Budget 2024-25 Expectations
-
ఎక్కడ ఈ నిధులు..? బడ్జెట్ పై KS ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..
-
Watch Live కేంద్ర బడ్జెట్
-
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం కావాలి!
దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశిస్తూ ఉండ వచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టడం అవసరం.మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం. ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.మరో తరం సంస్కరణలు అవసరంఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్‌తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది. అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్ మార్కెట్లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కేంద్ర బడ్జెట్.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..
దేశ ఆర్థిక వృద్ధిలో ఎంతో కీలకమైన కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలకు మేలు చేకూర్చేలా కేంద్ర విధానాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు సంస్థలకూ కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పెద్దగా ఆకర్షణీయమైన ప్రకటనలు చేయలేదు. ఎన్డీఏ కూటమికి గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో సామాన్యులకు వరాలు కురిపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే స్థానికంగా ఉన్న అవసరాలమేరకు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని నిధులు కావాలో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సూచిస్తూ నిపుణులు కొన్ని అంశాలను తెలియజేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో కావాల్సినవి..విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయింపులు పెంచాలి. ఈ సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు.మౌలిక వసతుల అభివృద్ధిలో కేంద్రం వాటా పెరగాలి.ఓడరేవుల అభివృద్ధి వేగవంతం కావాలి.భోగాపురం విమానాశ్రయ నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలి.ఆంధ్రప్రదేశ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీలకు నిధుల కేటాయింపులు జరగాలి.హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ వ్యవసాయ పరిశోధన సంస్థ ఏర్పాటు కావాలి.తెలంగాణలో..రాష్ట్రంలో మరిన్ని పారిశ్రామిక వార్డుల ఏర్పాటుకు డిమాండ్లు ఉన్నాయి.తెలంగాణలో సింగరేణి, ఐఐటీ హైదరాబాద్, మణుగూరు కోట భారజల కర్మాగారాలకు కేటాయింపులు జరగాలి.ఐటీఆర్ కారిడార్, ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: ఆర్థిక సర్వే, బడ్జెట్ మధ్య తేడా ఏమిటంటే..ఉమ్మడిగా తెలుగు రాష్ట్రాలకు..రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి.మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు నిధుల కేటాయింపులు పెంచాలి.రెండు రాష్ట్రాల్లో మరిన్ని మ్యూజియంలు ఏర్పాటు చేయాలి.ఇరు ప్రాంతాలకు కేంద్ర పన్నుల్లో లభిస్తున్న వాటా పెరగాలి.యూనిఫైడ్ కార్డు జారీ (ఆధార్, పాన్, వోటర్, ఈపీఎఫ్, రేషన్ కార్డులన్నింటికి ప్రత్యామ్నాయంగా ఒకే కార్డు) కావాలి.పెట్రోలు, డీజిల్ ధరలపై సుంకాలు తగ్గాలి.సీనియర్ సిటిజన్ల గరిష్ఠ పొదుపు పరిమితిని రెట్టింపు చేయాలి.ఆర్థికంగా వెనకబడ్డ పట్టణ ప్రాంతాల వారికి గూడు కల్పించే పీఎం ఆవాస్ యోజన కేటాయింపులు పెరగాలి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల కోసం పట్టణ మౌలికాభివృద్ధి నిధులు పెరగాలి.ఉద్యోగులకు మరిన్ని పన్ను రాయితీలు పెరగాలి.స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ రోడ్లకు కేటాయింపులు పెరగాలి. -
Budget 2024: వ్యవసాయ పరిశోధనకు ఊతం ఇవ్వాలి
న్యూఢిల్లీ: సాగు రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు, వ్యవసాయ రంగ మండళ్లు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాయి. 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ముందు ఆరి్థక మంత్రి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. వ్యవసాయ పరిశోధనపై పెట్టుబడులు మరింతగా పెంచాలని, ఎరువుల సబ్సిడీలను హేతుబదీ్ధకరికంచాలని ఈ సందర్భంగా ఆయా రంగాల ప్రతినిధులు సూచించారు. ఆరి్థక వ్యవస్థలో వినియోగం పుంజుకోవడానికి వీలుగా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, తక్కువ రేటుకు వర్తకులకు రుణాలు అందించాలని రిటైల్ వర్తకుల సమాఖ్య ఆరి్థక మంత్రిని కోరింది. వర్తకులకు జీఎస్టీ విషయంలో పలు వెసులుబాట్లు కలి్పంచాలని జీటీఆర్ఐ సూచించింది.