మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి
ఎరువుల సబ్సిడీలను హేతుబదీ్ధకరించాలి
వ్యక్తులకు ఆదాయపన్ను తగ్గించాలి
వర్తకులకు జీఎస్‌టీ మినహాయింపులు
బడ్జెట్‌పై వివిధ వర్గాల సూచనలు
ఆర్థిక మంత్రితో సంప్రదింపులు
న్యూఢిల్లీ: సాగు రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన పలు చర్యలను నిపుణులు, వ్యవసాయ రంగ మండళ్లు కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లాయి. 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ముందు ఆరి్థక మంత్రి వివిధ రంగాల ప్రతినిధులతో సంప్రదింపులు చేపట్టారు. వ్యవసాయ పరిశోధనపై పెట్టుబడులు మరింతగా పెంచాలని, ఎరువుల సబ్సిడీలను హేతుబదీ్ధకరికంచాలని ఈ సందర్భంగా ఆయా రంగాల ప్రతినిధులు సూచించారు. ఆరి్థక వ్యవస్థలో వినియోగం పుంజుకోవడానికి వీలుగా వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, తక్కువ రేటుకు వర్తకులకు రుణాలు అందించాలని రిటైల్ వర్తకుల సమాఖ్య ఆరి్థక మంత్రిని కోరింది. వర్తకులకు జీఎస్‌టీ విషయంలో పలు వెసులుబాట్లు కలి్పంచాలని జీటీఆర్‌ఐ సూచించింది.
జీఎస్‌టీ భారం దించాలి..
1.46 కోట్ల రిజి్రస్టేషన్లతో ప్రపంచంలోనే అతి పెద్ద పరోక్ష పన్నుల వ్యవస్థ అయిన జీఎస్‌టీకి సంబంధించి చేపట్టాల్సిన కీలక సంస్కరణలను గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్‌ఐ) ఆరి్థక మంత్రి దృష్టికి తీసుకొచి్చంది. జీఎస్‌టీ మినహాయింపు పరిమితిని రూ.1.5 కోట్ల వార్షిక టర్నోవర్‌కు పెంచాలని కోరింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు ఉన్న సంస్థలకే జీఎస్‌టీ రిజిస్ట్రేషన్ మినహాయింపు అమల్లో ఉంది.
జీఎస్‌టీలో ప్రస్తుతమున్న శ్లాబులను తగ్గించాలని, రాష్ట్రం వారీగా జీఎస్‌టీ రిజి్రస్టేషన్‌ను పరిహరించాలని.. దీనివల్ల జీఎస్‌టీ మరింత సమర్థవంతంగా, వ్యాపార అనుకూలంగా మారుతుందని పేర్కొంది. రూ.1.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న సంస్థలు మొత్తం రిజి్రస్టేషన్లలో 80 శాతంగా ఉంటాయని, మొత్తం పన్ను వసూళ్లలో వీటి ద్వారా వస్తున్నది 7 శాతమేనని గుర్తు చేసింది.
‘‘ఏటా రూ.1.5 కోట్లు అంటే నెలవారీ టర్నోవర్ రూ.12–13 లక్షలు. 10 శాతం మార్జిన్ ఆధారంగా వచ్చే లాభం రూ.1.2 లక్షలే. వీరికి మినహాయింపు కల్పిస్తే మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 23 లక్షలకు దిగొస్తుంది. జీఎస్‌టీ వ్యవస్థపై ఇది భారం తగ్గిస్తుంది’’అని వివరించింది. పన్ను వసూళ్లను పెంచడం ద్వారా 7 శాతం పన్ను నష్టాన్ని అధిగమించొచ్చని సూచించింది. ఈ ఒక్క చర్యతో ఎంఎస్‌ఎంఈలో వృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. రాష్ట్రాల మధ్య వాణిజ్యం ప్రోత్సాహానికి వీలుగా జీఎస్‌టీ నిబంధనలను సులభతరం చేయాలని కూడా కోరింది. వాతావరణ మార్పులు, టెక్నాలజీ, వాణిజ్యంపై పరిశోధనకు జీటీఆర్‌ఐ కృషి చేస్తుంటుంది.
పన్ను తగ్గిస్తే వినియోగానికి ఊతం..
అఖిల భారత రిటైల్ వర్తకుల సమాఖ్య ప్రతినిధులు ఆర్థిక మంత్రికి ఇచి్చన వినతిపత్రంలో పలు కీలక సూచనలు చేశారు. రిటైల్ రంగం వృద్ధి చెందేందుకు వీలుగా డిమాండ్ ను పెంచడం, వినియోగానికి ఊతమివ్వడం కోసం 2024–25 బడ్జెట్‌లో తక్కువ పన్ను రేట్ల రూపంలో ప్రయోజనాలు లేదా రాయితీలు కలి్పంచాలని కోరింది.
‘‘పన్ను రేట్లు తగ్గిస్తే, నెలవారీ ఖర్చు చేసే ఆదాయంపెరుగుతుంది. అది అంతిమంగా వినియోగానికి ప్రేరణనిస్తుంది. రిటైల్ రంగానికీ మేలు చేస్తుంది’’ అని పేర్కొంది. రిటైలర్లకు తక్కువ వడ్డీపై రుణాలు అందించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. బడ్జెట్‌లో ఈ మేరకు ప్రకటన చేయాలని కోరింది. ఫుడ్ అండ్ బెవరేజెస్‌ను అత్యవసర సేవగా గుర్తించాలని, భూముల రేట్లు, విద్యుత్‌పై సబ్సిడీలు, ఇతర ప్రయోజనాల కల్పించాలని కోరింది. వ్యాపార సులభతర నిర్వహణకు వీలుగా జాతీయ రిటైల్ విధానాన్ని వేగంగా రూపొందించి, అమలు చేయాలని కోరింది. ఎంఎస్‌ఎంఈల ప్రయోజనాలకు రిటైలర్లను అర్హులుగా ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేసింది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధిక మందికి ఉపాధి కలి్పస్తూ, జీడీపీలో 10 శాతం వాటాను రిటైల్ రంగం సమకూరుస్తుండడం గమనార్హం.
వ్యవసాయ రంగం పటిష్టత కోసం..
వాతావరణ మార్పుల ప్రభావాన్ని తట్టుకుని నిలబడేందుకు వీలుగా సాగు రంగంలో మౌలిక వసతులను బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. వ్యవసాయ రంగంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ)కి పెద్ద పీట వేయాల్సిన అవసరాన్ని ఇండియన్ చాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐసీఎఫ్‌ఏ) చైర్మన్ ఎంజే ఖాన్ ప్రస్తావించారు. దీనివల్ల సాగు రంగం మరింత వృద్ధి పథాన సాగుతుందని, రైతుల ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు రూ.9,500 కోట్ల నుంచి రూ.20,000 కోట్లకు పెంచాలని సూచించారు.
ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో (డీబీటీ) ఇచ్చే అన్ని రకాల వ్యవసాయ సంబంధిత సబ్సిడీలను హేతుబదీ్ధకరించాలని, 2018 నుంచి ఎలాంటి మార్పుల్లేని యూరియా రిటైల్ ధరలను పెంచాలని, సబ్సిడీల ద్వారా బయో ఫరి్టలైజర్స్, ఫోలియర్ ఫరి్టలైజర్స్‌ను ప్రోత్సాహించాలన్న సూచనలు ఆరి్థక మంత్రి దృష్టికి వచ్చాయి. ఇతర పెట్టుబడులతో పోల్చి చూస్తే వ్యవసాయ పరిశోధన పెట్టుబడులపై వచ్చే ఆరి్థక ప్రయోజనాలు పది రెట్లు అధికంగా ఉన్నప్పటికీ.. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో బడ్జెట్ కేటాయింపులు ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉండడాన్ని భారత్ కిసాన్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ గుర్తు చేశారు.
ఎంఎస్‌పీ కమిటీని వేరు చేయాలని, నూతన వ్యయసాయ రంగ విధానాన్ని తీసుకురావాలన్న సూచనలు కూడా వచ్చాయి. వ్యవసాయ ఎగుమతులకు ఊతమిచ్చేందుకు వీలుగా అపెడాకు కేటాయింపులను రూ.80 కోట్ల నుంచి రూ.800 కోట్లకు పెంచాలని జిల్లా స్థాయిలో ఎగుమతుల కేంద్రాలు తెరవాలని పలువురు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment