టాక్స్) రూపేణా రూ.18.23 లక్షలు వసూలు చేయాలని బడ్జెట్ అంచనాల్లో గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది 2022-23 సంవత్సరం రూ.16.61 లక్షల కోట్లతో పోలిస్తే 9.75 శాతం ఎక్కువ. ఇక గతేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2024 జనవరి 10 వరకు ఐటీ రీఫండ్స్ రూ.2.48 లక్షల కోట్లుగా ఉండనున్నాయి. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.17.18 లక్షలకోట్లు కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16.77 శాతం ఎక్కువ. స్థూల కార్పొరేట్ టాక్స్ (సీఐటీ) వసూళ్లు 8.32 శాతం, వ్యక్తిగత పన్ను ఆదాయం (పీఐటీ) వసూళ్లు 26.11 శాతం పెరిగాయి. రీఫండ్స్ సర్దుబాటు తర్వాత సీఐటీ వసూళ్లలో నికర వృద్ధిరేటు 12.37 శాతం, పీఐటీ వసూళ్లలో 27.26 శాతంగా నమోదైనట్లు తెలిసింది. -
ఈసారి మధ్యంతర బడ్జెటేనా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ అనేది సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు లేదా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం సమర్పించే తాత్కాలిక ఆర్థిక ప్రణాళిక. దాంతో వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్ వెలువరించనుంది. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించే వరకు ప్రభుత్వ వ్యయ అవసరాలను తీర్చడానికి ఇది తాత్కాలిక ఏర్పాటుగా పనిచేస్తుంది. ఏటా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు యూనియన్ బడ్జెట్ అమల్లో ఉంటుంది. కాబట్టి ఆ తేదీ వరకు మాత్రమే ప్రభుత్వానికి హక్కులు ఉంటాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు జరిగే సాధారణ ప్రభుత్వ వ్యయానికి, మధ్యంతర కాలంలో ఖర్చులను భరించడానికి ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటు అనుమతి అవసరం అవుతుంది. అందుకే మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ఈసారి ఎలా ఉండబోతుందంటే.. ఒకవేళ మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెడితే సాధారణంగా వ్యయం, రాబడి, ఆర్థిక లోటు, ఆర్థిక పనితీరు, రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలు ఉంటాయి. ఇందులో ఎలాంటి ప్రధాన విధాన ప్రకటనలూ ఉండవు. ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, మధ్యంతర బడ్జెట్లో ఓటర్లను ప్రభావితం చేసే ఏ పెద్ద పథకాన్నీ చేర్చకూడదు. ప్రస్తుత ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌తో ఆర్థిక సర్వేను సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే పన్నుల పెంపు, తగ్గింపు తదితర అంశాలను మధ్యంతర బడ్జెట్లో ప్రకటించవచ్చు. మధ్యంతర బడ్జెట్ ద్వారా పార్లమెంటు ఎన్నికలకు ముందు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వంటి ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి పార్లమెంటు వోటాన్ అకౌంట్‌ను ఆమోదిస్తారు. ఎలాంటి చర్చ లేకుండానే దీనికి ఆమోదం దక్కుతుంది. వోటాన్ అకౌంట్ సాధారణంగా రెండు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది అవసరమైతే పొడిగించవచ్చు. భారతదేశ ఆర్థిక ప్రణాళిక, పాలనను మధ్య తేడాను అర్థం చేసుకుని బడ్జెట్‌ను విశ్లేషించాల్సి ఉంటుంది. మధ్యంతర బడ్జెట్ ఆర్థిక స్థిరత్వానికి కీలకం కాగా, పూర్తి సంవత్సర బడ్జెట్ రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుంది. ఇది మొత్తం ఆర్థిక సంవత్సరానికి దిశను నిర్దేశిస్తుంది. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలు.. 2023లో ఎక్కువగా అమ్మిన సంస్థలు ఇవే.. పూర్తికాల బడ్జెట్లో.. పూర్తి సంవత్సర బడ్జెట్లో ఆర్థిక వృద్ధి, మూలధన పెట్టుబడి సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. పూర్తి సంవత్సరం బడ్జెట్ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది వివిధ రంగాలు, సంస్కరణల పట్ల ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తుంది. -
నిండుతున్న కేంద్ర ఖజానా.. కానీ ఇకపై..
కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, సెస్లతోపాటు ఇతర మార్గాల్లో నిధులు సమకూరుతుంటాయి. అయితే ప్రభుత్వ సంస్థల్లో కేంద్రానిదే మేజర్ వాటా. ఆ కంపెనీలు ఆర్థిక సంవత్సరంలో లాభాల్లో ఉంటే అవి ఇన్వెస్టర్లకు డివిడెండ్ల రూపంలో నగదు బదిలీ చేస్తాయి. దాంతో కేంద్రానిదే అధిక వాటా ఉంటుంది కాబట్టి భారీగా నిధులు సమకూరుతాయి. ఈ ఏడాది ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) కేంద్రానికి భారీ డివిడెండ్లను చెల్లిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బడ్జెట్లో నిర్దేశించిన అంచనాల్ని మించి చెల్లింపు ఉంటుందని పేర్కొన్నాయి. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల వరకూ డివిడెండ్లు వస్తాయని ఆ వర్గాలు వివరించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రూ.43,000 కోట్ల డివిడెండ్ మొత్తాన్ని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి మించి ఈ ఏడాది అదనంగా రూ.12,000-17,000 కోట్లు వస్తాయని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే పీఎస్‌యూల నుంచి రూ.43,800 కోట్ల డివిడెండు మొత్తం కేంద్రానికి అందింది. పీఎస్‌యూల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అయితే ఆ లోటును డివిడెండ్లు పూడుస్తాయని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు? కొన్ని ప్రభుత్వ సంస్థలు లాభాల భాటపడుతూ కేంద్రానికి భారీగా నిధులు సమీకరిస్తున్నాయి. అయితే ఇంకొన్ని కంపెనీల్లో ప్రభుత్వం వాటా విక్రయించడం ద్వారా రానున్న రోజుల్లో కేంద్రానికి వచ్చే మొత్తంలో కోత పడనుందని నిపుణులు చెబుతున్నారు. డిజిన్వెస్ట్‌మెంట్ పేరుతో వాటాలు అమ్మి రూ.51,000 కోట్లు సమీకరించాలని బడ్జెట్లో నిర్దేశించుకోగా, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల రూ.30,000 కోట్లు కూడా రావడం కష్టమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ వాటాల విక్రయంతో రూ.10,500 కోట్లు మాత్రమే కేంద్రం సమీకరించగలిగింది. ప్రస్తుతం ఎనిమిది ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రతిపాదన వివిధ దశల్లో ఉందని తెలిసింది.