జీఎస్టీ భారం దించాలి..1.46 కోట్ల రిజి్రస్టేషన్లతో ప్రపంచంలోనే అతి పెద్ద పరోక్ష పన్నుల వ్యవస్థ అయిన జీఎస్టీకి సంబంధించి చేపట్టాల్సిన కీలక సంస్కరణలను గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) ఆరి్థక మంత్రి దృష్టికి తీసుకొచి్చంది. జీఎస్టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌కు పెంచాలని కోరింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు ఉన్న సంస్థలకే జీఎస్టీ రిజిస్ట్రేషన్ మినహాయింపు అమల్లో ఉంది. జీఎస్టీలో ప్రస్తుతమున్న శ్లాబులను తగ్గించాలని, రాష్ట్రం వారీగా జీఎస్టీ రిజి్రస్టేషన్‌ను పరిహరించాలని.. దీనివల్ల జీఎస్టీ మరింత సమర్థవంతంగా, వ్యాపార అనుకూలంగా మారుతుందని పేర్కొంది. రూ.1.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న సంస్థలు మొత్తం రిజి్రస్టేషన్లలో 80 శాతంగా ఉంటాయని, మొత్తం పన్ను వసూళ్లలో వీటి ద్వారా వస్తున్నది 7 శాతమేనని గుర్తు చేసింది. ‘‘ఏటా రూ.1.5 కోట్లు అంటే నెలవారీ టర్నోవర్ రూ.12–13 లక్షలు. 10 శాతం మార్జిన్ ఆధారంగా వచ్చే లాభం రూ.1.2 లక్షలే. వీరికి మినహాయింపు కల్పిస్తే మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 23 లక్షలకు దిగొస్తుంది. జీఎస్టీ వ్యవస్థపై ఇది భారం తగ్గిస్తుంది’’అని వివరించింది. పన్ను వసూళ్లను పెంచడం ద్వారా 7 శాతం పన్ను నష్టాన్ని అధిగమించొచ్చని సూచించింది. ఈ ఒక్క చర్యతో ఎంఎస్ఎంఈలో వృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల మధ్య వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా జీఎస్టీ నిబంధనలను సులభతరం చేయాలని కూడా కోరింది. వాతావరణ మార్పులు, టెక్నాలజీ, వాణిజ్యంపై పరిశోధనకు జీటీఆర్ఐ కృషి చేస్తుంటుంది.పన్ను తగ్గిస్తే వినియోగానికి ఊతం..అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య ప్రతినిధులు ఆర్థిక మంత్రికి ఇచి్చన వినతిపత్రంలో పలు కీలక సూచనలు చేశారు. రిటైల్ రంగం వృద్ధి చెందేందుకు వీలుగా డిమాండ్ ను పెంచడం, వినియోగానికి ఊతమివ్వడం కోసం 2024–25 బడ్జెట్లో తక్కువ పన్ను రేట్ల రూపంలో ప్రయోజనాలు లేదా రాయితీలు కలి్పంచాలని కోరింది. ‘‘పన్ను రేట్లు తగ్గిస్తే, నెలవారీ ఖర్చు చేసే ఆదాయంపెరుగుతుంది. అది అంతిమంగా వినియోగానికి ప్రేరణనిస్తుంది. రిటైల్ రంగానికీ మేలు చేస్తుంది’’ అని పేర్కొంది. రిటైలర్లకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన చేయాలని కోరింది. ఫుడ్ అండ్ బెవరేజెస్‌ను అత్యవసర సేవగా గుర్తించాలని, భూముల రేట్లు, విద్యుత్‌పై సబ్సిడీలు, ఇతర ప్రయోజనాల కల్పించాలని కోరింది. వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా జాతీయ రిటైల్ విధానాన్ని వేగంగా రూపొందించి, అమలు చేయాలని కోరింది. ఎంఎస్ఎంఈల ప్రయోజనాలకు రిటైలర్లను అర్హులుగా ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కలి్పస్తూ, జీడీపీలో 10 శాతం వాటాను రిటైల్ రంగం సమకూరుస్తుండడం గమనార్హం. వ్యవసాయ రంగం పటిష్టత కోసం.. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడేందుకు వీలుగా సాగు రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ)కి పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్ఏ) చైర్మన్ ఎంజే ఖాన్ ప్రస్తావించారు. దీనివల్ల సాగు రంగం మరింత వృద్ధి పథాన సాగుతుందని, రైతుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు బడ్జెట్లో నిధుల కేటాయింపులు రూ.9,500 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచాలని సూచించారు. ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో (డీబీటీ) ఇచ్చే అన్ని రకాల వ్యవసాయ సంబంధిత సబ్సిడీలను హేతుబదీ్ధకరించాలని, 2018 నుంచి ఎలాంటి మార్పుల్లేని యూరియా రిటైల్ ధరలను పెంచాలని, సబ్సిడీల ద్వారా బయో ఫరి్టలైజర్స్, ఫోలియర్ ఫరి్టలైజర్స్ను ప్రోత్సాహించాలన్న సూచనలు ఆరి్థక మంత్రి దృష్టికి వచ్చాయి. ఇతర పెట్టుబడులతో పోల్చి చూస్తే వ్యవసాయ పరిశోధన పెట్టుబడులపై వచ్చే ఆరి్థక ప్రయోజనాలు పది రెట్లు అధికంగా ఉన్నప్పటికీ.. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో బడ్జెట్ కేటాయింపులు ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉండడాన్ని భారత్ కిసాన్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ గుర్తు చేశారు. ఎంఎస్పీ కమిటీని వేరు చేయాలని, నూతన వ్యయసాయ రంగ విధానాన్ని తీసుకురావాలన్న సూచనలు కూడా వచ్చాయి. వ్యవసాయ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు వీలుగా అపెడాకు కేటాయింపులను రూ.80 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంచాలని జిల్లా స్థాయిలో ఎగుమతుల కేంద్రాలు తెరవాలని పలువురు సూచించారు. -
బడ్జెట్‌పై హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు
-
రైల్వే ప్రయాణికులకు కేంద్రం శుభవార్త!
ఇకపై దేశంలోని పాతరైలు భోగీలు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో వందే భారత్ భోగీలు ప్రత్యక్షం కానున్నాయి. ప్రయాణికులకు సేవలందించనున్నాయి. రద్దీని తగ్గించడం, ఇంధనం, సిమెంట్, పోర్ట్ కనెక్టివిటీ మార్గాల్లో వేగంగా సరకు రవాణా చేసేలా కేంద్రం రైల్వే రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొనసాగుతున్న మధ్యంతర పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే రంగానికి బడ్జెట్ కేటాయింపులపై కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 2024-2025 మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే రంగానికి బడ్జెట్ రూ.2.55 లక్షల కోట్లకు పెంచారు. ఈ కేటాయింపులు గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2.41లక్షల కోట్లుగా ఉన్నాయి. మూడు ఎకనమిక్ రైల్వే కారిడార్లు ఈ సందర్భంగా..వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు ప్రధాన ఎకనమిక్ రైల్వే కారిడార్ ప్రాజెక్టులను అమలు చేస్తామని సీతారామన్ చెప్పారు. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచి, ఖర్చును తగ్గించేలా విద్యుత్, ఖనిజ, సిమెంట్ కారిడార్లు, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్లు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కారిడార్లు. ఈ మూడు కారికాడార్లను గుర్తించి మల్టీ మోడల్ కనెక్టివిటీ చేసేందుకు గాను ప్రధానమంత్రి గతి శక్తి పథకం కింద కేంద్రం ఈ ప్రాజెక్ట్‌లను గుర్తించింది. 40వేల వందే భారత్ రైలు భోగీలు 40వేల సాధారణ రైలు బోగీలను (కోచ్‌లు) వందే భారత్ భోగీలుగా అప్‌గ్రేడ్ చేస్తామని, భద్రత, సౌలభ్యం, ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచుతామని సీతారామన్ అన్నారు. . రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) రిటైర్డ్ డైరెక్టర్ కేబీల్ వాధ్వా మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతం ఉన్న బోగీలు కాలం చెల్లిన డిజైన్‌తో ఉన్నాయి. వాటి స్థానంలో కొత్త వందే భారత్ భోగీలు రానున్నాయి. అధిక వేగం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందుతుందన్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేలా ‘ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రైల్వే కారిడార్లలో రద్దీని తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రైల్వే కారిడార్లలో మరిన్ని కొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చేలా, ప్రయాణికుల రాకపోకల్ని మరింత సులభతరం చేసేలా భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందించాం. తద్వారా ప్రయాణికుల భద్రత, అధిక ప్రయాణ వేగం పెరగడం ద్వారా ప్యాసింజర్ రైలు సేవలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ మూడు రైల్వే ఎకనమిక్ కారిడార్లతో దేశీయ ఎకనామీ వృద్ది సాధిస్తుంది. లాజిస్టిక్ ఖర్చులను తగ్గిస్తాయని అని ఆమె తెలిపారు. 11 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులు అనంతరం ఈ కారిడార్లలో మొత్తం 11 లక్షల కోట్లతో 434 ప్రాజెక్టులు చేపట్టనున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘ప్రణాళిక ప్రకారం,రాబోయే 6 నుంచి 8ఏళ్ల కాలంలో సుమారు 40వేల కిలోమీటర్ల మేర ట్రాక్‌లు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ని కోచ్‌లను మెరుగైన సౌకర్యాలు ఉండేలా అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. దీని కోసం రూ.15,200 కోట్లు ఖర్చవుతుందని, వచ్చే ఐదేళ్లలో దీన్ని అమలు చేయన్నట్లు మంత్రి మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంజన్లు, వ్యాగన్లు, కోచ్‌ల వంటి రోలింగ్ స్టాక్లను కొనుగోలు చేయడానికి 41,086.09 కోట్ల రూపాయలను కేటాయించాలని కేంద్రం మధ్యంతర బడ్జెట్లో పలు ప్రతిపాదనలు తెచ్చింది. చదవండి : హెచ్1బీ వీసాపై అమెరికా కీలక ప్రకటన -
ఇది భద్రలోక్ బడ్జెట్
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 – 2025 ఆర్థిక సంవత్సరానికి గాను తాత్కాలిక (ఓట్ ఆన్ అకౌంట్) బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లక్ష్యం నాలుగు విభాగాల ప్రజలకు – పేదలు, యువకులు, రైతులు, మహిళలకు మేలు చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఈ నాలుగు వర్గాలకు బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో ఏ విధమైన మేలు చేసిందన్నది ఇక్కడి ప్రశ్న? 2014 వరకూ,అంటే తాము అధికారంలోకి వచ్చే ముందర అంతా చిందరవందరే అన్నట్లు ‘మా ఆర్థిక నిర్వహణ ద్వారా 2014 ముందరి అన్ని ఆర్థిక సవాళ్ళనూ నేడు అధిగ మించాం’ అంటూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఉప న్యాసంలో వ్యాఖ్యానించారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం. కాంగ్రెస్ హయాంలో నాటి అత్యధిక పతన స్థాయి అయిన డాలర్‌తో పోలిస్తే 65 రూపాయలుగా రూపాయి విలువ ఉంది. నేడు రూపాయి విలువ డాల ర్తో పోలిస్తే మరింత దారు ణంగా దిగజారి 84 రూపా యల పరిధిలో ఉంది. ఇక, నిరుద్యోగం 2014లో 5.4 శాతంగా ఉండగా 2023 డిసెంబర్ నాటికి 8.7 శాతా నికి పెరిగిపోయింది. 