బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..! | Budget 2024-25: Expectations Are Rising And These Are The Things To Expect On Feb 1st, No Major Announcements - Sakshi
Sakshi News home page

Budget 2024 Expectations Highlights: ఆశలన్నీ ఆరు అంశాల మీదే..! బడ్జెట్‌పై పెరుగుతున్న అంచనాలు

Published Mon, Jan 29 2024 9:48 AM | Last Updated on Tue, Jan 30 2024 4:52 PM

Interim Budget 2024 These Things Expect On February 1 - Sakshi

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ వెల్లడించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్‌లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అయితే బడ్జెట్‌ ప్రకటించడానికి ముందే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా.. ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద ద్రుష్టి సారించే అవకాశం ఉందని వెల్లడించారు.

 👉2024 బడ్జెట్‌లో డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌కు ఎక్కువ నిధులు కేటాయించే సూచనలు ఉన్నాయి.

 👉ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును GDPలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

 👉కాపెక్స్‌పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి & వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు.

 👉రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

 👉వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువని తెలుస్తోంది.

 👉గృహాల కోసం ప్రభుత్వం డబ్బును (నిధులు) 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 ట్రిలియన్‌ డాలర్లకు (12 బిలియన్ డాలర్లకు సమానం) చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement