
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఏప్రిల్ 1, 2025 నుంచి 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.41 తగ్గించాయి. సవరించిన రిటైల్ సేల్ ధర వల్ల ఢిల్లీలో దీని రేటు రూ.1,762గా ఉంది. ఈ తగ్గింపుతో హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఎల్‌పీజీపై ఆధారపడే వ్యాపారాలకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. అంతర్జాతీయ ముడిచమురు రేట్లలో హెచ్చుతగ్గులు, ఇతర ఆర్థిక అంశాల ప్రభావంతో ఈ ధరలను సవరిస్తుంటారు. కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించినా, గృహాల్లో ఉపయోగించే ఎల్‌పీజీ ధరలను మాత్రం మార్చలేదు.
ధరల హెచ్చుతగ్గులు
గత నెలలో మార్చి 1, 2025న ఓఎంసీలు ప్రధాన నగరాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.6 పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ ఇండేన్ ప్రకారం.. ఫిబ్రవరిలో అంతకుముందు నెలతో పోలిస్తే 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.7 తగ్గించారు. మార్చి నెలలో రూ.1,797 నుంచి రూ.1,803కు పెరిగింది. తాజాగా రూ.41 తగ్గించారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో మార్పులకు అనుగుణంగా ఇంధన ధరల్లో అస్థిరత నెలకొంటుంది.
ఇదీ చదవండి: రెండేళ్లలో తొలిసారి ధరలు పెంపు
నగరాల వారీగా ధరలు
ఢిల్లీ-రూ.1,762 (రూ.1,803 నుంచి తగ్గింది)
కోల్‌కతా-రూ.1,872 (రూ.1,913 నుంచి తగ్గింది)
ముంబయి-రూ.1,714.50 (రూ.1,755.50 నుంచి తగ్గింది)
చెన్నై-రూ.1,924.50 (రూ.1,965.50 నుంచి తగ్గింది)