2013లో దేశంలో ధరలు భారీగా పెరిగిపోవడం (ద్రవ్యోల్బణం) కూడా 2014 ఎన్ని కలలో కాంగ్రెస్ ఓటమికి కారణం. కాగా, 2022 నుంచీ మొదలుకొని దేశంలో ధరలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్నాయి. ఇక స్థూల జాతీయో త్పత్తి విషయంలో కూడా మన పరిస్థితి కేవలం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, గుడ్డి వాళ్ళ రాజ్యంలో... ఒంటి కన్ను రాజులా (రఘురాం రాజన్ వ్యాఖ్యానించినట్లు) మాత్రమే ఉందన్నది నిజం. యూపీఏ హయాంలో జీడీపీ సాలీనా సగటున 8.1 శాతం మేర పెరగగా... ప్రస్తుత బీజేపీ హయాంలో (2014 నుంచి 2023 వరకు) అది సాలీన సగటున 5.4 శాతం మేరనే పెరిగింది. కోవిడ్ కాలంలోని ఆర్థిక పతన స్థితిని కాసేపు పక్కన పెట్టినా మొత్తంగా బీజేపీ పాలనలో జీడీపీ పెరుగుదల పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. అవినీతిని నిర్మూలించామంటూ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ఉపన్యాసంలో చెప్పుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయ ‘అవినీతి సూచి’లో భారత్ ర్యాంకు మొత్తం 180 దేశాలలో 2022 సంవత్సరంలో 85వ స్థానంలో ఉండగా 2023లో 93వ స్థానానికి దిగజారింది. ఇక అసమానతల విషయంలో నిత్య జీవితంలో దిగజారిపోతోన్న సామాన్య జనం జీవన ప్రమాణాలు ఒక ప్రక్కనా... పెరిగి పోతోన్న కార్పొరేట్లూ, ధనవంతుల సంపద రాసులు మరో పక్కనా కనపడుతూనే ఉన్నాయి. ఈ స్థితిలో ప్రస్తుత బడ్జెట్ ఈ సమస్యలు వేటికీ జవాబు ఇవ్వలేదు. ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్ మాత్రమేనంటూ సమస్యల పరిష్కారాల నుంచి తప్పించుకునే ధోరణి... ద్రవ్యలోటు తగ్గింపు పేరిట ప్రజా సంక్షేమం కోసం... వారి సమస్యల పరిష్కారం కోసం కొత్తగా ఏ వ్యయాలు చేయలేని దుఃస్థితి తాలూకు ఇరకాటం ఈ బడ్జెట్ రూప కల్పనలో దాగి వున్న అసలు నిజాలు. ఒక పక్కన ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రత్యక్ష పన్నుల వసూళ్ళు మూడు రెట్లు పెరిగాయి. అలాగే పరోక్ష పన్నుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అలాగే, మానిటైజే షన్ ద్వారానూ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారానూ కూడా కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. మరో పక్కన కొన్ని లెక్కల ప్రకారం దేశీయ అప్పులు 200 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయాయి. ఇంత పెద్ద ఎత్తున సమకూరిన వనరుల ఫలం, ఫలితం మాత్రం ప్రజలకు దక్కడం లేదు. అంటే, బడ్జెట్ల క్రమంలో జరుగుతోంది పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే అనేది నిర్వివాదాంశం. పెరుగుతోన్న బిలి యనీర్లు, ప్రపంచ ధనవంతుల జాబితాలో పైకి పాకు తోన్న వారి ర్యాంకులే దీనికి తార్కాణం! ఇక ప్రస్తుత బడ్జెట్ కూడా ఈ య«థాతథ స్థితికి మినహాయింపేమీ కాదు. ప్రస్తుత బడ్జెట్ అనంతరం జాతినుద్దేశించి తన సందేశంలో ప్రధాని మోదీ ఇది చరిత్రాత్మక బడ్జెట్ అన్నారు. ఇది కేవలం మాటల గారడీ. బడ్జెట్‌కు కొద్ది రోజుల ముందర ఈ బడ్జెట్ నుంచి ఏ సంచలనాలనూ ఆశించొద్దని ఆర్థిక మంత్రి చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఆమె ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితిని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని చెబుతోన్న చరిత్రాత్మక కేవలం... ధనవంతుల సేవలో తరిస్తోన్న బడ్జెట్ల పరంపరలో పదవ మైలు రాయిని చేరుకోవడం తాలూకూది మాత్రమే కావచ్చు!! డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులు మొబైల్: 9866179615 -
Interim Budget 2024: లక్షద్వీప్‌కు నిర్మలమ్మ వరాలు
ఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను నేడు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లక్షద్వీప్‌లకు నిర్మలా సీతారామన్ వరాలు కురిపించారు. లక్షద్వీప్‌లను టూరిస్ట్ హబ్‌గా మార్చడానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. లక్షద్వీప్‌లో పర్యాటకానికి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11.11 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు నేడు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందులో దీవుల్లో పర్యాటకానికి కావాల్సిన సౌకర్యాలతో పాటు ఓడరేవుల కనెక్టివిటీని పెంచేవిధంగా పలు ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. దేశీయ టూరిజంపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పర్యాటక ప్రాంతాల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌ను కేటాయించారు. సహజమైన బీచ్‌లు, విశిష్ట సాంస్కృతిక వారసత్వానికి పేరుగాంచిన లక్షద్వీప్ ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రయోజనం పొందనుంది. ఇటీవల రాజకీయం లక్షదీవులు, మాల్దీవుల చుట్టూ తిరుగుతూ వస్తోంది. ప్రధాని మోదీ లక్షదీవుల్లో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లక్షదీవుల్లో దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు భారీగా స్పందించారు. లక్షదీవులు.. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా మారుతాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే.. ప్రధాని మోదీ ఫొటోలకు మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్ చేశారు. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో మాల్దీవుల పర్యటనను పలువురు ప్రముఖులతో సహా నెటిజన్లు రద్దు చేసుకున్నారు. బుక్ మైషో లాంటి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సైట్లు కూడా మాల్దీవుల బుకింగ్స్‌ను రద్దు చేశాయి. మాల్దీవులకు అత్యధిక పర్యాటకులు భారత్ నుంచే వెళుతున్న క్రమంలో మనదేశ లక్షద్వీప్లపై చర్చ సాగింది. అటు.. మాల్దీవుల్లో కొత్తగా వచ్చిన ప్రధాని ముయిజ్జూ చైనా అనుకూల విధానాలు అనుసరిస్తున్నారు. దీంతో భారత్ లక్షదీవులను పర్యాటకానికి అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. ఇదీ చదవండి: Budget 2024 Live Updates Telugu: బడ్జెట్ సమావేశాలు అప్డేట్స్.. -
రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం.. సంచలన ప్రకటన
-
Budget 2024: నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక అంశాలు ఇవే
-
Budget 2024: అప్పట్లో ఇవే హైలెట్స్.. మళ్లీ ఉంటాయా?
బడ్జెట్ ఎప్పుడు వచ్చినా మధ్య తరగతి వర్గాలు కోటి ఆశలు పెట్టుకుంటాయి. ఈ సారి ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పైనా మిడిల్ క్లాస్, అల్పాదాయ వర్గాల్లో బోలెడు అంచనాలు ఉన్నాయి. ఈ వర్గాల కోసం గతేడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏయే ప్రయోజనాలు కల్పించిందో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఫిబ్రవరి 1న సమర్పించిన 2023-24 కేంద్ర బడ్జెట్ మధ్యతరగతి వర్గాల కోసం అనేక మార్పులను తీసుకొచ్చింది. మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే లక్ష్యంతో 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ముఖ్యమైన ప్రకటనలు ఏంటో ఇక్కడ చూడండి.. ➧ పన్ను మార్పులు: కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. దీని కారణంగా సంవత్సరానికి రూ. 7 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ➧ పన్ను శ్లాబులు: కొత్త పన్ను విధానంలో పన్ను శ్లాబుల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. అలాగే పన్ను రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. రూ.3 లక్షల వరకూ వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ. 3 లక్షల నుంచి రూ.5 లక్షల ఆదాయానికి 5 శాతం పన్ను, వార్షికాదాయం రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకూ 10 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 20 శాతం పన్ను రేటు విధించారు. ➧ స్టాండర్డ్ డిడక్షన్: జీతం పొందే ప్రొఫెషనల్స్, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 50,000 నుంచి రూ. 52,500కి పెంచారు. ➧ 80C మినహాయింపు పరిమితి: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసే సాధనాల్లో పెట్టుబడి పరిమితిని రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. ➧ విద్య: విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాసంస్థలకు నిధులతో సహా విద్యారంగానికి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారు. ➧ హౌసింగ్: డెవలపర్లు, గృహ కొనుగోలుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడంతో పాటు అందరికీ సొంతిల్లు అందుబాటులో ఉండేలా బడ్జెట్లో అనేక చర్యలు ప్రకటించారు. మళ్లీ ఉంటాయా? సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 ఫిబ్రవరి 1న సమర్పిస్తున్నది మధ్యంతర బడ్జెట్. అయినప్పటికీ గత బడ్జెట్లో అందించిన లాంటి ప్రయోజనాలు మళ్లీ ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల వేళ మధ్యతరగతి వర్గాలను కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. -
బడ్జెట్ ముందు బుల్ దూకుడు
ముంబై: బడ్జెట్ వారాన్ని స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఆరంభించింది. రిలయన్స్(7%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1.53%) షేర్లు రాణించడంతో పాటు ఆసియా, యూరప్ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు కలిసొచ్చాయి. మధ్యంతర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు, ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచకపోవచ్చనే ఆశలూ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఇటీవల క్యూ3 ఫలితాల ప్రకటన సందర్భంగా కంపెనీల యాజమాన్యం ఆశావహ అవుట్‌లుక్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా సూచీలు దాదాపు 2% ర్యాలీ చేసి నెల రోజుల్లో(డిసెంబర్ 5, 2023 తర్వాత) అతిపెద్ద ఒక రోజు లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్ 1,241 పాయింట్లు పెరిగి 71,942 ముగిసింది. నిఫ్టీ 385 పాయింట్లు బలపడి 21,738 వద్ద నిలిచింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇంధన, ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, పారిశ్రామిక, కన్జూమర్ డ్యూరబుల్స్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్ ఇండెక్సులు 1.68%, 1.03% చొప్పున లాభపడ్డాయి. ఆసియాలో చైనా, సింగపూర్ మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. యూరప్‌లో బ్రిటన్, ఫాన్స్ సూచీలు అరశాతం పెరిగాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద సెన్సెక్స్ సుమారు 2% ర్యాలీతో బీఎస్ఈలో రూ.6.08 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల గరిష్ట స్థాయి రూ.377 లక్షల కోట్లకు చేరింది. ఇంధన షేర్లకు భారీ డిమాండ్ పశ్చిమాసియా సంక్షోభంతో ఎర్రసముద్రం నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా నవంబర్ నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న ఇంధన రంగ షేర్లకు సోమవారం అనూహ్యంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఓఎన్జీసీ, క్యాస్ట్రోల్ 8%, రిలయన్స్, కోల్ ఇండియా 6%, హిందుస్థాన్ పెట్రోలియం 5%, బీపీసీఎల్, గెయిల్ 4%, ఇంధప్రస్థగ్యాస్ 3%, ఆయిల్ ఇండియా, ఐఓసీ 2% షేర్లు రాణించాయి. రి‘లయన్స్’ గర్జన ఇంధన రంగ షేర్ల ర్యాలీలో భాగంగా రిలయన్స్ షేరు 7% ర్యాలీ చేసి రూ.2896 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా లాభపడి రూ. 2905 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ.1.25 లక్షల కోట్లు పెరిగి తొలిసారి రూ.19.59 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ సూచీలో అత్యధికంగా లాభపడిన షేరు ఇదే. కాగా గత 3 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు మొత్తం 9% లాభపడింది. -
పీఎం కిసాన్ సాయం రూ.9 వేలు? రైతులను ఊరిస్తున్న కొత్త బడ్జెట్
రానున్న కొత్త బడ్జెట్ దేశంలోని రైతులను ఊరిస్తోంది. 2024 మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో సహా వారి సంక్షేమ పథకానికి కేంద్రం కొన్ని మార్పులు చేస్తుందని భావిస్తున్నారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తున్న ఈ మధ్యంతర బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఆశించనప్పటికీ, ప్రభుత్వం ఈ సంవత్సరం పీఎం కిసాన్ (PM Kisan) పథకం చెల్లింపును 50 శాతం పెంచవచ్చని ‘ది ఎకనామిక్ టైమ్స్’ నివేదించింది. ప్రస్తుతం ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున అందిస్తుండగా ఇది రూ.9,000 వరకు పెంచే అవకాశం ఉందని పేర్కొంది. కేంద్ర బడ్జెట్ 2024లో ఆశించే మూడు ప్రధాన సామాజిక రంగ ప్రకటనలలో రైతులకు పీఎం కిసాన్ పథకం చెల్లింపుల పెంపు ఒకటని ఆర్థికవేత్తలు విశ్వసిస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. గత సంవత్సరం బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. ఇది ఈ ఏడాది బడ్జెట్లో 50 శాతం పెరగవచ్చని అంచనా. ఇదీ చదవండి: Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు, ఆశిస్తున్న ప్రకటనలు, రైతులకు సంబంధించిన పథకాల్లో పెరగనున్న ప్రయోజనాలు తదితర అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. -
బడ్జెట్ 2024 - ఆశలన్నీ ఆరు అంశాల మీదే..!
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ వెల్లడించనున్నారు. లోక్‌సభ ఎన్నికల కారణంగా 2024-25 ఆర్థిక బడ్జెట్లో పెద్ద ప్రకటనలు ఏమీ ఉండవని తెలుస్తోంది. అయితే బడ్జెట్ ప్రకటించడానికి ముందే అంచనాలు పెరుగుతున్నాయి. మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చావ్లా.. ప్రభుత్వం ప్రధానంగా ఆరు అంశాల మీద ద్రుష్టి సారించే అవకాశం ఉందని వెల్లడించారు. 👉2024 బడ్జెట్లో డిజిటలైజ్డ్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు), బ్రాడ్‌బ్యాండ్ వృద్ధిని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్‌కు ఎక్కువ నిధులు కేటాయించే సూచనలు ఉన్నాయి. 👉ప్రభుత్వం సంక్షేమ వ్యయాన్ని పెంచడానికి సిద్ధంగా ఉందని, 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థిక లోటును GDPలో 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 👉కాపెక్స్‌పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించడానికి & వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్దతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచ వృద్ధి ఆందోళనలను అధిగమించడానికి క్యాపెక్స్‌పై ప్రభుత్వ వ్యయం పెరుగుతుందని భావిస్తున్నారు. 👉రాబోయే ఆర్థిక సంవత్సరానికి, ఆహారం, ఎరువుల సబ్సిడీల కోసం భారతదేశం దాదాపు రూ. 4 ట్రిలియన్లు (48 బిలియన్ డాలర్లు) కేటాయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. 👉వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కోసం 26.52 బిలియన్ డాలర్ల ఆహార సబ్సిడీ వ్యయాన్ని అంచనా వేయనుంది. ఇది గత ఆర్ధిక సంవత్సరం కంటే 10 శాతం లేదా 24.11 బిలియన్ డాలర్లు ఎక్కువని తెలుస్తోంది. 👉గృహాల కోసం ప్రభుత్వం డబ్బును (నిధులు) 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1 ట్రిలియన్ డాలర్లకు (12 బిలియన్ డాలర్లకు సమానం) చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Budget 2024: నో ట్యాక్స్ లిమిట్ రూ.8 లక్షలకు పెంపు..!?
రానున్న కేంద్ర బడ్జెట్ 2024పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ సంపూర్ణ బడ్జెట్‌కు ఉన్నంత అంచనాలు ఈ సారి బడ్జెట్‌పై ఉన్నాయి. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు, దీర్ఘకాలిక పన్నుల విధానం, వినియోగం, పొదుపును పెంపొందించే చర్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. రూ.8 లక్షల వరకూ నో ట్యాక్స్! ఇది మధ్యంతర బడ్జెట్ అయినప్పటికీ పూర్తి బడ్జెట్లో ఉండే లాంటి ప్రయోజనాలు కొన్ని ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ జాతీయ అధ్యక్షుడు నారాయణ్ జైన్ తెలిపారు. సెక్షన్ 87A కింద వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొంత రాయితీని అందించవచ్చని, దీని కింద మొత్తం పన్ను మినహాయింపు పరిమితిని ఇప్పుడున్న రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సింగిల్ హైబ్రిడ్ స్కీమ్ వ్యక్తిగత ఆదాయపు పన్ను విధింపునకు సంబంధించి కొన్ని మినహాయింపులను కలుపుకొని సరళీకృత "సింగిల్ హైబ్రిడ్ స్కీమ్"ని ఈ బడ్జెట్లో ప్రకటించవచ్చని బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్థిక వ్యవహారాలు, పన్నుల కమిటీ ఛైర్పర్సన్ వివేక్ జలాన్ అంచనా వేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రయోజనాలు మహిళా పారిశ్రామికవేత్తలకు పన్ను సడలింపులు, పని చేసే తల్లులకు ఎక్కువ వేతనంతో కూడిన సెలవులు వంటి ప్రయోజనాలను ఈ బడ్జెట్లో ఆశించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (కలకత్తా చాప్టర్) చైర్పర్సన్ రాధికా దాల్మియా చెబుతున్నారు. రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన భత్యం పెంపు, బాలికలకు విద్య ప్రయోజనాలను పెంచడం కీలకమైనని ఆమె పేర్కొన్నారు. -
త్వరలో 2024 బడ్జెట్ - నిరుద్యోగులకు వరం..
2024 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేస్తుందని ఇప్పటికే హింట్ కూడా ఇచ్చేసారు. వీటితో పాటు ఉపాధి కల్పించే పథకాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న కారణంగా ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆస్కారం ఉండదు. ఉద్యోగాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన స్వావలంబన భారత ఉపాధి పథకం కింద.. వచ్చే రెండేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఏకంగా రూ.6000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. దీని కింద ఐదు లక్షలకుపైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. ఈ కంపెనీలన్నీ సుమారు 10 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్వావలంబన భారత ఉపాధి పథకం అనేది కరోనా లాక్డౌన్ తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్థితిని పెంపొందించడానికి ప్రవేశపెట్టారు. ఇది భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చేస్తుంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధిని కల్పించడానికి, ప్రభుత్వం రాబోయే మధ్యంతర బడ్జెట్లో వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళల వంటి రంగాలను విస్తరించవచ్చని సమాచారం. ఇందులో సరైన ఉపాధి లభిస్తే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ముందుగానే హింట్ ఇచ్చిన నిర్మలమ్మ - నాలుగు అంశాలు కీలకం
2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల మీద దృష్టి పెట్టనుంది? ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బృందం ఎలాంటి ప్రకటనలు చేయనుందనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. యువత, మహిళలు, రైతులు, పేదల సంక్షేమానికి ఈ బడ్జెట్ పెద్ద పీట వేస్తుందని భావిస్తున్నారు. ఇటీవల హిందూ కళాశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కులం, వర్గం లేదా మతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారి అభ్యున్నతిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. యువకులు, మహిళలు, రైతులు, పేదవారిని సంస్కరించడానికి వారి అభ్యున్నతి వైపు దృష్టి కేంద్రీకరించేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. నైపుణ్యాన్ని పెంపొందించడానికి, వ్యవసాయ ఉపకరణాలను మెరుగుపరచడానికి, పౌరులకు ఆరోగ్య సంరక్షణ.. ఇతర ప్రయోజనాలను అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. సీతారామన్ పంట అనంతర పద్ధతులను ఆధునీకరించడం, వివిధ రంగాల్లో తయారీని ప్రోత్సహించడం వంటి ప్రాముఖ్యతలను వివరించారు. బడ్జెట్లో మాత్రమే కాకుండా ఈ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్అండ్డిని మెరుగుపరచడంతోపాటు అగ్రశ్రేణి నిపుణులను సలహాదారులుగా తీసుకురావాలని కూడా చూస్తున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా? ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చురుకుగా పనిచేస్తున్నాయని ఆమె వెల్లడిస్తూ.. ఈ అభివృద్ధి తక్కువ ఖర్చుతో లావాదేవీలను వేగవంతం చేయడం, అంతర్గత, బాహ్య చెల్లింపులను మరింత సరసమైనదిగా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ, కంపెనీలు, స్టాక్ మార్కెట్లలో సానుకూల పనితీరును కనబరుస్తున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేదని కొందరు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, అలంటి వాదనలు చేసేవారు ఆధారాలు చూపాలని సీతారామన్ సవాల్ విసిరారు. -
బడ్జెట్లో రాబోయే కీలక ప్రకటనలు..?
మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1న చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి దీన్ని పార్లమెంట్లో చదవనున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఇది మధ్యంతర బడ్జెట్ కావడం విశేషం. అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన ఖర్చులు, గడిచిన ఏడాదిలో ఖజానాకు వచ్చిన రాబడులను వివరిస్తుంది. పేదలు, యువత, రైతులు, మహిళలకు ఈసారి బడ్జెట్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బడ్జెట్లో ఈ కింది అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. మహిళలకు బడ్జెట్ కేటాయింపులు పెంచే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో కేటాయింపులు 30 శాతం పెరిగాయని తెలుస్తుంది. కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు తీసుకునే డబ్బుపై వడ్డీ రాయితీ పథకం ప్రకటించే వీలుంది. రైతులకు పంటబీమాతో పాటు తమకు తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే అవకాశం ఉంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన ఇంధనంకు సంబంధించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. విద్య, ఆరోగ్య సంరక్షణకు మరిన్ని నిధులు కేటాయించే వీలుంది. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా.. మేక్ ఇన్ ఇండియా ద్వారా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహాకాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. కిసాన్ సమ్మాన్ నిధి కింది ఇచ్చే నగదును పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
Budget 2024: ట్యాక్స్ పేయర్స్కి ఈ గుడ్ న్యూస్ ఉండొచ్చు!
దేశమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టన్నారు. ఈ బడ్జెట్‌పై దేశంలోని అన్ని వర్గాలవారు వివిధ ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు ఈసారి ఏవైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా అని ఆసక్తిగా ఉన్నారు. ఈసారి ప్రవేశపెట్టేది సమగ్ర బడ్జెట్ కాకపోయినా కొన్ని సానుకూల మార్పులపై పన్ను చెల్లింపుదారులలో ఆశలు ఉన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రధాన పన్ను ప్రయోజనాలు ఉంటాయని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయినప్పటికీ ఈ మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపు ఊరటనిచ్చే కొన్ని చిన్న సర్దుబాట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అవి ఏవేవీ అన్నది ఇక్కడ చూద్దాం.. బెంగళూరుకు హెచ్ఆర్ఏ మినహాయింపు చట్ట ప్రకారం మెట్రో నగరంగా బెంగళూరును గుర్తించినప్పటికీ, ఆదాయపు పన్ను విషయాల పరంగా బెంగళూరును ఇప్పటికీ నాన్-మెట్రో సిటీగా పరిగణిస్తున్నారు. ఈ బడ్జెట్లో బెంగళూరును మెట్రో నగరంగా వర్గీకరించి హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. సెక్షన్ 80D మినహాయింపు పరిమితి పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల కోసం సెక్షన్ 80D కింద మినహాయింపు పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఇది సాధారణ ప్రజలకు రూ.25,000 నుంచి రూ.50,000కు, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచవచ్చని పన్ను నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ సేవలకు పన్ను తగ్గింపులను సులభతరం చేయడానికి కొత్త పన్ను విధానంలోకి సెక్షన్ 80D ప్రయోజనాలను తీసుకొస్తారన్న ఊహాగానాలు ఉన్నాయి. గృహ కొనుగోలుదారులకు టీడీఎస్ పరిమితి ప్రస్తుతం ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపు పరిమితి రూ. 50 లక్షలు ఉంది. ఈ పరిమితిని మించితే 1 శాతం టీడీఎస్ ఉంది. ఆస్తి కొనుగోళ్లపై టీడీఎస్ మినహాయింపులకు సంబంధించి ఈ మధ్యంతర బడ్జెట్ ఆస్తులు విక్రయించే ఎన్ఆర్ఐలకు మరింత పారదర్శకత, అవగాహన తీసుకొస్తుందని భావిస్తున్నారు. మూలధన లాభాలపై పన్ను సరళీకరణ పెట్టుబడి ఆదాయానికి సంబంధించి ప్రస్తుత పన్ను వ్యవస్థలో ఉన్న సంక్లిష్టతను ఎత్తి చూపుతూ ట్యాక్స్ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఇండెక్సేషన్‌కు సంబంధించిన నియమాలను సరళీకృతం చేయడం, లిస్టెడ్, అన్‌లిస్టెడ్ సెక్యూరిటీల పన్నులో సమానత్వాన్ని తీసుకురావడం వంటివి ఈ సూచనల్లో ఉన్నాయి. -
కేంద్రం ఫోకస్ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ సారి మధ్యంతర బడ్జెట్‌పై అచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించడంతో పాటు పన్ను ప్రయోజనాల రూపంలో కొంత ఉపశమనాన్ని ప్రకటించాలని ప్రజలు భావిస్తున్నారు. ద్రవ్య లోటు, ద్రవ్యోల్బణాన్ని ఎలా నియంత్రిస్తారు అనే దానిపై అందరి దృష్టి ఉంది. ఈ సారి బడ్జెట్లో వీటిపై నిర్ణయాలు తీసుకుంటే సామాన్యులకు మేలు జరుగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. పన్ను స్లాబ్ ప్రస్తుత పన్ను స్లాబ్‌లో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.3 లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితి ఉంది. దీని అర్థం ఈ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవలసిన అవసరం లేదు. రాబోయే బడ్జెట్లో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్రం రూ.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ప్రామాణిక తగ్గింపు(స్టాండర్డ్ డిడక్షన్) ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు రెట్టింపు చేయాలని పన్ను చెల్లింపుదారులు భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న జీవన వ్యయం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కోసం ప్రామాణిక మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని వాదన కూడా ఉంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. ఆర్థిక లోటు తగ్గింపు భారత్ తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని 50.7 బేసిస్ పాయింట్ల మేర అంటే దాదాపు రూ.9.07 లక్షల కోట్లు తగ్గించుకోవచ్చని అంచనా. కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని కొనసాగిస్తూ సంక్షేమ వ్యయాన్ని పెంచడంతో పాటు గ్రామీణ ఉపాధి, గృహనిర్మాణంపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో ఈమేరకు నిర్ణయాలపై కొంత సందిగ్ధం ఏర్పడనుందని కొందరు చెబుతున్నారు. -
వ్యవ‘సాయం’ అందుతుందా..?
భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయం కీలకపాత్రం పోషిస్తోంది. దేశంలో 42 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ గతంలో కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. దీనికి తోడు వ్యవసాయం ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవడం కీలకం. అప్పుడే ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా అన్నదాత ఆదాయం హెచ్చవుతుందని నిపుణలు చెబుతున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో నీటిపారుదల రంగానికి కేటాయింపులు, నాణ్యమైన విత్తనాలు, టెక్నాలజీ వంటివి ఆర్థిక మంత్రికి కీలకంగా మారనున్నాయి. సవాలు విసురుతున్న పరిస్థితులు.. వ్యవసాయ, పశుపోషణ రంగానికి కీలకమైన డీజిల్, విద్యుత్తు, పశువుల దాణా, మేత ఖర్చులు విపరీతంగా పెరిగాయి. వ్యవసాయ రంగంలో ద్రవ్యోల్బణం గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఈ ఏడాది ఆలస్యం కావడంతో పంట దిగుబడుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దాంతో కొన్ని ప్రాంతాల్లో ఆహారకొరత ఏర్పడుతోంది. వ్యవసాయ ఎగమతులు తగ్గుతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు గోధుమ పంటను దెబ్బతీశాయి. గోధుమలు, చక్కెర ఉత్పత్తులను కేంద్రం ఇప్పటికే నిలిపేసింది. ఆధునికీకరణకే పెద్దపీట.. భారత్‌లో వ్యవసాయం సంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతోంది. దీనికి భిన్నంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతోంది. దీంతో వాటి ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో మన రైతులు అంతర్జాతీయ మార్కెట్లతో పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. భారత్‌లో రైతుల ఉత్పత్తి.. అంతర్జాతీయ మార్కెట్ల అంచనాలకు మధ్య చాలా అంతరం ఉంది. ప్రభుత్వం వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే పాలసీలను తీసుకురావాల్సి ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. రైతులకు సాంకేతికత, దానికి సంబంధించిన పరికరాలు చౌకగా లభించేందుకు ఈ రంగంలోని స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెబుతున్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావడానికి 2022 బడ్జెట్లోనే పునాదులు వేశారు. కిసాన్ డ్రోన్లను ప్రమోట్ చేసేలా అగ్రిటెక్ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు నాబార్డ్ కింద ఓ నిధిని ఏర్పాటు చేసింది. బ్లాక్‌చైన్, కృత్తిమ మేధ, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను వ్యవసాయ రంగానికి అన్వయించడమే అసలైన సవాలు. 2024-25 బడ్జెట్లో వీటికి ప్రత్యేక కేటాయిపులు చేయడంతో పాటు.. పన్ను రాయితీలు ఇవ్వాలని కొందరు కోరుతున్నారు. వ్యవసాయ రుణాలు రూ.22-25 లక్షల కోట్లు..? 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.22-25 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈమేరకు ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టనున్న తాత్కాలిక బడ్జెట్లో ప్రతిపాదిస్తారని సమాచారం. అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.20 లక్షల కోట్లు. ప్రస్తుతం రూ.3 లక్షల వరకు ఇచ్చే స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 2% వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. ఇదీ చదవండి: నిర్మలమ్మ జట్టులో కీలక వ్యక్తులు వీరే.. అందువల్లే రూ.3 లక్షల వరకు రుణాలు 7% వడ్డీ రేటుకే లభిస్తున్నాయి. గడువులోపు బకాయిలు తీర్చేవారికి అదనంగా మరో 3% వడ్డీ మినహాయింపూ ఉంటుంది. దీర్ఘకాల రుణాలనూ రైతులు తీసుకోవచ్చు కానీ.. మార్కెట్ రేటు ప్రకారమే వడ్డీ రేటు ఉంటుంది. -
ఎంఎస్ఎంఈకి ప్రత్యేక ప్యాకేజ్!
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్‌సభలో ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో తనకు ప్రత్యేక ప్యాకేజ్ ఉంటుందని లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ) భావిస్తోంది. భారతదేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతున్న నేపథ్యంలో.. ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు వీలుగా తగిన కనిష్ట స్థాయి రుణ రేట్లు పరిశ్రమలకు లభిస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. స్థూల దేశీయోత్పతిలో ఎంఎస్ఎంఈ రంగం వాటా 29.15 శాతం కావడం గమనార్హం. బ్యాంకులు– ఎంఎస్ఎంఈల మధ్య సంబంధం అసమానంగా ఉందని, రుణ దాతల విచక్షణ పరిధిలో అసతౌల్యతకు గురవుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎఫ్ఐఎస్ఎంఈ) సెక్రటరీ జనర ల్ అనిల్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బడ్జెట్ ప్రయతి్నస్తుందన్న విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. దేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ నిర్దిష్ట ఉత్పత్తుల ఎగుమతి వాటా 2023–24లో (సెపె్టంబర్ 2023 వరకు) 45.56 శాతంగా ఉంది. ఇది 2022–23లో 43.59 శాతం. కన్స ల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఎంఎస్ఎంఈలకు మూలధన ప్రవాహాలలో నష్టాలను తగ్గించడానికి క్రెడిట్ గ్యారెంటీలు, బీమా పథకాల వంటి నష్ట నివారణ సాధనాలను ప్రోత్సహించడం మంచిని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆటో మోటివ్, ఎల్రక్టానిక్స్, ఇండ్రస్టియల్, ఎలక్ట్రికల్ మెషినరీ, కెమికల్స్ వంటి పరిశ్రమలకు ఈ తరహా చర్యలు అవసరమని వివరించారు. 6 శాతం మాత్రమే ఈ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ విక్రయాల్లో ఎంఎస్ఎంఈ పాత్ర కేవలం 6 శాతంగా ఉంటోందని పరిశ్రమ పేర్కొంటోంది.